హలో...డాక్టర్/కొవ్వులు ; కొలెష్టరాలు (Fats & Cholesterol)

వికీసోర్స్ నుండి

4. క్రొవ్వులు - కొలెష్ట్రాలు

ధమనీకాఠిన్యము (Atherosclerosis) :

పాతదినాలలో తరచు వినేవారము కాదు గాని యీ తరములో చాలామంది అధిక కొలెష్ట్రాలు (Cholesterol) గురించి వినే ఉంటారు. గుండె పోటులు (Heart attacks), మస్తిష్క రక్తనాళ విఘాతములు (Cerebrovascular accidents) దూర రక్తప్రసరణ లోపాలకు (Peripheral vascular diseases), ధమనీకాఠిన్యము (Atherosclerosis) కారణమని వైద్యశాస్త్రజ్ఞులు గ్రహించిన తరువాత, ధమనులు బిరుసు ఎక్కడానికి క్రింది హేతువులను పరిశీలనల వలన, గణాంకముల వలన వైద్యులు గ్రహించారు.

1) రక్తపుపోటు (Hypertension)

2) మధుమేహవ్యాధి (Diabetes mellitus)

3) పొగత్రాగడము

4) అధిక కొలెష్ట్రాలు (Hypercholesterolemia)

5) ఊబకాయము (Obesity)

6) వ్యాయామలోపము

7) వంశానుగతము

8) వృద్ధాప్యముల

వలన ధమనులు బిరుసెక్కడము, సన్నబడడము, ఇరుకుబడుట జరిగి దుష్ఫలితములు కలుగవచ్చును. వయస్సుతో బాటు పైన పేర్కొన్న కారణాల వలన ధమనుల లోపొర (Intima) క్రింద కొలెష్ట్రాలు, కొవ్వులు  క్రమేణ పేరుకొంటాయి. రక్తములో ఉన్న కొవ్వులను భక్షక కణములు (macrophages) మింగి ధమనుల లోపొర క్రింద చేరుకుంటాయి. కొవ్వులు, కొలెష్ట్రాలను మింగిన భక్షణ కణాలు ఫేనకణములుగా (Foam cells) మారుతాయి. ఈ కణాలు విచ్ఛిన్నమయినపుడు ఆ కొవ్వులు బయటకు రావడము వాటిని మరల కబళించడానికి మరికొన్ని తెల్లకణాలు, భక్షక కణాలు చేరడము, ఆ ప్రాంతములో తాప ప్రక్రియ (Inflammation) కలగడము జరుగుతాయి. కాల్షియం కూడా క్రమేణ  చేరి ఫలకలు (Plaques) ఏర్పడుతాయి. ఈ విధముగా ధమనులు బిరుసెక్కి నాళముల లోపలి పరిమాణము కుచించుకు పోతుంది. ఈ ఫలకములు పగుళ్ళు పెట్టినపుడు అచ్చట రక్తము గడక ్డ డితే రక్తప్రసరణకు అంతరాయము కలుగుతుంది. హృదయ ధమనులలో ఈ ప్రక్రియ కలుగుతే గుండెపోటులు, మస్తిష్క రక్తనాళాలలో యీ ప్రమాదము జరిగినపుడు మస్తిష్క రక్తనాళ విఘాతాలు (Cerebro vascular accidents) కలుగుతాయి.

ఈ ధమనీ కాఠిన్యమును అదుపులో పెట్టాలంటే ఆ కారణాలను అదుపులో పెట్టాలి కదా! రక్తపుపోటును అదుపులో ఉంచడము, మధుమేహ వ్యాధిని నియంత్రించడము, ధూమపానము మాని వేయడము, తగినంత వ్యాయామము చేయడము, శరీరపు బరువును అదుపులో ఉంచడము అవసరము. రక్తములో ఉన్న కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు (Triglycerides) అనే  కొవ్వులు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నాలను చెయ్యాలి కొలెష్ట్రా లు ( Cholesterol) :

