హరిశ్చంద్రోపాఖ్యానము/ద్వితీయభాగము

వికీసోర్స్ నుండి

హరిశ్చంద్రోపాఖ్యానము

ద్విపద

ద్వితీయభాగము


మనుజేశు డంత నమ్మగువ నీక్షించి
'మనకు నేఁ డిచ్చోట మసలుట దగదు
ముందఱ నున్నది ముయ్యేఱునేల[1]
యం దున్నజనులు మహాజను[2]' లనిన
వనిత యిట్లనుఁ బ్రాణవల్లభుఁ జూచి
“పెను పొందుతత్పురిపే రేమి దేవ
యొనరంగ నే[3]లెడియొడయుఁ[4] డెవ్వాఁడు
మన కెవ్వ రందు సంబంధబాంధవులు
మనయప్పు తెగటార్ప మది వేఁడువారి
వినిపింపు వారల విమలాత్మ' యనినఁ10
జందనగంధి కాజననాథుఁ డనియె
'నిందుకళాధరుం డే[5]లు నప్పురము
నావిశ్వనాథుఁడే యాత్మబాంధవుఁడు
దైవంబుఁ ద్రాత[6]యు దాతయు మనకు

నగలక[7] మునినాథునప్పున కొక్క
తెగ[8] సేయ వలయు నో దేవి యె ట్లైన'
నని కుమారునిఁ దనయంస మె[9]క్కించు
కొని యట పోవుచోఁ గొంత దవ్వులకు
నరుణారవిందంబు[10] లడుగులు గాగ
దరుల[11] గ్రుమ్మరువనదంతావళముల[12]
యురుతరతుండంబు[13] లూరులు గాఁగ[14]
సరససైకతసీమ[15] జఘనంబు[16] గాఁగ
సురుచిరం[17] బగుమేటి[18]సుడి నాభి గాఁగఁ
గర మొప్పుచిఱుతరఁగలు[19] వళుల్[20] గాఁగ
నునుఁదీగనాచు[21] లేనూఁగారు[22] గాఁగ
నెనయ జక్కవలు పాలిండ్లును గాగ
జెలువంపుబిసములు[23] సేతులు గాఁగ
వెలిదమ్మి[24] వదనారవిందము గాఁగఁ
గలికిబేడిసలు[25] వాల్గన్నులు[26] గాఁగ
నెలకొన్నజలవేణి[27] నెఱివేణి గాఁగ[28]30

158

హరిశ్చంద్రోపాఖ్యానము

సరవిఁ బెల్లెసఁగెడు జలకణ పంక్తు
లరు దారుమా క్తికహారముల్ గాఁగ
నవలఁ గ్రీడించు రాయంచలరవము
నవ హేమనూపుర నాదంబు గాఁగఁ
బెనుపొంద నెరసిన ఫేనంబు దెలుపు
దనరారు చున్న చందనచర్చ గాంగ
గూలావనీరుహకుసుమపరాగ
జాలంబు చిత్రవ స్త్రంబుగా మెఱయ
జనలోక పావని జాహ్నవి గంగఁ
గనుఁగొని హ స్తపంకజములు మొగిచి...................................40
నుదుటఁ గీలించి సన్నుతు లొప్ప భక్తి
గదిసి నందనుఁడును గాంతయుఁ దాను
నాపుణ్యవాహినియం దవగాహ
మోపికఁ గావించి యుచి తాహ్నికములఁ
గ్రమమునఁ దీర్చి యక్కడఁ గొంత సేపు
శ్రమము దీరఁగ నిల్చి జననాథతిలకుఁ

...................................................................................................

వెల్లువ, నెఱి వేణి గాఁగ = నిండారుజడ గాగా, పెల్లు= మిక్కి గా, జలకణపం కులు=నీటిబొట్ల వరుసలు, అనుదారుమౌ క్తికహారముల్ = వింతయైనముత్యపునరు లు, నవ హేమనూపుర నాదము=క్రొత్తబంగారంవియచప్పుడు, పెనుపు = పెంపు, నెరసిన ఫేనంబు దెలుపు= వ్యాపించిన నురుఁగు తెల్లఁదనము, చర్చ పూఁత, కూలా... జాంము- కూల= గట్టునందలి, అవనీ రుహ = చెట్ల యొక్క కుసుమపరాగ = పుప్పొడి యొక్క,జాలంబు = సమూహము, గంగ ను ఇంతవఱకొక స్త్రీ గావర్ణించి నాడు. జనలోకపావని = భూలోకమును పవిత్రము చేయునది, జాహ్నవి - జహ్ను మునివలనఁ బుట్టినది, నందనుఁడు=కొడుకు, పుణ్యవాహిని - పవిత్రమగు

నది, అవగాహము=స్నానము, ఉచిత ఆహ్నికముల = తగినట్టి పగటికర్మములను,

159

ద్వితీయ భాగము.

డట చని ముందట నా వేల్పు చోటి
తటమున నురుతరద్వారక వాట
వాపీతటా పవనసముత్తుంగ
గోపుర ధ్వజ మణి కుడ్య విచిత్ర..........................50
తోరణ ప్రాసాద తురగ మదాంధ
వారణ రథ భట వ్రాత సామగ్రి
జెన్నొందు చున్న కాశీపురిఁ జేరి
కన్నులు విలసిల్లఁగా మహీవిభుఁడు
ముదమునఁ దన దేవిమోము వీక్షించి
మదిరాణి యిందులమహీమ వర్ణింపఁ
బదినూఱుముఖములఫణియును జాలఁ
డిది వేదవిఖ్యాత మిది ముక్తిమార్గ
మిది స్వర్గసోపాన మిది సిద్ధ సేవ్య
మిది దోషచయదూర మిది తీర్థ సార
మిది భుక్తిముక్తిద మిది సత్యచరిత.........................60

...............................................................................................

వేల్పుటేటితటము- దేవనదియైనగంగగట్టు, ఉరుతర... సామగ్రిన్ - ఉరుతర = మిక్కిలిగొప్ప దైన, ద్వారక వాట= ద్వార పుతలుపులును, వాపీ వడ బావులును, తటాక = చెఱువులును, ఉపవన =తోఁటలును, సముత్తుంగ గోపుర పొడవైన గోపుగములును, ధ్వజ = ధ్వజములును, మణికుడ్య = రత్నమయ మైనగోడలును, విచిత్ర = వింత లైన, తోరణ-ముఖద్వారములును, ప్రాసాద = మేడలును, తురగ =గఱ్ఱములు, మదాంధ వారణ=మదము చే కన్ను గానని యేనుఁగులు, రథ=రథ ములును, భటవాత = బంట్ల సమూహములును, సామగ్రిన్ = వీనియొక్క సంపూర్ణ త చేత, దోషచయదూరము= దోష సమూహములకుదవ్వయినది - దోషముల నెల్ల

పోగొట్టునది. తీర్థ సారము = శ్రేష్ఠ మైనతీర్థము. భుక్తిముక్తి దము= భోగ మోక్ష
160

హరిశ్చంద్రోపాఖ్యానము


మిది శంకరక్షేత్ర మిట్టిచిత్రంబు
కంతునిరొజు రోసి కన్నులు మూసి
చింత లొక్కటిఁ జేసి శివుఁ దలపోసి
యల సంతతోల్లాస మందెడువాసి
గలిగించునీ కాని మన పుణ్య రాశి
వామాక్షి విప్రుని వధియించునతఁడు
కామాంధుఁ డై తల్లిఁ గదిసినయతఁడు
నుడుగక సురఁ ద్రాగు చుండెడునతఁడుఁ
దొడరి సువర్ణంబు దొంగిలునతఁడు.............................70
వనితల శిశువుల వధియించునతఁడుఁ
గినుక మై ధేనువుఁ గెడపినయతఁడుఁ
గొండీఁడు గృహదాహకుఁడు గరదుండుఁ
జండాలు డఖిలదూషకుఁడును మఱియుఁ
గ్రిమి పశు మృగ పక్షి కీటాది జంతు
సముదాయ మైన నిచ్చట మృతిఁ బొంది
మిన్నేరుజడలును మిక్కిలిగన్ను
ద్రౌన్నెలపువ్వును గుత్తుక నలుపుఁ
బులితోలు కా సెయుఁ బునుకకంచంబు

........................................................................................................


ములనొసఁగునది. కంతునికొఱ= మన్మథునితక్కువ, సంతతఉల్లాసము= ఎడతె గని యానందము, వాసి= మేలిమి - ఆధిక్యము, సుర=కల్లు, సువర్ణము= బంగారు, కెడపిన= చంపిన, కొండీఁడు=కొండెము చెప్పువాఁడు, గృహదాహకుఁడు= ఇంటికి నిప్పు పెట్టెడువాఁడు,గరదుండు=విషము పెట్టెడివాఁడు, అఖిల దూషకుఁడు=అం దతిరిని దూషించువాఁడు,మిన్నేరుజడలు=ఆ కాశగంగగలజడలు, మిక్కిలికన్ను =మూడవకన్ను కొన్నె లపుష్పంబు కొత్తచందురుఁడ నెడితలపువ్వును,కుత్తు

కనలుపు=గొంతునందలినీలిమ. పునుకకంచము= తలపు ర్రపాత్ర, పలుఁద = వెడలు

161

ద్వితీయ భాగము.

వలుఁదశూలము నశి వనమాలిక యును..........................80
గలయిత డాత డై 'కమనీయరత్న
కలిత మై తలఁచిన కడలనే మెలఁగు
నతులవిమానంబు నందు దన్నెలమిఁ
బ్రతిదినంబును ససంభ్రమముగాఁ గదిసి
యొసపరినన్నెలు నోరచూపులును
ముసిముసినగవులు మొగడచన్నులును.
నసియాడునడుములు నలసయానములు
రస మొల్కుబింబాధరంబులుఁ గలిగి
యలరువిత్తుని మోహనా స్త్రంబు లనఁగ
నలరారురుద్రక న్యాసహస్రములు
వివిధ భంగులం గొల్వ వినుతికి నెక్కి
శివలోక మున సుఖస్థితి నుండఁ గాంచు'
ననుచుఁ జిత్రంబుగా నచ్చటి మహిమ
మన మార నాచంద్రమతికిఁ జెప్పుచును
ధవళగోపుర చతుర్ద్వార బంధురము....................................90

.......................................................................................................

అస్థివనమాలిక = ప్రేవులమాల, ఇతఁడు ఆతఁడై = ఇచట మృతిఁబొందినవాఁడు శివునిలక్షణములను బొంది ఆశివుఁడేయై- శివసారూప్యమును బొందియనుట, కమ నీయరత్న కలితము= మేలయినమణులతో పొదుగఁబడినది, తలఁచినకడల నే తలఁచుకొన్న చోట్ల నే, ఒసపరి వన్నెలు = సింగార పువగలు, 'మొగడచన్ను లు= మొగ్గలవంటి పాలిండ్లు, అసియాడు-జవ్వాడు, అలసయానములు= మెల్లనినడ లు,బింబాధరములు దొండపండువంటి పెదవులు, అలరువిత్తుని మోహనాస్త్రములు= మన్మథుఁడు జగత్తును మోహింపఁజేయుటకై వేయు బాణములు,

ధవళ ... బంధురము ధవళగోపుర = తెల్లనిగో పురముల చేతను, చతుర్ద్వార =
162

హరిశ్చంద్రోపాఖ్యానము


ప్రవిమలముకాతపత్రసుందరము
నరుణవి తానరమ్యమును సమీర
తరళిత వృషభ కేతనభాసురంబు
మణిరంగవల్లి కామంటపోజ్జ్వలము
ప్రణుత గుగ్గులు పపటలవాసితము.........................100
పటహ భేరీ శంఖ పణవ మృదంగ
పటు ఘంటికానేక బహువాద్యరవము
కాంతాసమర్పిత కర్పూరళకల
కాంత నీరాజన కాంతి శోభితము

..............................................................................................................

నాలుగు హజారముల చేతను, బంధురము = మనోజ్ఞ మైనది. ప్రవిమల • • • సుందర ము- ప్రవిమల = మిక్కిలి తెల్లనైన, ముక్తా ఆతపత్ర = ముత్యపు గొడుగు చేత, సుందరము= అందమైనది, అరుణ వితానరమ్యము = ఎఱ్ఱని మేలుకట్ల చే సొగ నై నది, సమీర... భాసురంబు---సమీర - గాలి చేత, తరళిత కదల్పఁబడిన, వృషభ కేతన - ఎద్దుపడఁగ చేత, భాసురము=మనోజ్ఞ మైనది. మణి . . . జ్వలము – మణి రత్నముల చేత నైష, రంగపల్లి కా = ముగ్గులతోఁగూడిన, మంటప = మంటపముల చే, ఉజ్జ్వలము - ప్రకాశించుచున్నది. ప్రణుత ... వాసితము • ప్ర ణుత = మిక్కిలినుతింపఁబడిన, గుగ్గులు ధూపపటల = గుగ్గిలపు ధూపములసమూ హము చే, వాసితము= వాసనగలదిగా చేయఁబడినది. పటహ...రవము హజాత ప్పెట, భేరీజన గారాలు, శంఖ= చిందములు, పణవ= చిన్నత ప్పెటలు, మృదంగ =మద్దెలలు, పటుమంటికా గొప్పగంటలు, అనేక పెక్కు లైన, బహు= నానావిధము లైన, వాద్య = వాద్యముల యొక్క, రవము= ధ్వని, గలది. .శోభితము - కాంతా = స్త్రీల చేత, సమర్పిత = అర్పింపఁ బడిన, కర్పూరశకల = కప్పురపు తునుకల చేత, కాంత = మనోజ్ఞ మైన , నీరాజన = ని

వ్వొతులయొక్క, కొంత = ప్రకాశము చేత, శోభితము= ఒప్పునది. అగణిత ...

ద్వితీయభాగము.

163

నగణితకనక కుంభాభిరామంబు
నగు విశ్వనాథమహా దేవునగరుఁ
జేరి యా దేవుని శ్రీలింగమూర్తి
గోరి సద్భక్తి నెక్కొనఁగ దర్శించి
ధరణిఁ జాఁగిలి మొక్కి తనమోడ్పుఁ గేలు
గర మొప్ప ఫాలభాగంబునఁ జేర్చి....................110
జయ భక్తమందార సజ్జనోద్ధార
జయ సద్గుణాధార సంసారదూర
జయ సత్కృపాలోల శాతత్రిశూల
జయ హుతాశన నేత్ర జలజాక్షమిత్ర
జయ మేరుకోదండ జయ విష్ణు కాండ
జయ నిర్జి తొనంగ శశిధవళాంగ
చారుకోమలహాస చతురవిలాస
గౌరీమనోల్లాస కాశీని వాస
యీ కౌశికునిఋణం బీకాశిలోన
దీకొని తీర్పఁగాఁ దెరువు గల్పింపు'....................120

..............................................................................................

అగణిత = లెక్కింపరాని, కసక కుంభ = బం గారుక లశముల చేత, అభి రామంబు=మనోజ్ఞమైనది, భ క్తమందార = భక్తులకు కల్పవృక్షమువంటివాఁడా, సజ్జన ఉద్ధార = సత్పరుషులను ఉద్ధరించువాఁడా, శాత= వాఁడియైన, హుతాశన నేత్ర = నిప్పుకన్ను గలవాఁడా, జలజాక్ష మిత్ర = విష్ణువునకు చెలికాడా, మేరుకో దండి= మేరుపర్వతము విల్లుగాఁగలవాఁడా, విష్ణుకాండ = విష్ణువు బాణముగాఁగ లవాఁడా, నిర్జిత అనంగ జయింపఁబడిన మన్మథుఁడుగలవాఁడా, శశిధవ చంద్రునివలె తెల్ల నిఅంగములు గలవాఁడా, చారుకోమలహాస =

సొగసై మృదువైన నవ్వుగలవాఁ దీకొని= ఎదుర్కొని పూని, తెరువు=మార్త
164

హరిశ్చంద్రోపాఖ్యానము

మని సన్నుతులు సేసి యచ్చోటు వాసి
మనమార నా చంద్రమతియును దాను
భుక్తి ముక్తులు రెండుఁ బోలంగ నొసఁగు
భక్తవత్సలుఁ గాలభైరవుఁ గొలిచి
భసిత త్రిపుండ్రంబు ఫాలలోచనము
నిశిత త్రిశూలంబు నీలకంఠంబు
భోగీంద్రహారంబుఁ బునుకక ప్పెరయు
నాగకంకణమును నల్ల నిమేను
మరులు కెంజడలును మణికుండలములుఁ
జిఱుగజ్చెమొలనూలు సింగినాదంబు
డాకాలి పెండెంబు డమరువుఁ గత్తి
రాకాసితలలతోరపువనమాల
సెలవిపై ఁ జిఱునవ్వు చిలికెడుమోముఁ
గలిగి యుజ్జ్వలరత్న ఖచితంబు లైన
యోగ వాగలు మెట్టి యొక పాద మూఁది.......................130

.......................................................................................................

ము ఉపాయము,భసితత్రి ఫండ్రంబు = బూదిమూఁడు రేకలు, ఫాలలోచనము = నో సటికన్ను, నిశిత త్రిశూలంబు నాఁడియైన త్రిశూలము, భోగీంద్రహారంబు సర్ప శ్రేష్ఠుఁ డైన వాసుకి అనెడు హారము, పునుకక ప్పెర = కపాలపాత్ర, నాగ కంకణము = సర్పముల కడియము, మరులు కెంజడలును = మోహముగొలి పెడు ఎఱ్ఱనిజటలును, చిరిగజ్జె = చిన్నగ జ్జెలు, సింగినాదంబు = పొడదుప్పికొమ్ముతో చేయఁబడిన యోగుల సుషిర వాద్యవి శేషము, డాకాలి పెం డెంబు = ఎడమ కాలి పెండేరమును, డమరుగము, రాకాసి.. పనమాల-రాకాసితలల= రాక్షసుః శిరస్సుల చేత నెన, తోరపు = పెద్ద, వనమాలయు, సెలవి = పెదవిమూల, ఉజ్జ్వ

లరత్న ఖచితము = ప్రకాశించురత్న ముల చే పొదుగ బడినది. యోగ వాగ

ద్వితీయ భాగము.

165

బాగుగా నొసపరి బాగు నటించు
నా దేవ దేవుని యానందమూర్తి
మోదంబుతోఁ జిత్తమున నిల్పి యొక్క
మఱియు నచ్చట మణిమంత్రౌషధములఁ
గజవక యుండ వాకట్టి సింహముల.................................140
శరభంబులను ఘోరశార్దూలములను
వెర వారఁగా నెక్కి విహరించి యజన
విరచితాసనభద్రవిన్యాససరణి
నరుదుగా నాసీను లై యణిమాది
సిద్ధులు గలిగి ప్రసిద్ధు లైనట్టి
సిద్ధుల నిష్టార్థ సిద్ధిగాం గొలిచి
మగుడి భూవిభుఁ డొక్కమఠముపొంతకును
దగఁ జేరి యున్నయ త్తతి నిప్పులురుల
వీక్షించి యమ హీవిభునితో ననియె
నక్షుత్రకుఁడు మది నయమింత లేక.............................150
'యచ్చుగా మాగురుం డవనీశ నీకు
నిచ్చినమితి నేఁడు నెల్లియుఁ జిక్కె
బచ్చ పైకము గూడఁ బడినది లేదు

...................................................................................................

లు=యోగ సిద్ధులు మెట్టు పాదుకలు, ఒసపరి బాగు శృంగార వంతునివిధము, వా కట్టి=నోరు బంధించి, శరభము= ఎనిమిది కాళ్ల మృగము, శార్దూలము= పెద్దపులి, అజిన... సరణిః" = అజిన-కృష్ణాజినము చేత, విరచిత = చేయఁబడిన, ఆసన-=ఆ సనము యొక్క , భద్ర=శుభ మైన, విన్యాస = రచన యొక్క, సరణిన్ =విధ మున, నిప్పులు ఉరులన్ కన్నుల నిప్పుకలు రాలగా, నయము = మెత్తదనము, ఇచ్చినమితిక్ = పెట్టినగడువులోపల, నేఁడును ఎల్లియుణ్ చిక్కె

ను = నేఁడు - రేపును మిగి లెను, పచ్చ పైకము= బంగారు వైకము, కూడఁబ
166

హరిశ్చంద్రోపాఖ్యానము


తచ్చలు పచరించి తటమటించెదవు
యిప్పు డేమరిపాట నిటకు నే తెంచి
ముప్పిరి గొనుకోపమునఁ గౌశికుండు
నన్ను వీక్షించి యీనర నాథుమీఁద
మిన్నక తరువుండి మితి వోక మున్నె
పన్ను గాఁ దె మన్న పసిఁడిచౌకముల
నెన్ను ము నీవన్న నెచట నేఁ దెత్తుఁ..................................160
బసిఁడిఁ దెమ్మనుచు నేఁ బలుమారువేఁడ
మినుగ వేనుఁగుగన్వ మీటినయట్లు
చదువు నంతరమాయెఁ జాలు నీజాగు
తుద లేదు వీనుఁగుతోడి జాగరము
బోయబొంకులు బొంకి పోయెదో లేక
మాయప్పు నేఁటీతో మాన్పి పుచ్చెద వు
నిను నేఁడు ముఖమున నెత్తురు . బొమిఁ
కొనిగుల్లపఱుపక కొలికికి రావు

.........................................................................................................

డినది=కూడినది - స్వార్థమునఁబడు. తచ్చలుపచరించి = జిత్తులు నెఱపి, తటమ టీం చెదవు= మోసపుచ్చెదవు, ఏమరిపాటు=పరాకుగా-అదాటున ,పన్ను గాన్= ఒప్పిదముగా, పసిండిచౌక ములకాక ఆకువరాలు.. నాలుగురూపాయలవరా చౌక మనఁబడును. మిసుకవు=కదలవు, ఏనుఁగుగవ్వదాటినయట్లు= పెద్దగవ్వను ఎగఁ జిమ్మినను కదలనట్లు కదలకు న్నా వనుట. చదువును అంతరమాయె= విద్యాభ్యాస మునకును అడ్డికలిగెను, పీనుఁగుతో డిజూగరము= పీనుఁగుతోఁగూడ మేలుకొను ట- పీనుఁగుతో ఎంత సేపు మేలుకున్నను తుది లేనట్లు నీ జాగునకును తుది లేదనుట. బోయబొంకులు=కటికి బొంకులు, నెత్తురుఁ బ్రామికోని= మొగమున నెత్తురు లేకుం డునట్లు చేసి- అవమానభయాదులవలన మొగమున నెత్తురు లేకపోవుట ప్రసిద్ధ ము. గుల్లపఱషక = గుల్లవలె తెల్లఁ బాఱనీయక , కొలికికి రావు=పరిపాక మునకు రా

ద్వితీయ భాగము.

167

పట్టి గుత్తని నిన్నుఁ బలు వీక్షింపఁ
జట్టు మోయించెదసర్వదా చూడు'..............................170
మనుచు నక్షుత్రకుం డంతరంగమును
మునుకొని చిల్లులు మోన నాడుటయు
జననాథుఁ డాత్మలోఁ జాలఁ జింతించి
తనయుండు నాలును దానును దక్క
నితరధనంబు లొండేమియుఁ గలుఁగు
మతము గానక చంద్రమతి దిక్కుఁ జూచి
గుడిగుడి కన్నీరు గ్రుక్కుచు నొండు
నుడువ నాలుక రాక నులివేఁడియూర్పు
లందంద నిగుడ మో మరవాంచి యున్న
చందంబుఁ జూచి యాసాధ్వీలలామ ................................180
దీపించుపతివక్త్ర దృష్టివి చేష్ట
లేపార నింగితం బెఱిఁగెడియట్టి
చదురాలు గాన సంశయ లేశ మైన
మది లేక పల్కె దీమసము పెంపునను
‘భూచ మెల్ల నేర్పున నేలినట్టి
రాచ వేల్పవు నీవు ప్రాకృతు నట్లు
పాయనిచింత విభ్రాంతిఁ గుం దెదవు

................................................................................................

వు- కార్యము తీర్చవనుట. గుత్త:-గుత్తయని, చట్టు=బండజాతిని, చిల్లులువో వన్ =తూటులుపడునట్లు, నులి వేఁడి జనులి వెచ్చ, వక్త = మొగము, దృష్టి =చూ పు, చేష్టలు= వ్యాపారములు, ఇంగితము= మనస్సునందలి యభిప్రాయము, చదురాలు = నేర్పుకత్తె, దీమసము= ధైర్యము, రాచవేల్పవు = రాజురూప మైన దేవ

తవు, ప్రాకృతునట్లు=పామరునివ లె, దాయంబుకల= విపత్తు సమయమున, ఒండొ
168

హరిశ్చంద్రోపాఖ్యానము


దాయంబుతల నిట్టిదైన్యంబు దగునె
మతిఁ బూని నీ సత్య మహిమ పెంపొంద
మితి రెండు దినములు మీఁద నుండఁగనె ................................190
చొప్పడ నప్పు దీర్చుట మేలు దినము
లొప్ప నొండొక టెక్క నొక్కటి దఱుఁగు
నుడితప్పు వాతప్పు నుసలక సత్య
“మెడలింపఁ గని పెట్టు నెపుడుఁ గౌశికుఁడు
శిశువులు వాపోవఁ జెక్కిలి మీటి
విశ దాత్త పాలుఁ ద్రావించుచందమున
నుసలక మన వెంట నుండి యీయప్పు
కసటు వాపఁగ నేఁడు గలిగె నీ ఎడుగు
నింటి వేలుపు మన కితఁ డింక నెన్ని
కంటకంబులు వల్కుఁ గా కేమి దీనఁ ..........................................200
బేద నేనని నోరఁ బ్రేవులుఁ జూప
బోదు రే ఋణముఁ దెంపునఁ గొనువారు


...................................................................................................

కటిఎక్కన్ = ఒక్కొక్కటి జరుగ గా, ఒక టి తఱుఁగుక్ = ఒక్కొక్క దినము గడువులోతగ్గును, సుడిత ప్పు =మాటతప్పు, వాతప్పు= నోటితప్పు, చెప్పినమాటత ప్పుటయు, చెప్పరానిమాట చెప్పుటయునని రెండుతప్పులు, నుసలక = ఆలస్యములేక, సత్యము ఎడలింపన్ = సత్యమును తప్పించుటకై నుడి తప్పును వాతప్పును గని పె ట్టుననుట. చెక్కిలిమీఁటి= చెంపపుడికి, అప్పుక సటు= ఋణదోషము, పడుగు= వటుఁడు, ఇంటి వేలుపు = గృహదైవము, గృహదేవతవ లె దగ్గజ నేయుండి శుభ ములిచ్చువాఁడనుట. కంటకములు=కఠిన వాక్యములు, పల్కు 'గాక = పలికినను పలుక నీ, ఏమిదీన = దీనివలన నేమిగ లుగ గలదు, పేద నేను అని నోరణ ప్రేవులు చూషణ్ = నేను పేదవాఁడను అని కడుపులోని పేగులు దెలియునంత

విరివిగా నోరు దెఱచి బతిమాలుకొన్న ను, పోదు రే ఋణము తెంపునఁ గొను

169

ద్వితీయ భాగము.


జపములు దపములు సకలదానము
లుపవాసవిధులు దేమోపచారములుఁ
గ్రతువులు నొనరించి కాంచుపుణ్యంబు
లతులిత సత్య వాక్యమునకు సరియె
కావున నిప్పు డక్కల వాపి కొనఁగ
నేవిధంబున వెర వేమియుఁ గాన
మెడపక నను విక్రయించి చెల్లింపు
కడఁబడుఁ గొంతైనఁ గౌశికుఋణము
కడమకు నొక తెగ గల్గు నెల్లి టికి
గుడిఁ జుట్టి వచ్చిన కొలఁది. మే లొదవు
నఱమఱ లేక లె'మనుటయు గుండె
మెఱుఁగుఁగైదువుఁ గ్రుచ్చి మెజమి నట్టైన
నులికి భూపాలుఁ డాయుగలిఁ జూచి
పలికె బాష్పములు జెప్పల నప్పళింప
'మది రాణి యీవేఁడిమాట నా చెవులఁ
గదియించి పాపంబు గట్టుకోఁ దగునె

................................................................................................


వారు అప్పును కటువుగా పుచ్చుకొను వారు విడిచి పెట్టిపోదురా, అక్కఱ = నిర్బంధము, ఎడపక = ఆలస్యము చేయక , కడఁబడు కొంతైనన్ కౌశికుఋణ ము=విశ్వామిత్రునియప్పు కొంచెమైనను తగ్గును, కడమకు = మిగతయప్పునకు, ఒక తెగ = ఒక దారి, గుడి ... కొలఁ ది=గుడి ప్రదక్షిణము చేసినంత మాత్రమునకుఁ దగి నట్టి, మేలు= శ్రేయము, గుండెన్ = గుండెయందు, మెఱుఁగుఁ గైదువు=పదను పెట్టఁగా తళతళ మెఱయు వాఁడియాయుధము, మెఱమినట్లు= నాటిన దానిని ఇటు నటు మెదల్చినట్లు,ఉలికి= ఆ దిరిపడి,ఉగ్మలి= స్త్రీ, అప్పళింపక్ = ఆక్రమిం పఁగా, కదియించి = పొందించి - వినిపించి, ఏవగింపన్ = అసహ్యపడుకోఁగా, మా

170

హరిశ్చంద్రోపాఖ్యానము


పతి యెట్టికష్టంపుఁబని సేసి యైన
సతిఁ బ్రోచు టిది ధర్మశాస్త్ర సమ్మతము.............................220
యాలి నమ్మినకష్టుఁ డనుచు నెల్లెడలఁ
జాల నిందించుచు జను లేవగింప
వదనాంబుజము వంచి వసుధఁ బెక్కేండ్లు
బతి కెడియామాల బ్రతు కేటి బ్రతుకు
పడతి నేనిట్టు నిన్ బతిమాలి యమ్మి
పడయఁగాఁ దగు నింద్రపదవైన నొల్ల
లెక్కింప నపకీర్తి లేనిజీవనము
నిక్కబుగా నొక్క నిమిషంబె చాలు
నొఱలంగఁ బ్రాణుల నొ త్తి కుత్తుకలు
గరగర దేఇగెడికటిక వాఁ డైన .........................................330
దయ లేక తనకళత్రము నమ్ము కొను నే
నయ మేది దీనికి నా మది సొరదు
ధనమున కై పత్ని దాసిగా నమ్మి
చనునె భర్తకుఁ గూడు చవి యని కుడువ
మరణంబు మేలు నెమ్మదిదీనికంటెఁ
బరికింప ననుడు నప్పడతి యిట్లనియె
'నాపద వచ్చినయప్పుడే మున్ను
దాఁపినధన మిచ్చి తగుఁ బత్నిఁ గావ


....................................................................................................

లబ్రతుకు= అతినీచపు బ్రతుకు , ఓఱలంగన్ = విలపించునట్లుగా, కళత్రము=భార్య, నయము ఏది= మెత్తనవిడిచి, చనునె . గుడువ - 'భర్తకుఁ గూడుచవియని కుడువఁజ నునె' అనియన్వయము. ఆపద ... గావఁ జనును = విపత్తు కలిగిన సమయమందే

ముందు తాను దాఁచి పెట్టుకొన్న ధనమిచ్చి తనభార్యను గాపాడఁదగును. ప

ద్వితీయ భాగము.

171


జనుఁ బత్నినైనను జట్టిగా నమ్మి
తనకు వచ్చిన బారిఁ దప్పింప వలయు' 240
నని చెప్పి 'నీతి వాక్యస్థితిఁ గొంత
మనమునఁ దలపోయుమా చలమేల
సతి నమ్మియైనదోషముఁ బాసి పుణ్య
గతి కేఁగుసద్విధి గలిగినఁ జాలుఁ
బంక జహితవంశ పాఱున కిచ్చి
బొంకినసా పంబు పొలియ దేమిటను
బొంకిన మొగసిరి తెలియు నాయుష్య
మింకుఁ దేఁకువ దప్పు నెడ తెగుఁ గీర్తి
నమ్మిక మాలు మానము దూలపోవు
వ మగుఁ బుణ్యంబు వచ్చు నాపదలు.........250
ధర నానృతార్దుష్కృతం పర మనుచు
నురువడి మోయుచు నుండు వేదములు

త్ని నైనను ... వలయును - తన కే బాధకలి గె నేని తపభార్య నైనను వెలకు నమ్మి దానిని తప్పించుకొనవలయును. జట్టి= వెల, సతి, . , జూలు - భార్యను విక్రయించి యైనను తనకుఁగ లుగుదోషమును దొలఁగించుకొను పుణ్యగతికిఁబోయెడు మంచి విధి ఆచరించినఁ జాలును-భార్య నై నను అమ్మవచ్చునుగాని సద్గతిగూర్చు ధర్మని ధిని దప్పరాదనుట. పొఱ... పాపంబు - - బ్రాహ్మణునకి చ్చెదనని చెప్పి వెనుక లే దని కల్లలాడుటవలనఁ గలుగుపాపము. పోలియదు ఏమిటను = ఏద్దాని చేతఁ గాని నశింపదు, మొగసిరి = పురుషత్వ పుసొంపు, తేఁకువ= బెట్టు, ఎడ తెగు= విచ్ఛిన్న మగును - నడుమ నశించిపోవును. నమ్మిక మాలు= తనయందు ఇతరులకుఁ గలనమ్మ

కము చెడిపోవును, తూలపోవు= చెడును, ఎము = వ్యర్థము, నానృతాత్ దుష్కృ.
172

హరిశ్చంద్రోపాఖ్యానము

నాలును బిడ్డలు నర్థంబు నెపుడుఁ
గాలిసం కెల లెల్ల కడలను బతికి
మఱచియు వీనిపై మక్కువ సేయ
రెఱుక గల్గిన ధీరు లెల్ల కొలంబు
వక్రంబుగా నాడ వలదు న న్ని పుడు
విక్రయింపఁగ వేళ విచ్చేయు' మనుచు
ముదమునఁ జాఁగిలి ( మొక్కి హస్తములు
గదియ మొగుడ్చు నాకళ్యాణిఁ జూచి.....260
వనజాక్షి నిను నాఁడు వనవహ్నిఁ గూల
ననుమతించిన నాకు నవఘళం బెద్ది
నాక తంబున నిట్టి నలఁకువ వచ్చె
నాకతంబున నిట్టి నగుఁ బాటు వుటై
సొరిదిఁ బెం పెసఁగురాజుల దేవు లెల్లఁ
బరువడిఁ గనుసన్నఁ బనులు గావింప
నురు వైభవంబుల నుండుని న్నిట్టి
వరవుగ నమ్ముకో వలసె నే మందు
నీయట్టికులసతి నీయట్టిసాధ్వి
నీయట్టి ప్రియురాలి నేఁటితో, బాప...........270
సమకట్టెనే పాపజాతి దైవంబు
కమలాక్షి నాపూర్వకర్మ మెట్టిదియ


తంపరమ్ = అబద్ధమునకం టే మించిన పాపము లేదు, వక్రంబు గాళ్ = ఏస గా, ఆ “వమళంబు = లక్ష్యుము, నలఁకువజ పీడ, నగుఁబాటు=అపహాసము, కనుసన్నక్ ప నులు గావింపక్ = నీయొక్క కను సైగలచేత నే తెలిసికొని నీకువలయు ఊడిగములు

చేయఁగా, ఉరువై భవంబునన్ = గొప్పయైశ్వర్యముతో, వరవు= దాసీత్వము,

ద్వితీయ భాగము.

173

లక్కయై కరఁగదు లలన నాకిట్టి
చిక్కు వచ్చుటగొ నా చిత్తంబు మిగుల
ననద వై ని నిప్పు డమ్ముకొ మంచు
ననుమతిఁ జేసెద వకట నా గుండె
తూలదు వీలదు తునియలై పోవ
దోలంపుముద్ద గా దోపువ్యుబోఁడి
వనజాక్షి నినుఁ గూడి వర్తించు ఘోర
వనములు శృంగార వనములు నాకు.......280
మగువ నీ వున్న కోమలతృణశయ్య
తగుహుసతూలికాతల్పంబు నాకు
గలకంఠి నీ పొందు గలగిరిగుహలు
సలలిత మణిచంద్రశాలలు నాకు
మలయజగంధి ప్రేమమున నీ ఫెసఁగు
ఫలకందమూలముల్ బహువిధాన్న ములు
జలజాక్షి నేఁడు నాసామ్రాజ్యలక్ష్మి
తొలఁగి పోయినరీతి దోఁచుచున్నదియు'
ననుచు నాందోళింప నతనిఁ గ్రోధమునఁ
గనుఁగొని మఱియు నక్షత్రకుం డనియె...........290


“లక్కయై... నాచి త్తంబు' - 8 నాచి త్తంబు నాకిట్టి చిక్కు వచ్చుటకో లక్కయైక రఁగదు- నామనస్సులక్క వలె కరఁగకున్నది; నేనిట్టి చిక్కు పడ వలసియున్నందుపలన నేమో అదియట్లు కరఁగకున్నది. అనదవై = అనాథ పై, తూలదు= చెడదు, ప్రీలదు=పగులదు, ఓలంపు శుద్ద గాడు= గందపము గాదు. గిరిగుహలు.కొండబిలములు, సలలితమణి చంద్రశాలలు = మేలయినరత్నముల 'ఁగట్టఁబడి నమి ధైటిండ్లు, మలయజగంధి ఇచంద సమువంటి వాసనగలదానా,

ఆందోళింపక్ =మిణకరింప,ఆజాను బాహులును = మోకాలిషఱకు నందు చేతులు
174

హరిశ్చంద్రోపాఖ్యానము

‘భూమిళ మాటలఁ బొద్దుఁ బుచ్చెదవు
తామసం బేల ని త్తఱ వెరవేది
తరుణిఁ బాయఁగ లేక తల్లడించినను
నురి యుపాయముఁ జెప్పు మాధనంబునకు
జాగు సేయక పత్ని జట్టిగా నిచ్చి
నాగురు నాథుధనంబుఁ జెల్లింపఁ
జెచ్చెర లేచి వచ్చేదొ మౌనికడకు
వచ్చెదమో రావె వైళంబె' యనుచు
'నాసల బెట్టి నన్న డఁగింప వలదు
వేసాలు సేయక వేగ లె'మ్మనుచుఁ...........300
జేపట్టి తీవియ వచ్చిన వాని తెగున
కావసుధాధీశుఁ డొత్తలో రోసి
నిమిషంబు నచ్చోట నిలువక కదలి
రమణి నమ్ముటకునై రాజమార్గమున
జను దెంచు నప్పు డాజాను బాహులును
బెను పొందుమూఁపులుఁ బీనవక్షంబు
నురుతరస్కంధంబు నొజు పగు మేను
నరనుత సింహాసనస్థితుభంగి
నరుదార తెప్ప లల్లార్పక చూచి
పురజను లాత్త లోఁ బొదలు వేడుకల.........310
నీచంద మీయంద మారాజసంబు


ను, పెనుపుఒందు మూఁపులు = ? -బలుపుగల భుజశిరస్సులు, పీనపక్షంబు=బలుపుగల తొమ్ము, ఉరుతరస్కందంబు= మిక్కిలి గొప్పమూఁపు, ఒఱపు = అందము, నరను

...... స్థితుభంగిక్ = మనుష్యులచే కొనియాడంబడు సింహాససమరి దున్న వానివలె,

175

ద్వితీయ భాగము.

నీ చూపు నీయేపు నిట్టి తేజంబు
నీ పెంపు నీసొంపు నీ ప్రతాపంబు
నీపోఁడి మీవాఁడి మీభుజాబలము
నెందు నెవ్వరియందుఁ నెన్నఁడుఁ గాన
మిందుక ళాధరుం డితఁడగు నేని
నందివాహనము పినాకంబు నేది
కణితోలు ఫణులకంకణహారములును
జుఱుకుఁగన్నును వాడిశూలంబు నెవ్వి ....................320
కరిరాజవరదుఁడు గాఁబోలు నితఁడు
కరిరాజవరదుఁ డీఘనుఁ డగు నేని
గరుడవాహన మెద్ది ఘన మైనయట్టి
సరసను నిజశంఖచక్రము లెవ్వి
పురుహూతుఁ డీఘనభుజుఁడు గాఁబోలు
పురుహూతుఁ డీఘనభుజుఁ డగు నేని
యిర వెండఁగా వెల్ల టేనుంగు నేది
కరమొప్పు నల వేయిగన్నులు నెవ్వి
మనసిజుఁ డీమహామహుఁడు గాఁబోలు
మనసిజుఁ డీమహామహుఁ డగు నేని
ననవిల్లుఁ బుష్పబాణంబులు నెవ్వి.........................330


ఏపు= విజృంభణము , పోఁడి మి= రూపము, వాఁడిమి= ప్రతాపము, ఇందుకళా ధరుండు= శివుఁడు,పినాక ము= త్రిశూలము కరితోలు =నల్లగజచర్మము , ఫణులకం కణహారములును = సర్పము లకడియములును హారములును, చుఱకుఁగన్ను = వేడి కన్ను - అగ్ని నేత్రము, కరిరాజవర దుఁడు= మేటియేనుఁగునకు వరమిచ్చిన విష్ణు

దేవుఁడు, పురుహూతుడు= ఇంద్రుఁడు. వెల్ల టేనుఁగు= ఐరావతము, మన సిజుఁ
176

హరిశ్చంద్రోపాఖ్యానము


చను చెప్పఁగాఁ గీరజయవాజి యెద్ది
యెఱుఁగ రా దీతనియెసఁగు తేజంబు
మరు పడ్డనిప్పుకమాడ్కి నున్నాఁడు
పరఁగ నీవిభుపదపంక్తి జాడలను
బరికింపుఁ డిదె సార్వభౌమచిహ్నములు
మరి చూడరము యీ మానినీమణిని
దెర వుచ్చునద్దంబుఁ దెగడెడు మోము
జాతినీలపురంగు జడిపించుకురులు
లేతచందురుఁ బిసాళించు నెన్నుదురు.........................340
మద చకోరములతో మలయు నేత్రములుఁ
గొదమ లేళ్లకు సిగ్గుగొలి పెడిచూపు
విరులవిండ్లకు నము వేసిన బొమలు
సరసచంపకము మెచ్చని నాసికంబుఁ
దెలి మొల్ల మొగ్గలఁ దెగడుపల్వరుస
పులకండ మొలికెడు బొమంచుమోవి
చీక టీ విరియించుచిఱునవ్వు పసిఁడి

....................................................................................................................

డు=మన్మథుఁడు, ననవిల్లు = పుష్పధనువు, కీరజయవాజి = చిలుక య నెడు జయప్రద మైనగుఱ్ఱము, మఱుపడ్డ కానివుఱుగప్పిన, పదపం క్తి జాడలను = అడుగుల వరుసల జాడలందు, పరికింపుఁడు = చూడుఁడు, తెర పుచ్చునద్దంబు = గవి సెనతీసిన యద్దము, జాతినీలపురంగు= మేలుజాతి నీలమణులవ న్నె లను, పిసాళించు=పోలు, మలయు=మాతాడు, కొదమ లేళ్లు=చిన్న లేళ్లు, సిగ్గుగొలి పెడు= సిగ్గుఁబుట్టించు, విరులవిండ్లకుక్ =పూలవిండ్లకు, అమ్ము వేసిన = బాణము దొడిగినట్టి- బాణము: దొడు గఁగా వంపు గా వండియున్న పూలవిండ్లవ లే బొమలున్న వనుట, సరసచంపకము=

మేలైన సంపెఁగ మొగ్గను, నాసికంబు = ముక్కు, బొమ్మంచు మోవి =ఎఱ్ఱని

177

350

ద్వితీయ భాగము.


