పుట:2015.333901.Kridabhimanamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోవలె నిట పండుకొనుడు మీ రని పోయి
    జలకంబు లాడి పూసలు ధరించి
అలి జిల్గుమల్లుసెల్లా గట్టి రవిక చే
      పట్టి రాజూచి యాపాదమస్త
కంబు గాన్పింప మోహంబున బైబడి
     గ్రుచ్చి కౌగిట జేర్చి కుచయుగంబు
బట్టబో రామలక్షి పార్శ్వముననుండి
హుమ్మనుచు బల్క నంత నె మలికిపడగ
దానితో నె మనుచు నీవు పూనుకొన్న
ఠీవి మఱవంగ దరమె రామావధూటి.
సీ. ఒకనాటికలలోన నుదయమే నును బట్టి
        రతి గోర నిపుడు నిస్త్రాణ జేయు
   మధ్యాహ్నమని తెల్పి మధ్యాహ్నమౌన రాగ
     విడెమునేయుం దని విడెము నెసి
  నంతట నిద్రించి యావల మీయిష్టం
     మని కూర్కి లేచినవెనుక జుట్టు
  దువ్వెద రమ్మని దువ్వుచు రాత్రికి
     సిస లని చేతిలో జేయి వేసి
యిటుల దందన సేయునంతటను నిద్ర
మేలుకొని గుండె ఝల్లున మేను మఱచి
సొమ్మసిల్లి యొకింత యుసూరు మనుచు
మదిని దపియించుచుంటి రామావధూటి!