హైందవ స్వరాజ్యము/మొదటి ప్రకరణము
హైందవ స్వరాజ్యము.
మొదటి ప్రకరణము.
దేశీయ మహాసభ : తదధికారులు.
చదువరి : నేటిదినము మనభూమిలో ప్రజలు స్వరాజ్యము స్వరాజ్యము అని బహుభంగుల మాట్లాడుకొనుచున్నారు. అందుకై అందరు వాపోవుచున్నట్లున్నది. దక్షిణాఫ్రికాలో మరి యితర ప్రాంతములలో కూడ ఇదేరీతిని మన వారు ఆశల తోనున్నారు. భారతభూమి స్వాతంత్యములకు ఆతురపడు చున్నది. తమరీవిషయమున అభిప్రాయమిత్తురా ?
సంపాదకుడు : ప్రశ్న చక్కగానడిగితిరి. ప్రత్యుత్తరమి చ్చుటమాత్రమంత సులభముగాదు. పత్రికాధికారులకు మూడు ముఖ్యధర్మములు కలవు. లోకుల అభిప్రాయములను కని పెట్టి వెలిబుచ్చుట యొక ధర్మము ; ప్రజలలో సక్రమములు సమం జసములు నగు క్రొత్తయాశయములను జనింపజేయుట మరి యొక ధర్మము ; ప్రజలకుగల కష్టనిష్టూరములను జంకు కళంకు లేక బహిరంగ పరచుట మూడవధర్మము. మీప్రశ్నకు ప్రత్యుత్తరము చెప్పుటలో ఈ మూడుధర్మములును నేక కాలమున నెర వేర్చవలసివచ్చుచున్నది. కొంతవరకు ప్రజల సంకల్ప
హైందవ స్వరాజ్యము.
మును బహిరంగపరచవలెను. కొంతవరకు కొన్ని యద్బోధన లను ప్రకటింపవలెను. కొన్ని కొన్ని కష్టనిష్టూరములను విమర్శింప వలెను. మీరు ప్రశ్న యడిగితిరి గావున ప్రత్యుత్తరమిచ్చుట నావిధి.
చదువరి : అట్లయిన మనలో స్వరాజ్యమునకయి అభిలాష
జనించిన దనియేకదా మీ యభిప్రాయము.
సంపా: ఆ యభిలాషయే దేశీయ మహాసభకు పుట్టువు కల్పించినది. " దేశీయ" మను పదప్రయోగమే దానిని వెలిబుచ్చుచున్నది.
చదువరి : మీరు చెప్పునది సరిగాదు. నవయౌవన భారత భూమి దేశీయమహా సభను అలక్ష్యముతో చూచునట్లున్నది. అది బ్రిటిషు పరిపాలనను అనంతము చేయు సాధనమని ఇప్పటి యౌవనులు తలంచుచున్నట్లున్నారు.
సంపా : ఆయభిప్రాయము న్యాయము కాదు. భారతపితా మహుండగు మన దాదాభాయి నౌరోజి శంఖుస్థాపనచే యనిచో నేటిదినము మన యౌవనులు స్వరాజ్యమును గురించి మాటలాడుటకైనను అవకాశముండి యుండదు. హ్యూము మహాశయుడు వ్రాసినది మనము మరువజాలము. ఆతడు మవలను కార్య దీక్షకు బురికొల్పినది స్మరింప క వీలు లేదు...
దేశీయమహాసభోద్దేశములను సాధించుటకు ఆత డెంత ప్రయ 3
దేశీయ మహాసభ : తదధికారులు.
త్నముమీద మనలనుద్బోధించి నదియు మనకు సంస్మరణీయమే.
అట్లే సర్ విల్లియము వెడ్డర బరనుకూడ తన ధనమాన ప్రాణ
ములను మనకొరకు వినియోగించినాడు. అతడు వ్రాసినవిషయ
ములు నేటికిని సమాదరణీయము లై యున్నవి. గోకెలే పండితు
డు మన హైందవజాతిని స్వరాజ్య మునకు సిద్ధము చేయుటకయి
దారిద్య వ్రతమును పూని ఇరువది సంవత్సరముల కాలమును
మన కై ధారపోసెను. దేశీయ మహాసభ మూలకముగా ఈ
భూమిలో స్వరాజ్య బీజములను చల్లిన వారిలో కీర్తి శేషులైన
న్యాయమూర్తి బద్రుద్దీను తయాబ్ది యొక్కడు. ఇ దేవిధముగా
బంగాళములో, మద్రాసులో, పంజాబులో మరి యితర ప్రాంత
ములలలో భారత భూమియంతటను హైందవ దేశమిత్రులును
దేశీయసభాభిమానులును నైన హైందవులును ఆంగ్లేయులును
నుందురు.