రేకులతో నెదిరించుచెక్కిళ్లు
కంతుసంకుకు బొమ్మ గట్టినగళము
దంతికుంభముల నడల్చు పాలిండ్లు
చిగురుటాకుల నిరసించుహ స్తములు
గగనంబుతోఁ బరిఘాణించునడుము
తేఁటి టెక్కలదండఁ దెగడునూఁగారు
వాటమై తొక్కి నిల్వఁగ వచ్చుపిరుధు
లనటికంబముల గయ్యాళించుతొడలు
ననవిత్తు కాహళల్ నగుచిఱుదొడలుఁ
గెందామరల నేవగించుపాదములు
సుందరి గా దిది సొబగురాయంచ
యంచ గా దిది నడ పారుక్రైమించు
మించు గా దిది రాచమెచ్చుల ప్రతిమ...................360
ప్రతిమ గా దిది పచ్చి పగడంపులతిక
లతిక గా దిది నవలావణ్య సరసి
సరసి గా దిది పుష్పచాపునిశరము
శరము గా దిది రతి సవరించుచిలుక


-.................................................................................................... పెదవి, పసిఁడి రేకులు బంగారుతగళ్లు, కంతుసంకుకు = మన్మథుని విజయ శంఖమునకు, బొమ్మగట్టిన = జయించిన, దంతి = ఏనుఁగు, పరిఘాణించు = మాటాడు, దండ =సరము, గయ్యాళించు= ధిక్కరించు, చిఱుదొడలు=పిక్కలు, ఏవగించు =అసహ్యపడుకొను, సొబగు రాయంచ =సొగ సైన రాజహంసము, నడపొరుక్రొ మ్మించు=నడకగల క్రొత్త మెఱుఁగుఁ దీఁగ, రాచమెచ్చుల ప్రతిమ= మెచ్చుకొనఁ దగినరాచబొమ్మ, లతిక = తీగ, నవలావణ్యసరసీ = మనోజ్ఞ మైన లావణ్యరస

మునకు, సరస్సు అయినది. పుష్పచాపునిశరము= మన్మథిని బాణము, రతిసవరించు
178

హరిశ్చంద్రోపాఖ్యానము

చిలుక గా దిది వికసించు చెంగల్వ
కలువ గా దిది చంద్రకళవంటి చెలువ
చెలువ యీ గతి విలసిల్లఁగా వలయు
వలయుఁ గాంతల కిటువ లెఁబుట్టుగలుగ
నని ప్రజ దర్కింప నారాజు పలికె
వినరయ్య చెప్పెద విశ్వంబులోనఁ ...........................370
గొనియాడఁ దగుభానుకులమున నేను
జనియించినాఁడఁ ద్రిశంకునందనుఁడ
సార్వభౌముఁడ హరిశ్చంద్రుఁ డన్ వాఁడ
సర్వసర్వంసహాచక్రంబు నెల్ల
నా కౌశికున కిచ్చి యతనికి మున్ను
మేకొన్న ధనముకై మెల్యత న మదను
నన్ను తబహు వేదశాస్త్రాదికళల
నెన్నిక కెక్కునుహీసుకులార
శరణన్న ము న్నెట్టిళత్రువు నైనఁ
గరుణించు నుత్తముడు,క్షత్రియులార........................380
కోటికిఁ బడ గెత్తి కోరువస్తువులు
పాటించి యొసఁగుసంపాసారులార
మగఁటిమి నని మొన మార్కొని పోరి
పగఱకు వె న్నీ నిభటముఖ్యులార

.........................................................................................................


చిలుక =రతి గోము గాఁ బెంచుచిలుక, కొనుకులముజసూర్యవంశము, సర్వస్వం సహాచక్రంబు= సమస్తమైన భూమండలము, మేకొన్న = ఒప్పుకొన్న , మహీసుగులు = బ్రాహణులు,కోటికిక్ ఎడగ ఎత్తి= ఒక కోటి ధనమువకు ఒక పడగ ఎత్తి-అత్య

ధనికు లై ,సంపొనారుూర - వైశ్యులార, మగఁటిమి= ప్రతాపము, అని మొన=

179

ద్వితీయ భాగము.

కట్టల్క వే టారుగా వడి వేయు
రట్టిఁడిబిరుదుల రాహుత్తులార
పతిహిత సాహస బహువిధోపాయ
చతురు లై మతి కెక్కుసనంత్రులార
చనవరులార యోసామంతులార
ధనపతులార యోతగుదొరలార
పసిఁడి గేదఁగి రేకు పస మించుమేను
కుసుమకోమలి నిత్తు కొనరయ్య మీరు
తామరపువ్వు నదల్చు నెమ్మోము
కోమలి నమద కొనరయ్య మీరు
నెరసి క్రోమించు రాణించుగన్దవల
గురుకుచ నమ్మెదఁ గొనరయ్య మీరు
మృగ రాజునకు బొమ్మ మెట్టిననడుము
చిగురాకుబోఁడి నిచ్చెదఁ గొనరయ్య
కలహంసలకు నవఘళ మైననడపు
మెలతుక మీకు నమ్మెదఁ గొనరయ్య
తగవు మాఱగ నన్ను దయఁ జూడరయ్య
తెగడక నాకొక్కదిక్కు గారయ్య
యలుగక నామాట లాలింప రయ్య...................................400

............................................................................................................

యుద్ధాగ్రము, కట్టల్క = పెనుకోపము, వేటు ఆఱుగా = ఒక్కొక్క వేట ఆఱు దునుకలు గా,రట్టిఁడిబిరుదులు-=నింద లేని పొగడ్త కెక్కిన బిరుదులుగల, పసిడి గేదఁగి రేకుపస=బంగారు మొగలి రేకు బాగు, క్రొమ్మించు=కొత్త మెఱుఁగు, రా ణించు= చెలువు చూపు, గురుకుచ = గొప్పచన్ను లుగలది, మృగరాజునకున్= సింహ మునకు, బొమ్మ మెట్టిన = గెలిచినట్టి,కలహంస=రాయంచ,అవమళము= అతిమాత్రము,

180

హరిశ్చంద్రోపాఖ్యానము

చెలగి నా యక్కఱఁ జేకొనరయ్య'
యని దైన్య మేర్పడ నమ్మహారాజు
దన పత్ని నముదుర్దశఁ జూచి పొక్కి
వాడవాడల నెల్ల వారలు గుములు
గూడి యశ్రులు జడిగొనఁ దమలోనఁ
'గటకటా యిట్టి వెంగ లిరాజు గలఁడె
మటుమాయత పసి యేమరులు గొల్పినను.....................410
నెమ్మదిఁ దనయేలు నేలకుఁ దోడు
సొమ్ము లన్నియు నిలుచూఱగా నిచ్చి
యమ్మెదఁ గడమ కై యాలి. గొం డ నెడుఁ
దమ్ము మాలినయట్టిధర్మంబు గల దె
యివ్వనుంధరఁ బుణ్య మెంతయుఁ జేసి
యెవ్వరు బొందితో నేఁగిరి దివికిఁ
జదువులు విని మీఁద జరుగుసౌఖ్యంబు
మది నమ్మి బ్రతుకు బ్రాహ్మణునకు నిచ్చెఁ
బనుపడ మొగిలులోపలినీళ్లునమ్మి

....................................................................................................................

గుములు= గుంపులు, అశ్రులు=కన్నీళ్లు, జడిగొనన్ = వానవలెఁదొరుఁగగా, వెం గలి: =వెర్రి, మటుమాయతపసి= మిక్కిలి మాయలు చేయుముని,మరులుగొల్పినను = మోహ పెట్టినను-తబ్బిబ్బుక త్రాగించినను, తనయేలు....దోడు = తాను ఏలునట్టిభూ మితో 'ఁ గూడ,నిలుచూఱ= నిలువుకొల్ల-ఆపాదమ స్తకము గలనిలువు సొమ్ములన్ని యును కొల్ల గాననుట, కడమ కై = మిగతయప్పున కై , తమ్ముమాలినయట్టి ధర్మము, గలదే తనకుపయోగింపనట్టి ధర్మమునుగలదా తన కుపకరింపనిధర్మ మొకధ ర్మమగు నాయనుట , వసుంధర=భూమి, చదువులు= వేదశాస్త్రాదులు, మిఁదజ రుగుసౌఖ్యంబు = రాఁబోవు సుఖములు-స్వర్గరంభాభోగాదులనుట, బ్రతుకు= జీవ

నము - జీవనాధారమైన భూ రాజ్యధన దారాదులు, పనుపడ =గట్టిగా, మొగిలు

ద్వితీయ భాగము.

181

దొననీళ్లుఁ జల్లు వేఁదుజుఁ డెందుఁ గలఁడె...................... 420
యాలు బిడ్డలు దగులని మున్నె రోసి
చాలించి నట్టి నిస్సంగుని నైనఁ
జేసిన నేరమి చేనేత, గుడువఁ
జేసి యీబూమేలు సేసె దైవంబు'
ననుచుండ మఱి కొంద ఱకట యీ రాజు
నన నేల విపుల కవనివల్లభులు
దగినదానము లీరొ ధన మియ్యం గొనరొ
పగ గొని యీరీతిఁ బట్టి యర్రదిమి
దార లెక్కలకునై తరువులు వెట్టి
దారల నమ్మించి ధనములు గొనెడి..............................430


..................................................................................................

ఇమబ్బు, దొన= కొండమీది నీటిపల్లము, వేఁదుఱుఁడు =వెర్రివాఁడు - ఇక మీద మబ్బులు గురియఁగల వానను నమ్మి యిప్పుడు సిద్ధముగా నున్న దొన నీళ్లు వెచ్చించుకొను వెట్టివాఁడుగలఁ డాయనుట =సందేహగ్రస్తమైన వానను నమ్మి నిశ్చితముగానున్న దొననీళ్లుఁ జల్లివై చునట్లు, సందేహాస్పదము లైన స్వర్గభోగా దులను నమ్మి యిహసుఖభోగములను పోఁగొట్టుకొనుట వెర్రి తన మేయని భానము; తగులు= తగులము, చాలించినట్టి నిస్సంగునిక్ = సంగము వదలుకొన్నట్టి విరక్తుని, చేసిన నేర మిన్ = నేరక చేసిన తప్పును, చేనేత = ఈ చేతి కా చేయిగా-తోడ్తోట చేయనుట, కుడుపఁ జేసి= అనుభవింపఁ జేసి, ఈబూ మెలు = ఈ వంచనలు - ఆలు. . . దైవంబు = ఈ హరిశ్చంద్రుఁడు రాజ్యము సేయుచున్న కాలమున నే ఆలుబిడ్డలు బంధకము లని రోసి లోపల సంగము వదలికొనియున్న రక్తచిత్తుఁడు. ఇట్టి నిస్సంగుఁడ నిగూడ తలఁపక , దైవము ఇతఁడు తెలియక చేసిన నేరమును తోడ్తో అనుభ వింపఁ జేసి యిట్లు వంచనలు చేసినదని యర్థము, అర్రుఅదిమి = మెడఁద్రో క్కి మిక్కిలినిర్బంధ పెట్టి, దార లెక్కలకు నై= దానము చేసినదాని లెక్కలు

ఒప్పగించుకొనుటకై , తరువులు తప్సీలు, దారల = భార్యలను, శఠము= ధూ
182

హరిశ్చంద్రోపాఖ్యానము

కఠినచిత్తులు లేరు గాక లోకముల
శఠ మేల నృపులతో సంయమీంద్రులకు
వెడమతు లైనయీవిపులజాడ
వడిముడిగాఁ జొచ్చి వాత వెళ్లుదురు
ఉపకార మోపిక నొనరించువారి
కపకార మొనరింతు రప్పుడే కడఁగి
యలగుజ్జువడుగు మూఁ డడుగుల నేలఁ
దొలితొలి బలి వేఁడి తుది నెట్లు సేసె
మరి కశ్యపాది బ్రాహ్మణు లిల యెల్లఁ
బరశురాముని చేతఁ బడసి యా ఘనుని.........................440
నుదధిలోనై నఁ గా లూఁదంగ నీక
కదలి పోఁ దోల రెగజిబిజి సేసి
యివి యన్ని యేటికి నీకౌశికుండు
తివిరి విప్రుఁడు గాక తిరిగెడునాఁడు
సొలపు దీరఁగ వసిష్ఠునియింటఁ గుడిచి
తొలగి పోవుచు నెన్ని దొసఁగులు సేసె
నిదె మహీతెలమెల్లనేలునీ రాజు
చెదరక యిట్లేడు చెట్లను జెఱచి
పోనీక బందెలఁ బొరలించి తపసి
దానవుం డై నల్ల ద్రావు చున్నాఁడు...........................450


.........................................................................................................


రత్వము, సంయమీంద్రులకున్ = ముని శ్రేష్ఠులకు, వడముడి గా - వెళ్లుదురు= భయంకరముగా నోటిలో జొచ్చి తిరుగ నోటినుండియే వెడలుదురనుట, గుజ్జున్ డుగు= పొట్టిమాణపకుఁడగు వామనుఁడు, ఉదధి=సముద్రము, దొసఁగులు= కీళ్లు,ఏడు చేట్లను చెఱిచి= సప్తవ్యసనములను భంగ పెట్టి, బందెలన్ పొరలించి-

నిర్బంధములఁ జుట్టి, దానవుండై నల్ల త్రావుచున్నాఁడు= రాక్షసుఁడై నెత్తురు

ద్వితీయ భాగము.

183


కడఁగి వీనుఁగుమీఁదఁ గంచంబు వెట్టి
కుడువగాఁ జూచుఁ గక్కూర్తిగాఁ డితఁ
నెవ్వరులేకయీరాజు తలనె
కూడా నే యీబలుగు తంపు టప్పు'
ననఁగ నందొక కోంద'ఱద్దిరా! చేటు
ధనికుల మని పల్లదంపుఁబెంపునను
రాజులు వాటించురాణివాసముల
నోజతో నూడిగెం బొనరింపఁ దమకు
వరవుడుగాఁ జేసి వరుస వర్తింపఁ
బురిలోనఁ బులుకా సిపురువుల తరమె...................460
కరి రొంపిఁ జిక్కినఁ గ్రమ్మఱ నెత్త

....................................................................................................


తాగుచున్నాఁడు-ఋషి రాక్షసునివలె పడరాని హింసలు పెట్టుచున్నాడ నుట. పీనుఁగు... కక్కూర్తిగాఁడు= పీనుగుపయినిక ంచము పెట్టి తినుటకుఁగూడ పాలుమాలునట్టివాఁడు గాఁడు-అట్టివాఁడు తన యాకటిని దీర్చుకొనుటయే ముఖ్యము గాఁ జూచు నే కాని పీనుఁగుమీఁది దని రోయనట్లు ఈఋషి తనయ క్క ఱ దీర్చుకొను టేకాని యీ రాజు నిట్టి పాట్లు పెట్టుటకు నసహ్యపడఁడనుట. బలుగు త్తంపుటప్పు= గొప్ప దైనదట్టపుఋణము, అద్దిరా చేటు ఔరా, చేటు = చేటు చెడుచున్నా రౌరాయని యాక్రోశము. ప్రల్లదంపు పెంపునను ధూ ర్తత్వము యొక్క అతిశయము చేత -అధిక ధూర్తత్వముతో, సములకున్ = రాజులు అనుభవించు అంతఃపురకాంతలను, ఊడిగంబు ఒనరింపఁ = తమకు ఊడిగములు చేయుటకై , పరవుడు గాన్ దాసిగా, పులు కాసిపురువులతర మే = పచ్చరెక్క- పురువులకు అనఁగా అల్పులకు వశమా, అల్పు లైనవారు తమకు ధనమున్నదని మిక్కిలిధూర్తులై , రాజులకే తగినయంతః

పుర స్త్రీలను వెలకు (గొని తమకూడిగములు చేయం బెట్టుకొన శక్యమగు నాయ
184

హరిశ్చంద్రోపాఖ్యానము

కరి యోపుఁ గాక సూకర మెట్టు లోపు
ధర నింత వాని దుర్దశ నివారింప
నరు లోపుదురె విశ్వనాథుండు దక్క'
నని యని వగచుచు నశ్రువు లొలుక
మునుచిన్నబోయిన మోములు వంచి
మరినిల్వజాలక మందిరంబులకు
నరిగి శోకాగ్నుల నల యుచున్నంత
నాపురిఁ గౌశికునాజ్ఞచే మున్నె
కాఁపురంబుగ నుండి కపటమార్గమునఁ........................470
జెనఁటివిపునిరూపుఁ జేకొని మిగుల
నను పెందఁ జరియించు నాకలిరాజు
తలప నింతిం తనితనధనంబునకుఁ
గొలఁది గాదని సెట్టి గొడుకులు దన్ను
వారక నడుజాము వచ్చి వేఁడినను
గోరిన ధనములు 'గొండు కొం' డనుచు
నక్క ఱదందఁ డై యప్ప టప్పటికి
వెక్క సంబున నూర్లు వేలు నప్పిచ్చి
ముట్టఁ జిక్కిన వేళ ముట్టి చేపట్టి
రట్ట డై తిరిగి పత్రంబులు గొనుచుఁ.............................480

.........................................................................................................

నుట. సూకరము=పంది, ఇంత వాని దుర్దశ = ఇట్టి సార్వభౌము డైనట్టివానిదుర వస్థ, చెనఁటివి పునిరూపు = కుత్సిత వాహణునిరూపము, సెట్టికొడుకులు కోమటికుమారులు, నడుజాము= అర్ధరాత్రి, ఆక్క ఆగండఁడు= అవసరముతీర్చు నట్టిదిట్టడు, వెక్క నంబునక్ = మీఁదుమిక్కిలిగా, ముట్టనన్ చిక్కిన వేళ్ళ పూర్ణముగా తనకు చిక్కిన సమయమున- -మిక్కిలియప్పులు తీయించి వారియ్య లేక తనకు దొరకినప్పుడు, రట్టడి= రాయిడి కాఁడు, పత్రంబులు=దస్తవేజులు

ద్వితీయ భాగము.

185


బెట్ట వచ్చిన కల్ల వెనువులు నెనఁచి తిట్టి వారును దానుఁ దిరిదీపు లాడు మటుమాయలాఁడు కంబళపురీషంబు పటికిరింతలపిల్లి పట్టినదొబ్బ శుద్ధ క ష్టుం డని చూపటి దెగడ బద్దకంబునఁ బెక్కు బాసలు 'సేసి వృద్ధి సజగఁ జక్రవృద్ధిని మాస వృద్ధిని లెక్కించి నెస నప్పు లెత్తి కాలకౌశికుఁ డనఁగాఁ బేరు వడసి కాలీచఁజనుచు శీఘ్రముగ నింటింటఁ...................................490 "బాయక పంచాంగపరనంబు సేసి యాయవారము లెత్తి యతి దైన్యవృత్తి నడిగిన ధాన్యంబు లవి వేఱు వేజ ముడిచిన బట్టలు మూఁపుపై వేలఁ దోలు నస్థులుఁ జిక్కి తూఁగాడు మేనుఁ

.......................................................................................................

కొనుచు వ్రాయించి పుచ్చుకొనుచు, పెట్టవచ్చిన = అప్పులు చెల్లింపరాఁగా, కల్ల పెనుపులు పెంచి = దొంగవడ్డీలు వేసిచుట్టి, తిరితీపులాడు = కొట్లాడు,మటు మాయాలాఁడు=మిక్కిలిమాయలు పన్ను వాఁడు, కంబళ పురీషంబు = కంబళినంటినమలము-దానివలెఅసహ్యమయ్యును తొలఁగింపరానివాఁడు, పటికిరిం తల ... దొబ్బ = చలము పట్టిన పిల్లి పట్టుకొన్న మాంసఖండము - పిల్లి మాంసఖండము పట్టుకొనఁగాఁ దీయఁగూడనట్లు హఠము సాధించునీచుఁడు, బద్ధకమున =బలా త్కారముతో, బాసలు= ఓట్లు, వృద్ధి కాపడ్డి, చక్రవృద్ధిని=వడ్డి కి వడ్డీని, వారవృద్ధిని = వార పువడిని,అప్పు లెత్తి= అప్పులు గావించి- అప్పులిచ్చి, కాలీచఁజనుచు= ఈ కాళ్లతోనడచుచు,ఆయవారము= ధాన్య యాచన, తూఁ గాడు= అల్లలాడు, పె

186

హరిశ్చంద్రోపాఖ్యానము

బేలు రాలేడుసిగ పడతలఁ గణితి
పిల్లికన్నులుఁ గుఱుపీచుమోసములు
నుల్లి గడ్డంబు నత్యుగ్రదృష్టియును
దళ మైనపట్టెవర్ధనములు వేళ్ల..................................500
నులిచినదర్భలు నుదుటిపై బొరుసు
నొరుగునోరును వెలి కుఱికిన పండ్లు
యరవి దోవతియు పంచాంగంబు ముష్టి,
బరఁగినకరతిత్తి పతాల సంచి
యెరిగిన గొడుగును నుసి రాలుకోల
విడువక గోహత్య వ్రేలుచు నలుక
ముడివడ రాఁజుమోమును గల తన్ను
'నదె వచ్చె నడ పీనుఁ గనుచు నంతంతఁ
గదియుచు మై పొనుకంపున కెడసి
తొలఁగుచుఁ బురజనుల్ తుప్పున నుమియఁ
బలుమాఱుఁ గెలఁకులు పరికించు కొనుచు.................510.
'నెవ్వఁడు మృత జాతుఁ డెవ్వఁడు రుగు
డెవ్వఁడు దుర్మృతుం డీపురిలోనఁ
|బేతవాహకునిగాఁ బిలువ రెవ్వరును

...................................................................................................

తల తల వెనుక కుజుపీఁచు మాసములు = పీఁచువంటినులిమీసములు, ఉల్లిగడ్డము ఉల్లివంటిగడ్డము,నులిచిన= మెలిఁబెట్టిన, బొరుసు: బుడిపి, ఒరుగు= వంకర, ఆర విచోవతి = కరలదోవతి, కరతి త్తి=గీతగీతలు గా నుండు చిన్న సంచి, నుసి = పుప్పి, అలుకముడివడ = కోపము నెలకొనఁగా, పొస్తుకంపునకు = పొస్తుకాయదు ర్గంధమునకు, మృతజాతుఁడు=చచ్చినవాఁడు, పుట్టినవాఁడు, గుగుఁడు=రోగి,దు శృతుఁడు= చెడుబావుఁ బొందిన వాఁడు-పత నాదుల చే అకాలమరణమునొం) దినవాడు, ప్రేత వాహకునిగా = పీనుఁగు మోయుటకై, బాతి గాన్ = మిక్కిలి'

ద్వితీయ భాగము.

187


బ్రాతిగా వెడలింప బడుగులు లేవు
బొమ్మరాకాసుల భోజనమ్ములకు
రమ్మని ప్రార్థింప రాఁ డొక్క రుడు
పిండివంటలు నెయ్యి బెల్లంబు పప్పు
గండశాంతులఁ దృప్తిగాఁ దిన లేదు
సప్తకంబులఁ బాయసము నెయ్యి పెరుఁగు
తృహస్థ గా జుర్రిత్రేన్ఫంగ లేదు -.............................520
కడికడి కొక మాడ గ్రహణ కాలమున
వడి వీడ దోవతి వదలించు కొనుచు
బరు లుబ్బఁ బృష్టోష్ణ పర్యంతముగను
బెరుఁగువంటకము పేర్పెఁడు దిన లేదు
లేదో మృత్యువు చంప లేఁడొ జముండు
కాదేని చావులు గఱ వాయె జగతి
నీకొట్టికకు విపుఁ డెట్లు చే రెడీని
గైకొని బ్రతుక నే గతి గల దింక
మ్యూక లై జనులు నికూల మై చనిరొ
కాక నా వీనులఁ గవి సెనో చెవుడు..........................530

..............................................................................................


గా, వెడలింపన్ = కాటీకిఁ గొని పోవుటకు, బడుగులు=చిక్కిన దేహముగలవారు, బొమ్మరా కాసుల భోజనమ్ములకు = బ్రహ్మరాక్షసులభోజనములకు, గండశాంతులవ్ = ఉపాయనిష్పత్త్యర్ధమైన నివారణములందు, సప్తకంబులన్= స ప్రకాశ్రాద్ధము అందు - ఏడుగురినిబిలిచి పెట్టుశ్రాద్ధములందు 'తృప్తిస్థ' గాన్ = 'తృప్తుల మైతిమి' అనునట్లుగా, తేన్పంగన్= త్రేపులు విడుచుటకు, కటిక డికి= ముద్దముద్దకు బరులు బ్బి= ప్రక్కలు బలియునట్లు, పృష్ఠ ఓష్ఠ పర్యంతముగను= పెదవి మొదలుకొని వీఁ పువఱకును, పేర్పెఁడు= ఒక టిమీఁదనొకటి గా, కొట్టిక = ఊరు, వీనుల ... చెవుడు,

వావులు ఈయూమునందు చాలఁగలిగియునా చెవుడు చే నాకు వినరాకున్నదోయ 1
88

హరిశ్చంద్రోపాఖ్యానము


శ్రుతిసుఖంబుగ మతి శుష్కరోదనము
వితతంబుగా నేఁడు వినరా దదేల
నని తల పోయుచు నా హరిశ్చంద్ర
జన నాథుమాటలచంద మాలించి
'చిక్కెఁబో నేడు నా చే మత్తికాఁడు
చిక్కులఁ బెట్టి కౌశికుని మెప్పింతు
వెదక బోయినదీఁగ విస్మయం బొదవఁ
బదములఁ దగిలె నాభాగ్యంబుక తన
బెదరించి వీరల భేద మొందించి
యుదరి పోఁ దోలుదు నుర్వీతు నొండె............................... 540
మనసులో దయ వుట్ట మాటలు వన్ని
పనివడ బోధించి భావంబు గలఁచి
యింతి నమక యుండ నిపుడె మాన్పింతు
నంతట మితి దప్పు నడఁగు సత్యంబు'
నని మడిమెలు మోవ కతి సంభ్రమమునఁ
గునుకుచు సందడి గోపంబు నిగుడ
మూఁగిన ప్రజఁ గోల మొ త్తి దట్టించి
లోఁగక పాయఁ దోలుచుఁ జను దెంచి
తన మ్రోల నిల్వ నాతనిజన్ని దములు

...................................................................................................................

నుట. శుష్కరోదనము = కన్నీళ్లు లేని యేడ్పు, మ త్తికాఁడు = వెర్రివాడు - వెదకబోయినమష్యుఁడు తానే యెదురుప డెననుట, మడిమలు మోవక = కుదికా ళ్లు ఊనక - అతిత్వరితము గాననుట, కునుకుచు=కునిసినడచుచు, సందడిఁగోపంబు= జనులకలకలమునకుకోపము, దట్టించి = ఆదల్చి, 'పాయఁదోలుచుక్ = త్రోవయిచ్చు

నట్లుతఱుముచు, గుఱుకొని= యత్నించి, తెలిసి మరికాని= తెలిసికొని యేకాక,

189

ద్వితీయ భాగము.

గనుఁగొని విపుఁడు గాఁబోలు ననుచుఁ.......................550
జెయ్యెత్తి మొక్కినఁ జిఱునవ్వు నవ్వి
యయ్యవనీశుతో నవ్విపుఁ డనియె
'గుఱుకొని నిన్ను నీకులమును దెలిసి
మఱి కాని దీవింప మాకు దోషంబు
నీ వెవ్వఁడవు మరి నీకుఁ బేరేమి
యీవిధి సతి నమ్మ నే యక్క మీద వె
నుడుగక వాతఁ డొవ్వుఱుకంగఁ గుడిచి
గడిపోతువ లె మేనికండలు పెంచి
కసవుఁ గట్టెలు మోయఁ గాయ పం డ్లమ్మ
బసులజంగిలి గాయఁ బాలేరు దున్న
గొఱమాలిముచ్చుల గూడి దూరమునఁ
జెఱవట్టి తెచ్చిన చెలువ నా లనుచు
మొఱఁగి యీరీతి నముట మాకుఁ దోఁచె
నెఱిగి రేఁ దలవరు లిప్పుడే పట్టి
కొఱుతఁ బెట్టుదు రోరి రోమలి విడిచి
పఱచి నీ ప్రాణముల్ బ్రతికించు కొనుము......................560.

.........................................................................................................

క్కఱ=ఆవశ్యకత, వాతన్= నోటియందు, క్రొవ్వు ఉఱుకంగన్ =క్రొవ్వు వెలికివచ్చునట్లు, కుడిచి = తిని మిక్కిలి క్రొవ్వుపట్టునట్లు తిని, గడిపో తు-ఆఁబోతు, పసులజంగిలి= పశుసమూహము, పాలేరు= మేఁడిపొలికిదు న్నెడు మడఁక , కొఱమాలి= ప్రయోజనము లేక పోయి- మిక్కిలి బలసియున్నందులకు క సవు మొద లైన వానిని మోయుటకుఁగాని కాయలు పండ్లు అమ్ముటకుఁగాని పసుల ను గాచుటకుఁగాని పాలేరు దున్నుటకుఁ గాని ప్రయోజనము లేనివాఁడ వైయను

ట, ఆలు= పెండ్లము, మొఱఁగి= ఏమరించి, ఎఱిఁగి రేఁ దలవరులు తలారులు తెలి
190

హరిశ్చంద్రోపాఖ్యానము

కా దేని వరువుడు గా దార మోసి
మోదంబుతోడ నీ ముదిత మా సఁగు
మెనయంగ నీతప్పు లేము వహించి
కొని కాచెదము బ్రహకొడుకు వచ్చి నను'..................570
నని పెక్కు దుర్భాష లాడెడువిపు
గనుఁగొని విభుఁ డాత్మ..గలఁగ కిట్లనియె
'నరసి చూడఁగ నేర వకట దురాత,
పరిణామములు బహుభాష లే కాని
జగతిపై సూర్య వంశమునఁ ద్రిశంకు
జగతీశునకుఁ బ్రశస్తంబుగాఁ బుట్టి
యేరాజ్య మొనరించునీ కాలమునకుఁ
జోరశబ్దము సెవి సోఁకె నీ చేత
మఱి బ్రాహ్మణుఁడు వచ్చి మఱుగుఁ జొచ్చినను
దజలక రక్షింపఁ దగుఁ గాక మాకుఁ.........................580

........................................................................................................

సికొని రేని, వరవుడుకా : దాసి, దారపోసి దానము చేసి, ముదిత =స్త్రీ,ఆ త్మన్ =మనస్సునందు, పరిణామములు= బింకములు. ఏ... కాలమునకు = నేను రా జ్యము సేయుచుండిన యింత కాలమునకు, చోరశబ్దము ... నీ చేతన్ = నీవు చెప్పఁగా చోరుఁడనుపలుకు నా చెవులఁబ డెను. పట్టిశబ్దమే పడెననుట చే నిజముగా చో రుడు కలుగ నే కలుగఁడయ్యెననియు, ఆశబ్దము ఇంత కాలమున కిప్పుడె వినిఁబ డెను. ఇంతకుఁ బూర్వము శబ్దమునుగూడ విన్నది లేదనియు హరిశ్చంద్రుని ధ ర్మోత్తరపరిపాలన మహిమాతిశయము దెలియునది. 'నారాజ్యమందు చోరశబ్ద మే వినఁబడకుండఁగా రాజగు నేనా చోరుఁడనగుదునని కాలకౌశికుని నే -పొడుచుట యూహ్యము. కాలకౌశికుఁడు చంద్రమతిని దొంగలించి తెచ్చితివా యన్నందుల కిదియు తరము.ఇఁక కోమలిని మాకు దానము చేసితి వేని నీతప్పులను మేమారోపించుకొని నీక పాయము లేకుండఁ జే సెదమన్న కాలకౌశికుని వాక్య

మున కుత్తరమిచ్చుచున్నాఁడు 'మరి... బాఱఁదగునే బ్రాహ్మణుఁడు భ

ద్వితీయ భాగము.

191


బరభయంబునఁ జిక్కి పారినీ మఱుఁగుఁ
జోరఁ బాఱ దగునె యి యీచొప్పగు నేని
బాణాసనం బేల బాణంబు లేల
ప్రాణంబు లేల కృపాణంబు లేల
ప్రబలమత్తేభ కుంభస్థలమాంస
కబళమహోల్లాసకంఠీరవంబు
ముదిసిన నాఁకొన్న ముట్టఁ జిక్కి నను
బొదలుమాంసము డించి పులు 'మేయఁ జనునె
దారుణక రవాలధారాహ తారి
వీరకోటీరనవీనమాణిక్య............................................590
రంగవల్లీ రణరంగ విఖ్యాత
మంగళ విజయరమాకరగ్రహణ

...................................................................................................................


యపడి మమ్ము శరణుసొరఁగా మేము కాపాడువార మే కానీ మేముభయపడి నీబోఁటివాని మఱుఁగుఁజొచ్చువారము గామనుట, ఈచొప్పుఅగు నేని= ఇట్లు ని న్న శరణుజొచ్చుట మాకుఁగలి గెనేని, బాణాసనంబు = విల్లు, కృపాణము=క త్తిప్రబల ... కంఠీరవంబు - ప్రబల= మిక్కిలి బలవంత మైన, మత్తేభ =మదపుటే నంగుల యొక్క, కుంభ స్థల= కుంభ స్థలములందలి, మాంస=మాంసమును, కబళ = మ్రింగుటయందు, మహోల్లాస = మిక్కిలియుల్లాసముగల, కంఠీరవంబుజ సింహ ము, ముట్టజిక్కి నను=పూర్ణముగా పట్టువడినను, పులు=గడ్డి, దారుణ ... ప్రళ సము - దారుణ భయంకరమైన, కరవాల ధారాబక త్రీవాదర చేత, హత = చంప బడిన, అరికా శత్రువుల యొక్క, వీరకోటీర = వీర సూచకము లైన బాహుపురులం చలి, నవీనమాణిక్య=క్రొత్తమణుల చేత నైన, రంగవల్లీ = మ్రుగ్గులుగల - శత్రురా జుల భుజములను నఱుకఁగా వారిబాహుపురులనుండి రాలినరత్నముల చే మ్రుగ్గు లు పెట్టఁబడినయనుట, రణరంగ = యుద్ధరంగమనెడి పెండ్లిరంగమందు, విఖ్యా

త-పొగ డ్తకెక్కిన, మంగళ =శుభమైన, విజయరమా= జయలక్ష్మి యొక్క, కర
192

హరిశ్చంద్రోపాఖ్యానము


శస్త మై నట్టియాక్షత్రియో త్తముని
హస్త మేరీతిని నలవడుఁ గృషికి
వడి నుక్కుదాయంబు వచ్చిన ధైర్య
ముడిగిన దైన్యంబు నొందిన నగ రె
మున్ను విశ్వామిత్రమునిమఖంబునకుఁ
బన్నుగా నే నొడఁబడుధనంబునకు
మితిఁ జేసి చెల్లింప మేకొని వచ్చి
సతి నమెదను హరిశ్చంద్రుఁ డన్ వాఁడ ..........................600
జులుము లేటికి నొండుసుద్దులు మాని
తొలఁగుము నాలోని తుందుడు కార్ఫ
గలవాఁడ వేని నిష్కములు వేవేలు
వెలఁదికి విలువగా వేవేగ నిమ్ము
నావుడు విపుం డానరనాథుఁ జూచి
‘భావింప నీ వాక్య పద్ధతిఁ గొంత
నిజము గానఁగ వచ్చె నీయెడ మాకు
విజయోస్తు భూపాల విను మొక్క బుద్ధి

...................................................................................................................

గ్రహణశ స్తము=పాణిగ్రహణము చేత పొగడ్త కెక్కినది. ఇది హ సమునకు వి కే వణము. ఇట యుద్ధరంగమును పెండ్లి గాను అందు రాలిన రాజుల కోటీరమణు లు మ్రుగ్గులు గాను పెండ్లికూతురు జయలక్ష్మి గాను రూపితములని తెలియునది, మ్రుగ్గులు గాఁ దీరుటకు లెక్క లేనిరత్నములు రాలవలయునుగాన లెక్క లేని శత్రు రాజులు హతులగుట సూచితము. శత్రురాజుల ననేకులవధించి జయముగొన్న వాడననిభాషము. కృషికి! ఇదున్నుటకు దున్ను కొని బ్రతుకరాదా యన్నందు ఆ కిదియు త్తరము. ఉక్కు దాయంబు = మిక్కుటమైనయాపద,

మితిఁజేసి=గడుపు పెట్టి, మేకొని= ఒప్పుకొని, జులుములు=దుండగములు, నాలోని తుందుడు

193

ద్వితీయ భాగము.


నప్పులు గొని త్రోచుననువులు గొన్ని
చెప్పెద నా మాటఁ జేసెద వేని.....................................610
తనడంబు దప్పక ధనికులయిండ్ల
కనువునఁ జని వారి కనురాగ 'మొదవ
రిత్త మొక్కులు 'మొక్కి ప్రియములు పలికి
నెత్తిఁ జేతులు పెట్టి నిక్కముల్ నొడివి
తెరలఁ దియ్యనిపండ్లతీపులు మరిపి
చరణ సేవలు సేసి చనవులు మెఱసి
యిములఁ దన పేరి నెంతయుఁ జెప్పి
నమ్మికఁ బుట్టించి నయములు సేసి
గడుసరిమనసులు గరఁగించి పుచ్చి
జిడికిరింతలు గట్టి చెవి యాన కున్న...............................620

  • [29](బోలుసొములు లక్కబొదవులు గాజు

.............................................................................................................

క= నామనస్సులోని కొంచలము - తాపమనుట. అప్పులుగొని త్రోచుననువులు= అప్పులు దీసికొని యియ్యక మ్రింగి యుబుసుపుచ్చు నుపాయములు, డంబు= ఆటో పము, రిత్త మొక్కులు=మనః పూర్వకము కాని నమస్కారములు, నెత్తిఁ జేతు బ.... పలికి= నెత్తిమీఁద చేయి పెట్టి తాము చెప్పిన దెల్ల నిజములని శపథములు చే నీ, తెరలఁ దియ్యనిపండ్ల తీపులు మరిపి = చక్కఁగా మాగిన పండ్ల తీపులయందు వా రిని మరిగించి వశము చేసికొని, పేర్మి= పెద్దఱికము, గడుసరిమనసులు=కటువు లై నమనములు, చిడి కిరింతలు= మోసపుమాటలు, చెవియానకున్నన్ = ఇట్లు యుక్తు లుచేసి మోసములుపన్నియు తమమాటలు వారి చెవిలో నెక్కకున్న యెడల నను ట,ఇఁకచేయవలసిన మోసపుఁ గార్యములను జెప్పుచున్నాడు:-లక్క బొదువు ...............................................................................................................

  • 194

హరిశ్చంద్రోపాఖ్యానము

జాల మాయ పసిఁడిజలపోసనములు
లోహాచితంబు లె లోలత మించు-
నేహరంబులు గొన్ని నీలాల నమర
గుప్తంబుగా రాత్రి గొనిపోయి దీప
దీప్తి డొమ్మెఱుఁగుల దీపించు నట్టి
“రాజుల చెవిఁ బడి రవ్వ గాకుండ
Hజతో నివి దాఁచు డొండెడ'ననుచు
మొఱుగు మొజంగిన ముద్రగా ముడిచి
- తఱుచుగా లక్క ముద్రలు మీఁద నొ త్తి......................630
యాహికంబులు పెట్టి యవి దక్కు మితులు
సాహసంబునఁ బల్కి సారులఁ బెట్టి
ప్రబలంబుగా వడ్డీ పాజక మున్న
కుబుసంబులోఁ జే మగుడ్చు చందమున


.........................................................................................................

లు=లక్కబొందులు, మాయపసిఁడి జలపోసనములు= కాకిబంగారు మొలాములు, లోహాచితంబులు-ఇనుముతోఁ జేయఁబడినవి, నేహరంబులు= తావళములు, దీప... దీపింపన్ = దీపపు వెలుతురున ! తళతళమని క్రొత్త కాంతులు ప్రకాశించునట్లు. బూటక పుసొమ్ములు గావున పగటఁగాక రాత్రులందు దీపము వెలుతురున దానిక ల్లఁదనము వెలువడకుండునట్లు, రాజులు ... గాకుండ- రాజులువినిరా యీ సొమ్ము లుగయికొందురు గావున వారి చెవిలోఁబడి యల్లరి కానట్లు. దాఁచుఁడు=దా చి పెట్టుఁడు, మొఱగు మొఱంగి= మోసపుమాటపలికి, ముద్రగాముడిచి = కట్టగా కట్టి-విప్పియిచ్చినచోబూటకముబయలుపడుననిభావము,తఱుచుగా...నొ త్తి మిక్కిలియు లక్క గాల్చి విప్పకుండునట్లు ముద్రలు వేసి, యాహికములు=కుదు లు, మితులు సాహసంబునక్ పల్కి=గడువులు తప్పితే ఈయెట్టు ఆయెట్టు ఈ సాహసవాక్యములాడి, ప్రబలముగా .. మున్న = మిక్కిలిగా వడ్డ పెరుఁగకుము

ను పె, కుబుసంబులో... చందమున- చేయి చొక్కొలోఁదూర్చి మరలఁ దీయ

193

ద్వితీయ భాగము.

నచ్చుగాఁ దీర్తు మాయ ప్పని కొన్ని
యచ్చిక బుచ్చిక లాడి పత్రములు
గెంటక యిచ్చి యాక్రియ నూరు వేలు
గంటఁబిడకలు గట్టి గైకొని పిదప)
లండుబోతులఁ దనలాగు 'పెన్ లజ్జ
బండలఁ గొందఱఁ బాటించి తెచ్చి
టక్కరి పూట తాటలు సేసి ధనము
చక్కనఁ గైకొని జరిగినపిదపఁ
దనజాడ దెలిసి క్రంతకుఁ దీసి రేని
మనమున బెదరక మానంబు విడిచి
కట్టుఁ గొట్టును బడి కరకరి కోర్చి
చట్టు పెట్టిన మోచి సరి యాక నుండు
ఘటిక సిద్ధుఁడు రాయిఁ గొట్టిన గొడ్డ
లటమట కాడు మహామాయలాఁడు

...................................................................................................................

నట్లు-అతిరహస్యము గాననుట, అచ్చిక బుచ్చికలు=కలుపుగోలుతనములు, కంట ...గట్టి=కంటిలో పిడకలుగట్టి-కన్నుఁ బామియనుట. లండుబోతులు=దుండ గీండ్లు, దనలాగు పే లబండల = తనవంటి లజ్జమాలిన ధూర్తులను, టక్కరి పూఁట తాటలు=జిత్తులమారి పూఁటకాఁపుమోసములు- మోసపుపూఁటకాఁపుత నములనుట- మోసగాండ్రను పూఁట కాఁపులుగా పెట్టి యని భావము. జరిగినపిద ప= తాను దీసికొన్న ధనమంతయు వ్యయ మైనపిదప, తనజాడ = తానుధనమంత యు లేకుండుజాడ, క్రంతకున్ = రచ్చకు, కరకరి క్రూరత్వము, చట్టు=చ ట్రాయి-దండ నార్థము పూర్వము చట్టురాతిని అపరాధుల పై మోపించుట గలదు, ఆఁక = చెఱ, ఘటిక సిద్ధుఁడు=గుళిక గలయోగసిద్ధుఁడు, రాయిఁగొట్టిన

గొడ్డలి= రాతిని బగులఁగొట్టిన గొడ్డలి,అటమటకాఁడు = 'మోసగాడు, గడుసు
196

హరిశ్చంద్రోపాఖ్యానము

గడుసు తుంటరి జోగి గ్రక్కిన ముడుసు
ముడి దిన్న నక్క ముమ్మోటు పిసాళి......................650
బలు క త్తి రాతికిఁ బాసిన గొంటు
ఇలలోన నిట్టి మ హేంద్రజాలకుని
చేపడ్డదనములు నేరునే మగుడ
వాపోవునే పిల్లి వడిఁ దిన్నకోడి
విసికితిమని తారె వేసారి యప్పు
లొసఁగినవారెల్ల నొల్లక తొలఁగ
నెమ్మది దానుంట నేర్పది గాక
నిమ్ముల నీరీతి నిల్లాలి నమ్మి
దీనత మైఁ దల దెగి పడి యప్పు
పూని దీర్చెడనంట బుద్ధిలో పంజె..........................660
పెట్ట లేనని తొట్టు పెట్టి బొంకినను

........................................................................................................

తుంటరి= మొఱకుఁ డైన దుష్టుఁడు,జోగి క్రక్కినముడుసు=భిక్షుకుఁడుమిసనయె ముక, ముడి దిన్న నక్క =బుడిపినిదిన్నట్టినక్క, ము మోటు = మూఢశిరో మణి, పిసాళి జిత్తులమారి, బలుక త్తిరాతికిఁ బాసినగొంటు = పెద్దనల్ల రాతికినలఁ గక తప్పించుకొన్న గొంటుపక్క, మహేంద్రజాలకుని = ఇట్టిమ హేంద్రజాల ములు సేయువాని-మాయలాని, చేపడ్డ = చేత దొరికిన, చేరు నే మగుడ = ఇచ్చిన వానికి మరల లభించునా? లభింపవనుట. వాపోవు నే...కోడి = పిల్లి తిన్నట్టి కోడి అఱచునా-మాయలాని చేతఁబడ్డ ధనము మరల దక్కునా అనుట. వినికి - నేర్పు- అప్పులొసఁగిన వారెల్ల విసికితిమని తారెవేసారి అడుగ నొల్లక తొలఁ గఁగాఁ దాను నెమ్మదినుంటయే నేర్పు' అని అన్వయము. అది గాక ఆరీతిని చేయక, తల దెగి పడిన్మ్యప్పుదీ ర్చెదనంట = తల తెంచుకొని యప్పు దీర్చుకొనె దననుట , తలపోయిన వెనుక అప్పుతీర్చినను తీర్పకున్న ను సమాన మేయని భావ ము " పెట్టలేనని ...మునికి' - నీవు ధనము ఇయ్యఁజాలనని యొట్టు పెట్టి అబద్ధమాడి

...

