పుట:2015.333901.Kridabhimanamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇట్టు పెక్కుదేశములగూర్చి శ్రీనాధుడు పద్యముల జెప్పెను. వానినెల్ల జాటుపద్యమణిమంజరులలో జేర్చితిని. అందు జేరని దిందొక్కటి: కడమమండలమందలి 'కుందుగడ్డ ' ను గూర్చి చెప్పినది.

గీ. మందరాద్రినములు మానవు లందఱు
   చందమామకూన లిందుముఖులు
   కందు లేనిమౌక్తికంబులు జొన్నలు
   కుందనంపు బెడ్డ కుందుగడ్డ.
            మఱియు శ్రీనాధుడు నానాజాతివనితల గూర్చి చెప్పిన పద్యములు గొన్ని--
చ. తొలకరిమించుదీనగతి దోస దుకాణముమీద నున్నయ
    య్యలికులవేణితో దమలపాకులబేరము లాడబోయి నే
    వలచుట కేమి శంకరునివంటి మహాత్ముడు లింగరూపమై
   కులికెడుదానిగుభ్భిచమగుబ్బలసందున నాట్యమాడగన్.
ఉ. వీసపుముక్కునత్తు నరవీసపుమంగళసూత్ర మమ్మినన్
   గామను దాని కమ్మ లరకాసును దానివి పచ్చబూనలున్
   మాసినచీర గట్తి యవమాన మొసంగగ నేడు రాగ నా
   కాసలనాటివారి కనకాంగిని జూచితి వీళ్ళరేవునన్.
సీ. హరిజీలముల కప్పు లణగించునునుగొప్పు
        విడ బువ్వదండ దా వీడబాఱ
   గోటిచందురుడాలు గీటు సేయగజాలు
     మొగముకుంకుమచుక్క సొగసు గులుక