హరివంశము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
పదునాల్గవశతాబ్ది ప్రారంభమున నాంధ్రసామాజ్యలక్ష్మీధురంధరుఁడగు నోరుగంటి ప్రతాపరుద్రుఁడు ఢిల్లీ చక్రవర్తిచే నోడించబడి చెఱపెట్టబడినవా డగుటచే, నంతకుఁ బూర్వము రెండు శతాబ్దములనుండి శత్రుభయంకరులై మహాధీమంతులై పరిపాలనాదక్షులగు మహావీరులకు జన్మస్థాన మైనట్టియు, విద్యానాథాదిగీర్వాణమహాకవులకును, పాల్కురికి సోమనాథ, మారన, మంచన, తిపురాంతకాది ఆంధ్రమహాకవులను రుద్రభట్ట, హరీశ్వర రాఘవాది కర్ణాటక కవీశ్వరులకును నాశ్రయభూతులైన భాషాపోషకుల కునికిపట్టయినట్టియు, కాకతీయసామ్రాజ్యము భగ్నము కావలసి వచ్చెను. అప్పుడు ప్రతాపరుద్రునిచే నాయామండలాధికారులుగ నియమింపఁబడిన నాయకులు తమస్వాతంత్ర్యమును బ్రకటించుటచే నాంధ్రదేశమున ననేకరాజ్యములు బయలుదేరినవి. అందు ప్రథమమున నాచన సోమనాథాది మహాకవుల కాశ్రయమైనట్టియు, బిదపఁ బదునాఱవశతాబ్దమున నష్టదిగ్గజములని ప్రసిద్ధి గాంచిన మహాకవులకుం బోషకుఁడై ప్రబంధయుగమునకు మూలమై విద్వద్రాజశిఖామణియగు కృష్ణదేవరాయని వలన దిగంతవిశ్రాంతకీర్తిం బడసినట్టిదియు నగు కర్ణాటరాజ్యము మొదటిది. నెల్లూరు మొదలుకుని సింహాచలము వఱకును గల భూమి నాక్రమించుకొని ప్రథమమున నద్దంకియుఁ బిదపఁ గొండవీడును రాజధానులుగ నూఱేండ్ల వఱ కును బరిపాలించి యెఱ్ఱాప్రగ్గడ, శ్రీనాథాది మహాకవిపోషకులై జగద్విఖ్యాతయశస్కులగు రెడ్లరాజ్యము రెండవది. ఈ రెడ్లవంశమున జనించిన దేపటివేముఁడు లేక ప్రోలయవేమారెడ్డి యను నాతఁడు స్వదేశాభిమానమును స్వమతాభిమానమును గలవాఁడగుటచే నాంధ్రదేశమునకుఁ దురుష్కుల వలనఁ గలిగిన బాధలను దొలఁగించి వైదికమతము నుద్ధరింప నెంచినవాఁడై "తనకు నద్దంకి తగురాజధానిగాఁ బరాక్రమంబున బహుభూము లాక్రమించి" రెడ్లరాజ్యమును స్థాపించెను. ఈతఁడు క్రీస్తుశకము 1324వ సంవత్సరము మొదలు 1350 వఱకును రాజ్యపాలనముఁ జేసియుండెనని శాసనముల వలనఁ దెలియుచున్నది. ఈఁతడు మిగుల విద్యాపోషకుండును, ఆర్యమతధర్మములయం దత్యాదరము కలవాడునునై యనేకాగ్రహారదానాదిసత్కార్యముల నొనరించుచు "నన్వయైకపావనుఁడై వెలుఁగొందెను". సకలకళాకోవిదులగు నుభయభాషాకవులచే నిండియుండు నీతని యాస్థానముననే యెఱ్ఱాప్రగడయు నాస్థానకవిగా యుండుటంజేసి యాతనికాలము పదునాలవశతాబ్ది మధ్యభాగంబని మనము నిశ్చయింపవచ్చును.
| "దురితహరు ప్రబంధపరమేశ్వరునిఁ జెద | |
యని విప్రనారాయణచరిత్రమును రచించిన మల్లనకవి చెప్పియుండుటచే ఎఱ్ఱాప్రగ్గడ యింటిపేరు చెదల్వాడవా రని మనకుఁ దెలియవచ్చుచున్నది. ఇతఁ డార్వేలనియో పుట:హరివంశము.pdf/6 పుట:హరివంశము.pdf/7 పుట:హరివంశము.pdf/8 పుట:హరివంశము.pdf/9 పుట:హరివంశము.pdf/10 పుట:హరివంశము.pdf/11 పుట:హరివంశము.pdf/12 పుట:హరివంశము.pdf/13 పుట:హరివంశము.pdf/14 పుట:హరివంశము.pdf/15 పుట:హరివంశము.pdf/16