197

ద్వితీయ భాగము.

గట్ట వచ్చు నె నిన్నుఁ గౌశిక మునికి'
నావుడుఁ జిఱునవ్వు నవ్వియా రాజు
“వావిరి మీబోటి వదరు పెద్దలకు
నుప దేశ మొనరింప నోపుఁ గా కిట్టి
విపరీత బుద్ధులు విన నింపు గావు
బుజ్జగింతలుఁ బొరి బొంకుమాటలును
మజ్జాతు లగువారిమాటలు గావు
జజ్జరికాడ నీచనుత్రోవఁ జనుము
నెరయ నీఁ గొన లేని నీవను వట్టి........................670
పరవమాటలు సహింపవు దల' మనినఁ
గాల కౌశికుఁడు భూకాంతుని సత్య
శీలంబునకు మదిఁ జిత్రంబు నొంది
పలికె నిట్లని 'మహీపాలక నీకు
వల నొప్ప నీదురవస్థలు దొలఁగు
వెరవుఁ జెప్పిన నీకు విరసమై తో చెఁ
బరికించి చూడ నీ భాగ్య మెట్టిదియు


.................................................................................................

నప్పటికిని విశ్వామిత్రునికి నిన్ను బంధింపశక్యమగునా? కావున బొంకి తప్పిం చుకొనుమనుట, ఓపుఁ గాక = శక్యమగును గాని, బుజ్జగింతలు బతిమాలుకొనియూఱడించుటలు, బొంకుమాటలు= అసత్య వాక్యములు - అనఁగా, ఇయ్యవలసి సధనమును ఇయ్య లేనని బతిమాలి బుజ్జగించుట గాని ఆధనమును తీసికొన్న దేలేదని బొంకు లాడుట గాని యనుట, మజ్జాతులు = నాజాతిగలవారు = క్షత్రియులు, జజ్జరి కాఁడ = పంచకుఁడా, నీచను త్రోవఁజనుము నీ దారిని నీవుపొమ్ము- లేని జోలి పెట్టుకొనకుమనుట, ఈ గొన లేనినీవు = నేను ఇయ్యంగా వెలయిచ్చికొన లేని వాఁడవగునీవు, వట్టి పరవమాటలు వ్యర్థము లైన పలుపమాటలు -

198

హరిశ్చంద్రోపాఖ్యానము

మాకుఁ దోఁచిన దొకమాటఁ జెప్పి తిమి
కాక నీమతి కింతకంటకం బైన
హితవుఁ జెప్పంగ మాకేల నీ కెట్టి..................................680
గతి వుట్టఁ గల దట్లు గానిమ్ము మీఁద
నాలి నంగడిఁ బెట్టి యమెడు నీకు
జాలి లేదఁట మాకు సంతాప మేల
కోరినధన మెల్లఁ గొమ్మని యెల్ల
వారును జూడ సువర్ణ నిష్కములు
రూపించి చౌకంబు ద్రోచి చెల్లించి
భూపాలునకు నిచ్చె భూసురో త్తముఁడు
వలనొప్ప ముఖపద వాసన కెగరు
కలికితుమ్మెదల రెక్కలగాలి: గదలి
తిలకించుచంద్రమతీ దేవికురులు...........................690
బలువిడిఁ గృపమాలి పట్టి రాఁ దిగిచి
పాపట నేటి దప్పం బయ్యెద జాలు
వీఁపున నెటివేణి విరిసి తూఁగాడఁ
బదములు దొట్రిల్ల బొష్పముల్ రాల
వదనంబు సెమరింప 'వాతెఱ గంద

లేక ప్రవాహమువలె ఎడ తెగక వదరునట్టిమాటలు, తలము-తొలఁగిపొమ్ము, కంట కంబు = అసహ్యము, నీ కెట్టిగతి... మీఁద = నీకుమీఁద ఏగతి రానున్నదో యబ్లె యదియగుఁగాక మాకేమి, చౌకంబుడ్రోచి = నాలు గేసిగా ఎంచి, ముఖప ద వాసన-మోము దామర యొక్క తావి, కలికి=నీటు, తిలకించు = తళుకొత్తు, కురులు=తల వెండ్రుకలు, బలువిడి = బలవంతముగా, తిగిచి= ఈడ్చి, నెటిదప్పక్ =

తీరు చెదరఁగా, తొట్రిల్లర్ = తడఁబడఁగా, వా తెఱ= పెదవి, రాయక్ =

ద్వితీయ భాగము.

199


ఘనకుచంబులు రాయఁ గౌ నసియాడఁ
దను వెల్లగంపింపధైర్యంబు వదల
దివుటమై బెబ్బులి ధేనువుఁ బట్టి
గవిఁ జేరఁ గొనిపోవు కై నడిఁ దోఁప
నాలు గేనడుగులు నడవ నీడ్చుటయు........................700
బొలవత్సము ఛాలెఁ బాయక వెనుక
దగిలి వాపోవుచుఁ దల్లిఁ బో నీక
బిగియఁ పయ్యెదకోంగుఁ బెనఁచి చే పట్టి
యాక టఁ జంటి కర్రాడుచు ముద్దుఁ
గూఁకటి తూఁగాడఁ గునియుచు నున్న
సుతు లోహితాస్యునిఁ జూచి భూపాలు
డతిదుఃఖ తాత్ము డై యశ్రువు లొలుక ఁ
దాలిమి వదలి గదదకంఠుఁ డగుచుఁ
గాల కౌశికునితోఁ గదిసి యిట్లనియె
‘నెలమి ధేనువు విక్రయించుచోఁ గ్రేఁపుఁ......................710
దొలఁగింతు రే తల్లిఁ దొలఁగఁగాఁ జేసి
నాకులభూషణు నాకూరి పట్టి
నీకోమారునిఁ గొను మిచ్చెద నీకు
విలువ వీనికి వేయి వేలు నిష్కములు
నల నొప్ప నొసఁగుము వసుధామ రేంద్ర

............................................................................................................. ఒకటితో నొకటి యొర సికొనఁ గా, ఆసియాడమ్ =అల్లలాడగా", అవుట మైకన్

కోరికితో, గవిన్ - గుహను, బాలవత్సము = పసిదూడ, వాపోవుచు[మార్చు]

ఏడ్చుచు, అట్టాడుచు= ఆతుర పడుచు,తూఁగాడన్ = చలింపఁగా,కునియుచు = ఆఁకటి చే చక్కఁగానడవలేక కున్సియడుగులు పెట్టుచు, కేఁపు= దూడ, తల్లి

దొలఁగఁగాఁజేసి కేఁపుఁ దొలఁగింతు రే, అని యన్వయము, విలువ= వెల, విల్వ
200

హరిశ్చంద్రోపాఖ్యానము

నావుడు వివ్రుఁ డానర నాథుఁ జూచి
“నీవు సెప్పినమాట నిక్క మంతయును
గోవు విల్వఁగఁ జన్నుఁ గుడి చెడి కేఁపు
గోవుతోడనె జట్టిఁ గూడి రావల దె
యక్కఱ దీ రెడునం దాక ధనము....................720
నెక్కడఁ గొని వత్తు రెవ్వరెందైన
నోడక నమముల కోర్చి యీ కల్ల
లాడంగ మా జంఘ లదురు చున్న వియుఁ
జక్క నీ వచ్చిన బాడఁ బొ మింక
జిక్కఁడు కాలకౌశికుఁడు నీ చేత
యిచ్చి నాచేఁ గొన నీశుండు నోపఁ
డచ్చి నా యెదుర బ్రహ్మకుఁ బోవ రాదు
పురిలోన బందెలపో తీతఁ డనఁగఁ
బరఁగ నా పేరిఁ జెప్పఁగ మున్ను వినవె


గన్ =అమ్మగా, జట్టిఁగూడి రాజులదే =వెలలోఁ జేరిరావలదా - ఆవు వెలలోనే దూడ వెలయుఁ జేరిపోయినదనుట, అక్క,ఱ ... రెం దైన్ = ఎక్కడఁగాని ఒక్కరియప్పునిర్బంధము తీఱునంతవఱకును వారికిఁ గావలసినంత ధసము ఎవ్వరు గాని ఎక్కడనుండి కొని పచ్చియియ్యఁజూలుదురు-నీ కెంతయప్పో అంతధనము నా కియ్యం దరము గాదనుట, అఘములకున్ = పాపములకు -అబద్ధమాడు టవలనఁగలుగు పాపములక నుట, జంమలు=పిక్కలు- నీయొద్దనుండఁగూడక వేగ పోవలయునని నాపిక్క లదురుచున్న వనుట, చక్కన్ =సరిగా, ఇచ్చి నా చే గొనక్ = నాకు ఒక టియిచ్చివై చి మరలదానిని నాయొద్దనుండి తీసికొనుటకు - నీకొడుకును నాకిచ్చివై చి మరలవానిని దీసికొనిపోవుట కవిభావము,అచ్చి = అప్పు

పడి, బండెలపోతు= చెఱ పెట్టుస్వభావముగలవాఁడు, కాలదట్టింతు = కాలితో

ద్వితీయ భాగము.

201

కాలరుద్రుని నైనఁ గాలుని నైన................................730
కాల మృత్యువు నైనఁ గాల దట్టింతుఁ
బురుషుఁ డెవ్వఁడు నీకుఁ బూని న న్ని చట
నరుదుగా నౌను గా దనువాడు గలఁడె
వీఁడు నాదాసుఁడు వెలఁది నాదాసి
యేడఁ బుత్రుని నమే దిఁకఁ జెప్పు' మనిన
విని యప్పు డాధూ రవిప్రునితోడ
మను జేశుఁ డలుక తో మఱయు నిట్లనియెఁ

గొనియాడఁ దగువి ప్రకులమునఁ బుట్టి
చనునె నీకిట్టియసత్య వాక్యములు
ప్రొద్దున లేచి నీ మొగముఁ గల్గొనిన..........................740
యద్దినంబున వచ్చు నాపద లెల్ల
ని న్నొకవిప్రుని నిందింప నేల
మిన్నక తలపోయ మేదినిలోనఁ
గూడు నడ్డికి నిచ్చి కూర్చెడివారి
జాడ లిట్టివియె యాశ్చర్య మేటికిని
గులము ప్రధాన మే గుణము లేకున్న
గలశాబ్ది బుట్టదె కాలకూటంబు
వెడమాట లన్నియు విడిచి వే యిప్పు

డడిగిన ధనము సయ్యనఁ జౌక మెన్ని


...........................................................................................................

దన్ని వై తును, నీకుబూని= నీకుఁ గావచ్చి, ఔను గాద నెడి వాఁడు = లేదుకద్దని చెప్పఁగలవాడు, కూడుపడ్డ కిక్ = కూడెడునట్టివడ్డికి, కూర్చెడి వారి= ధనము గూర్చెడి వారి, కలశాభి = పొలసముద్రము, కాలకూటము = హాలాహలము, వెడమాటలు= వెట్టిపలుకులు, చౌక మెన్ని = నాలు గేసిగా లెక్క పెట్టి, కాఱులు= 1.

202

హరిశ్చంద్రోపాఖ్యానము

కొడుకుఁ గోమలిఁ దోడుకొనుచు నీ యింటి..........................750
కడ కేఁగెదవొ లేక కాజులు వల్కి
కినిసి బ్రాహ్మణుని శిక్షింప లేరనుచుఁ
జెనఁటికోడిగములు సేసి పోయెద వొ'
నావుడు విప్రుఁ డన్న రపతి కనియెఁ
గావరంబున నోరు గడవ నాడెదవు
విడి కల్ల లాడినఁ జేరునే ధనము
కడపట నీకు నక్కఱ దీర దేని
పన్ను గాఁ గత్తియు బలపంబుఁ బూని
కన్న పెట్టుము సిరి గలవారియిండ్లు
'నీచాత్మ ప్రొద్దున నీవు నా మొగముఁ..................................760
జూచితి గాన నాసొమ్ము నీ కబ్బె
దివిరి నాకులము నిందించి నాగుణము
వివరింప నీ కేల వియ్య మందెద వె
నను విప్రుఁ డని కాచినాఁడవు గాక
కినిసి కాకున్న శిక్షింతువే నీవు

..........................................................................................................

=రజ్జులు, కినిసి ... రనుచు= ఎవ్వరు గాని బ్రాహణుని కోపించి దండింపఁజాలరని చెనఁటికోడిగములు = వ్యర్థ పుతుంటతనములు, కావరమునన్=క్రొవ్వు చేత, నోరుగడవనా డెదవు =నోరికి మించిమాటా డెదవు నోట సెంత చెప్పవచ్చునో యంతకు హెచ్చు గాపలి కెద పనుట, “చెడి ...ధనము = ఐశ్వర్యము చెడినవాఁడు అబద్ధములాడి సంపాదింపవలయునన్న యెడల ధనముపచ్చి చేరు నాయనుట, అక్కఱ=అప్పునిర్బంధము - పెండ్లమును బిడ్డను అమ్మికూడ అప్పుదీఱ దేని, కత్తి= కన్నపుఁగత్తి, బలపము = కన్న పుజాయి, నా మొగము........ నీక బ్బె= ఇది హరిశ్చంద్రుఁడు నీ మొగము ప్రొద్దునఁ జూడరాదన్నందులకు కాలకౌశికుఁడు చె.

ప్పినబదులు, 'కినిసి... నీవు కాకున్న నీవు కిసిసిశిక్షింతువే = బ్రాహ్మణుఁడనికాక

203

ద్వితీయ భాగము.

కటకటా వెఱచునె కాలకౌశికుఁడు
కుటిలవిచార నీగూబజం కెనల'
నని యిట్లు బ్రాహణుఁ డామహీవిభునిఁ
గనలి తర్కింప నశుక్రకుఁ డనియె
'వసుధీశ యీవట్టివాగ్వాద మేల .........................770
మసలక మీలోని మలఁకలు వాయఁ
దగవు గావింతుఁ బెద్దలు మెచ్చి పొగడ
దగిలి మీ కది సమ్మతం బగు నేని
లక్షమాడలు ఇచ్చి లంచ మిచ్చినను
బక్షపాతము మాకుఁ బని లేదు గాన
మాట మాటకు బుట్టుమదిని జలంబు
' పాటించి చలమునఁ బ్రబలుఁ గోపంబు
ప్రాపించుఁ గోపంబు పాపంపుబొత్తుఁ
బాపంబు నరకకూపమునకుఁ 'దెరువు
గాన నీ మది దురాగ్రహమును గొంత
మాని నా చెప్పినమాట గ్రహీంపు'
మని చెప్పి ముద మందునా బ్రాహణునకు
మనుజనాథుండు సమతి నిట్టు లనియెఁ
'వటుశిరోమణి భవద్వాక్యంబు మాకు..........................780

..........................................................................................................

పోయినయెడల కోపించి నన్ను చండింతువా, గూబజం కెనల= గుడ్లగూబలవంటి కంటి బెదరింపుల చేత, మలఁక లు=రచ్చలు- అసమాధానములు, తగవు గావింతు = న్యాయము తీరును, మసలక ... బగు నేని 'తగవు మీకు సమ్మతంబగు నేని తగిలి మీలోని మలఁకలువాయ అది పెద్దలు మెచ్చిపొగడఁ గావింతు' నని యన్వయము.

ప్రాపించు ... బొత్తు =కోపము పాపముతో డిసహవాసమును బొందును-కోపము

హరిశ్చంద్రోపాఖ్యానము

బటుబుద్ధిఁ దలపోయ బ్రహమంత్రంబు
పన్ని నచీకటిఁ బాపి వెళ్లింప
సన్న పుదీపంబు సాల దే తలఁపఁ
బిన్న వైనను బుద్ధి, పెద్దవు నీవు
మన్నించి మాన్పుము మావివాదంబు
నీ వెట్లు చెప్పిన నీ చెప్పి నట్ల..................................790
కావింతు' మనిన నకుత్రకుం డనియె
నిఖిలభూజనులకు నిజము నిష్ఠురము
ముఖము స్రుక్కింతురు మోవ నాడినను
బాడి దీర్చుట దొడ్డపని యగు నైనఁ
గూడదు పోలించి గోళ్లు రాయఁగను
మాకుఁ దోఁచినజాడ మానవాధీశ
యీకాంత విప్రున కీ వమునపుడు
బాలుఁ డీజట్టిలోపలివాఁడు గాఁడె
పోలఁ బుత్రున కింతఁ బొలఁతుక కింత
విలువధనం బని వేర్వేజ చెప్పి....................................800
తెలియ నాడక జట్టీ తీర్చితి గాన


...................................................................................................


వలన పాపము సిద్ధించుననుట, బ్రహ్మమంత్రంబు = బ్రహ్మమంత్రమువలె పవిత్రమై త్రోసిపుచ్చరానిదనుట, పన్నిన = అలముకొన్న, పెనుచీకటిని సన్న నీదీపము పోఁగొట్టునట్లు, మా పెద్దతగవును పిన్న పగునీవే తీర్ప నేర్తువనుట, ముఖము .... నాడినను = తుదముట్టన్యాయము తీర్చినయెడల మొగమును ముడుఁచుకొందురు. పాడి... నైన = అయినప్పటికిని అనఁగా ఎవరి కెట్లు పడినను, న్యాయమును తీర్చుట యే గొప్ప కార్యమగును, కూడదు పోలించి గోళ్లు రాయఁగను- నిజమును దెగునట్లు తీర్పు చేయక ఇట్లు అట్లు పోలికలు చెప్పి మిణకరించుచు గోళ్లురాసి"

కొనుట యొప్పుదు, తెలియనాడక = విశదపడునట్లు చెప్పక, దక్కె = కాలకాశి

ద్వితీయ భాగము.

205

సుతునితోఁ గూడ నీ సుందరి దక్కె
వితతంబు గాఁగ నీ వి ప్రముఖ్యునకు'
నని తనచక్కిగా నా ధూర్తవిప్రుఁ
డొనరఁ జెప్పినమాట కుత్సాహ మంది
కాలకౌశికుఁడు నక్షత్రకుఁ గ్రుచ్చి
యాలింగనముఁ జేసి యధిపుక ట్టెదుర
వెక్కిరించుచుఁ గోల విసరుచు నోరు
వెక్క సంబుగ విచ్చి వెడనవ్వు నవ్వి
గంతులు వైచుచుఁ గర తాళగతుల...............................810
నంతంత నాడుచు నంతటఁ బోక
పడుచు లార్వఁగఁ జుట్టుఁ బరువులు వాతి
కడఁగి చూచెడివారిఁ గదలఁ దోలుచును
బలువిస్వరంబులఁ బనసలు కొన్ని
చెలఁగి త్రప్సలు మీఁదఁ జిలుకఁ జెప్పుచును
జెనఁటిగోఁతికి వీర్ల శివ మె త్తి నట్లు
కనుక నిఁ బెక్కు వికారముల్ సేయఁ
జూడ రోయుచు మహీశుఁడు మదిలోన
నేడ ధర్మం బింక నెక్కడితగవు

...........................................................................................................

కుని అధీనమయ్యెను, తనచక్కి గాన్= తనపక్షముగా, కరతాళగతులన్ : చ ప్పెట్లచఱచుచు,పడుచులు=పడుచువాండ్లు, ఆర్వఁగ = పరిహాసముగా కోయని యఱచునట్లు, కడఁగి చూచెడి వారిక్ = తాను పరువులు వారుటను పూనిచూచు నట్టివారలను, కదలఁబోలుచును= పోవఁదఱుముచును, బలువిస్వరంబుల= పె క్కువికారస్వరములతో, పనసలు=ఋక్కులు, త్రప్పలు=నోటి తుంపరలు, చెనఁ

టి... వీర్ల శివము = వెర్రికోఁతికి వీరులయావేశము, కనుక నిన్ - వేవేగ, వంశ నా
206

హరిశ్చంద్రోపాఖ్యానము

లెక్కడిదైవ మిం కెక్కడి సత్య................................820
మెక్కడిభూసురుఁ డేమి చెప్పెడిది
యెలమిఁ జుట్టమువలె నీ ధూరు వడుగు
పిలువనితగవుఁ జెప్పెద నని వచ్చి
కాలకౌశికునిపక్షము పల్కె వంశ
నాళ పన్నగ మాననము ముట్టి నట్టు
లీద్విజాధమునకు నీ యనాచారి
కీ 'ద్వేషచిత్తున కీ పిశాచమున
కీ, క్రూరకర్మున కీ యేభ్యరాన సి
కీ కష్ట చరితున కీ బహుభాషి.
కీ పల్ల వాధరి నీ కీరవాణి..................................830
నీ పుష్పకోమలి నీ పద్మగంధి
నీ చంద్రబింబాస్య నీనీల వేణి
నీ చకోరాక్షి నీయిభ రాజగమన
పులి మెడ గొరియఁ దెంపునఁ గట్టి నట్టు
లలవున దాసిగా నమ్ముకో వల సె'
నని వెచ్చ నూర్చి హా యని తల వంచి
కనుఁగవ బాష్పంబుకణములు దొరుఁగ

............................................................................................................

శపన్నగము= వెదురు గొట్టములోని పాము, జననము ముట్టినట్లు= మొగమునుదాం కినట్లు-గారడీఁడు వట్టి వెదురుగొట్టమును మొదటఁజూపి పిదప హస్తలాఘవ మున దానిని గదల్పఁగా' నందున్న కొయ్య పాము మొగమును దాఁకునట్లు. 'ఇట్లే నక్షత్రకుఁడును ఏమియుఁ గీడు సేయనట్లు తోఁపించి పిదపఁ గీడు చేసినాఁడ నుట ఎభ్యరాసి = దుష్టపం క్తిలో చేరినవాఁడు, పల్లవాధరి చిగుళ్ల వం టి పెదవిగలది, కీరవాణి: చిలుక వంటి మాటలుగలది, ఇభరాజగమన=మేటి

యేనుఁగువంటినడగలది. గొరియ= గొర్రె కడగోరన్=కొనగోటితో,

207


ద్వితీయ భాగము.

నెసఁగుశోకాగ్నుల నెరియుచు నున్న
వసుధీశుదీన భావంబు వీక్షించి
పురపురం జిత్తంబు పొక్క నందంద............................840
కరుణతో నారాజ కాంతాలలామ
సుతుఁడును దాను నేడ్చుచుఁ జను దెంచి
పతి పాదముల మీఁద భక్తితోవ్రాలి
కొడుకు మొక్కించి డగ్గు త్తికఁ బెట్టి
కడగోరఁ గాటుక కన్నీరు మీటి
పొణిపల్లవములు పరగంగ మోడ్చి
'ప్రాణేశ నేటితోఁ బాసితే మముఁ
బాయఁ ద్రోవలు 'నేసెఁ బ్రతిబంధ మకట
మాయురే కౌశికమాయాపిశాచ
మిది మొద లెందున్న నేమి నీయొద్ద..................................850
గదలవు నామనోగతులుఁ బ్రాణములు
నానోముఫలమున నాథ నీ వెలమి
నీనిఖిలోర్నియు నే లెదు మగుడ
నక్షత్రకుండు దుర్నయమున విప్ర
పడు మాడుట కాత బరి తాపపడకు

......................................................................................................

టుకకన్నీరు కాటుకతోగూడినకన్నీరు, మీటి= పోఁజిమ్మి , పాణిపల్లవములు== చిగుళ్ల వంటి చేతులు, 'పాయఁ. . . పిశాచము = విశ్వామిత్రుఁడనెడి మాయపు పి శాచి మనలను ఎడఁబాయునట్లు మార్గములుప న్నెను, మాయురే = ఔరా! మ నోగతులు=మానసవ్యాపారములు, నీయొద్దంగదలవు=నీ పొంతను విడిచిపోవు- ని న్నుఁదప్పమరొక్కటిని నామనస్సు ఎప్పుడు గాని తలఁచుకొనదనుట, నిఖిల-

ఉర్వి= సమస్తభూమి, విప్ర పశుమాడుట = బ్రాహ్మణునిపక్షము గా తగవు చెప్పుట
208

హరిశ్చంద్రోపాఖ్యానము

సన్మార్గవ ర్తి వై జరుపు నీమీఁద
నున్మాదమున రేగి యోహరిశ్చంద్ర
వక్రించెఁ గుళిక సంభవరాహు విపుడు
చక్రాయుధుఁడు నీకు శరణమై మనుచు
నక్రంబు పట్టిననాఁడు గజేంద్రు......................................860
విక్రమంబునఁ గాచి విడిపించి నట్లు
తఱలకు ధైర్యంబు దలఁపకు మము
మఱవకు నీసత్య మహిమంబు' ననుచుఁ
బతి పాదములమీఁద భక్తితో వ్రాలి
సుతుని మొక్కింపంగఁ జూచి యాసతిని
గాలకౌశికుఁ డౌడు గఱచి నిప్పుకలు
రాల వీక్షించి కరాళించి పలికె
'నోసి నాయెడ భయ మొక్కింత లేక
వాసి మాలిన బీదవానిని మ్రుచ్చు
డాసినగతి నిల్చి డాసి నేఁ జూడఁ................................870
బాసి రా నేరక భాషించు టెట్లు?
భాషించి మఱి చాఁగఁబడి మొక్కు టెట్లు?
రోష మె ట్లాదవ దీరోతఁ గల్గొనిన

.................................................................................................... కుశిక సంభవరాహువు = విశ్వామిత్రుఁడనెడి రాహుగ్రహము, చక్రాయు ధుఁడు = విష్ణుదేవుఁడు, ఈవి శేషణము సాభిప్రాయము - రాహువును విష్ణువు తనచక్రముతో నడఁచినట్లు విశ్వామిత్రునిగూడ నడఁచుననిభావము, నక్రం ముసలి, తఱలకు చలింపకు, ఔడుగఱచి -=క్రింది పెదవికొరికికొని, కరాళించి భయంకరముగా, వాసిమాలిన బీద వానిని= పరువు లేనట్టి దరి డ్రుని = హరిశ్చంద్రుననుట, మ్రుచ్చు... చూడన్ = ఇదొంగ సమీపించినట్లు నేను సమీపించి నిలిచి చూచుచుండగా, చాఁగఁబడి = చాఁగిలబడి, ఒదవదు= పుట్టదు,

ద్వితీయ భాగము.

209

బాపు పతివ్రత బాపురే గోల
బాపురే గుణవతి బాపురే ముగుద
విడువు మీ దేశాలివిద్య లొజ్జలకు
బడిత పాఠము దొంగ పదరు లన్నియును
మిఁక నేమరించినెఱిఁగితి నీ మర్మ
యురికి పోఁ జూచెద వూడ నీ వెనుక
దక్కితి వని నమఁ దగదు నిన్నె పుడు.......................880
గుక్కకూఁతుర మెడఁ గోసి పోఁగలవు
రెండు పోనాడిన రేవనిరీతి
నుండ బాలకు నిన్ను నోరంత ప్రొద్దుఁ
గీలుసం కెలఁ గేలఁ గీలించి వీపు
ప్రీలంగఁ గొట్టుదు వెఱుపు లేకున్న
గోఁచి గట్టిననాఁటఁగోలె వీనుఁగుల
నోఁచి గడించినమూలధనంబు


.........................................................................................................

బాపు పతివ్రత = నెబాసు పతివ్రతయఁట, బాపు రేగోల = సెబాసు ఏమి తె లియనిదఁట, బాపురే = సెబాసు గుణములుగలదఁట, బాపు రేముగుద= సెబాసు ముద్దరాలఁట, ఈ దేశాలివిద్యలు=నీ దేశములో కఱచిన యీవిద్యలు, ఒజ్జలకు నీకుఁ గఱపిన వానికి, విడువు=పదలి పెట్టుము - నాయొద్దజూపకుమనుట, బడిత పాఠము = చదివినపాఠము, 'దొంగ పదరులు అన్నియను బడితపాఠము', అని యన్వయము, దొంగ పదట ఫుమాటలన్నియు నే నీవు నేర్చిన చదువులు గాని మరిమంచివి ఏవియుఁ గావనుట, ఊడ నీ వెనుక = నీ వెనుకను విడిచిపోవును - నిన్ను వెంటనంటుచు నే కాచియుందుననుట, రెండుపో నాడీన రేవనిరీతి = రెంటికిఁజెడ్డ రేవనివ లె-ఇదియొక సామెత, ఉండ = ఉండను, ఓరంత ప్రొద్దు= రేయుంబగలు, కేలక్ కీలించి = చేతులకుఁదగిల్చి, గోఁచిగట్టిన నాఁటగోలె= తెలివి పుట్టినది మొ

దలుగా - మొట్టమొదట పసితనమున తెలివి పుట్టినది మొదలు గాననుట, గడించి
210

హరిశ్చంద్రోపాఖ్యానము
కసి బెండపువ్వులగతి రాసి మోసి
పొసఁగునావాతన పొక్కు 'లెన్ని తివి
చేతిత డాటి దుచ్ఛిష్టపు లేమ.................................890
రిబాతి యే నీవంటి బానిసె లెచటఁ
గండ క్రొవ్వున నన్నుఁ గైకొని రాక
మెమొ డొగ్గెదవు మందెమేలముల్ మాను'
మనుచుఁ బట్టఁ దలంచి చూపువ్వుబోఁడి
తనకు మొక్కుచు: బోణితలముల నొగ్గ
బెలుచ నెత్తురులు సిప్పిలఁ గోల మొ త్తి
తలకొన్న కోప మంతటనిల్పలేక
వెఱచి వాపోవుచు వెసఁ బాఱి తండ్రి
మఱుఁగుఁ జొచ్చినసుకుమారుఁ గుమారుఁ
గుదికిలఁ బడ రెట్టఁ గుదియించి తిగిచి....................900
యదరంట మొ త్తి నోరడఁగ జంకించి
పెడమూటలన్ని యుఁ బెనుమోపు గాఁగ

................................................................................................................

=సంపాదించినట్టి, నాహతన పొక్కు లెన్ని తివి నానోట నే మన్ను గొట్టం జూచితివి; చేతితడి ఆఱదు ఉచ్ఛిష్టపు లేము.= ఎంగెలిదానా నిన్ను న చేతి తడికూడ ఆరిపో లేదు. ఒకరు పెట్టినభోజనముఁదిని కడిగన చేయి తడి యాఱకమును పే వారియెడ ద్రోహము తలఁచునట్లు నిన్ను దీసిన క్రొత్త తీయక మును పే ద్రోహము తలఁచెదవాయనుట, బాఁతియే= హెచ్చా, మెండు ఒ గ్గెదవు= మిక్కిలియు ఊఁ గెదవు, మందె మేలములు= చనవులు, ఒగ్గన్ = చాఁచఁగా, చిప్పిల = కాఱునట్లు, తలకొన్న = రేగిన, అంతట నిల్ప లేక - అచంద్రమతిని గొట్టినమాత్రముతో విడువఁజాలక , కుదికిక లఁబడన్ = మొగము పై నెత్తుకొని "నేల మోవ గొంతు ,గూర్చుండు, నట్లు అదరంటన్ =పూర్ణముగా, నోరు అడఁగన్ జం

కించి=నోరెత్తి ఏడువకుండునట్లు బెదరించి, పెడమూటలు = పెద్ద మూటలు

ద్వితీయ భాగము.

211

మడఁ బెట్టి యాచంద్రనుతి నెత్తికెత్తి
'మురి పెంపుఁబని లేదు ముందు నింక
సరగున నింటికి జరుగు లె'మ్మనుచుఁ
దన వెంట విప్రుఁడు తఱుముచు నడవఁ
దనయుముద్దుల కేలు దన కేలం
చెక్కుల సన్నంపుఁ జెమ రెక్క నడుము
నుక్కట నొక్కింత నూఁగారు దోఁప
నలరుపయ్యెద జాఱ నలకలు చెదర..................................910
నులివాళ్లు వాఁడి తనూలత సోల
నలయుచుఁ జనుచున్నయా మచ్చెకంటిఁ
గలయ వాడలఁ బుణ్య కొంతలు సూచి
వగలఁ గుందుచు బాష్పవారి బిందువులు
దెగినముత్యంబుల తెఱుఁగునఁ దొరుఁగఁ
“గటకటా! భార మెక్కడ నుండి వచ్చె
గిటగిట నై నయీ కీరవాణికిని
గచభార మోర్వనికంఠ మాధాన్య
నిచయ భారమునకు నిలువ నెట్లో ర్చె
నేల దీనికి గుంద నిటు చూడరమ్మ......................................920
వేలి నొయ్యనఁ బట్టి వెనుకొని వచ్చు

...........................................................................................................

మడతఁబెట్టి=మడిచి, మురి పెంపుఁబని=సొగసుకులుకుతోఁగూడిన సుకుమార మైన పని, నడుమునుక్కటన్ = నడుముయొక్క చలనము చేత, నులివాళ్లువాఁడి = కొంచెమువాఁడి, తనూలత = తీఁగవంటి మేను, మచ్చెకంటి = చేపలవంటికన్ను 'లు గలది, గిటగిట నై న = మిక్కిలి కృశించిన, కీరవాణి = చిలుక పలుకులు వంటి పలుకులుగలది, కచభారము కురుల బరువు, నిచయ= సమూహము, ఏలదీనికి,

గుందన్ = ఈయాఁడు దానికి దుఃఖింప నేల - అనఁగా దీనికంటె నెక్కువ ద్యు
212

హరిశ్చంద్రోపాఖ్యానము

వెన్న ముద్దకు రూపు వెట్టినమాడ్కి
నున్న మెత్తని మేను నొప్పెడువాఁడు
యెన్న డు నెండఁ గన్నెఱుఁగనిశిశువు
గన్ను ల ముత్యాలు గాజు నేడ్చెడిని
నే చెల్ల నో యమ యీ చక్కనన్న
రాచ తేజము గలరత్నాల పెట్టె
నడవ నెట్లో ర్చెనే నా ముద్దుఁజిలుక
కడుపుఁ జురుక్కనుఁ గన్న వారికిని
వీఁ డొక్క తెరబొమ్మ విప్రవృశ్చికము..............................930
పీడించి వీరి నొప్పించు చున్నాఁడు
కాలఁగాఁ జిక్కిన కాష్ఠంబువంటి
కా లీచఁ బోయిన కట్టిఁడి మాల
చందురంబులును బుస్తకమును గోపి
చందనంబులును జూచి చనదుసూనమ్మ
నెందును బురిలోన నెప్పుడు మెలఁగు
బంది కాండ్రకు నివి పరఁగుచిహ్నములు'

..................................................................................................................


భీంపవలసియున్న యీ బాలునిఁ జూడుఁడనుట, వెన్న... మేను= వెన్న ముద్దను దెచ్చి బాలునిరూపముగాఁజేసినట్లు ఈ బాలుని మేను మిక్కిలి మెత్తనై నిగనిగ లాడుచు చూచుటకు అతిభోగ్యము గానున్నదనుట, కన్నుల ముత్యాలు గాఱన్ = ముత్యములవలె కన్నీటి బొట్లు కాఱగా, నే చెల్ల = నేను సహింప నే, రాచ తేజము =రాజ తేజస్సు, తెరబొమ్మ =వెఱుబొమ్మ,విప్రవృశ్చికము=బ్రాహ్మణరూపముననుండు తేలు, కాలగాన్.= కాష్టంబు= కొంచెము కాలి కొంచెము కాలక యున్న కట్టెట, కాలు ఈ చఁబోయిన కట్టిఁడి = ఈఁచబోయిన కాలుగలు కఠినుఁడు, మా

చందుకములు= సిందూరములు, బంది కాండ్రకు=బందిపోటు దొంగలకు, ముక్కు

ద్వితీయ భాగము.

213


యని విప్రుఁ దిట్టుచు నావధూజనము
దనమీఁద మెటిక లందఱుఁ బెళ్లు విజువ
ముఖ మెర్రనై బొమముడిపాటు గదుర....................................940
శిఖ వీడ వెస ముక్కుఁ జెమరులు నిక్క
"నవఘళంబుగ దండ మల్లార్చి పేర్చి
కవిసి వేసిన మహాక లక లం బెసఁగ
‘‘నదే విప్రభల్లూక మరుదెంచెఁ దలఁకి
'పద పద' మనుచు నప్పారకామినులు
పెలుగా నొండొరుఁ బిలుచుచుఁ గలఁగి
జల్లున గమి విచ్చి సందులు దూటి
పోవంగఁ జూచి యాభూసురాధముని
వావిరి వెతఁ బెట్ట వడుగులు గదిసి
కుదిచి యొక్కఁడు చేతికోలఁ బోవై చె .....................................950
'బెదర కొక్కఁడు శిఖఁ బెఱికి రాఁ దిగి చెఁ
బొడిచె నొక్కఁడు తూటు మోవఁగ నెత్తి
విడిచె దోవతికట్టు వెస నొక్కరుండు
నొక్కఁడు మీసంబు లూడి రాఁ బెరికె
నొక్కఁడు జంధ్యంబు లొగిఁదెంచి వై చె
నొక్కఁడు గొడుగు డాయుచుఁ విఱిచె
నొక్కఁడు పుస్తుకం బొడిసి కెకొనియె
నొక్కఁడు గుదికిల నుర్విపైఁ ద్రోచె

..................................................................................................................

జెమరలు= ముక్కు రంధ్రములు, అవమళంబుగళ్ = హెచ్చుగా, అల్లార్చి = ఆడిం చి, విప్రభల్లూకము= బ్రాహ్మణుఁడ నెడి యెలుఁగుబంటు, పౌరకామినులు = పుర

స్త్రీలు, కుదిచి=గట్టిగాఁబట్టి, కుదికిలక్ = వెల్లకిలఁగా చీబోతున్ = మన్నుఁ
214

హరిశ్చంద్రోపాఖ్యానము


నొక్కఁడు గన్నుల నొగి మన్నుఁ జల్లె
నొక్కఁడు మొగముపై నుమి సె నాలోన.......................960
నొక్కఁడు వెస నాఁకె నూర్ధ్వపుండ్రంబు
నొక్కఁడు రాళ్లపై నొనరంగ నీడ్చె
నొక్కఁడు పిడికిట హుమ్మని గ్రుద్దె
బెక్కుగాఁ దోఁడేటిపిల్ల లు గూడి
అచీబోతు లంపటఁ బెట్టి నట్లు
కాల కౌశికు నిట్లు గారించువి ప్ర
బాలుర ' కెల్లను బ్రణమిల్లి
సన్నుత ప్రియవాక్యసరణిఁ బార్థించి
'మన్నింపుఁ డనుచంద్రమతిమాట కలరి:
“నీకుఁ బ్రియంబుగా నీచు నీవిప్రుఁ...............................970
కొని చంపక కాచితి' మనుచు
వడుగు లందఱు వాడవాడకుఁ బోవ
వెడగొడ్డుఁ బులి నాకి విడిచిన ట్లైన
జడిసి తొల్లిటితనజజాట మెల్ల
నుడిగి రోజులు లేనియురగంబుఁ బోలె
వడి చెడి తల యె త్తి వడుగు లచ్చోట
సుడియ కుండఁగ నోరచూపులు సూచి
దోవతి ధూళి విదుల్చుచు లేచి

..................................................................................................

-బోతు, లంపట పెట్టు=శ్రమ పెట్టు, కారించు= బాధ పెట్టు, వెడగొడ్డు = అల్ప పశువును, జంజాటము= తొడుసు అడిచిపాటు, ఉరగము= సర్పము, సుడియకుండం గన్ = చుట్టుకొనకుండునట్లు, ఇంటివారి... పాపాత్మురాల= ఇంటివారిని దొంగవ

215

ద్వితీయభాగము.

భూవల్లభుని దేవిముఖము వీక్షించి
'యోసి న న్ని బ్బంగి నోడక గ్రుద్ది.............................980
గాసి పెట్టెడుపలుగాకుల నెల్ల
దలవరు లరు దెంచి దండింప కుండఁ
దొలఁగి పొమ్మని పాఱిఁ దోలంగఁ దగునె
యింటివారిని లేపి యీవల దొంగ
బంటుకుఁ జెయ్యిచ్చు పాపాతురాల
వరువుగా నిన్నెట్లు వచ్చు సమ్మగను
బరుసనిమాటలపని యిప్పు డేల
నిల్లుఁ జేరినమీఁద నీపగ యెల్ల
వెళ్లింప కున్న నే విప్రుండ నఁట వె'
యని పగఁ జాటుచు నాధూర్తవటులఁ.............................990
గినిసి తిట్టుచుఁ దనగృహమున కేఁగి
తలసాల నిలుచున త్తరి నెట్టయెదుటఁ
బెలుచఁ దుమ్మిన భీతిఁ బ్రిదులుచు నిలిచి
చింతించు చున్నంత శిష్యుఁడు వచ్చి
సంతసంబున నమస్కారంబుఁ జేసి
నడుఁకుచుఁ జేరి ముందఱ నున్న శిష్యు
వడుగు నల్లప్పటి వడిఁ దుమినట్టి

.......................................................................................................... చ్చెనని జాగ్రత్తపఱుప లేపి తుద కాదొంగ చేతి కే పట్టియిచ్చు పాపిష్ఠి దానా వ రుసనిమాటలపని= పరుసుగా మాటాడవలసినయక్కఱ, వెళ్లింపకున్న = తీర్చుకొనకు న్న, ధూర్తవటులు=దుర్మార్గు లైస వడుగలు,తలసాల= తలవాకిలి,ఎట్టయెదుటన్ = మిక్కిలియెదురుగా, పలుచన్ = గట్టిగా ప్రిదులుచున్ = సడలుచు= బిగితప్పి

విరవిరవోవుచు, నడుఁకుచున్ =వడఁకుచు, అల్లప్ప... వానరునిన్ = తలసాల
216

హరిశ్చంద్రోపాఖ్యానము

యెండి పోయినవాలహీనవానరునిఁ
గుండకోళకునిఁ గర్కోటకుఁ డనెడి
కుటిలజాతుని బందికుక్క వీక్షించి.....................................1000
'తటుకునఁ దుము పంతముఁ జెప్పు మనిన
దినము వారముఁ బొడ్డు దిక్కును గ్రహము
నొనర నెన్నినరీతి నొకకొన్ని యెన్ని
‘కలుగు నిప్పుడు గృహకలహంబు మీకు
దలపోసి చూడఁ దథ్యం' బన్నఁ గలఁగి
“తప్పదు నీ మాట తార్కాణ మాకుఁ
జెప్పితి మును తుమ్ము చేకొన కేఁగి
నా కూ రిపత్ని చే నడు నెత్తి వగుల
రోకట నొక పెట్టు రూఢిగాఁ బడితి
ముండకూతురు కిన్క ముక్కునబంటి.............................1010
గుండె జల్లను నది గోపించే
పడఁతి గా దది నన్నుఁ బట్టి మర్దింపఁ


................................................................................................. నిలుచున్నప్పుడు వేగతుమినట్టివాడును, చిక్కిపోయినతోక లేనికోఁతిపంటి వాఁడును - దీనిచే వానరమువలె వికారరూపును ధూర్త చేష్టలునుగలవాఁడని తెలియునది, కుండగోళకుని . కుండుఁడనఁగా స్త్రీ కి మగఁడుండఁగా ఱంకు మగనికిఁ బుట్టిన కొడుకు, గోళకుఁడనఁగా విధవకు అంకుమగ నివలనఁబుట్టిన కొడు కు-ఇచట కుండగోళకుఁడనుట కేవలనిందామాత్రపరము,కుట్లజాతునిక్ = పుట్టుక చేత నే కపటుఁడై నవానిననుట, బందికుక్క = బందిపోటువారలుపయోగించు కుక్క వంటివాఁడనుట - క్రూరత్వమను చౌర్యమునుగలవాఁడనిభావము. తుమ్మ పంతము= తుమ్మినందులకు ఫలము, తార్కాణ= మూఁదల- సరిదాఁకునది. చెప్పితి ...కేగి = ముందుతుమ్మఫలము నీవు చెప్పితివిగాని దానిని పాటింపక నేనులోపలికి

బోయి, కిన్క ముక్కు నబంటి =కోపము ముక్కు వఱకుఁగలది, తలపుచ్చుక = త

217

ద్వితీయ భాగము.

బుడమిఁ బుట్టిన పెనుభూతంబు గాని
యీయింతిఁ గొని వచ్చు టెఱిఁగిన నన్ను
బోయినప్పుడే తలపుచ్చుక మ్రింగుఁ
గావున నిప్పు డీక మలాక్షి వార్త
నీవు ముందఱనేఁగి నేర్పు సంధిల్ల
జననాథుఁ డొక్కఁ డీసతి దాగ వోసె
నొనర నొజ్జుల కని యొడఁబడ మొఱఁగి
నావధూమణికి సంతసము వుట్టించి..........................1020
వేవేగ నాలోని వెఱ పెల్ల మాన్పు'
మని వేడుకొనుటయు నవ్వటుధూర్తు
మనసులో వేరొక్క మతము చింతించి
‘విరసంబు వుట్టించి వీనికి వీని
తరుణికి నొక మరి తలపట్లు చేసి
మొగములు వగులంగా మొత్తు లాడించి
నగుచుఁ జూచెదఁగాక నా కేమి' యనుచుఁ
గపట మేర్పడఁగ 'నౌఁ గా'కని పోయి
చపలాత్ము'డాయొజ్జసాని కి ట్లనియెఁ
జేరి నీ రోకమాటఁ జెప్ప వచ్చితిని.........................1030

....................................................................................................