ఇది ఒక రకమైన కొవ్వు. పైత్యరసము (Bile) లోను, పిత్తాశయములో (Gallbladder) ఏర్పడే రాళ్ళలోను ఉన్న దీనిని తొలుత కనుగొన్న తరువాత కొలెష్ట్రాలు వివరాలను శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. వృక్షములలో కొలెష్ట్రా లు చాలా చాలా అరుదు. కాని జంతుజాతులలో కాలేయములో (Liver) విరివిగాను, అన్ని కణాలలోను కొలెష్ట్రాలు ఉత్పత్తి జరుగుతుంటుంది. వృక్షజాతి కణాలకు కణకుడ్యాలు (Cell Walls) ఉన్నట్లు జంతువుల కణాలకు స్థిరమైన గోడలు ఉండవు. జంతుకణాలకు పైపొరలే  (Cell membranes) ఉండడము వలన కణాల ఆకారము మారుటకు, చలనానికి, కావలసిన సారళ్యము, మృదుత్వము చేకూరుతుంది. జంతుకణముల పైపొరలు,కొలెష్ట్రాలు, ఫాస్ఫోలైపిడులు (Phospholipids),ఎపోప్రోటీనులుతో (apoproteins) నిర్మితమవుతాయి. పైత్యరస ఉత్పత్తికి, ఎడ్రినల్ వినాళగ్రంధుల స్రావకాల ఉత్పత్తికి, స్త్రీ, పుంస్త్వ హార్మోనుల (Estrogen

51 :: and Testosterone) ఉత్పత్తికి, కొలెష్ట్రాలు అవసరమే. కొంత కొలెష్ట్రాలు

ఆహారము వలన సమకూడినా, కాలేయములోను, వివిధ కణములలోను ఉత్పత్తి జరిగి కూడా కొలెష్ట్రాలు రక్తములోనికి ప్రవేశిస్తుంది. పైత్యరసము ద్వారా కొంత కొలెష్ట్రాలు ప్రేవులలోనికి చేరినా, అందులో చాలా భాగము చిన్నప్రేవులద్వారా  గ్రహించబడి తిరిగి కాలేయమునకు చేరుతుంది. రక్తములో కొలెష్ట్రాలు ఎక్కువయితే అది ధమనీ కాఠిన్యమునకు దారితీస్తుంది. ట్రైగ్లి సరై డులు ( Triglycerides ) :

గ్స లి రాలుతో (Glycerol) వసామ్లములు (Fatty acids) సంయోగము చెందుట వలన ట్రైగ్లిసరైడులు అనే క్రొవ్వు పదార్థాలు ఏర్పడుతాయి. మనము తినే కొవ్వుపదార్థాలలో యివి ఉంటాయి. శరీరములో కూడా ఉత్పత్తి అవుతాయి. శరీరమునకు శక్తి చేకూర్చడానికి  ఇవి ఉపయోగపడుతాయి. అవసరానికి మించిన కొవ్వులు శరీర అవయవములలోను, కొవ్వుపొరలలోను నిలువ ఉంటాయి. రక్తములో ట్రైగ్లిసరైడుల ప్రమాణము పెరుగుతే అవి ధమనుల బిరుసుతనానికి తోడ్పడుతాయి. లై పోప్రోటీనులు (Lipoproteins)

కొవ్వుపదార్థములు నీటిలో కరుగవు. వాటికి జలవికర్షణ (Hydrophobia) ఉండుటచే రక్తములో ఎపోప్రోటీనులనే (Apoproteins) వాహక మాంసకృత్తులతో కలిసి అవయవాలకు కణజాలానికి కొనిపోబడుతాయి. ఆ మాంసకృత్తులు, కొవ్వుల సంయోగములను లైపోప్రోటీనులు (lipoproteins) అంటారు. ఈ లైపోప్రోటీను నలుసులులో కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు, యితర కొవ్వులు లోపల నిక్షేపమయి ఉంటే, వాటిని ఆవరించి ఒక ఫాస్ఫోలైపిడు, కొలెష్ట్రాలుపొర ఎపోప్రోటీనులతో ఉంటుంది. ఈ ఫాస్ఫోలైపిడులకు జలాపేక్షక (Hydrophilic) ధ్రువములు వెలుపలి వైపును, జలవికర్షణ (Hydrophobic) ధ్రువములు లోపలివైపున ఉంటాయి. అందువలన లైపోప్రోటీనులు రక్తముతో కలిసి అవయవములకు చేర్చబడ గలుగుతాయి. 1)

ఈ లైపోప్రోటీనులను  సాంద్రత బట్టి ఐదు తరగతులుగా విభజిస్తారు.

