హలో...డాక్టర్/దూర ధమని వ్యాధి (Peripheral arterial disease)

వికీసోర్స్ నుండి

11. దూర(మేర) ధమని వ్యాధి ( Peripheral Arterial Disease ) దూర (మేర) ధమనులలో రక్తప్రసరణకు అంతరాయము కలుగుతే దానిని దూర (మేర) ధమని వ్యాధిగా (Peripheral Arterial Disease) పరిగణిస్తారు. ఈ దూర (మేర) ధమని వ్యాధికి ముఖ్యకారణము ధమనీ కాఠిన్యత (arteriosclerosis). కాళ్ళ ధమనులు ( Arteries of lower extremities ) :

శరీరములో వివిధ అవయవాలకు ధమనుల ద్వారా రక్తప్రసరణ జరిగి వాటి కణజాలమునకు ప్రాణవాయువు, పోషకపదార్థములు అందించ బడుతాయి. గుండె ఎడమజఠరిక (left ventricle) నుంచి బయల్వడు బృహద్ధమని (aorta) ఛాతి నుంచి ఉదరములో ఉదర బృహద్ధమనిగా (abdominal aorta) వివిధ శాఖలను ఇచ్చి, కటివలయములో (pelvis) రెండు శ్రోణిధమనులుగా (ileac arteries) చీలుతుంది. ప్రతి శ్రోణిధమని బాహ్య శ్రోణిధమని (external ileac artery), అంతర శ్రోణిధమని (internal ileac artery) శాఖలను ఇస్తుంది. బాహ్య శ్రోణి ధమని తొడ లోనికి తొడధమనిగా (ఊరుధమని femoral artery ; ఊరువు = తొడ)  ప్రవేశిస్తుంది. ఊరుధమని నిమ్నోరుధమని (Profunda femoris artery) శాఖను యిచ్చి బాహ్యోరు ధమనిగా (Superficial femoral artery) తొడలో కొనసాగి మోకాలి వెనుకకు జానుధమనిగా (Polpliteal artery) ప్రవేశించి పూర్వ జంఘికధమని (anterior tibial artery), పృష్ఠ జంఘికధమని (Posterior tibilal artery) శాఖలుగా చీలుతుంది. ఈ ధమనులు కాళ్ళకు, పాదములకు రక్త ప్రసరణ చేకూరుస్తాయి.

127 :: పూర్వ జంఘిక ధమని (anterior tibial artery) పైపాదములో

ఊర్ధ ్వ పాద ధమనిగా (Dorsalis pedis artery) కొనసాగుతుంది. ఊర్ధ్వపాద ధమని (dorsalis pedis artery) నుంచి మధ్యపాద ధమని శాఖ (metatarsal artery, (or) arcuate artery) వెలువడి మధ్యసము ్థ (medial) నుంచి నడిపాదములో ఊర్ధ్వపాద చాపముగా (dorsal plantar arch) పార్శ్వభాగమునకు కొనసాగుతుంది. ఊర్ధ్వపాదధమని, ఊర్ధ్వపాద చాపముల నుంచి అంగుళిక ధమనులు (digital arteries ) కాలివేళ్ళ పైభాగములకు రక్తప్రసరణ చేకూరుస్తాయి.

128 :: పృష్ఠ జంఘికధమని (posterior tibial artery ) అరపాదమునకు

చేరి మధ్యస్థ పాదతల ధమని (medial plantar artery), పార్శ్వ పాదతల ధమనులుగా (lateral plantar artery) శాఖలు చెంది అరకాలికి రక్తప్రసరణ సమకూర్చుతాయి. పార్శ్వ పాదతల ధమని (lateral plantar artery) కాలి మడమనుంచి పాదములో ప్రక్క భాగమునకు పయనించి పిదప మధ్య భాగమువైపు పాదతల ధమనీ చాపముగా (Plantar arterial arch) విల్లు వలె సాగి పాదతలమునకు చొచ్చుకొను ఊర్ధ్వ పాదధమని శాఖయైన నిమ్నపాద ధమనితో (deep plantar artery of dorslis pedis artery) కలుస్తుంది. పాదతల ధమనీ చాపము (plantar arterial arch) నుంచి అంగుళిక ధమనీ శాఖలు (digital arteries) కాలివేళ్ళకు రక్తప్రసరణ సమకూర్చుతాయి. ధమనుల నిర్మాణము :

