Jump to content

11. ప్రహ్లాదచరిత్ర ప్రారంభము - ప్రహ్లాదుని భక్తి పారమ్యము

వికీసోర్స్ నుండి

సీస పద్యము తనయందు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భ్రుత్యునికైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్ను దోయికి నన్యకాంత లడ్డం బైన మాతృభావన సేసి మరలువాడు తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను దీనుల గావ జింతుంచువాడు తేట గీత సము(ఖు)లయెడ సోదరస్థ్తితి జరు(గు)పువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదు డైన ప్రహ్లాదు డధిప!