16. ఉత్తరాదేవికి పరీక్షిత్తు జన్మించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
                 అధ్యాయము.....12

సీ. గురునందనుడు సక్రోధుఁ డై యేసిన బ్రహ్మశిరోనామ బాణ వహ్నిఁ

గుంపించు నుత్తర గర్భంబు గ్రమ్మఱుఁ బద్మలోచనుచేతఁ బ్రతికె సండ్రు

గర్భస్థుఁడగు బాలు గంసారి యేరితి బ్రతికించె? మృత్యువు భయము వాపి

జనియించి యతుఁడెన్ని సంవత్సరము లుండె? నెబ్భంగి వర్తించె నేమి సేసె?

ఆ. వినుము శుకుడు వచ్చి విజ్ఞాన, నతని కెట్లు సూపె నతఁడు పిదపఁ

దన శరీర మే విధంబున వర్జించె? విప్రమ్ముఖ్య! నాకు విస్తరింపు.(1-274)


వ. అనిన సూతుండు డిట్ల్నియె.ధర్మనందనుడు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీపరాజ్యంబు నార్జించియు,మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు,నంగనాతురంగ మాతంగ సుభట కాంచనాది దివ్యసంపదలు సంపాదించియు,వీరసోదర విప్ర విద్వజ్జన వినోదంబులం బ్రమోదించియు,వైభవంబు లలవరించియుఁ,గ్రతువు లాచరించియు,(దుష్ట శిక్షణ,శిష్టరక్షణంబు లొనరించియు) ముకుంద చరణారవింద సేవారతుండై,సమస్త సంగంబులంచు నభిలాషంబు వర్జించి,యరిషడ్వార్గంబు జయించి రాజ్యంబు సేయుచు.(1-275)


తే. చందనాల నాఁకట స్రగ్గువాఁడు,దనివి నొందని కైవడి ధర్మసుతుడు

సంపదలు పెక్కుగలిగియుఁ,జక్రిపాద,సేవనంబులఁబరిపూర్తి సెందకుండె.(1-276)


వ. అంతం గొన్ని దినంబులకు నభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు దశమాన పరిచ్ఛేద్యుండై,గర్భాంతరాళంబున దురంతంబైస యశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు. (1-277)


ఉ. కుయ్యిడ శక్తిలే దుదర గోళములోపల నున్న వాఁద ది

క్కెయ్యది? దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నేఁ

డియ్యిషువహ్ని వాయుట్కు నెయ్యది మార్గము? నన్నుఁ గావ నే

యయ్య గలండు? గర్భ జనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా! (1-278)


క. చిచ్చఱకోల వశంబునఁ, జచ్చిన బహిర్గతుడుఁ గాని సమయమునను దా

నుచ్చలిత గర్భవేదనఁ, జచ్చును మాతల్లి ఘెర సంతాపమున్. (1-279)


క. చెచ్చెర బాణ జ్వాలలు, వచ్చిన విష్ణండు గావవచ్చు ననుచుఁ దా

ముచ్చటలు సెప్పు సతులకు, నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో! (1-280)


శా. రాఁడా చూడు? సమస్త భూతములులో రాజిల్లువాఁ డిచ్చటన్

లేడా? పాఱుని చ్చిచ్చఱమ్ము దిలగన్ లీలాగతిన్ ద్రోచి నా

కీడా? నేఁ డభయప్రదాన మతఁ దూహింపన్ నతత్రాత మున్

గాఁడా? యెందఱిఁ గావఁడీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో! (1-281)


వ. అని గతాగత పాణుండై శిశువు చింతించు సమయంబున. (1-282)


సీ. మేఘంబు మీఁద క్రొమ్మెఱుఁగు కైవడి మేనిపై నున్న పచ్చని పటమువాఁడు

గండ భాగంబులఁ గాంచన మణినయ మకరకుండల కాంతి మలయువాఁడు

శరవహ్ని నణఁగించు సంరంభమునఁ జేసి కన్నుల నునుఁగేంపు గలుగువాఁడు

బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాఁడు

తే. గంకణాంగద వనమాలి విరాజి, మానుఁ డసమానుఁ డంగుష్టమాత్రదేహుఁ

డొక్కగదఁ జేతఁదాల్చి నేత్రోత్సవమగు, విష్ణుఁ డావిర్భవించె న వ్వేళయందు. (1-283)


వ. ఇట్లు భక్తపరాధీనుండైన పరమేశ్వరుం డావిర్భవించి, మంచు విరియించు మార్తాండు చందంబున శిశుకునకు దశదిశలం యఖండిత మహోల్కాజాల సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి, విప్రుని చిచ్చరమ్ము వేఁడిమి పోఁడిమిఁ జెఱిచి, డింభకుని పరితాప విజృంభణంబు నివారించి, గర్భంబు కందకుండ రక్షించి యర్భకునికి నానందంబు గల్పించిన. (1-284)


