హలో...డాక్టర్/మూత్రాంగములు (Kidneys)

వికీసోర్స్ నుండి

20. మూత్రాంగములు ( Kidneys ) శరీరములో వివిధ అవయవముల కణజాలములో జరిగే జీవవ్యాపార ప్రక్రియలో (metabolism) వ్యర్థపదార్ధములు ఉత్పత్తి అయి రక్తములోనికి ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థపదార్థములను రక్తమునుంచి ఎప్పటి కప్పుడు తొలగించి రక్తమును శుద్ధిచేసి శరీర అవయవములను పరిరక్షించి శరీర వ్యాపారమును ఆరోగ్యకరముగా నడిపించుట చాలా అవసరము. జంతుజాలములోను పక్షులలోను ఆ బాధ్యత మూత్రాంగములు (kidneys) నిర్వహిస్తాయి. మూత్రాంగములలో రక్తము నిత్యము వడపోయబడి వ్యర్థ పదార్థములు నీటితో బాటు తొలగించబడుతాయి. వడపోత ద్రవము (filtrate) నుంచి దేహమునకు అవసరమయే చక్కెర (glucose), సోడియం, బైకార్బొనేట్, ఏమైనో ఆమ్లములు (aminoacids) వంటి పదార్థములు, ఎక్కువైన నీరు క్లిష్టమైన ప్రక్రియతో తిరిగి రక్తములోనికి గ్రహించబడుతాయి. మిగిలిన వడపోత ద్రవము వ్యర్థ పదార్థములతో మూత్రముగా విసర్జింపబడుతుంది. రక్తములో అధికమయిన పొటాసియమ్, ఉదజని (hydrogen), అమ్మోనియా, యూరికామ్లము (uric acid) మూత్రాంగములలో మూత్రములోనికి స్రవించబడుతాయి.

శరీరములో నీరు, విద్యుద్వాహక లవణములు (electrolytes), ఇతర  ఖనిజలవణముల పరిమాణములను, ఆమ్ల - క్షారకముల సమతుల్యతను (Acid- base balance) నిర్వహించుటలోను, రక్తపీడన నియంత్రణలోను మూత్రాంగములు ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. రక్తోత్పాదిని (erythropoietin) అనే జీవోత్ప్రేరకము (enzyme) మూత్రాంగములలో ఉత్పత్తి అయి ఎముకల మజ్జలో ఎఱ్ఱరక్తకణముల ఉత్పాదనకు తోడ్పడుతుంది. మూత్రంగములు వివిధ కారణముల వలన సత్వర ఘాతములకు (acute insults ) లోనయితే సత్వర మూత్రాంగ వైఫల్యము ( Acute Re:: 226 :: nal failure) కలుగవచ్చును. దీర్ఘకాల వ్యాధుల వలన దీర్ఘకాల  మూత్రాంగ వైఫల్యము (Chronic Renal failure) కలుగవచ్చును. వీని గురించి తరువాత చర్చిస్తాను. మూత్రాంగముల నిర్మాణము, వ్యాపారముల గురించి స్థూలముగా ఇపుడు వ్రాస్తాను.

మనుజులలో రెండు మూత్రాంగములు కుడి, ఎడమ ప్రక్కల ఉదరాంత్ర వేష్టనమునకు (peritoneum) వెనుక ఉంటాయి. ఇవి చిక్కుడు గింజల ఆకారములో ఉంటాయి. వయోజనులలో  ఒక్కక్కటి సుమారు 11 సెంటీమీటరుల పొడవు కలిగి ఉంటుంది. మూత్రాంగము వెలుపలపక్క కుంభాకారమును, లోపలప్రక్క పుటాకారమును కలిగి ఉంటుంది. లోపల మధ్యభాగములో ఉండు నాభి (hilum) నుంచి మూత్రనాళము (ureter) వెలువడుతుంది.

227 :: బృహద్ధమని (aorta) శాఖ అయిన ముత్రాంగధమని (Renal artery ) నాభి ద్వారా ప్రవేశించి మూత్రాంగమునకు రక్తప్రసరణను

చేకూర్చుతుంది. మూత్రాంగ నాభి నుంచి మూత్రంగసిర (Renal vein) వెలువడి రక్తమును అధోబృహత్సిరకు (Inferior venacava) చేర్చుతుంది. మూత్రాంగములనుంచి వెలువడు మూత్రనాళములు (Ureters) దిగువకు పయనించి శరీరపు కటిస్థలములో (Pelvis) ఉండు మూత్రాశయమునకు (urinary bladder) మూత్రమును చేరుస్తాయి. మూత్రాశయములో మూత్రము నిండుతున్నపుడు దాని గోడలో కల మృదుకండరము (detrusor muscle) సాగి  మూత్రాశయపు పరిమాణము పెరుగుటకు సహకరిస్తుంది. మూత్రాశయము నిండినపుడు మూత్రము మూత్రద్వారము (urethra) ద్వారా విసర్జింపబడుతుంది.

228 :: మూత్రాశయము, మూత్రద్వారముల మధ్యనుండు నియంత్రణ కండరము

(sphincter) వలన మూత్రవిసర్జనపై మనకు ఆధీనత కలుగుతుంది. మూత్రాశయ కండరము (detrusor muscle) సంకోచించి, నియంత్రణ కండరపు బిగువు తగ్గుట వలన మూత్ర విసర్జన జరుగుతుంది.