పుట్జ, సంధిల్లన్ = కూడికొనఁగా, జన నాధు.... జలకు = ఒకానొక రాజు ఈ స్త్రీని ఉపాధ్యాయులకు దానము చేసెను, ఒడఁబడన్ = సమ్మతించునట్లు, మొఱగి ఏమరించి, వధూమణి= భార్యారత్నము, వెఱపుణభయము, .వటుధూర్తు= ధూర్తుఁ డైనపడుఁగు, 'వేపొక్కమతము= మఱియొక యభిప్రాయము - తనగురు వుచెప్పినది గానట్టి వేఱుభావమును, విరసంబు .... తరుణికి = వీనినితరుణికిని

విరసంబు పుట్టించి' అనియన్వయము. మొత్తులాడించి . = ఒకరినొకరు మొత్తు
218

హరిశ్చంద్రోపాఖ్యానము

నోరు గా చెద నన్న నుడువుదు నీకు
జెప్పిన నొజ్జల చేఁ జావు నిజము
చెప్పకుండిన మాకుఁ జేటు నీ చేత
వెడల నాడిన దుర్వివేక ఈమాట
కడగి చెప్పినఁ గాని కడుపుబ్బు దిగదు
నాలుక నువుగింజ నానదు నాకు
జాలి నాతోడ నొజ్జలు సెప్పి యున్న
మాట నీ కెఱిఁగించి మదురుగో డైన
దాటి పోయెద నింక దాఁపుర మేల
రూపింప వికృతంపురూపు నీ రూపు........................1040
నా పత్ని కటుగాన నా కిటమీఁదఁ
గమనీయరూప రేఖలు గల కాంత
నమర నొక్క తే వివాహంబు గా వలయు
నని యొజ్జ లిట క్రింద నాడు వాక్యములు
వినిపింప నవి నీకు విరస మౌ నంచు


..............................................................................................................

నట్లు చేయించి, ఒజ్జసాని= భార్య, నోరుగా చెదనన్నన్నీ నోరు నేను జెప్పిన మాటను జెప్పకుండుసట్లు పదిలము గాఁ జూచుకొందునని చెప్పితివేని, పెడల నాడి వెలిపడునట్లు చెప్పినచో, దుర్వివేకము= వివేకము లేమి, కడుపుబ్బు దిగ దు= చెప్పకుండినయెడల కడుపు ఉబ్బుట తీసిపోవదు-ఆఱట అడఁగదనుట, నా లుక ... నాకు= నాకు నాలుకలో నువ్వుగింజకూడ నిలువదు - ఒక్కమాటయైనను వెలువడకుండ నేరదనుట, జాలిన్ = పరితాపముతో నిన్ను బ్రోలిన పెండ్లముకలి గెనని పరితాపముతో ననుట, మదురుగోడ = చుట్టుపారిగోడ, దాఁపురము దాఁచి పెట్టుట, వికృతంపు ... నాపత్ని కిన్ = నా పెండ్లమునకు నీరూపమువలె వికారమైన రూపము, కమనీయరూప రేఖలు = మనోజ్ఞ మైన యా కారలక్షణము

లు, వినిపింప... నంచు= 'నీకువిరసమౌనంచు నవి వినిపింపను' అని యన్వయము.

219

ద్వితీయ భాగము.

నిదె నేఁడు సౌందర్య మెల్లను బ్రహ్మ
చిదిమి చక్క నిరూపు సేసిన యట్టి
రాచకూతురు గొని రవ్వగా కుండ
దాచినమామూలధన మెల్లఁ బెట్టి
గోఁచికాఁడై దానిఁ గొనుచు నే తెంచి................................1050,
లాంచి యున్నాఁడు నీలా గొత్తి చూడ
వాఁడె పో మనతలవాకిట నున్న
వాఁడన్న నది మోము వడిఁ జేవురింపఁ
గోపించి పెట పెటఁ గొఱకి దంతములు
వాపోవుచంకటివానిఁ బోవైచి
'కటకటా! కాటికిఁ గాళ్లు సాచియును
విటతనంబులజాడ విడువఁ డీబడుగు
కొండంగి వీని వెక్కురుతల దఱుగ
ముండగోష్ఠికి ముక్కు మొగ మేడ తనకు

.............................................................................................................

ఇంతవఱకు వినిపింపకుంటిననుట, సౌందర్య... ... రాచకూఁతురు=బ్రహ్మలోకము సం గలచక్కఁదనమునంతయుఁ దీసికొని చక్కనిరూపుగా సేయఁగా నైనట్లున్న యొక రాజకుమారి, గోఁచికాఁడై =ధన మెల్ల రాచకూఁతునకు వెలగానిచ్చి వేయుట చేత కాసుమిగులక కౌపీనమాత్రము మిగిలినట్టి దరిద్రుఁడై, లాఁచియున్నా డు నీలాగు ఒత్తిచూడన్ = నీవిధము ఏమో చక్కఁగా పరిశీలించుటకై పొంచి యున్నాఁడు, జేవురింపన్ = ఎఱుఁబాజఁగా, దంతములు = పండ్లు, వాపోవు . చంక టివానిక్ = ఏడ్చుచున్న చంక లో బిడ్డను, కాటికిఁగాళ్లు సాచియును చావఁబోవు సిద్ధుఁడు గానుండియును - మరణము దాపించినంత ముదుక డయ్యునను ట, విటతనంబులజాడ = జారత్వపుచి న్నెలు, బడుఁగు= బక్కవాఁడు, కొం డంగి=కుటిలుఁడు, వెక్కురుతలదఱుగక్ = వికారపు తలకాయ కోయను,. ముండ తనకు ముండలతోడఁగూడుటకు తగినంత ముక్కు మొగము తీరు

220

హరిశ్చంద్రోపాఖ్యాసము

బిడ్డల కొసఁగక పెండ్లాము కిడక...................................1060
వడి కిచ్చుచుఁ జీమ వలెఁ గూడఁ బెట్టి
ధన మంతయును మిండతల కి చ్చెవీని
గొని పోయి యెన్నఁడు కూలఁ గ్రుమెదరో
బాపురేయనుకొనఁ బని లేదు గాక
రూపింప నాకంటె రూపసి కలదె
యీప్రొద్దు నానిఁ గుయ్యిడ శిఖఁ బట్టి
వీఁపుతీటంతయు విడిపించి యెదుట
దక్కించి పోయిన ధన మెల్ల మగుడఁ
గ్రక్కింప కున్న నేకలహకంఠిక నె'
యనుచు రోకలిఁ గేల నమరించుచున్న..........................1070
గని రయంబున వెళ్లి కర్కోటకుండు
కడుసంభ్రమంబునఁ గాలకౌశికుని
యడుగులఁ బడి లేచి హస్తముల్ మొగిచి
'విచ్చేయుఁ డింక మీ వెఱు పెల్లఁ బాపి
వచ్చితి' ననుడు నవ్వటుధూర్తుఁ బొగడి
లోని కేఁగెడునంతలోఁ దల్పు మూసి
పూని గొండ్లెముఁ బెట్లి పోయె నా శిష్యు
డత్తఱిఁ జని కాంచె నా రాజు దేవి
చిత్తంబు జల్ల నఁ జిడిముడిఁ బడుచు

.....................................................................................................

తన కెక్కడిది, మిండతలకున్ = జారిణులకు, కూలఁగుమ్మెదరో = కూలునట్లు గ్రుద్దుదురో, అనుకొనఁబని లేదు గాక = నాకు నేనే నాయందమును చెప్పుకొనవల సిన యక్కఱలేదు గాని, రూపసి= అందకత్తె, కుయ్యిడ = అఱవఁగా, దక్కిం

చిపోయిన ధనము = తనకువశము చేసికొని కొనిపోయి దారపోసికొన్న విత్తము,

221

ద్వితీయ భాగము.

మెదుక పట్టినతల మెడ గండమాల.................................1080
నుదుటిమీఁదటిసుడి నులిగొన్న బొమలు
బుర్ర ముక్కును లొట్ట పోయినగన్ను
వెట్టి చూపును దెగి వేలాడు చెవులు
మిడిపండ్లు చెక్కిలి మీఁదిపుల్పిరియుఁ
బడి వేలుచన్నులు బడ బాకినోరు
రోటు పోయిన చెయ్యి రొమ్ము కంపరము
వాటుఁగాలును రోలువలె నున్న నడుము
బద్దుపిక్కలు నంట బలసిన తొడలు
మొద్దుపాదంబులు ముడిఁగిన వ్రేళ్లు
గఱుకునల్ల నిమేను గలిగి దయ్యంబు.............................1090
మఱపింపఁ దగు నుచ్చమల్లిచందమునఁ
గనుఁగొన రోఁతైనకాల కౌశికుని
వనిత హుమ్మనుబందివాటులమాతం
గని దానిఁ గదియ బెగ్గల మంది వెఱచి
వెనుకకు జరుగు నుర్వీవిభు దేవి


............................................................................................................

“మొగిచి =మోడ్చి, మెదుక పట్టిన = పిసక గానున్న, నులిగొన్న = చిక్కు పడిన, బడబాకినోరు = పెద్ద వెడఁదనోరు, రోటుపోయిన ఈచఁబోయిన, కంపర ము=పాడే, వాటుఁగాలు = నడుచునప్పుడు ప్రక్కవాటు గాఁబోవునట్టి కాలు, బద్దుపిక్కలు=పలుచనిపిక్కలు, అంట బలసిన=నిలు వెల్లబలుపునొందిన - చక్క దనమునకు అనుగుణముగా అయ్యెభాగములందు ఎక్కువతక్కువలుగా బలుపు నొందక ఒక్కటే మొద్దు గా బలసియున్నట్టి యనుట, కఱుకు బిరుసైన, ఉచ్చమల్లి = దిస్స మొలయాఁడుది, హుమ్మను బందివాటులమాత= బందివాటుదొం గల తల్లివలె హుమ్మనుచు బెడిదముగా నుండునది, బెగ్గలమంది = భయపడి, ఉ

ర్వీవిభుదేవి = రాజు భార్య, చివ్వంగి= సివంగి, బలిభిక్షముల వారిన్= - బలి.
222

హరిశ్చంద్రోపాఖ్యానము

సివ్వంగి లేడి వీక్షించుచందమునఁ
క్రొవ్వునఁ జూచి కర్కోటకు మాట
లన్ని యు నిజముగా నాత్మ భావించి
పన్ని నకోపంబు బలసి రెట్టింప
బలి భిక్షములవారి బలువిడి మొత్తం..............................1100
దలసాలఁ గట్టినతన వేలుదుడ్డు
వడిఁ గేలఁ గైకొని వచ్చునజ్జఱభి
'గడఁగి వీక్షించి యక్కాల కౌశికుఁడు
గుండె భగాలనఁ గొలఁది యె తనకుఁ
'బండె నెక్కడఁ జొరఁ బాఱనె' ట్లనుచు
వెడ వెడఁ దన కచ్చ వీడంగఁ బారి
వడి మోము వగులఁ గవాటంబు దాఁక
గడియతో, బెనఁగి దిగ్భమఁ దత్తజింపఁ
‘బొడువ నీ కెక్కడఁ బోవచ్చు' ననుచు
బెక్కు భంగుల మొజ్జఁ బెట్టంగ వెట్టి................................1110
కుక్క లోఁబడఁ బట్టి కొట్టిన రీతిఁ
' జేతు లొగ్గుచు మొక్కుఁ జేకొను' మనుచు
నాతురంబున వేఁడ నందంద మొ త్తి
వడి చెడి దగ దొట్టి వఱద లై చెనుట


......................................................................................................

గానిబిచ్చము గాని అడుగవచ్చువారిని, బలువిడి = బలముగా, మొ త్తన్ =కొ ట్టుటకు, వ్రేలుదుడ్డు = వ్రేలాడుచున్న దుడ్డుక ర్రజ, జఱభి=దుష్ట స్త్రీ, 'గుండె... బండె' గుం డెభ గాలని యదురునంతమాత్రమై కార్యము ముగిసినది, ఎక్కడం జొరబాఱ నెట్లు = ఎక్కడబ్రవేశింపవచ్చును ఎట్లు పాఱిపోవచ్చును అని, వడి

చెడి. అలసట చే కొట్టెడియురవడి తీసిపోయి, దగదొట్టి=దప్పినొంది, పఱదలై

223

ద్వితీయ భాగము.

గడవ వగర్చు నక్క లహకంఠికను
గనుఁగొని తలపోసి కాల కౌశికుఁడు
'దినదినంబును మొత్త దీనిచేఁ జత్తు
హర హరా యిటువ లె నడలుట కన్న
మరణ మైనను నొక్క మాటైన లెస్స
పంద నందజు బాధ పఱుతురు గాని..............................1120
యెందు సాహసునిది క్కెవ్వరుఁ బోరు
పులి నడుగరు మేకపోతులఁ గాని
బలహీనుఁగాని చంపవు దయ్యములును
దెంపు మీఱఁగ నాశ దెగఁ గోసి దీన్ని
గొంప లోపలగొట్టుదు' ననుచుఁ
గుదియక కరతి త్తి గొని దాని వ్రేయ
నది చెడిపోవను నందంద మోఁ దె
నడి దానితలఁ బట్టి వంచిన విప్రు
నొడిచి గడ్డము పట్టి యూఁచె న వ్వెలఁది
నఖముల వచ్చె నన్నాతి నాద్విజుఁడు............................1130
ముఖము చిప్పఁగ నది ముక్కు వోగఱచె
విసువక నీ రీతి వి ప్రదంపతులు
మసలి పోరఁగఁ జంద్రమతి సేరి యనియెఁ
'దగువారు నిందింపఁ దమవారు రోయ
నగువారి నెఱుఁగక నయ మేది యిట్లు


...............................................................................................................

= వెల్లువలై , కడవవగర్చు= మీఁదుమిక్కిలి అలయుచున్న, అడలుట = దుఃఖిం చుట, ఒక్కమా టైనన్ = ఒక్కసారి గా మరణ మేక లిగినను, షందను= పిరికివానిని,

కుదియక = నెనుదీయక , కరతి త్తి=వట్రపుసంచి, నయము=నీతి, అభిమానము=మా
224

హరిశ్చంద్రోపాఖ్యానము


మగఁడు నాలును నభిమానంబు విడిచి
మొగములు వగులంగ మొత్తు లాడుదురె
వతితోడ సతి మాఱుపడే నేని పుణ్య
గతి కేఁగ నరకంబునఁ గూలు

  • [30](పతిభ క్తిమహిమంబుఁ బ్రకటించు నట్టి ........................1140

యితిహాస మొక్కటి యెఱిఁగింతు వినుమ
యను వెంద శర్మిష్ట యను పుణ్యవతికి
'ననుఁగు సుహృ త్సేనుఁ డనుపుణ్యపురుషుఁ
డతనికుష్ఠ వ్యాధి నరయంగ నలసి
యతని వీఁపున నిడి యర్ధరాత్రంబు
ఘనభూతబేతాళకలకలం బెసఁగఁ
జను త్రోవఁ గొట్టుపై శవము దాక :గను
నొడలు వదలు నొప్పి నుగ్రుఁ డై మండి
కడఁగి కోపంబునఁ గాంత కిట్లనియె
'నినుఁ డు'దయా'ద్రికి నే తెంచువఱకు...........................1150
వనిత నీపతి తల వ్రయ్యలై పడును'
ననీ శాప మిచ్చిన నా పూవుబోఁడి
దనపతి చావుకుఁ దలపోసి పోసి
'యిల జీవు లకు నెల్ల నిదె వేగెఁ బొద్దు
పొలు పేది నాపాలి పొద్దస్తమించె
భానుండు పుడమ నాపతి ప్రాణ హాని


.......................................................................................................

నము, మాజుపడౌనేని ఎదిరించెనేని, అనుఁగు=గారామైన, శవము= పీనుఁగు, ఒక లు వదలునొప్పి= దేహమువిడిచిన బాధ చే - శవము కర్త, ఇనుఁడు=నూర్యుడు, పొలు పేది... ఆస్తమించే వాపాలిటికి ప్రొద్దు అయినట్టి నా మగఁడు తీరిపో .........................................................................................................

225

ద్వితీయ భాగము.

యేను బతి ప్రత నిల నై తినేని
భానుండు మింటను భాసిల్ల కుండు
నన విని బ్రహ్మాదు లద్భుతం బంద
నొనరంగ దిననాధుఁ డుదయింప నోడె...............................1160
నిది దివ మిది రాత్రి యిది సంధ్య యనుటఁ
దిదశుల కైనను దెలియ రాకుండఁ
దరుణి పతివ్రతాధర్మంబునకును
హరుఁడు ప్రసన్ను, డై యతికృపామూర్తి
“వరము వేఁడుము నీవు వనజాక్షి' యన్నఁ
గరములు మొగిచి యక్కళ్యాణి పలికె
'సర్వేశ వరము నీ శవమున కిమ్ము
పార్వతీనాథ నాపతిఁ గావు' మనిన
వామ దేవుం డిచ్చె వరము లిర్వురకు
భామ ప్రార్థింపంగ భానుండు వుడమె................................1170
గరకంఠుడరిగె నా కైలాసమునకుఁ
దరుణి పతివ్రతాధర్మ మిడే రె)*[31]
బాయని భ క్తీమై బతిపాద సేవ
సేయుటఁ గాదె ప్రసిద్ధికి నెక్కి
రాయరుంధతియును నా యహల్యయును
నా యనసూయయు నఖిలలోకముల

.........................................................................................................


యెను. భానుఁడు=సూర్యుఁడు,మింటను భాసిల్ల కుండు= ఆ కాశమున వెలుఁగకుం డుగాక -ఉదయింపకుండుఁగాక యనుఁట, దిన నాథుఁడు= సూర్యుఁడు, త్రిద శలు= దేవతలు, వామదేవుఁడు= శివుఁడు, గరకంఠుఁడు= శివుఁడు, ఏపరించుచు= ..........................................................................................................

  • 226

హరిశ్చంద్రోపాఖ్యానము

నేపరించుచుఁ బతి కెదురు భాషించు
పాపాత్మురా లూరఁబందియై పుట్టు”
నని పెక్కు భంగుల నా రాజు దేవి
దను మోవ నాడినధర్మ వాక్యములు.......................1180
గన లెడుసూదులు గర్ణరంధ్రములఁ
జొనిపినయ ట్లైన సురసుర స్రుక్కి
కండ క్రొవ్వునఁ గాల కౌశికుమాఁద
మండు కోపము చంద్రమతిమీఁద విరిసి
'పాడిఁ జెప్పఁగ నిన్ను ( బనివడి యిచటి
కేడ ముక్కిఁడి పిల్చె నిఁక నింత నుండి
బాడుగ నీ కిచ్చి పతిభ క్తి సేయు
జాడ లన్ని యు నీదుసంగడి నేర్చి
నీవు వంకలు దీర్ప నీ పంపుపనులు
గావించు చుండెదఁ గాక వేగిరమె........................1190
న న్నెఱం గెదు గాక నా పేరు తెలియ
విన్న మృత్యువు కైన వెర వేఁకి వచ్చుఁ
గదలి నే రోకలి గైకొన్న వలన
గడలుదు రీవాడగరిత లందఱును
నాపొడ గాంచిన నగరంబు వడఁకు

...........................................................................................................

దుఃఖపఱుచుచు, తను మోవన్ = తన్ను దాఁకునట్లు, కన లెడు = మండుచున్న, పాడి = నీతి, ఏడ ముక్కిడిఁబి ల్చె- ఈముక్కిడి నిన్ను నీతి చెప్పుటకై యెక్క డఁ బిలిచినాఁడు, ఇంతనుండి = ఇది మొదలు గా, బాడుగ = అద్దె, నీదు సంగడిన్ = నీ సాంగత్యమున, వంకలు =తప్పులు, వెర వేఁకి = మిక్కుట పుజ్వరము, రోఁకలిఁ

గైకొన్న వలన=రోఁకలి యెత్తి కొని కొట్టఁబోయిన దిక్కున, గరితలు= స్త్రీలు

ద్వితీయ భాగము.

227

నీపోటువాటున నిపు డిట్లు ముమ్ము
బోరించితివి జంత్రి బొమ్మ నా యక్క
నీరఁ జి చ్చెగయింప నేర్చినతల్లి
యెచ్చట నుండి నీ విటు దాపురముగ
వచ్చితి చొచ్చితి నాస మీ వనుచు..............................1200
నోడక కురులు బిట్టొడిసి రాఁ దిగిచి
మూడి వో దాఁకించి మూతులు నులిమి
యెగ్గులుఁ దప్పులు నెన్ని యీరీతి
పగెల నిచ్చలు బాములఁ బెట్టి
యిడుమలఁ గుదియించి యించుక సేపు
నెడపక పనులు సేయించుచు నుండి
నట హరిశ్చంద్రుండు నప్పు డారీతిఁ
గుటిల కుంతలి నమ్మి కొన్న ధనంబు
వ్రయము గాకుండ సర్వంబును ముడిచి
నయ మొప్ప నిచ్చిన నక్షత్రకుండు..........................1210
వేడుకఁ గైకొని విభుని వేవేల


....................................................................................................

పొడ =ఆ కారము, పోటువాటు= పొడుచుట కొట్టుట, జంత్రి బొమ్మ= యంత్రపు బొమ్మ, నాయక్క - ఇది నీచపరముగా చెప్పినమాట, నీరన్చిచ్చు ఎగయింప నేర్చిన తల్లి = జనీళ్లుపోసి అగ్గిని రగులునట్లు చేయ నేర్చినది- చల్లగా నే మాకిట్టి జగ డము పెట్టించిన దాన వనుట. లేక నీటియందు నిప్పుఁ బుట్టింప నేర్చినదనియు న ర్థాంతరము దోచుచున్నది కాని యిదిసరి కాదు. దాపురముగ-ప్రాప్తముగా, చొచ్చితి వాసము= నాయిల్లు చొచ్చితివి, బిట్టు=గట్టిగా, మూడివోఁదాఁకించి =పృష్ఠము అడుగువఱకును తలను వెండ్రుకలుపట్టి యీడ్చివంచి, ప గెలన్= సామ థ్యపు మాటల చేత, నిచ్చలు= తనయిచ్చవచ్చినట్లు, బాములు= బాధలు, ఇడు

మలు= ఆపదలు, కుదియించి=స్రుక్కించి, ఇంచుక సేపు నెడపక = కొంత సేపయి.

228

హరిశ్చంద్రోపాఖ్యానము

జాడల దీవించి సమ్మతి: బలికె
'గురుఁడు పుత్తేరంగఁ గోరి నీ వెంటఁ
దిరుగుచుఁ దరు వున్న దినముల కెల్ల
జెల్లింపఁ గలబ త్తే సెలవుగా నీవు
చెల్లించితివి నాకుఁ జెల్లె ధనంబు
మితితో డ నొసఁగుము మేకొన్న గాధి
సుతునిఋణం బెల్లఁ జొప్పడఁ దీర్చి
పొమ్మన్నదీవించి పోదు నీతోడ
దొమ్ములు రేఁపక దొసఁ గెల్ల నుడిగి'.............................1220
యనుటయుఁ దల యూచి యమ్మహీవిభుఁడు
తనలోన నవ్వి యాతని కిట్టు లనియెఁ
“బగ గొని కృప మాలి బందెలు వెనఁచి
తగునె నా చేతి విత్తము రిత్త గొనఁగఁ
దఱలక నా మీఁద దరువుండ నిన్ను
దరిమి పుత్తెంచున త్తరి భవద్గురుఁడు
సత్తుగా నీకు నిచ్చలును రొక్కించి


............................................................................................................


నను అవ కాశములేకుండునట్లు, పుత్తేరంగన్ = పంపఁగా, తరువున్న దినములకె ల్లన్=తప్సీలు గానుండిన నాళ్లకన్నిటికిని- ఇట భార్యను బిడ్డను అమ్మినధనము న క్షత్రికుఁడు విశ్వామిత్రునిఋణమునకు చెల్లుగా పెట్టుకొనక తనతిప్పిలుండినది నములకు బత్తె సెలవుగా పెట్టుకొన్నాఁడని తెలియునది, మితితోడ =గడు వునకు సరిగా, మేకొన్న = ఒప్పుకొన్న, గాధిసుతుని= విశ్వామిత్రుని, దొమ్ముల దొమ్మిజగడములు, రేపక = ఎత్తి పెట్టుకొనక , దొసఁగు=దోషము, బం దెలు పె వఁచి=నిర్బంధములలోఁ జుట్టి, కొత్తగొనఁగ?" =వ్యర్థముగా నీబత్తే సెలవునకని పు

చ్చుకొనుటకు, తఱమి= బలాత్కరించి, పుత్తెంచు నత్తరి =పంపున పుడు, నత

ద్వితీయ భాగము.

229


బత్తె మి మ్మని నన్నుబలుకఁ డొండేని
నీకు నే నొడఁబడ నేఁ డీధనంబు
చేకూఱ గైకొని చిక్కులు వెట్టి....................................1230
తప్ప నాడెద వసత్యంబున కోర్చి
చెప్ప నే మున్నది శివుఁ డొక్కఁ డెఱుఁగు'
నావుఁ డిట్లని పల్కె నక్షత్రకుండు
'భూవర నీ వెంటఁ బుత్తెంచు నపుడు
నీచేత బత్తెంబు నిచ్చలు గొనఁగ
నాచెవిలోఁ జెప్పి నాఁడు మగ్గురుడు
నీ వెడఁబడ నేల నిను వేఁడ నేల
నీవు లేదన నేల నినుఁ బ్రభాతమున
దీవింప వచ్చిన దీనవి ప్రుఁడనె
చావ నొవ్వఁగఁ బూని సాహసం బొదవ ............................1240
నెడపక గిరు లెక్కి యేళులు దాఁటి
కడు భయంకరమహాగహనముల్ గడచి
కాలు గాలినపిల్లి కరణి నీవెంట
నేల నీబంటనై యెల్లందుఁ దిరిగి
వారక హిమనర్ష వాతాతపముల

.............................................................................................

గాన్ =రూఢిగాననుట,రొక్కించి=-రొక్కము రూపము గా, ఒండేని= ఒక్కటి యు, చేకూఱక్ = దొరకఁగా నే, తప్పనా డెదవు తప్పి పలి కెదవు, ప్రభాతము నన్= వేకువను, దీనవిప్రుఁడ నే= దరిద్ర బ్రాహ్మణుఁడ నా కాదనుట. గహన ముల్ -చొరరాని యడవులు, కాలు గాలిన పిల్లికరణి = కాలికి చిచ్చుదగిలిన పిల్లి విధమున, నీ వెంట నేలన్=నీ వెంబడిచోట, ఎల్లందున్ = ఎల్ల యెడలను, హిమ... తపములు = మంచువాన గాలి యెండలు, తిరిసిన పలుగూడు = బిచ్చ.

230

హరిశ్చంద్రోపాఖ్యానము

నూరూరిగుడిపంచ నొదిఁగి నిద్రించి
తిరిసిన పలుగూడు దెచ్చి నిచ్చలును
వరుస నొక్కొకకడి వనరుచుఁ గుడిచి
చదువును సంధ్యయు జపమును వేల్మి
మొదలు ముట్టఁగఁ బోయి మోటనై బడలి ...................1250
చిడుము గోకుచు జరఁ జిక్కి నట్లుండి
కడపట బత్తెంబు గాన కే తేర
నడుమఁ జావఁగ నీవు నా తలపుండ్లు
గడిగి రక్షించెదో కఱవు కాలమున
నురిసిన పుండ్ల పై నుప్పును జల్లి
కెరలఁ జేసెదవు నే గినిసితి నేని
చక్కఁ బెట్టగ లేరు సాధువు "రేఁగఁ
బొక్కి నిల్వదు తలపొలమునఁ గాని
మే లెరింగెద వని మితి వచ్చు దాఁక
నాలిని నిన్నుఁ గాసాడితిఁ గాక ......................................1260

.......................................................................................................

మె త్తి తెచ్చిన పలువిధము లైన యన్నము, కడి= యుద్ద, వనరుచున్ = కుందుచు' వేల్మి = హోమము, మొదలు పెట్టఁగ పూర్ణ ము"గా, మోట నై = మొద్దడ నై, చిడుము =తీటకురుపు, జరఁజిక్కినట్లు = ముసలితన మువచ్చినట్లు , ఏ తేరన్ = రాఁగా, నడుమన్ చావఁగా = దారినడుమఁ జచ్చితి నేని, నాతల పుండ్లు గడిగి - ఇదిజాతీయము= నాకడగండ్లు తీర్చి, ఉరిసిన పుండ్లు = పగిలిన పుంటికలు కెరలన్ =మండునట్లు, చక్కబెట్టఁగ లేరు = నన్ను సమాధాన పెట్టి శాంతున్ని జేయ లేరు, సాధువు... గాని = సాదు వై నవాఁడు కోపమున విజృంభిం చెనెని తలపొలమున నే కాని తక్కినచో నిలుపఁడు, మేలు ఎఱుంగుదువని నాకుఁజేయ వలసిన ఉపకారము నీకునీవే తెలిసికొందువు గాని నేనడుగవలసినది లేదని, మితి=

ద్వితీయభాగము.

231

తఱలి పోవఁగ నీక ధర గిరి గీచి
మొఱలు వెట్టఁగ గట్టి ము వ్వెతఁ బెట్టి
గుదిగుది గావించి కూరాకు సేసి
యదలించి నిను మేకయజిపుఁ గూయింపఁ
జనుఁ దప్పె నది నేఁడు సర్వధా నిన్ను
వెనకముందటిపగ వెడల మరలు
మఱవకు మిప్పటిమాటల నెల్ల
నెఱిఁగెడు శివుఁడు నా కేటికి బాస'
యనిన హరిశ్చంద్రుఁ డొవటు ధూర్తుఁ
గనుఁగొని కోపంబు గదుర నిట్లనియే ............................1270
'గురు కార్య మొనరింపఁ గోరి నా వెంట
నరు దెంచి తిరిగి వది నాకు సెలవై
పరదేశులకు గుళ్ల పంచలు గాక
యిర వైనసున్న పుటిం డ్లేడఁ గలుగుఁ
బలుగూడు గాక యేపట్టున నైనఁ
గలదె పాయసము భిక్షాం దేహి యసిన
నెవ్వగఁ గుందుచు నీర సాన్న ములఁ

.......................................................................................................

గడువు, ధరగిణి గీఁచి= నేల గీర గీఁచి, మొఱలు పెట్టఁగఁ గట్టి=నీవు కుయ్యో మొ ర్రోయని కూయిడునట్లు ఆగిరిలో నిలువఁబెట్టి, మున్వెత= తాపత్రయము, గుడి గుది = గుత్తిగుత్తి, మేఁకయఱపుఁగూయింపన్ చనున్ = మేఁకవలె నఱచు నట్లు చేయఁదగును, వెనుక ....మరల్తు. = ముందు వెనుక నాకు నీయందుఁగలపగ యంతయుఁ దీరునట్లు సుళ్ల బెట్టుదును, ఎఱిఁ గెడు... బాస= నేను పగదీర్చు కొందునని యొట్టు పెట్ట నేల - నీవు చేసిన దానికి శివుఁడే యెఱిఁగి ప్రతిఫలమియ్యం గలఁడు. నాకు సెల వె= నాకువ్యయమా-గురు కార్యమునకు వచ్చినందులకు నీకుఁ

జేయవలసినవ్యయము గురునిదే కాని నాది కాదనుట. నీరసాన్న మలన్ నెవ్వగఁ

232

హరిశ్చంద్రోపాఖ్యాసము

క్రొవ్వి బలురె గువ్వగుత్తుక పడక
నివి యెల్లఁ దప్పులు నెగ్గులుఁ జేసి
తివిరి 'రేఁగెద నన్నఁ దెలుప నా వశమె...........................1280
తీసారుచక్కెర దిన్న యా నోర
-నేపాకు మేసినవిధమున నీవు
చేసి నంతయు మేలు సేసి మరేల
చేసితి విట్టికుచ్చిత మింక నైనఁ
గుదుకనగోలు గైకొనక నా ధనము
వదలుము మున్ను విశ్వామిత్రుఋణము
మితితోడఁ జెల్లించి మీఁద నెట్లయిన
ధృతిఁ దీర్లు నీ బ త్తె దినముల లెక్క'
నావుడు విని నవ్వి నక్షత్రకుండు
భూవర నీకంటె బుద్ధిమంతుఁడను
దొడిఁబడఁ జేతికి దొరికిన ధనము
విడిచి మీఁదటఁ గొను వెంగలి గలఁడె
చదును మీఁదిడి దెబ్బ సుగతి గాక
పిదప నొప్పునె మతి పెక్కు లేమిటికి
విడువు మింతట నుండి వి త్తంబుమీఁది
యడియాస వైడికిఁ బ్రాణముల్ లంకె.................................1290

........................................................................................................


గుందక క్రొవ్వి బల్దు రేయనియన్వయము. గువ్వగుత్తుకపడు= ఆకటి చే హీనస్వ రమగు, రేఁ గెదనన్నన్ =విజృంభించెదను అని చెప్పఁగా, తెలుప నావశ మే= తేర్చు ట, నాతరమా చేసినంతయుమేలు చేసి = ఇంతవఱకుఁజేసినదంతయు మే లుగా నేచేసి, కుదుకనగోలు= పంచన,చదువు .. సంగతి గాక =పిమ్మటి చదువు

దెబ్బకొట్టినపుడే గాని పిదప కలుగునా, ఆడియాస =వ్యర్థమైనయాస, ఈ చేతి

ద్వితీయ భాగము.

233


విడుతుఁ బ్రాణము లైన విడువ ధనంబు
మెడ మెండుకొని తెంపుమా చేతి హేతిఁ
దల దెవ్వ మొ త్తి యీధనముఁ గైకొనుము
వెలయంగ నాచావు వెదకుఁ గౌశికుఁడు'.....................................1300
ననిన వీనులు మూసి హరహరా యనుచు
జననాథుఁ డాత్మలో సంతాప మంది
కడుఁబడ్డధూర్త నక్షత్రకు నోరు
దొడుకుట పాపంబు దుర్మార్గుడితఁడు
బల్లిదు చేతిలోఁ బడినధనంబు
పిల్లినట్టిన దొబ్బ ప్రిదులక పోయె
బొంకు గాకుండ నా పూనినమితికి
నింకఁ గౌశికుఋణ మేమిటఁ దీర్తు'
నని మదిఁ దలపోయ నా మహారాజు
గనుఁగొని కినిసి నక్షత్రకుం డనియె
'నూరకనివ్వెఱగొంది యిట్లున్న
నేరీతి మాధనం బిటమీఁద వచ్చు.
జెచ్చెర నొక త్రోవఁ జేసి మమ నిపి
పుచ్చిన బోదు మీపోరాట ముడిగి
వడి నారఁ గైకొన వచ్చు చట్రాత

............................................................................................................

హేతీక్ = ఈనీ చేతిలోనుండు ఖడ్గము చేత, మెడ మెండుకొని తెంపుము= నా మెడ విజృంభించి తెగ నఱుకుము, నోరుదొడుకుట= నోరు మెదల్పఁజేయుట-మాట లాడించుట యనుట. బల్లీదు ... బొబ్బ-బలవంతుని చేతిలోఁజిక్కినధనము పిల్లి పట్టుకొన్న మాంసఖండమువలె మరలఁదీసికొన శక్యము గాదు ప్రీదులక పోయె =సడలి మరలిరాదయ్యే, వడి ...చట్రాత = చట్టురాతినుండి నారు

234

హరిశ్చంద్రోపాఖ్యానము

బడయంగ వచ్చును భస్మతై లంబు
నిసుక నంటకముగా నివిరింప వచ్చు
రసము సేయఁగ వచ్చు రాలు గరంగి
రాదు నీ మనసు మార్దవము నొందింప
మేదినీనాథ యీమేలంబు లేల.......................................1320
లే లెమ్ము ధనము చెల్లింపు నీ'వనిన
భూలోక నాథుఁ డప్పుడు విచారించి
నక్షత్రకునిఁ జూచి 'నాదుర్గుణములు
లక్షలు వానిఁ బల్మఱు నేన్న నేల
నాలిని బుత్రుని నంగడిఁ బెట్టి
కాల కౌశికుఁ డనుకష్టున కమ్మి
కూర్చిన ధన మెల్లఁ గుదుకన గోలు
నేర్పుసఁ గైకొంటి నీకు సిద్ధించె
మునిశిఖామణితోడ మొరిగిన మితికి
ధనము: జెల్లించుచందము డెందమునకుఁ .....................1330
దలపోసి చూచితిఁ దక్కొండు గాన
నలవడ దటుగాన నాలస్య ముడిగి
నామీఁద వచ్చుధనం బెల్ల నీకు
నే మానవుం డిచ్చు నీమితిలోన
నతనికి బంటుగా నమ్ముకో నన్ను

....................................................................................................


దీయవచ్చును, పడయంగ ... తైలము= బూడిదలోనుండి నూనె సంపాదింపవ చ్చును, ఇసుక ... నివిరింపవచ్చు= ఇనుక ను వంటకముగా కరఁగింపవచ్చును, రస ము... గరంగి= రాలుగరంగి రసముఁ జేయఁగవచ్చు'నని యన్వయము. కరంగి=క రగించి, మార్దవము=మృదుత్వము, కుదుక గోలున నేర్పున = వంచన యొక్క నై

పుణ్యము చేత, అలవడదు= అనువుపడదు, నామీఁదవచ్చుధనము= నన్ను అమ్మగా

ద్వితీయ భాగము

.

235

మతిలోన వల దనుమానింప ననిన
నావటుధూ ర్తుండు నట్ల కా కనుచు
వావిరి నారాజువలపలి కేలు
తనపు సుక పుఁబాటఁ దగ ముడి వేసి
చనుమంచు నట కొని చని పురిలోనఁ......................1340
బొడగన్న వా రెల్లఁ బురపురం బొక్క
నడరి పేరెత్తి యిట్లని యమ దొడఁగె
‘జనులార వనుధలో సన్నుతి కెక్కు
వనజాత బాంధవవంశ వర్ధనుని
సారవ ర్తను హరిశ్చంద్రన రేంద్రుఁ
గోరినధన మిచ్చి కొనరయ్య మీర
అరుదుగా బొందితో నమ రేంద్రపురికి
జరిగిన యట్టి త్రిశంకుభూపాలు
కూరిమిపుత్రు సద్గుణవిభూషణుని
గోరినధన మిచ్చి కొనరయ్య మీరు........................1350
త్రిజగంబులను మేటిదీవు లనెల్ల
నిజజయ స్తంభముల్ నిలిపి యవక్ర
భూరిపరాక్రమంబున నొప్పు రాజుఁ
గోరినధన మిచ్చి కొనరయ్య మీరు
కలరాజ్య మెల్లనా కౌశికమునికి
నిల యెల్ల నెఱుఁగంగ నిచ్చితి ననుచు
ధార వ్రాసినమహాదానవినోదిఁ

........................................................................................................

వచ్చునట్టిరొక్కము, అమ్మకో = అమ్ముకొనుము, వసుధ - భూమి, వనజాత బాంధ 'వవంశ వర్ధనుఁడు = సూర్యవంశము వర్ధిల్లఁ జేయువాఁడు, అవక్రభూరిపరాక్రమము = వంకర లేని విస్తారమైనవిక్రమము, పొదలు = పెరుఁగుచున్నట్టి, కదియించు= చే

236

హరిశ్చంద్రోపాఖ్యానము

గోరినధన మిచ్చి కొనరయ్య మీరు
బేతాళుతలఁ దైవ్వ వేసి సన్మునుల
భీతి నివారించి పేర్చినయట్టి...................................1360
వీర శేఖరు జగద్వి ఖ్యాత చరితు,
గోరిన ధన మిచ్చి కొనరయ్య మీర'
లని వాడవాడల నమ్మున మ్మునత్తరిని
బెను పొందు పేరును బెంపును జెప్పి
యవనీశు మునిపుత్రుఁ డమ్ము వాక్యములు
సెవుల సోఁకుటయునచ్చెరువంది చెలఁగి
పొదలు పాపంబులు పూదోలి ముక్తి
గదియించు మణికర్ణికాసమీపమున
మతమారఁ దనతపోమహిమఁ గౌశికుఁడు......................1370
పితృవనం బొకటి గల్పించి యా మున్నె
యురుశక్తి వీర బాహుని పేర జముని
బరఁగిన చండాలపతిగా సృజించె
కుఱు వెండ్రుకల కోరకొప్పిడి కాని
యఱవుడు తలనిట్టు నట్టును జుట్టి
జేగురుబొ ట్టిడి చెవి సంకుఁగొడుపు
లాగుగా వ్రేలఁ దెల్లని ముడ్సు నిల్పి

.......................................................................................................

ర్చు, మతమారన్ = మతము చక్కఁగా ఆలోచించి, పితృవనము = రుద్రభూమి " ఉరుశ క్తిన్ = గొప్ప సామర్థ్యము చేత, వీర బా... సృజించె= యముని వీర బాహుఁ డను పేరుగల చండాలపతి గా సృజించెను, కుజు ...ప్పిడి=కుఱుచనైన వెండ్రు కలను మడిచియోర గాకొప్పు పెట్టి, కావియఱవుడు=చింపులు గానుండు కావి

గుడ్డ, సంకుగొడుపులాగుగాన్ =శంఖము కో పువలె, ముడ్సు = ఎముక , తొలులువో

ద్వితీయ భాగము.

237

తొలులు వోయిన ప్రాతతోలును గప్పి
బలుగత్తి మొల నచ్చు పడ నమరించి
కడుమైల పేలిక గాసించి నడుము
బడికి వేసిన యరపట్ట బిగించి...................................1380
యెడమచేఁ బశుమాంస మేర్చినగుదియఁ
గడమచే నినుపయుంగరములగుదియ
గడజాతిగాఁ బూని క్రందుసందడిని
జడియుచు శంబళి శంబళి యనుచు
దళముగా మెఱసెడితన మేనికుష్టు
పొలసుకు జుమ్మని పొలయుమక్షికల
గుంచియతోఁ జోఁపు కొనుచుఁ బెన్నలుపు
మించి కందెన నూనె వేఁగినట్లున్న
'మొగమునఁ జీఁకట్లు ముడివడఁ గల్లు
సగము ద్రావినకుండఁ జంకట నిటికి..............................1390
మీరినమదమున మెయి దేల గిలఁగఁ
బాఱంగ వెడపాటఁ బాడుచు బయలు
జాఱుచు నల్ల సచ్చనిపొడి మ్రింగి

..................................................................................................................

యిన = తూట్లుపడిన, కడుమైల పేలిక = మిక్కిలిమాసిన చింపిగుడ్డ, కాసించి= కా సాగాలగట్టుకొని, అరపట్టె= ఒడ్డాణము, ఏర్చిన గ్రుచ్చిన, కడమ చేన్ = డాచే త, కడజాతి గాన్ = చండాలజాతికి సూచకముగా, క్రందుసందడిని= అలముకొ నుగలబకును, జడీయించు= జళిపించు, మక్షికలు= తేనీఁగలు, కుంచియ=కుచ్చు, పెన్న లుపు-= కటికి నలుపు, కందెన నూనె = బండికీలునూనె, మేఁగిన=పూసిన, మిక్కుటమైన, చీఁకట్లు = చీఁకట్లవంటి నల్లఁదనపు కాంతులు. మీరినమద మునన్= అతిశయించిన కావరము చేత, తేలగిలఁగన్ పాఱగన్ = తేలికగానుం డఁ గా, మేనును ఇచ్చవిచ్చినట్లు మత్తు చేవిదుల్పఁ గాననుట, పెడపాట =

సన్న నిపాట,బయలుజాఱుచు =ఇటునటు తొలఁగుచు, నల్లపచ్చని పొడి

238

హరిశ్చంద్రోపాఖ్యానము

రోజువాసము నుల్చి గుడ్లెర్ర జేసి
కెలని వారల బూతు గెరలఁ దిట్టుచును
దొలఁగు రాజెవ్వఁడు దొర యెవ్వఁ డనుచుఁ
దాగిన రోజు మత్తా గొని యిన్ని
లాగుల నల్లనల్లన నృపుఁ గదిసి
యోరువ రాక బిట్టోకిలిం తొదువ
నోరు మద్యముకంపు నూల్కొనఁ బలి కె..................1400
నోరి నాపంచినయుడిగ మేమైనఁ
గోరి సేయుచు నొఱ గొడ్డంబు లేక
కొలిచెదవేని యీ గోచి బాపనికి
వలచినధన మంతవట్టును నిచ్చి
బంటుగా నేలుదుఁ' బరఁగ ని న్న నినఁ
గంటకం బొదువ భూకాంతుఁ డిట్లనియె
“నోరి చండాలుఁడ యారకుండెదవొ
నోరు వ్రోయఁగ వ లెనో పండ్లు డుల్ల
నుడుగక కల్లు గ్రుడ్లుఱుకంగం ద్రావి

.........................................................................................

