3. బ్రహ్మ-నారదుల సంవాదము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
                                         == అధ్యాయము---౫ ==


వ. నారదుండు బ్రహ్మ కిట్లనియె. (73)


మ. చతురాస్యుండపు వేల్పుపెద్దవు జగ త్సర్గానుసంధాయి వీ

శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్ధర్థా సం

యుతమై సర్వము నీ కరామలకమై యుండుం గాదా ! భారతీ

సతి యిలా లఁట నీకు నో జనక ! సందేహమున్ బాపవే ! (74)


శా. ప్రారంభాది వివేక మెవ్వఁ డొసఁగున్ ? బ్రారంభ సంపత్తికా

ధారం బెయ్యది? యేమి హేతువు ? యదర్థం ? బే స్వరూపంబు ? సం

సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగింతు వెల్లప్పుడుంన్

బారం బెన్నఁడు లేదు నీమనువు ? దుష్ర్పాపంబు వాణీశ్వరా ! (75)


శా. నాకుం జూడఁగ నీవు రాజ వనుచున్నాఁడన్ యథార్థస్థితిన్

నీ కంటెన్ ఘనుఁ డొక్క రాజు గలఁడో ? నీ వింతకున్ రాజవో ?

నీ కే లాభము రాఁ దలంచి జగముల్ నిర్మించె ? దీ చేతనా

నీకం బెందు జనించు నుండు ? నణఁగున్ ? న్నిక్కంబు భాషింపుమా. (76)


మ. సదస త్సంగతి నామ రూప గుణు దృశ్యంబైన విశ్వంబు నీ

హృదధీనంబు గదా ! ఘనుల్ సములు నీ కెవ్వారునున్ లేరు, నీ

పద మత్యున్నత, మిట్టి నీవు తపముల్ ప్రావీణ్య యుక్తుండవై

మది నే యీశ్వరుఁ గోరి చేసితివి ? త న్మార్గంబు సూచింపవే. (77)


శా. అంభోజాసన ! నీకు నీశుఁడు గలం డంటేనిఁ దత్పక్షముం

దంభోజాత భవాండ మే విభుని లీలాపాంగ సంభ్రాంతిచే

సంభూతంబుగ వర్తమానమగు ? సంఛన్నంబగున్ ? దద్విభున్

సంభావింపఁగ వచ్చునే ? తలఁప నే చందంబు వాఁ డాకృతిన్ ? (78)


క. తోయజ సంభవ ! నాకీ, తోయము వివరింపు చాలఁ దోఁచిన నే నా

తోయము వారికి నన్యుల, తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్. (79)


వ. దేవా ! భూత భవిష్య ద్వర్త మానంబులగు వ్యవహారంబులకు నీవ విభుండవు. నీ వెఱుంగని యర్థం బించుకయు లేదు. విశ్వప్రకారంబు వినిపింపు మనిన విని వికసిత

ముఖుండై విరించి యిట్లనియె. (80)


క. రారా ? బుధులు విరక్తులు, గారా ? యీరీతి నడుగఁగా నేఱరు వి

స్మేరావహము భవ స్మిత, మౌరా ! నాపైడి ! మర్మ మడిగితి వత్సా ! (81)


శా. నానా స్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప వి

న్నాణం బేమియు లేక తొట్రుపడఁగా నాకున్ సమస్తాను సం

ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము,

న్నే నా యీశ్వరు నాజ్ఞ గాక జగము ల్నిర్మింప శక్తుండనే. (82)