హలో...డాక్టర్/జలుబు (Common cold)

వికీసోర్స్ నుండి

35. జలుబు ( Common Cold ) మనలో జలుబు రాని వారెవరూ ఉండరు. చాలామందిలో జలుబు వచ్చి దానంతట అది కొద్దిదినాలలో తగ్గిపోతుంది. కాని కొద్ది మందిలో దాని పర్యవసానముగా మధ్య చెవిలో తాపము (otitis media), నాసికా కుహరములలో తాపము (nasal sinusitis), ఊపిరితిత్తులలో తాపము (bronchitis) కలుగ వచ్చును. జలుబు విషజీవాంశముల వలన కలుగుతుంది. ఎక్కువగా నాసికా విషజీవాంశములు (Rhinoviruses) జలుబుని కలిగించినా, యితర ఎంటరో వైరసులు (Enteroviruses), కొరోనా విషజీవాంశములు (Coronaviruses), ఎడినోవైరసులు ( Adenoviruses ), పారాఇన్ ఫ్లుయెంజా వైరసులు ( Parainfluenza viruses ), వ్యాపకజ్వర విషజీవాంశములు (Influenza viruses), హ్యూమన్ రెస్పిరేటరీ సిన్ సిషియల్ వైరసులు (Human respiratory Syncytial  viruses ), జలుబుని కలిగించ గలవు. నాసికా విషజీవాంశములు (Rhinoviruses) పికోర్నా వైరసు సముదాయములో ఉన్న ఎంటెరో వైరసులకు చెందుతాయి. వీటి పరిమాణము అతి సూక్ష్మముగా ఉంటుంది. వీటి ఆకారము వింశతిఫలక ఆకారము (Icosahedral). ఇవి ఒంటిపోగు రైబోన్యూక్లియక్ ఆమ్లమును కలిగి ఉంటాయి. మానవ నాసికా విషజీవాంశములలో A, B, C అనే మూడు ప్రధాన తెగలలో, జన్యుపదార్ధములో మాంసకృత్తుల బట్టి 160 రకాలు ఉన్నాయి. ఈ విషజీవాంశములు జలుబు ఉన్నవారి నుంచి తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెదజల్లబడుతాయి. వస్తువుల ఉపరితలములపై  పద్దెనిమిది గంటల వఱకు ధ్వంసము కాకుండా మనగలుగుతాయి. దగఱ ్గ లో ఉన్న వారు ఆ వెదజల్లబడిన విషజీవాంశములను పీల్చినా, లేక ఆ విషజీవాంశములు ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కును

372 :: ముట్టుకొన్నా, వ్యాధిగ్రస్థులను  కరచాలనములతోనో మరోలాగో తాకి

పిదప ముక్కు, నోరు, స్పర్శించినా అవి ముక్కు, గొంతు, శ్వాస నాళముల శ్లేష్మపుపొర (Mucosa) లోని కణముల లోనికి ప్రవేశిస్తాయి. ఆపై త్వరగా ఆ కణములలో వృద్ధిచెందుతాయి. ఈ విషజీవాంశములచే ఆక్రమించబడిన కణముల నుంచి ఖీమోకైన్లు ( chemokines ), సైటోకైన్లు (cytokines) విడుదలయి  తాప ప్రక్రియను కలిగిస్తాయి. ఈ విషజీవాంశములు 32 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఒద్ద వృద్ధి చెందుతాయి. ఆ ఉష్ణోగ్రత ముక్కు, గొంతుక, శ్వాసనాళములలో ఉండుట వలన ఆ భాగములే తాప ప్రక్రియకు గురి అవుతాయి. నాసికా విషజీవాంశములు ( Rhinoviruses ) కణ విధ్వంసమును కలుగజేయవు. రెస్పిరేటరీ సిన్ సీషియల్ విషజీవాంశముల వలన శ్లేష్మపుపొర కణముల విధ్వంసము జరుగవచ్చును.