ధమనుల గోడలలో బయటపొర (tunica externa or advenitia), మధ్యపొర (tunica media), లోపొర (tunica interna or intima) అనే మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో సాగుకణజాలము (elastic tissue), పీచుకణజాలము (fibrous tissue) ఉంటాయి. మధ్య పొరలో మృదుకండరములు (smooth muscles), సాగుకణజాలము (elastic tissue), పీచుకణజాలము (fibrous tissue) పీచుపదార్థము (collagen) ఉంటాయి. నాళపు లోపొర పూతకణములు (lining cells), సాగుపదార్థము (elastin), పీచుపదారము ్థ ల (collagen) మూలాధారమును (basement) అంటిపెట్టుకొని ఉంటాయి. పెద్ద రక్తనాళములకు రక్తము సరఫరా చేసే రక్తనాళ రక్తనాళికలు (vasa vasorum) కూడా రక్తనాళపు గోడలలో ఉంటాయి. దూర ధమనుల వ్యాధి :

ధమనీ కాఠిన్యత (arteriosclerosis) శైశవమునుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత కనిపించి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర (intima) క్రింద కొవ్వులు, కొలెష్టరాలు,

129 :: కాల్సియం, తాపకణములు పేరుకొని ఫలకలుగా (plaques) పొడచూపుతాయి.

ఈ పలకలు రక్తనాళముల లోపలి పరిమాణమును తగ్గిస్తాయి. ధమనుల లోపలి పరిమాణము ఎక్కువగా తగ్గితే కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుతుంది. ధమనుల లోపొరలోని పలకలు చిట్లుతే వాటిపై తాపప్రక్రియ కలిగి, రక్తపుగడ్డలు ఏర్పడి (thrombosis) రక్తప్రసరణకు ఆకస్మిక అవరోధము కలుగజేయగలవు.

దూరధమనుల వ్యాధి సాధారణముగా కాళ్ళలో చూస్తాము. ఈ వ్యాధివలన రక్తప్రసరణకు ఆటంకము ఏర్పడుతుంది. అమెరికాలో అరవై సంవత్సరాలు దాటిన వారిలో 12 నుంచి 20 శాతపు వారిలోను ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వారిలో 50 శాతపు వారిలోను దూరధమని వ్యాధి పొడచూపుతుంది. ప్రపంచములో 20 కోట్లమంది యీ వ్యాధిగ్రస్థులు ఉంటారు. కారణములు :

వృద్ధాప్యము వలన ధమనీకాఠిన్యత కలిగినా పిన్నవయస్సులోనే యీ వ్యాధిని తీవ్రతరము చేసే కారణములను వైద్యులు, శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరముల పూర్వమే పసిగట్టారు. ఇవి : ధూమపానము :

దూరధమని వ్యాధిని కలుగజేసే కారణములలో పొగత్రాగుట ప్రధమ స్థానములో నిలుస్తుంది. దూరధమని వ్యాధి కలిగేవారిలో 80 నుంచి 90 శాతము మంది ప్రస్తుతపు, లేక పాత ధూమపానీయులే.

ఇతరుల నుంచి పొగ పీల్చినవారిలో కూడా యీ వ్యాధి కలిగే అవకాశములు ఉన్నాయి. వీరిలో రక్తనాళముల లోపొరలో జరిగే మార్పుల వలన ధమనీ కాఠిన్యత వేగము పెరుగుతుంది. దినమునకు కాల్చే పొగాకు, ధూమపానము చేసిన సంవత్సరములతో వ్యాధి అనుపాత నిష్పత్తితో ముడిపడి ఉంటుంది.

130 :: మధుమేహవ్యాధి ( Diabetes mellitus ):

మధుమేహవ్యాధి కాలము, తీవ్రతతో దూరధమని వ్యాధి కలిగే అవకాశములు పెరుగుతాయి. మధుమేహవ్యాధి కలవారిలో దూరధమనివ్యాధి కలిగే అవకాశము రెండింతలు అవుతుంది. కొవ్వులు, కొలెష్ట రాలు :

