పుట:1857 ముస్లింలు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లింలు


ప్రతిభను చూపెట్టిన ఆమె పోరాడుతూ శత్రువుచేత చిక్కారు. విచారణ కోసం ఆమెను సైనికాధికారి General Havelock ఎదాుట హాజరు పర్చారు. ఆమె ధైర్య సాహసాలను విన్న General Havelock ఆమె రూపురేఖలను చూసి అవాక్కయ్యాడు. ఆ సుకుమారి రణరంగంలో అరివీర భయంకరంగా వ్యవహ రించ డన్ని ఆ ఆంగ్లేయుడు నమ్మలేక పోయాడు. అపరాధాన్ని అంగీకరించి క్షమాపణ వేడుకుంటే ఆరోణప లన్నీ రద్దుచేస్తాననీ,క్షమించి విడిచిపెట్టగలననీ ఆమెకు హామీ ఇచ్చాడు. ఆ ప్రతిపాదానలను బేగం అజీజు న్‌ నిర్ద్వందంగా నిరాకరించారు. ప్రాణ భయం ఏమాత్రం లేని ఆమె ప్రవర్తన చూసి విస్తుపోయిన ఆ అధికారి చివరకు, నీకేం కావాలి? అని ప్రశ్నించాడు. నాకు బ్రిటిష్‌

1857 సెప్టెంబరు 14న భీషణ పోరాటం జరిగిన కాశ్మీర్‌ గేటు. భారీ సైన్యంతో మెహిరించిన ఆంగ్లేయులు భారీ ఫిరంగులతో కాశ్మీర్‌ గేటును పేల్చివేసి కంపెనీ సైనికులు ఎర్రకోటలోనికి ప్రవేశించారు.

పాలన అంతం చూడలనుంది (I want to see the end of British rule ) అని ఆమె నిర్భయంగా సమాధానమిచ్చారు. ఆ సమాధానంతో మండిపడిన General Havelock ఆమెను కాల్చి వేయాల్సిందిగా సైనికులకు ఆదేశాలిచ్చాడు; ఆ ఆదేశాలు తక్షణమే అమలయ్యాయి.

కాన్పూరు సాహసి బేగం అజీజున్‌ మార్గాన సాగిన మరొకరు 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో తెలియరావట్లేదు. ఆమె ఎల్లవేళలా ధరించే ఆకు పచ్చరంగు

-------49--------------