పుట:2015.370800.Shatakasanputamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ని మహాపాపము పాపనోపినదిగా నీ పాదరేణుప్రకా
     రము నేనేమని సన్నుతింతు రఘువీరా! జానకీనాయకా!62
శా. నా యజ్ఞానముఁ బాపుమంచు మదిలో నానాప్రకారంబులన్
     గూయం గూయ నదేమిరా యనవు నీకున్ మ్రొక్కనా? కుక్కనా?
     చీ యంచేటికి రోఁతగించెదవు? నీచిత్తంబు రాకుండినన్
     బ్రాయశ్చిత్తము నాకునెద్ది? రఘువీరా! జానకీనాయకా!63
మ. నియమంబొప్ప ననేకజన్మములనుండిన్ దాఁచుకొన్నట్టి సం
     చయదోషంబుల మాటమాత్రమున దోఁచంబోవు చోరత్వ మె
     న్ని యుపాయంబుల నభ్యసించినవియో నీ నామముల్ వేయు నా
     రయ నిన్ను న్వివరించుటెట్లు రఘువీరా! జానకీనాయకా!64
శా. తారుణ్యోదయ! యొంటిమిట్టరఘునాథా! నీకు నేఁ బద్యముల్
     నూఱుం జెప్పెద నూరుఁబేరు వెలయన్ నూత్నంబుగా; నంత నా
     నోరుం బావన మౌను, నీ కరుణఁ గాంతున్, భక్తి న[1]న్నందఱున్
     రారమ్మందురు గారవించి రఘువీరా! జానకీనాయకా!65
శా. చీరన్ దీయకు చన్నుగుబ్బల పయిం జీకాకుగాఁ గాకుగాఁ
     జేరన్ దీయకు మందబోయఁడిదె వచ్చే ప్రొద్దు రావద్దురా

  1. న్నెవ్వరున్