పుట:2015.333901.Kridabhimanamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ. కలగంటి నొకరాత్రి కనకాంగి నీతోడ
       సమరతితో గేళి సల్పినట్లు
  కలగంటి నొకరాత్రి కలకంఠిరో నీవు
     పరతిలో నను గుషాల్పఱిచినట్లు
  కలగంటి నొకరాత్రి కలికి గాఢాలింగ
     నాదిసౌఖ్యంబుల నలరినట్లు
  కలగంటి నొకరాత్రి కమలాక్షి నీతోడ
    బంధలీలల జాల బడలినట్లు
ఒక్కరాతిరి కల గంటి జొక్కి నేను
నీడుకెమ్మోని యానుచో నీవు నాదు
పై పెదవి యానుచును ఱెప్పపాటు లేక
నున్ముఖము చూచునట్లు రామావద్ఫ్హూటి!

 ఈ పరిశీలనమువలన "నెట్టి జారుడయినను తన దుశ్చారిత్రము దానే ప్రకటించుకొనుచు బద్యముల వ్రాయునా" యను నాక్షేప నుపాస్తమయినది.  "స్వచ్చమగు శ్రీనాద్ఃఉని కీర్తిని గళంకిమొనర్చుచు నాతడు విషయలోలు డని నిరూపించు నైతిహ్యములును జాటు పద్యములను గొన్ని యంధపరంపరగ నంధ్రలోకమున గొంతకాలమునుంది వ్యాస్తములై యుండుట పాఠకమహాశయు లెఱింగియేయుందురు.  మోహాంధకారమూలకము లగుననీ గాధలను భేదించి వింర్మలకీర్తితేజోవిరాజితం బగు శ్రీనాధునిదివ్యమూర్తిని నాంధ్రలోకమునకు బ్రకాశింప