పుట:2015.370800.Shatakasanputamu.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాసపబోధశతకము కేవలభగవచ్చింతనముతో భక్తిరసప్రతిపాదకముగ నున్నది. ఈ శతకము మానసరాజయోగసంధాయకమని కవి చెప్పిన మాట సత్యము. శ్రీ మహాత్ముని లీలావతారముల నభివర్ణించుచు మనమునందుఁ జొన్పుటయే యైహికములను దరించువిధమని కవి మృదుమధురకవితాస్నిగ్ధమగు సుకుమారవచనములతో నుడివి పామరజనుల భగవచ్చింతనమునకుఁ బురికొల్పుచున్నాఁడు. ఇందలిపద్యము లైహికబంధములు నిస్సారములనియుఁ గళేబరము మలమూత్రస్విన్నము గావున దానిపై మమకారము బెట్టుకొనరాదనియు జన్మబంధదూరమగు పరమాత్ముని సన్నిధి జేరుటకుఁ బ్రయత్నించుమనియు బోధించుచున్నవి. ప్రజాసామాన్యమునం దీశతకము మిగుల వ్యాప్తినొందియుంటయే దీని యుత్కృష్టత కొకదృష్టాంతము.

చిత్తబోధశతక మనునది యొకటి యీకవిపేరుతోఁ గానవచ్చుచున్న ది. దాని శైలియు ధారయు విషయసమీకరణము మానసబోధశతకమునకు మిగుల చేరువలో సున్నది. ఈశతకనిర్మాతయగు