జలుబు కలిగించే విషజీవాంశములు చాలా త్వరగా మనుజుల మధ్య వ్యాప్తిచెందుతాయి. పాఠశాలలలోను, దినసంరక్షణ కేంద్రాలలోను పిల్లల నుంచి పిల్లలకు జలుబు ఎక్కువగా వ్యాప్తి చెంది, పిల్లల నుంచి పెద్దలకు సంక్రమించగలదు. కుటుంబములో ఒకరి నుంచి మరి ఒకరికి, కచేరీలలోను, కర్మాగారములలోను, పనిచేసేవారిలో ఒకరినుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శీతాకాలములలోను, ఆకురాల్చు కాలములోను, జలుబులు ఎక్కువగా కలుగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ముక్కు ఉష్ణోగ్రత ఈ విషజీవాంశముల వృద్ధికి దోహదపడుట, వ్యక్తుల వ్యాధినిరోధక శక్తి తగ్గుట దానికి కారణము కావచ్చును. వ్యాధి లక్షణములు :

మనలో అందఱికీ జలుబు ఎప్పుడో అప్పుడు కలుగుట వలన లక్షణాలు అందఱికీ అనుభవవేద్యమే. ముందుగా గొంతు నొప్పి, ముక్కు, గొంతుకలలో దుఱద, ఒంటినొప్పులు, నలత, జ్వరభావము కలిగి, ఆపై ముక్కు కారుట, తుమ్ములు, దగ్గు, ముక్కు దిబ్బకట్టుట కలుగుతాయి. తలనొప్పి కొందఱికి కలుగుతుంది.  పిల్లలలో జలుబుతో   జ్వరము తఱచు

373 :: చూస్తాము. వయోజనులలో జలుబుతో పాటు జ్వరము హెచ్చుగా కలుగదు.

ఉబ్బస ఉన్నవారిలో జలుబు కలిగినప్పుడు ఉబ్బస ప్రకోపించవచ్చును. పిల్లలలో జలుబులు మధ్యచెవిలో తాపమునకు (Otitis media) దారి తీయవచ్చును. జలుబు తర్వాత తక్కువ శాతము మందిలో నాసికా కుహరములలోను (Paranasal sinuses) పుపుసనాళికలలోను (Bronchi ), తాపము కలుగవచ్చును. వీటికి గురైనవారిలో వ్యాధి లక్షణములు 20 గంటల నుంచి నాలుగుదినములలో కనిపిస్తాయి. చాలామందిలో రెండు దినములలో వ్యాధి లక్షణములు పొడచూపుతాయి. వారము, పదిదినములలో చాలా మందిలో వ్యాధి లక్షణములు తగ్గిపోయినా  కొంతమందిలో యీ లక్షణాలు రెండు, మూడువారముల వఱకు ఉండగలవు. కొద్దిశాతము మందిలో దగ్గు రెండు మూడువారముల వఱకు ఉండవచ్చు. వ్యాధి నిర్ణయము :

ఒంట్లో నలత, ఒంటి నొప్పులు, ముక్కు కారుట, తుమ్ములు, కొద్దిగా గొంతునొప్పి, పెద్దగా జ్వరము లేకపోవుట జలుబును సూచిస్తాయి.

వ్యాపక జ్వరాలు (Influenza) ఉన్నవారిలో జ్వరము, దగ్గు, ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉంటాయి. తుమ్ములు, ముక్కు కారుట  విపరీతముగా ఉండవు.

ధూళి, పుప్పొడులకు  అసహనములు ( allergies ) ఉండి వాటి బారి పడినవారిలో తుమ్ములు, ముక్కు కారుట ఎక్కువగా ఉంటాయి. వీరికి జ్వరము, ఒళ్ళునొప్పులు, నలత తక్కువగా ఉంటాయి. కళ్ళలో దుఱద, కళ్ళు నీరు కారుట కూడా పదార్థాల అసహనమును ( Allergies )  సూచిస్తాయి. జలుబు ఉన్నవారి నాసికా స్రావములలో విషజీవాంశములను ( viruses ) కనుగొనవచ్చును, కాని వ్యయముతో కూడుట వలన, ప్రయోజనము లేకపోవుట వలన ఆ పరీక్షలు సలుపరు.

