హలో...డాక్టర్/నారంగ కాలేయ వ్యాధి (Cirrhosis of liver)

వికీసోర్స్ నుండి

17. నారంగ కాలేయవ్యాధి (Cirrhosis of Liver)  కాలేయములో కాలేయకణముల విధ్వంసము, కొత్తకణముల పునరుత్పత్తి, కణముల విధ్వంసము పిదప తంతుకణములచే ( fibroblasts) తంతీకరణము (పీచువంటి పదార్థము ఏర్పడుట ; fibrosis) జరుగుట వలన కాలేయములో బుడిపెలు (nodules) ఏర్పడి నారంగ కాలేయవ్యాధికి (Cirrhosis) దారితీస్తాయి. ఈ వ్యాధి అంతిమదశలలో కాలేయ వ్యాపారము ఎక్కువగా క్షీణించి పచ్చకామెరలు కలుగుట వలన దేహము, కాలేయము కూడా నారింజపండు వర్ణములో ఉంటాయి. అందువలన ఈ వ్యాధి నారంగ కాలేయవ్యాధిగా (cirrhosis of liver ; Greek kirrh(s) orangetawny + - osis) పేరు పొందింది .

నారంగ కాలేయవ్యాధి దీర్ఘకాలపు వ్యాధి. ఆరంభదశలో లక్షణములు కనిపించవు కాని వ్యాధి ముదిరిన పిదప కాలేయ వ్యాపారము మందగించుట వలన, ద్వారసిరలో రక్తపీడనము పెరుగుట (portal vein hypertension)

190 :: వలన వ్యాధి లక్షణములు కనిపిస్తాయి. జలోదరముతో (Ascites) ఎత్తైన

బూరకడుపుతోను, పచ్చకామెరలు వలన నారింజ రంగుతోను ఈ వ్యాధిగ్రస్థులు అంత్యదశలలో కనిపిస్తారు.

కాలేయకణముల విధ్వంసము కలిగించు వివిధ విష పదార్థములు, వ్యాధులు, నారంగ కాలేయవ్యాధికి దారి తీయవచ్చును. మద్యపానము, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి విషజీవాంశములు (viruses) కలిగించే దీర్ఘకాల కాలేయతాపములు (Chronic hepatitis), కొవ్వుపదార్థములు వలన కలిగే ‘వస కాలేయ తాపములు ‘ (nonalcoholic steatohepatitis - NASH ) వలన హెచ్చు శాతపు నారంగ కాలేయ వ్యాధులు కలుగుతాయి. మద్యపానము :-

మితము మించి మద్యము దీర్ఘకాలము (పది సంవత్సరములకు మించి) సేవించువారిలో 15- 20 శాతము మందిలో నారంగ కాలేయవ్యాధి పొడచూపుతుంది. మద్యము (ఆల్కహాలు) కాలేయములో ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ (alcohol dehydrogenase) అనే జీవోత్ప్రేరకము (enzyme) వలన ఎసిటాల్డిహైడ్ గా (acetaldehyde) మారుతుంది. ఎసిటాల్డిహైడు వలన కాలేయతాపము, కాలేయ కణ విధ్వంసము, దీర్ఘకాలములో నారంగ కాలేయవ్యాధి కలుగుతాయి. మద్యము కాలేయములో పిండిపదార్థములు, కొవ్వులు, మాంసకృత్తుల వ్యాపారములపై (metabolism) కూడా ప్రభావము చూపిస్తుంది. మితము మీఱి మద్యపానము సలిపేవారిలో కాలేయములో కొవ్వు నిలువలు పెరిగి మద్య వసకాలేయ వ్యాధిని (alcoholic fatty liver ), మద్య వసకాలేయతాపమును (alcoholic steatohepatitis) కలిగించగలవు. సుమారు 30 శాతపు నారంగ కాలేయవ్యాధులు మితిమీఱిన మద్యపానము వలన కలుగుతాయి. విషజీవాంశములు కలిగించు కాలేయతాపములు (viral hepatitis)-

పెక్కు విషజీవాంశములు (viruses) కాలేయ తాపమును (hepatitis) కలిగించగలవు. వీనిలో హెపటైటిస్ -బి, హెపటైటిస్ - సి విషజీవాంశములు (viruses) కలిగించు కాలేయతాపము కొందఱిలో దీర్ఘకాల కాలేయ

191 :: తాపముగా (Chronic hepatitis) కొనసాగి ఆపై నారంగ కాలేయవ్యాధిగా పరిణమిస్తుంది. ప్రపంచములో సుమారు 55 శాతపు  నారంగ

కాలేయవ్యాధులు విషజీవాంశముల వలన కలుగుతాయి. మద్యేతర వస కాలేయ తాపము (nonalcoholic steatohepatitis) :-

మద్యపానము సలుపనివారిలో కూడా కాలేయకణములలో కొవ్వు ఎక్కువగా చేరినపుడు దీర్ఘకాలిక కాలేయతాపము (nonalcoholic steatohepatitis) కలిగి ఆపై అది నారంగ కాలేయవ్యాధిగా పరిణమించవచ్చును. స్థూలకాయము కలవారిలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను (diabetes mellites), రక్తములో కొవ్వుపదార్థములు (cholesterol and Triglycerides) హెచ్చుగా ఉన్నవారిలోను, కాలేయ కణములలో కొవ్వు చేరి తాపము కలిగించగలదు. కణవిధ్వంసము పిదప పీచుకణముల (fibroblasts), కాలేయ నక్షత్రాకార కణముల (hepatic stellate cells) చైతన్యము వలన పీచుపదార్థము ఏర్పడి (fibrosis) నారంగ కాలేయవ్యాధిగా రూపొందే అవకాశము ఉన్నది. ప్రాథమిక పై త్య నారంగవ్యాధి ( Primary biliary cirrhosis ) :-