ఖైలోమైక్రానులు, (Chylomicrons)  వీనిలో 90 శాతము ట్రైగ్స లి రైడులు,

52 :: 2)

3) 4) 5)

కొలెష్ట్రాలు 3 శాతము ఉంటాయి.

అల్పతమ సాంద్ర లైపోప్రోటీనులు  (Very low density lipoproteins) : వీనిలో ట్రైగ్స లి రైడులు 55 % కొలెష్ట్రాలు 20 శాతము ఉంటాయి.

అల్పతర సాంద్ర లైపోప్రోటీనులు. (Intermediate density lipoproteins): వీటిలో ట్రైగ్లిసరైడులు 30% కొలెష్ట్రాలు 35 % ఉంటాయి. అల్పసాంద్ర లైపోప్రోటీనులు (Low density lipoproteins): వీటిలో ట్రైగ్లిసరైడులు 10 శాతము కొలెష్ట్రాలు 50 శాతముంటాయి.

అధిక సాంద్ర లైపోప్రోటీనులు (High density lipoproteins); వీటిలో ట్రైగ్లిసరైడులు 5 శాతము  కొలెస్ట్రాలు 20 % ఉంటాయి.

ఇవి కాక Lp (a) అనే మరి ఒక లైపోప్రోటీనును కూడా వర్ణించారు. ఇది అల్పసాంద్ర, అధికసాంద్ర లైపోప్రోటీనుల మధ్య యిముడుతుంది. కాలేయములోను, అవయవాలలోను, కణజాలములోను లైపేసు (Lipase) అనే జీవోత్ప్రేరకము (enzyme) వలన గ్లిసరాలు (Glycerol), వసామ్లములు (fatty acids) తొలగించబడి అల్పతమ సాంద్ర లైపోప్రోటీనులు (VLDLs) అల్పసాంద్ర లైపోప్రోటీనులుగా (LDLs) మారుతాయి. అల్పసాంద్ర లైపోప్రోటీనుల వలన ధమనీకాఠిన్యత (atherosclerosis) కలుగుతుంది కాబట్టి వీటిని చెడు కొలెష్ట్రాలుగా పరిగణిస్తారు.

అధికసాంద్ర లైపోప్రోటీను లేశములు కణజాలము నుంచి క్రొవ్వులను తొలగించి కాలేయమునకు చేరుస్తాయి. ఇవి ధమనీ కాఠిన్యము నివారించుటకు సహాయపడుతాయి కావున వీటిని మంచి కొలెష్ట్రాలుగా పరిగణిస్తారు. పరగడుపున (పన్నెండు గంటల ఉపవాసము తర్వాత) చేసే రక్తపరీక్షలతో వివిధ లైపోప్రోటీనుల పరిమాణ విలువలు తెలుసు కోవచ్చును.

జన్యువులు, భోజన విధానాలు, వ్యాయామము, మద్యపానముల వినియోగము, ధూమపానము యితర ఔషధులు ఈ పరిమాణ విలువలపై ప్రభావము చూపిస్తాయి.

53 :: ధమనీ కాఠిన్యము కలిగించే యితర ప్రమాదహేతువులను అనుసరించి

అల్పసాంద్ర లైపోప్రోటీనులు (LDL), టైగ్లిసరైడులు ఏ పరిమాణములలో ఉంటే ప్రమాదకరమో నిర్ణయించి వాటిని తగ్గించే ప్రక్రియలను, మందులను వాడుకోవాలి

గుండెపోటులకు గురియైన వారిలో 90 శాతము మందిలో అల్పసాంద్ర లైపోప్రోటీనులో (LDL), Lp(a) వో, ట్రైగ్లిసరైడులో ఎక్కువవడమో, లేక అధికసాంద్ర లైపోప్రోటీనులు (HDL) తక్కువవడమో కనిపిస్తుంది. ఈ క్రొవ్వు విపరీతములను (Dyslipidemias) పిన్నవయస్సులోనే రక్తనాళ వ్యాధులను కలుగజేస్తాయి. అందువలన రక్తపరీక్షలతో వీటిని కనిపెట్టి చికిత్సకు పూనుకొనాలి. ఇరువది సంవత్సరాల వయస్సు తరువాత తొలిసారి రక్తపరీక్షలు జరపాలని, ఎట్టి లోపాలు లేకపోతే ఆ తరువాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొవ్వుపదార్థాలకై పరగడపు రక్తపరీక్షలు చేయాలని హృదయ వైద్య నిపుణులు సూచనలు ఇస్తారు.

