పుట:2015.333901.Kridabhimanamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. వాసన గల్గుమేను ని?డువాలుకమంగవ గుబ్బిగుబ్బలున్
    కేసరిమధ్యమున్ మదనకేళికి నింపగుబాహుమూలవి
    న్యాసము గల్గినట్టియెలవాగను బోగముదాని జేయ కా
    దాసరిదాని జేసినవిధాతను నేమనవచ్చు నీశ్వరా.
సీ. పొలుపొందగ విభూతిబొట్టు నెన్నొనలిపై
         దళుకొత్తు చెమట కుత్తలపడంగ
    సొగసుగా బూదండ జోపినకీల్గొప్పు
        జాఱుగా నొకచేత సరుదుకొనంగ
   బిగిచన్నుగనమీద నిర్తుసుపయ్యెద చెంగు
      దిగజాఱి శివసూత్ర మగపడంగ
   ముక్కున హురుమంజి ముత్యాలముంగర
     కమ్మవాతెఱమీద గంతు లిడంగ
  గౌను జువ్వాడ మెట్టియల్ గదిసి మ్రోయ
  గమ్మనిలుకాని జాళుబొమ్మ యనగ
  మెల్ల మెల్లన సింహాద్రిమీది కేగె
  గన్నెపూబోడి యగపాలివన్నెలాడి.
ఉ.నాలగుకన్నుదోయి లిగువట్రుగుబ్బలు కారుచీకటిం
   జాల హసించుకొప్పజిగి సారసము న్నగుమోము గల్గునా
   బాలిక గూలి కమ్ముకొన బట్టలు వేసేడివాని కెచ్చె హా
   సాలెత గాదురా కుసుమసాయకు పట్టపుదంతి యింతియే.
ఉ.కుమ్మరివారిబాలిక చకోరవిలోచన ముద్దుగుమ్మ యా
   వమ్ముదరిన్ రసామలినవస్త్రము చుంగులు జాఱు గట్టి తా