చదువరి: నిలుడు. - నిలుడు. మీరు కడుదూర మరుగుచు
న్నారు. నా ప్రశ్నకును మీరిచ్చునుత్తరమునకును ఎక్కు డెడ
మేర్పడుచున్నది; నేను మిమ్మునడిగినది స్వరాజ్యమునుగురించి.
మీరు ప్రత్యుత్తరము చెప్పుచుండునది పరులపరిపాలనను గురించి.
ఇంగ్లీషు పేర్లు నాకు విననక్కఱలేదు. మీరు వానిని చెప్పుచు
న్నారు. ఇట్లుండుట చేత మీకు నాకు పొత్తుపొసగునని తో
హైందవ స్వరాజ్యము.
మాట్లాడినయెడల సంతోషము. తక్కిన " శిష్ట ” సంభాష
ణయంతయు నా నెత్తి కెక్కదు,
సుపా: ఈతొందరపాటు వలదు. నేనును మీరీతినుండ రాదు. కొంచెము ఓపిక పట్టితి రేని మీకు కావలసినదే నేనును చెప్పుట మీరెరుఁగ గలరు. చెట్టొక్క నాట పెరుగదు. నన్ను మీరు అభ్యంతర పెట్టుట, హైందవ భూమి మిత్రులను గురించి మీరు విననొల్ల కుండుట, చూడగా (మాసంగతి తీసికొను నెడల) స్వరాజ్యము కడుంగడుదూరమగునట్లు తోచుచున్నది. మీ వంటివార నేకులుండిన యెడల మన మొక అడుగైన ముందుకు పెట్టియుండము. ఈసంగతిమాత్రము జ్ఞాపకము పెట్టుకొనుడు.
చదువరి: మీ ధోరణి చూడగా లోకాభిరామాయణము
మాట్లాడి నాకు జవాబు ఎగగొట్టు నట్లున్నది. నాకు ఎవరు
దేశమిత్రులుగా దోచుచున్నారో వారు నా అభిప్రాయము ప్రకా
రము దేశమిత్రులు గారు. అట్లుండగా వారిని గురించిన ఈ
ప్రసంగము నేను వినవలసినపని యేమి ? మనజాతికంతయు
పితామహుడని మీ రనునట్టి యతఁడు ఆజూతి కేమిచేసినాడు ?
అతఁడు చెప్పునదంతయు ఇది : "ఇంగ్లీషు పరిపాలకులు న్యాయ
ముచేయుదురు. వారికి సహాయముకండు”.
సంపా : తిన్నగా చెప్పినను దృఢముగా చెప్పుచున్నాను.
5
దేశీయ మహాసభ : తదధికారులు,
షించుట వ్రీడాకరము. అతడు చేసినపని స్మరించుకొనుము. తన జీవితమునే అతడు దేశమునకై సమర్పించినాడు. మన కిప్పుడుకల జ్ఞానము అతడు పెట్టినభిక్ష. అంగ్లేయులు మన సార మును పీల్చి మనలను పిప్పి చేసిరనుట మనకు దెల్పిన వాడు దాదాభాయియే : కడపటివరకును ఆంగ్లజాతియందు అతనికి నమ్మకమున్నంతమాత్రమున నదియొక దోషమా? మనకు కండ కావరముండి ముందు కొకయడు గెక్కువగా పెట్టగల్గినంత నే దాదాభాయి గౌరవమునకు హానిగల్గునా ? ఆమాత్రము చేత మన మతనికంటెను వివేకులమా? వివేకు లైన వారి కొక టే గుర్తు. వారెక్కి వచ్చిన నిచ్చెనను వారెప్పుడును పడదన్ను కొనరు. మెట్లలో నొక మెట్టు నశించినను మెట్లన్నియు వీడిప డును. శిశువులుగా నుండి పెద్దయయినపిదప మనము శిశుస్థితిని తృణీకరింపము. నాటి సంగతి సందర్భములు స్మరించుకొని ఆనం దించుచుందుము. బహుకాలము నేర్చుకొని గురువు మనకు పాఠములు చెప్పును. దానిపై మనము మరికొంతదూరము మభివృద్ధి చేసికొందుము. ఆయన వేసిన పునాదుల పైన నేను కొంత యెక్కువ కట్టుకొనిననూత్రాన నేను ఎక్కున వివేకి యగుదునా ? అత డెప్పుడును నాకు గౌరవనీయు డేకదా ! మన భారతపి తామహుడగు దాదాభాయి సంగతియు నింతే. అతడు
భారత జాతీయ నిర్మాత యని యంగీకరింపక తప్పదు. హైందవ స్వరాజ్యము.
