హలో...డాక్టర్/శరీర రక్షణ వ్యవస్థ (Immune System)
31. శరీర రక్షణ వ్యవస్థ ( Immune System ) జంతుజాలపు మనుగడకు శరీరరక్షణ వ్యవస్థ చాలా అవసరము. సూక్ష్మాంగ జీవులు (bacteria), విషజీవాంశములు (viruses), శిలీంధ్రములు (fungi), పరాన్నభుక్తులు (parasites), జీవవిషములు (toxins), ఇతర మాంసకృత్తులు (proteins ), శర్కర మాంసకృత్తులు (glycoproteins) శరీరము లోనికి చొచ్చుకొని నిత్యము దాడి చేస్తుంటాయి. శరీర రక్షణ వ్యవస్థ వానిని తటస్థీకరించుటకు, నిర్మూలించుటకు యత్నిస్తుంది. దాడి చేసే సూక్ష్మజీవులు, విషజీవాంశములు, జీవవిషములు శరీరములోనికి ప్రవేశించకుండా చర్మము, శ్వాసపథము, జీర్ణమండలము, మూత్ర జననాంగములను కప్పే శ్లేష్మపు పొరలు (mucous membranes) చాలా వఱకు నివారిస్తూ దేహమునకు రక్షణ చేకూరుస్తుంటాయి. దేహము దగ్గు, తుమ్ము ప్రక్రియల వలన శ్వాసమార్గములోని వ్యాధి కారకములను (pathogens), ప్రకోపకములను (irritants) శరీరము బయటకు నెట్టగలుగుతుంది. శ్వాసమార్గములోను, జీర్ణమండలము లోను శ్లేష్మము (mucous) వ్యాధి కారకములను బంధించి తొలగించ గలుగుతుంది. జీర్ణాశయములోని ఉదజహరికామ్లము (hydrochloric acid), జీర్ణాశయములోని రసములు, జీవోత్ప్రేరకములు (enzymes) సూక్ష్మాంగజీవులను నిర్మూలించుటకు ఉపయోగపడుతాయి.
చెమటలోను, కన్నీళ్ళలోను, స్తన్యములోను, శ్వాసపథ స్రావములలోను, మూత్ర, జననాంగ పథములోను ఉండే రసాయనములు, lysozyme వంటి జీవోత్ప్రేరకములు ( enzymes), సూక్ష్మాంగ జీవులను ధ్వంసము చేయుటకు ఉపయోగపడుతాయి. శరీరమునకు గాయములు తగిలిన వెంటనే స్రవించు రక్తము గడ్డకట్టి గాయములను పూడ్చుటకు తోడ్పడుతుంది. ఆపై గాయములను మాన్చు
- 332 :: ప్రక్రియకు దేహము పూనుకుంటుంది. రోగజనకములు (pathogens)
గాయముల ద్వారా శరీరములోనికి చొరబడనీయకుండా నివారించుటకు ప్రయత్నము చేస్తుంది.