ఇది స్వయంప్రహరణ వ్యాధి (autoimmune disease). సాధారణముగా 50 సంవత్సరాల స్త్రీలలో ఈ వ్యాధి కలుగుతుంది. వీరిలో మైటోఖాండ్రియాలపై పనిచేయు ప్రతిరక్షకములు ( Anti Mitochondrial Antibodies ) ఉంటాయి. ప్రాథమిక పై త్యనాళిక కాఠిన్య తాపము ( Primary sclerosing cholangitis ) :-

ఈ అరుదైన వ్యాధి ఎక్కువగా ఐరోపాఖండ ఉత్తరభాగములో నివసించు వారిలోను, వారి వంశజులలోను 20 - 40 సంవత్సరముల ప్రాయములో కనిపిస్తుంది. వీరి పైత్యనాళికలలో తాపము (inflammation), తంతీకరణము (fibrosis), కాఠిన్యతలు (sclerosis) కలిగి పైత్య ప్రవాహమునకు అవరోధము కలుగుటచే నారంగ కాలేయవ్యాధి కలుగుతుంది. వీరిలో ఆంత్రతాప వ్యాధులు ( Inflammatory bowel diseases) కూడా తఱచు కలుగుతాయి.

192 :: ఇనుము ( అయ ) వర్ణకవ్యాధి ( Hemochromatosis ) :-

వంశపారంపర్యముగా సంక్రమించు ఈ వ్యాధిగ్రస్థులలో చిన్నప్రేవులు ఆహారములో ఇనుమును అధికముగా గ్రహించుట వలన కాలేయములో ఇనుము నిల్వలు  పెరుగుతాయి. హృదయము, క్లోమము, చర్మము, ఇతర అవయవములలో కూడా ఇనుము నిల్వగా చేరుట వలన వీరిలో నారంగకాలేయవ్యాధి, మధుమేహము, చర్మములో కంచువర్ణము, హృదయవైఫల్యము (heart failure) పొడచూపుతాయి. తామ్ర కాలేయవ్యాధి ( Wilson’s disease ) :-

జన్యుపరముగా కలిగే ఈ వ్యాధిగ్రస్థులలో ATP7B అనే మాంసకృత్తి లోపము వలన కాలేయకణములు   రాగిని పైత్యరసము లోనికి తగినంతగా విసర్జింపజాలవు. అందువలన కాలేయములో రాగినిల్వలు పెరిగి కాలేయకణముల విధ్వంసమునకు, నారంగ కాలేయవ్యాధికి దారితీస్తాయి. ఆపై రాగి కంటి స్వచ్ఛపటలములోను (cornea), మెదడులోను, మూత్రాంగముల లోను (kidneys) కూడా నిక్షిప్తము అవుతుంది. వీరి రక్తద్రవములో (plasma) రాగి విలువలు తక్కువగా ఉంటాయి. రక్తద్రవములో తామ్రవాహకము సెరులోప్లాస్మిన్ (serum ceruloplasmin) విలువలు తగ్గిఉంటాయి. వీరి మూత్రములో రాగి విలువలు హెచ్చుగా ఉంటాయి. ఆల్ఫా 1 ఏంటిట్రిప్సిన్ (alpha 1 antitrypsin) అనే జీవోత్ప్రేరకము లోపించిన వారిలో కూడా నారంగ కాలేయవ్యాధి కలుగగలదు. భారతీయశిశు నారంగ కాలేయవ్యాధి ( Indian childhood cirrhosis ) :-

ఇది జన్యుపరముగా 1-3 సంవత్సరాల శిశువులలో కాలేయములో రాగినిల్వలు పెరుగుట వలన కలిగే వ్యాధి. రాగి, కంచుపాత్రల వాడకము ఈ రోగమునకు దోహదపడుతుంది. రాగి, కంచుపాత్రల వాడకము తగ్గుట వలన, వ్యాధిని త్వరితముగా నిర్ణయించి చికిత్సలు చేయుట వలన ఈ వ్యాధి, దీని వలన కలిగే శిశు మరణములు అఱుదు అయినాయి.

మరికొన్ని ఇతర కారణముల వలన, తెలియని కారణముల వలన (cryptogenic) నారంగ కాలేయవ్యాధి కలుగవచ్చును.

