1. విదురుని తీర్థయాత్ర

వికీసోర్స్ నుండి

శ్రీ మదాంధ్ర మహాభాగవతము[మార్చు]

తృతీయ స్కంధము[మార్చు]

కం|| శ్రీమహిత వినుత దివిజ, స్తోమ ! యశస్సీమ ! రాజ | సోమ ! సుమేరు

స్థేమ ! వినిర్జిత భార్గవ, రామ ! దశానన విరామ ! రఘుకులరామా ! (1)

అధ్యాయము - ౧[మార్చు]

వ. మహనీయ గుణగణ వరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు

శుకయోగీంద్రుం డిట్లనియె. (2)


విదురుడు తీర్థయాత్ర సేయుట[మార్చు]

ఉ|| పాండు నృపాల నందనులు | బాహుబలంబున ధార్తరాష్ట్రులన్

భండనభూమిలో గెలిచి | పాండుర శారద చంద్రచంద్రికా

ఖండ యశఃప్రసూన కలి | కావళిఁ గౌరవ రాజ్యలక్ష్మి నొం

డొండ యలంకరింపుచు జ | యోన్నతి రాజ్యము సేయుచుండఁగన్. (3)


కం|| మనుజేంద్ర ! విదురుఁ డంతకు, మును వనమున కేఁగి యచట | మునిజన గేయున్

వినుత తపో ధౌరేయున్, ఘను ననుపమ గుణ విధేయుఁ | గనె మైత్రేయున్. (4)


కం|| కనుఁగొని తత్పాదంబులు, దన ఫాలము సోఁక మ్రొక్కి | తగ నిట్లనియెన్

మునివర్య ! సకల జగత్పా, వన చరితుఁడు కృష్ణుఁ డఖిల | వంద్యుం డెలమిన్. (5)


కం|| మండిత తేజోనిధియై, పాండవ హితమతిని దూరభావంబున వే

దండపురి కేఁగి కురుకుల మండనుఁ డగు ధార్తరాష్ట్రు | మందిరమునకున్. (6)


తే|| చనఁగ నొల్లక మద్గృహం | బునకు భక్త, వత్సలుండగు కృష్ణుండు | వచ్చుటేమి

కతము ? నాకది యెఱిఁగింపు | కరుణ తోడ, ననుచు విదురుండు మైత్రేయు | నడిగె ననిన. (7)