అల్ప సాంద్రపు కొలెష్టరాలు (low density lipoprotein) హెచ్చుగా ఉన్నవారిలోను, అధిక సాంద్రపు కొలెష్టరాలు (high density lipoprotein) తక్కువగా (40 మి.గ్రా/డె.లీ కంటె తక్కువ) ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు హెచ్చుగా ఉన్న వారిలోను ఈ వ్యాధి ప్రాబల్యము హెచ్చు. రక్తపీడనము అధికమైన (hypertension) వారిలోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను (chronic kidney disease) దూరధమని వ్యాధి ప్రాబల్యము అధికముగా ఉంటుంది. వ్యాధిలక్షణములు :

దూరధమని వ్యాధిగ్రస్థులలో ప్రామాణిక లక్షణము సవిరామపు పోటు (intermittent claudication). ఈ పోటు కాలిపిక్కలో (calf) కొంత దూరము నడిచిన పిదప క్రమరీతిలో కలిగి, విశ్రాంతి తీసుకొన్న పది నిమిషములలో క్రమరీతిలో ఉపశమిస్తుంది. ఈ పోటు సలుపుగా గాని, నొప్పిగా గాని, పోటుగా గాని, నీరసము వలె గాని పొడచూపవచ్చును. నడిచేటపుడు కాలి కండరములకు రక్తప్రసరణ అవసరము పెరుగుతుంది. ధమనుల నాళ పరిమాణము తగ్గుటవలన అవసరములకు తగినంత రక్త ప్రసరణ, ప్రాణవాయువు సరఫరా లోపించి కండరములలో నొప్పి, పోటు, కలుగుతాయి. కాని సుమారు పది శాతపు మందిలోనే యీ పోటు ప్రామాణికముగా ఉంటుంది. నలభై శాతము మందిలో నొప్పిగాని, బాధగాని ఉండదు. కొందఱిలో నొప్పి కాలి పిక్కలలో కలుగక పోవచ్చును. కొందఱిలో నొప్పి నడక ఆపివేయునంత తీవ్రముగా ఉండకపోవచ్చును. కొందఱిలో నొప్పి పది నిముషముల విశ్రాంతితో ఉపశమించక పోవచ్చును. వ్యాధి తీవ్రత హెచ్చయినవారిలో నొప్పి విశ్రాంత సమయములలో

131 :: కూడా కలుగుతుంది. సాధారణముగా యీ విశ్రాంతపు నొప్పి (rest pain)

రాత్రుళ్ళు పడుకున్నప్పుడు కలిగి, కాలు క్రింద పల్లములో పెట్టాక తగ్గుతుంది. అపుడు కాలికి రక్తప్రసరణ కలిగి పాదములో ఎఱ్ఱదనము పొడచూపుతుంది. రక్తప్రసరణ లోపము వలన కణజాల నష్టము, పాదములలో ‘బెజ్జములు కొట్టినట్లు’ కనిపించే మానని పుళ్ళు (non healing  ulcers with punched out appearance) కలుగవచ్చును.

రక్తప్రసరణకు పూర్తిగా ఆటంకము కలిగినపుడు కాలు చల్లబడుతుంది. నొప్పి విపరీతముగా ఉంటుంది. కాలు పాలిపోయి ఉంటుంది. కణజాలములు మరణిస్తే, వేళ్ళలోను, పాదములోను కుళ్ళుదల (gangrene) కలుగుతుంది. దూరధమని వ్యాధి కలవారిలో వ్యాధి ఉన్న కాలి చర్మములో రోమములు తగ్గిపోతాయి. చర్మము దళసరి తగ్గి నున్నబడి మెరుస్తూ ఉంటుంది. కండరములు క్షయము పొందుతాయి. ధాతునాడులు (dorsalis pedis and posterior tibial artery pulses) నీరసిస్తాయి. నాడి చేతికి తగలక పోవచ్చును. కాళ్ళు, పాదములు ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతాయి. వ్యాధి తీవ్రముగా ఉంటే కాలు పైకెత్తినపుడు పాలిపోయి క్రిందకు దింపాక ఎఱ్ఱబడుతుంది. బెజ్జములు కొట్టినట్లు (punched out appearance) మానుదలలేని పుళ్ళు ఉండవచ్చు. కణజాలము రక్తప్రసరణ లేక చనిపోతే, ఆ భాగము నల్లబడి కుళ్ళుదల (gangrene) చూపవచ్చును.

