Jump to content

Gabbilam

వికీసోర్స్ నుండి

జాషువా - గబ్బిలం

[మార్చు]

1.

 చిక్కినకాసుచే తనివి చెందు నమాయకు డెల్ల కష్టముల్‌
 బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
 ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
 డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై

భావం:

కష్టపడి సంపాదించగా దొరికిన కొద్ది ధనంతో తనివితీరే అమాయకుడు, ఆకలి అనే అగ్ని చేత దహించబడిన సన్నని ఆకారం కలవాడు ఐన ఆ పేదవాడు అన్ని కష్టాలను ఆ కొద్ది  అన్నంతో  మరచిపోతారు.  నాలుగు దిక్కులు  కలిగిన ఈ లోకంలో దిక్కులేనివాడై ఆ హరిజనుడొకడు భారతదేశానికి చిట్టచివరి కొడుకుగా పుట్టాడు .

విశేషం: 1. "భరతోర్వకు గడగొట్టు బిడ్డడై " అనే వాక్యంలో కడగొట్టు బిడ్డ అనగా చిట్టచివరి బిడ్డ అని కాకుండా వర్గ విభజన గురించి శ్రీకృష్ణుడు భగవత్గీతలో చెప్పిన ప్రకారం నాలుగు కులాలు (బ్రాహ్మణా, వైశ్య క్షత్రీయ, సూద్ర కులాలు ) కాకుండా మిగిలిన వారిని 'పంచమ వర్ణం ' గా అనగా చివరి వర్గంగా విభజించారు. ఆ చివరి కులానికి చెందినవాడు అనే అర్ధం వస్తుంది . 2. అమాయకుడు అన్న పదం ఒకరిమీద ఆధారపడకుండా తన రెక్కల కష్టం మీద బతికేయవాడు కానీ ఎదుటివారిని మోసం చేసి దోచుకునే మనస్తత్వం లేనివాడు అనే దృష్టితో కవి ఉపయోగించాడు. 3.క్షుత్ =ఆకలి + ఆనల=మంటలలో + దగ్ధమూర్తి =దహించబడినవాడు అనగా సన్నని బక్కచిక్కిన శరీరం కలవాడు అనిఅర్ధం.

"https://te.wikisource.org/w/index.php?title=Gabbilam&oldid=251450" నుండి వెలికితీశారు