కొవ్వులు, కొలెష్ట్రాలు ఎక్కువయితే జీవనశైలిలో మార్పులు, ఔషధాలు అవసరము. జీవనశైలి మార్పులు :

ఆహారములో కొవ్వుపదార్థాలను తగ్గించుట, సంతృప్త వసామ్లములు (Saturated fatty acids) గల తైలములు తగ్గించి అసంతృప్త వసామ్లములు (Unsaturated fatty acids) గల తైలముల వాడుక పెంచుట, ఎక్కువ బరువుంటే బరువు తగ్గుట, తగినంతగా వ్యాయామము చేయుట, పొగత్రాగుట మానుట, మద్యము వినియోగము తగ్గించుట, రక్తపుపోటు, మధుమేహ వ్యాధులను అదుపులో పెట్టుట చాలా అవసరము. కుసుమనూనె (safflower oil), పొద్దుతిరుగుడు నూనె, ద్రాక్షవిత్తుల నూనె, ఆలివ్ నూనెలలో అసంతృప్త వసామ్లములు ఎక్కువగా ఉంటాయి. వాటి వాడుక మేలు. జంతు సంబంధపు కొవ్వులలో కొలెష్ట్రాలు, సంతృప్త వసామ్లములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి వాడుకను తగ్గించుకొనుట మంచిది.

54 :: హృద్ధమని వ్యాధి చరిత్ర ఉండి, పెక్కు ప్రమాద హేతువులు (risk

factors) ఉంటే, అల్పసాంద్ర లైపోప్రోటీనుల (LDL) పరిమితి 70 మి .గ్రా / డె .లీ కంటె తక్కువకు తీసుకురావాలి.

రెండుకి మించి ప్రమాద హేతువులు ఉన్నవారిలో అల్పసాంద్ర లైపో ప్రోటీనులను 100 మి.గ్రా./డె.లీ కంటె తక్కువకు తీసుకురావాలి ప్రమాద హేతువులు లేని వారిలో అల్పసాంద్ర లైపోప్రోటీనుల పరిమితి 160 మి.గ్రా. / డె.లీ కంటె తక్కువకు దించాలి. ఈ పరిమితులకంటె ఎక్కువగా చెడు కొలెష్ట్రాలు (LDL) ఉంటే మందులు అవసరము. ఔషధములు : స్టా టినులు (Statins)

స్టాటినులుగా ప్రాచుర్యములో ఉన్న  3- హైడ్రాక్సీ, 3- మెథైల్ గ్లుటరిల్ కోఎంజైం-ఎ రిడక్టేజ్  అవరోధకములను (HMG-CoA reductase 3-hydroxy-3-methyl-glutaryl-coenzyme A reductase inhibitors) విరివిగా యిప్పుడు వైద్యులు వాడుతారు. ఇవి ప్రమాదకర హృద్రోగముల సంఖ్యలను బాగా తగ్గించడము వైద్యులు గమనించారు. పెక్కు సంవత్సరాలు వైద్యవృత్తిలో ఉన్న నేను యీ స్టాటినుల సత్ఫలితాలకు ప్రత్యక్ష సాక్షిని. నా వద్ద వైద్యము చేయించుకొనే రోగులలో సత్ఫలితాలను నిత్యము చూస్తున్నాను. ప్రావస్టాటిన్ (pravastatin), సింవాస్టాటిన్ (simvastatin), అటోర్వస్టాటిన్ (atorvastatin), రొసువాస్టాటిన్ (rosuvastatin), లోవాస్టాటిన్ (lovastatin), ఫ్లూవాష్టాటిన్ లు (fluvastatin) ఉదాహరణలు.

కండరాల నొప్పులు, కండరాల నీరసము, కీళ్ళనొప్పులు వంటి అవాంఛిత పరిణామాలు వీటివలన కలుగవచ్చును. కండరకణ విచ్ఛేదనము (Rhabdomyolysis) జరిగి క్రియటినిన్ కైనెజ్ (creatinine kinase) విలువలు పెరుగవచ్చును. ఈ పరిణామాలు కలుగుతే ఆ మందులను ఆపివేయాలి. వేఱొక స్టాటిన్ ని తక్కువ మోతాదుతో ప్రయత్నించవచ్చును.

