పుట:2015.370800.Shatakasanputamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     జారల్ మేనుల జారలం గవయు కృష్ణా! యేకపత్నీవ్రత
     ప్రారంభం బిపుడేల నీకు రఘువీరా! జానకీనాయకా!66
మ. తిరునామంబు ధరింపఁడేని నొసలన్ దిక్పూరితంబైన నీ
     వరనామంబుఁ దలంపఁడేని మదిలో వాంఛించి నీ పాదపం
     కరుహ శ్రీతులసీదళోదకముఁ ద్రాగండేని వాఁడేటి నే
     ర్పరి వైకుంఠపురంబుఁ జేర రఘువీరా! జానకీనాయకా!67
మ. శరణంబన్నను మాటమాత్రమున విశ్వద్రోహి తోఁబుట్టుకున్
     గరుణాపూర్ణవిలోకనం బొదవ లంకారాజ్యసింహాసన
     స్థిరపట్టం బొనరించినాఁడ వఁట యేదేవుండు నీసాటి యు
     ర్వరలోనన్ భవరోగదూర! రఘువీరా! జానకీనాయకా!68
మ. పరనారీ కుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగ్మంబుపైఁ
     గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ
     బరువుల్ వాఱెడు నా తలంపులు మిమున్ భావింపఁగాఁ జేసి స
     ర్వరసాధీశ్వర! నన్నుఁ బ్రోవు రఘువీరా! జానకీనాయకా!69
మ. నరకుల్ క్రాఁగిన యిన్పకంబముల నంటంగట్టఁగాఁ గొట్టఁగాఁ
     బొరలం బొర్లఁగఁ గక్కరాలఁ గొని వీఁపు ల్గోయఁగా వ్రేయఁగా
     నరకావాసులలోన నుండుదురు నీ నామంబు వర్జించి దు
     ర్మరణంబు ల్గని చన్నవారు రఘువీరా! జానకీనాయకా!70