మ. గదఁ జేఁ బట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునన్ దుర్భయ

ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ

సదయుం డెవ్వఁడొకో! యటంచు మదిలోఁ జర్పింపుచున్ శాబకుం

డెదురై చూడు నదృశ్యుఁడయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా! (1-285)


వ.అంత ననుకూల శుభ గ్రహోదయంబును, సర్వ గుణోత్తర ఫల సూచకంబునైన మంచి లగ్నంబునం భాడవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన ధర్మ నందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యహంబు సదిమించి, జాతకర్మంబులు సేయించి, కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచి సంపన్నంబులై న యన్నంబులు నిడిన,వారలు ధర్మపుత్రునకిట్లనిరి.(1-286)


చ. ప్రకటిత దైవయోగమునఁ బొరవసంతతి యంతరింపఁగా

వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు కృష్ణుఁడు డనుగ్రహించి శా

బకు బ్రతికించెఁ గావున నృపాలక బాలకుఁ డింక శాత్రవాం

తకుఁ డగు విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కెఁ బూజ్యుడై. (1-287)


వ. అని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె. (1-288)


శా. ఓ పుణ్యాత్మకులార!నా పలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్

మా పెద్దల్ చిరకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై

యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా! యెల్లప్పుడున్ మాధవ

శ్రీ పాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే! (1-289)


వ. అనిన విని నరేంద్రా! భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన యిక్ష్వాకు చందంబునం బ్రజల రక్షించ. (శ్రీ రామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య ప్రతిజ్ఞుండు నగు)డేగె వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబిచక్రవర్తిభంగి (శరణ్యుండును, వితరణఖనియు నగు). దుష్యంత సూనుండైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు(యజ్వలకు)ననర్గళ కీర్తి విస్తరించుచు,ధనంజయ కార్తావీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుండగు. కీలిపోలిక దుర్ధర్షుండగు. సముద్రుని తెఱంగున దుస్తరుండాగు.మృగేంద్రుని కైవడీ విక్రమశాలియగు. వసుమతిం బోలె నక్షయ క్షాంతి యుక్తుండగు. భానుని లాగు ప్రతాపవంతుండగు.వాసుదేవు వడువున సర్వభూతహితుండగు. తల్లిదండ్రులమాడ్కి సహిష్ణుఁడగు. మఱియును. (1-290)


సీ. సమదర్శనంబున జలజాతభవుఁ డనఁ బరమ ప్రసన్నత భర్గుఁ డనఁ గ

నెల్లగుణంబుల నిందిరావిభుఁ డన నధిక ధ్ర్మమున యయాతి యనఁ గ

ధైర్యసంపద బలి దైత్యవల్లభుఁ డన నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనగ

రాజితోదారత రంతిదేవుం డన నాశ్రిత మహిమ హేమాద్రి యనఁగ

తే. యశము నార్జించుఁ , బెద్దల నాదరించు,నశ్వవేభంబు లొనరించు,నాత్మసుతులు

ఘనులఁ బట్టించు,దండించు ఖలులఁబట్టి మాధనుఁడు నీమనుమండు మానవేంద్ర! (1-291)


"భుజంగ ప్రయాతము". హరించు గలిప్రేరి తాఘంబు లెల్లన్

భరించున్ ధరన్ రామభద్రుండు వోలెన్

జరించున్ సదా వేదశాస్త్రాను వృత్తిన్

గరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. (1-292)


వ. ఇట్లు పెక్కేండ్లు జీవించి, భూసుర కుమారక ప్రేరితంబైన, తక్షక సర్పవిషాన లంబునం దనకు మరణంబని యెఱింగి, సంగవర్జితుండై, ముకుందు పాదరవింద భజనంబు సేయుచు శుక యోగీంద్రుని వలన నాత్మవిజ్ఞాన సంపన్నుంఢై, గంగా తటంబున శరీరంబువిడిచి,నిర్గత భయశోకంబైన లోకంబు ప్రేశించును. అని జాతకఫలంబు సెప్పి లబ్ధకాములై భూసురులు చనిరి. అంత (1-293)


క. తనతల్లి కడుపు లోపల, మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం

డనుచుఁ బరీక్షింపఁగ జను, లనఘుఁ, బరీక్షిన్నర్రేంద్రుఁ డండ్రు నర్రేంద్రా! (1-294)


ఆ.కాలళచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణుఁ, డైన భంగఁ దాత లనుదినంబుఁ

బోషణంబు సేయుఁ బూర్ణుఁ డయ్యెను ధర్మ,పటల పాలకుంఢు బాలకుంఢు(1-295)


