పుట:2015.333901.Kridabhimanamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                  ముకురవీక్షాఇది 63

గీ.లంజెవారికి శ్రీమహాలక్షి గాదె
   దర్పణము విప్రముఖ్యగంధర్వగణము
   పుణ్యచారిత్ర దృష్టాంతభూమి గాదె
   దర్పణమ్ము వివర్తనాదముల కెల్ల. 197.
ఉ.ఉన్మదమత్తకోకిల కు
        హూకలపంచమరాగరాగసం
   పన్మహనీయ మైనమధు
       మాసపున్నమనాడు బిడ్డకున్
   మన్మధవేధదీక్ష పది
        వాళ్ళగుమాత్రము నేతదుర్ధమై
   సన్మతి నుండగావలయు
       జక్కనివాడావ యక్కవాడలోన్ 198
సీ. అది నీకుమారిత మదనరేఖాకన్య
            వదనరేఖావైభవమున జంద్రు
    దొర గూర్చికొన్నది ధూర్తదేవత నిన్ను
          దండ్రి బోలినయట్టితరళనయన
   సాముద్రికాగమజ్ఞానసారీణులు
       కదు భాగ్యసంపద గలది యండ్రు
   భాగ్యసంపదకల్మి ప్రస్ఫుటం బయ్యెగా
       మీర లిందుల వచ్చి మీఱియుంట