55 :: ఈ స్టాటిన్లను వాడేటప్పుడు కాలేయ జీవోత్ప్రేరకములను (Liver

enzymes) రెండు మూడు నెలలకు ఒకసారి ఒక ఆరుమాసములు ఆపై ప్రతి ఆరుమాసములకు పరీక్ష చేయాలని సూచిస్తారు. ఆవి రెండు మూడు రెట్లు పెరుగుతే స్టాటిన్లను మానవలసిన అవసరము కలుగవచ్చును. ఈ స్టాటినుల వలన తీవ్ర కాలేయవ్యాధులు చాలా, చాలా అరుదు. గుండెవ్యాధులు అరికట్టబడి ఆయుస్సు పెరిగే అవకాశమే చాలా ఎక్కువ.

స్టాటినులు cytochrome - P450 ఎంజైముల ద్వారా ఛేదింపబడి విసర్జింపబడుతాయి కనుక P450 ఎంజైముల ద్వారా విసర్జింప బడే  ఔషధాలను వాడవలసి వచ్చేటప్పుడు స్టాటిన్లను తాత్కాలికముగా ఆపి వేయాలి. ఎరిత్రోమైసిన్ (erythromycin) సంబంధ ఔషధులు, జెమ్ ఫైబ్రొజిల్ (gemfibrozil), కీటోకొనజాల్ (ketoconazole), ఇట్రాకొనజాల్ (itraconazole), మందులు కొన్ని ఉదాహరణలు. వీనిని వాడునపుడు స్టాటినులను తాత్కాలికముగా ఆపివేయాలి.


పైత్యరసామ్లములను వేఱ్పరచు మందులు  (Bile acid sequestrant resins):[మార్చు]

కొలిస్టరమిన్ (cholestyramine), కొలిస్టిపొల్ (colestipol), వంటి మందులు పైత్యరసామ్లములతో కూడి, ఆంత్రముల ద్వారా కొలెష్ట్రాల్ మరల గ్రహించబడకుండా చూస్తాయి.

నయాసిన్ (niacin), ఎజెటిమైబ్ (ezytimibe) మందులు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుటకు ఉపయోగ బడుతాయి. PCSk9 అవరోధకము :

ఎవొలోకుమాబ్ (Evolocumab) అను ఔషధము  pro protein convertase subtilisin/kexin type 9 అనే మాంసకృత్తిని అవరోధించు ఏకరూపప్రతిరక్షకము(monoclonalantibody).PCSK9  కాలేయములో LDL విచ్ఛేదన గ్రాహకములను నిరోధించి కాలేయకణములలో చెడు కొలెష్ట్రాలు విచ్ఛేదనమును మందగింప జేస్తుంది. PCSK9 ని అవరోధించి ఎవొలోకుమాబ్ చెడు కొలెష్ట్రాల్ విచ్ఛేదనమును ఇనుమడింపజేసి రక్తములో LDL కొలెష్ట్రాల్ విలువలు తగ్గిస్తుంది. ఈ మందు చాలా ఖరీదైనది కావున

56 :: అరుదైన పరిస్థితులలో దీనిని వాడుతారు.

ట్రైగ్లి సరై డుల ఆధిక్యము (Hyper triglyceridemia) :

రక్తములో ట్రైగ్స లి రైడులు 200 మి.గ్రాములు మించితే చికిత్స అవసరము. బరువు తగ్గుట, వ్యాయామము పెంచుట, మద్యము వినియోగము మానుట, మితాహారము, మధుమేహవ్యాధిని అరికట్టుట, వంటి జీవనశైలి మార్పులు ట్రైగ్లిసరైడులను తగ్గించుటకు తోడ్పడుతాయి.

నయాసిన్ (niacin), ఫిబ్రేటులు (fibrates), జెంఫైబ్రొజిల్ (gemfibrozil), ఒమెగా - 3 వసామ్లములు (omega-3 fatty acids) జీవనశైలి మార్పులతో తగ్గని ట్రైగ్లిసరైడులను తగ్గించుటకు వాడుతారు.

57 ::