చికిత్స : జలుబుకు ఉపశమన చికిత్సలే ఇప్పుడు లభ్యము. ముక్కు

374 :: దిబ్బడ, నీరు కారుటలను తగ్గించడానికి నాసికా నిస్సాంద్రకములను (Nasal decongestants) వాడవచ్చును. ఇవి ముక్కులో చుక్కలుగాను (

Oxymetazoline nasal drops, Phenylephrine nasal spray, Ipratropium bromide nasal drops ), నోటితో తీసుకొనే ఔషధములుగాను ( Phenylephrine tablets, Pseudoephedrine tablets ) లభ్యము. ఒంటినొప్పులు, నలతలకు ఎసిటెమైనోఫెన్  (Acetaminophen),  పేరెసిటమాల్ (Paracetamol), ఐబుప్రొఫెన్ లు (Ibuprofen) వాడవచ్చును.

లొరటడిన్ (Loratadine), డెస్ లొరటడిన్ (Desloratadine), సెట్రిజెన్ (Cetrizine) వంటి హిష్టమిన్ గ్రాహక అవరోధకములు (Histamine receptor blockers) వలన తొలి, మలి దినములలో కొంత ఉపశమనము కలుగవచ్చును.

గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలింతలు కొంత ఉపశమనమును కలిగించవచ్చును. జింక్ ఖనిజలవణము వలన కొంత ప్రయోజనము కలుగవచ్చును.

జలుబులకు సూక్ష్మజీవి నాశకములను (Antibiotics) వాడకూడదు. వాటికి విషజీవాంశముల పైన ఎట్టి ప్రభావము ఉండదు. వాటి వలన అవాంఛిత ఫలితాలు, వికటఫలితాలు కలుగవచ్చును. అనవసరముగా సూక్ష్మజీవి నాశకములు (Antibiotics) వాడుట వలన వాటికి లొంగని సూక్ష్మజీవులు వృద్ధిచెందుతాయి. చాలా సూక్ష్మజీవి నాశకములు  అందువలన నిష్ప్రయోజనము అవుతున్నాయి. విటమిన్ సి, విటమిన్ డి, తేనెల వలన ప్రయోజనములు నిరూపితము కాలేదు. అలాగే దగ్గుమందుల ప్రయోజనము కూడా శూన్యము. పిల్లలలో ప్రయోజనము లేకపోవుట వలన అవాంఛిత ఫలితాలు కలుగుట వలన డెక్స్ట్రోమిథార్ఫన్ (Dextromethorphan) అనే దగ్గుమందును పలు దేశాలలో నిషేధించారు. జలుబుకి కార్టికోష్టీరాయిడ్ తుంపరమందుల వలన ప్రయోజనము లేదు.

375 :: జలుబుకు  విషజీవాంశనాశకములు (Antivirals) పరిశోధన

స్థాయిలో ఉన్నాయి. ప్లికొనారిల్ (Pleconaril) నాసికా విషజీవాంశములు (rhinoviruses) ముక్కులో శ్లేష్మపుపొర కణములతో సంధానమగుటను అరికడతాయి. అందువలన ఆ జీవాంశములు నాసికాకణముల లోనికి  చొచ్చుకొనవు. వృద్ధిచెందవు. ఉబ్బస వ్యాధిగ్రస్థులలో యీ మందు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. నివారణ :

జలుబు కలిగించే విషజీవాంశములు యితరులకు సులభముగా అంటుకోగలవు. వ్యాధి సోకిన తొలి మూడు దినములలో యివి వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువ. జలుబు సోకిన మూడుదినములు పాఠశాలలకు, దిన సంరక్షక కేంద్రాలకు పిల్లలను పంపకపోవుట మంచిది. జలుబు ఉన్నవారు తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు నోటికి, ముక్కుకు ఆచ్ఛాదనలను (masks) ధరించడమో, లేక  మోచేతులను అడ్డుపెట్టుకొనుటో చెయ్యాలి. ఇతరులను స్పర్శించరాదు, ఇతరులతో కరచాలనములు చేయరాదు. తఱచు చేతులను కడుగుకొనుట, శుభ్రపఱచుకోని  చేతులతో ముక్కు, నోరు, కళ్ళు స్పర్శించక పోవుట వలన  జలుబులను అరికట్టే అవకాశములు ఉన్నాయి. జన్యు పరివర్తనాలు  (genetic mutations) ఎక్కువగా కలిగే ఈ జలుబు విషజీవాంశములను  టీకాలతో నివారించగలగడము దుస్సాధ్యము.

376 ::