సౌగంధికప్రసవాపహరణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తృతీయాశ్వాసముఅవధరింపుము వసుధాధీశచంద్ర
యవలి కథాక్రమం బది వివరింతు
ధనపతి వచ్చునుద్దండంబుఁ గాంచి
మనమున నులికి ధర్మతనూభవుండు
మొన నిల్చి యున్న తమ్ముని ముఖాంబుజంబుఁ 5
గనుఁగొని నియమొందఁగా నిట్లు పలికె

ధర్మరాజు సంధిసేయ బూనుట


బాలునితోఁ జేయు బవరంబునకు
చాలు చాలై యుండే సమసె సైన్యములు
పడిరి యోధులు తగ్గె బలము గుఱ్ఱములు
బెడిదంపుబలములు బెంచి యేతెంచె 10
శ్రీదుఁ డాతని నాజిఁ జెనకి జయింపఁ
గాఁ దీర దెంతటి ఘనులకు నైన
పరికింపుము ధనాధిపతిసేనలోన
బిరుదధ్వజంబులు బెక్కింటి నవియు
వారెల్ల నెరయోధపర్యులు గారె!15
పో రేలసంధియై పొసఁగుట లెస్స
నావిని శమననందనుని వీక్షించి

గాండీవి దానికొడఁబడకుండుట


దేవేంద్రపుత్రుండు ధృతిమీరఁ బలికె
ముందుగా కయ్యంబు మొనసేయకున్నఁ
బొందు సంధి యొనర్పఁ బొసఁగుఁ గా కిపుడు 20
అదియేల దీరు మీ యాత్మలో నింత
బెదరేల ననుఁజూడు పృధ్వీతలేంద్ర!
అరమర లొకయింత యైనను లేక
కురుపాండవులు జతగూడయుండగను
నొరసి కయ్య మొనర్ప నుగ్రునికైనఁ25
దరమె నాభుజశక్తి ధననాథుకడిమి
కను మని శత్రులు గడగడవణక
తనరేడి దేవదత్తంబుఁ బూరించి
వల కేల విలు గుణధ్వనిజేసి యార్చి
కలనికి బలములు గవియించుటయును30గిరగిర గిరగిర గిరగిర దిరిగె;
పటుతరబ్రహ్మాండభాండజాలములు1705
పటపట పటపట పటపటఁ బగిలె ;
తనరారుచున్న పద్నాల్గులోకములు
ఘనభయంబుల హల్లకల్లోలమయ్యె,
పొలుపొందునట్టి యంభోనిధానములు
పెలుచ నీరము లింకి బీటలు వారె!1710
కుతలంబుతో సప్తకులపర్వతములు
గతితప్పి బలుక్రుంగి కానరావయ్యె
ప్రకటించి చీకాకుబడె ఫణిరాజు;
కకలిక లగుచు దిగ్గజములు బెగడె,
సురసమూహంబెల్ల చూడ్కులు మాని 1715
వరువడి వడి పటాపంచగా నేఁగె;
ఆవేళ తల్లడమంది పద్మజుఁడు

బ్రహ్మదేవుఁడు హరిహరులకడ కేతెంచుట వారల
                 స్తుతించుట

వావిరి దగదొట్టిపడి దొట్రుకొనుచుఁ
గ్రక్కున హంసతురంగరాజంబు
రావణకుంభకర్ణాది ప్రముఖులను
ఠీవి నెదిర్చి ఖండించినవారు
అంతటి బలసాహసాంకు లీధరణి
కాంతులు వీరితో కలహించి యెదిరి
చెలరేగి యనిసేయఁ జెల్ల దటన్న
నలకూబరుఁడు యక్షనాథున కనియె
అయ్య! యీపని యెంత యీబల మెంత!
వెయ్యారువిధముల విమతులఁ బొగడఁ

