పుట:2015.370800.Shatakasanputamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని చింతనము జేయుచుఁ -జిత్తమునఁ దనివిఁ జెందుచు నెప్పుడు
కనుదమ్ములను ముడుచుచు -ధ్యానంబుగాఁ జేయు నారాయణా. 113
అపగతాఘ కృత్యుఁడై -ఈరీతి నభ్యాస మొనరించుచు
నపరోక్ష సిద్ధి నొందు -బ్రహ్మంబు తానగుచు నారాయణా. 114
కందళిత హృదయుఁడగుచు -సచ్చిదానంద స్వరూపుఁడగుచు
సందర్శితాత్ముఁడగుచు -నుండు నవికారతను నారాయణా. 115
అవ్యయానంద పూజ్య -రాజ్య సింహాసనాసీనుఁడగుచు
భవ్యాత్ముఁడై వెలసెను -బూజ్య సంభావ్యుఁడై నారాయణా. 116
నీవు సకలంబుగాని -యున్నదే నీకన్న వేఱొక్కటి
జీవుఁడని వర్ణించుట -వ్యవహార సిద్ధికిని నారాయణా. 117
చిలుక పలుకులు పలికితి -నాకేమి తెలియుఁ దత్త్వ రహస్యము