Creative Commons Attribution-ShareAlike 3.0 Unported

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భావాలు కారకత్వాలు సవరించు లగ్నం :- లగ్నం తనూభావాన్ని సూచిస్తుంది. శరీరం, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావం, సుఖదుఃఖాలు మొదలైన వివరాలు తనూభావం నుండి తెలుసుకోవచ్చని పరాశరుని శ్లోకం వివరిస్తుంది. ఉత్తరకాలామృతం దేహమూ, కాళ్ళు, చేతులూ, అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనం, జ్ఞానం, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము లగ్నం వివరిస్తుందని చెప్తుంది. ద్వితీయ భావం :- ఇది ధన భావం, కుటుంబ భావంగా భావించబడుతుంది. ధనార్జన, ఆహారం స్వీకరించుట, కంఠ ద్వని, మాట తీరు, కంఠ వ్యాధులు, నాలుక. ముఖము, జీవనం, ఉపన్యాసం, వాక్కు, వాగ్ధాటి, విద్య. ఐశ్వర్యము, ఆభరణములు, భోగము, దుస్తులు, ఆచారం, దాతృత్వం, వజ్రము, మారకము, మణులు, ధనధాన్యము, వ్యాపారం. నాసిక, సుగంధ ద్రవ్యములు, నివయము, కోమలత్వం. కుటుంబం, పాండిత్యం, స్నేహం, స్నేహితులు, స్థిరభావం. త్రీతీయ భావం :- ఇది పరాక్రమ భావం, కనిష్ఠ సోదర భావంగా భావించ బడుతుంది. తమ్ముళ్ళు, ధైర్య సాహసాలు, కార్య భారం వహించుట, రౌద్రము, కనిష్ఠ సోదరులు, ఆభరణములు, సత్ప్రవర్తన, వర్ణాశ్రమ ధర్మం, పెద్దలు, యుద్ధము, గురువులు, చెవులు, వాహన సౌక్యము, కాళ్ళు, శారీరక బలం, చిత్త చాంచల్యం, మృష్టాన్న భోజనం, సామర్ధ్యం, శారీరక పుష్టి, సర్వసౌఖ్యము, సంపన్న జన్మ, స్వల్ప ప్రయాణములు, సామర్ధ్యము, కోపము, లాభము, శాంతం, దాసదాసీలు, కార్య సంధానం మొదలైనవాటికి కారకత్వం వహిస్తాడు. చతుర్ధభావం మాతృభావం. తల్లి సౌఖ్యం, వాహనం, సుఖం గురించి తెలియజేయును. అనేక విధ వాహన సంపద, కష్టార్జితం, శీలము, తల్లి బంధువులు, భూమి, గృహములు, చెరువులు, నూతులు, సాధన మొదలైనవి తెలియజేయును. పంచమ భావమనే సంతాన భావము. మంత్ర స్థాన, పూర్వపుణ్య స్థానం, బుద్ధి స్థానం కూడా ఔతుంది. వ్యాపారము, బుద్ధిబలం, వివేకము, ఉన్నత విద్య, సంతానం, పితృధనం, సత్కథా పఠనం, వినయము, గౌరవం, స్త్రీ మూలక భాగ్యము, అన్నప్రధానం, మంత్రోపాసన, మంత్ర జపం, పాప పుణ్యములు, గ్రంథరచన, వార్తాలేఖనం, ఆలోచన, వంశపారంపర్య అధికారం, సంతృప్తి, తండ్రి చేసిన పుణ్యము, మనసు, ఛత్రము, గర్భము, శుభలేఖలు, కోరికలు సిద్దించుట, దూరదృష్టి, రహస్యము, క్షేమము, కార్యాచరణ వైభవము, ప్రతిభ, పాండిత్యము, సంగీత వాద్యములు మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది. షష్టమ భావము శత్రువు, రుణం, రోగ స్థానం. రోగములు, ఋణబాధలు, తగాదాలు, పేచీలు, కౄర కార్యములు, పిసినారితనం, అపవాదులు, యాచకత్వం, అకాల భోజనం, జైలు, అన్నదమ్ములతో వైషమ్యాలు, దొంగతనం, మేనమామలు, ఆపదలు, ప్రేగులు, జీర్ణాశయం మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది. సప్తమ భావము కళత్ర స్థానం. వ్యాపారములో భాగస్వాములు, భార్య, ద్వికళత్రం, దాంపత్య సుఖం, దొంగతనం, బుద్ధి మాంద్యము, వస్త్రములు, అలంకారములు, సుగంధద్రవ్యములు, పానీయములు, విదేశీ ప్రయాణములు, ధనార్జన, మూత్రము, మర్మస్థానముల మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. అష్టమ స్థానం ఆయుర్భావం. మరణము, మరణకారణము, వారసత్వము గురించి తెలియ జేయును. ఇంకా సుఖము, ఆపద, తగాదాలు, సోమరితనం, ధనవ్యయం, దురదృష్టం, మానసిక స్వభావం, అవమానం, పరధనము మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది. నవమభావాన్ని భాగ్యభావం అంటారు. పూర్వజన్మ పుణ్యం కారణంగా కలుగు అదృష్టం, స్థితిగతులు, దూరప్రయాణాలు, ఆధ్యాత్మిక స్థితి, మంత్రోపాసన, గురువులను గౌరవించుట, విద్యార్జన, పిత్రార్జన, సంతానం, ఐశ్వర్యం, ఆచార సంప్రదాయాలు, దైవభక్తి, ఊరువుల మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది. దశమభావం రాజ్యభావం అంటారు. ఉద్యోగం, వ్యాపారం, పేరు ప్రఖ్యాతులు, అధికారం, వృత్తి గురించి తెలియజేస్తుంది. దయాగుణం, యంత్రము, మంత్రము, అభిమానము, మాతృ దేవత, పదవి స్థానం, ఔషధము, బోధన, ముద్రాధికారం, సన్మానం, దేవతలు, పుణ్యము, దత్త పుత్రుడు మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది. ఏకదశ భావమును లాభభావం అంటారు. అగ్ర సోదరులు, స్నేహితుల గురించి తెలియజేస్తుంది. వివిధ ఆదాయములు, వివిధలాభములు, తండ్రి సోదరులు, అలంకారములు, నగలు, కార్యసిద్ధి, ఆశయసిద్ధి, చిత్రలేఖనం, లలిత కళలు, మంత్రోపాసన, విద్య, బంగారం గురించి తెలియ జేయును. ద్వాదశ భావం వ్యయభావం అంటారు. ధనవ్యయం, సమయ వ్యయం, పూర్వజన్మలు, రహశ్య శ్త్రువులు గురించి తెలియ జేస్తుంది. అది బంధనం, ఋణ విమోచనం, స్త్రీలోలత్వం, కళత్రహాని, విదేశప్రయాణం, ఉద్యోగ విరమణ, అధికార పతనం, మనోచంచలం, అహంకారం, శరీర అనారోగ్యం, మారకం మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.