193 :: వ్యాధి లక్షణములు :-

నారంగ కాలేయవ్యాధిలో కాలేయకణముల విధ్వంసము జరిగి కాలేయవ్యాపారము మందగించుట వలన కొన్ని వ్యాధి లక్షణములు కలుగుతాయి. వ్యాధి ముదరక మునుపు ఎట్టి లక్షణములు కనిపించవు. వ్యాధి అంచెలంచెలుగా ముదిరినపుడు వ్యాధి లక్షణములు పొడచూపుతాయి. కాలేయములో తంతీకరణము (fibrosis) జరిగి ద్వారసిరపై (portal vein) ఒత్తిడి పెరిగి ద్వారసిరలో రక్తపీడనము పెరుగుట వలన కొన్ని వ్యాధి లక్షణములు కలుగుతాయి. ద్వారసిర (portal vein) జీర్ణాశయము (stomach), చిన్నప్రేవులు (small intestines), క్లోమము (pancreas), ప్లీహము (spleen), పిత్తాశయముల (gall bladder) నుంచి రక్తమును కాలేయమునకు చేర్చుతుంది. ద్వారసిర కాలేయములో సూక్ష్మ రక్తకేశనాళికలుగా (capillaries) చీలి రక్తమును కాలేయకణములకు అందజేస్తుంది. ఈ రక్తము ద్వారా జీర్ణమండలము నుంచి గ్రహించిన పోషకపదార్థములు, విషపదార్థములు (toxins) కాలేయ కణములకు చేరుతాయి. కాలేయ ధమని (hepatic artery) కూడా కాలేయమునకు రక్తము కొనిపోతుంది. కాలేయధమని శాఖలు, సూక్ష్మరక్తకేశనాళికలుగా చీలి కాలేయకణములకు రక్తమును అందజేస్తుంది. సూక్ష్మరక్తకేశనాళికల కలయిక వలన కాలేయసిర (hepatic vein) ఏర్పడి  అధోబృహత్సిర (Inferior venacava) ద్వారా రక్తమును హృదయమునకు చేరుస్తుంది.

కాలేయములో తంతీకరణము (fibrosis) జరిగినపుడు ద్వారసిర రక్తప్రవాహమునకు అవరోధము కలుగుతుంది. అందుచే ద్వారసిరలో రక్తపీడనము పెరుగుతుంది (portal hypertension). అందువలన జీర్ణమండలపు సిరలలో పీడనము, సాంద్రత (congestion) పెరుగుతాయి. ద్వారసిరలో అధికపీడనము వలన క్రింది లక్షణములు కలుగుతాయి. ఉరుప్లీ హము ( splenomegaly ):-

ద్వారసిర అధికపీడనము (portal hypertension) వలన ప్లీహములో (spleen) సాంద్రత (congestion) పెరిగి ప్లీహ పరిమాణము పెరుగుతుంది.

194 :: పెరిగిన ప్లీహములో  తెల్లరక్తకణములు (white blood corpuscles),

రక్తఫలకములు (platelets) అధికముగా విధ్వంసము చెందుట వలన వీరి రక్తములో తెల్లకణముల సంఖ్య, రక్తఫలకముల సంఖ్య తగ్గుతుంది అన్ననాళములో ఉబ్బుసిరలు ( Esophageal varices) :-

జీర్ణాశయ సిరలలో పీడనము పెరిగి వాటిలోని రక్తము అన్ననాళపు (esophagus)  సిరలకు మరలింపబడుట వలన అన్ననాళపు సిరలు ఉబ్బుతాయి. ఈ ఉబ్బిన సిరలు చిట్లి రక్తస్రావము జరిగితే  రక్తవమనము (hematemesis) కలుగుతుంది. అన్ననాళములోనికి రక్తము స్రవించి జీర్ణాశయములో ఆమ్లముతోను, ప్రేవులలో క్షారముతోను కలియుటచే నల్ల విరేచనముల (melena) విసర్జన జరుగుతుంది. అన్నవాహిక ఉబ్బుసిరల (esophageal varices) నుంచి రక్తస్రావము అధికమయితే ప్రాణాపాయము కాగలదు. ఉదరకుడ్యములో ఉబ్బు సిరలు ( Caput medusa) :-

జీర్ణమండలపు సిరలలో పీడనము పెరిగి రక్తము ఉదరకుడ్యపు (abdominal wall) సిరలకు  మళ్ళుట వలన కడుపులో చర్మము క్రింద సిరలు పెద్దవయి బొడ్డు చుట్టూ నీలవర్ణములో  కనిపిస్తాయి. జలోదరము ( Ascites ) :-

ద్వారసిరలో రక్తపీడనము పెరుగుట వలనను, కాలేయకణ వ్యాపారము మందగించి ఆల్బుమిన్ అను మాంసకృత్తి ఉత్పత్తి తగ్గి రక్తపు రసాకర్షణ పీడనము (osmotic pressure) తగ్గుట వలనను ఉదరకుహరములో (abdominal cavity) నీరుపట్టవచ్చును. అపుడు వీరి ఉదర పరిమాణము పెరిగి కడుపులో నిండుతనము (bloating) కలుగుతుంది. వీళ్ళలో కాళ్ళ పొంగులు కూడా పొడచూపుతాయి. దేహములో లవణ ప్రమాణము, జలప్రమాణము పెరుగుటచే వీరి బరువు పెరుగుతుంది. జలోదరము బాగా ఎక్కువయినపుడు ఆయాసము కలుగుతుంది. కాలేయకణ నష్టము వలన కాలేయవ్యాపారము మందగిస్తుంది. ప్రారంభములో వీరికి నీరసము, ఆకలి తగ్గుట, బరువు తగ్గుట కనిపించ

