పుట:2015.329863.Vallabaipatel.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

వల్లభాయిపటేల్

బొంబాయికిరాఁగానే యీవాతావరణములో నాయన కొంచెము తేరుకొన్నట్లే కనుపించెను. కాని 13 బుధవారము రాత్రి పొత్తికడుపులో బాధ యెక్కు వయ్యెను. 15 వ తేదీ శుక్రవారము తెల్లవారుజామున 3 గంటలకల్ల నాయన హృదయగతికి నరోధము కల్గెను. వైద్యులువచ్చి పెక్కు చికిత్సలుచేసిరి. ఉదయము 8 గంటల కాయనకుఁ గొంచెము స్పృహవచ్చెను. ఆ స్పృహ తుదివఱకు నుండెను. ఆయన కుమార్తె మణిబెన్, కుమారుఁడు దయాభాయిపటే లాయనకు సర్వసపర్యలు చేయుచుండఁగా, సరిగా 9 గంటల 37 నిమిషములకు బార్డోలీ సత్యాగ్రహ సమరసేనుని, స్వతంత్ర భారతరథ చోదకుఁడు, సమైక్య నవభారతనిర్మాత, మన సచివుఁడు, సోదరుఁడు, సర్దా రస్తమించెను.

ఈ సంగతి వల్లభాయి ప్రైవేటుకార్యదర్శియగు శంకర్, ప్రధాని పండిట్ నెహ్రూకుఁ, బ్రెసిడెంటుకుఁ, దదితరమంత్రులకు బొంబాయిలోని మంత్రులకు టెలిఫోన్ చేసినాఁడు.

ఈ సంతాపవార్త వినినంతనే బొంబాయిమంత్రులు సర్దార్ భవనము చేరిరి.

వేలాది స్త్రీ పురుషులు సర్దారును దుది దర్శనముచేసి విలపించసాగిరి. బిర్లా భవనమంతయు జనారణ్యమైయుండెను. ఢిల్లీనుండి సాయంకాలము 4 గంటలకుఁ బ్రెసిడెంటుప్రసాద్, ప్రధాని నెహ్రూ, తదితరాధికారానధికారప్రముఖులు వచ్చిన యనంతరము వల్లభాయి యంత్యక్రియలు ప్రభుత్వలాంఛనములతో నాయన యగ్రజుఁడు విఠలభాయి పటేల్‌కు జరిగిన సోనేపూరు శ్మశానములో జరిగెను.