మణిమంతుఁ డొప్పకుండుటదగవౌనె! కాంచనోదరు డుండగాను.
మగటిమిఁ గలమణిమంతుఁ డుండఁగను
వార్త కెక్కిన హరిధ్వజుఁ గుండఁగను
గీర్తిఁ గాంచిన మణిగ్రీవుఁ డుండఁగను
వీరల కెనయైనవీరులు లెక్క
మీరి యుద్ధము సేయ మీ చెంతనుండ
జెరలు గొట్టుచు సర్వసేన లుండఁగను
దరలక ననుకంటితనయుఁ డుండఁగనుఆవలివారు కయ్యమె కోరుచుండ
నీవేళ కమలంబు లిచ్చుట గొదువ
దీనత్వ మొంది ప్రార్ధించివేడినను65
బూనికౌగిటఁజేర్చి పొం దొనరించి
నలువొందకమలముల్ నవనిధానములు
నలకాపురంబైన నర్పింపవచ్చు.
నేపున గర్వించి యెదిరించినపుడు
నీపాదములయాన నేతృణ మియ్య70
ననిన సందఱు యోధు లటువలెఁబలికి
కనలుచుఁ గదలి శంఖములు పూరించి
దారుణసింహనాదములు బర్వించి
పోరికి సేనలు బురికొల్పుటయును
వారి వీరికి నింత వర్ణింపరాని75
హోరాహవం బయ్యెఁ గురకులాధీశ!

'

ఉభయపక్షములకును సంకులసమరమగుట.మదకరు ల్మదకరు ల్మార్కొనుకరణి
పొదలి పులుల్ పులు ల్బోరుచందమునఁ
గలఁగక తొలగక గండభేరుండ
ములు గండ భేరుండములు దూరులీల
శరభముల్ శరభముల్ సమరంబు సల్పు
సరణి హరుల్ హరుల్ సరిబోరుమాడ్కి
ధరణీధరంబులు ధరణీధరములు
తలకక నెదురేగి తార్కొనునటుల
పొడుచుట నరుకుట పొదలి మోదుటయుఁ
దొడఁబడి నాటుట తునియుట బెట్టు
దాకుటల్ దెలియక దర్పంబు మెరసి
యాకాంక్షలనుబోరె నఖిలసైన్యములు,
అసమయంబున నలుక రెట్టించి
వాసవి విలుగుణధ్వని చేసి నిగుడి
యరుదైన కిన్నరయక్షదైతేయ
గరుడగంధర్వుల ఘనయోధవరుల
కలిమి వీక్షించి యేకడలఁ జూచినను
వెలయు మోపులుగట్టి వేయుచందమున
నంచితదివ్యశరావళి ముంచి
మించి యేసినఁగూలె మేటియేనుఁగులు
రథములు బొడియయ్యె రధికులు మడిసి
రథికులు సమసిరి హయములు మ్రగ్గె
కొద్దిమీరిన గొడుగులు కేతనములు
గద్ద లాడిన లీల గగనంబు నిండె 100
మెండైన యెలగోలు మేదిని యణఁగె
దండిబారులు గ్రుంగె దర్ఫముల్ దొలఁగె
బలియురపై దూరి ఫల్గుణుం డపుడు
వలనొప్ప శరలాఘవ స్ఫూర్తి మెరసి
కరములు నొక ప్రోవు కాళ్ళొకప్రోవు105
శిరములు నొకప్రోవు చెవు లొక్కప్రోవు
కండలు నొక ప్రోవు కనులొక్కప్రోవు
గుండెలు నొక ప్రోవు క్రొవ్వొక ప్రోవు
మెండుగా నిండార మెదడొకప్రోవు
తుండంబు లొక ప్రోవు తోడ లొక ప్రోవు 110
ఒక ప్రోవు శల్యము లోక ప్రోవు ప్రేవు
లోకప్రోవు చర్మంబు లోక ప్రోవు నరము
లొకప్రోవు కేశంబు లోకప్రోవు నాస
లకలంకగతి పర్వతాకారములుగఁగటికవాఁడును వోలి గాండీవధన్వి
కటికపోగులు వైచె ఘనభీకరముగ
నలిగి యంతటఁ బోక నాసవ్యసాచి
చెలఁగి యక్షబలంబుఁ జెదరించి నరికి
యొండొండ ఖండించి యోజలు గోసి
నిండారు నెరపిన నీటువాటిల్ల
తలకొని చిర్లాడి తప్పిపోనీక
నలినలిగాఁగ సైన్యముల ఛేదించి
ఘనరథంబులు మహాగ్రావము ల్గాఁగఁ
దనర కేతనములు తరువులు గాఁగ
ధనురాదులు లతావితానముల్‌గాఁగఁ
దనువులు భీకరస్థాణువుల్ గాఁగఁ
నేనుఁగుల్ గండశైలేంద్రముల్‌గాఁగఁ
నానాయుధంబులు నాగముల్‌గాఁగఁ
దురఁగముల్ హరిణసందోహమల్ గాఁగ
వరనూత్న బహుచిత్ర వర్ణవస్త్రములు
పొలుపొందఁబూచిన పొదరిండ్లు గాఁగ
సలలిత బహురత్న చయభూషణములుచటుల జాజ్వల్య పాషాణముల్ గాఁగఁ
బటుభేరిరథనేమి బలఘోషణములు
ఖగమృగారావసంకరములుగాఁగఁ 135
దగి యెప్పు ధననాథు దళమహాటవులఁ
చలపడి తనబాణదావాగ్ని చేతఁ
జలమున ముంచి భస్మంబుఁ గావించె
వెస నార్చి ధనదని వెన్నంటనేసి
మసలక నేనూట మణిమంతు నొంచి140
యెలమి మణిగ్రీవు నిన్నూట జడిపి
నలకూబరుని మాట నాటంగ నేసి
వరబలో ద్దండదుర్వార ప్రచండ
నిరుపమపాండిత్యనిజభుజాదండ
సారుఁడై తగు సవ్యసాచి నీక్షించి145
ధీరతో ధనాధీశుఁ డిట్లనియె

