పుట:2015.329863.Vallabaipatel.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

111

వానికి 'సాత్వికనిరోధ'మక్కరకు రాదు. ప్రజల బాధ్యత వహింప వలసిన ప్రజాప్రతినిధియగు పరిపాలకుఁడే దుర్బలుఁడైనచో, నతని కాధిపత్య మొసంగిన ప్రజలగతి యేమి? సర్దారు వల్లభాయి తన్ను నమ్మినవారి నెన్నటికిని నట్టేట ముంచఁడనియు, వారిని హీనపఱచఁడనియు నాకుఁదెలియును."

గాంధీజీ యుపవాస మొనర్చినను, మఱియెంతగా మొఱ బెట్టినను మతకలహాగ్ని చల్లార లేదు. ఈ యగ్ని యిట్లుండగనే 1948 జూన్ నెలలోగా భారతదేశమునుండి బ్రిటిషువారు నిష్క్రమింతురనియు, నీలోగా భారతదేశ పరిపాలన మెవరికి స్వాధీనము చేయవలయునో నిర్ణయించుటకు లార్డు మౌంట్ బాటెన్‌ను రాజప్రతినిధిగాఁ బంపుచున్నామని బ్రిటిషు ప్రధాని పార్ల మెంటులో 1947 ఫిబ్రవరి 27నఁ బ్రకటించెను.

లోగడ నిశ్చయము ప్రకారము మౌటుబాటెన్ భారతదేశమునకువచ్చి కాంగ్రెసు ముస్లింలీగు నాయకులతో మంతనములు జరిపెను. ముస్లిము లధిక సంఖ్యాకులుగనున్న పంజాబు, సింధు, బెంగాలు; సరిహద్దు రాష్ట్రముల గలిపి "పాకిస్థాన్‌" అనుపేర ప్రత్యేకరాజ్యమును నెలకొల్పవలెనని ముస్లింలీగు నాయకులు మంకుపట్టుపట్టిరి. ఇందువల్ల బీహారు, పంజాబు రాష్ట్రములలో హిందూముస్లిందొమ్మీ లధికమయ్యెను. ఇందుచే సాధ్యమైనంత త్వరలో భారత దేశసమస్యా పరిష్కార ముచితమని బ్రిటిషు ప్రభుత్వము నిశ్చయించెను.

మౌంట్‌బాటెన్ 1947 జూన్ 7 వ తారీఖున భారత నాయకుల నాహ్వానించి బ్రిటిషువారి నూతన పథకమును దెలియజేసెను. దానిలో సారాంశమేమన రెండుమూడు నెల