హరిహరి రామ
స్వరూపం
ధన్యాసి రాగం ఆది తాళం
ప: హరి హరి రామ నన్నరమర జూడకు
నిరతము నీ నామస్మరణ మే మరను
చ1: దశరధ నందన దశముఖ మర్థన
పశుపతి రంజన పాప విమోచన || హరి ||
చ2: మణిమయ భూషణ మంజుల భాషణ
రణ జయ భీషణ రఘుకుల పోషణ || హరి ||
చ3: పతితపావన నామ భద్రాచలధామ
సతతము శ్రీరామ దాసు నేలుమా రామ || హరి ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.