పుట:2015.333901.Kridabhimanamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గమ్మనిమ్రోతతో గరనఖమ్ముల భాండము లంగజాస్త్రపా
తమ్మున బ్రోవు దీసె విటతండముగుండియ లారవిచ్చగన్.
సీ.తళ్కుతళ్కమకాంతి జెళ్కు కెంపులముంగ
   రందమై కెమ్మోనియందు గుల్క
  ధగధగద్ధగలచే ధనరారులంగారు
    గొలుసులింగపుకాయ కొమరు మిగుల
 నిగనిగన్నిగలచే వెగడుచెల్వపుగబ్బి
    గుబ్బ లురంబున నిబ్బరింప
  రాజహంసవిలాసరాజితం బగుయాన
   మందు మెట్టెలు రెండు సందడింప
 సరసదృక్కుల నిటులను గరగజూచి
పొందికైనట్టిమోమున భూతిరేఖ
రాజకళ నొప్ప నద్ధంకిరాజవీధి
బొలిచె నొకకొమ్మ గాజులముద్ధుగుమ్మ
సీ. మకరధ్వజునికొంప నొకచెంప గనిపింప
       జీర గట్టినదయా చిగురుబోడి
   యుభయకక్షములందు మరుదీర్ఘతరము లౌ
     నెఱులు పెంచినదయా నీలవేణి
 పసపువాసన గ్రమ్మ బైటచేలము లెప్ప
      ముసుకు పెట్టినదయా ముద్దుగుమ్మ
పూర్ణచంద్రునిబోలి పొసంగ సింధూరంపు
     లొట్టు పెట్టినదయా పొలతి నుదుట