132 :: పరీక్షలు ( investigations ):

కాళ్ళలో దూరధమని వ్యాధిని కనుగొనుటకు డాప్లర్ శ్రవణాతీతధ్వని సాధనముతో చీలమండ (ankle) వద్ద ఊర్ధ్వపాద ధమనిలో (dorsalis pedis artery) ముకుళిత రక్తపీడనమును (systolic blood pressure) బాహుధమనిలో (brachial artery) ముకుళిత రక్తపీడనమును కొలిచి వాని నిష్పత్తిని (చీలమండ రక్తపీడనము/బాహు రక్తపీడనము = Ankle Brachial Index ABI index) లెక్కకట్టాలి. ఆ నిష్పత్తి 0.9 కంటె తక్కువయితే దూరధమని వ్యాధిని సూచిస్తుంది. ఈ పరీక్ష సున్నితమైనది (sensitive) మఱియు నిశితమైనది (specific). తొంభైయైదు శాతపు

133 :: వ్యాధిగ్రస్థులలో ఈ నిష్పత్తి వ్యాధిని పసిగట్టుతుంది.

అధిక రక్తపీడనము (hypertension), మధుమేహవ్యాధి (diabetes mellitus), దీర్ఘకాల మూత్రాంగ వ్యాధుల (chronic kidney disease) వలన అతిసూక్ష్మ ధమనులు సంకోచించి ప్రసరణలోపము (small vessel disease) కలుగజేసినపుడు యీ నిష్పత్తి వ్యాధిని పసిగట్ట క పోవచ్చును.

ధమనీ కాఠిన్యత హెచ్చయి రక్తనాళముల గోడలలో కాల్సియమ్ పేరుకొనుట వలన చీలమండ దగఱ ్గ రక్తనాళములు అణచుటకు వీలుబడకపోతే (Noncompressible vessels) అంగుళి రక్తపీడనము/బాహు రక్తపీడనముల (toe pressure / upper arm pressure) నిష్పత్తిని వ్యాధి నిర్ణయమునకు పరిగణించవచ్చును.

వ్యాధి లక్షణములు ఉండి చీలమండ / బాహు రక్తపీడనముల నిష్పత్తి సాధారణ పరిమితులలో ఉంటే నడక యంత్రముపై (treadmill) ఐదు నిమిషముల వ్యాయామము చేయించిన తర్వాత ఆ యా రక్తపీడనములు కొలిచి చీలమండ / బాహువుల ముకుళిత రక్తపీడనముల నిష్పత్తిని తీసుకొని వ్యాధి నిర్ణయము చేయవచ్చును. వ్యాధిగ్రస్థులలో వ్యాయామము పిదప చీలమండ / బాహువుల నిష్పత్తి 20 శాతము తగ్గుతుంది. శ్రవణాతీతధ్వని చిత్రీకరణముతో (ultrasonography) రక్తనాళముల చిత్రములను గ్రహించి సంకుచితములు పొందిన భాగములను గుర్తించవచ్చును. రక్తనాళముల లోనికి సన్నని నాళికను (catheter) చొప్పించి దాని ద్వారా వ్యత్యాస పదార్థములను (contrast material) ఎక్కించి ఎక్స్ -రే లతో రక్తనాళములను చిత్రీకరించవచ్చును. వ్యత్యాస పదార్థములు యిచ్చి గణనయంత్ర (త్రిమితీయ) ధమనీ చిత్రీకరణములను (CT Angiograms), అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణములను (magnetic resonance Angiography) చేసి వ్యాధిని ధ్రువీకరించవచ్చును. ఇతర సమస్యలు :

దూరధమని వ్యాధిగ్రస్లు థు ధమనీ కాఠిన్యత ప్రభావమువలన హృద్ధమని

134 :: వ్యాధులకు (Coronary artery disease), మస్తిష్క రక్తనాళ విఘాతములకు

(cerebro vascular accidents) అధిక సంఖ్యలో పాలవుతారు. ఉదర బృహద్ధమనిలో బుడగలు (abdominal aortic aneurysms) కూడా వీరిలో కలుగవచ్చును. అందువలన ఆ వ్యాధులను కనుగొను పరీక్షలు, వాటికి చికిత్సలు కూడా అవసరమే. చికిత్స : జీవనశైలిలో మార్పులు ( Life style modification ):ధూమపాన విరమణ :

