పుట:2015.370800.Shatakasanputamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ఱము; నిన్నున్ మతి దూఱ మంత నపవర్గస్వర్గమార్గంబు దూ
     రము గాకుండును మాకుఁ జేర రఘువీరా! జానకీనాయకా!55
మ. తమ గర్వంబునఁ దారు పొంగిపడుచున్ దైవంబు మంత్రంబుఁ దం
     త్రములన్ వీడఁగ నాడుచున్ దిరుగు నిర్భాగ్యుల్ మహారాజులై
     మము నూరింపఁగ నేము నిన్నెఱిఁగి నీ మంత్రం బెఱింగిన్ దరి
     ద్రమతిన్ వేడఁగఁ బోవుటెట్లు రఘువీరా! జానకీనాయకా!56
మ. హిమధామ ప్రతిమాన కాంతియుతులై యింద్రాది దిక్పాలకుల్
     తములన్ స్తోత్రముచేయ నుండుదురు నీ దాసానుదాసుల్ సుర
     ప్రమదాపల్లవపాటలాధర సుధాపానాది కేలీవిహా
     రములన్ మీఱుచు మీరు చూడ రఘువీరా! జానకీనాయకా!57
శా. మిమ్ముం గొల్చి తలంచి పాపముల నెమ్మిన్ సోఁక రానీక నే
     నెమ్మిన్ సౌఖ్యముఁ బొందువాఁడ ననుచున్ నీ మూర్తి భావించెదన్
     రమ్మా వీని తలంపు మేలని కృపన్ రక్షింప నాలోనికిన్
     రమ్మా నన్నుఁ గృతార్థుఁ జేయ రఘువీరా! జానకీనాయకా!58
మ. ప్రమదారత్న మహల్య గౌతముని శాపప్రాప్తి పాషాణరూ
     పముతోఁ బెక్కుయుగంబులుండఁగ హరబ్రహ్మాదులుం బాపలే