195 :: వచ్చును. కాలేయములో ఎష్ట్రెడియాల్ (estradiol) అనే స్త్రీ సంబంధ

వినాళగ్రంథి స్రావకపు (hormone) విచ్ఛేదన తగ్గి రక్తములో దాని పరిమాణము పెరుగుతుంది. పెరిగిన ఎష్ట్రడియాల్ వలన అరచేతులలో ఎఱద ్ఱ నము (palmar erythema) కనబడుతుంది. చర్మముపై సాలీడు మచ్చలు (spider nevi) ఏర్పడుతాయి. ఈ మచ్చలమధ్య సూక్ష్మధమని ఉండి దాని చుట్టూ ఉబ్బిన కేశనాళికలు సాలీడు ఆకారములో ఉంటాయి. ఎష్ట్రడియాల్ ప్రభావము వలన పురుషులలో స్తనములు ఉబ్బుతాయి (gynecomastia). పురుషులలో వృషణముల క్షీణత, నపుంసకత్వము కలుగుతాయి. నారంగవ్యాధి తీవ్రత పెరిగినపుడు పచ్చకామెరలు పొడచూపుతాయి. బిలిరుబిన్ (bilirubin) వర్ణకపు విసర్జన తగ్గుటవలనను, కాలేయములో పైత్య నాళములలో పైత్యపు నిశ్చలత వలనను (biliary stasis) రక్తములో బిలిరుబిన్ విలువలు పెరిగి పచ్చకామెరలు కలుగుతాయి. వీరి చర్మము, నేత్ర శ్వేతపటలములలో ( sclera ) పచ్చదనము కనిపిస్తుంది. చర్మములో పైత్య లవణములు చేరుటచే దురద కలుగుతుంది.

కాలేయములో రక్తములోని అమ్మోనియా యూరియా గా విచ్ఛిన్న మవుతుంది. కాలేయ వ్యాపారము తగ్గినపుడు అమ్మోనియా విచ్ఛేదన తగ్గి అమ్మోనియా విలువలు పెరుగుతాయి. రక్తములో అమ్మోనియా విలువలు, ఇతర వ్యర్థ పదార్థములు పెరుగుట వలన మతిభ్రంశము కలుగగలదు.

రక్తములో డైమిథైల్ సల్ఫైడ్ (dimethyl sulfide) విలువలు పెరుగుతే శ్వాసలో దుర్వాసన (fetor hepaticus) ఉంటుంది.  రక్త ఘనీభవన అంశములు (clotting factors) కాలేయములో ఉత్పత్తి అవుతాయి. కాలేయ వ్యాపారము బాగా మందగించినపుడు రక్తఘనీభవన అంశముల లోపము కలిగి వీరిలో రక్తస్రావములు జరుగవచ్చును. చర్మములోను చర్మము క్రింద  సూక్ష్మ రక్తనాళికల నుంచి రక్తము స్రవించి కమలవచ్చును. వీరిలో prothrombin time ఎక్కువగా ఉంటుంది. కాలేయ మతిభ్రంశము ( hepatic encephalopathy ) :-

అంత్యదశలో రక్తములో అమ్మోనియా, ఇతర విషపదార్థములు

196 :: పెరుగుటచే స్వీయసంరక్షణ తగ్గుట,  జ్ఞాపకశక్తి మందగించుట, ఏకాగ్రత

లేకపోవుట, తత్తరపాటు, గజిబిజి, అపస్మారకములు కలుగుతాయి.  కాలేయవైఫల్యపు అంత్యదశలో అరచేతులు మణికట్టుకీళ్ళ వద్ద గబ్బిలం రెక్కల వలె కొట్టుకోవచ్చును (asterixis). కాలేయ మూత్రాంగ విఘాతము ( Hepatorenal syndrome ):-

నారంగ కాలేయవ్యాధిగ్రస్థులలో జలోదరము ఎక్కువగా ఉన్నపుడు మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గుతుంది. కాలేయవైఫల్యము తీవ్రమయినపుడు మూత్రాంగ ధమనులు సంకోచిస్తాయి. మూత్రాంగవైఫల్యము (hepatorenal syndrome) కూడా కలిగే అవకాశము ఉన్నది.

నారంగ కాలేయవ్యాధిగ్రస్థులలో తెల్లనిగోళ్ళు, డోలుకఱ్ఱలవేళ్ళు (clubbing of fingers), బాహుమూలములలో వెండ్రుకల నష్టము, శ్రవణమూల లాలాజలగ్రంథుల (parotid salivary gland) వాపులు, అరచేతి  కండర ఆచ్ఛాదనములలో (palmar aponeurosis ; Palmar fascia) బొడిపెలు, సంకోచములు (Dupuytren ‘s contractures) వంటి లక్షణములు కూడా కనిపించవచ్చును. రక ్తపరీక్షలు :-

నారంగకాలేయవ్యాధి ప్రారంభదశలో రక్తపరీక్షలు వ్యాధిని పసిగట్టుటకు తోడ్పడుతాయి. వీరిలో ప్లీహము ఉద్రేకము (hypersplenism) వలన రక్తఫలకముల సంఖ్య (platelet count), రక్తములో తెల్లకణముల సంఖ్య (white blood corpuscles count) తగ్గి ఉంటాయి.

రక్తద్రవములో (serum) కాలేయ జీవోత్ప్రేరకముల (liver enzymes) విలువలు పెరుగుతాయి.  ఏస్పర్టేట్ ట్రాన్సెమినేజ్ (Aspartate transaminase - AST), విలువలు  ఏలనైన్ ట్రాన్సెమినేజ్ (Alanine transaminase  విలువలు కంటె ఎక్కువగా ఉంటాయి. ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ (alkaline phosphatase AP), గామా గ్లుటమిల్ ట్రాన్స్ఫరేజ్ (gamma glutamyil transferase GGTP) విలువలు పెరిగి ఉండవచ్చు. పెరిగిన ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ , గ్లుటమిల్ ట్రాన్స్ఫరేజ్ విలువలు

197 :: (AP & GGTP) పైత్యనాళముల అవరోధమును సూచిస్తాయి.