కుబేరార్జునుల సంవాదము


నరుఁడ వటంచు నెంతయు నిన్ను నేను
పరువ సేయకయున్న పైకొనివచ్చెశరలాఘవ స్ఫూర్తి సాహస ప్రతిభ
సరిసన్నవాడ వఝ్ఝారె మాయన్న
మెచ్చితి నిను మేలు మేలు కిరీటి
పొచ్చంబుగా దొకబుద్ధి చెప్పెదను
కచ్చుకపడి యీడుగాని కయ్యంబు
విచ్చలవిడినేయ వెర్రితనంబు
మచ్చరంబున నన్ను మార్కొనవలదు
తచ్చనల్ సాగు విత్తరిని వేవేగ
వచ్చినయట్టి మీవారును నీవు
విచ్చేయుఁ డనిన నవ్విజయుఁ డిట్లనియె
ఓరాజరాజ! నాదొక విన్నపంబు
వేరె చిత్తములేక వినుఁడు తెల్పెదను
నీరకర్మమునకు వెరచువారలకు
మీరు చెప్పినబుద్ధి మిక్కిలి నిజము
సమధికభీకరసమరరంగముల
మిమువంటి ఘనులతో మెలఁగెడివాఁడ
నిలవేళనాకు నింతింతయు నొకటి
యిలదొడ్డ కొంచెమే నెన్నఁడుఁ జూడ


