పుట:2015.329863.Vallabaipatel.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

వల్లభాయిపటేల్

రము, గొప్ప ధైర్య పరాక్రమములను బ్రదర్శించిన సైనికులకుఁ బ్రభువులు పారితోషికము లిచ్చుట మరియాద. ఇప్పుడుబార్డోలీ రైతులు కోరుచున్న దట్టి బహుమతులుకాదు. తమ మడిమాన్యములను దమకుఁ దిరిగి యిప్పించఁగోరిరి. స్వరాజ్యము సిద్ధించిన పిమ్మట వారికిఁగలిగిన యన్యాయమును దొలగించెదమని కాంగ్రెసు ప్రముఖు లప్పుడు వాగ్దానములను జేసియుండిరి. కాంగ్రెసు ఆజ్ఞలను శిరసావహించి, కాంగ్రెసు కీర్తి గౌరవముల నెన్నిమడుంగులో హెచ్చించి చిరస్థాయిగాఁజేసిన, బార్డోలీవీరుల యాస్తులను దిరిగి వారికిప్పించుట కాంగ్రెసు మంత్రుల విధ్యుక్త ధర్మము. అప్పుడు దేశద్రోహులై, యమూల్యములైన భూముల నేరెండురూపాయలకో కొట్టించివైచుకొని భూస్వాములైనవారికి గుణపాఠముచెప్పుట యవశ్యకర్తవ్యము.

కాంగ్రెసు మంత్రులు ప్రభుత్వాధికారమును జేఁబట్టిన వెంటనే, యీ యపచారమును దొలగించుటెట్లని యాలోచనకుఁగడంగిరి. రివిన్యూ వేలములలో నన్యాయముగ గొనిన వారిచేత సౌమ్యమార్గములచే నా భూములను బార్డోలీ రైతుల కిప్పించుటకుఁ బూనుకొనిరి. ఏ కొలదిమందికోతక్క నెక్కువమంది కట్టి సంస్కారము కలుగలేదు. వారు తమ లీగల్ హక్కులచాటున నిలుచుండి శఠించిరి. బొంబాయి మంత్రు లీ లీగల్ చిక్కులను దొలఁగించుటకుఁ బ్రత్యేకముగ నొకబిల్లును దీసికొని రావలసిన యావశ్యకత యేర్పడినది. ఈ భూములకు గవర్నమెంటువారే కంపెన్సేషను నిచ్చుటకుఁగూడ నదికారమును బొందిరి. వేలములో నన్యాయముగ నీ భూముల నార్జించిన వారికిఁ దగిన ప్రతిఫల మిచ్చికూడ వారినుండి