దూరధమని వ్యాధిగ్రస్థులు ధూమపానమును (tobacco smoking) తప్పక విరమించాలి. నా నలుబది సంవత్సరముల వైద్యవృత్తి ప్రత్యక్ష అనుభవములో రక్తప్రసరణ లోపము వలన కాళ్ళు కోల్పోయిన వారిలో 95 శాతము మంది ధూమపానీయులే. అందువలన పొగత్రాగుట తప్పకుండా మానాలి. వ్యాయామము ( exercise ) :

దూరధమని వ్యాధిగ్రస్థుల శిక్షణపూర్వక వ్యాయామము అవసరము. నడక యంత్రములపై గాని (treadmills, exercise bicycles, and ellipticals), నేలపైన గాని కాళ్ళలో నొప్పులు పుట్టే సమయమునకు కొంచెము సమయము తగ్గించి నడుస్తూ, విరామము తీసుకుంటూ దినమునకు 30 నుంచి 60 నిమిషముల వ్యాయమము చేస్తే సత్ఫలితములు కలుగుతాయి. కాళ్ళ వ్యాయామము వలన చిన్న (శాఖలు) ధమనుల పరిమాణము పెరిగి కణజాలమునకు ప్రత్యామ్నాయ ప్రసరణను (collateral circulation) పెంపొందిస్తాయి. వ్యాయామము వలన హృద్ధమని సంఘటనలు, (cardiovascular events), మస్తిష్క విఘాత సంఘటనలు (cerebro vascular events) కూడా తగ్గుతాయి. వీరు నొప్పి కలుగకుండా నడవగలిగే దూరము, సమయము కూడా పెరుగుతాయి. మధుమేహవ్యాధిని, ఆహారనియమముతోను, వ్యాయామము తోను,

135 :: తగిన ఔషధములతోను అదుపులో పెట్టుకోవాలి.  రక్తపుపోటు ఎక్కువయితే

దానిని ఆహారనియమము, వ్యాయామము, ఔషధములతో అదుపులో పెట్టుకోవాలి. అల్పసాంద్రపు కొలెష్టరాలుని (Low density Lipoprotein) ఆహారనియమము, స్టాటిన్ (statins) మందులతో తగ్గించుకోవాలి. అధికసాంద్రపు కొలెష్టరాలుని (High Density Lipoprotein) పెంచుకోవాలి.ట్రైగ్స లి రైడుల (triglycerides) ఆహారనియమము, మందులతో తగ్గించుకోవాలి. ఏస్పిరిన్ ( Aspirin ) :

దూరధమనివ్యాధి లక్షణములు కలవారిలో ఏస్పిరిన్ వాడుక వలన ధమనులలో రక్తపుగడ్డలు ఏర్పడుట తగ్గుతుంది. హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు తగ్గుతాయి. ఏస్పిరిన్ రక్తఫలకలు గుమికూడుటను (platelet aggregation) నివారిస్తుంది. కణజాల విధ్వంసము తగ్గిస్తుంది. క్లొ పిడోగ్రెల్ ( Clopidogrel ) :

ఏస్పిరిన్ వాడలేనివారిలో రక్తఫలకములు గుమికూడుటను నివారించి రక్తపు గడ్డలను అరికట్టుటకు క్లొపిడోగ్రెల్ ను ఉపయోగిస్తారు. ఏస్పిరిన్ క్లొపిడోగ్రెల్ రెండూ కలిపి వాడుట వలన పరిశోధనలలో అదనపు ప్రయోజనము కనబడలేదు. రెండిటి వాడకము వలన రక్తస్రావ ప్రమాదములు ఎక్కువయే అవకాశములు ఉన్నాయి. ఇదివరలో గుండెపోటు కలిగినవారిలో టికగ్రిలార్ (ticagrelor (Brilinta)) ప్రమాదకర హృదయ సంఘటనలను (Major Adverse Cardiac Events - MACE) తగ్గించుటకు ఏస్పిరిన్ తో పాటు ఉపయోగిస్తారు. సిలొష్ట జోల్ ( Cilostazol ) :

సిలొష్టజోల్ వాడుక వలన దూరధమని వ్యాధిగ్రస్థులు నడవగలిగే దూరము పెరుగవచ్చును. కాని పరిశోధనలలో దీర్ఘకాలిక ప్రయోజనములు కనిపించలేదు. హృద్ధమని సంఘటనలు, మర్త్యత్వములలో (mortality) తేడా కనిపించలేదు. సిలోష్టజోల్ వలన కాళ్ళలో పొంగులు కలుగవచ్చును.

