పుట:2015.333901.Kridabhimanamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జనకుడవు కర్త వొజ్జపు సజ్జనుడవు
క్రొత్తలంజెలకాముండవుత్తముడవు
తొడల నిడుకొని ముద్దుకూతునకు నీవు
మించుటద్దంబు చూపరా మంచిరాజ ! 199
గీ. కేల గ్రొమ్మింద్చుటద్ధంబు గీలుకొల్పి
   మంచితొడమీద నొప్పారె మదనరేఖ
   ముద్దునెమ్మోము లావణ్యమున జయించి
   కుపలయాప్తుని జెఱఫేట్టుకొన్నకరణి. 200
క.దీవించి మంచి కూతురు
   "శ్రవ్ర్ధస్వంబు" చెప్పి చెవి టిట్టిభవె
   ట్టీ ! వెన నిప్పింపుము సం
   బావన నొకవెండి బిడ్డపసపున కనియెన్ 201
వ. అనంతరంబ గాంధర్వి పూర్వసంబంధంబున నైన
    ప్రేమానుబంధంబున గేలు గేలం గీలించి యిట్లనియె.
గీ. ఎందు పోయితి గోవింద ! ముందరట్ల
   యెంద ఱతివల వలపించి తెచటనెచట
   దలపు పుట్టించెనే నీకు దైవ్ మిట్లు
   పాయసం బారగించినప్రాతపట్టు 203