వాడుకరి:ఇందూ జ్ఞాన వేదిక
ఇందూ జ్ఞాన వేదిక దైవ జ్ఞానాన్ని మతాలకతీతంగా విశ్వవ్యాప్తంగా అందరికీ అందించాలని ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థ.
బ్రహ్మవిద్యాశాస్త్రం ఆధారంగా శాస్త్రీయతను, అశాస్త్రీయతను, ఆస్తికుల, నాస్తికుల వాస్తవమును, మూఢనమ్మకముల మూఢత్వమును సమాజానికి తెలియజేయుటకు, జ్ఞాన మరియు ధర్మ ప్రచార నిమిత్తము అర్థశతాధిక గ్రంథకర్త, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైతసిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారిచే 2004 లో ఇందూ జ్ఞానవేదిక (Regd.No. 168/2004) స్థాపించబడినది. కుల, మత రహిత సమాజ నిర్మాణమునకు, మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత, పరిశుద్ధ బైబిల్, పవిత్ర ఖురాన్ లలో వున్న దైవజ్ఞానము ఒక్కటేనని శాస్త్రబద్ధముగా తెలియజేస్తున్న, సత్యమునే ప్రకటిస్తున్న యోగీశ్వరుల వారి సంచలనాత్మక రచనలను, ప్రసంగాలను సమాజమునకు తెలియచేయుచున్నది.