వచ్చిన యట్టి మావారిలో నొకరు
మెచ్చరు నీ వెట్లు మెచ్చెదు నన్ను ?170
కూరిమి ధర్మజుకొలువులో నున్న
వారిలో నెలగోలువాడను నేను
ఘనయోధవర్యులు గదియకమున్న
కనుగల్గి యొకబుద్ధి గనియు వేవేగ
పరిణామమున నీవు పట్ణంబు జేరు
తరువాత మేము మాస్థలము జేరుదుము
నరులను గెల్చె కిన్నరనాథుఁ డనిన 175
సురదానవుల కిది చోద్యంబుగాదు
నరులు గుబేరు నెంతయుఁ గెల్చి రనిన
సరకుసేయరు నిన్ను సకలలోకముల
మాకుఁ జెప్పినయట్టి మహనీయబుద్ధి
నీకింతయును లేదు నేను నేమందు'180
నని వారిమొనలుగా నాడినయట్టి
ఘనుని కుబేరుండు గనుగొని పలికె
అర్జున నీపల్కు, లవి యథార్గంములు
వర్జింపఁదగినవి వర్జింపవలయునల్పసాంగత్యంబు నల్పయుద్ధంబు
నల్పమానవసేవ సల్పాయుధంబుఁ
గ్రొవ్వునఁ జేసినఁ గోదువలౌ నిజము
కవ్వడి విను కొంచెగాఁడవా నీవు
ధరణిపై దివ్యకోదండ పాండిత్య
శరకౌశలరణోగ్రసాహసం డనుచు
కాలకేయనివాతకవచాది దైత్య
జాలభిద్వలమహోత్సాహివీవనుచు
వాతాత్మజునితోడ వాదుకై యంప
నేతువు కట్టి గెల్చిన ధీరుఁ డనుచు
వరఖాండవవనంబు వహ్నికి నచ్చి
సురరాజుదరిమిన శూరుఁడవంచు
హెచ్చుగా శంకరు నెదిరి పోరాడి
మెచ్చులు గైకొన్న మేటి యటంచు
నారదుచే మున్ను నానావిధముల
నారూఢిగా విని యధిప నీతోడ
నని సేయఁ దలంచి నే నరిగితి నిటకు
వినుట నిశ్చయము గావింపగా నిపుడుకనుగొంటి నీపరాక్రమకౌశలంబు
ఘనయోధవరులలో ఘనుడవు నీవు
నే నిను గెల్చిన నెగడు నాకీర్తి 205
నే నీకు నోడిన నే కొద్ది గాదు.
వనధిలంఘించి రావణు పురి గాల్చి
చనుదెంచు కపికులచంద్రునికంటె
నగముల గూల్చి దానవుల ఖండించి
జగముల నుతిగాంచు జంభారికంటె 210
అంగజు హరియించి యజుతల ద్రుంచు
గంగాధరునికంటె ఘనుఁడనే నేను!
కేవున వారల గెలుచు నీలావు
చూపుము నాబల్మి చూతువుగాని
అని పల్కి క్రోధించి యాగ్నేయశరము 215

కుబేరార్జునుల యుద్ధముఘనమంత్రయుతముగా గాండీవిమీఁదఁ
బనిపిన పటపటఁ బగిలె నంబరము
ధరణి వణంకె దిగ్దంతులు మ్రొగ్గె
బెదరె శేషుఁడు గిరుల్ పృధ్విలో గ్రుంగె
నది మహాప్రళయమార్తాండప్రకాశ
మండితం బగుచు శుంభత్ప్రౌఢి నిగుడె
గాండీవధన్విదాఁగని విజృంభించి
ధారుణీతలము దిక్తటము లల్లాడ
వారణాస్త్రము బూని వైచె వైచుటయు
నది మహావిలయకాలాంతకాభీల
విదితగదాదండ విలసితం బగుచుఁ
జనుదెంచి రవికోటిసన్నిభమైన
యనలఘోరాశుగం బవలీల దునిమె
ఆమరేంద్ర సుతుఁడు యక్షాధిశుమీఁద
సముదగ్రతరవాయుసాయకం బేసె,