అంతేకాక శరీరములో ప్రత్యేక రక్షణ వ్యవస్థ నిక్షిప్తమై ఉన్నది. ఎముకలలోని మజ్జలో బహుళ సామర్థ్య మూలకణముల (pluripotent stem cells ) నుంచి శ్వేతకణములు ఉత్పత్తి చెంది శరీరరక్షణలో పాల్గొంటాయి. థైమస్ గ్రంథి ( Thymus gland ) :
థైమస్ గ్రంథి (thymus) గళగ్రంథి ( thyroid gland ) క్రింద నుంచి ఛాతి పైభాగములో యిమిడి ఉంటుంది. ఇందులో టి - రసికణములు (T- Lymphocytes) ఉత్పత్తిచెంది, పరిపక్వము పొందుతాయి. టిరసికణములు (T- Lymphocytes) శరీరరక్షణలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. స్వయంప్రహరణ కణముల (auto reactive) నిర్మూలనము కూడా థైమస్ గ్రంథిలో జరుగుతుంది. స్వయంప్రహరణ వ్యాధులను (auto immune diseases) నివారించుటకు థైమస్ (thymus) గ్రంథి తోడ్పడుతుంది. రసిగ్రంథులు ( Lymph glands ) :
శరీరములో గజ్జలలోను, బాహుమూలములలోను, మెడలోను, ఉదరములోపల, ఛాతిలోపల సముదాయములుగా ఉండే రసిగ్రంథులు (lymph glands) వ్యాధికారకములను (pathogens) వడగట్టి అవి కలిగించు వ్యాధులను ( infections ) ఆ యా ప్రాంతములకు పరిమితము చేస్తాయి. ప్లీ హము ( Spleen ) :
ఉదరములో ఉండే ప్లీహము (spleen) రక్తము ద్వారా వచ్చే ప్రతిజనకములను (antigens) వడగట్టుతుంది. ఇందులో ఉండే రసికణములు (lymphocytes ), ప్రతిజనకములను విచ్ఛేదించి, వాటికి
- 333 :: ప్రతిరక్షకములను (antibodies) స్రావక కణముల (Plasma cells)
ద్వారా తయారుచేయు ప్రక్రియకు దోహదకారి అవుతాయి.
గొంతులో ఉండే గవదలు (tonsils), చిన్నప్రేవుల (small intestines) లోను, క్రిముకము (appendix) లోను ఉండే రసికణజాలము (lymphoid tissue) రక్షణవ్యవస్థలో భాగములే. చర్మము, శ్లేష్మపు పొరల (శ్లేష్మ త్వచము ; mucous membranes) ద్వారా వ్యాధికారకములు (pathogens) శరీరములోనికి చొచ్చుకొన్నపుడు శరీరరక్షణ వ్యవస్థ రోగ జనకములను (pathogens) నిర్మూలించి, వాటిని తటస్థీకరణము చేయుటకు ప్రయత్నిస్తుంది. ఈ రక్షణవ్యవస్థ నిర్మాణము, వ్యాపారము క్లిష్టతరమైనను శాస్త్రజ్ఞుల కృషి వలన చాలా విషయములు ఎఱుకలోనికి వచ్చాయి. ఈ శరీరరక్షణ వ్యవస్థలో వివిధకణములు, స్రావములు ( secretions) పాలుపంచుకుంటాయి.
రక్తములో ఎఱక ్ఱ ణములు (erythrocytes), తెల్లకణములు (leukocytes), రక్తఫలకములు (platelets), రక్తద్రవము (plasma) ఉంటాయి. ఎఱ్ఱకణములు ప్రాణవాయువును కణజాలమునకు చేర్చుటకు ఉపయోగపడుతాయి. రక్తఫలకములు రక్తము గడక ్డ ట్టుటకు, రక్తస్రావము నివారించుటకు తోడ్పడుతాయి. తెల్లకణములు రోగజనకములను (pathogens) కబళించుటకు, నిర్మూలించుటకు ఉపయోగపడుతాయి. రక్తద్రవములో (plasma) ఉండే ప్రతిరక్షకములు (antibodies), ఇతర స్రావములు వ్యాధి కారకములను తటస్క థీ రించుటకు తోడ్పడుతాయి. కణ రక్షణ
- 334 :: తెల్ల కణములు ( Leukocytes ) :
తెల్లకణములు శరీరరక్షణలో పాల్గొంటాయి. తెల్లకణములు ఎముకల మజ్జలో బహుళ సామర్థ్య మూలకణముల ( pluripotent stem cells) నుంచి ఉద్భవిస్తాయి. తెల్లకణములను కణికలు గల కణములు (granulocytes), కణికలు లేని కణములుగా (non granulocytes) విభజించవచ్చును.
