పుట:2015.333901.Kridabhimanamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లలో గలదు. ఇం దీవిగ్రహమునకు నాలుగు చేతు లున్నవి. తలపై కాబాయి కుళ్ళాయి ఉన్నది. చెవులకు గమ్మలున్నవి. ముందరికుడిచేత డమరుక మున్నది. ముందరి యేడమచేత కప్పల(?)మున్నది. కుడివెనుకచేత జింకపిల్ల(?) యున్నది. ఎడమవెనుకటిచేత త్రిశూల మున్నది. నాల్గుచేతులకు మూడేసి కంకణము లున్నవి. మెడలో కంటె హారము నున్నవి. పాదములకు బాజేబు లున్నవి. పీఠమునకు దిగువను వరాహ మున్నది. కాకతీయకులదైవత మిట్లు దొరకుట నాకు జాల వేడ్క గొల్పినది. ఈ కాకతమ్మ యేక శిలానగరమున నేకవీరాదేవికి సైదోడుగా వెలసియుండిన దని క్రీడాభిరామమున గలదు. ఆదేవాలయము, విగ్రహము, నగరము, రాజ్యము నన్నియు నంతరించిపోయినవి గదా! ఏకవీరాదేవివిగ్రహమును గూర్చియు జాయసేనాపతివిగ్రహమును గూర్చియు వేర్వేఱుగా వ్యాసములను విగ్రహములతో బ్రకటింతును.

 ముక్త్యాల ప్రాంతములలో ఏకవీర, మాహురమ్మ, కాతతమ్మలుగా గుర్తింపదగిన విగ్రహములు మ~తికొన్ని నే సేకరించినవానిలో నున్నవి.  అందులో వింత గొలు;ఉ విగ్రహ మింకొకటి యున్నది.  అది ప్రాయికముగా బండ్రెండు పదుమూడు శతాబ్దుల దయి యుండును.  ఒక తురుష్కవీరుడు బల్లెమును చేబూని ఒక యేనుగుతో పోరాడుచున్నాడు.  ఏనుగుమీద నిద్దఱు వ్యక్తులున్నారు.  ఒకరు కాతీయసేనాని జాయసేనాపతియో యేమో!