పుట:2015.333901.Kridabhimanamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇట్టి వింకను పెక్కు లున్నవి. మఱియు మొరస రాజ్యమునుగూర్చి చెప్పినపద్యములు గొన్ని యున్నవి. చాటు (ద్వితీయ) లో చూచునది. కడిదిఉరమునుగూర్చి చెప్పినవి:

క. ముదివిటులు విధవలంజలు
   పదకవితలు మాఱుబాసబాపనవారల్
   చదువని పండితవర్యులు
   కధనాస్థిరవీరవరులు కడిగిపురమునన్.
ఉ.చీరయు ముక్కుముంగఱయు జెంపలగంధము జుక్కొబొట్టు మం
  జీరఝుణారవవము జేతుల గంకణనిక్వణంబు నొ
  య్యారము జాఱుకొప్పునుగయాళీతనంబును గాని లోన శృం
  గార మొకింత లేదనుట గంటిని యీఉరివారకాంతలన్.
రాచవీఋఇ (రాయచోటి) కరిగి చెప్పినవి:
చ.వస గలముద్దుమోని బిగినట్రువగుబ్బలు మందహాసముల్
   నొసట విభూతిరేఖయు వుమంగునతావి మిటారిచూపులున్
   రసికులు మేలుమేలు భళిరాయని మెచ్చంగ రాచవీటిలో
   బసిడిసలాకవంటి యొక బెల్జెవధూటిని గంటి వేదుకన్.
ఉ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . లో
   చేస్తిమి లేస్తి మామెకుడిచేతికి దండ మటుండనిమ్మయా
   విస్తరి పుట్టినట్టి పలువిత్తుల ఱంకుల రాచవీటిలో
   వస్తును బస్తు నాయె గవితార్ధుల కక్కడ గూడు గల్గునా?