వీనిలో కణికల కణములు (granulocytes) అధికశాతములో ఉంటాయి. కణికలకణములలో న్యూక్లియస్ లు పలు కణుపులతో భాగములుగా (మూడు నుంచి ఐదు వఱకు) విభజించబడి ఉంటాయి. హెమటాక్సొలిన్ - యూసిన్ వర్ణకములు (hematoxylin - eosin pigments) కలిపి సూక్ష్మదర్శినితో చూసినపుడు కణద్రవములో కణికలు (granules) చుక్కలు వలె కనిపిస్తాయి. కణికల రంగు బట్టి ఇవి తటస్థ కణములు ( Neutrophils ), ఆమ్లాకర్షణ కణములు (Acidophils or Eosinophils ), క్షారాకర్షణ కణములు (Basophils) అని మూడు రకములు. తటస్థ కణములు ( Neutrophils ):
రక్తములో హెచ్చు శాతపు ( 60- 70 శాతము ) శ్వేతకణములు తటస్థకణములు. హెమటాక్సిలిన్, యూసిన్ వర్ణకములు (hematoxylin, eosin) చేర్చినపుడు వీటి కణద్రవములలో (plasma) కణికలు లేత ఊదారంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి. సూక్షజీవులు, శిలీంధ్రములు (fungi) శరీరములో ప్రవేశించినపుడు వీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సూక్ష్మజీవులను, శిలీంధ్ర కణములను (fungi) కబళిస్తాయి (phagocytosis). పలు సూక్ష్మజీవులను కబళించి, వాటిని నిర్మూలించిన పిదప ఈ కణములు మరణించుటచే చీము ఏర్పడుతుంది. ఆమ్ లా కర్ష ణ కణములు ( Eosinophils , Acidophils ) :
హెమటాక్సిలిన్ - యూసిన్ వర్ణకములతో కణద్రవములో వీటి
- 335 :: కణికలు (granules) నారింజరంగులో ఉంటాయి. వీటి న్యూక్లియస్లు
సాధారణముగా ఒక కణుపుతో రెండు భాగములుగా చీలి ఉంటాయి. రక్తపు శ్వేతకణములలో వీటి శాతము 2- నుంచి 4 వఱకు ఉంటుంది. కొక్కెపు క్రిములు ( hookworms ), ఏటికక్రిములు (roundworms), నారిక్రిములు (Tape worms) వంటి పరాన్నభుక్తులు (parasites) దేహములో ప్రవేశించినపుడు, అసహన ( allergies ) వ్యాధులు కలిగినపుడు, ఉబ్బస వంటి వ్యాధులు కలిగినపుడు వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి విడుదల చేసే రసాయనములు పరాన్నభుక్తులను చంపుటకు ఉపయోగపడుతాయి. ఈ ఆమ్లాకర్షణ కణములు భక్షణలో ( phagocytosis ) పాల్గొనవు. క్షారాకర్ష ణ కణములు ( Basophils ) :
ఈ కణములలో న్యూక్లియస్లు రెండు, లేక మూడు భాగములుగా విభజించబడి ఉంటాయి. హెమటాక్సిలిన్, యూసిన్ (hematoxylin, eosin) వర్ణకములు కలిపినపుడు కణద్రవములో కణికలు ముదురు ఊదారంగులో ఉంటాయి. ఈ కణికలలో హిష్టమిన్ (histamine), హిపరిన్ (heparin), ప్రోష్టాగ్లాండిన్స్ (prostaglandins) వంటి రసాయనములు ఉంటాయి. రక్తపు శ్వేతకణములలో వీటి శాతము 0.5 