పుట:2015.370800.Shatakasanputamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     డ్డేమిన్ పల్మఱు వేసరింపఁ గవి నే నీరాదె నీ సీమలో
     గ్రామం బొక్కటి చాలు నాకు రఘువీరా! జానకీనాయకా!54
శా. మామా యంచును మామ యంచు నెపుడే మా యల్లుఁ డుద్యద్గతిన్
     హేమాద్రిప్రతిమానమైన యొక విల్లేపార మో పెట్టఁగా
     సామర్థ్యంబున [1]మేటి యీతఁడని నీ సత్త్వంబె వర్ణింతు నో
     రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!55
మ. కమరం గ్రాఁగిన లోభివాని తల పున్కం, గుక్కమాంసంబు మ
     ద్యముతో వండుచుఁ దిన్న మాలఁడయినం, దత్పాపకర్మంబులన్
     యమకూపంబుల లోపలం బడఁడు జిహ్వాగ్రంబునన్ రామమం
     త్రముఁ బేర్కొన్నను నొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా!56
మ. యమకూపంబుల లోపలం బడి మహాహైన్యంబునుం బొందకుం
     డ ముదంబారఁగ నన్నుఁ బ్రోచి కరుణన్ సాయుజ్యమిమ్మీ తుదిన్
     గ్రిమిరూపుం దన రూపుగాఁ బెనిచి రక్షింపన్ విచారించునా
     భ్రమరంబుం బలెఁ బాపదూర! రఘువీరా! జానకీనాయకా!67
మ. మమకారంబున సర్వకాలమును నీ మంత్రంబు వాక్రుచ్చు డెం
     దము నాకుం గలుగంగని మ్మటులయైనన్ మృత్యువక్త్రమ్ము దూ

  1. వీఁడు మేటి యని నీసత్వంబు వర్ణింతునో