పుట:1857 ముస్లింలు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు

అరెస్టు చేసి కలకత్తా తరలించిన మాతృభూమిని అంటిపెట్టుకుని అవథ్‌ మహారాణి బేగం హజరత్‌ మహల్‌ ఆంగ్లేయుల విూద యుద్ధం ప్రకటించారు. ఆమె మార్గంలో విలాసవంతమైన జీవితాన్ని వదలి, కాన్పూరు పాలకుడు నానాసాహెబ్‌ పక్షాన పాతికేళ్ళ ఆడపడుచు బేగం అజీజున్‌ పోరుబాట పట్టారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరా డిన మహిళలలో అజీజున్‌ ప్రత్యేక స్థానం పొందారు. ఆమె తన సహచరుడు షంషుద్దీన్‌ సహకారంతో ఆయుధా లు ఉపయోగించటం, గుర్రపు స్వారి చేయటం నేర్చుకొని సైనిక దుస్తులు ధరించి రణరంగానికి సిద్ధమయ్యారు. మాతృదేశం పట్ల భక్తిభావనలు గల యువతులను సవిూకరించి, ప్రత్యేక మహిళా సైనిక దళం ఏర్పాటు చేశా రు. మహిళా సైనిక దళం ఏర్పాటు చేయటమే కాకుండా, వారికి స్వయంగా చక్కని శిక్షణ ఇచ్చి, ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోనగలిగేట్టుగా తీర్చిదిద్దారు. తుపాకి పేల్చటం, కత్తి తిప్పటం, గుర్రపు స్వారి చేయటంలో ప్రత్యేక శిక్షణ కల్పించి సుశిక్షితులైన సైనికులుగా తయారు చేశారు. ప్రజల రక్షణతోపాటు, రాజ్యరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెడతామని శపథాలు చేయించి, శత్రువును దునుమాడేందుకు, ఏ క్షణాన్నైనా రణరంగ ప్రవేశం చేయడానికి మహిళా బలగాలను సర్వసన్నద్ధంగా ఉంచారు.

ప్రముఖ రచయిత ఆనంద స్వరూప్‌ మిశ్రా గ్రంథంNana Saheb Peshwa and the War of Independence లో మహిళా సైనిక దళాన్ని స్థాపించిన ప్రప్రథమ మహిళగా అజీజున్‌ను అభివర్ణిస్తూ ఆమె కృషి గురించి చాలా వివరంగా పేర్కొన్నారు. తిరుగుబాటు యోధులకు ఆహారం, ఆయుధాలను సమకూర్చి పెట్టడం, నాయకులు, సైనికుల మధ్యన సంధానకర్తల్లా వ్యవహరించటం, బ్రిటీష్‌ సైనికుల కదలికలు గమనించి ఆ సమాచారాన్ని తిరుగుబాటు దళాల నాయకులకు చేరవేయటం తదితర బాధ్యతలను ఆమె తన దళాల ద్వారా సమర్థవంతంగా నిర్వహించి నానాసాహెబ్‌కు సహకరించారు. యుద్ధభూమిలో గాయపడిన స్వదేశీ సైనికుల చికిత్సకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించటం పట్ల ఆమె శ్రద్ధను చూపారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులు గాయపడి అనాధలుగా ప్రాణాలు విడవటం పట్ల కలతచెందిన ఆమె క్షతగాత్రులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలందించారు.

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగుతున్న ఆ పోరాటంలో అన్ని విధాల తనదైన