ఉంటుంది. కణజాలములో ఉండే స్తంభకణముల (mast cells) వలె ఇవి ఐజి-ఇ ని ( immunoglobulin E, IgE) ఆకర్షిస్తాయి. ప్రతిజనకములు (antigens) ఈ కణములపై ఉండు ఐజి-ఇ తో (IgE) సంధానము అయినపుడు రసాయనములను విడుదల చేసి అసహనములు (allergies), రక్షణ వికటత్వములను (anaphylaxis) కలిగిస్తాయి. తాప ప్రక్రియలలో కూడా ఇవి పాల్గొంటాయి. కణికలు లేని శ్వేతకణములు : రసికణములు ( lymphocytes )
రసికణములు (lymphocytes) రక్తములో తెల్లకణములలో సుమారు ఇరవైశాతము ఉంటాయి. కణిక కణముల కంటె పరిమాణములో చిన్నవిగా ఉంటాయి. వీనిలో న్యూక్లియస్లు పెద్దవిగా ఉండి కణద్రవ (cy:: 336 :: toplasm) పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ రసికణములు రెండు రకాలు. బి - రసికణములు (B Lymphocytes), టి - రసికణములు (T- Lymphocytes). రక్తప్రసరణలో 10- 15 శాతపు రసికణములు బి- రసికణములు (B -lymphocytes), 70- 80 శాతపు రసికణములు టి.రసికణములు (T-lymphocytes). సూక్ష్మదర్శినిలో ఒకేలా కనిపించినా, ప్రతిరక్షకములను (antibodies) ఉపయోగించి వీటిని వేఱుగా గుర్తించ వచ్చును.
బి - రసికణములు (B-lymphocytes) ప్రతిరక్షకముల (antibodies) ఉత్పత్తికి తోడ్పడుతాయి. టి - రసికణములు ( T- lymphocytes) శరీరములో కణముల ద్వారా జరిగే ఆలస్య రక్షణ ప్రతిస్పందనల లోను (delayed Immunological reactions), మార్పిడి అవయవముల తిరస్కరణ ( transplant rejection ) లోను పాల్గొంటాయి. ఏకకణములు ( Monocytes ) :
రక్తములో 3 నుంచి 10 శాతపు తెల్లకణములు ఏకకణములు. మిగిలిన తెల్లకణముల కంటె ఇవి పెద్దవిగా ఉంటాయి. వీటి న్యూక్లియస్లు చిక్కుడు గింజల ఆకారములో ఉంటాయి. వీటి కణ ద్రవములో కణికలు ఉండవు. ఇవి సూక్ష్మజీవులను భక్షిస్తాయి. రోగ కారకములను (pathogens) భక్షించి వాటి భాగములను టి - రసికణములకు (T- lymphocytes ) జ్ఞప్తికై అందిస్తాయి. భవిష్యత్తులో ఆ రోగ కారకములు దేహములోనికి చొచ్చుకొన్నపుడు వాటిని రక్షణ స్రావకములతో (immunoglobulins) ఎదుర్కొనుటకు ఈ చర్య తోడ్పడుతుంది. ఈ ఏకకణములు (monocytes) ప్లీహములో ఎక్కువగా నిలువ ఉంటాయి.
ఏకకణములు రక్తమునుంచి అవయవముల కణజాలములకు కూడా చేరి పృధుభక్షక కణములుగా (macrophages) మార్పు చెందుతాయి. పృధుభక్షకకణములు (macrophages సూక్ష్మజీవులను భక్షిస్తాయి. మరణించిన కణజాల అవశేషములను, సూక్ష్మజీవుల అవశేషములను
- 337 :: తొలగించుటకు, జీర్ణించుకొనుటకు ఈ పృధుభక్షకకణములు ( macrophages ) తోడ్పడుతాయి.