బుక్కాపొడి, నుల్చి = మెలిఁ బెట్టి, బూతు = బండమాట,కెరలన్ = మిక్కుటమగునట్లుగా, తొలఁగు ,.. డనుచు = తొలఁగిపో నా కెవ్వఁడురాజు నేను గాక మఱియెవ్వఁడుదొర, యనుచు- ఇది దారి నెదురుపడిన వారిననుమాట, త్రాగినరోఁజు మత్తా= కల్లు త్రాగుట చే నిట్టూర్పులు పుచ్చునట్టి మత్తు, బిట్టు=మిక్కిలి, ఒదువన్ = కలుగునట్లుగా, నూల్కానన్ = నెలకొనఁగా, ఊడిగము=పని, ఒజగొడ్డెము=మససునొప్పించు వంకరమాట, అంతపట్టును= పూర్ణముగా, కంటకము=అసహ్యత, డుల్లన్ = రాలునట్లు, గ్రుడ్లుఉ ఱుకంగన్ = గ్రుడ్లు వెలికి ఉబ్బునట్లుగా, కల్లుద్రావియనుట, బట్టి-అఱవుడు, చింపి = చిని

.

239

ద్వితీయ భాగము.

యొడ లెఱుంగక పేలె దూరక నీవు.................................1410:
కులహీనుఁడవు భానుకులజుని నన్ను
బిలిచి యే లెద నంటి వెఱపింత లేక
కట్టిన డొక బట్టి కప్పింది తోలు
చుట్టిన దొక చింపి సొమ్మెల్ల నినుము
కక్కువచ్చెడి నిన్నుఁ గనుఁగొన నకట
వక్క సేయని లేకి వాఁడవు నీవు
నే నేడ నీ వేడ నెమ్మి గౌశికుని
కే నిచ్చుధన మేడ నీలాగు మెట్టు
మెట్టుకుఁ దఱుమిన మెఱమెడుకోప
మెట్టు వుట్టదు విన్న నెవ్వరికైన'....................................1420
నావుడు వాఁడును 'నామీఁద నలుగ
దేవతులకు నైనఁ దీర దెల్లందుఁ
దప్పు లెల్లను దండధరుఁడనై వెదకి
చప్పుడు గాకుండ జనుల దండింతు.
మాటలఁ బని యేల మాకును నీకు
మాటి మాటికి నన్ను మాలవాఁ డంచు

........................................................................................................

గినగుడ్డ, సొ మెల్ల నినుము = సొమ్ము లెల్ల ఇనుపసొమ్ములు, కక్కు: వాంతి, వక్క నేయని... వాఁడవు=వక్క కుఁగూడకొఱగానట్టి అప్రయోజకుఁడవు. లేకి అనఁ గారాలినగింజలు = లేకి వాఁడనఁగా రాలినగింజ లేర్పఱచుకొని బ్రతుకు వాఁడు.. మెట్టు మెట్టుకు= అంచెకంచెకు -పయి పయిని, తఱమినన్ = ఒత్తిమాట్లాడఁగా మెఱ మెడుకోపము = మనస్సునఁ గ్రుచ్చుకొన్నట్లు బాధిం చెడుకోపము ;నా మీఁద ... తీఱదు' వాపైకోపము చేసికొనుటకు దేవతలకుఁగూడ శక్యము గాదు,

'మాకును నీకును మాటలఁబనియేల' ననియన్వయము. ఒక్క నాణెమై= ఒక్క మేని

240

హరిశ్చంద్రోపాఖ్యానము

నీకు రోయఁగ నేల నీతండ్రి కులము
నాకులంబును నొక్క నాణెమై యుండు
నిప్పుడే నెట్లుంటి నేమి కౌశికుని
య ప్పెట్లు దీర్చెద వవుఁ గాదొ చూడు .......................... 1430
తులువ నీమది నింత దురభిమానంబు
గలవాఁడ వీముంజిగానిచే నిట్లు
దొసఁగులఁ బడి చిక్కి దొంగ చందమున
వైస కట్టు వడి నీచవృత్తి రానేల?
"కినిసి నీతోడఁ దర్కింప 'నేమిటికి
ధనముఁ బెట్టిన నెందు దాసులు లేరె'
యనిన హరిశ్చంద్రుఁ డాయంత్యజుండుఁ
గనలీ తర్కింప నకు త్రకుం డనియె
“నలినా ప కులనాథ నాతోడ నీవు
పలికిన మాటల పద్ధతి దప్పె..........................................1440
మునినాథుతో మున్ను మునిపిన మితికి
ధన మిచ్చువానికి దాసునిఁ గాఁగఁ

.............................................................................................................

మై- ఒ కేయంతస్తు గాననుట - హరిశ్చంద్రుని తండ్రి త్రిశంకునికి విసిష్ఠశాపమున చండాలత్వముగలుగుట యిట యూహించుకొనునది, ఇప్పుడే నెట్లుంటి నేమి= నేనిప్పుడు ఎట్లుండినను నీకేమి. అవుఁ గాదొచూడు = నీ చేతనప్పుదీర్చుటకవు నో కాదోచూచుకొనుము - ఇదిచూచుకొనక నన్ను నిందింప నేలయనుట, దుర భిమానము=దురహంకారము. ముంజి గాఁడు=వడుగు, దొసఁగులన్ = తప్పులను, తర్కింప వాదులాడఁగా, మునిపిన = చెప్పినట్టి, వినుత సత్కులజునిన్ పొగడ్త కెక్కినమంచికుల మునఁ బుట్టిన వానికి, అంజక = నెనుదీయక , పల్లె... శాస్త్రమె = మంటిపిల్లియైనను పల్లె త్తి ఎలుక లఁబట్టినచో ఆంతే పిల్లి శాస్త్రము

కోరిన ... నాపాలు= ఆడిగిన ద్రవ్యమిచ్చి నిన్ను గొనిపొండని వ్యర్థముగా మొఱ

241

ద్వితీయ భాగము.

గొనిపోయి న న్నము” మ్మంటి గాని
వినుతసత్కులజుని వెదకి యిమ్మనవు
వీనికులం బేల వీనిరూ పేల
వీనిగుణం బేల వీని పెం పేల
మాలైన నేమి బ్రాహణుఁ డైన నేమి
తోలు గప్పిన నేమి తులువైన నేమి
గంజాయి దినె నేమి కలు ద్రావె నేమి
నంజక ధన మిచ్చునతఁడె నా మెచ్చు
పల్లె త్తి యెలుకలఁ బట్ట నోపినను
పిల్లి శాస్త్ర మె మంటిపిల్లి యే చాలుఁ
గోరినధన మిచ్చి కొన రం డటంచు
నూరక మొఱనెట్టు చుండ నాపాలు
వారక నినుఁ గొన వచ్చిన వారి
తో రాయిడించి పోఁ దోల నీ పాలె
మలకలు మాని యీమాలని నేల
కలధన మిప్పింపఁ గలవె కాదేని
వెక్కు మాటలు గట్టి పెట్టి సత్యంబు
దక్కు బొంకితి నని తలఁగి పోయెదవు............................1460
బలువున నినుఁ ద్రాటఁ బట్టి పట్టణము
కలయఁ ద్రిమ్మర నాకుఁ గారణం బేమి
విను నా ప్రతిజ్ఞ నీ విత్త మంతటికి

..........................................................................................................

బెట్టుచుండుట నాభాగ పుపని, రాయి డించి పోఁదోలనీపా లె =క లహించి వచ్చి నవారిని పోఁదఱుముట నీ భాగ పుపనియా, మలకలు = వంకరనడతలు, త్రాటఁ

బట్టి-పుస్తకపు త్రాటికిఁగట్టి, కలయన్ = అంతటను, ఇంతటికి నినుమడి పెట్టి

242

హరిశ్చంద్రోపాఖ్యానము.

నినుమడిఁ బెట్టిన నింక నొండొకని
కేగతి నిను నమ్మ నితనికే కాని
శ్రీగురునాన కాశీనాథునాన"
యని రాజు మునిపుత్రుఁ డాడువాక్యముల
విని యంత్యజుఁడు మోము వికసింపఁ బలి కెఁ
“బరిణమించితి నిన్ను బాఁపనవడుగ
తిరుగక యీమాట తిరముగా నిలుపు......................................1470
వక్క సేయని లేకివాఁడని నన్ను
సేయక కరాళించె నీ రాజు
వాటమై యీమాట వడి నమ్ము వోలె
నాటి యున్నది నేడు నా మనంబునను
గెంటక యీయప్పు గెంటి యీ తులువ
బంటు గా నేలక పాయదు కోప
మప్పు ధసం బింత యని గురి నాకుఁ
జెప్పుము చెల్లింతుఁ జేకొను' మనిన
నలరి నక్షత్రకుఁ డతనితోఁ దెలియఁ
బలికె 'నీ భూపాలు పై తరు వనెడి....................................1480
చేతిసంకెల వీడఁ జేసెద వే ని
దాతవు నాపాలిధర, దేవతవు

..............................................................................................................

న... నమ్మను = నీవియ్యపలసిన ధనమునకు రెండింత లి చ్చెదనన్న ను వీనికిదప్ప వేరొక్కనికి ఏవిధమునను అమ్మను, అంత్యజుఁడు మాలవాఁడు, పరిణమిం చితి= మొక్కితి, తిరము గాన్ = స్థిరముగా, కరాళిం చెన్ = భీష్మము గాపలి కెను, అమ్ము= బాణము, గెంటక = వెనుదీయక , గెంటి= తొలఁగించి, గుఱ= కొ లఁది , మేర, తరువనెడి చేతిసం కెల = చేతిసం కెలవ లెనుం డెడి నాతప్సీలు, 243

ద్వితీయ భాగము

వేడుక జట్టి గావించి నా పూన్కి
వీడ నాడకు మాకు విత్త మిం తనిన
లోఁగి యీఁతకుఁ గానిలో తని జట్టి
వీఁగక సర్వధా వినియెద నేని
పురుషు డేనుఁగు నెక్కి పొడవుగా నిక్కి
వరరత్న మెగిరిపో వై చినపొడవు
ధనరాశి మా కిమ్ము తడయ లెమ్ము
విను నిక్క మిది నుమ్ము వీఁడు నీ సొమ్ము1490
గొను' మన్న వాఁడు నిక్కుచుఁ బల్కెనీకు
ధనరాశి యిచ్చోటఁ దరలక నిత్తు
నొక విచారము మాకు నొదవె నీ రాజు
సుక వాసి పనిపంద చూపుగుజ్జంబు
మామిడి క్రిందిసోమరి మేదకుండు
భూమి తుంటరి యెనుపోతు పై వాన


వేడుక జట్టి గావించి = ఎగతాళికి బేరము మాట్లాడి, నాపూన్కి వీడనాడకు = నీకమ్మవలయున నెడి నా ప్రయత్నమును నేను విడిచి పెట్టినట్లు బేరము మాట్లాడ కుము,విత్త మిం తనిసర్" = మాకు వేల గా నియ్యవలసిన ద్రవ్యము ఇంతయని చెప్పఁ ఈఁతకుఁ గానిలోఁతుఅని= ఈత కొట్టుటకుఁ దగినలోతు లేదని- ఇచ్చిన వెలకు తగినంతలాభము లేదని యనుట, వీఁగక వెనుదీయక, నిక్కుచుక్బి ట్టుబిగిసికొనుచు, తరలక =తప్పక, సుకవాసి= సుఖము గా బ్రతికిన వాఁడు, పని వంద = పనులు యందు మందుఁడు, చూపు గుజ్జంబు పైచూపునకుఁదోఁచు బచ్చెనగుఱ్ఱము, మామిడి క్రిందిపోమరి మామిడి చెట్టు క్రిందనుండు సోమరిపోతు, పేదకుఁడు = గోలయైన వాఁడు, భూమితుంటరి భూమినిదున్ను వాఁడు, ఎనుపోతు పై వాన = ఎనుపగొడ్డ. పెవానవింటివాఁడు - ఎనుముమీఁదవానయెంత గురిసి నేను దానికి చలిపుట్టనట్లు ఎంత తర్జనభర్జనములు చేసినను వీనియెడ ప్రయోజన 244

హరిశ్చంద్రోపాఖ్యానము

మొండరి చల్ల చప్పుడు గోడ చేర్పు
చండిపో తనునట్టిజాన నున్నాఁడు
చెప్పిన పని జాగు సేసిన వేళ
ముప్పిరి గొనుకోపమున మొఱ వెట్ట 1500
దుడ్డున వీఁపు కంతులు గట్ట మోఁది
జడ్డు వాపినఁ గొల్వు చాలు నా కనుచుఁ
దక్కిపోయిన వెటఁ దగుల నా వశమె
యుక్కునఁ బెనఁచిన ట్లు న్నాఁడు వీఁడు
గొలుసు దప్పి నయట్టికోఁతిచందమునఁ
గలధన మీవు రొక్కము గొని పోదు
విల్లాలు పుత్రులు హితులు బంధువులు
దల్లిదండ్రులు నన్న దములుఁ గలుగు
నాని నెమ్మది నమ్మ వచ్చు. గా కిట్టి 1510
వాని నేగతి నమ్మ వచ్చుఁ నా'క నిన
నక్షుత్రకుండు భూనాయకుఁ జూచి
'దక్షతఁ జండాలుఁ దగ నొడంబఱిచి
పూఁట పూఁటకు జరుపుడు వుచ్చి చనక


ములేదనుట. మొండరి= మొండివాఁడు, చల్లచప్పుడు=చల్లచిలుకునప్పటి సద్దు వలె గొణగువాఁడు కాని చుఱుకుఁదనము లేనివాఁడు. గోడ చేర్పు = గోడమూల లందుఁ జేరిపడియుండు మూడుఁడు, చండిపోతు = దుండగీఁడు, ముప్పిరిగొను కోపమున, మిక్కిలియతిశయించిన క్రోధము చేత, దుడ్డునకట్ట చేత, కంతులు = కణుతులు, జడ్డు = మొద్దుతనము, ఉక్కునఁ బెనఁచినట్లున్నాడు = ఉక్కు తెచ్చి మనుష్యరూపముగా చేసినట్లు విని యవయవములు మిక్కిలిదృఢములుగాను బలవంతములు గానునున్నవి. గొలుసు ... కోతి- కట్టినగొలుసునుండి తప్పించుకొన్న కోఁతి, జరుపుడు పుచ్చిచనక

ఎట్లోజరిన్

ద్వితీయ భాగము.

245

పూఁటకాఁప వె నీవు పొమ్మని యనక
మితి కాక మున్నె నీ మీఁదిధనంబు
మతమునఁ జెల్లింపు మా కిప్పు' డనుచు
బోధించి పక్కలు ఎడుచునవ్వడుగు
బాధకు నలసి భూపతి మది లోన
నెడపక ధనముఁ బ్రో విడి నేఁటితోడఁ
గడతుఁ గౌశికు మాయఘట్ట మే'ననుచు.........................1520
వీర బాహును జూచి విను మని పలికె
“నీరీతి నపనమ్మి కేల నా మిదం
జాల నీతని కుల్కి సత్యంబు రోజుకు
నూలిపోఁగునఁ జిక్కి నుసల కున్నాఁడఁ
దల్లి సత్యము నాకుఁ దండ్రి సుజ్ఞాన
మెల్లెడ సోదరుఁ డెసఁగు ధర్మంబు
చెలువార ధైర్యంబు చెలికాఁడు శాంతి
కులసతి వినయంబు కొడుకు చర్చింప
'నే సత్యమునకుఁగా నిప్పుడు నీకు
దాసుఁడ నై జట్టి దక్కుచున్నాఁడ....................................1530

........................................................................................................ పోక, పూఁటకాఁప వేజ నీవు నాకు మధ్యస్థుఁడవాయని చెప్పక , పక్కలువాడు చు =కడుపుప్రక్కలందు పొడిచి నిర్బంధ పెట్టు, ప్రోవిడి = రాసిగాఁ బెట్టి, కౌశికుమాయ మట్టము = విశ్వామిత్రుడు సేయు మాయల మేర, కడతు = దాఁ టుదును- అతని ! మాయలనుండి విడివడుదుననుట, అపనమ్మిక నమ్మిక లేమి, ఉల్కి= భయపడి, నూలిపోఁగున ...కున్నాఁడు=నూలిపోఁగంత యీపడుగు నకుఁ జిక్కి సత్యమునుబట్టి చలింపకు న్నాడను నూలిపోఁగువలె నాకు విడి పించుకొనుట అతి సులభముగా నుండినను సత్యమునకుఁగట్టు వడి యందుఁజిక్కి- యేయున్నాను; ఇట్లుండఁ గా నిన్ను గూడ నతిక్రమింతువా ' యని భావము.

జట్టిదక్కుచున్నాఁడ= బేరమునకు లోనగుచు.న్నాఁడను, అట్టిసత్యము .. .
246

-

హరిశ్చంద్రోపాఖ్యానము.

వట్టి సత్యంబు నేఁ డగు నాకుఁ బూఁట
గట్టిగాఁ జేపట్టి కలఁక పో విడువు
నీయాజ్ఞఁ దల మోచి నీ కనుసన్న
బాయక ఏపంపుపను లొడఁ గూరు
నలఁగక నా చేయునంత కాలంబు
నలసిన సొలసిన నటు నిటుఁ జనిన
మఱచిన వెరచిన మఱి నీధనంబుఁ
జెఱచినఁ బఱచినఁ జేయఁ లే ననిన
విసికిన గసికిన వెడనిద్ర నొంది
నుసలిన మసలిన నొప్పిఁ జెప్పినను...........................1540
మెఱుఁగులు గ్రము నామేటి ఖడ్గమునఁ
దఱిఁగి ర క్తము గాఱ దనతలఁ దెంచి
నీపాదములమీఁద నిలుపుదు నిదియె
నాపూని' కనిన నంతట సమ్మతించి
వీర బాహుఁడు తన వెంట నే తెంచు
ఘోరమూర్తుల నతి క్రూరవ ర్తనులఁ
దనకింకరులఁ బంపి ధనముఁ దెప్పించి
ఘనతర పర్వతాకారంబు గాను
బెను రాసి వ్రాయించి ప్రియము రెట్టింప
మునికుమారున కిచ్చి మొక్కి పొమ్మనిన....................1550
నక్షుత్రకుండు నానందంబు నొంది

.......................................................................................................

పూఁట=సత్య మేనాకు పూఁట కాఁపు - నిన్ను తిరస్కరింపననుట, కసికినన్ = కనుక్కు మన్నను, వెడనిద్ర=కొంచెమునిద్ర, నుసలినన్ = తొలఁగినను, తఱిఁగి=

కోసి, ఘోరమూర్తుల = భయంకరాకారులను, ఒడఁబడ్డ = ఒడంబడిక చేసి

ద్వితీయ భాగము

.

247

లక్ష భంగుల నృపాలకుని దీవించి
'యుర్వీశ మాకు నీ వొడఁ బడ్డదనము
నర్వంబుఁ జెల్లె నీశ్వరసాక్షి గాను
విచ్చేయు మిఁక' నని వీర బాహునకుఁ
ఇచ్చెర నప్పన సేసెఁ జేసేత
దివినుండి కనుఁగొని దివిజులు మెచ్చి
యవనీత లేశున కాఁకలి దప్పు
లొదవ కుండఁగ వరం బొసఁగి రావేళ
సదయుఁడై యంతటఁ జని యంత్యజుండు..........................1560
ముద మారఁ దనగృహంబునకుఁ బో నచటు
గదలి సగర్వంబుగాఁ దన చేతఁ
బట్టిన పశుమాంసభారంబు చంకఁ
బెట్టిన మద్యంపుబిందియ నిచ్చి
‘కొని రమ్ము నీవన్నఁ గువల యేశ్వరుఁడు
వినయసంభ్రమములు వెలయ వహించి
యే సిడిముడిపాటు నే వికారంబు
నేసిగ్గు రోఁతయు నెసఁగక వానిఁ
గొలిచి సంగడిఁ జనుగోసంగిబంట్ల
గలసి తా నటు చని కలయ నెల్లెడలఁ..................................1570
బడి యున్న ముడుసులు పసరంపుఁ దలలు
బడికి వేయఁగ నెండఁ బరిచినతోళ్ళు

..........................................................................................................

కొన్న , అప్పర సేసెన్ = అప్పగించెను, చేసేఁత = చేతిలో చేయివై చి, దివిజలు-= - దేవతలు, అంత్యజుఁడు = మాలవాఁడు, మద్యం పుబిందియ= కల్లుకుండ,

చిడిముడిపాటు = తొట్రుపాటు, సంగ డిన్ =తనతో జత గా, కోసంగిబంట్లు=
248

'హరిశంద్రోపాఖ్యానము.

గజచి కుక్కలు పీకఁ గాఁ బెను కొమ్ము
లొఱగఁ దీసినరీతి నున్న డొక్కలును
వఱద లై నెత్తురు వడియుకుత్తుకలు
తఱిఁగిన గోవులు తఱు చైనపచ్చి
మురియలు సెదరినముఱికి నంజుళ్లు
'నఱచు కాకులుఁ గలయామాలవాడ
వడిఁ జొచ్చి ప్రేవులు వాతి కే తేర
నడరుదుర్గంధంబు కణు మాత్ర మైనఁ........................1580
గింక రిపడక శంకింపక ధైర్య
మింకక చండాలునింటికి నేఁగి
యడరంగ భూపాలుఁ డామాల దన్ను
గడఁగి పంపుచు నున్న కష్టంపుఁబనులు
నెలకొని నిమిషంబు నిలిపిన కాలు
నిలుపక సొలవక నిద్దుర వోక
కలఁగక నన్నోదకములపై నాస
గొలుపక వ్యపగతకు తృష్ణుఁ డగుచు
మొగము స్రుక్కింపక ముడుఁగక రేయుఁ
బగ లన కమ్మహీపాలు: డొనర్ప.....................................1590

.............................................................................................................

వికారపురూపుగల పనివాండ్రు, పసరంపు=పశువుల యొక్క , బడికి వేయఁగన్ = పదను పెట్టుటకు, ఒఱఁగ దీసినరీతిన్=వాలునట్లు విలవిల రాచుకొన్న విధ ముగా - కుక్కలుఁ పీఁకఁగా నొప్పికి కొమ్ములు ఒఱగునట్లు నేలరాచినరీతి గా నే యున్న మృగముల బొందులనుట, మురియలు జఖండములు నంజుళ్లు=మాంసము లు, ప్రేవులు వాతి కే తేరక్ = అసహ్యమైన దుర్గంధము నకు ఓకిలింత పుట్టి కడుపు లోని ప్రేఁగులు నోటికి రాఁ గా, కింకిరిపడక =రోఁతపడక, వ్యపగ తక్షుత్ తృష్ణు

డు=పోయినట్టి ఆఁకలిదప్పులుగలవాఁడు, స్రుక్కింపక =ముడుఁగక, నెరసులు=

ద్వితీయ భాగము.

249

నెరసులుఁ దప్పులు నెమకుచు నొక్క
వెరవు చిత్తంబున వెదకి 'సత్యంబు
తెరలంగ వీని ప్రతిజ్ఞఁ దప్పించి
కరమి. మొనరింతుఁ గాళిక మునికి,
నని నిశ్చయము సేసి యావీరబాహుఁ
డొనరంగ నొక రాత్రి యుర్వ్త లేంద్రు
తొడలపై ( బదములతుదఁ జాఁపి భక్తి
నడుగు లొత్తుచు నున్న నతనిమనంబు
నొరయ మాయా నిద్ర నొంది రే యెల్ల
జరణ సేవ యొనర్చుజననాథుఁ జూచి...............................1600
'యోరి నీదెస నాకు నుల్లంబునందు
వారక కొంతవిశ్వాసంబు వెడమెఁ
బన్నుగా నా సేయుపనులపై నిన్ను
మన్నించి నిలి పెద మది నఱ లేక
వినుమది చెప్పెద వివరంబు గాఁగఁ
బెనుపొంద నీ పురి ప్రేతవనంబు
నా గుత్తగాఁ జేసినాఁడ నీ వచటి
కేఁగి పీనుఁగుఁ గాటి కెవ్వరేఁ దెచ్చి
కైకొని తమయిచ్చ గాఁ గాల్చి మరలి
పోకుండ నాయానఁ బొడిచి యాశవము...........................1610

.................................................................................................................

దోషములు, తెరలంగన్ = తప్పిపోవునట్లు, ఆత నిమనంబు నొఱయన్ = ఆతని మనస్సునొ త్తి చూచుటకు, అఱ= సంకోచము, 'కాటికిన్ = వల్లె కాటికి, ఎవ్వరేన్ = ఎవ్వరైనను, తమయిచ్చగాన్తమయిష్ట ప్రకారముగా మనయుత్తరు

వులేక తమయిష్టము చొప్పునననుట, మరలిపోకుండ = తిరిగిపోకుండునట్లుగా,
250
హరిశ్చంద్రోపాఖ్యానము.

మొల నున్న వస్త్రంబు మొగము కోక యును
వలనొప్ప నొకమాడ వాతి పాతిక యుఁ
ఔనుపొంద నాకిచ్చి పిండాశ నంబుఁ
దిని నీవు బ్రతుకు మీ దినముననుండి
వీరదా సనుపేర వెలయు మీ విపుడు
కోరిపట్టడుముద్ర గుదియ గొ'మనుచుఁ
దన చేతి కిచ్చిన దగఁ బని పూని
వినయంబుతో మొక్కి వీడ్కొని పోయి
యత్తజ గమురుకం పడరి దిక్కులను
మొత్తమై నిగుడు'క్రొంబొగలు నంతంత..........................1620
మండు నొల్కులుఁ జేరి మానవమాంస
ఖండంబు లొండొండఁ గసికిలఁ గ్రుచ్చి
కమ్మగాఁ గాల్చి చంకటఁ బెట్టి మెసఁగి
నెమ్మది నృత్యంబు నెఱపుభూతములు
సగము గాలుచు నున్న శవములఁ బట్టి
తిగిచి గుంపులు గూడి తినుపిశాచములు
నెడ నెడ బొక్కల నిజన బాలకుల
వెడలించి భక్షించుబేతాళతతులుఁ
దల కాయలకు మూఁగితమతమ వనుచుఁ
గలహించుడాకినీగణములు మఱియు..............................1630

.........................................................................................................

పొడిచి= అగపడి - వారిక నుట, వాతి పాతిక = వాతి కాసును, పిండాశనంబు= తర్పణములప్పుడు పెట్టుపిండము లాహారము, కమరుకంపు= కాలిన దుర్గంధము, ఆడరి- =వ్యాపించి, ఒల్కులు= పీనుఁగులు, కసిక లు= సలాకలు - శూలములు, ఎడ

నెడ =నడుమనడుమ, బొక్కల = గుంతలందు - బిడ్డలను సొద పెట్టి కాల్ప

ద్వితీయభాగము.

251

వడి వధ్యశిలలపై వడిసి యందంద
మడువులై పేరినమనుజరక్తములుఁ
బురియల నట మ్రింగి పులి తేఁపు లడర
నఱగక పొరలాడి యఱచు రక్కసులు
మునుముగాఁ గొఱ్ఱుల మోఁకాళ్ల నూఁది
కొని నిక్కి యా మీఁదఁ గుణపశల్యములు
దొడికి దంష్ట్రల నొక్కి ద్రుస్సి రాఁ దిగిచి
కడఁగి క్రక్కెడు జంబుకములుఁదోఁడేళ్లు
బిండాన్న శేషముల్ ప్రిదులక మెసంగి
యొండొండ వ్రాలుచు నున్న ఘూకములు..............................1640
గరములఁ గొఱవులు గైకొని పేర్చి
గురులు వా జెడు పెద్ద కొఱవి దయ్యములు
పూకుండ మాయపుఁ బూసరల్ దెచ్చి
చేకొని యామంత్రసిద్ధుల కిచ్చి
తొత్తులగతి నుండి తొడరిననరులఁ
బొత్తులఁ ది నెడు పెంపుడుదయ్యములును
సరిఁ గూడి ఋగ్యజుస్సామవేదములు

...........................................................................................................

కగుంతలు త్రవ్విపూడ్చుటగలదుగనుక నిట్లు చెప్పఁబడినది, వధ్యశిలలు=చంపఁ దగిన వారినినిలిపి చంపునట్టిఱాళ్లు, మునుము గాక" = ముందుగా, కుణపశల్యము లన్ కాపీనుఁగు నెమ్ములు, తొడికి=పట్టి కొని, ద్రుస్సీ రాన్ = తెగివచ్చునట్లు, జంబు కములు = నక్కలు, గురులుపా పెడు= పరువు లెత్తెడు, మాయపు పూనరల్ = కపటపు పూదండలను, మంత్రసిద్ధులు = మంత్రసిద్ధి కైవల్లెకాటిలో జపాదులు చే యువారు, తొత్తులు= వరవుళ్లు, తోడరిననరులన్ = వారిని మార్కొన్న జనులను, పొత్తుల = ఒక రిపొత్తుననొకరు - సంగడిగా, పెంపుడుదయ్యములు= పెంచి నట్టి

252

హరిశ్చంద్రోపాఖ్యానము.

పరఁగ గుణించెడు బ్రహ్మరాక్షసులుఁ
గ్రందుగాఁ గలిగి వెక్కసమును వెఱుపు
నందంద యొదవించునారుద్రభూమి...............................1650
నారాజ శేఖరుం డటఁ బ్రవేశించి
ధీరుఁ డై నిజఖడ్గ దీప్తులు నిగుడఁ
పేరము సుడివడ నొడిసి
పట్టి కూతలుఁ బెట్టి బలువిడి మోఁది
యెల్ల భూతంబుల నెల్ల డాకినుల
నెల్ల శాకినుల మోహిని పిశాచములఁ
గనుఁగొని “నేఁ డాదిగా మీరు గూడి
చని వీర బాహునిసదనంబునందు
వెట్టి గొట్టము నీళ్లు వెలయంగఁ గనవు
కట్టెలు నివి యాదిగాఁ గలపనులు.....................................1660
పగ లెల్లజేసి మాపటి కిట వచ్చి
తెగువ మై నీకాడు తిరుగ రా నుండి
యెచ్చట నెవ్వరు నెఱుఁగక యుండ
వచ్చి పీనుఁగుఁగాలవైచి పోకుండ
నా లీల కోజువిదయ్యంబుల దివ్వె
కోలల నారిగాఁ గొని గస్తు దిరిగి

.........................................................................................................

దయ్యములు, సరిఁగూడి= సరి గా జతిగూడి; వెక్క సము= వేండ్రము, పేరము= పరుగు - చుట్టు, సుడివడన్ =తడ బడఁగా, వెట్టి=కూలిపని, కొట్టము=పసుల కొట్టము, కాడు=శ్మశానము, తిరుగరానుండి = చుట్టితిరిగి. ఎచ్చట... పోకుం డన్ = ఎచ్చటఁగాని ఎవరైనను తెలియకుండునట్లు పీనుఁగును కాలఁబెట్టి పో

కుండునట్లుగా, దివ్వెకోలలవారు = ది వ్విటీవారు, పొడచూపక = తము ఆగ

253

ద్వితీయ భాగము.

'ప్రొద్దునఁ జను దెంచి పొడచూప కున్న
గ్రుద్ది యీ దుడ్డునఁ గొట్టుదు' ననుచు
విపులసంపద గలవీర బాహునకు
'జపము సేయుఁడు మంత్రసాధకు' లనియుఁ.......................1670
జండాలుఁ డనక మాస్వామి దీవించి
రండు నిచ్చలు బ్రహరాక్షసు' లనుచు
గట్టిగా నియమ షూ"క్రమమునఁ జేసి
నిట్టరాడునుఁబో లె నిలుచున్న వాని
బేతాళు నొక్క నిఁ బిలిచి నీ వింక
ఘాతగా నా కొల్వుకాఁడవై వీరి
గొట్టి యిందఱిఁ బనిగొనుచు నిచ్చోటఁ
బెట్టింపు తగు మంచఁ బెంపార' ననిన
వసుధఁ జాఁగిలి మొక్కి. వాఁడును నేఁగి
మసలక దిబ్బగా మన్ను వ్రేయించి....................................1680
సమముగా ఘనశిలా స్తంభముల్ నిలిపి
యమరంగ నొక మంచ యామీఁద వైచి
“విచ్చేయు' మని విన్న వించిన విభుఁడు
వచ్చి యా మంచపై వలనొప్ప నుండి
యడిదంబు తోడుగా నా రుద్ర భూమి
కడు నప్రమత్తుడై కాఁ పుండె నంత
నట కాలకౌశికునాలయంబునను


..................................................................................................

పఱుపక, నిట్టరాడున్ = ఇంటినడుమపొడవుగా నాటినకంబము, ఘాత గా= గ ట్టిగా కొల్వుకాఁడు = భృత్యుఁడు, అడిదము = కత్తి, మటుమాయలు = మిక్కుటపుమాయలు, మలక లు= వంకరలు, ఉడుకులు = కొందలములు

తపిం
254

హరిశ్చంద్రోపాఖ్యానము,

మటుమాయలను జిక్కి మలక లఁ జొక్కి
యుపవాసములఁ గుంది యుడుకులఁ గంది
యెపుడు చింతల వేగి హృదయంబు గ్రాఁగి...................1690
కంటకంబుల నొచ్చి కన్నీరు దెచ్చి
కంటసంబులఁ జిక్కి కఱుకులఁ బొక్కి
మురి పెంబు వీడి మోము గరంబువాఁడి
గరువంబు దూలి శృంగారంబు మాలి
విశ్రాంతి మది నాటి వెలు వెలఁ బాటి
విభమంబులు జాతి విశ్వేశు దూరి
బలు రాహుముఖమునఁ బడి కాంతి దప్పి
జలదరించెడు బాలశశి రేఖఁ బోలె
నలిగి యందఱు 'హంసనారి నాఁ బరఁగి
బలు బాములకు నోర్చి పట్టియుఁ దాను.....................1700
దినమును జంద్రమతీ దేవి పనుపు
పనులు సేయుచు నిట్లు పండ్రెండు నెలలు
మునుకొని వర్తింప భూపాలసుతునిఁ
గనుఁగొని యొక నాఁడు కాలశికుఁడు
చేరి 'యో లోహిత చెలఁగి యే ప్రొద్దు
నీరీతిఁ జంటి క్రిం దిటికి యీ తొత్తు

........................................................................................................

చుటలు, క్రాగి=క్రాఁగిన దై, కంటకములు = విరోధో క్తులు, కంటనంబులు= విప్రలాపములు, కఱుకులు =కాఠిన్యములు, మురి పెంబు = మురువు - నడల యొయ్యారము,గరువము= గొప్పఁదనము, జలదరించెడు... రేఖ=కంపించుచున్న లేత చంద్రకళ, హంసనారి= ఇది చంద్రమతికి కాల కౌశికునింటఁగలిగిన పేరు, బలు “బాములు= పెనుఇడుములు, చంటి క్రిం దిరికి స్తనముల క్రింద నేహత్తుకొని - తల్లి

ద్వితీయ భాగము.

255

కఱుపుల గుడిచాటుకాఁడ వై యిట్లు
తఱలవు వీఁ పెల్ల దద్దులు గట్ట
నిడువక కా దింక' నని జడ
తొడలును జెవులు నెత్తురు లుబ్బ నులిమి ..................1710
'యిది యాదిగా నింక నీ వాడలోనఁ
జది వెడియా బ్రహచారులఁ గూడి
బుద్ధి దప్పక వనంబునకు నిచ్చలును
బొద్దునఁ జని పదిపుల్లె లాకులును
వేలిమి సమిధలు వెలయ దర్భలును
బాలురపో రుడ్పబండ్లు దో సెఁడును
దులసి పత్రియుఁ బెయ్య దూడకుఁ గనవు
నలవడఁ గొంచు ర'మ్మని నియమించి
పనిచిన వెలు వెలఁ బాఱచు వచ్చి
తన తల్లి పాదపద్మములపై వ్రాలి...............................1720
యనయంబు వగచుచు నశ్రువు లొలుక
దన తెజం గప్పుడంతయుఁ జెప్పుటయును
గడుపులోఁ జెయి పెట్టి కలఁచి నట్టైనఁ
గడు భయంబునఁ బొంది కన్నీరు దొరుఁగ
గురుకుచంబులతోడఁ గొడుకుమో మత్తి
తరలాక్షి పెదవులు దడపుచుఁ బలికె
'గటకటా! కృప మాలి కాల కౌశికున

..........................................................................................................

నన్ను లమాటువిడుపక యనుట, కజపుల ... కాఁట డై= చెప్పుడు బోథనములు ప్రచురించుచున్న వాడ వై , తరలవు=కదలవు, అడుపక కాదింకన్ = కొట్టక నిఁక తీఱదు, వేలిమి= హోమము, ఉడ్పన్ ఇమాన్పించుటకు, పత్రి= బిల్వపత్రి, తలపేరు =

1
256

హరిశ్చంద్రోపాఖ్యానము-

కిటు నిన్నుఁ బని కంప నెట్లు నోరాడె
నడవికి నీ విప్పు డరిగినఁ గాని
తడయక విప్రునితల యేరు దిగదు...........................1730
పట్టభద్రునికూర్మి పట్టికి వేల్మి
కట్టెలు మోవంగఁ గట్టడే నీకు
గట్టిగా భాగ్యంబు గలవధూ మణికి
బుట్టక నా కేల పుట్టితి కూన
యడవికి నిన్నుఁ బొమ్మనఁ జూచి చూచి
నుడువంగ నే గతి నో రాడు నాకు
నీనుఁ బాసి నిమిషంబు నే నిల్వఁ జాల
ననుఁ బాసి పోయె దే నా ముద్దులయ్య
చేకొని యిఁక నేమి సేయ నున్నవియొ
కాక విశ్వామిత్రు కపటవ ర్తనము'...........................1740
లని వెచ్చ నూర్చుచు నా పుణ్యసాధ్వి
వినయంబుతో నెల్ల వేల్పుల వేడి
దనుజదర్వీకరతస్కరభూత
ఘనతరమృగ పక్షి గణములవలన
నవిరళంబుగఁ బ్రాణహాని లేకుండ
వివిధ భంగులను దీవించి నందనుని
వల చేత నొకరకు నలనొప్పం గట్టి

.................................................................................................................


తలనొప్పి, పట్టభద్రుని .... పట్టిన్ = పట్టాభిషి, క్తుఁడైన రాజుకడుపున బుట్టిన గా రాబు కొడుకునకు, వేలి క ట్టెలు= హోమముకొఱ కై నసమిధలు, కట్టడే = నిర్ణయ మా, విశ్వామిత్రుక పటవ ర్తనములు చేకొని యిఁక నేమి సేయనున్నవియె కాక అనియన్వయము, దనుజ = రాక్షసులు, దర్వీకర = సర్పములు,తస్కరం దొంగలు,

అవిరళంబుగన్ = దట్టము గా , వలను ఒప్పన్ = పొందుబాఱఁగా, మోరత్రోపు

ద్వితీయ భాగము.

257

యలుగక 'పొ'మ్మని యనుపంగ నడవి
కెలమితో నృపసూనుఁ డేఁగుచు నుండఁ
జలము మీరంగ విశ్వామిత్రుఁ డంతఁ..........................1750
దనమంత్రశక్తిచేఁ దక్షకుఁ డనెడి
ఘన పన్నగంబు నాకర్షించి పలికె
'నోయి తక్షక మాకు నుపకార మొకటి
సేయుము నీ కిది చెప్పెదఁ దెలియ
వినుము హరిశ్చంద్రవిభుఁడు వసిష్ఠ
ముసిమాట చెల్లింప మోరత్రోవునను
నెట్టన సత్యంబు నెఱ పెద ననుచు
నుట్టి గట్టుక వేలు చున్నాఁడు వాని
గలఁచి బొంకింప నెక్కడ సందు లేక
తలపోసి యీరీతిఁ దపము చాలించి.............................1760
తిట్టున కొడిగట్టి తిరుగు చున్నాఁడ
రట్టు దప్పక పొందు రా నున్న వేళఁ
గలయఁ బర్వెడుభ వద్దరళ కాలాగ్ని
గులగిరులైన నుగ్గులు వాఱ గాలు
వసుధలోఁ దక్కినవా రన నెంత
మసలక నీవు నా మతమున నేఁగి

................................................................................................................

ముట్టెతో త్రోయుట చేత పందులు మొద లై నవి ముట్టెతో నే యవలీల గా చెట్లను పెల్లగింపఁజూచునట్లు - కష్టమయ్యును అవలీల గాననుట, ఉట్టి గట్టుక ...చున్నాఁడు= ఒక్క టె దీక్షగానున్నాడు, తిట్టునకు ఒడిగట్టి = దూ ఱునకును లోనయి,రట్టు... నున్న వేళ = నింద రానున్న వేళ తప్పక వచ్చును, భవత్ గరళ కాలాగ్ని = నీ యొక్క విషమనెడి కాలవహ్ని, కులగిరులు = కులప


258

హరిశ్చంద్రోపాఖ్యానము

యహికులో త్తమ లోహితాస్యకుమారు
గహనఁ బులోఁ బడఁ గఱచి రమ్మనిన
దకయక పనిఁ బూసి తక్షకుం డపుడు
వడి నేఁగి యల పితృవన సమీపమునఁ.............................1770
దళ్లు కొట్టెకిగుంటదరిఁ జాలఁ బ్రబలి
చల్లగా నీడయై చలివెంద్రపూలె
మట్టంపుఁబొడవున మా నై నమర్రి
చెట్టు క్రిందటి పుట్ట చేకొని యుండె
నా తక్షకునిచేత కనుకూల మొదవం
బ్రీతితో శిష్యులఁ బిలిచి కౌశికుఁడు
'మునికుమారకులార ముదమున మీరు
చని లోహితాస్యుని సంగడిఁ గూడి
వనములోఁ జరియించువానిఁ బ్రేరేచి
కొని పోయి తక్షకు ఘోరవిషాగ్ని.......................................1780
బడఁ ద్రోచి రం'డని పనిచినవారు
తడయక చని రాచతనయునిఁ గాంచి
'యో లోహితాస్య మాయెజ్జలు వనుప
నీ లీల వచ్చి ము న్నెప్పుడు నిచటఁ
గడునొప్పుఫలములుఁ గంద మూలములు
నుడుగక కొనిపోవు చుందుము గాన

.....................................................................................................

ర్వతములు, ముగ్గులు వాఱన్ = చూర్ణమగునట్లుగా, గహనంబులో రరానియడవియందు,పడన్ = నేలఁగూలునట్లు, పితృవన సమీపమునన్ =వల్లె కాటి దాపున,తళ్లుకొట్టెడుగుంటదరి= చినచిన్నయలలు కొట్టుచుండెడి కొలనిగట్టున, చలి

వెంద్ర = చలిపందిరి, మట్టంపు పొడవున = దిట్టమైన పొడవు చేత, మానై న =

ద్వితీయ భాగము.

259

గుఱుతులు మే మెఱుగుదు మంతటికిని
దెఱఁగొప్ప నీవు నే తెమ్ము మా వెనుక'
ననుచు బోధించి వారటు గొనిపోయి
మను జేశ సుతుఁడు నెమ్మనమున నలర ......................1790
ఫలములు దర్భలు పసిమాకు కసవు
కలయంగఁ దోడ్పకి కట్టగాఁ గట్టి
సమిధలు దల కెత్తి “చను'మన్న మొగము
చెమరింపఁ గూఁటి చీకాకు పడఁగ
దడవడంకులు గొంచుఁ దను వెల్లఁ గంద
నడుగులుదొట్రిల్ల నల్లన నడచి
వచ్చి యల్లప్పటివటమూలమునను
జెచ్చెరఁ దలమోపుఁ జేర్చి రాసుతుఁడు
చల్లని జలము లచ్చటి గుంట ద్రావి
మొల్లన మరలి యాయుర్వీరుహుబు..............................1800
నీడఁ గొండొక సేపు నిద్రించి తన్ను
గూడి వచ్చినవడుగులు దలఁపింపఁ
“మనములో నిందాక మఱచి యున్నాఁడ'
ననుచుఁ బర్ములు రయంబునఁ గోయ
నొక కాలు పుట్టపై నూఁది యాసాద
మొక కొంత నిక్కి మ్రా నూతగాఁ దొక్కి

................................................................................................