ఉభయపక్షముల పోరాడుటనలకాధిపతిమీఁద నలిని గాంగేయుఁ
డలఘుమహోగ్రనాగాశుగం బేసె
నిరవొందగాఁ గిన్నరేంద్రునిమీఁదఁ
బరువడి ద్రోణుడు బ్రహ్మాస్త్ర మేసెనరవాహనునిమీఁద నాగ కేతనుఁడు235
కరమర్థి జలధరకాండంబుఁ జొనిపెఁ
గూర్చి కుబేరుపైఁ గురునందనుండు
నార్చుచుఁ గినిసి రౌద్రాశుగం బేసె
కర్ణుండు శ్రీదుపైఁ గవిసి దేవతలు
వర్ణింపఁ బావకోజ్వలబాణమేసె 240
మరియు దక్కిన యోధమండలావళులు
గురియించి రాశుగఘోరవర్షములు
సగగున నాదివ్యశరపరంపరలు
గరికరి నొరిసి లోకములు బెగ్గిల్లఁ
బ్రళయ భైరవమహాపటహనిర్ఘోష 245
కలితభూతేశ ఢక్కా, ఢమత్కార
శతకోటి శతకోటి సంకులాఘోష
తతహవ్యవహభీమ ధామంబు నగుచుఁ
దనరుచు భూనభోంతరములు నిండి
చనుదెంచు నాదివ్యశరములు గాంచి 250
నాగాశుగముచేత నలకూబరుండు
బాగుమీరిన వాయుబాణంబు దునిమెకడు మణిగ్రీవుండు గరుడాంబకమున
పొడిపొడిగా, నేసే భోగిశరంబు
మణిమంతుఁ డొగి బ్రహ్మమార్గణంబునను 255
గణుతింపఁ గమలజకాండంబు నేసె
అనిలాంబకము బూని యల జయంధరుఁడు
కనలి మేఘశరంబు ఖండించివైచె
వరుణసాయకమున వహ్నిబాణంబు
పరియలు గావించె భానుకేతనుఁడు 260
ధనదుఁడు పొంగి మార్తాండబాణమునఁ
దనరారఁ గూల్చె రౌద్రశిలీముఖంబు
రహిమీర తక్కిన రసిక శేఖరులు
మహిగూలి రత్యంత మహితశస్త్రముల
అరిమురి గెరలి జయంధరుం డపుడు 265
సురనదీతనయుని జూచి క్రోధించి
ఘనదివ్యశరవృష్టి గప్పి నొప్పించి
జననుతతాళధ్వజంబు ఖండించి.
యతఁ డేయుశరముల నన్నింటి దునివి
యతులితం బైనట్టి యరదంబు గూల్చి 270విలుగుణధ్వని చేసి వెస నార్చుటయును;
గలఁగకఁ దొలఁగకఁ గాంగేయుఁ డపుడు
మరియొకరథ మెక్కి మార్గణవృష్టి
గురియించి మణిమంతుఁ గూర్మినందనుని
తనువెల్ల నించినఁ దర్పంబు 'మెరసి 275
కనలి జయంధరగంధర్వవిభుఁడు
కడువడి భీష్ముని కవచ మింతింతఁ
బొడిపొడిచేసినఁ బొంగి గాంగేయుఁ
డెనసిన కినుక నర్ధేందుబాణముసఁ
గనకకిరీటంబు ఖండించుటయును 280
చిత్రాంగదుండు విచిత్ర కేతనుఁడు
'థాత్రి వ్రీలఁగ నార్చి దర్పముల్" మెరసి
యవలీల గాంగేయు నరదంబుఁ గూల్చి
వివిధసాయకముల విలు ద్రుంచి వైచి
సారథి హరులను సముయించి ఘోర 285
నారాచముల మేను నాట నేయుటయుఁ
దమకించి యొండు రథంబుపై నెక్కియమరనదీసూనుఁ డర్థచంద్రాంశు
గములచే నిరువురి కంఠముల్ ద్రుంచి
రమణ జయంధరు రథముపై కురికి 290
కరవాల మంకించఁ గని మణిగ్రీవుఁ
డురవడి నెడసొచ్చి యొక్క భల్లమున