వ్యాధి ముదరక మునుపు రక్తద్రవములో బిలిరుబిన్ విలువలు పెరుగకపోయినా, వ్యాధితీవ్రత పెరిగినపుడు బిలిరుబిన్ విలువలు పెరుగుతాయి.

కాలేయములో ఆల్బుమిన్ (ఒక మాంసకృత్తి) ఉత్పత్తి తగ్గి రక్తములో ఆల్బుమిన్ విలువలు తగ్గుతాయి.

సూక్ష్మజీవుల ప్రతిజనకములు (bacterial  antigens) కాలేయములో విచ్ఛిన్నము పొందక రక్షణవ్యవస్థకు చేరుట వలన వాటికి ప్రతిరక్షకముల (antibodies) ఉత్పత్తి జరిగి గ్లాబ్యులిన్ల (globulins) విలువలు పెరుగుతాయి. కాలేయములో రక్తఘనీభవన అంశముల  (clotting factors) ఉత్పత్తి తగ్గుట వలన రక్తము నెమ్మదిగా గడ్డకడుతుంది. వ్యాధి తీవ్రత పెరిగినపుడు రక్తఘనీభవన వేగము సూచించు ప్రోథ్రాంబిన్ కాలము (Prothrombin Time PT) ఎక్కువగా ఉంటుంది.

ఆల్డోష్టిరోన్ (Aldosterone), మూత్ర పరిమాణము తగ్గించు ఏంటి డైయూరెటిక్ హార్మోనుల (anti diuretic hormone) ప్రభావము వలన మూత్రములో ఉప్పు కంటె నీరు తక్కువగా విసర్జింపబడి రక్తద్రవములో సోడియమ్ సాంద్రత (serum sodium) తగ్గి  సోడియం ప్రమాణములు తక్కువగా (Hyponatremia) ఉండవచ్చును. రక్తద్రవములో విద్యుద్వాహక లవణముల (electrolytes) విలువలను, యూరియా విలువలు, క్రియటినిన్ విలువలను గమనిస్తూ ఉండాలి. వీరికి  కాలేయ తాపములు బి, సి ( hepatitis - B, hepatitisC) వ్యాధుల పరీక్షలు చేసి ఆ వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చెయ్యాలి.

ఇనుము వర్ణక వ్యాధికై (hemochromatosis) రక్తద్రవములో, Ferritin,Transferrin saturation  లను పరీక్షించాలి. తామ్ర కాలేయవ్యాధిని (Wilson’s disease) గుర్త ిం చుటకు రక్త ద్ర వములో రాగి సాంద్రతకు, సెరులోప్లాస్మిన్ (ceruloplasmin) ప్రమాణములకు, మూత్రములో రాగి విలువలకు పరీక్షలు చెయ్యాలి. కంటి

198 :: పరీక్షలు కూడా సలపాలి.

ఆల్ఫా -1 ఏంటిట్రిప్సిన్ లోపము  కనిపెట్టుటకు దాని విలువలను తెలుసుకోవాలి. స్వయంప్రహరణ వ్యాధులను గుర్త ిం చుటకు AntiNuclear Antibodies -ANA, Anti Mitochondrial Antibodies, Anti Smooth muscle Antibodies, Anti LKM Antibodies పరీక్షలు చెయ్యాలి. శ్రవణాతీత ప్రతిధ్వని చిత్రీకరణ (Ultrasonography) :-

శ్రవణాతీత ప్రతిధ్వని చిత్రీకరణముతో  కాలేయపు ఆకారమును, కాలేయములో బుడిపిలు, కనుగొనగలము. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో కాలేయము నుంచి ప్రతిధ్వనిత్వము (echogenesis) హెచ్చుగా ఉంటుంది. ప్లీహ పరిమాణము పెరిగి ఉంటుంది (splenomegaly). ద్వారసిరలో (portal vein) వ్యాకోచ సంకోచములు (pulsations) కనిపిస్తాయి. ఉదరకుహరములో జలమును (జలోదరము) కూడా కనిపెట్ట గ లము. పైత్యనాళములలో అసాధారణములను కూడా గ్రహింపగలము. అన్నవాహిక, జఠరాంత్ర దర్శనము ( Esophago gastroduodenoscopy ) :-

నారంగ కాలేయవ్యాధిగ్రస్ల థు లో అన్నవాహిక, జఠరము, ప్రథమాంత్రము లను అంతర్దర్శినితో (endoscopy) పరీక్షించి అన్నవాహికలో ఉబ్బు సిరలను (esophageal varices) కనుగొని తగిన చికిత్స చెయ్యాలి. కాలేయ స్థితిస్థా పకత చిత్రీకరణ ( Hepatic elastography ):-