గాగైన, ప్రేరేచి = పురికొల్పి, గుఱుతులు ... మంత టికీని=కందమూలఫలాదు జడుచోట్ల గుఱుతుల నెల్ల తెలియుదుము, దడపడంకులు = మిక్కిలి 'కోపమును, అల్ల ప్పటి=ఆ, తల మోపు తలమీఁది బురువు, ఒల్ల నన్ = మెల్ల గా,

'ర్వీరుహము= చెట్టు, తలఁపింపన్" = ఆకులు గొనిపోవలయునని తలఁపింపఁగా,
260

హరిశ్చంద్రోపాఖ్యానము

వాలుగొ మ్మొక కేల వడి వంచి యున్న
కేలు సాఁపఁగ గమకించునాలోనఁ
గాలకంఠ కఠోర కర కంపితోగ్ర
శూలాగ్ర నిర్గత స్థూల కీలాభ.........................1810
లోలజిహ్వారుణలోచనం బగుచుఁ
గ్రా లేడు ఫణము భీకరముగా ముడిచి
యాలోన నడఁగినయమ్మహాభుజగ
మాలోహితాస్యుని నదరంటఁ గఱచె
నా విషవహ్ని భగ్గునఁ బేర్చి మేన
నావహింపక మున్నె 'హా మాత ! యనుచుఁ
జావుతో సరిపోల్పఁ జనుమూర్ఛ నొంది
భూవరపుత్రుండు భూమిపై వ్రాలె
నంత. భస్మీ భూత మయ్యె నా వటము
సంతియ కాని యాయాదిసర్పంబు .................1820

................................................................................................


పౌలుగొము = వాలియున్న శాఖ, ఉన్న కేలు= తక్కిన చేయి, కాలకంఠ ... లోచనంబు, కాలకంఠ = శివునియొక్క, కఠోర = కఠినమైన, కర= చేతి చేత, కంపిత -= ఆడింపఁబడిన, ఉగ్ర=భయంకగమైన, శూలాగ్ర = శూలము మొ! ననుండి నిర్గత = వెడలిన, స్థూలకా పెద్దదైన, కీలా = జ్వాలతో, ఆభ = సాటి యైన, లోల= చలించుచున్న, జిహ్వా నాలుకయును, అరుణలోచనము = ఎఱ్ఱనికన్నులు గలది, ఇచట శివుని చేతికిని, పాముపడఁగకును, శూలము నకును పాము నాలుక కును, శూలాగ్రమందలి స్థూలకీలకును పాము ఆరుణలో చనమునకును సామ్యము దెలియుసది, ఫణము=పడగ, అదరంటన్ = బిట్టుగా పేర్చి = విజృంభించి, ఆవహింపక = ప్రవేశింపక, చావుతో... మూర్ఛ= మరణ

ముతో సమానము చేయ దగినసొమ్మ, ఆదిసర్పంబు తక్షకుఁడు, జనని తల్లి

ద్వితీయభాగము.

261

పనివడి చంప నోపదు బాలు నతని
జనని పాతివ్రత్యశ క్తి పెంపునను
నది చూచి ముని పుత్రు లాశ్చర్య మంది
‘నదిలోనఁ దలఁప నీ మను జేంద్రసుతుఁడు
నిగిడినవిషవహ్ని నిలువునఁ గాలి
పొగిలి భస్మము గాక పోలించి చూడ
నలకాలకూట మహాగరళంబు
చెలఁగుచు మ్రింగి మూర్ఛితుఁ డై నశివుని
వడువున నున్నాడు వాడదు మోము
విడువదు తను కాంతి వీస మంతయున.....................1830
బదతలంబులు గాజు వాఱవు నిప్పు
జెద లంటునే వలచేతి యీరక్ష
వెలయ నే మంచు దీవించి కట్టినదొ
తలపోయ మును వీనితల్లి దా' ననుచు
నరిముఱిఁ బురమున కరిగి యావార్త
తెఱఁ గొప్పఁ జంద్రమతీ దేవితోడ
గుఱుతులు సెప్పి వడ్గులు చని రంత-
గొఱగానిపలు కనుక్రొవ్వాడి వేడి
మెఱుఁగుఁగైదువు నాటి మెఱమిన గుండె
పఱియలుగా ఐలి ప్రాణంబు వెడలి................................1840

............................................................................................................

కాలకూట...గరళంబు = హాలాహలమహావిషము, గాజు పాఱవు =గట్టి రావు, కొఱు గాని= పసమాలిన, క్రొవ్వా డివేఁడి = పుక్కిలివాఁడియైవేఁడిగానున్న ' విరుగు కైదువు = పదును బెట్టఁగా తళతళ మెఱయుచున్న వాఁడి యాయుధ

లను, మెఱమినన్ = నాటి యిటునటు మెదల్చినచో, పరియలు=తునుకలు
262

హరిశ్చంద్రోపాఖ్యానము

యదరి భూవరు దేవి 'హా పుత్ర' యనుచు
నొదవిన వెనుమూర్ఛ నొక్కింతదడవు
తరిగినకడలి చందంబున నేల
యొరిగి చేష్టలు దక్కి యొయ్యన దెలసి
నేలలు పుడుకుచు నిగిడినవగల
వాలుఁగన్నుల నీరు వజద లై పాఱ
‘నక్కటా యో లోహితాస్య నా కింక
దిక్కెవ్వ రి టమీఁదఁ దెరు వేది బ్రతుకు
కీదుఃఖ వార్ధి నే నే తెప్పఁ గడవ
నీదురు నీవిధి కే మని వగతుఁ...............................1850
బతిఁ బాసియును నిన్నుఁబట్టి నాపట్టి
మతిని నే దిగులును మఱచి వర్తింప
నెక్కడ నుండి నేఁ డిటు వెంటనంటి
తెక్కలి దైనంబు దెక్కొనె నిన్ను
బుట్టక పుట్టిన పుట్టుభోగికిని
బుట్టభోగికిఁ బఁ బుట్ట నేమిటీకి

.................................................................................................................

భూవరు దేవి = రాజు భార్య, ఒదవిన=కలిగిన, తఱిఁగినకదళి = నఱకంబడినయరఁటి చెట్టు, పుడుకుచు= తడవుచు, నిగిడిన = సాఁగిన- అతిశయించిన, వాలుఁగన్నులు = విశాలము లైన నేత్రములు, వఱదలు=ప్రవాహములు, తెగువే.దెబ్రతుకుకు = బ్రతు కుటకు దారియేది? దుఃఖ = దుఃఖసముద్రము, ఏ తెప్పన్ = ఏది తెప్ప గాఁ గొని, - ఎవ్వరిని ప్రాపు గానాశ్రయించి, ఈమహా దుఃఖమును, కడవనీఁదుదును=దా టునట్లు ఈఁదఁగలదానను, ఈవిధికి= ఈ దైవ వ్యాపారమునకు, నిన్ను బట్టి=నీ వుండుటం జేసి, తెక్కలి = పంచన చే, తెక్కొ నెన్ = చం పెను, పుట్టక పుట్టినపు

ట్టుభోగికిని= లేక లేక పుట్టి పుట్టుక మొదలుగా భోగములనుభవించుచుండువానికి.

ద్వితీయ భాగము.

263

నప్పాపజాతిపు ర్వదరంటఁ గఱచు
నప్పుడు నన్ను నే మని తలంచితి వె
వేఁడిని హృదయ మీవిప్రున కెపుడు
వీఁడు కొండొక వాఁడు విపిన భూములకుఁ.........................1860
గనిక రింపక పంపఁగా నెట్లు వచ్చు
ననక కృపాహీనుఁడై నిన్నుఁ బం పెఁ
బంపెఁ బో నీకుఁగాఁ బనిఁ బూని యడవి
కిం పెసలార నే నేల పో నై తిఁ
బోవుట గలిగినఁ బుత్ర నిన్ గోలు
పోవుదు నే బుద్ధిఁ బురు పేట్టు మే సె
నీ పుట్టినప్పుడు నెమి దైవజ్ఞు
లేపార నిల యెల్ల నే లెద వనుచుఁ
గడఁగి పల్కిరి గాని కాలాహి చేత
నడవిలోపలఁ జత్తు వన రైరి తనయ.................................1870
యడవికి నీ వేఁగునపుడు గన్నీరు
వెడలెడు నీవాలు వెడదగన్నులును


ఆగర్భ శ్రీమంతుఁడగు నీకును, పుట్టభోగికిని = పుట్ట యందుండు పామునకును, ఆ ప్పాపజాతి పుర్వు = ఆ పాపిష్ట మైన పురుగు-పాము, అదరంటన్ = మిక్కిలిగా, వేఁడిమి హృదయము = మనస్సు క్రూర మైనది, “వీడు ...ననక' =వీఁడు పసివాఁడే అరణ్యభూములకు దయ లేక యెట్లు పంపవచ్చును అని యెంచక, పం పెఁబో= పంపి నను పంపనీ, నీకుఁ గాఁ బనిపూని=నీకొఱకు పని చేకొని-నీకు పెట్టినపని నేను వహించి యేలపోక పోతిని, పోవుట... పోవుదు నే= నేనుపోయియుందు నేని, కొడుకా నిన్ను దారపోసికొందు నా దారపో సికొనననుట, బుద్ధిపురు వెట్లు మే సె= నాబు ద్ధి పురు గేవిధమునఁ దిని వైచినది, నాబుద్ధియు నెట్లు ముసించినదో యనుట, దై

వజ్ఞులు= జ్యొతిషికులు, కాలాహి=క్రూర సర్పము, వాలు వెడఁదగన్ను లు=నిడు
264

హరిశ్చంద్రోపాఖ్యానము

విన్ననై పెదవులు విఱిచి దైన్యమున
నన్ను రమ్మని పిల్చు నలికొట్టుపలుకు
బలుచని చెమటతో ఫాలభాగమునఁ
గలగొన నంటిన కాకపక్షములు
దలసాల వెడలెదుదాక నా దెసకు
మలయుచూడ్కులు గలమంచినీ మోముఁ
గన్ను లఁ గట్టిన కై వడిఁ దోఁచు
చున్నది యిప్పుడె ట్లోపుదు మఱవ...............................1880
బొద్దు నేఁ డిదె క్రుంకెఁ బొలమున నుండి
'ముద్దు లేఁగలు వచ్చి మొదవు లఁ గల సె
మనమున మోహంబు మల్లడి గొనఁగఁ
జను దేవు నీవేల చన్నులు సేఁ పె
నేపరింపుదురె న న్నిట్లు మా యయ్య
నా పుత్రరత్నంబ నా నిధానంబ'
యని పెక్కు భంగుల నడలు భూపాలు
వనికపై నా వి ప్రవనిత గోపించి
'యోసి యమాంగల్య మొదవ నేడ్చెదవు

................................................................................................................

దలై విడివి గానుండుకన్నులు, సలి కొట్టుపలుకు - ని సకొట్టుమాటపో లేక సడిగా ట్టుచుండుపలుక నుట, కలగొనన్ = చెదరఁగా, కాకపక్షములు=కూఁకట్లు, తల సాల తలవాకిలి, మలయుచూడ్కులు= తిరిగి తిరిగి చూచుచూపులు, కన్ను లఁగ ట్టిన కై వడి కన్ను లలో నే యుండునట్లు, ఎట్లోపుదుమఱవ - మఱవ నెట్లు నేర్తును ముద్దు లేఁగలు = ముద్దుగులుకు దూడలు, మొదవులక్ = ఆవులను, చన్నులు సేఁ హెచ న్ను లందు పాలు చేఁపుచున్నది, ఏపరిం పుదు రె= దుఃఖ పెట్టుదురా, భూపాలువ నిత, రాజ కాంత, కలగొని= ఇటునటు వ్యాపించి, చీమల గామలవ లెను-ఇది

జాతీ

ద్వితీయ భాగము.

265

యీసంధ్య ప్రొద్దు మాయింటిముందటను .................1890
గలగొని చీమల గామల వలెను
జెలఁగుచు ముందర శిశువు లాడఁగను
నీ కేల పలవింప నీకుమారునకు
నీకునుగాఁ జెడి నేఁ డిల్లుఁ బెళ్లు
బో కార్చి నట్టి యీ ప్రోడకు నేడ్వ
నాకుఁ బోవదు గాక నా సూత్రధారి
కొడుకు నెక్కడ దాఁగ గురుతుగా నంపి
కడునుగ్ర భుజగంబు గఱచిన దనుచు
వెడయేడ్పు 'లేడ్చుచు వెదకుచు సందు
వెడలి పోఁ జూ చెపో వేసాలు వన్ని......................1909
లోకంబులో లేని లొట తాటక త్తే
నీ కువాడమ్ము లన్నియుఁ దెల్సు మాకుఁ
గైకొని మేఁక లఁ గాచి రా పొమ్ము
నీకంటె మిక్కిలి నెఱజాణ నేను
గొడుకుకు విలపించు కొనుచు నీ వున్న
నెడప కెన్వరు సేతు రీపను లెల్లఁ

.......................................................................................................

యము - గుంపులు గా క్రిక్కిరిసియనుట, నీకుమారునకు ... పెళ్లు= నేఁడు నాయి ల్లును పెళ్లును -నిన్నుండియు నీకొడుకునుండియుఁ జెడినది, పో కార్చి...పోవదు పోఁగొట్టుకొన్న యాప్రోడబిడ్డకు నేడ్చుట నాకు నొప్పదు గాని - ఇట లోహితాస్యుని ప్రోడడయనుట పరిహాసపరము - ప్రోడబిడ్డ నాయనుట , సూత్ర ధారి కొడుకను= సూత్రధారివ లె పలు వేషములు నేర్చిన యాకొడుకును, దాఁగఁగు ఱుతుగా సంపి= దాఁగికొనుటకు అడియాలము చెప్పి పంపి, కడునుగ్ర భుజగంబు మిక్కిలిభయంకరమైన సర్పము, లొటతాటకత్తె= జిత్తులమారి దానవు, కువాడ

మ్ములు=కపటవర్తనములు, 'నెఱజాణ=మంచి నేర్పుకత్తె, పిసాళింపక = టక్కులు
266

హరిశ్చంద్రోపాఖ్యానము


జాలు లే లెమ్ము పిసాళింప' కనుచు
నాలీలదుర్భాష లాడుచు నున్న
కాలకౌశికు భార్యఁ గనుఁగొని వగపు
లోలోన నడఁచి యాలోలాక్షి పలికెఁ ..........................1910
దల్లి నామీఁద ని త్తరి దయ నుంపు
ముల్లంబులో నిది మొండుగాఁ గొన
విస మెక్కి చచ్చినో విపినంబు లోనఁ
బొసఁగంగఁ గొఱప్రాణముల నున్న వాడొ
చొప్పడ నా పుత్రుఁ జూచి రా నొకని
నిప్పుడే పంపు వాఁ డీల్గగక మున్నె
మసలక తెప్పించి మందుఁ బోయించి
పసనుగా నొనరింపు ప్రాణదానంబు'
ననుచు దైన్యము దోఁప నా రాజు దేవి
తను వేఁడుకొనుచుఁ బాదములపై బడిన. 1920
గలహకంఠిక కనికర మింత లేక
తలమని ముంగ లఁ దలఁ బాయఁ ద్రోచి
'తొలుత ఆ సొమ్ముకుఁ దో డింకఁ గొంత
గెలువఁ జూ చెదవు మిక్కిలి జాణ వౌదు
కట్టెలు దెమ్మన్న ఘసభుజంగముల
పుట్ట లెక్కఁగ నేల పోయె నీకొడుకు
చేకొని యిది మేము చేసినత ప్పె

...........................................................................................................


సేయక , కొఱప్రాణములు = కుట్టుసురు, పసను గాన్ = పొందిక గా, తలము= తొ లఁగుము, తొలుతటి .... జూచెదవు=ముందు మిమ్ముకొన్నందులకు దారపోసినరొ

క్క మేకాక మఱి కొంతరొక్కము నీకొడుకు మందుమాకులకు వెచ్చ పెట్టింపఁ

ద్వితీయ భాగము.

267

వాకట్ట మైతిమి వసుధఁ బాములకు
మందుల విలువలు మా కేడఁ గలవు
మందు పెట్టఁగ లేము మనఁ జేయ లేము ................................1930
వెదక నంపఁగ లేము వెజ్జుఁ దేలేము
మదిమదితో నుండి మా కేమి శ్రద్ధ
పీడ వాయదు మాకు బిడ్డఁడు నీవుఁ
గూడు గూరకు సడి గొట్టక యడిగి
యున్న మాటలు మాని యూరక వచ్చి
పన్నుగా నీచేయుపను లెల్లఁ దీర్చి
ప్రొద్దు వోయినమీఁదఁ బోయి నీ పుత్రు
సుద్ది నిక్కంబుగాఁ జూచి రమ్మనిన
ను త్తర మొండాడ నులికి యా సాధ్వి
చి త్తంబులో శోకశిఖి మండుచుండ.......................................1940
జాము పోయిన దాఁకఁ జాఁగఱ గొట్ట
బాములఁ బొందుచుఁ బను లెల్లఁ దీర్చి
బడలియు మఱి వచ్చి భ క్తి దీపింప
నడుగు లొత్తుచు నున్న నా విప్రవనిత
వడి జొల్లు సెలవుల వడియ నూరుపులు
నిడుదలై గొటలొట నిగుడ వెండ్రుకలు

ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ/

జూచెదవు, వాకట్టమైతి మి=నోరుకట్ట మైతిమి, విలువలు = వెలలు, మనఁజేయన్ = బ్రతికింపఁగా, వెజ్జు - వైద్యుని, మదిమది ...శ్రద్ధ కుడిచి నెమ్మది గా నుండి మాకీ లేనిపోని యక్కరేమి వచ్చె, పీడ... మాకు = నీబిడ్డఁడు ఏమై తే నేమి మాపీడవ దలదు, సడిగొట్టక ఇనస పెట్టక, సుద్ధి = సంగతి, ఉలికి= భయపడి, శోక శిఖి =

దుఃఖాగ్ని, చాఁగఱగొట్టన్ బాధింపఁగా,. సెలవులతో = పెదవిమూలలం.
268

హరిశ్చంద్రోపాఖ్యానము

విరిసి జుంజురుదల వేలాడఁ జెమట
దొరుఁగుక కుంబుల దుర్గంధ మెసఁగఁ
బిసరు గాచినకుండ పేర్పు చందమున
నెసఁగిన బాకి నో రెంతయుఁ దెఱచి................................1950
కలవరింతల వాడగరితలు బెదరఁ
బెలుచఁ బండ్లును బెటపెటఁ గొర్కు కొనుచు
నొడలిచీర నెఱంగ కుదరంబు పెద్ద
తడగంబుగతిఁ దోఁపఁ దన ప్రక్కలందుఁ
జడుగును బేకయుఁ బలెఁ బడి మునిఁగి
పడుచులు గూర్కంగఁ బందిచందమునఁ
దెప్పున నిద్రఁ జెందిన యటమీఁద
నప్పద్మలోచన యల్లన లేచి
యంధ కారమును శోకాంధకారమును
బంధురం బగుచు లోపల వెలుపలను................................1960
గిరిగొని కవయంగఁ గెం గేల నొక్క
కొఱవిఁ గైకొని వడుగులు సెప్పి చనిన
కడకుఁ బోయిన త్రోవగా నొక్క తేయును

.....................................................................................................

దు, జుంజుఱుతల= పల్లతలయందు, కక్షము= చంక , పిసరు=కడిగిన ధాన్యములో త్రోపుడుపడినది, కుండ పేర్పు =కుండ పెంకు, 'బాకి = పెద్ద,తడగము = ఎద్దుమీఁద నీళ్లు తెచ్చెడి తోలుసంచి, పడుగు=వ స్త్రపు నేఁతయందలి నిడుపునూలు, పేక =వస్త్రపు నేత యందలి అడ్డనూలు, పడుచులు=పిల్లవాండ్రు, బంధురము= ఆధి కము, లోపల శోకాంధ కారమును, వెలుపల అంధ కారమును, గిరిగొని- నెల కొని, కవయంగన్ =క్రముకొనఁగా, పోయిన త్రోవఁ గా=పోయిన దే దారి గా- తాను , తెలియకపోయిన దారియే దొరిగాననుట,వటభస్మ... నుండ = కాళ్లకడ m

ద్వితీయ భాగము.

269.

దొడరిన పతిభ క్తి తోడుగా నరిగి
పొడవైన వటభ స్మపుంజంబు గాళ్ల
కడను బుట్ట తలాపికడ నుండ నిట్లు
పడి కన్ను లరమోడ్చి పాదముల్ వీడు
పడఁ జూచి మృదుపాణిపల్లవయుగము
వెడఁదయురంబుపై వేసి గళంబు
కుడి దిక్కు భుజముపైఁ గొండొక వంచి ..........................1970
మొగ మోరగాఁ బెట్టి ముందటిచుంచు
జిగి దప్పి కెంధూళిచే బీదువారి
యొక వికారము లేక యూరక తొల్లి
ప్రకటని ద్రావస్థఁ బరఁగుచందమున
నున్న యాలోహితాస్యునిఁ జూచి ప్రాణ
మున్నదో లేదని యువిద మూర్చిల్లి
ధర మీఁదఁ బడి పెద్దదడవుకుఁ దెలసి
పురపురఁ జిత్తంబు పొక్క నందంద
చెందమ్మి రేకులఁ జెనకుహ స్తముల
ముందలయును మొగంబును మోఁదుకొనుచుఁ ...................1980
జాలఁ గీ లెడలినజంత్రంపుబొమ్మ
పోలిక మూర్చిల్లి పుత్రువై వ్రాలి

.......................................................................................................

మర్రిపొడి రాసియు, తలాపికడ పుట్టయును గానుండునట్లు, వీడుపడన్ = వేఱు వేళ ఎడగలుగఁగా, మృదుపాణి పల్లవయుగము= చిగుళ్ల వంటి మెత్తని చేతులదోయి, వెడఁదయురము=విశాలవక్షము, గళంబు=మెడ, చుంచు=కూఁకటి, జిగిదప్పి = కాంతిమాసి, కిందూళి చే బీదువాటి.ఎఱ్ఱదుమ్ము చేత వన్నె మారి, చెకు=మారా

డు=పోలునట్టి, కీలు ఎడలిన= మఱవీడిన, కల్యాణవిహార = శుభమైన నడవడిగ వాఁ •
270
హరిశ్చంద్రోపాఖ్యానము

క్రమమఁ దెలి చెంది కన్నీరు దొరుఁగ
నమ్మది రాక్షి యిట్లని యేడ్వఁ దొడఁ గె
‘హా లోహితాస్య వంశైక విస్తార
లాలిత సౌభాగ్యలక్షణాకార
నిర్వికార మహాగుణాధార
భూనుతఘనమణిభూషణో దార
హా సుకుమార కల్యాణవిహార
వాసి కెక్కినచక్రవర్తికుమార ..................................1990
తిన్న నినగ నామతించు నీ మోము పుట్టు,
కన్నులపండువుగాఁ జూడకున్న
బులకండ మొలుకునీ ముద్దులమాట
లలవడ వీనుల నాలింప కున్న
మెఱుఁ గారునీబోదుమేను చిత్తంబు
కఱవు మా నక్కునఁ గదియింప కున్న
నొడలఁ బ్రాణము లుండ ఇక నిమిషంబు
నెడముగా నినుఁ బాసి యే నెట్టు లొర్తు
నే తెరువునఁ బోయి యే నెట్లు వత్తు
నాతోడఁ జెప్ప వే నాతోడునీడ..................................2000
యెచ్చట నుండి నిన్నెలమి నేఁ బిలువ
వచ్చి నన్ బొడగాంచి వదనాబ్ద మలర
నెదురుగా వత్తు నేఁ డేటికి రావు

..............................................................................................................

డా, తిన్న నినగవు=చక్కనినవ్వు, ఆమతించు= పుట్టు, పులకండ ము=కండచక్కెర, బోదు మేను- గోముగాఁ బెరిఁగిన మేరు,అక్కునక్ = తొమున, ఎడము గా - " గా నీకు నాకు చేరిక లేనట్లు గా, ఎచ్చటనుండి = ఎక్కడనుండి గాని,మరులు= మే లోర్తు

తెఱపి

ద్వితీయ భాగము.

271

మది నీకు నా మీఁద మరు లెందుఁ బోయె
వడుగుల చేత నీ వార్త విన్న పుడె
తడయక నే రానితప్పు పైఁ బెట్టి
యలుక మై ముఖ పద్మ మవ్వలఁ జేసి
పలుకవు నే నిట్లు పలుమాఱుఁ బిలువ
నో యన్న నే మని యొక మరి కింక
నోయన్ననీ కింక నుడిగి నాలోని.........................................2010
కుం దార్పవే పై డి కుండలమేడ
లందు రత్నావళి నలరునుయ్యెలల
సుదతులు జోకొట్టి జోలలు వాడ
నిదుర పొయెడు నీవు నిర్భయమున నడవి
నుడుగక నిద్దుర నొంది యున్నాఁడ
వే మందు నింక నేట్లేమందు విధిని
నేనుందు పెట్టిన నెసగుఁ బ్రాణము'
లని యని పలవించి యవనిపై (బొరలి
తనయుని ముక్కునఁ దన వేలు మోపి..............................2020
యుడుగక మెల్ల నే యూరుపు లరసి
“యెడలఁ బ్రాణము డాఁగి యున్నది గాని

ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ

మ, వైఁ బెట్టి=మీఁద మోపి, ముఖపద్మ మవ్వలఁ జేసి = ముఖారవిందము పెడమళి గాత్రిప్పుకొని “ఓయన్న ఏమి అని ఒక మరికి ఇంక న్" ఓయన్న నీకింకన్ 'ఉడిగి' అని ఛేదము. ఓయన్నా ! నేను ఓయని పిలువఁగా ఇంక వొకసారి ఏమియని చెప్పి, నీ కోపమును విడిచి యనియర్ధము,కుందు=దుఃఖము, పైడికుండల మేడలు = బంగారు కుంభములుంపఁబడిన సౌధములు, రా నేల = రాతి నేల యందు, ఏమందు... నెట్లు =

272

హరిశ్చంద్రోపాఖ్యానము

చావఁడు వీఁ డని చర్చించి మఱియు
భావించి యిది యేల వలవని యాస
వత్తు రే చచ్చినవారును మరల
ని త్తరినిటు చావ నిది కట్ట డయ్యె
నిన్నియుఁ గల్ల లూహింపఁ గౌశికుఁడు
నన్ను వేదనఁ బెట్ట నలిఁ బన్ని నట్టి
మాయ గా కని దైవమా' యని కొడుకుఁ
బాయనియక్కునఁ బట్టి పాలిండ్ల......................................2030
నొత్తి 'యో యమ్మ చ న్నొల్లం' డన్ శోక
మొత్తి యా కఱచిన యురగంబు దలఁచి
శ్రుతి బాహ్యుఁ డిలఁ బుట్టు గ్రుడ్డు తామనుఁడు
గలి చెడ్డ చెడుగు తెక్కలి బొక్క లాఁడుఁ
బదవిహీనుఁడు జగ త్ప్రాణభక్షకుఁడు

.................................................................................................................


ఇఁక నే నెట్లు బ్రదుకుదును , వలవనియాస= కూడనియాస, కట్టడి = ఏర్పాటు, పాయ నియక్కునన్ = కొడుకు నెన్నఁడును ఎడఁ బాసియుండని తన రొమ్మునందు, ఓయ మ్మచన్నొల్లఁడు ఆన్ శోకము= ఓయమ్మా చన్ను నొల్లఁడేయ నెడి శోకము, ఉర గము=పాము, శ్రుతి బాహ్యుఁడు= చెవులు లేనివాఁడని సర్పపరము - వేద బాహ్యుం డని అర్థాంతరము, పుట్టుగ్రుడ్డు= గ్రుడ్డునఁ బుట్టినది, అని సర్పపరము-పుట్టినది మొ దలుగా గ్రుడ్డియైనవాఁడని యర్థాంతరము, తామసుఁడు= నీచుఁడు, తామసస ర్పజాతి, గతి చెడ్డ చెడుగు= దారి సరిగా లేక పంకర గానుండుదుష్టజంతువు-దా రితప్పినదుష్టుఁడని యర్థాంతరము, తెక్కలి=దొంగ, బొక్కలాఁడు బొక్క లందుండువాఁడు - దాఁగుపోతని యర్థాంతరము, పదవిహీనుఁడు = కాళ్లు లేని వాడు - అంతస్తు లేనివాఁడని యర్థాంతరము, జగత్ప్రణభక్షకుఁడు=వా

యువునుభక్షించువాఁడు, జగత్తులోని వారి ప్రాణములనుభక్షించువాఁడు.

ద్వితీయ భాగము.

273

వెదకి యీవసపాల వితు నేమందు'
నని పాము నిందించి యంతరంగమున
దను దానె యూరార్చి ధైర్యంబు దెచ్చి
“వెల్లువ వొరలినవిధిని నీయడవి
మల్ల డి గొనువగ మాన కేడ్చినను....................................2040
నుతుని ప్రాణములు వచ్చునె వీనిఁబుణ్య
గతికిఁ బోవ దహించి కాలకౌశికుని
ముదిత మేల్కొనకయ మున్నె నేఁ బోయి
వదలక పని దీర్ప వలయు నిచ్చోటఁ
దడయుట గా దని తనచీర బిగిచి
కొడుకు వీఁపునఁ గట్టుకొని కొంత దవ్వు
చని చితి కే శాస్త్రిశకల కపాల
ఘనచర్మ సంకీర్ణ ఘట జీర్ణ శూర్ప
భసిత సముద్భటపటునటద్భూత
విసర బేతాళ సంవృత్తమై చూడ
నతిభీకరం బైనయా రుద్రభూమి
ధృతిఁ జొచ్చి యం దొక్క దెసఁ బుత్రు డించి ............................2050

.................................................................................................. వెల్లున్ పొరలిన విధిని= ప్రవాహము ప్రవహించిన తీరు గా, మల్లడిగొనువగన్ = పెనఁగొనుదుఃఖమున ఒకదుఃఖముతో మఱియొక దుఃఖము పెనఁగొను నట్లుగా, బిగిచి= బిగించి, చితి....సంవృత్తమై - చిత=పొదలు, కేశ = వెండ్రుక లు, అస్థి= ఎముకల, శకలకైతునుకలు, కపాల= పుర్రెలు,మనచర్మ = పెద్దతోళ్లు, సంకీర్ణ ఘట= చెల్ల చెదరై నకుండలు, జీర్ణశూర్ప = చిరిఁగిన చేఁటలు, భసిత =బూడి ద, సముద్భట = మిక్కిలి ఉద్ధత మైనదియు, పటు=బిట్టుగా, నటత్ = ఆడుచు

న్న, భూతవిసరణ = భూత సమూహములు, బేతాళ = బేతాళుఁడును, సంపృత్తము
274

హరిశ్చంద్రోపాఖ్యానము.

పొంత యొల్కులలోనఁ బొడవడి కాలి
కొంత చిక్కినకడకొఱవులు దెచ్చి
కుఱు ప్రోఁగుగా నిడి కొడుకు నం దునిచి
కొజువి నొక్కటఁ దలకొఱ విడఁ బూని
చేతు లాడక మోము చీరతో నొ త్తి
యాతురంబున నేడ్వ నా యార్త రవము
విని హరిశ్చంద్రుండు విస్తయం బంది
'ననుఁ గన్మొఱంగి యీనడు రేయి నకట..........................2660
యీ వల్ల కాటిలో నీ యార్తరావ
సవిధి విన వచ్చె నెలుఁగుచందమును
బోలింప సతి గాని పురుషుడు గాఁడు
చాలు నీతలపోత సయ్యననేఁగి
కదిసి చూడక పొందు గాదని ముద్ర
గుదియ మూఁపున నికి క్రూర ఖడ్గంబు
మొల ట్రెండుతో నంట ముడి వేసి బిగిచి
కులగిరి పై నుండి కుంభినిమీఁది
కసమున నుఱుకుసింహంబుచందమున

.......................................................................................................

వర్తించునట్టిది, పొంత యొల్కులు= దాపటి పీనుఁగులు, పొడవశి-=కనఁబడి, కడ కొఱవులు = కాలఁగా మిగిలినకట్టెలు, కురు ప్రోగు=చిన్న రాసి, కొఱవి ... వి డన్ = ఒక్క కొఱవి చే తలయందు పెట్టుకొఱవిని బెట్టుటకు, మోము చీరతోనో త్తి= మొగమును చీర తోఁగప్పుకొని, కనొఱంగి = ఏమరించి, ఎలుఁగుచందమును పోలింపఁగాన్ = కంఠధ్వనితీరును తార కాణ చేసిచూడఁగా, సతి = స్త్రీ, చాలు నీతలపోత = స్త్రీయోపురుషుఁడోయని యిచట నేయుండి తర్కించుకొనుచుం డుట చాలును, పొందు గాదు= తార కాణ యేర్పడదు, మొలద్రిండు= మొలయం

దలిదట్టి, కుంభిని= భూమి, అసమునన్- దర్పమున, ఆదట=ప్రేమము,

ద్వితీయ భాగము.

275

మసలక యారాజు నుంచ పై నుండి..............................2070
మేదినిఁ బడ దాఁటి మెల్లన వచ్చి
యాదటఁ గనుఁగొనునప్పు డయ్యింతి
నెరసిన కురులును నెటి ధూళి దూలి
విరిసినసీమంత వీథియు వదలి
జాతినపయ్యెదఁ జన్ను లమీఁద
గారెడుక న్నీ రుఁ గరపల్లవమునఁ
గదిసిన చెక్కును గలికి లే నవ్వు
గుదిసినచూపును గొండొక వదలి
మూఁపుపై వేలు కొమ్ముడియును వగల
వాపోవఁ గెంపారువాలుఁగన్నులును
వెడలునిట్టూర్పులు వెగచు కుత్తిక యు
బడలిన మేనును బగిలిన మోము
మగిడినచనుకప్పు మాసిన చీర
పగిలినయధరబింబమునై తలంపం
బలుచని మొగిలులోపలఁ దోఁచుచంద్ర
కళభంగి మాఁగుడు గవిసి మానిక పు .............................2080

................................................................................................................


నెరసినకురులును= చెల్ల చెద రైన తలవెండ్రుకలును, నెటి= ఒప్పు, ధూళిన్ =దుమ్ము చే, తూలి = పస చెడి, విరిసిన సీమంత వీధి =విచ్చయిన పాపట రేక, లేనవ్వుగుది సిన చూపు= లేతనవ్వు తీసిపోయినదృష్టి, కొండొక = కొంచెము, పగల... వా లుఁగన్ను లు=దుఃఖముల చే రోదనము సేయఁగా సెఱఁబాజిన విశాలము లైన - నే త్రములును, వెగచుకు త్తిక యు= వెక్కి వెక్కి యేడ్చుచున్న గొంతును, మగిడినచ మకప్పుతోలంగిపోయిన చన్ను లమీఁదిపయ్యెద, పగిలినయధరబింబము=పీట

లువారిన దొండపండువంటి మోవి, పలుచని మొగిలు=పలుచ గానున్న మబ్బు,మా
276

హరిశ్చంద్రోపాఖ్యానము,

బొమను మసిపాతఁ బొదిఁగినమాడ్కి-
నెమ్మేని క్రొమ్మ్రించు నిగుడక మాసి
నా కేశుఁ బాసిననాఁటిపౌలోమి
చేకొన్న దుర్దశ : జెందిన ట్లున్న .................................2090
భావించి యాత్మ లోఁ బలుమాఱు వగచి
భూవల్ల భుఁడు దానిముందఱ నిలిచె
నిలిచినఁ గనుఁగొని నివ్వెఱపాటుఁ
గళవళంబును మదిఁ గడలు కొనంగఁ
'దొలఁగినపయ్యెద తుంగ స్తనముల
నలవడఁ గప్పు నయ్య య్యబ్జాక్షి జూచి
వెర్ఱవకు మీవయో వెలఁది యిచ్చోట
'నెఱసిన చీకటి నిట్లొంటి నున్న
నెఱసాహసివి మరి నీ కేటి వెఱపు
'మరుగు పెట్టక చెప్పుమా నీకు నిట్టి..............................2100
నెగు లింతయును నేమి నెపమునవచ్చె
మగువ నీ పేరేమి మగనిపేరేమి
యెచ్చట నుండుదు వీ బాలుఁ డెట్లు
చచ్చె' నావుడు ముఖాబ్దము వేల వై చి

...................................................................................................

గుడు=నలుపు - మాలిన్యము, మసిపొత = మాసినగుడ్డను, నెమ్మేని క్రొమ్మించు = దేహముయొక్క క్రొత్త కాంతి, నిగుడక = ప్రసరింపక , నా కేశన్...దుర్దశన్ దేవేంద్రుని ఎడఁ బాసినప్పటి శచీదేవి పొందిన దురవస్థ, నివ్వెఱపాటు= ఆశ్చర్య ము, కళవళము= కలఁత, నెఱసిన చీఁకటి=నిండుకొన్న చీకటి, నెఱసాహసివి= పూర్ణ సాహసము గలదానవు, నీ కేటి వెఱపు= ఇంతటి సాహసముగల . నీకుభయ మే

ల, నెగులు= బాధ, విప్రవరునింట=బ్రాహ్మణో త్తముని గృహమునందు, తప్పనా

ద్వితీయభాగము.

277

కన్నుల బాష్పంపుఁగణము లందంద
చన్ను గుబ్బల మీఁద జలజల దొరుఁగఁ
బొరిఁబొరి వగచుచు భూవల్లభునకుఁ
గరుణ రా గద్గదకంఠి యై పలి కేఁ
“బురుషవ రేణ్య యీపురి నొక్క విప్ర
వరునింట దాసి నైవర్తించు చుందు......................2110
నప్పు ఏర్పఁగ నుపాయము మఱి లేక
తప్ప నాడక పతి ద న్న మ్ము కొనియె
నాసుతుఁ డితఁ డంసనారి నా పేరు
భూసురుం డడవికిఁ బుత్తెర వేల్మి
కట్టెలకై వచ్చి కడు నుగ్రమైన
కట్టిడిభుజగంబుకాటునఁ జచ్చె
ననఘ మీ రెవ్వ రిట్లనుకంప మీర
దనశోక ముడుపఁ జిత్తమునఁ దలంచి
విచ్చేసి నట్టియావిశ్వనాథుఁడవు
నిచ్చలు బహుభూత నివహంబు గొలువ..............2120
నిచ్చలుఁ బ్రియ మార నీ రుద్రభూమి
నచ్చుగా విహరించునాభూతపతి వై
యెఱిఁగి యుండితి రేని యేమైన మందుఁ
గరుణ నిచ్చి సజీవిగా వీనిఁ జేసి

..............................................................................................................

డక = లేదు పొమ్మని అబద్ధము చెప్పలేక , తన్నమ్ముకొనియెన్ = నన్న మ్ముకొ నెను, భూ సురుఁడు=బ్రాహ్మణుఁడు, పుత్తరన్ =పంపఁగా, వేలి కట్టెలు= హోమమునకై 'నసమిధలు, కట్టిఁడిభుజగము=క్రూర మైన సర్పము, అనుకంపవయ, తనశోకము

= నాశోకము, విశ్వనాథుఁడవో= కాశీ విశ్వనాథుఁడవో, భూతపతివో=శవుఁ
278

హరిశ్చంద్రోపాఖ్యానము.

నన్ను రక్షింపుము' నావుడు దాని
సన్నుత ప్రియవాక్యసరణిచేఁ దనదు
కులసతి యవుట నిక్కువముగా నాత్మ
దెలియక చంద్రమతీ దేవి కనియె
‘భూతనాథుఁడఁగాను భువి నెల్ల జనుల
చేత మొక్కులు గొనుసిద్ధుండఁ గాను...........................2130
వెడఁగునుందుల చేత విష మె ట్లడంగుఁ
జెడునొకో చీర రాచినఁ బాముకాటు
మందుఁ బెట్టగ నేర మనఁ జేయ నేర
నెందు నిప్పురమున నీ రుద్రభూమి
గుత్తగాఁ గైకొని గురు భుజశక్తి
నొత్తి యెవ్వరినైన ను క్కడఁగించు
బలియుండు చండాలపతి వీర బాహుఁ
డెలమిమై మన్నించి యీ ముద్రగుదియఁ
దగ నిచ్చి యీ కాడు తఱలక రేయుఁ
బగలును గావంగఁ బనిచె న న్నిందు.....................2140
వీరదా సను పేర వెలయుచుండుదును
వారక నడు రేయి వచ్చి నీ విట్లు
నన్నుగానక యుండ నందనుఁ దెచ్చి
పిన్ననిఁ జతిమీఁదఁ బెట్టంగఁ దగునె
నెలఁతవు గాన మన్నించితి నిన్ను

....................................................................................................

డవో, చెడునొకో చీరరాచినఁబాము కాటు=పొముకఱచిన విషమును గుడ్డ

తో రాచి తుడువఁగా తీసిపోవునా, మనఁ జేయన్ = బ్రతికించుటకు, గురుభుజ

ద్వితీయ భాగము.

279

దల దైవ్వ వేయుదుఁ దక్కొరుఁడై న
సొద వేర్పఁ దగునంత చోటుకు మాడ
మొదటనే తెచ్చి మాముందర బెట్టి
పిదప దహింతురు పీనుఁగుఁదెచ్చి
ముదిత యీతగిన చొప్పున నీవు దెచ్చి...........................2150
యీకుమారున కగ్గి నిమ్మిటుపొసఁగ
లేకున్నఁ గాల్చి పోలేవు న న్నేలు
నొడయుఁడు వీర బాహునియఢులాన
వెడలి పో' మనిన న వ్వెలఁది యిట్లనియెఁ ? "
'బరహిత చరిత నాపై నొక కొంత
కరుణ సేయక సిరి గలదానివ లెనె
యడిగెద వేల న న్నదలించి యిపుడు
యెడపక దీన నీ కేమి గూడెడిని
సక లదీవుల నేలుజనపతిపుత్రుఁ
డకట చే రెండు నేల కర్హుండు గాఁడె ................................2160
నీ వేమి సేతు పన్నినమునిమాయ
నా వెంటఁ దతిగొని నలఁచి పో నీక
పట్టి యీగతి నేలపైనిడి కాల
బెట్టి ప్రాముచు బుస వెట్టు చుండంగ'

....................................................................................................

శక్తి న్ = గొప్ప బాహు బలము చేత, కాఁడు=శ్మశానము, తక్కొరుఁడు=మరి యొక్కఁడు, సిరి గలదానిపలెనే - సంపదలగల స్త్రీవలెనే, నీ కేమిగూ డెడిని= నీకేమలాభము ఒనఁగూడఁగలదు, జనపతి పుత్రుఁడు= రాజకుమా రుఁడు, తతిగొని= విడువక , నేల పైనిడి 'కాలఁ బెట్టి ప్రాముచున్ = నెల పైఁ బెట్టి

కాలి తో రాచుచు, చాయ గాన్ = చూచాయగా - జాడగా తన సంగతి సూచిత
280

హరిశ్చంద్రోపాఖ్యానము.

నని యిట్లు చాయగా నాడిన మాట
విని హరిశ్చంద్ర భూవిభుఁ డాత్మ . గలగి
తగ విచారించి 'యీ తరుణి నా పత్ని
యగు' నని మనసు సయ్యనమగిడించి
'గట్టిగా నెఱుఁగ కీగతిఁ దలం పే ల ..................................2170
పుట్ట విశ్వేశ నా బుద్ధిలో' ననుచుఁ
బరితాప మంది యప్పడఁతి నీక్షించి
మరి పల్కె 'జోద్యంపుతూట లాడెదవు
నట్టేడు దీవులనడు మెల్ల నేలు
పట్టభద్రుని కూర్మి ప ట్టట బాలుఁ
డామహీశుని దేవి వఁట నీకు విత్త
మేమియు లేదన్న నెటు నమ్మ వచ్చు
నీకెంత గలిగిన నిన్నదలించి
మాకుఁ గైకొన రాదు మాడకు మిగులఁ
జేకొని యేలిక చెప్పిన చొప్పు
గాక నీ పేదఱికము నాకుఁ బొ త్తె.....................................2180
పాటలగంధి నీపలు కియ్యకొనఁగఁ

.............................................................................................................

మగునట్లు - ' ఏడు దీవుల నేలు రాజకుమారుఁ డనుమాట జాడఁగాచం ద్రమతీవృ త్తాంతమును సూచించినపని భావము. మనసు సయ్యనమగిడించి = మొదటభార్య గాఁదలఁచి పిదప నట్లు తలఁపఁ గాదని మనస్సును త్రిప్పుకొని, గట్టిగా నెఱుఁగక = రూఢిగా నన్ని యుఁ దెలిసికొనక, పట్టఁట= పట్టియఁట - ఇటనిత్తునకు సంధివి చార్యము, నీ కెంతగలిగినను= నీకు ఎంత సంపద యుండినను, మాకు ...మిగుల - మాడకం టే నెక్కువగా మాకుఁ బుచ్చుకొనరాదు, నీ పేదఱికము నాకుఁ బొ

త్త=నీ లేమిడితో నాకేమైన సంబంధమా? నీ లే మిడిని పాటింపవలసిన యక్క ఱ

ద్వితీయభాగము.