స్రావక కణములు ( Plasma cells ) :
స్రావకకణములలో (plasma cells) న్యూక్లియస్లు ఒక ప్రక్కగా ఒరిగి ఉంటాయి. న్యూక్లియస్లలో డి ఎన్ ఎ పదార్థము చుక్కలుగా గడియారపు ముఖము, లేక బండిచక్ర ఆకారములో పేర్చబడి ఉంటుంది. కణద్రవము క్షారకాకర్షణమై నీలవర్ణములో కనిపిస్తుంది. స్రావకకణములు, బిరసికణములు (B- lymphocytes) నుంచి ఉద్భవిస్తాయి. ప్రతిజనకములను (antigens) కబళించిన బి రసికణములు (B- lymphocytes), ఏకకణములు (monocytes) ఆ ప్రతిజనకములను పెప్టైడు ( peptide ) ఖండములుగా భేదించి ఆ ఖండములను టి-రసికణములకు (T-Lymphocytes) చేరుస్తాయి. ఆ టి-రసికణముల ప్రేరణతో రసిగ్రంథులలోను (lymph glands), ప్లీహములోను (spleen) బి- రసికణములు (B- Lymphocytes) స్రావకకణములుగా (Plasma cells) మార్పు చెందుతాయి. స్రావకకణములు ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేసి ఆ ప్రతిరక్షకములను రక్తములోనికి స్రవిస్తాయి. ప్రతిరక్షకములు (antibodies) ప్రతిజనకములను (antigens) తటస్థీకరించు ప్రక్రియలో పా ల్గొంటాయి. స్రావక రక్షణము (Humoral immunity) :
శరీరములో రసికణములు (Lymphocytes ), స్రావక కణములు (plasma Cells) స్రవించు ప్రతిరక్షకములు (antibodies, immunoglobulins) సూక్ష్మజీవులను (bacteria), విషజీవాంశములను (viruses), జీవవిషములను (toxins) నిర్మూలించుటకు, తటస్థీకరించుటకు తోడ్పడుతాయి. శరీరములోనికి చొచ్చుకొను సూక్ష్మజీవులు, శిలీంధ్రములు (fungi), విషజీవాంశములు (viruses), జీవవిషములు (toxins), ప్రతిజనకములుగా (antigens) గుర్తించబడుతాయి. ప్రతిజనకముల ప్రేరణ వలన టి:: 338 :: రసికణములు (T- Lymphocytes), ఏకకణములు (monocytes ) విడుదల చేయు సైటోకైన్లు (cytokines ) బి రసికణముల సమరూప వృద్ధిని (cloning) ప్రేరేపిస్తాయి.
ఈ బి రసికణములు (B - Lymphocytes) స్రావకకణములుగా (plasma cells) మార్పు చెందుతాయి. సమరూప స్రావక కణములు ఆ యా ప్రతిజనకములకు ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేస్తాయి. కొన్ని బి - రసికణములు మాత్రము జ్ఞాపక కణములుగా (memory B cells) మిగిలి ఉంటాయి. భవిష్యత్తులో అవే ప్రతిజనకములు (antigens) శరీరములోనికి చొచ్చుకొన్నపుడు ఈ జ్ఞాపక కణములు (memory B cells) వృద్ధిచెంది స్రావక కణములుగా (plasma cells) మారి ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేస్తాయి. ఆ విధముగా స్ఫురణ రక్షణ (recall- immunity) కలుగుతుంది.