కాలేయ స్థితిస్థాపకతను (elasticity) వివిధ పరీక్షలతో చిత్రీకరించి నారంగ కాలేయవ్యాధిని (Cirrhosis of Liver) నిర్ధారించవచ్చును. పైత్య నాళములను (bile ducts), క్లోమ నాళములను (pancreatic ducts) అంతర్దర్శినులతో కాని అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములతో కాని ( Endoscopic Retrograde Cholangio PancreatographyERCP, Magnetic Resonance Cholangio Pancreatography:: 199 :: MRCP ) చిత్రీకరించి వాటిలో అసాధారణములను కనుగొనవచ్చును. కణపరీక్ష ( Histology ):-

కణపరీక్షతో నారంగ కాలేయవ్యాధిని నిర్ణయించవచ్చును. కాలేయ కణజాలమును చర్మము ద్వారా (transcutaneous) కాని, కంఠసిర మార్గముతో కాని (trans jugular), ఉదర దర్శనము (laparoscopy) ద్వారా గాని గ్రహించవచ్చును. ఈ ప్రక్రియలతో ఉపద్రవములు కలిగే అవకాశము ఉన్నది. అందువలన  రోగిని పరీక్షించుట వలన, ఇతర పరీక్షల వలన వ్యాధిని నిర్ణయించగలిగితే కణపరీక్షలు వైద్యులు చేయరు.

కణపరీక్షలలో తంతీకరణము (fibrosis), కాలేయకణములలో కొవ్వు చేరుట, వసతాపము (steatohepatitis), కాలేయకణ విధ్వంసము  తామ్రకాలేయము, అయవర్ణకవ్యాధి వంటి వ్యాధుల లక్షణములు కనిపిస్తాయి. జలోదర జల పరీక్ష:-

జలోదరము ఉన్న వారిలో ఉదరకుహరము (abdominal cavity) నుంచి లోహనాళిక ద్వారా ద్రవమును సేకరించి ఆ ద్రవమును తెల్లరక్త కణములకు (leukocyte count), మాంసకృత్తులకు, కర్కటవ్రణ కణములకు (malignant cells) పరీక్షించాలి. చికిత్స :-

నారంగ కాలేయవ్యాధి కలిగిన పిదప పోదు. వ్యాధి మూలకారణములకు చికిత్సచేయుట, వ్యాధి పురోగతిని అరికట్టుట, వ్యాధి వలన కలిగే ఉప ద్రవములను అరికట్టుట, ఉపద్రవములకు చికిత్స చేయుట, పరదాన కాలేయ మార్పిడికి  పరిశీలించుట వైద్యుల లక్ష్యములు. నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులు మద్యపానము మానివేయాలి. ఎసిటెమైనోఫెన్, పారసిటమాల్ మందుల వాడకము తగ్గించాలి. కాలేయము ద్వారా విసర్జింపబడు ఇతర ఔషధములను, కాలేయకణములపై విష ప్రభావము గల ఔషధములను మానివేయాలి. వాటి వాడుక తప్పనిసరి

200 :: అయితే తగ్గించిన మోతాదులలో జాగరూకతతో వాడాలి.

పోషక పదార్థములు :-

నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో శరీరవ్యాపారము (metabolism) హెచ్చవుతుంది. వారికి తగిన పోషకపదార్థములు అందించాలి. తగినన్ని మాంసకృత్తులు, కాలరీలను అందించాలి. మద్యపానము సలిపేవారిలో ఫోలికామ్లము (folic acid), థయమిన్ (thiamine) లోపములు ఉంటాయి. వారికి వాటిని అందించి ఆ లోపములను సరిదిద్దాలి. జలోదరము కలవారు సోడియమ్ వాడుకను దినమునకు 2 గ్రాములకు (5 గ్రాముల ఉప్పుకు సమానము) పరిమితి చేసుకోవాలి. టీకాలు :-

కాలేయతాప విషజీవాంశములు ఎ, బి (hepatitis A, hepatitis B) లకు టీకాలు వేయాలి. వ్యాపకజ్వరము (Influenza), శ్వాసకోశ తాపములను (pneumonitis) అరికట్టుటకు కూడా టీకాలు అవసరము. కోవిడ్ కు టీకాలు కూడా వేయాలి. అన్నవాహికలోని ఉబ్బుసిరలకు చికిత్స :-

అన్నవాహికలో ఉబ్బుసిరలు (esophageal varices) నుంచి రక్తస్రావము అరికట్టుటకు బీటా ఎడ్రినలిన్ గ్రాహక అవరోధకములు (beta adrenergic receptor blockers) - ప్రొప్రనలాల్ (propranolol), గాని నెడొలాల్ (nadolol) గాని వాడుతారు. విశ్రాంత హృదయవేగము (resting heart rate) 25 % తగ్గే వఱకు మోతాదును సరిచేయాలి. బీటా అవరోధకములు వాడలేనివారిలోను, వాటిని సహింపలేనివారిలోను, అంతర్దర్శిని ద్వారా ఆ ఉబ్బుసిరలకు పట్టీలు బంధించాలి (band ligation), లేక వాటిని తంతీకరణ రసాయనములతో (sclerosant agents) కఠినపరచాలి. ఈ చర్యలకు ఫలితములు లేక రక్తస్రావము మరల మరల సాగే వారిలో కంఠసిర ద్వారా కాలేయములో ద్వారసిర - కాలేయసిరల సంధానము (Transjugular Intrahepatic Portosystemic

201 :: Shunt - TIPS) సలుపుట వంటి ప్రక్రియలు ఉపయోగపడగలవు.