281

గాటిపాపని కేల కరుణ నీమీద
లేకున్న నాకిచ్చు లెక్కకుఁ జెల్లు
గైకొందు నిమ్ము నీ కట్టినమినుకు”
నావుడు నుల్కి యానాతి చిత్తమున
భావింపఁ దన పతిభక్తి పెంపునను
బొడగాన రాదన్యపురుషులకేరి
కొడికమై నామెడ నున్న యీమినుకు
యితఁడె హరిశ్చంద్రుఁ డిక నేమి శంక
మతిలోన ననుచు నమానవాధీశుఁ ...............................2190
డున్న దుర్దశకు బిట్టుల్లంబు గలఁగి
తన్నుఁ దా నెఱుఁగక ధరమీఁద వ్రాలి
ధృతి పెట్టి కేలకుఁ దెలసి 'హా నాథ
సతతదయాలోల సత్యసంశీల
హా హరిశ్చంద్ర రావయ్య నీ పుత్రు
లోహితాస్యునిఁ బదలోచనుఁ జూడు
ముందు నీతొడల పై ముదమున నిద్ర
జెందినగతి నేఁడు చిత్తంబు పొక్క
బన్ని నచితిమీఁదఁ బడి దీర్ఘనిద్ర
నున్నాఁడు మేల్కొనఁ డొక మరి యైన..............................2200
నా పుత్రరత్నంబు నా పాటుఁ జూడ

.............................................................................................................

నాకు లేదనుట, 'కాటి పాపనికి = వల్లె కాటిలోని వానికి, నీ పలుకియ్యఁ గొనఁగఁ గాటి పాపనికి నీ మీఁదఁ గరుణయేల అనియన్వయము. చెల్లు- చెల్లు గా, మినుకు = తాలి,బొట్టు, నావుడున్ = అనఁ గా, ఉల్కి =అదిరి, నాతి = స్త్రీ, పొడగాన

రాదు=కనుట కలవి గాదు, ఒడిక మై=మనోహరమై, బిట్టు= మిక్కిలి, ఉల్లంబు=
282

హరిశ్చంద్రోపాఖ్యానము.

నోపక వచ్చి తా నున్న వాఁ డిచటఁ
గాటిలోఁ గాననికన్నుల నున్న
చోట ని న్ని బృంగి శోకాబ్దిముంప
దలఁచి మమ్మిటుఁ దెచ్చి దై నంబు నీకుఁ
దెలిపెనే' యనుచు నద్దినక రకులుని
యడుగుల పై వ్రాలి యశ్రువు లురిలి
మడుఁగు గట్టఁగఁ జంద్రనుతి విలపించు
'నో సార్వభౌమ నీ వున్నయీమంచ
భాసురరత్న సభామంటపంబె......................................2210
పటుభూత బేతాళ పంక్తులు వీర
భటపరివారక ప్రకరంబె నీకుఁ
బెను పొందుచితివహ్ని భీకరశిఖలు
ఘనతరకరదీపికాసహసములె
చదలఁ గ్రిక్కితీసినశవధూమపుంజు
మది భవ త్కేళినీలాత పత్రము లే

............................................................................................................

మనస్సు, నా పొటు ... నున్న వాఁడిచట= నేను పడుపాట్లను జూడఁజాలక యి చ్చటికి వచ్చియున్న వాడు అని యు త్ప్రేక్ష. కావనిగన్నుల నున్న చోట= వెలుపలి సంగతు లొక్కటిని దెలిసికొన కుండునట్టి కన్నులతోనున్న యిచ్చో ట- వెలుపల జరుగు సుఖదుఃఖములు పాటింప వీలు లేక నీవిచ్చటనుండఁగా ననఁట. శోకాభిన్ =దుఃఖసముద్రమునందు, మడుఁగుగట్టగన్ = మడుఁగులు గా ఏర్పడఁ - వెల్లువలుగా కాఱఁగా ననుట, ప్రకరంబె= సమూహమా, పెనుపు ... శిఖ లు=వర్ధిల్లుచున్న సొదనిప్పుల భయంకర జ్వాలలు, ఘనతర ... సహస్రము లె=మి క్కిలి గొప్పవైన వేనవేలు చేది వ్వెలా, చదలన్ = ఆకాశమున, క్రిక్కిరిసిన - పుంజము = దట్టముగా పర్వినపీనుగు పొగ లసమూహము, భవత్ కేళినీ

లాతపత్రము లే= నీయొక్క విలాసార్ధ మైన నల్లని గొడుగులా, శూల... జాలం

283

ద్వితీయ భాగము.

శూలకీలిత నరసూలిరోజ
జాలంబు లాఖేటసమయచామర లె
కరమర్థి నరశిరఃక ఠిన పాత్రములు
సరసతమంగళాచారకుంభము లె...............................2220
జ్వలన ప్రదేశ నిజవ్యజనములు
ధళధళ మనుచి తతాళవృంతములె
ప్రజతండములు బరాబరి సేయ మత్త
గజములు నీ వెంటఁ గదిలి రావేల
నోజుతోఁ బడివా? నొప్పుసాంబ్రాణి
తేజీలు నీ వెంటఁ దిగిచి రావేల
వలనొప్ప దండల వజ్రాలమించు
దొలఁకాడు చున్నంయాందోళిక లేవి
పసిఁడితీగల కీలుపంజుల డాలు

................................................................................................................

బులు-శూలమందుఁ గ్రుచ్చఁబడిన మనుష్యుని పెద్దతల వెండ్రుకల సమూహము లు, ఆఖేటసమయ చామర లె= వేటకుఁ బోవునప్పటి చామరములా, నరశిరఃక లిన పాత్రములు = మనుష్యుల తలల నెడి-అనఁగా పుట్టెల నెడి కటువైన పాత్రవ లు, జ్వలన ప్రదేశ నిజవ్యజనములు = అగ్గి నిమంట పెట్టుచోటనున్న యీవిసన కర్రజలు, చిత్ర తాళ వృంతము లే= వింత లైన విసనకర్రలా, ప్రజతండములు= జనస మూహములు, బరాబరి సేయక్ = హెచ్చరిక సేయఁగా, పడివా గె=ఎక్కుట కా యి త్తపరుచున పుడు సవరిం చెడు గుర్ర పుసవరణ, సాంబ్రాణి తేజీలు= మే లైన గుఱ్ఱములు, ఇచట “రావేల మదనిర్ఘ రావేల పరిమళలోభ లు ఘోళీ భద్రేభమటలు తగ వేల చూడఁ క్రొత్తగ వేలసంఖ్య లై పడివాగె బఱ తెంచుఫ్రౌఢహరులు అని హరిశ్చంద్ర నలోపాఖ్యానము నందలి రచనతోడి సామ్య మూహించునది.చం డెలన్ = అడ్డ' కొయ్యలందు, వజ్రాలమించు దొలకాఁడు=మగ రాల కాంతి ప్ర

సరించు, అందోళికలు= అందలములు, పసిడితీ గల = బంగారుజరీతీ గలయు.
-284

హరిశ్చంద్రోపాఖ్యానము.

పస నైనముత్యాలపల్లకీ లేవి.................................2230
యా తేజ మారూప మాభుజాగర్వ
మా తెల్వి యాభాగ్య మారాజసంబు
నెక్కడ నుడి వోయె నెక్కడ నడఁగె
నెక్కడఁ దుద మొద లీదురవస్థ
కక్కటా' యని యేడ్చు నతివచి త్తంబు
వెక్కఁ గౌగిటఁ జేర్చి భూవల్ల భుండు
ముప్పిరి గొనుమూర్ఛ మునిఁగి యొక్కింత
తెప్పిటి ధైర్యంబు దిగ జాఱఁ దన్ను
గప్పిన పుత్రశోకంబున మునిఁగి
విప్పారు కన్నుల నేన నశ్రు లొలుకఁ........................2240
గొడుకు రూపంబును గుణవిశేషంబు
నడుపును ముద్దును నగవుఁ దేజంబుఁ
బలుమాఱు నంకించి పలవించు విభునిఁ
గెలుపుచుఁ జంద్రమతీ దేవి పలికె
“భానుకు లేశ యీ పగిది నిద్దఱముఁ
బూని యేడ్చుచు నున్నఁ బొసఁగ దీసఁద
వివరింపు మిదె ప్రొద్దు వేగుజా మయ్యె
గదిసిన చిమ్మచీకటి వెల్లఁబారె

.................................................................................................................

కీలుపంజుల= కీలుగల దివిటీలయు, డాలు వసనైన= కాంతి నీటుగులుకునట్టి, ఉ డివోయెన్= తీసిపోయెను, ,ఈదురవస్థకు తుద మొద లెక్కడ?' అని యన్వ యము, విప్పు ఆరుక న్ను లకన్ =విశాలత నిండిన కన్ను లందు =పూర్ణ వైశాల్య ముగల కన్ను లందనుట, అంకించి= పొగడి, వివరింపుము=వివేచింపుము, ప్రొద్దు

నేను జాము= సూర్యుఁ డుదయించు సమయము, ఏతేక = రాక, ఏలిక సాని=

285

ద్వితీయ భాగము.

నినుఁ డుదయాద్రికి నే తేక మున్న
చన కున్న నేలిక సానిచేఁ జావు...................................2250.
చెప్పు మే తెఱుఁ గన్నజింతించి తగవు
దప్పక నధిపుఁ డత్తన్వి కిట్లనియెఁ
'జెలువ యీ బాలునిఁ జిచ్చునఁ ద్రోయ
వలసిన నేలిన వానిలాభంబుఁ
దప్పించి సత్యంబు దప్పి మోమోట
నిప్పని కియ్యతో నేరీతిఁ బొసఁగుఁ
బొసఁగ వీ పలుకులు మోయి ని న్నేలు
వసుధామరునిఁ గాంచి వదలక వేఁడి
వలయుమాడయు మఱి వారి పాతికయు
వలనొప్పఁ గొని రము వడి నిట' కనినఁ.................... 2260.
దనప్రాణనాధుసత్యవ్రతంబునకు
మనమున నలరి యమ్మహి పతి కాంత
తనయు నక్కడఁ బెట్టి తగ నప్పగించి
మనుజేశునకు మొక్కి మసలక మరలి
పురవీథి నేఁగునప్పుడు కౌశికుండు
తరలాక్షిఁ జంపింపఁ దలఁచి యాక్షణమె
మొఱకు వెండ్రుకలును ముదురు మీసములుఁ
గజకునల్లని మేనుఁ గలచోరు నొకనిఁ

...............................................................................................................

దొర సానియైన కలహకంఠిక , చిచ్చునఁ ద్రోయవలసినన్ = నిప్పునందు వేయవలసి యుండినయెడల, ఏలినవాని లాభంబు దప్పించి = నా ఏలిక యైన వీర బాహునికి వచ్చు వాతిపాతిక మొదలైన యాదాయమును బోఁగొట్టి, ఇయ్యకోన్ = సమ్మ,

తించుటకు, వసుధామరునికి = బ్రాహ్మణుని, ధాత్రీత లేశు పడఁతిన్ = రాజు
286

హరిశ్చంద్రోపాఖ్యానము

.

దడయక పుట్టించి ధాత్రీత లేశు
పడఁతిఁ జంపింప నుపాయంబుఁ గఱపి.........................2270
పొరిఁబొరిఁ 'బొమన్న బోయి తల్కావి
చిర ముండ్ల బంతియు సెలకట్టెకత్తి
బలపంబు భమరాలఁ బట్టిన క్రోవి
యొలికి లోపలిభూతి యొగి మైల మందు
కుఱునీలికా సెయుఁ గొంకి నారసము
నొఱపుగాఁ బూని వాఁ డుక్కున నేఁగి
యావారణాసిపురాధీశు నగరు
వావిరిఁ గన్నంబు వడి వేసి చొచ్చి
మిసమిస మనుచుఁ డొమెఱుఁగులు వారు
పసిఁడికుండల మేడపై నంద మైన...........................2280
తూఁగుటుయ్యలలోనఁ దొలు కార మెఱుఁగుఁ
దీఁగ బాగుననొప్పిదీపించు దాది
చెలువ మై మించిన సిబ్బెంపుగబ్బి
వలుఁదపాలిండ్లలో వడనాంబుజంబు
గదియ నిద్రించుచక్కనిరాచపట్టి
కదలక మెదలక కాలున నూఁది

...............................................................................................................

ర్యను , తల్కా విచిర = తలయందు కావి చీర, ముండ్ల బంతి = ముండ్లు వరుసగాగ లచెండు, సెలకట్టె మొద లైనవి దొంగ సాధనములు, భ్రమరాల క్రోవి = దీప మార్పెడి పురుగులుగల గొట్టము, ఒలికిలోపలి భూతి = కాలిన పీనుఁగుసొదలో నిబూది, మైలమందు స్త్రీరజ కృతమై వశీకరణసాధనమగు నౌషధము, తొలుకారు = తొలుకరి కాలము, సిబ్బెంపు గబ్బివలు దపాలిండ్లు= సిబ్బెములు

గలిగి బటువులై విరివిగల చన్నులు, కదలక మెదలక కాలుననూఁది= కోలుచే

ద్వితీయ భాగము

.

287

కుదియంగ వెసఁ బట్టి కుత్తుక ( బిసికి
తోరంపుదివియలతో మాఱు నుండు
హారమణీశోభితాభరణములఁ
గళవళం బందక కైకొని పోయి..................................2290
మలఁగుచు నాచంద్రమతి సనుదెంచు
తెరువున కడంబు దిగన వచ్చి
గరువంబుమీఱ దస్కరుఁ డిట్టు లనియె
“నీ వేళ నీ వెంట నెవ్వరు లేక
నీవేల నీరీతి నేఁ గెద ఇంటి
నలుగక చెప్పు లె' మ్మన్న జిత్తమునఁ
గలఁగుచు నిలిచి యక్కమలదళాక్షి
వెగచి యేడ్చుచుఁ దన వృత్తాంతమెల్లఁ
దగఁ జెప్పుటయు లేనిదయఁ దాల్చి వాఁడు
“నా చెల్లెలవు నీవు నలినదళాక్షీ.............................2300
యీచందమునఁ గుంద నేల కొమ్మనుచుఁ
బన్ను గాఁ దన చేతి పసిబిడ్డ తొడవు
లన్నియు ముడి గట్టి యం దిచ్చునంత
దాది మేల్కని రాచతనయునిఁ గాంచి
మదిలోన శోకంబు మానక యపుడు
చనుదెంచి యంతయు జన నాథునకును

- త్రొక్కి పట్టి కదలక మెదలకుండునట్లు చేసి, తోరంపు ... భరణములన్ పెద్ద దీపములతో పాటిగా వెలుఁగుచున్న హారరత్న ములను శోభితము లైన త క్కిన యాభరణములను, కళవళ ము=కలవరపాటు, గరువంబు = పెద్దఱికము,

వెరచి = వెక్కి, తొడవులు= భూషణములు, కుదియంగన్ = కీడ్పడునట్లుగా,
288

హరిశ్చంద్రోపాఖ్యానము.


వినిపించినను చీకట్లగడు విస్మయంబంది
కడువేగమునఁ బ్రతుకడకు నే తెంచి
కడకతోఁ దనదు దుఃఖము లెల్ల విరియఁ
'గొనకొన వీనిని గుదియంగఁ బట్టి........................................2310
వనరంగఁ జంపినవాఁ డెవ్వడనుచు
వల నొప్పఁగాఁ దలవరులఁ బిల్పించి
వెలయ వారలకు న్వవిధ మెఱిఁగింప
మెఱుఁగుఁగైదువులలొ క్రొమ్మమెఱుఁగులు దిశల
నెరసిన నెడలంగ జడియు
కాలకింకరులు బింక పుఁదలవరులు
కోలది వ్వెల వారిఁ గొంచు నవ్వీథిఁ
'బదపదఁ డిదె దొంగ పదపంక్తి చొప్పు
వదలకుం' డని వచ్చు వారికి మున్నె
'దొంగ నాచేతికి దొరికె మీరేల...............................................2320
వెంగళు లై జాడ వెద కెద'రనుచు
వడిఁ జోరకుఁడు తలవరులలోఁ గలసి
తొడిఁబడఁ గృప మాలి తోయజనేత్రి
పెడ కేలు బిగఁ బట్టి పెలుచ నందంద
పిడికిళ్లఁ బొడుచుచు బిట్టు తిట్టుచును
బ్రిదులక గొనిపోయి భీషణుం డనెడి
మొదలితలారి సముఖమునఁ బెట్టి

....................................................................................................................

ఱంగు గెదువుల = తళతళలాడు ఆయుధముల, నెఱుసిన = నిండిన, ఎడలంగన్.

తొలగిపోవునట్లు, కోలది వ్వెలు= దివ్వటీలు, వెంగలులై = వెర్రివారై, ప్రిదులక =

289


ద్వితీయభాగము.

సూడిద పెట్టి దా సురిఁగె నా చోరుఁ
డప్పుడు భీషణుం డాచంద్రమతిని...................2330
నిప్పులు గన్ను ల నిగుడ నీక్షించి
రోజువాసము నుల్చి కొని 'తన బారిఁ
బాతి పొమ్మ నుచు నుద్భటనృత్తి లేచి
జంకించి చేవాలు జళిపించి వ్రేయ
నుంకించి శంకించి 'యువిద వధించు
రట్టు నా కేటికి రాజు ముందర నె
పెట్టెదఁ గాకని పేరోలగమునఁ
గొడుకుకుఁ బలవించు కొనుమహీపాలు
కడ నిల్పి నవరత్న కాంతుల మించు
తొంగలించెడు బాలుతోడవులమూట..................2340
ముంగల నిడిన 'హా ముద్దుల పట్టి
హా కుమార యంచు నట వక్షమందు
దాకొన నొత్తి నేత్రముల నం దం ద
తొరుఁగున శ్రులఁ దొప్పదోఁగి శోకాగ్ని
నెరియుచు విలపించు చెట్ట కేలకును
గొంత ధైర్యము దెచ్చుకొని హరిశ్చంద్రు
కాంతాశిరోమణిఁ గనుఁగొని పలికెఁ

......................................................................................................

తప్పించుకొననట్లు, మచ్చంబుగా = గుఱుతు గా, సూడిద = కౌనుకి , సురిఁగె =మ రుగ య్యెను. నుల్చికొని= మెలిఁ బెట్టికొని, తన బారిఁ బాలి పొమ్ము = నాదా నుండి పరుగెత్తిపొమ్ము, నవరత్న కాంతులమించు = నవరత్నముల కాంతులయొ క్కప్రకాశము, తొంగలిం చెడు = ప్రకాశించెడు, తొడవుల మూట = సొమ్ము

లముల్లె, దాకొన్" క దియునట్లు, దొడికి = తెగించి, అతి పలు :
290

హరిశ్చంద్రోపాఖ్యానము

గటకటా నిన్ను నెక్కడి దురాత్మకుఁడు
'కుటిలుఁడై యిటు సేయఁ గోరి పుత్తెంచెఁ
దొడవుల కై తెంపుతోఁ బ్రాణములకు .....................2350
దొడికి ముద్దులపట్టిఁ దునుమ నేమిటికి
నను వేఁడుకొనిన నింతకు మేలిమైన
వినుత భూషణములు వెలఁది నీ కిడనె
సుకుమారు నత్యంతసుందరాకారు
నకట చంపఁగఁ జేతు లాడెనే నీకుఁ
బురుషులకంటె నెప్పుడు నారుగుణము
లరయ సాహస మెక్కు డతివల కనిన
యమరిననీతి వాక్యము నిజ మయ్యె
రమణిరో దానవురాలవు గాక '
యని చాలఁ గోపించి యప్పు డారాజు ...................2360
'ననుమానమే ల సయ్యన ధర్మ మెన్న
దీనితో భాషింప దీనిఁ గంగొనిన
నూనుఁ బాతక'మ ని యుర్వీశుఁ డాత్మ
నంతంత నడరుశోకా వేశమునను
వింతగా 'భీషణ విను' మని పలి కెఁ
బడఁతుక నా కన్న పట్టిపాదముల
కడ నిల్పి యీ బాలఘాతుకి శిరము
వెసఁ ద్రుంపు మని చెప్పు వీర బాహునకు

.....................................................................................................

దానవురాలవు = రాక్షసివి, ధర్మ మెన్న... బాతకము = ధర్మము నాలోచిం పఁగా నిట్టిఘాతుకితో మాటాడుటయు దీనిని గన్నెత్తిచూచుటయు నే పాత

కముగావచ్చును, నాకన్న పట్టి = నేనుగన్నట్టి బిడ్డ ని యొక్క, ముమ్మరంబుగ వగ

ద్వితీయభాగము.

291

మసలకు మిదియె ముమ్మాటికి సెలవు
పొమ్మన్న నప్పు డాభూపాలు దేవి................................2370
“ముమ్మరంబుగ మది ముప్పురి గొనఁగ
వగపు లన్ని యుఁ బాయ వరమి చ్చె దైవ
మగల నేటికిఁ జావు'కని తలపోసి
తల వాంచి తనకల్లఁదనము దీపింప
నిలిచి యూరక యుండె నేల వ్రాయుచును
పోఁడిగా నత్త టి భువనముల్ వెగడ
నేఁడు హరిశ్చంద్రనృప శేఖరుండు
శ్రీకరనిజరాజ్య సింహాసనంబు
నీ క్రియ విలసిల్ల నెక్కు న న్నట్లు
లాలితనిజమండల స్ఫూర్తి మెఱయ...............................2380
బాలభానుఁడు తూర్పు పర్వతం బెక్క
నంత నాభీషణుఁ డనుత లారియును
బంత మేర్పడఁగ నాభానుకు లేశు
కాంతఁ దోడ్కొని పోవఁగా రాజవీథి
నంతంత డగ్గఱి యాపౌరసతులు
గమి గూడి చూచి యక్కట దాది. చన్ను
నిముక నేరనిచిన్ని నెత్తురుఁగందు
బంగారువంటిపాపని మెడం బిసికి

.........................................................................................................

అన్నియు మది ముప్పురిగొనఁగఁ బాయ దైవమువరమిచ్చె' నని యన్వయము, గల నేటికి = చింతింప నేల, దీపింపన్" =ప్రకాశించునట్లుగా ఈక్రియ : విధము, లాలిత ... స్ఫూర్తి = మనోజ్ఞ మైన తనబింబము యొక్క తోంపిక జ .... నెత్తురుగందు = దాది చంటిలో నిముడనేరనంత చిన్ని జొత్తు పాప బిడ్డ ....








మ్క,

'ది ... నెత్తురుఁగందు= దాదిచంటిలో నిముడ నేర నంత చిన్ని జొత్తు పాప,బిడ్డ..
292
హరిశ్చంద్రోపాఖ్యానము

మింగ నెచ్చటనుండి మృత్యువై వచ్చె
నాఁడుదొంగలు దురుచైరి పో భువిని ......................2390
బోఁడిగా బిడ్డలఁ బొరుగిండ్ల నుంచి
నిదుర వోవఁగఁ బాసె నేఁటితో మనకు
నిది మహాపద వుట్టె నీపట్టణమున
వదలక నిటువంటివారికి నెల్ల
బెదరుగా దీనిఁ జంపినఁగాని పిదప
ఢాక గాదనువారు 'తగ దాటదాని
నేకల్ల నేసిన నిటు పట్టి చంప
నొలికి ద్రిప్పుడు మేను నొక చోటు గోసి
తలగి పొమ్మందురు తనభూమి వెడలి
యీలోకకల్యాణి కీమానవతికి......................................2400
నేలీల నీనింద యెసఁగెనో రొని
పరికించి చూడ నేపట్టున నై న
బరమాణువంత పాపము గాన మెన్న
డులుకుచు దొంగ దా నొక చోట నుండు
నొలయ నవిశ్వాస మొక చోట నుండు
నాఁట దానికి వశ మమ్ముయీ మేటి

.........................................................................................................

నేఁటితో మనకు బిడ్డలను పొరుగిండ్ల కేని పంపినను వారచట నెమ్మది గాను దురనునమిక తో నిదురపోవుటమనకు నేఁటితో తీరెననిభావము - పొరుగిండ్లకు గూడి బంపరాచయ్యె నని భావము. ఢాక = భయము-హద్దు, ఆఁటదానికిన్ : ఆడు దానిని ఒలికి త్రిప్పుడు = పీనుఁగునుజంపి త్రిప్పఁగా, మేనునొక చోటగోసి దేహములో ఏదేనొక భాగమునుగోసీ, ఉలుకుచు ...నుండు = దొంగయులుకుచ

తానగపడక యొక చోటనుండును. అపనమ్మకము దొంగ కానట్టి మరొక్కరి

ద్వితీయ భాగము.

293

'రోటలు దాఁటి యీగోడలు దాటి
తాళంబు లెడలించి తలుపులు దెఱుచి
కేళిమై రొప్పుజాగిలముల మొఱఁగి
దాది వాకట్టి భూతలనాథుపట్టి.................................2410
నాదట నీరీతి నర్రొత్తి చంప
నూహింప నెవ్వఁడో యొకకన్న గాఁడు
సాహసంబునఁ బోయి చంపి యీతొడవు
లను వొండఁ గొనిపోవ నంత నారెకులు
తను గూడముట్టినఁ దరలాక్షి మీఁదఁ
జొప్పు పుట్టంగ నాసొమ్ములు వైచి
తప్పించుకొని పోయెఁ దన ప్రాణభీతి
నేరము దనమీఁద నెరసిన లం
గూరి భూపాలునికొలువులోపలను
నిలిచి భాషింపఁగ నేరక చావు .....................................2420
కలుగక చనుచున్న' దనువారు గొంద
'రిది 'బాలఘాతుకి యెద నెన్ని చూడ
నిది వధూవధ దీన నె ట్లాడ నెట్లో

.............................................................................................

యందుండును, ఎడలించి = ఊఁడునట్లు చేసి, జాగిలములు = వేఁటకుక్కలు, మొఱఁగి = ఏమరించి, ఆదటన్ = ఆసక్తితో, అర్రొత్తి మెడఁబట్టి, ఆరెకులు =తలారులు, కూడ ముట్టినన్ కూడునట్లు వచ్చి పైకొనఁ గా, చొప్పుపు ట్టంగన్ దొంగజాడకలుగునట్లు, నెరసినన్ = వ్యాపింపఁగా మోపంబ డఁగాననుట, లజ్జఁగూరి = సిగ్గునొంది, ఇది ... నెట్లో ఒక ప్రక్కచూడఁగా, నిది బాలఘాతుకి గాన వధింపఁదగును. మఱి యొక దృష్టి నిజూడఁగా ఇది స్త్రీ గాన

స్త్రీవధ ముదగదు. కనుక తగును తగదు అని ఎట్లు చెప్పి తే నేమి వచ్చునో మనకీ
294

హరిశ్చంద్రోపాఖ్యానము

దోష మేవెంటను దొడరునో చనదు
దూషింప భూషింపఁ దుది నెంతవట్టు
తప్పును నొప్పును దైవ మెఱుంగు
నొప్పు నూరక చూచుచుం'టను వారు
పలువు రీరీతిని బలుచందములను
బలుకంగ నావీర బాహునిక డకు
వదలక కొనిపోయి వసుధీశుఁ డాత్మ.............................2430
జెదరక మును మూడు సెలవులు నొసఁగి
యాన తిచ్చినచందమంతయుఁ దెలియ
వానికిఁ జెప్పి యవ్వన జాక్షి, నపుడు
బెడిదంపు బావురుఁబిల్లివాతికిని
దొడిఁబడ రాచిల్కఁ ద్రోయుచందమున
దగ నప్పనము సేసి తలవరుల్ దాను
మగిడి భీషణుఁ డేఁగె మనుజేశుఁ గొలువ
వీర బాహుండును విభునాజ్ఞ సేయఁ
గోరి చయ్యన నతి క్రూరవ ర్తనులఁ
గ్రోవ్వాడి మృత్యువుకోఱలు వోలె......................................2440

........................................................................................................................

జోలియేల, దోషమే ... దొడరునో = ఎట్లు చెప్పి తేదోషము గూడవచ్చునో,చ నదు దూషింపభూషింపన్= దూషించుటయు భూషించుటయు రెండును ఒప్పు దు. కుది... మెఱుఁగు=కడపటనీవిషయమున త ప్పెంతమాత్రమో ఒ ప్పెంతమా త్రమోదైవ మే యెఱుఁగును. ఒప్పునూరక చూచుచుంట = ఊరక చూచుచు మాత్ర ముండుటయేతగును. మూఁడు సెలవులునొనఁగి= ముమ్మాటికీ ఆజ్ఞ చేసి,అప్పనము చేసి =అప్పగించి, అతిక్రూరవ ర్తనులన్ = మిక్కిలిక్రూర మైన నడవడిగలవారిని,

వ్వాఁడి మృత్యువుకోఱలు= మిక్కిలివాడియైనమృత్యువు యొక్క కోఱపండ్లు,మ

295

ద్వితీయ భాగము.

మవ్వంపుమెఱుఁగులమాడ్కి మేలైన
బిత్తరంబులు సిమ్ము బెడిదంపువాలుఁ
గత్తులు గలభయంకరులఁ గింకరుల
వీక్షించి 'మీరెల్ల వెసఁ బ్రేతభూమి
కక్షీణగతి నేఁగి యచ్చోట నున్న
వీరదా సను నెఱవీరుని చేతి
కీరమణీమణి నిచ్చి చంపింపు'
డనుటయు వార లయ్యతివదోడ్కొనుచుఁ
జని వీర దాసునిసన్నిధి నిలిపి
పతియానతియు వీర బాహునిపంపు........................2450
నతిచిత్రముగఁ జెప్ప నది విని యలికి
వెఱఁగంది 'బాపురే విధిచేఁతఁ గడువ
నెఱవాదు లెవ్వరు నిఖలలోకముల
నేటితోఁ గడముట్టెనే కౌశీకుండు
గాటంబుగా సల్పుకపటనాటకము
వెఱచిన వానిని వెన్నిచ్చి యోడి

-...............................................................................................................

వ్వంపుమెఱుఁగులు= లేఁత మెఱుపు(దీఁగలు. ఈ రెండును బెడిదంపువాలుఁగత్తులకు విశేషణములు, వాలుగత్తులు బెడిదములగుటకు క్రొవ్వాడి మృత్యువుకోఱలునుబిత్త రములు చిమ్ముటకు మవ్వంపు మెఱుఁగులుసు ఉపమానములు,బి త్తరములు= బెళ బెళ కాంతులు, బెడిదంపు=భయంకరమైన, అక్షీణగతిన్ కొఱవడ నినడతో వేగముగా నడచి, విధి చేత = దైవకృత్యమును, కడవన్ = అతిక్రమించు టకు, నెఱువాదులు- నేర్పరులు,కడముట్టె నే= ముగింపునొందినదా. గాటము గాన్ =కఠినముగా, కపట నాటకము=బూటకములుపన్ని యాడించునాట. నేఁటితో

ముగింపు నొందెనా యనుట, చంద్రమతి వధింపఁబడనున్న ది గనుక వధించుటలో
296

హరిశ్చంద్రోపాఖ్యానము

పఱచినవానిని భయమునఁ బూరి
గజచినవానినిఁ గైదువుఁ బూన
మఱరిచినవానిని మజిదిక్కు లేక
మఱుగుఁ జొచ్చినవాని నదిలోనఁ గరుణ ..................2460
నెఱయఁ బ్రోచుట నాకు నియమ వ్రతంబు
పరికింప నిట్టిచో బడలినయబలఁ
దెరలక ఘోరాసిఁ దెగ వ్రేయు మనుచు
నాకడ కంపించినాఁడు నా స్వామి
నా కేల వగ పన్న నా కేలు సాగ
దీకిడుఁ గావింప నిది తప్పుత్రోవ
యేక్రియ గల దింక నేమి సేయుదును
సుతుని దుర్మృతికి నేడ్చుచు మతి కూర్మి
సతిఁ గృపాణాహతిఁ జంపఁ బాలయ్యె'
నని యశ్రు లొలుక మీ మర వాంచి యున్న.............. 2470
మను జేశునకుఁ జంద్రమతి యిట్టు లనియె
'నినకులాధీశ నీ వెఱుఁగనియట్టి

......................................................................................................


విశ్వామిత్రునిబూటకములన్నియుఁ దీరిపోవుననిభాపము. పూరిగఱచిన వానిని= కశవునోటఁబెట్టుకొన్న వానిని, కైదువు పూనకన్ = ఆయుధమును దాల్చు ట కు, పరికింపన్ = విచారింపఁగా, బడలినయబలన్ :అలసియున్న స్త్రీ ని, అలయక యున్న పురుషు నే శరణుఁ జొచ్చినచోఁ బ్రోవవలసియుండఁగా అల సిన స్త్రీని కత్తితోనఱకుట యెట్లు అనిభావము, నాకడకు అన్నక్ = నాయేలిక నా చెంతకుఁ జంపుమనిపంపినాఁడు గాని నేనె చంపఁ దీసికొనిరా లేదు కాఁబట్టినాకు దీనిని గురించి విచార మెందుకు అన్నచో, నా కేల సాఁగ దీకీడు గావింపన్ = ఈ చెఱుపును జేయుటకు నా చేయి నిగుడఁజాలదు.ఇది తప్పుఁ ద్రోప= నా చేయి

సాగకుండుటయు తప్పుమార్గము, కృపాణాహతిన్ = కత్తివాటున, పా

297

ద్వితీయ భాగము.

వినుతధర్మంబులు వేరొండు గలవె
మున్ను స్వామిద్రోహి మోవ లే ననుచుఁ
బన్న గతల్పుతోఁ బలి కె భూదేవి
తన్ను మోచినచోటఁ దగ వట్టె పెట్టి
మిన్నక సురిఁగిన మెత్తురే జనులు
నీ పురీశ్వరుఁడు ని న్నేలినసామి
యీపని విధియించె నిది గాక నాకు
రూఢిగా రాకుమారునిఁ జంపె ననెడి..........................2480
యాడిక తలగూడె యభిమాన మెడ లె
నటు గాన ననుఁ జంప నర్హ మీ వేళ
కటకటా నీవేల కరుణఁ దాల్చెదవు
తక్కిననీచవర్తనులచేఁ జావ
కిక్కడ నాజీవి తేశుఁడ వైన
నీ చరణంబులు నెమ్మితోఁ గొల్చి
నీచేత మృతిఁ బొంది నీ పొందు మీఁద
నే పొందఁగాఁ గంటి నెట్టి సౌఖ్యంబు
లీపొందు రా వింక వెడ సేయ నేల

.......................................................................................................


లయ్యెన్ = పాలుపడవలసి వచ్చెను, పన్నగకల్పుతోన్ = శేషుఁడు సెజ్జ గాఁగ విష్ణునితో, తన్ను మోచిన చోట = తన్ను పోషించి భరించునట్టి స్వామియెడల తగవు అట్టె పెట్టి మిన్నక సురిఁగినన్ = ధర్మమును జేయక యట్లె దిగవిడిచి యూ రక మఱుఁగుపడినయెడల, రూఢిగాన్ =గట్టిగా, ఆడిక =నింద, తలగూడెన్ - సంభవించెను, అభిమాన మెడ లె= గౌర ఏము తీసిపోయెను, నిందపాలై గౌరము గోలుపోయియున్న నేను బ్రతుకుట యుక్తముగాదు గాన నన్నుజంపుట య

ర్హము, మీఁదన్ = ఉత్తర కాలమందు- లేక పరలోకమందు- లేక జన్మాంతర,మ
298

హరిశ్చంద్రోపాఖ్యానము


నరులును మునులుఁ గిన్నరులును సురలు......................2490
నరుదంది యిందును నందును బొగడఁ
దెంపు'మని తెంపు దలకొనఁ బలికి
జలజాక్షి తనచీర చక్క నమర్చి
ప్రాణేశు వలగొని పదముల కెరగి
పాణిపల్ల వములు భక్తితో మొగిచి
యనుదినర కపంకారుణం బగుచుఁ
గనుపట్టి జేవురుగట్టుచందమున
నున్న యా వధ్యశిలో పరిస్థిలిని
జెన్నారి చిఱునవ్వు సెలవిఁ దళ్కొత్త
బద్ధాసనంబునఁ బడఁతి గూర్చుండి..............................2500
పద్మినీవల్ల భుపై జూడ్కి నిలిపి
లోకలోచన సర్వలోకైకవంద్య
నాకు వేవేల జన్మంబులయందు
సతతపుణ్యుని హరిశ్చంద్రభూవిభునిఁ
బతిగా నొనర్పు మపార్థివేశ్వరుని
యాపద లన్నియు నడఁచి సత్యంబు
దీపింపఁ జేయు మీ తెఱఁగున'ననుచు
వినయంబు నెన్కొన వేఁడి చిత్తంబు
తనపతి వైఁ జేర్చి తలఁ పొండు లేక

...........................................................................................................

దు, తెంపుదలకొసన్ = సాహసము పుట్టఁగా, అనుదిన రక్తపం కారుణము= ప్ర తిదినమును నెత్తురు రొంపి చేత నెఱ్ఱనై నది, జేవురుగట్టు= ఎఱ్ఱకొండ, సెలవి :

పెదవిమూల, పద్మినీవల్లభు పైన్ = సూర్యుని పై, నెక్కొనన్ = మీఱఁగా, బంధ

ద్వితీయ భాగము.

299

నున్నంత బంధంబు లూడ్చి పో వైచి....................2510
యన్న రేంద్రుఁడు జగ దాశ్చర్య మెసఁగు
బహుసరిత్సాగర పర్వతద్వీప
మహితమహామహీమండలభార
మురుతరలీలఁ గేయూర విభాతి
భరియించునపసవ్య బాహుదండమున
సకలవిరోధి రాజన్యకోటీర
నికరకీలిత మణినికషణదీ ప్త
శాత ధారాభీల చటులఖడ్గంబు
భూతముల్ భీతిల్ల ముష్టి నమర్చి
చండమార్తాండదుస్సహదుర్నిరీక్ష..............................2620
మండల ప్రభలతో మార్కొని మండు
మెఱుఁగు లుగ్రంబుగా మిన్నులఁ బర్వ
నొర వాయఁ బెటికి మహోగ్రతఁ బూని

..........................................................................................................

ములు= ప్రేమాద్యను బంధములు, ఊడ్చిపో వై చి =-బొత్తి గాఁ దొలఁగించుకొని, బహు భారము- బహు=అనేకము లైన, సరిత్ =నదుల చేతను, సాగర= నము ద్రముల చేతను, పర్వత= కొండల చేతను, ద్వీప = ద్వీపముల చేతను, మహిత = పెద్ద దైన, మహామహీ మండలభారము = గొప్ప భూమండలము యొక్క బరువు, కే యూరవిభాతి= బాహుపురి లీలగా, భరియించు= తాల్చునట్టి, అపసవ్య బాహు దండమునన్ = దక్షిణ భుజదండమునందు, సకల... ఖడ్గంబు= సమస్త శత్రు రాజుల బాహు పురుల సమూహములందు పొదుఁగంబడిన రత్నములతో నొఱ పెట్టుటవలన మెఱుఁ గెక్కిన వాఁడివాదర చే భయంకర మైన పెనుగత్తి, చండ ... ప్రభలతో = ప్రచండమైన సూర్యునియొక్క సహింపశక్యము కానట్టియుఁదేరి

చూడగానట్టియు బింబము యొక్క కాంతులతో , మార్కొని ఎదిరించి, మండు
300

హరిశ్చంద్రోపాఖ్యానము

జళిపించి జీవి తేశ్వరి మెడ మోపి
కలఁగక తెగ వేయ గమకించునంత,
గ్రమ్మఱ నెడ సొచ్చి ఖడ్గంబుఁ బట్టి
యమును జేశుతో ననియెఁ గౌశికుఁడు
“చాలు నోహో యిట్టి సాహసకృత్య
మేల కై కొంటి న రేశ్వర నిన్ను
వీక్షింప దోషంబు వివరింప మనుజ................................2530
రాక్షసుండవు గాక రాజవా నీవు
వ్రాలు వైరులమీఁద వాలునీవాలు
వాలుఁ గంటులఁ ద్రుంప వాడె యీ వాలు
భామలఁ జంపఁ బాపము లే దటంచు
నేమించెనే మున్ను నిను వసిష్ఠుండు
క్రమమున ధర్మార్థ కామమోక్షములు
నమర నీ కీఁ దగునట్టియీ'సాధ్వి
జననుత సౌందర్యసంశోభితాంగి
నినుపముల్కికి నేల యీఁడలం చెదవు
భువనవిఖ్యాత మై పొలుపొందునట్టి ..................................2540
రవివంశమునఁ బుట్టి రాజసం బుడిగి
బతిమాలి పెనుమాలబంటవై నీచు

........................................................................................................

మెఱుఁగులు= జ్వలించు చున్న కాంతులు, నిన్ను వీక్షింప దోషంబు=నిన్ను జూచుటయే పాపము, మనుజరాక్షసుఁడవు=మనుష్యరూపమున నున్నటి రాకా సివి, వ్రాలు వైరుల మీఁదన్ = అతిశయించుచున్న శత్రువుల పై, వాలునీవా లు=వ్రాలునట్టి నీకత్తి, వాలుఁగంటులన్ = స్త్రీలను, ఇనుపముల్కి కి = కత్తి యి నువస్తలాకునకు, రవివంశము = సూర్యవంశము, నందనున్ = కొడుకును, నాతి =

301

ద్వితీయ భాగము.

గతిఁ గాడు గాచునీకష్టంబు దగు నె
కులసతితలఁ దెగఁగొట్టి యేలోక
సౌఖ్యంబుఁ బొందఁ జూచెదవె
యాలికై దశుని నడఁపఁడే శివుఁడు
పోలింప నీకంటె బుద్ధిహీనుండె
సతి లేని గృహ మేల సౌఖ్యంబు లేల
సతి లేనిసుతు లేల సంపద లేల
సతియుఁ గల్గినఁ గల్గు సకలధర్మములు..................2550-
సతియుఁ గల్గినఁ గల్గు సకలపుణ్యములు
సతి గల్గినను గల్గు సత్పుత్రచయము
సతి గల్గినను గల్గు సద్గతి త్రోవ
యటు గాన విడువు మీ యాగ్రహబుద్ధి
గటకటా నీ వివేకం బెందుఁ బోయె
నాబుద్ధి వినక నందనుఁ జంపు కొంటి
నాబుద్ధి వినక నీ నాతి నమ్మితివి
మాను మిగుణ మన్న మానక దురభి
మానంబె పెంచెదు మానవాధీశ
నామాటఁ గైకొని నాకొమారితల..................................2560
నామాలమగువల నర్థి వరింపు
నీ సుతు ప్రాణంబు నీరాజ్య సుఖము
నీ సతితోఁ బొందు నీ తొంటి పెంపు
బడయు మీ వింక నీపదును దప్పినను
గడపట నీవు తెక్కలిఁ జత్తు' వనుచుఁ

...............................................................................................................

స్త్రీని, పదును= సమయము, తెక్కలిన్ = పంచన చే, భవసాగరంబున్ =సంపార
302

హరిశ్చంద్రోపాఖ్యానము

బెక్కుచందములఁ బ్రియమును భయము
నెక్క బోధించుమునీంద్రునిఁ జూచి
పక పక నవ్వి 'యీభవసాగరంబు
నొకదరిఁ జేర్చుచు నున్నాఁడు శివుఁడె
యితరునివలె నది యిది యని కాని.........................2570
గతులు నీచేతఁ దార్కాణింపఁబడెడు
రాసి నీ కెదు రుత్తరంబులు వల్క
నాసరోజాకుండు నలుకు నేనెంత
మును నీవు చెప్పిన బుద్ధులె కాక
వినఁ క్రొత్త లేడివి వివరించి చూడ
వీర బాహునిమది విశ్వాస మొదవ
గోరి నేఁ జేసిన ఘోర ప్రతిజ్ఞ
మఱచి సత్యము మట్టుపఱిచి లోలోన
జరిగి పోనిత్తున స్వామికార్యంబు
సుతు నొల్ల సతి నొల్ల సురలోక మొల్ల
బతిమాలి నీ విచ్చు పడతుల నొల్ల
సత్యంబు గలిగినఁ జాలు వేయేల
సత్యమే జయ మని చాటు వేదములు
విడువు ఖడ్గం బింక వేంచేయు మిట్టి
యెడ నుండఁ జనదు మునీశ నీ వింక'

.................................................................................................................

సముద్రము యొక్క, ఒక దరిన్ = ఒక గట్టును, ఇతరునివ లె= సామాన్యుఁ డైన యొక నివలే, ఇది యదియని కానిగతులు నీ చేతఁ దార్కాణింపఁబడెడు = ఇదిమంచిది అవి చెడ్డది యని సరి కానట్టి పద్ధతులు నీవు సూచించుచున్నావు, రాసిన్ = తెగు

వతో, సరోజాక్షుడు=విష్ణువు, పొంకంబు చెడి = పసగుంది, ఉవిదలు= స్త్రీలు,

303

ద్వితీయ భాగము.