చదువు : మీరు చక్కగా చెప్పితిరి. దాదాభాయి గౌరవ నీయుడని నాకిప్పుడు అర్థమయినది. ఆతడును మరియాతనివంటి వారును లేనియెడల మన కీనాడుగల యుత్సాహము కలిగి యుండక పోవచ్చును. అయిన గోకెలేనుగురించి ఇట్లు చెప్పను రాదు. ఆతఁడు ఇంగ్లీషు వారికి గొప్ప స్నేహితుఁడు. స్వరాజ్య మునుగురించి మాట్లాడుటకు ముందు మనము వారి దగ్గర నుండి ఎంతో నేర్చుకొనవలెననియు వారి రాజకీయ వివేకమును సంపా దింపవలెననియు అతడు చెప్పును. అతని యుపన్యాసములు చదిని చదివి నాకు వెగటుపుట్టినది.
సంపా : అట్లు వెగటు పుట్టిన యెడల అది మీయసహనము
నకే ద్యోతకముగా నున్నది. తల్లిదండ్రులు మెత్తగా నాలోచన
చేయుదు రనియు వారు తమతో పరుగెత్తిరనియు కోపించు
కొనుబిడ్డలు తల్లిదండ్రుల నగౌరవపరచువా రనికదా మనము
నమ్మచున్నాము. గోకెలేపండితుడు పితృవర్గము లోనివాడు.
అతఁడు మనతో పరుగు లెత్త లేదని మన మేవగించుకొననగునా?
స్వరాజ్యమును కోరునట్టిజాతి పితృవర్గము నెప్పుడును నుల్లం
ఘింపతగదు. పూర్వికులయెడ మర్యాద లేనినాడు మనము వ్యర్థు
లముగాని మరి వేరుగాము.ఆతురతపాలుగలవారు ఆత్మ సామ్రాజ్య
మేలజాలరు. భావపరిపాకముగలవారల కే అయ్యది తగును.
7
దేశీయమహాసభ : తదధికారులు.
విద్యకయి ధారపోయునపుడు అట్టివారు ఈ దేశమున నెందరుం డిరో వ్రేలుమడిచి చెప్పగలరా ? గోకె లేమహాశయు డేమి చేసి నను సరియే పవిత్రోద్దేశముతోను మాతృ సేవాదృష్టిలోను చేసి నాడనుట నాదృఢవిశ్వాసము. అతని మాతృభక్తి యపారము. దేశమాతకు ప్రాణమైనను సమర్పించుట కతడు సంసిద్ధుడు. అత డేమి పల్కినను పరసంతోషమునకయి పలుకువాడు కాడు. తనకు న్యాయమని తోచినదే చెప్పువాడు. కాబట్టి యతని యెడల మనకు సంపూర్ణాదరము అత్యవసరము.
చదువరి: అట్లైన మన మతని పాదముల బట్టి యన్ని విషయ
ములలోను నడువవలసిన దేనా ?
సంపా : నే నామాట చెప్పనే లేదు. ఎందులో నైనను మన
యాత్మసాక్షి ఆతని పథమునుండి వేరుపడెనా అప్పుడు తదను
గుణముగా నడువవలసినదేయని అతడే మనకు బోధించియుం
డును. అతడు చేసిన పనిని దూరకుండ, ఆతనితో పోల్చుకొను
నెడల మనము మిక్కిలి యల్పజ్ఞులమగుటను స్మరించుకొను
టయే మనము చేయవలసినది. అనేకులు వ్రాయసకాండ్రు అత
నిని ఉల్లంఘించి వ్రాయుదురు. ఆవ్రాతలకు మనము అసమ్మతి
దెల్పుట కరణీయము. గోకెలే మహానుభావునివంటివారలను
మనము స్వరాజ్య సౌధము యొక్క ముఖ్యస్తంభములుగా నాలో
హైందవ స్వరాజ్యము
యగుబూటక మనుకొనుట దురభ్యాసము. అభిప్రాయ భేదమా
త్రమున ఎదుటివారు దేశద్రోహులనుటయు నిట్టిదియే.
చదువరి: తమయర్థము నాకిప్పుడొక కొంచెము స్ఫురించు
చున్నది. నేను ఇంకను ఆలోచించుకొనవలసియున్నది. కాని
మీరు హ్యూమును గురించియు సర్ విల్లియము వెడ్డర బరనును
గురించియు చేయుసంభాషణ నా కేమియు గోచరింప లేదు.