వ.మఱియు ధర్మజుండు బంధుసంహార దోషంబు వాయుకఱకు నశ్వమేధయాగంబు సేయందలంచి,ప్రజలవలనం గరదండంబుల నుపార్జితంబైన విత్తంబు చాలక చిత్తంబునం జింతించునెడ, నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి మరత్తుండను రాజు మఖంబుచేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తముత్తర దిగ్భాగంబు వలన బలవంతులై తెచ్చిన,నా రాజసత్తముండూను సమాయత్త యజ్ఞోపకరణుండై, సకల బంధుసమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు చేసి, పురుషోత్తము నుద్దేశించి మూఁడు జన్నంబులు గావించె. (తదనంతరంబు కృష్ణుండు బంధు ప్రియంబు కొఱకుఁ గరినగరంబునం గొన్ని నెల లుంఢి, ధర్మపుత్రాదులచే నామంత్రణంబు వడసి, యాదవ సమేతుండై ధనంజయుండూ తోడరా నిజనగరంబునకుఁ జనియె.)అంతంకు మున్నువిదురుండు తీర్థయాత్రకుఁ జని మైత్రేయు ముందటఁ గర్మయోగంబులైన ప్రశ్నలు గొన్ని చేసి, యతనివలన నాత్మవిజ్ఞానంబు దెలసి కృతార్థుండై హస్తిపురంబునకు వచ్చిన(1-296)


                  అధ్యాయము....13


క. బంధుఁడు వచ్చె నటంచును, గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం

బంధములు నెఱపి ప్రీతి న, మంథరగతిఁ జేసి రపుడు మన్నన లనఘా! (1-297)


వ. అంత ధర్మనందనుడు విదురునికి భోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తనవారు లందఱు విన నిట్లనియె.
(1-298)


సీ. ఏ వర్తనంబున నింత కాలము వీరు సంచరించితిరయ్య? జగతిలోన

నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి? భావింప మీవంటి భాగవతుల

దీర్థసంఘంబుల దిక్కరింతురుగదా! మీయందు విష్ణుండు మెఱయుకతన

మీరె తీర్థంబులు మీకంటె మిక్కిలి తీర్థంబు లున్నవే? తెలిసిచూడ.

తే. వేరె తీర్థంబు లవనిపై వెదకనేల, మిమ్ముఁ బొడగని భాషించు మేలె చాలు

వార్తలేమండ్రు? లోకులు వసుధలోన, మీకు సర్వంబు నెఱిగెఁడి మేరగలదు.(1-299)


మత్తకోకిల. తండ్రి సచ్చిన మీఁద మా పెదతండ్రి బిడ్డలు దొల్లి పె

క్కండ్రు సర్పవిషాగ్ని బాధల గాసి పెట్టఁగ మమ్ము ని

ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా

తండ్రిభంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే? (1-300)


క. పక్షులు తమ ఱెక్కలలోఁ, బక్షంబులురాని పిల్లపదువుల మమతన్

రక్షించినక్రియ మీరలు, పక్షీకరణంబు సేయు బ్రతికితిమి గదే! (1-301)


క. మన్నారు? ద్వారకలో, నున్నారా? యదువు లంబుజోదరు కరుణన్

గన్నారా? లోకులచే, విన్నారా? మీరు వారి విధి మెట్టిదియో. (1-302)


చ. అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్త లోకవ

ర్తనముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి, యదుక్షయంబు సె

ప్పిన నతఁ డుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్

విను మని చెప్పఁ డయ్యె యదువీరుల నాశము భార్గవోత్తమా! (1-303)


ఆ. మేలు చెప్పెనేని మేలండ్రు లోకులు, చేటు చెప్పెనేని చెట్టయండ్రు

అంతమీఁద శూద్రుఁ డైన కతంబున శిష్టమరణ మతఁడు సెప్పఁ డయ్యె.(1-304)


వ. అది యెట్లనిన మాండవ్య మహాముని శాపంబునం దొల్లి యముండు శూద్రయోనియందు విదురుండై జన్మించియున్న నూఱుసంవత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించె. ఇట యుధిష్థిరుండు రాజ్యంబుఁ గైకొని లోకపాల సంకశులైన తమ్ములుం దానును కులదీపకుండైన మనుమని ముద్దుసేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె.(1-305)


క. బాలాజన శాలా ధన, లీలా వనముఖ్య విభవ లీన మనీషా

లాలసులగు మానవులను, గాలము వంచించు దురవగాహము సుమతీ! (1-306)


వ. అది నిమిత్తంబునం గాలగతి యెఱింగి విదిరుండు ధృతరాష్ట్రున కిట్లనియె. (1-307)				                 "సమాప్తము"