రక్తమును ద్వారసిర (portal vein) నుంచి కాలేయ సిరకు (hepatic vein) మఱలించినపుడు ద్వారసిరలో పీడనము తగ్గి అన్ననాళములోని ఉబ్బు సిరలు సామాన్యస్థితికి వస్తాయి. జలోదరము ( Ascites ):-

జలోదరము కలిగిన వారిలో ఉప్పు (సోడియమ్ క్లోరైడు) వాడకమును దినమునకు 5 గ్రాములకు (సోడియమ్ 2 గ్రాములకు) పరిమితము చెయ్యాలి. వీరికి మూత్రకారకములను (diuretics) ఇచ్చి జలోదరము తగ్గించవచ్చును. స్పైరనోలాక్టోన్ (spironolactone) వంటి ఆల్డోష్టిరోన్ అవరోధకములను (aldosterone inhibitors), ఫ్యురొసిమైడ్ (furosemide) వంటి మూత్రనాళికల మెలిక భాగముపై పనిచేయు మూత్రకారకములతో (loop diuretics) కలిపి వాడితే సత్ఫలితములు కలుగుతాయి. మూత్ర కారకములను వాడునపుడు తఱచు రక్తపరీక్షలతో విద్యుద్వాహక లవణములను (electrolytes)  యూరియాను, క్రియటినిన్ ను పరిశీలిస్తూ ఉండాలి. జలోదరము అధికముగా ఉండి మూత్రకారకముల చికిత్సకు లొంగ నప్పుడు ఉదరకుహరములోనికి నాళిక చొప్పించి ఆ నాళిక ద్వారా జలోదర ద్రవమును తొలగించవచ్చును. 5 లీటర్లకు మించి ద్రవము తొలగించునపుడు సిరల ద్వారా ఆల్బుమిన్ ను ఎక్కించి రక్తప్రసరణ అస్థిరతను (hemodynamic instability), సోడియం హీనతను (hyponatremia), మూత్రాంగముల వ్యాపార క్షీణతను నిరోధించవచ్చును. జలోదరము ఎక్కువగా ఉన్నపుడు, అధిక ప్రమాణములలో ద్రవమును తొలగించుట సాధ్యము కానపుడు, కంఠసిర ద్వారా కాలేయములో ద్వారసిర (portal vein), కాలేయసిరల (hepatic vein) సంధానము (Transjugular intrahepatic porto systemic shunt - TIPS) అవసరము కావచ్చును. ఈ ప్రక్రియ వలన  కాలేయ మతిభ్రంశము (hepatic encephalopathy) కలిగే అవకాశము ఉన్నది.

202 :: స్వతః సూక్ష్మజీవ ఉదరవేష్ట న తాపము ( spontaneous bacterial peritonitis) :-

జలోదరము గలవారిలో సూక్ష్మజీవుల వలన ఉదరవేష్టన తాపము (Spontaneous Bacterial Peritonitis ) కలిగే అవకాశము ఉన్నది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా (streptococcus pneumoniae), ఎంటెరో బేక్టీరియేషియా (Enterobacteriaceae), ఎంటెరోకోక్సై (enterococcus) అనే సూక్ష్మజీవులు ఈ తాపమును సాధారణముగా కలుగజేస్తాయి. జలోదర ద్రవములో మాంసకృత్తులు 1 గ్రాము / డెసిలీటరు  కంటె తక్కువైనవారిలోను, అన్ననాళములోని ఉబ్బుసిరలనుంచి రక్తస్రావము కలిగేవారిలోను, అదివరకు సూక్ష్మజీవ ఉదరాంత్ర వేష్టన తాపము కలిగినవారిలోను ఈ తాపము కలిగే అవకాశము హెచ్చు. జలోదర ద్రవములో తెల్లకణముల సంఖ్య 250 / మైక్రోలీటరు కంటె ఎక్కువ ఉన్నవారిలో ఈ తాపము ఉన్నదని నిర్ణయించి వారికి సూక్ష్మజీవ నాశకములు (antibiotics) ఇవ్వాలి. ట్రైమిథాప్రిమ్ సల్ఫామిథాక్సజోల్ ( trimethoprim sulfamethoxazole), సిప్రోఫ్లోక్ససిన్ (ciprofloxacin), నార్ఫోక్ససిన్ (norfloxacin) లలో ఏదైనా వాడవచ్చు. కాలేయ మూత్రాంగ వై ఫల్యము ( Hepatorenal syndrome )

నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో ద్వారసిర పీడనము హెచ్చయినవారిలోను (portal hypertension), తీవ్ర కాలేయవైఫల్యము (fulminant hepatic failure) గలవారిలోను, జీర్ణమండలములో రక్తస్రావము కలిగిన వారిలోను, సూక్ష్మజీవుల వలన ఉదరాంత్రవేష్టన తాపము (spontaneous bacterial peritonitis) వంటి  సూక్ష్మాంగజీవుల దాడులు (infections) కలిగినపుడు, జలోదరము గలవారిలో రక్తప్రమాణమును భర్తీ చేయకుండా (ఆల్బుమిన్ తో) అధిక ప్రమాణములలో జలోదర ద్రవమును తొలగించినపుడు, ఎక్కువగా మూత్రకారకములను వాడినపుడు, మూత్రాంగముల రక్తనాళములు సంకోచించుటచే మూత్రాంగములకు రక్తప్రసరణ తగ్గి మూత్రాంగవైఫల్యము కలుగగలదు. కాలేయ - మూత్రాంగవైఫల్యము సిరల ద్వారా ఆల్బుమిన్ ను, నారెడ్రినలిన్లను ఇచ్చినపుడు కొంత మెరుగు కనిపించ

