Chakkatladanda/4

వికీసోర్స్ నుండి

  


సీ౹౹ గంజికూటికి నుప్పుగల్లు సంగతంబు| పాలపొంగలికిని బంచదార
తంబాకు సారాయితడువుచే గాటెక్కు | కమ్మ వీడ్య మునకు గప్పురంబు
నిప్పట్టునక మంచినీళ్ళతో నేస్తంబు | బూందిమిఠాయికిం పొం దునేయి
వరిగకూటికి లేత గురుగాకు బొారికూర | వరిబువ్వకును మంచి వరుగు లిగురు

గీ॥ నీటు నీటునుఁ గూడియే మేటి యగును|నీచు నీచునుఁలగూడి యే నిచ్చి బొలయు
అని పలుకు . . . . . 14

సీ౹౹ తేనె గూర్చిన యూగ తిని చచ్చునోలేదో|తెగదావి జుమ్మంచు దేటి తిరుగు
నిట్టబారిన మున్గ నిలుచునో నిల వదో| గుజ్ఞుమామిడి మ్రాను గొమలు సాగు
సాగుచేయని నేల చవుడెక్కి చెడిపోవు | పెడగట్ట దున్నిన మడియపండు
బలిసివీగిన మావు పౌరునో పొరదో| పయిగో వటంగనా పారుగాక
 
గీ॥ పిసినిగొట్టుతనంబును బేరజంబు |సోమరితనంబు మేనివేరా ముదగవు
అని పలుకు . . . . . 15

సీ౹౹ గున్నమామిడి లేజిగురు మేయు గోయెల|గొవ్ప రక్కె న పంచ్లుగొ రకుగాకి
ఏనుంగు తలనెత్తు రేక్రోలు సింగంబు| పీతబొక్కల మూతిబెట్టు నక్క
నును దమ్మితూడులం దిని రాయంచ చేపజెల్లల మట్టుసేయుమను గొంగ
పడగలెత్తిన నాగు బాములదిను నెమ్మి చచ్చిన పసుల కాసపడు బందు

గీ॥ చాలినాతిడు మేటికర్జంబు సేయు పంద నిచ్చలును మెతకపనులు సేయు అని,
అని పలుకు . . . . . 16

సీ౹౹ దూబరదిండి పొత్తున వేయిమాడలు పొదుపరి చేతి డబ్బుసకు లోటు
వదురు బోతాడెడి పదివేలమాటలు చదువరి యొకమాట సాటిగావు
గుడిసె వేటిడిన పెట్టెడుసామ్ము బంగాఠ మిల్లాలి మెడతాళి కీడుగాదు
చండిపోతొక, హరుసాలు చేసినపని. వనివాని యరజాము పనికి లొంగు

గీ॥ చెడుగు దానెంత పొడునైన నడిగియుండు మంచి కొంచెంబెయైవను మించియుండు
అని పలుకు . . . . . 17

సీ౹౹ కన్నపుగత్తి దొంగల యక్కరకెకాక పనికి వచ్చునె మేటి బవరములకు
తాటాకు రేక కాల్దాగుట కె కాక పాటింతురే జారు పాసె మాన
ఇనప మేకులు గొయ్య నెనయించుటకె కాక కదియ గొట్టుదురె బంగార మదుక
పోతువేటలు మారిజాతరల కెకాక జరుగునే తిరునాళ్ల సామి మ్రోల

గీ॥ క్రించు గ్రించులకే కాక మించు మెపుడు మేడి పనులకుఁ గొఱగాడు నూడిదసారి
అని పలుకు . . . . . 18

"https://te.wikisource.org/w/index.php?title=Chakkatladanda/4&oldid=415721" నుండి వెలికితీశారు