తొలిసారిగా ఒక ప్రతిజనకము (antigen, రోగజనకము pathogen) శరీరములోనికి చొచ్చుకున్నపుడు మొదటి 4-5 దినములు ప్రతిరక్షకములు (antibodies) రక్తములో కనిపించవు. ఆపై రెండవ దశలో మొదట ఐజిఎమ్ (immunoglobulin-M, IgM) ప్రతిరక్షకములు హెచ్చు ప్రమాణములో ఉత్పత్తి అవుతాయి. తరువాత 6-10 దినములకు ఆ ప్రతిజనకములకు ఐజి-జి IgG ప్రతిరక్షకముల (immunoglobulinG) ఉత్పత్తి జరుగుతుంది. మూడవదశలో ప్రతిరక్షకముల ప్రమాణములు స్థిరపడి, నాల్గవ దశలో ప్రతిరక్షకముల ప్రమాణములు మందగిస్తాయి. ఐజి-జి (IgG) ప్రతిరక్షకములు చాలా కాలము రక్తములో ఉండి దీర్ఘకాలిక రక్షణను (long term immunity) సమకూర్చుతాయి. శరీరములో ప్రతిరక్షకములు (antibodies, immunoglobulins) శర్కరమాంసకృత్తులు (glycoproteins). ఇవి Y ఆకారములో ఉంటాయి. ప్రతి ప్రతిరక్షకము (immunoglobulin) లోను రెండు తేలిక గొలుసులు (light chains), రెండు బరువు గొలుసులు (heavy chains) ఉంటాయి. ఈ గొలుసులు చక్కెర (oligosaccharides, glycans),
- 339 :: పెప్టైడుల (పెప్టైడులు ఎమైనో ఆమ్ల సంధానము వలన ఏర్పడుతాయి.)
సముదాయములను కలిగి ఉంటాయి.
క్షీరదములలో ప్రతిరక్షకములను ఐదు తరగతులుగా విభజించవచ్చును. ప్రతిరక్షకము G (immunoglobulin G, IgG) :
ఇవి ప్రతిజనకము శరీరములో చొచ్చుకొన్న 10- 14 దినముల పిదప ఉత్పత్తి అవుతాయి. అందువలన ఇవి ద్వితీయ రక్షణలో (secondary immunity) పాల్గొంటాయి. భవిష్యత్తులో శరీరము ప్రతిజనకముల పాలయినప్పుడు జ్ఞాపక కణములచే (memory B cells) ఇవి విరివిగా ఉత్పత్తి అయి స్ఫురణ రక్షణప్రక్రియకు (recall immunity) తోడ్పడుతాయి. ప్రతిరక్షకములు జి లు (IgG) పరిమాణములో చిన్నవి, కణజాలము మధ్యకు చొచ్చుకొని ప్రతిజనకములను (antigens, వ్యాధికారకములు, pathogens) నిర్మూలించుటకు తోడ్పడుతాయి. ప్రతిరక్షకము ఎమ్ (immunoglobulin M - IgM) :
ప్రతిజనకములు శరీరములో చొచ్చుకున్నపుడు తొలి దినములలో ప్రతిరక్షకము ఎమ్ (IgM) లు ఉత్పత్తి అవుతాయి. అందువలన
- 340 :: ఇవి ప్రాధమిక రక్షణలో పాల్గొంటాయి. ఇవి పరిమాణములో పెద్దవి.
ప్రతిజనకములతో (antigens) కలిసి గుమికట్టి (agglutination) వాటి విచ్ఛేదనమునకు తోడ్పడుతాయి. ప్రతిరక్షకము ఎ (immunoglobulin A, IgA) :
ఇవి శ్లేష్మపు పొరలలో (mucosa) ఉండి శ్లేష్మపు పొరలకు రక్షణ సమకూర్చుతాయి. ఇవి శ్వాసమార్గము, జీర్ణమండలము, మూత్ర మార్గములకు రక్షణ ఇస్తాయి. కన్నీరు, లాలాజలము, క్షీరము వంటి బహిస్స్రావకములలో కూడా ప్రతిరక్షకము ఎ (IgA) లు ఉండి ప్రతిజనకములను ఎదుర్కొంటాయి. ప్రతిరక్షకము డి (Immunoglobulin D, IgD) :
ఇవి రక్తములో తక్కువ ప్రమాణములలో ఉంటాయి. బి రసికణములపై (B Lymphocytes) ఉండి ప్రతిజనకములకు గ్రాహకములుగా (receptors) పనిచేస్తాయి. ఇవి క్షారాకర్షణ కణములను (basophils), స్తంభకణములను (mast cells) ఉత్తేజపరచి సూక్ష్మజీవులను విధ్వంసపఱచే రసాయనములను విడుదల చేయిస్తాయి. ప్రతిరక్షకము ఇ (Immunoglobulin E, IgE) :
ఇవి రక్తములో తక్కువ పరిమాణములో ఉంటాయి. అసహనములు (atopy and allergy) కలవారిలో వీటి ప్రమాణము అధికమవవచ్చును. ప్రతిజనకములు (antigens) శరీరములో ప్రవేశించినపుడు ఇవి ఉత్పత్తి చెంది క్షారాకర్షణ కణములకు (basophils), స్తంభకణములకు (mast cells) అంటుకొని ఉంటాయి. ప్రతిజనకములు మఱల శరీరములో ప్రవేశించినపుడు వాటితో సంధానమయి ఆ కణముల నుంచి హిష్టమిన్ (histamine), leukotrienes, interleukins వంటి తాప జనకములను విడుదలను చేయిస్తాయి. ఇవి పరాన్నభుక్తులను ఎదుర్కొనుటకు సహాయపడతాయి. ఇవి అసహనము (allergy), రక్షణ వికటత్వము (anaphylaxis) కలిగించుటలో పాత్ర వహిస్తాయి.