136 :: హృదయవైఫల్యపు లక్షణములు అధికము కావచ్చును. దీనివలన కళ్ళు

తిరుగుట, కడుపు పీకు, వంటి విలక్షణములు కలుగవచ్చును పెంటాక్సిఫిలిన్ (Pentoxifylline) చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా దీనివలన ప్రయోజనము అనుమానాస్పదమే. విటమిన్ బి -12, ఫోలిక్ ఏసిడ్ ల వలన ప్రయోజనము కలుగదు.

ధమనీ పునరుద్ధ రణ చికిత్సలు (Revascularization procedures) :

దూర ధమనులలో వ్యాధి తీవ్రత హెచ్చయినప్పుడు, విరామ సమయములలో నొప్పి కలుగునపుడు ధమనీ పునరుద్ధరణ (revascularization) అవసరము.

కృత్రిమ నాళికపు బుడగతో ధమనిలో సంకుచించిన భాగమును వ్యాకోచింపజేయవచ్చును (balloon angioplasty). శ్రోణిధమని (ileac artery), ఊరుధమనులలో (femoral artery) వ్యాధి ఉంటే యీ ప్రక్రియ వలన ప్రయోజనము కలుగవచ్చును. క్రింద ధమనుల వ్యాధిగ్రస్థులలో ఫలితములు తక్కువ. ధమనిని వ్యాకోచింపజేసిన (angioplasty) పిమ్మట వ్యాకోచ నాళికలు (stents) పొందుపఱచుట వలన ఫలితములు మెరుగుగా లేవు. ధమనీ కాఠిన్య ఫలకల తొలగింపు (atherectomy) వలన, ధమనిని వ్యాకోచింపజేయుటకంటె దీర్ఘకాలిక ఫలితములు మెరుగుగా లేవు. అధిగమన శస్త్రచికిత్సలు ( bypass surgeries):

ధమనులలో సంకుచిత భాగమును దాటించుకొని రక్త ప్ర సరణను పునరుద్ధ రిం చుటకు అధిగమన శస్త్రచికిత్సలు (bypass surgeries) అందుబాటులో ఉన్నాయి. రోగి దృశ్యసిరను కాని (Great saphenous vein), కృత్రిమ నాళమును (Gore-Tex graft) కాని, ధమనిలో సంకుచిత భాగమునకు ముందు ఒకకొనను, వెనుక రెండవ కొనను కలిపి కణజాలమునకు రక్తప్రసరణ పునరుద్ధింప జేస్తారు.

137 :: రక ్తపుగడ్డ ల తొలగింపు ( Embolectomy ); రక ్తపుగడ్డ ల విచ్ఛేదన (Thrombolytic therapy ):

ధమనులలో రక్తపు గడ్డలు ఏర్పడినా (thrombosis), ప్రవాహములో వచ్చి పేరుకొనినా (emboli) వాటిని శస్త్రచికిత్సతో కృత్రిమ నాళికపు బుడగలను ఉపయోగించి తొలగిస్తారు. అలా తొలగించ లేనపుడు రక్తపు గడల ్డ విచ్ఛేదకములను (tissue plasminogen activator- tPA / thrombolytic agents) వాడి వాటిని కరిగింపజేస్తారు. అంగవిచ్ఛేదనము ( amputation ):

రక్తప్రసరణ కోల్పోయి కణజాలము మరణించినపుడు  (gangrene formation), పుళ్ళుపడి సూక్ష్మజీవుల ఆక్రమణ అధ్వాన్నమయినపుడు, రక్తప్రసరణ పునరుద్ధరణ సాధ్యము కానప్పుడు బాధ ఉపశమునకు, ప్రాణరక్షణకు అంగవిచ్ఛేదన (amputation) అవసరము. రక్తప్రసరణకు అవరోధము ఎచట ఉన్నదో దానిని బట్టి ఎచ్చట విచ్ఛేదనము చెయ్యాలో వైద్యులు నిర్ణయిస్తారు. దూరధమని వ్యాధిగ్రస్థులలో హృద్ధమని వ్యాధులు, గుండెపోటులు, మస్తిష్క విఘాతములు వలన మృత్యువు కలిగే అవకాశములు, అంగనష్టము కలిగే అవకాశము కంటె హెచ్చు.

138 ::