పుట:2015.370800.Shatakasanputamu.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. చిత్తగింపుము మీపాదసేవకుఁ డను
     భావజవిలాస హంసలదీవివాస
     లలితకృష్ణాబ్ధిసంగమస్థలవిహార
     పరమకరుణాస్వభావ గోపాలదేవ.

దేవరకోట సంస్థానములో సుప్రసిద్ధమైయున్న ఆంధ్రనాయకాలయము పూజాపురస్కారశూన్యమై హీనదశయం దున్నపుడు పురుషోత్తమకవి మిగులఁ బరితపించి సుప్రసిద్ధుఁడు ప్రత్యక్షరూపుఁడగు దేవున కిట్టి విపరీతస్థితి చేకూరుటకుఁ గినిసి నిత్యోత్సవములు చేయించికొనక చేతఁగానివానివలె నూరకుంటఁ బ్రతిష్ఠగాదనియుఁ బూర్వకీర్తి నిలుపుకొమ్మనియు నిందాస్తుతులతో నీశతకమును ఆంధ్రనాయకునిగూర్చి రచించెను. ఇతఁడు మానసబోధశతకము, హంసలదీవి గోపాలశతకము, భక్తకల్పద్రుమశతకము, ప్రకృతాంధ్రనాయకశతకము వ్రాసినాఁడు. “మనసా హరిపాదము లాశ్రయింపవే "యని యీకవి మానసబోధశతకము రచించితినని చెప్పుకొనుచున్నాఁడు. ప్రకృతము మానసబోధశతక మొకటి తాడేపల్లి పానకాలరాయకవికృతము కనఁబడుచున్నది. పానకాలరాయకవి చిత్తబోధశతకము వ్రాసెనుగదా! ఇఁక మానసబోధశతక మేల వ్రాయవలసివచ్చెను? పురుషోత్తమకృతికే యెవరేని కర్తృత్వము మార్చి .