సంపా: హిందువుల విషయములో ఏ తత్త్వము పనికివచ్చి
నదో ఇంగ్లీషువారి విషయములో కూడ ఆతత్త్వమే పనికి
వచ్చును. ఇంగ్లీషువారందరు చెడ్డ వారని నే నెప్పుడు చెప్ప
నొప్పుకొనను. వారిలో అనేకులు భారతభూమికి స్వరాజ్యము
కోరువారున్నారు. ఇతరులకంటే ఇంగ్లీషు వారికి కొంచెమెక్కువ
స్వార్థపరత్వ మున్నదనుట నిజమే కాని ఆమాత్రము చేత ఇంగ్లీ
షువారందరు చెడ్డ వారు కారు. న్యాయము మనకు చేయమని
ఇతరులను కోరునప్పుడు మనమును ఇతరులకు న్యాయము
చేయవలెను. సర్ విల్లియము భారతభూమికి చెడుగుకోరడు.
అదియే మనకు చాలును. మనము న్యాయముగా నడుచుకొను
నెడల మనకు స్వాతంత్య్రము శీఘ్రతరముగా కలుగును. అది
మీకు ముందు తెలియగలదు. ప్రతి ఇంగ్లీషువానిని మన శత్రు
వుగా దూరము చేయు నెడల స్వరాజ్యము దూరము పోవును.
9
దేశీయ మహాసభ : తదధి కారులు.
యెడ న్యాయముగా నుండు పట్ల మన ఉద్దేశము నెర వేర్చుకొను
టలో మనకు వారిసహాయము లభింపగలదు.
చదువరి: ఇప్పుడు - ఇదంతయు నాకు వట్టిపిచ్చిగా దోచు
చున్నది. స్వరాజ్యము ఇంగ్లీషు సహాయము ఇవి రెండు పరస్పర
విరోధములు. మనకు స్వరాజ్యము రాగా చూచి ఇంగ్లీషువా రెట్లు
సహింపగలరు ? అయిన ఆవిషయము మీ రిప్పుడు నాకు నిర్ధా
రణ చేసి చెప్ప నక్కర లేదు. దానివిషయమై కాలహరణ
మొనర్చుట వ్యర్థము. మనకు స్వరాజ్యము ఎట్లు వచ్చునో
మీరు చెప్పునప్పటికి నాకది అర్థము కావచ్చును. ఇంగ్లీషు
సహాయము సమాచారము మాట్లాడిన దానివలన మీయెడల
నాకు కొంతవ్యతి రేక భావము కలిగినది. కాబట్టి ఈవిషయమే
యెక్కువగా చెప్పుచునుండవలదు.
సంపా: నాకు ఆవిషయమున నింకను ప్రసంగింపవలయు నను
ఆశ లేదు. మీకు నాయెడ విరుద్ధ భావ మేర్పడినంతట నాకు
వ్యసనము లేదు. మొట్ట మొదటనే తీపిగానిమాటలు చెప్పుట
మంచిది. శాంతముగా సహనముతో మీవిరుద్ధ భావమును తొలఁ
గించుట నావిధి.
చదువరి: మీరు కడపట చెప్పినవిషయమునకు సంతోషము.
నాకుదోచినట్లు దాపరికము చేయక మాట్లాడుట కది నాకు
హైందవ స్వరాజ్యము.
కాలేదు. దేశీయ మహాసభ యెట్లు స్వరాజ్యమునకు బునాది
వైచినదో తెల్పుడు
. సంపా: చూతము. దేశీయమహాసభ భారతభూమి నాలుగు చెరగులనుండి దేశ పుత్రులను నొక్కచోట చేర్చెను. మనమం దర మొక్క జాతీయను నుత్సాహమును మనకు కలుగ జేసెను" ప్రభుత్వము వారికి ఆ సభ యెడల అసూయయే. దేశాదాయమును దేశ వ్యయమును ప్రజా ప్రతినిధులే నిర్ణయింపవలె నని ఎప్పుడును ఆసభ కోరినది. కనడాలోవలె ఇక్కడ స్వపరిపాలన యేర్ప డవలెనని యెప్పుడును అడుగుచు వచ్చినది. మనకు అది దొర కునా లేదా, అదేమంచిదా కాదా, దానికంటే మంచిది మరి యొకటి కలదా యిత్యాది ప్రశ్నలు ఇట అనవసరము. మనము గమనింపతగినది ఒక్కటే విషయము. దేశీయమహాసభ మనకు స్వరాజ్యముచవి ఇట్టిదనుటను ప్రకటించినదా? లేదా? ఆకీర్తి తత్సభకు లేక చేయుట నాయము కాదు. మనమును ఆప్రయ త్నము చేయుదుమేని కృతఘ్ను లమగుటయేగాక మనయు ద్దేశ పరిపూ ర్తినిగూడ దూరము చేసికొనిన వారమగుదుము. దేశీయ మహాసభ మసజాతీయాభివృద్ధికి విరోధియని యెంచుట దానిని మనము వినియోగించు కొనుభాగ్యము పోగొట్టుకొనుట యగును.