- 341 :: సంపూరక వ్యవస్థ (Complement system) :
శరీరరక్షణలో ప్రతిరక్షకములతో (antibodies) బాటు సంపూరక వ్యవస్థ (Complement system) ప్రముఖపాత్ర వహిస్తుంది. సంపూరక వ్యవస్థలో కణద్రవములో ఉండే కొన్ని మాంసకృత్తులు, శర్కర మాంసకృత్తులు (glycoproteins), కణముల పొరలపై ఉండే గ్రాహకములు (receptors) పాలుపంచుకుంటాయి. ఈ సంపూరకములు శరీరముపై దాడిచేసే సూక్ష్మాంగజీవుల భక్షణకు (phagocytosis), సూక్ష్మజీవుల కణకుడ్యముల విధ్వంసమునకు (cell wall destruction), తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షక కణములను (phagocytes) ఆకర్షించుటకు సహాయపడతాయి.
సంపూరకములు (complements) సూక్ష్మజీవులకు అంటుకొని తదుపరి భక్షకకణముల గ్రాహకములతో (receptors of phagocytes) సంధానమవుతాయి. అప్పుడు భక్షకకణములు ఆ సూక్ష్మజీవులను భక్షించి వాటిని ధ్వంసము చేస్తాయి. ఇవి తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షకకణములను (phagocytes) రోగజనకముల (pathogens) దగ్గఱకు ఆకర్షిస్తాయి.
సంపూరకములు (complements - c5b, c6, c7, c8, c9) వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల కణముల పొరలపై పరంపరముగా సంధానమయి కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలను (membrane attack complexes- MACs) ఏర్పరుస్తాయి. ఈ కణవేష్టన ఆక్రమణ వ్య (MACs) సూక్ష్మజీవుల కణముల పొరలలో చిల్లులు పొడిచి సూక్ష్మజీవులను ధ్వంసము చేస్తాయి. సంపూరకములు విషజీవాంశముల (viruses) ధ్వంసములో కూడా తోడ్పడుతాయి. దేహములో రక్షణ వ్యవస్థ సక్రమముగా పనిచేయుట వలన శరీరము అనేక వ్యాధుల నుంచి సహజముగా కోలుకోగలుగుతు ఉంటుంది. సూక్ష్మాంగ
- 342 :: జీవులు, శిలీంధ్రములు, విషజీవాంశములు, జీవవిషముల ఉధృతి
అధికమయినపుడు తగిన ఔషధముల ప్రయోజనము బాగుగా కనిపించినా, సహజ వ్యవస్థలో లోపములు విస్తృతముగా ఉన్నపుడు ఔషధములు కూడా దీర్ఘకాలము ప్రయోజనము చేకూర్చజాలవు.
- 343 ::