నావుడు వెఱఁగంది నరలోక నాధు
పావన సత్యసంపద 'కాత్మ నలరి
బొంకించునాసలఁ బో వీడి మౌని
పొంకంబు చెడి తలపోయుచు నుండె
నప్పుడు దేవత లంబరవీధి.................................................2590
నుప్పొంగు వేడ్కల నువిదలుఁ దారు
బహురత్నదీప్తుల భాసిలుచున్న
మహనీయదివ్యవిమానంబు లెక్కి
వెఱఁగంది క్రందుగా వీక్షించుచుండ
నెఱ దెంపుమై ధారుణీత లేశ్వరుఁడు
భిదురంబుకంటెను బెడిద మై చదల
నదరులు సెదర భయంకరలీల
వాలువా లెత్తి యా వొమాక్షికంఠ
నాళంబు తెగ వేయ నది కఱుక్కనఁగఁ
దాఁకిన వేటు పూ దండయై చెన్ను......................................2600
గైకొని పూబోఁడిగళమున నున్న
దల యూచి సతిఁ జూచి తన కేలునె త్తి
ధళధళ మనుఖడ్గధార వీడ్కించి
'దాటి దప్పెనొ కాక ధవళాక్షి కిప్పు

.....................................................................................................................

కందు గాన్ =గుంపులుగొని, భిమురంబు కం టెను= వజ్రాయుధముకంటెను, బె ద మై= భయంకరమై, చదల = ఆ కాశమునందు, అదరులు: మీడుంగుఱులు, వాలు వాలు= అతిశయించుచున్న క త్తి, కంఠ నాళంబు = గొంతుక్రోవి, కలుక్క గళగ... దండయైక = కఱుక్కని తగిలిన దెబ్బ పూదండ గా మారినదై, చెన్ను గై

కొని= అందమునొంది, గళమునన్ = మెడయందు, ఈతోయము= ఈసారి, అసినో
304

హరిశ్చంద్రోపాఖ్యానము

డీరీతి కౌశికునింద్రజాలంబొ
వాతప్పితినొచేతివడి దప్పి చనెనొ
చూత మీతోయ మీచోద్య మిలీల
నసి వోవ వచ్చు నాయసి వొక' యనుచు
వెసఁ బూన్చి మఱియును వేయఁ జూచుటయు
శ్రీవిశ్వనాథుఁ డాశ్రిత పారిజాతుఁ ........................................2610
డా వేళఁ గరుణ నిండారుచిత్తమున
వడి గొని మూడుత్రోవలఁ బాఱు నేఱు
తొడరి కెంజెడలలోఁ దుంపురుల్ గురియఁ
జెన్నుగా నౌదలఁ జేరినమించు
"క్రొన్నెలతళ్కు చకోరాళిఁ బిలువ
నుఱక పువ్వులవిల్తు నొక జుఱ్ఱఁ గొన్న
చుఱుకుచూపులకన్ను చోద్య మై మేఱయ
దనర నేనుఁగుమోముతనయునిఁ గన్న
వనజాక్షి దాపలివంక శోభిల్ల
మేలి మువ్వన్నెలమెకము మైతోలు.....................................2620
చేల గట్టిన కాసెచెఱఁగు దూలాడఁ
బోఁడిగా మెఱుఁగుల పోల్కి దీపించు
మూఁడుముల్కులవాలు ముష్టి చే నమర

....................................................................................................

వవచ్చు నాయసిపోక = నాక త్తి పాటు వ్యర్థము కావచ్చునా, మూడుత్రోపలఁ బారు నేఱు త్రిపథగ -గంగ , మంచుకొన్నె లతళ్కు = ప్రకాశము గల్యత చందురుని రేక , ఒక జుర్రున్ = ఒక్క పీల్పు గా, చుఱుకుచూపుల కన్ను = ఆ గ్ని నేత్రము, ఏనుఁగుమోము తనయుని గన్న వనజాక్షి = విఘ్నేశ్వరునిఁ గన్న ట్టి పార్వతి, దాపలివంకన్ ఎడమ ప్రక్క, మేలి మువ్వన్నెల మెకము మై

తోలు డేల = మే లైన జింక మేనితో ల నెడి వస్త్రము, మూడు ముల్కులవా

305

ద్వితీయ భాగము.

వెస ఖణీల్లున జంకె వేసి కుప్పించు
బసవరాయని నెక్కి పార్శ్వభాగమున
బాలును నీరు నేర్పఱచువాహనపు
వేలుపు డగ్గఱి వింజామ రిడఁగఁ
దివిరి నెమ్మది దూర్పు దెస నేలు రాజు
ధవళాతపత్రంబు ధరియించి నడువ
ముట్టి వేల్పులఁ గొట్టి మొనసిన బిరుదు.............................2630
పట్టెంబువీరుండు పడవాలు గాఁగఁ
గిన్న రగంధర్వగీర్వాణయకు
పన్న గవరులును బ్రమథులుఁ గొలువ
శుక కుంభసంభవ సుబల కణ్వాది
సక లసన్మునిగణసంస్తుతు లెసఁగ
ననుపమభూతిలిపావదా తాంగ
జనిత నిర్మల కాంతిచంద్రిక వలన
నయ మార నఖిలవిజ్ఞానివిశాల
నయనోత్పలముల కానంద మేసంగఁ
బరమయోగీంద్రులు భావంబునందుఁ.................................2640
బరికించి కాననిపరమాత్మ మూర్తి
యావేళఁ దనకుఁ బ్రత్యక్షమై 'సై చు

.................................................................................................

త్రిశూలము, బసవరాయని వృషభ రాజును - నందిని, పాలు ...ను వేలుపు హంసవాహనుఁడైన బ్రహ్మ, తూర్పు దేస నేలు రాజు ఇంద్రు డు. బిరుదు పట్టెంబు వీరుఁడు = గొప్ప కత్తిని దాల్చిన వీరుఁడైన కుమా రుఁడు, పడవాలు= సేనాపతి, అనుపమ ... చంద్రిక వలన = సాటి లేని బూదిచే పూయఁబడిన తెల్లని యవయవములవలనఁ బుట్టిన యచ్చమైన కాంతియ నెడు

వెన్నె లవలన, అఖిల ...త్పలములకున్ = సమ స్తజ్ఞానుల విశాలము లైన నేత్రములు
306

హరిశ్చంద్రోపాఖ్యానము

భూవర' యనిన నద్భుతముఁ దత్తఱము
భయము సంభ్రమమును భక్తియు నయముఁ
బ్రియమును బెనఁగొనఁ బెల్లుగా మేనఁ
బులకలు గొబ్బునం బొడమ నానంద
కలితాశ్రుకణములు గన్ను లఁ దొరుఁగ
నవనిఁ జాఁగిలి మొక్కి యడుగుల కెరఁగి
సవినయంబునఁ గిరజలజముల్ మొగిచి
“కాలకంధర లయకాలాగ్ని రుద్ర...........................................2650
కాలసంహర మహాకాళీనివాస
వాసు దేవ ప్రియ వాసుకివలయ
వాసవార్చిత కృత్తివాస మహేశ
నాగశోభితహ స్త నాగాసురారి
నాగ నాగాంతక నాగేంద్రవంద్య
కమలాసనస్తుత్య కమలా పనేత్ర
కమలారి సురసరిత మలక పర్థి

................................................................................................................

నెడి కలువలకు, సైఁచుభూవర = తాళురాజూ, కాలకంధర =నల్లని కంఠముగల వాఁ డా లయ....రుద్ర= ప్రళయకాలాగ్నివల్లెరౌద్రుఁడైనవాఁడా, కాలసంహర = యముని నిగ్రహించిన వాఁడా, మహా కాళీనివాస= పార్వతి కాటపట్టయిన వా డా, వాసు దేవ ప్రియ విష్ణువునకు ప్రియుఁ డైన వాఁడా, వాసుకివలయ = వాసుకి కడియము గాఁగలవాఁడా, వాసవార్చిత = ఇంద్రుని చేత బూజింపబడినవాఁ నాగశోభితహస్త = జింక తోలు చేనొప్పుచున్న చేయిగలవాఁడా, నా'గాసురారి =గజాసురునకు శత్రువైనవాఁడా, నాగ నాగాంతక = గజాసురాంత క, నాగేంద్రవంద్య = ఆది శేషునికి వందింపఁదగిన వాఁడా, కమలాసనస్తుత్య -- బ్రహ్మకు స్తోత్రము సేయఁదగిన వాఁడా, కమలా ప్త నేత్ర = సూర్యుఁడు కన్ను గాఁ

గలవాఁడా, కమలా... కపర్ది = చంద్రుఁడు గంగానది తామరలునుగల జ

307

ద్వితీయ భాగము.

గిరిశ రాసన రౌప్య గిరిశృంగనిలయ
గిరికన్యకాప్రియ గిరి భేది జనక
వేదమ స్తకముల వెలయునీదివ్య...............................2660
పాదపద్మములు నాఫాలంబు సోఁక
నరయఁ గృతార్థుండ నైతి లోకముల
దురితంబు లన్నియుఁ దొలఁగింపఁగంటి”
నని పెక్కు భంగుల నభినుతి సేయ
జననాథువలనఁ బ్రసన్నుఁడై శివుడు
రాజేంద్ర నీవంటి రాజు నాయేలు
నీజగంబులలోన నెవ్వఁడు లేఁడు
మేలు నీసత్యంబు మేలు నీ తెంపు
మేలు నీ ధైర్యంబు మెచ్చితి నడుగు
వరము లే మిటి వేఁడు వలసిన'వ నుచుఁ.........................2670
గరమున మే నంటి గౌరవం బమరఁ
గలకంఠములచాయ గల దనగూర్మీ
కలకంఠివంక కై కడకంటిచూపు
నిగిడించుటయు సిగ్గు నెక్కొని విభుడు

............................................................................................

జూటముగలవాఁడా, గిరిశరాసన = కొండయే విల్లు గాఁగలవాఁడా, కౌ గిరిశృంగనిలయ= కై లాసశిఖరము వాసస్థానము గాఁగలవాఁడా, గిరికన్యకా య = పార్వతికి వల్ల భుఁ డైనవాఁడా, గిరి భేది జనక = క్రౌంచపర్వతమును భే చిన కుమారునికి తండ్రియైన వాఁడా, వేదమ స్తకములన్ వేదశిరస్సులను పనిషత్తులందు, దురితములు= పాపములు, కలకంఠ ...వెంక కై = కోకిలము వన్నె గల తన గారాబుపడఁతి దెస కై -నల్లనిచాయగల గౌరిదిక్కు. అనుట,సిగ్గు క్కొని విభుఁడు = రాజు సిగ్గునొంది, మునుకుచు=మిణకరించుచు, సాదలనీరు

....
308

హరిశ్చంద్రోపాఖ్యానము

మొగము వ్రాలఁగవైచి మునుకుచు నున్న
వానితలంపు భావంబున నెఱిఁగి
యానీలకంధరుం డనియె నవ్వుచును
“సొదలనీ ఱలఁది యచ్చుగఁ దోలు గప్పి
పొదివి నిచ్చలు బహుభూతముల్ గొలువ
నీవల్ల కాటిలో నిటు విహరింప........................................2680
నావంటివాడ వై నాఁడవు నీవు
నిది గాధిపుత్రుమ హేంద్రజాలంబు
విదితంబుగా నీకు వివరింతు వినుము
మసనంబు గాదిది మఘశాల గాని
యెసఁగు శల్యములు గా విధ్యముల్ గాని
పడినపున్కలు గావు పాత్రలు గాని
యడరు నెత్తురులు గా వాజ్యంబు గాని
యొలయు కొర్వులు గావు యూపముల్ గాని
తల వెండ్రుకలు గావు దర్భలు గాని
వెఱవక ని న్నే లువీర బాహుండు..................................2690
మఱియుఁ గాలుఁడు గాని మాలఁడు గాఁడు
వినుము నీకూర్మి దేవిని నేలుచున్న
'యనఘుండు కౌశికుననునుతి నిలిచి

...........................................................................................................

= చితియందలిబూడిద, పొదివి= చుట్టుకొని, “బహుభూతమునిచ్చలుపొదివి కొలువన్ అని యన్వయము, నావంటివాఁడవు= "నే నెట్లు వల్ల కాటిలో పూర్వో కవిధములనుందునో యట్లే నీవును న్నాఁడవనుట, మసనంబు = వల్ల కాడు మఘశాల = -యజశాల, ఇద్మముల్ =కట్టెలు, ఆజ్యము= నెయ్యి, యూపముల్ =

'యూప స్తంభములు, కాలుఁడు=యముఁడు, దుర్మోహ... కారంబు = చెడ్డయ

309

ద్వితీయ భాగము.

కలఁగక కపటమార్గమునఁ జరించు
కలిరాజు గాని తాఁ గాఁడు (బాహణుఁడు
మతి నింక నీ కనుమాన మేమిటికి
ధృతిఁ జూడు' మని దివ్యదృష్టి నిచ్చుటయు
నంతయు విస్మయం బడర వీక్షించి
సంతోషమునఁ బొంది సతియును దాను
నొక్కట సాష్టాంగ మొనరించి భక్తి..................................2700
నెర్కొన 'పరమేశ నీ ప్రసాదమున
నరిగె దురోహమదాంధకారంబు
పరఁగె సమ్య జ్ఞానభాస్కరోదయము
నీభవబంధంబు లిన్ని యుఁ బాపి
నీభ క్తుగా నేలి నీ సేవ మరిపి
నన్ను మన్నింపవే నమ్రవిధేయ
నన్ను రక్షింపవే నాగ కేయూర
నీకు మొక్కఁగఁ గంటి నినుఁ జూడఁ గంటిఁ
బాకటంబుగ జన ఫల మబ్బె నాకు
నిండు నెమ్మది నిన్ను నిలుపుట దక్క........................2710
నొండువరంబు నే నొల్ల నీ యాన'
యనునప్పు డా రాజునర్ధాంగలక్ష్మి,

...................................................................................................

జ్ఞానమ నెఁడు గొప్పచీకటి, సమ ... దయము=మంచి జ్ఞానమ నెడి నూర్యోద యము, నమ్రవి ధేయ అడఁకువతోభజించువారికి పరతంత్రుఁడైనవాఁడా, నాగ కేయూర = సర్పములు బాహుపురులు గాఁగలవాఁడా, 'నిండు నెమ్మది కన్ను నిలుపటదక్క' = నాపూర్ణ హృదయములోనిన్ను నెలకొలుపుట తప్ప,

అర్ధాంగలక్ష్మిన్ = భార్యను - చంద్రమతిని, కాత్యాయని= ఫార్వతి, బాములన్
310

హరిశ్చంద్రోపాఖ్యానము

దనకృపాదృష్టిఁ గాత్యాయని చూచి
‘రా చంద్రమతి పతివ్రత నౌదు వీవు
నీ చరిత్రంబు వర్ణింప నచ్చెరువు
సుదతి నీమంగళసూత్రంబు గాదె
పదివేల బాములఁ బాపె నీపతికి
సౌభాగ్యవతివి గా సకలసామ్రాజ్య
వైభవంబుల మించి వసుధ నేలుచును
బెద్దగాలమునకుఁ బ్రియుఁడును నీవు........................2720
నొద్దిక వచ్చి మాయొద్ద నే యుండుఁ'
డని కుస్తరించి “నీ వడిగినవరము
కొను మిత్తు' మనిన నక్కొండ రాచూలి
పదముల వాలి 'భూపాలబాలకుని
బ్రదికించి నానిందఁ బాపి రక్షింపు
సకలజగన్మాత శాంభవి' యనుఁడు
వికసితవదనారవింద యై గిరిజ
“నీచి త్తశుద్ధికి నెఱయ మెచ్చితిని
రాచపాపఁడు మున్ను బ్రతుకు లోహితుని
ప్రాణ మిచ్చితి హరు పంపున' ననిన..........................2730
మాణిక్యకీలిత మంజుముంజీర
కంకణకింకిణీ కాంచనవలయ
ఝంకృతు లొలయ వజ్రపుటంటుజోడు

...........................................................................................................

=ఆపదలను, కుస్తరించి = బుజ్జగించి, కొండరాచూలి= పర్వత రాజై నహిమవంతు నికూఁతురగు పార్వతి, భూపాల బాలుకుని = కాశిరాజుబిడ్డను, హరుపంపునః =శి వునియాజ్ఞ చేత, మాణిక్య... ఝంకృతులు రత్నములు పొదుఁగఁబడిన సొగ సై

నయం దెలు కడియములు, చిఱుగ జ్జెలు మొలనూలు, వీనిఝంకారధ్వనులు, సేవ

311

ద్వితీయ భాగము.

తళుకులు మెజయునద్దంపుఁ జెక్కిళ్ల
దళుకు దళుక్కని తఱుచుగా మెఱయఁ
గదలుబంగారుచిల్కల రావి రేక
పొదలి నెన్నుదుట సొంపుగ నటియింప
గోమేధిక పుఁబులిగోరు నేవళము
ప్రేమమై యురమునఁ బెనఁచి తూఁగాడఁ
బరఁగ నుంగరముల పచ్చనిడాలు................................2740
బెరసి ముద్దుల వేళఁ బెనఁగ నే తెంచు
సుతు లోహితాస్యునిఁ జూడ నాచంద్ర
మతికిఁ జన్ను లు సేఁపె మమత నాయింతి
యానంద బాష్పంబు లందంద రాల
గా నక్కుతో నొ త్తి కౌగిటఁ జేర్చి
ముద్దాడుచుండ నప్పుడు కౌశికుండు
తద్దయు లజ్జించి తలవంచు కొనుచుఁ
గడుఁ జిన్న బోయి యాగ్రహ మెల్ల బోవ
విడిచి శంకించుచు వెఱఁగున మునిగి
'తపమనుదనమూలధనము ప్రతిజ్ఞ........................2750
నెపమునఁ జెడిపోయె నేఁడు నాకకట
పాక శాసనుఁ డేల ప్రశ్న గావించె
నాక్రియ మును లెల్ల న ట్లూరకుండఁ
బారెడిబండ్లకుఁ బదములు సాఁచు

...........................................................................................................

ళము= హారము, ఉరమునన్ పెనఁచి= బొమునందుగలుకొని, తపమను తనమూ లఢనము=మూలధనమువలె సంతరించిన తనతపస్సు, పారెడి... వీరిడిపగిది=ప

రు గెత్తుచున్న బండ్లను పోనీయకుండ నిలుప నెంచి తన కాళ్లడ్డము గాఁజాఫి తు
312
హరిశ్చంద్రోపాఖ్యానము

వీరిడిపగిది వివేకంబు మాలి
పని లేనిజగడంబు పై కి రాఁ దిగిచి
యనఘ వసిష్ఠుమహామునిసింహుఁ
గలఁచి నా దెస కేల గవియించుకొంటి
వల దని సుర లైన వారింప రైరి
జగతిలోపల హరిశ్చంద్ర భూవిభుఁడు ...........................27 60
పొగ డొందె నేమి తాఁ బొగడొందఁ డేమి
బొంక కుండిన నేమి బొంకిన నేమి
కింకరిపడి పరికింప నా కేల
నేలకు నింగికి నెటీ సూత్ర పెట్ట
లెడునా బుద్ధి సమసె నేడనుచు
నొగి వేటు దప్పుటయును జొహా రనెడు
పగిది సన్నిధి యైన భర్గాదిసురులఁ
గని మొక్కి పార్థివుఁ గౌఁగిటఁ జేర్చి
మనమున హర్షించుమాటలు వలికి
‘బడలితి వెంతయు భానుకు లేశ...................................2770
జడమతిఁ బూని నీసత్యంబు పెంపు
సొలవక నొరసి నేఁ జూచుట కిట్లు

.............................................................................................................

చకు దానిని నిలుప లేక తానే బాధనొందునట్టి వెర్రిఱ వానివలె, కవియించుకొంటి = ఎదిరించునట్లు చేసికొంటి, కింకిరిపడి = కోపపడి, పరికింపన్ = పరీక్షింప, నేల కునింగి... నా బుద్ధి= భూమికి ఆకాశమునకు సరిగా సూత్రము పెట్ట సమర్థమైన నాబుద్ధి-భూమ్యాకాశముల కవలీలగా వ్యాపించునట్లు అతివి స్తీర్ణ మైన నాబుద్ధి యనుట, సమ సె = నశించెను, వేటు ... పగిదిన్ - వేటు తప్పిపోఁగా జోహారని మొక్కునట్లు అందిన చోతలయును, అందనిచో కాళ్లును పట్టుకొనునట్లు,

లేకవ్రేటు తప్పఁగా నే జోహరన్నట్లు తటాలున, పార్థవు న్= రాజును, ఒర సి= ఒత్తి,

313

ద్వితీయ భాగము.

నలఁకువఁ బొందించి నాతిని నిన్ను
వేవేల విధముల వెతలఁ గుందించి
కావరంబునఁ జాలఁ గల్ల చేసితిని
లోలత నా తప్పు లోఁగొని మనసు
జాలిఁ బో విడిచి యీసామ్రాజ్యలక్ష్మి
నెమ్మదిఁ గైకొని నెరి మహీ ప్రజల
నిముల రక్షింపు మిఁక ' నన్న నవ్వి
‘యకట మునీంద్రయిట్లానతీఁ దగునె............................2780
సక లజగన్నుత చరితుండ వీవు
నీ కేటి తప్పులు నిఖిలలోకముల
నీకతంబున మించె -నేఁడు నా కీర్తి
ఘన మైననీయనుగ్రహమునఁ గాదె
చనుదెంచె ననుఁ బ్రోవఁ జం ద్రావతంసుఁ
డీ దేవతలు మును లీయోగివరులు
యఁ గాదె మన్నించిరి నన్ను
జల్లనినీక టాక్షంబు నామీఁద
నుల్లంబులో మోద ముప్పొంగఁ జేసె
బరి తాపములనెల్ల బాపె సౌఖ్యములఁ.......................2790
బురికొల్పె నింక నోమునిచంద్ర నిన్ను
వెఱచుచు నొకమాట వేఁడెద నేను
మఱచియు రాజ్యంబు మళ్లి కొమ్మనకు
మెలమితో ము న్నొక్కఁ డిచ్చినదైన

............................................................................................................

నలఁకువ= ఒరిపిడి, నాతిని= స్త్రీని నీ భార్యయైన చంద్రమతిని, చంద్రావతంసుఁ

డు= శివుఁడు,మున్నొక్కఁడు... కడపినన్ = ఒకడు ముందు దానిచ్చినట్టి గాని
314

హరిశ్చంద్రోపాఖ్యానము

బొలుపొందఁ దా దార పోసినదైన
సూది మోపెడునంత చోటు నాభూమి
లే దని కడపిన లెక్కింప వాఁడు
ఘనతర మగునరకమున వేయేండ్లు
మునుఁగుచుఁ గ్రిమిరూపమున వసియించు,
ననుధర్మశాస్త్రవాక్యార్థంబు గొంత...............................2800
మనమునఁ దలపోయుమా మునినాథ
యే కాతపత్రమై యెసఁగునీవసుధ
నీకిష్టమగువారి నిలిపి యేలింపు'
మనుటయు “మే లయ్యె నట్లచేసెదను
జననాథ నాకు నీసకలరాజ్యంబు
నీచేత నేలింప నిక్కంబు వేడ్క
నా చిత్తమునఁ జాల ననిచిన దిపుడు
బొంకితి నని పొమ్ము పో కున్న వట్టి
శంకలు మాని నాజాడ నే రము
దేవేంద్రుఁ డాదిగా దేవసంఘములు.........................2810
నావామదేవా దులైనసనుమ్మనులు
సెవులార విన మున్ను సేసిన ప్రతిన
శివశివ తప్పునే చెచ్చెర నిన్ను
నిల నెంత గాలంబు నేలింతు ననుచుఁ
బలికితి నందాఁకఁ బాలింపు వసుధ

...................................................................................................................

ధారపోసినట్టి గాని భూమిలో సూది మో పెడునంతామాత్రము భాగము ఇయ్య లేదని చెప్పి జరపి పుచ్చినయెడల, ఏకాతపత్రము= ఏకచ్ఛత్రము, ననిచినది= పుట్టి నది, బొంకితినని పొమ్ము = అబద్ధము చెప్పితినని చెప్పి తప్పించుకొని పొమ్మ, పోకు

న్న...రమ్మ = అట్లు చెప్పిపోనియెడల నా వెంట నే వచ్చి "నాపంపు సేయుము,

ద్వితీయ భాగము.

315

మరి మీద దేవేంద్రుమా ఱటగద్దె
నెరి నెంత గాలంబు నిలుపుదు నంటి
నంతగాలము నుండు మమరలోకమున
వింతగా దీమాట వి శ్వేశునాన
నావుడు నొం డాడ నలికి భూనాథుఁ................................2820
‘డే వెంట నేదోష మెసఁగునో' యనుచుఁ
జింతింపు చున్నంత శిష్యులు గొలువ
సంతోషచిత్తుఁ డై చయ్యన వచ్చి
తన తేజ మెల్లెడఁ దనర వసిష్ఠు
డనుపమభక్తి భర్గాది దేవతలఁ
గని మొక్కి ప్రస్తుతిఁ గావించి యప్పు
డినకులాధీశుని నీక్షింప నృప్పుడు
మ్రొక్కి చేతులు మోడ్చి మునినాథ నీవు
మిక్కిలిక రుణ నామీఁదఁ గావించి
తొడిఁబడఁ బరుసంబుతో నిన్ము సోఁకి...........................2830
కడువడి మేల్మి బంగార మైనట్టు
లీతని నన్ను బరీక్షింపఁజేసి
ఖ్యాతి నొందించితి గాదె నీ విపుడు
ఘనతపోధనుఁ డై నగాధేయుతలఁపు
మనమున నెఱిఁగి సమతిఁ బ్రోవ నిందు
వచ్చితి గాన జీవము వచ్చె నాకు

............................................................................................................


మాఱటగ ద్దె= ప్రతియైన సింహాసనమండు, పరుసంబునిమ్మ సోఁకి ... బంగార రమైనట్లు= స్పర్శ సేదితో నినుముతగిలి మంచి బం గారయినవిధమున, ఇచట స్పర్శ వే

దికి విశ్వామిత్రుఁడును, ఇనుమునకు హరిశ్చంద్రుఁడును ఉప మేయములు ,
316

హరిశ్చంద్రోపాఖ్యానము

నచ్చుగా మితలం పానతీ వలయు”
ననిన హరిశ్చంద్రు నావసిష్ఠుండు
గనుఁగొని తన పెంపు గాన రాఁ బలికె
'జగతి నిక్ష్వాకువంశ జులసత్కీర్తి............................28411
మిగులంగ నీచేత మెఱుఁగు వాటిల్లె
నాపురోహితుఁ డని ననుఁ బెద్దఁ జేసి
నాపూన్కి చెల్లించినాఁడ వీ వనఘ
యిట్టిసత్యవ్రత మిట్టియాదార్య
మిట్టి తెంపును గాన మెవ్వరియందు
నెలమితోఁ గౌశికుం డేపని వని చె
నలవడఁ గావింపు మదియె నాతలఁపు'
నావుడుఁ దనగురునాథువాక్యములు
ద్రోవక గాధిపుత్రునిమాట సేయ
ననుమతించె న రేం ద్రుఁ డట శివ శక్ర......................2850
వనజాసనుల మునివరుల పంపునను
దివ్యగంధంబుల దివ్యమాల్యముల
దివ్యభూషణముల దివ్యాంబరములఁ
గులపతితోఁ గూడఁ గువల యేశ్వరుని
నెలమి నచ్చర లెల్ల నెమ్మి గై సేయ
నాసమయమునఁ బూర్వాద్రిశృంగాభ
భాసురం బగు చున్న భద్రపీఠమున
రమణీయ నుగు హేమరత్న కుంభముల

........................................................................................................

పూర్వాద్రి... భాసురము తూర్పు కొండశిఖరముతో సాటిగా ప్రకాశించు

చున్న ది, హేమము=బంగారు, అమరన దీజలంబు = గంగాజలము, బకము=కొంగ,

ద్వితీయ భాగము.

317

నమరనదీజలం బమరఁ దెప్పించి
శ్రీకరంబుగ నభి షేకంబు చేసి .................................2860
'శ్రీకంఠుకరుణావి శేషంబు వలన
ధరణీతలం బెల్లఁ దగ నేలు' మనుచుఁ
గర మొప్పఁ బట్టంబు గట్టి రావేళ
గమలాసనుం డాదిగా మునివరులు
నమర దీవించి మంత్రాక్షత లిడిరి
తిరముగా ఘోషించే దేవదుందుభులు
పొరిఁ బొరి వర్షించెఁ బుష్పవర్షములు
పాడిరి గంధర్వభామిను 'లెలమి
నాడిరి వేఁడుక నప్సరః స్త్రీలు
చల్లనై విభుమీఁదఁ జందనానిలము.............................2870
నుల్లంబు వికసింప నొయ్యన నెల సె
బర మేశుఁ డప్పు డాపార్టీ వేశ్వరునిఁ
బరఁగ దీవించి “నీపట్టణంబునకు
భూనుత వైభవంబున నేఁగు' మనుచుఁ
దానును సురలు నంతర్ధానమొంది

[32]*(గోరంత వసిష్టసంయమి గాధినుతుని పంతంబుమాటలు పచరించి 'మిగుల నొంచి నాతనయుల నూర్వుర నీవు ద్రుంచునప్పుడు నింత దుఃఖంబు లేదు యకట హరిశ్చంద్రు నతికష్టవృత్తి....................................2880.

............................................................................................................

.

318

హరిశ్చంద్రోపాఖ్యానము

సకలరాజ్యముఁ గొని చండాలుఁ జేసి
వికృతరూపంబు గావించిన నీవు
బకమవై యుండుము పాపాత్మ ' యనుచు
శాప మిచ్చుటయు విశ్వామిత్రుఁ డలిగి
యేపున 'నాఁడేలవే యగు' మనుచుఁ
బ్రతిశాప మిచ్చినఁ బరఁగ నక్షణమే
యతులు కొక్కెరయును నాఁడెలు నైరి
వెలయు దీర ము మూడు వేలయోజనము
లలర బదాఱువేల నిడివి గలుగు
కొక్కెరయును నతి ఘోరరూపమున............................2890
నొక్కట ద్వ్యధిక మౌయోజనోన్న తిని
నతి భీకరం బై నయాఁ డేలు నగుచు
ధృతి యొప్ప భాగీరథీ సమీపమున
బలమునఁ బో రెను బక్షి ద్వయంబు
చలమును బలమును శౌర్యంబు మెఱయఁ
జరణ తాడనతీవ్రచంచు ప్రహతుల
నురుపతు, విశేషణోగ్రతాపముల
శిరముల వరములఁ జిక్కని తొడలఁ
దొరఁగుర క్తంబులతో శరీరములు
నరుణవర్ణంబులై యతి భీక రముగఁ .............................2900

..............................................................................................................

ద్యధిక మౌయోజనోన్న తిని=మూఁడుయోజనముల పొడవు చేత, భాగీరథి=గంగ, చరణ... ప్రహతులన్ = కాళ్ల చేఁదన్ను టల చేతను వాఁడిముక్కులతోఁ బొడు చుటల చేతను, ఉరుపక్షు... తాపములవ్ = పెను ఒక్కలను విదుర్చుట చేతఁ గలి గినగొప్పసం తాపముల చేతను, పక్షపదాహతిన్= చెక్కలయు కాళ్లయు కొట్టు

.

ద్వితీయభాగము.

319

బొరిఁబొరి నుడుగక పోరంగా వారి
పక్షు పదాహతిఁ బరఁగంగ జలధు
లక్షీణగతుల నే కార్ల వంబైన
చందంబుఁ గైకొని జనపాలవరుఁడుఁ
జంద్రమతియుఁ దనుజన్ముని భయము
లందంద తేర్చుచు నాసమయమున
నెడఁ జొచ్చి వారింప నింతలోఁ గదియ్య
దడయక నాఁడే లుదగ్రతఁ గదిసి
బక ముకంఠముఁ బట్టి బలువుగఁ దెంప
బకము పక్షములచే బలువిడి మోద..............................2910
గిరులు వ్రేళ్లతో తలక్రిందు మీఁదయ్యెం
దరులతో మృగపక్ష్మి తతులు బిట్టెగ సెఁ
దెలి యా భూ దేవి ధృతి దప్పి దివికి
మొఱఁ బెట్టబోయెనో మురవెరి కనఁగ
సురలును నజుఁడు నచ్చోటికేతెంచి
యిరవుల యెడఁ జొచ్చి 'యిఁకఁ జాలు' ననుచుఁ
గృపతోడ వారిపక్షిత్వము మాన్పి
“యపగతకల్మషు లగుమిర లిట్టి
ఘోరసంగ్రామంబు క్రూరతఁ జేయఁ
గారణమేమి యీ కౌశికు వలన................................2920
నాహరిశ్చంద్రున కైనకీ డేమి

................................................................................................

టచేత, జలధులు= సముద్రములు, ఏకార్ణవం బై న = ఒక్కటే సముద్ర మైనట్టి, తనుజన్ముని = కుమారుని, అపగతకల్మషులు=పోయిన పాపముగలవారు - పాపము

లేనట్టివారు, సంగ్రామంబు = యుద్ధము, పురికొన్న సంభ్రమంబున - అతిశయించి
320

హరిశ్చంద్రోపాఖ్యానము

యూహించి కనుఁగొని యుడుగు గోపంబు'
ననుచు వసిష్ఠుని నజుఁడు ప్రార్థించి
మునుకొని వారి నిమ్ములఁ గౌఁగిలించి
కొనఁ జేసి శాంతిఁ గైకొలిపి వీడ్కొల్పి
చనియె వేల్పులుఁ దాను జలజసంభవుఁడు)
యంత నా వృత్తాంత మానారదుండు
వింతగాఁ జెప్పిన విని సత్యకీర్తి
యానందరసభరితాతుం డై యపుడు
భూనాయకుని రాక పురిఁ జాటఁ బనిచె.......................29 30
నావార్త వీనుల కమృత మై సోఁక
వావిరిఁ దమతమవాడవాడలను
బురిగొన్న సంభ్రమంబునఁ బౌరసతులు
పరువడి బహువిధభవనమాలికలఁ
దనరుముంగిళుల ముందరిహజారములఁ
గనుపట్టునగరుపంకంబునఁ బూసి
సిరిగందమున నోలిఁజిగు రొప్పుఁ జల్లి
సురుచిరకర్పూర సూత్రముల్ నిగుడఁ
బలుచని చాఁదునఁ బట్టెలు దీర్చి
ధళధళ మెఱయుచిత్త రువు వాయించి ........................2940
కరమొప్పఁ గమనిక స్తూరి నలికి
సరస మౌపన్నీట జలకముల్ సల్లి
యాలయంబుల నెల్ల నాణిముత్తెముల

............................................................................................................

నసంబరముతో, పౌరసతులు=పుర స్త్రీలు, భవనమాలికలు= ఇండ్లవరుసలు, సిరి

గంధము- శ్రీగంధము, రంగవల్లికలు=మ్రుగ్గులు, తావుమంజిష్ఠ పుట్టములు= చిక్క

321

ద్వితీయ భాగము.

లీలమై రంగవల్లిక లొప్పఁ దీర్చి
ప్రమద మారఁగ నెఱపట్టుపుట్టములు
గమనీయ మగు మేలుకట్లుఁ గట్టించి
రావు మంజిషి పుట్టములు తేరులను
ఠీవి మూగ సంఘటించి కుంభములఁ
జాలువారగా వన్నె చీరలు గట్టి
కలువడంబులు గట్టి కొంచనదండ ..............................2950
కలితిపతాకలు గ్రుడుగా నెత్తి
విలసిల్లఁగాఁ బురవీథి మార్గముల
స్ఫుర దురు కాంచనపూర్ణ కుంభములఁ
బరువడి నెత్తి పుష్పంబులు నెరపి
ప్రవిమలరత్న దర్పణతోరణములు
రవిదీప్తులకును మార్పడ నమకంచి
కర మిట్లు పురము శృంగారించి రంత
నరయుగ వివిధ వాద్యంబులు మోయఁ
దేరులఁ గరులను దేశాలి భటుల
శూరుల వీరులం జుట్టాలహితుల ..............................2960
దొరల సామంతుల దుర్గాధిపతుల
సరసుల సత్కవీశ్వరులఁ బాఠకుల
నందఱఁ దోడ్కొని యాసత్యకీర్తి

...............................................................................................

నాచుంచి యెనిఫువన్నె వలువలు, కాంచనదండక లితప తాకలు = బంగారుడం ములతో నొప్పుధ్వజములు, కందు గాన్= చట్టము గా, ప్రవిమలరత్న చర్చ 'రణములు = స్వచ్ఛమైన రత్నముల చేత రచింపఁబడిన యష్టములు గల వెలు ద్వారములు, రవిదీప్తులకును మార్పడ = సూర్యకిరణములకు ఎదురుపడువ

గా-తోరణములందలి రత్న దర్పణములు సూర్యకిరణము , లెదురుపడునట్లు
322

హరిశ్చంద్రోపాఖ్యానము

వందిమాగధజయధ్వను లుల్లసిల్ల
నెదురుగా నేఁగి యయ్యినకు లేశ్వరుని
పదపంకజములకు భ క్తితో మ్రొక్కి
యొనరఁ జేతులు మాడ్చి 'యో హరిశ్చంద్ర
దీనకరవంశప్రవీపక నీకుఁ
బ్రతి సేసి కొనియాడ రాజులు గలరె
సతతసత్యవ్రతాచార సంపదల.................................2970
దొడరి వసిష్ఠునితో రాయిడించి
తడయక తన ఘోరతపము పెంపునను
బడయ దుర్లభ మైన బ్రహ్మఋషిత్వ
మడరంగఁ గైకొని యఖిలలోకములు
బొగ డొందు కౌశికముని వెఱగంద
నెగడించి మించితి నీ సత్యమహిమ
వసుమతీవల్లభ వన్నె రెట్టించే
నెగడె నీకతమున నీవంశ మెల్ల
సన్ను తం బై ననీసామ్రాజ్య లక్ష్మి
బన్ను గాఁ గైకొని ప్రజలం బాలింప ...............................2980
విచ్చేయుఁ డిఁక ' నని విన్న వించుటయు
నచ్చుగా దరహాస మల్లన యొలయ
సమయోచిత ప్రియసంభాషణములు
గొమరార మంత్రిముఖ్యుని నాదరించి
సన్నుత కాంచనాచలమును బోలె

...........................................................................................

నిలిపి మిక్కిలి ధగధగ ప్రకాశించునట్లుగా నసుట, తేజీలు= గుఱ్ఱములు, ప్రతి సేసి=సాటి చెప్పి, రాయిడించి =మార్కొని-కలహించి, కాంచనాచలము = బంగా

2

నున్నతం బై మించునొకరథం బెక్కి
చతురంగబలము లసంఖ్యలు గొలువ
మితి లేనివాద్యముల్ మి న్నంది మ్రోయ
మానితమాగధమధురగానములు
వీనుల కింపుగా విలసిల్లి పొలయఁ2990
దలకొని వందిబృందములు నుతింపఁ
జెలఁగి పుణ్యాంగనల్ సేసలు చల్ల
వెన్నెల వెదచల్లువింజామరములఁ
బన్నుగా డగ్గఱి భామలు వీవ
వాలారుఁగన్నులవారకామినులు
లీల మైఁ బసిఁడిపళ్లెరములలోన
గమనీయమణిదీపకళికలు మెఱయ
నమరించి మెయిదీఁగె లల్లన సొలయ
ఘనకుచంబులు నిక్కఁ గరములరుచులు
గనుపట్ట దరహాసకాంతులు నిగుడ3000
గలికిచూపుల మించుగములు రాణింప
నిలిచి నివాళింప నిండారువేడ్కఁ
బురముఁ బ్రవేశించి భూప్రజ లెల్ల
బరువడి జయ పెట్టఁ బార్థివేశ్వరుఁడు
వసుమతి నిజరాజ్యవైభవలీల
యెసగంగఁ జిరకాల మేలుచు నుండె
ననుచు మార్కండేయుఁ డాధర్మజునకుఁ

.......................................................................................................

కొండ, మణి దీపకళిక లు= మొగ్గ లవంటి రత్న దీపములు, దరహాసకాంతులు = .

రునవ్వు మెఱుఁగులు, మించుగములు= మెజపుల సమూహములు, భ్రమరా
324

హరిశ్చంద్రోపాఖ్యానము

బెనుపొంద మున్ను సెప్పిన మార్గమునను
సత్యసంధుఁడు హరిశ్చంద్రునిచరిత
నిత్యసత్కీర్తులు నెగడ రచించె3010
భ్రమరాప్రసాదసంప్రాప్తకవిత్వ
సుమహితసామ్రాజ్యసుఖపరాయణుఁడు[33]
చతురసామాన్యలక్షణచక్రవర్తి
ప్రతివాదిమదగజపంచాననుండు[34]
మతిమంతుఁ డయ్యలమంత్రిపుంగవుని
సుతుఁడు గౌరనమంత్రి సుకవిశేఖరుఁడు
కవు లెన్న నుత్తరకథ రచియించె
నెవరు పఠించిన నెవ్వరు విన్న
జనులకుఁ బుణ్యముల్ సమకూడు సిరులు
మునుముగా నాయుష్యములు గొన సాగుఁ
దాముఁ బుత్రులు నన్నదమ్ములు సఖులు
దామరతంపరై ధరణిఁ బెక్కేండ్లు
వేమాఱు నోములు వెలయఁ బెండ్లిండ్లు.
సేమ మేర్పడ నెందుఁ జేయుచుండుదురు.

హరిశ్చంద్రోపాఖ్యానము

సమాప్తము

  1. ముయ్యేఱునేల ='త్రిస్రోతాః' అన్నట్లుమూఁడు ప్రవాహములుగా గంగానది ప్రవహించు స్థలము
  2. మహాజనులు = గొప్పవారు - పుణ్యాతులనుట
  3. ఒనరంగన్ = ఒప్పునట్లుగా
  4. ఒడయుఁడు = ఏలిక - ప్రభువు
  5. ఇందుకళాధరుఁడు= శివుఁడు
  6. త్రాత = రక్షకుఁడు
  7. అగలక = వెనుదీయక
  8. తెగ = విధము
  9. అంసము=మూఁపు
  10. అరుణఅరవిందంబులు = ఎఱ్ఱదామరలు
  11. దరుల =గట్టులందు
  12. వనదంతావళములు=అడవియేనుఁగులయొక్క
  13. ఉరుతరతుండములు = మిక్కిలి గొప్పవైన తొండములు
  14. ఊరులు గాగన్ = తొడలు కాఁగా
  15. సరససైకతసీమ = ఒప్పిద మైనయిసుకదిబ్బపట్టు
  16. జఘనము=కటి
  17. సురుచిర = అంద మైన
  18. మేటి=గొప్ప
  19. చిఱుతరఁగలు=చిన్నయలలు
  20. వళుల్ = కడుపుమీఁదిముడుతలును
  21. నునుఁదీఁగనాచు=నిద్ద మైనపాఁచితీగ
  22. లేనూఁగారు= లేఁతయైననూఁగారు
  23. చెలువంపుబిసములు= అందమైన తామరతూండ్లు
  24. వెలిదమ్మి= తెల్లదామర
  25. కలికిబేడిసలు= ప్రకాశించుచున్నబేడిసచేఁపలు
  26. వాల్గన్నులు = నిడుద లైనకన్నులు
  27. నెలకొన్నజలవేణి = నిశ్చలముగా నున్న నీటివెల్లువ
  28. నెఱివేణి గాఁగ = నిండారుజడ గాగా
  29. ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతులఁ గానరాదు. కనుకఁ బ్రక్షి ప్తము
    గానోపు. ఇది లేక యేయున్నఁ గథాప్రణాళిక మిక్కిలి యొప్పిదముగా నుండును.
  30. ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతులం గనుపట్టదుగాన ప్రక్షిప్తము.
  31. ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతుల లేదు
    • ఈకుండలీకరణములోనిది పెక్కు ప్రతులం గానరాదు. మఱియునిందు లక్షణ
    దోషములును దక్కిన భాగమున లేనివి గనుపట్టుచున్నవిగాన యిది ప్రక్షీప్తమే
  32. ...పరాయణుడు = భ్రమరాంబికయొక్క యనుగ్రహము వలనఁ గలిగినకవిత్వమనెడి మిక్కిలి గొప్పసామ్రాజ్యమునందలి సుఖము నందు నిష్ఠుఁడైనవాఁడు
  33. ప్రతివాదిమదగజపంచాననుండు = ప్రతివాదులనెడి మదపుటేనుఁగులకు సింగ మైనవాడు.