18. ధర్మరాజు దుర్నిమిత్తంబులం గని చింతించుట

వికీసోర్స్ నుండి
                                                       అధ్యాయము--14

సీ. ఒక కాలమునఁ బండు నోషధీచయము వే ఱొకకాలమునఁ బండకుండ నండ్రు

క్రోధంబు లోబంబుఁ గ్రూరత బొంకును దీపింప నరుల వర్తింతు రండ్రు

వ్యహహారములు మహావ్యాజయుక్తము లండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు

మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు సుతులు దండ్రులఁ దెగఁజూతురండ్రు

తే. గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు, శాస్త్రమార్గము లెవ్వియు జరుగ వండ్రు

న్యాయపద్ధతి బుధులై వడవ రండ్రు, కాలగతి వింతయై వచ్చెఁ గంటె నేడె. (1-330)


మ. హరిఁ జూడన్ నరుఁ డేఁగినాడు నెల లే డయ్యంగదా ! రారు కా

లరు లెవ్వారును, యాదవుల్ సమద లోలస్వాంతు లేవేళ సు

స్థిరులై యుండుదురా ? మురారి సుఖియై సేమంబుతో నుండునా ?

యెరవై యన్నది చిత్త మీశ్వరకృతం బెట్లోకదే ? మారుతి ! (1-331)


క. మానసము గలఁగుచున్నది మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు, స

న్మానవ దేహక్రీడలు, మాన విచారింప నోపు మాధవుఁ డనుజా ! (1-332)


క. మనవులు చెప్పక ముందఱ, మన దార ప్రాణ రాజ్య మాన శ్రీలన్

మనుపుదు నని యాదేవుఁడు, మనమునఁదలపోసి మనిచె మనలం గరుణన్. (1-333)


క. నారదుఁ డాడిన కైవడిఁ, గ్రూరపుఁ గాలంబు వచ్చెఁ గుంభిని మీఁదన్

ఘోరములగు నుత్పాతము, లారభటిం జూడఁబడియె ననిలజ కంటే. (1-334)


సీ. ఓడక నాముందు నిక సారమేయంబు మొఱుఁగుచు నున్నది ఘోర యెత్తి

తయాదిత్యుఁ డుదయొంప సభిముఖియై నక్క వాపోయె మంటలు వాతఁ గలుగ

మిక్కిలు చున్నవి మెఱిసి గవాదులు గర్దభాదులు దీర్చి క్రందుకొనియె

నుత్తమాశ్వములకు నుదయించెఁ గన్నీరు మత్తగజంబుల మదము లుడిగెఁ

ఆ. గాలుదూతభంగి గవిసెఁ గపోతము మండ దగ్ని హోమ మందిరములఁ

జుట్టుఁ బొగలు దిశల నారిది నాచ్చాదించె, ధరణి మాసెఁజూడు ధరణి గదలె. (1-335)


క. వాతములు విసరె రేణు, వ్రాతము లాకసముఁ గప్పె వడి నుడిగొని ని

ర్ఘాతములు వడియె ఘనసం, ఘాతంబులు రల్త వర్ష కలితము లయ్యెన్. (1-336)


క. గ్రహములు పోరాడెడి నా, గ్రహములు వినఁబడియె భూతకలకలముల, దు

స్సహములగుచు శిఖికీలా, వహములక్రియఁ, దోఁచె గగన వసుధాంతరముల్. (1-337)


క. దూడలు గడువవు చన్నులు, దూడలకును గోవు దుగ్ధము, లౌడలం

బీడలు మానవు, పశువులఁ, గూడవు వృషభములు దఱిపికుఱ్ఱల నెక్కున్. (1-338)


క. కదలెడు వేల్పుల రూపుల, పదలెడుఁ గన్నీరు వానివలనం జెనటల్

వొదలెడిఁ బ్రతిమలు వెలి, జని, మెదలెడి నొకొక్క గుడిని మేదిని యందున్. (1-339)


క. కాకంబులు వాపోయెడి, ఘాకంబులు నగరఁ బగల గుండ్రలు గొలిపెన్

లోకంబులు విభ్రష్ట, శ్రీకంబుల గతి నశించి శిథిలము లయ్యెన్. (1-340)


మ. యవ పద్మంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతం బైన మా

ధవు పాదద్వయ మింక ముట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా

నవనీకాంతకు లేదువో ! పలుమఱు న్నందంద వామాఝక్షి బా

హువు లకంపము నొందుచుండు, నిల కే యుగ్రస్థితు ల్వచ్చునో ! (1-341)


న. మఱియు మహోత్పాతంబులు పెక్కులు పుట్టుచున్నయని. మురాంతకుని వృత్తాంతంబు వినరాద. అని కుంతీసుతాగ్రజుండు భీమునుతో విచారించి సమయంబున. (1-342)