203 :: వచ్చును. కొందఱికి రక్తశుద్ధి (dialysis) అవసరము పడవచ్చును. కాలేయ

మూత్రాంగ వైఫల్యము తీవ్రమైన ఉపద్రవము. ప్రాణాపాయము తొలగించుటకు చాలామందికి పరదాన కాలేయమార్పిడి చికిత్స అవసరము. కాలేయ మతిభ్రంశము ( Hepatic Encephalopathy ):

కాలేయ మతిభ్రంశము కలిగినవారిలో (శరీర) ద్రవప్రమాణ లోపములు (hypovolemia), రక్తములో విద్యుద్వాహక లవణముల అసాధారణములు (electrolyte abnormalities), ఆమ్ల క్షార అసాధారణములు (acid - base disturbances) ఉంటే వాటికి చికిత్స చేసి సరిదిద్దాలి. వీరిలో అమోనియా ప్రమాణములు పెరిగి ఉంటాయి. వీరికి లాక్టులోజ్ (lactulose) దినమునకు రెండు మూడు విరేచనములు కలుగునట్లు మోతాదును సరిచేస్తూ ఇవ్వాలి. లాక్టులోజ్ తో పరిస్థితి మెరుగు కానివారికి జీర్ణమండలము నుంచి గ్రహింపబడని నియోమైసిన్ (neomycin), రిఫాక్సిమిన్ (rifaximin) వంటి సూక్ష్మజీవి నాశకములను (antibiotics) కూడా నోటి ద్వారా ఇస్తారు. పెద్దప్రేవులలో సూక్ష్మజీవుల సాంద్రత తగ్గించుట వలన అమ్మోనియా ఉత్పత్తి తగ్గుతుంది. కాలేయకణ కర్కటవ్రణములు ( hepatocellular carcinoma ) :

దీర్ఘకాల కాలేయతాప వ్యాధులు బి, సి లు ( Chronic hepatitis B and Chronic hepatitis C) కలవారిలో కాలేయకణ కర్కట వ్రణములు (Hepatocellular carcinomas) కలిగే అవకాశములు హెచ్చు. వాటిని త్వరగా కనుగొనుటకు వీరికి ప్రతి ఆరు మాసములకు శ్రవణాతీతధ్వని పరీక్షతో (ultrasonography) కాలేయమును పరీక్షిస్తూ ఉండాలి. పరకాలేయ దానము ( Liver transplantation ) :

అంత్యదశలో నారంగ కాలేయవ్యాధి  ఉండి, జలోదరము అధికమయి ఉపద్రవములకు దారితీస్తున్నవారికి, అన్నవాహిక ఉబ్బుసిరల నుంచి రక్త స్రావము కలుగుచున్నవారికి, కాలేయ మతిభ్రంశము కలిగేవారికి, నారంగ కాలేయవ్యాధితో బాటు కాలేయకణ కర్కటవ్రణము (hepatocellular carcinoma) ఉన్నవారికి పరకాలేయ దానము ( liver transplanta:: 204 :: tion) చికిత్స అవసరము. కాలేయపుమార్పిడితో వ్యాధి నయమవుతుంది.

రక్తములో బిలిరుబిన్ (bilirubin) విలువ, రక్తములో క్రియటినిన్ విలువ (serum creatinine), రక్తపు ప్రోథ్రాంబిన్ కాలములతో (prothrombin time) అంత్యదశ కాలేయవ్యాధి నిర్ణయ సంఖ్య (model for end stage liver disease - MELD score) గణించి పరదాన కాలేయపు మార్పిడి చికిత్సకు  అర్హులైనవారిని  క్రమబద్ధీకరిస్తారు.

హృదయ, శ్వాసకోశవ్యాధుల వలన శస్త్రచికిత్సకు అనుకూలత లేనివారు, చర్మము గాక ఇతర అంగములలో  నయము కాని కర్కటవ్రణములు (cancers) ఉన్నవారు, మద్యపానము, యితర మాదకద్రవ్యముల వ్యసనములు కొనసాగిస్తున్నవారు పరదానకాలేయపు మార్పిడి శస్త్రచికిత్సకు అర్హులుగా పరిగణింప బడరు.

నారంగకాలేయవ్యాధి నివారణ :- మద్యపానము సలుపక పోవుట, లేక పరిమితము చేసుకొనుటవలన, కాలేయతాపము కలిగించు హెపటైటిస్ - బి విషజీవాంశములకు ( virus ) టీకాలు తీసుకొనుటవలన, హెపటైటిస్ - సి  సోకకుండా జాగ్రత్తలు తీసుకొనుట వలన, వివిధ కాలేయ తాపములకు చికిత్సలు చేయుట వలన, స్థూలకాయముు రాకుండా అవసరమైన కాలరీల ఆహారము తీసుకొని, వ్యాయామములు సలుపుట వలన, వంశపారంపర్య కాలేయ వ్యాధులు కనుగొనుటకు సకాలములో పరీక్షలు సలిపి తగిన చికిత్సలు చేయుట వలన, పెక్కు శాతము నారంగ కాలేయ వ్యాధులను అరికట్టవచ్చును.

205 ::