మూత్రాంగములలో (kidneys) కణజాలము బహిర్భాగము (cortex), అంతర్భాగములుగా (medulla) గుర్తించబడుతుంది. అంతర్భాగము (medulla) గోపురములు  (pyramids) వలె అమర్చబడి ఉంటుంది. ఈ గోపురముల కొనలనుంచి మూత్రము గరాటు ఆకారములో ఉండు మూత్రకుండిక (మూత్రపాళియ ; Renal Pelvis) లోనికి కుండిక ముఖద్వారముల (calyces) ద్వారా చేరుతుంది. మూత్రకుండిక క్రమముగా సన్నబడి మూత్రనాళముగా మూత్రాంగము నుంచి బయల్వడుతుంది.

మూత్రాంగములలో మూత్రము మూత్రాంకములలో (nephrons) ఉత్పత్తి అవుతుంది. మూత్రాంకముల తొలిభాగములు మూత్ర ముకుళములు (Renal corpuscles). మూత్ర ముకుళములు మూత్రనాళికలుగా (renal tubules) కొనసాగుతాయి. ప్రతి మూత్రముకుళములోనికి ఒక సూక్ష్మ ప్రవేశికధమని (afferent arteriole) ప్రవేశించి, కేశరక్తనాళిక గుచ్ఛముగా (Glomerulus) ఏర్పడుతుంది. ఈ కేశనాళికల గుచ్ఛము నుంచి నిష్క్రమణధమని (efferent arteriole) ఏర్పడి మూత్రముకుళము నుంచి బయటకు వెలువడుతుంది. నిష్క్రమణ ధమనులు మూత్రనాళికల చుట్టూ మరల కేశనాళికలుగా చీలుతాయి. ఈ కేశనాళికలు కలిసి నిష్క్రమణ సిరలను (efferent venules) ఏర్పరుస్తాయి. నిష్క్రమణ సిరల కలయికచే మూత్రాంగసిర (renal vein) ఏర్పడుతుంది.

మూత్ర ముకుళము రెండు పొరల కణములను కలిగి ఉంటుంది. కేశనాళిక గుచ్ఛములలోని రక్తము మూత్రముకుళముల (Renal corpuscles) లోపలి పొర ద్వారా వడపోయబడుతుంది. గుండె నుంచి బృహద్ధమనికి (aorta) ప్రసరించు రక్తములో 20 శాతము మూత్రధమని ద్వారా మూత్రాంగములకు ప్రసరించి వడపోయబడుతుంది. వడపోత ద్రవము (Glomerular filtrate) మూత్రనాళికల (renal  tubules)

229 :: లోనికి ప్రవేశిస్తుంది.

మూత్రనాళికల తొలిభాగము చుట్టగా ఉంటుంది (proximal convoluted tubule ). తర్వాత భాగము  చెంపపిన్ను వలె ఒక మెలిక  (loop of Henle) కలిగి ఉంటుంది. మెలికలో తొలిభాగము  మూత్రాంగ అంతర్భాగము (medulla) లోనికి దిగుమెలికగా (అవరోహి భుజము;descending limb of loop of Henle) దిగి, తిరిగి వెనుకకు ఎగుమెలికగా (ఆరోహి భుజము; ascending limb of loop of Henle) మూత్రాంగపు వెలుపలి భాగము (cortex) లోనికి వచ్చి మరల మరో చుట్టగా (తుదిచుట్ట/distal  convoluted tubule) ఉంటుంది. ఈ తుదిచుట్ట సమీపములో ఉన్న సమీకరణ నాళము (collecting duct) లోనికి  ప్రవేశిస్తుంది. సమీకరణ నాళములు మూత్రమును మూత్రకుండికకు(మూత్రపాళియ ; renal pelvis) చేరుస్తాయి. మూత్రకుండిక నుంచి మూత్రము మూత్రనాళముల(ureters) ద్వారా మూత్రాశయమునకు చేరుతుంది.

మూత్రనాళికలలో (renal tubules) వడపోత ద్రవము ప్రవహించునపుడు

230 :: చాలా భాగపు నీరు, విద్యుద్వాహక లవణములు (electrolytes),

గ్లూకోజు, ఎమైనో ఆమ్లములు (amino acids ), మూత్రనాళికల నుంచి మూత్రాంగముల అంతర కణజాలము (interstitial tissue) లోనికి, ఆపై మూత్రనాళికలను అనుసరించు రక్తకేశనాళికల లోని రక్తము లోనికి మఱల గ్రహించబడుతాయి.

వయోజనులలో మూత్రాంగములు (Kidneys) దినమునకు సుమారు 180 లీటరులు వడపోత ద్రవమును ఉత్పత్తి చేస్తాయి. ఇందులో తిరిగి సుమారు 178- 178.5 లీటరుల నీరు తిరిగి రక్తములోనికి గ్రహించబడి 1.5 - 2 లీటరులు మాత్రము మూత్రముగా విసర్జింపబడుతుంది. వడపోత ద్రవపు సాంద్రీకరణ (concentration) చాలా భాగము మూత్రనాళికల దిగు మెలికలలో (అవరోహిక భుజములు; descending limbs of loops of Henle), జరుగుతుంది. శరీర వ్యాపార క్రియలో జనితమయే యూరియా (urea), యూరికామ్లము (uric acid), క్రియటినిన్ (creatinine) వంటి వ్యర్థపదార్థములు సాంద్రీకరింపబడి తక్కువ నీటితో మూత్రముగా విసర్జింపబడుతాయి. మూత్రాంగములు వ్యర్థపదార్థములను విసర్జించు ప్రక్రియ చాలా క్లిష్టమైనది, సమర్థవంతమైనది. మూత్రాంగముల వైఫల్యము గురించి వేఱే వ్యాసములలో చర్చిస్తాను.

231 ::