వాలు చూర్ణము చేసి వరదివ్యబాణ
జాలంబులను మేను జల్లైడగండ్లు
చేసిన వీక్షించి చెలఁగి కర్ణుండు 295
భాసిలుఘనదివ్యబాణత్రయమున
గెరలి యేసిన మణిగ్రీవుండు మూర్ఛ
నొరగిన సారథి యొక్కింత డవ్వు
దొలఁగింప సూతపుత్రుండు పోనీక
బలువడి వెన్నంటి పరతెంచుటయును 300
కంచురథంబుల గంధర్వపతులు
కొంచింప కరువది కోట్లుమార్కొనియె
తమకించి యుక్కు రథంబుల యక్ష
రమణు వెంబడి కోట్లు రాధేయు గ్రమ్మె
పాటించి కిన్నర ప్రభులు ముమ్నారు 305కోటులు కర్ణుఁ దార్కొని పోరి రపుడు
అందరిమీఁద యయ్యధికుఁ డంభోధి
మందరనగము డా మధియించు లీల
పరుపడి బహుదివ్య బాణజాలముల
నరదంబులను గూల్చి యధికుల దునిమి 310
తురగంబుల వధించి దొరల మర్దించి
కరకరి సూతుల గళముల చిదిమి
ప్రళయకాలమునాటి భానుని సరణి
కలయించి యలయించి గగ్గోలుపఱచి
పరువులు బారించి భయము పుట్టించి 315
గరిమతో విజయశంఖంబుఁ బూరించె
నటమున్న చయ్యన నరదంబు నెక్కి
పటురోషమున భీష్మపార్థివేంద్రుండు
నలుదిక్కులు గలంగ నారి మ్రోయించి
పాలుపొంది మణిమంతుపుత్త్రునిమీఁదఁ 320
జలమునఁ నొకయర్ధచంద్రబాణంబు
కలితమంత్ర యుతమ్ముగా నే యుటయును
యక్షాధినాయకుఁడావిధమంతవీక్షించి పావక విశిఖంబుఁ బూని
యదలించి యేసిన నమరేంద్ర సుతుఁడు 335
ముదమున వరుణాస్త్రమున ద్రుంచుటయును
నలకూబరుం డైంద్రనారాచమునను
నులుకుచు నభిమంత్ర యుతముగా నేయ
సొలవక నప్పు డాసూతపుత్రుండు
చెలువుమీరఁగ శక్తిచే నది గూల్ప 330
నంతలో నర్ధచంద్రాశుగం బరిగి
నెంతయు నా కిన్నరేంద్రుండు బెగడ
ధరణీపై వెస జయంధరుని మస్తకము
గురుఘోషణములతో గూల్చెఁ గూల్చుటయు
భండనంబున తనపట్టికూలుటయు 335
మెండుగాఁ గన్నుల మిణుగుర్లు దుముక
సురనదీసూనునిఁ జూచి రోషించి
యరుదుగా మణిమంతు డరదంబు ద్రొప్పి
రణభయోదగ్రనారాయణాస్త్రంబుఁ
గణుతింపమంత్రయుక్తంబుగా నేసె 340
ఆది వెస బ్రహ్మాండ మాక్రమింపుచును


నుదుటున జనుదేరఁ నొయ్యనఁ గాంచి
వలనొప్ప భీషుండు వైష్ణవాస్త్రమున
నిలిపె నా బాణంబు నిమిషమాత్రమున
అప్పుడు మణిమంతు డమ్మహాశరము 345
తప్పిపోవుటఁ గాంఛి ధైర్యంబు మించి
కులిశనారాచంబు క్రోధించి యేయ
సొలవక సురనదీసుతుఁ డేపుమీరి
యవలీల నైంద్రసాయకమునఁ దునిమె
కనిసిపోనీయక గంధర్వవిభుఁడు 350
సర్వాంగముల నించెఁ జటుల బాణముల
నుర్వీతలాధీశుఁ డోడక నిలిచె
నతులితఘోరశస్త్రాస్త్రజాలముల
ధృతి నించె మణిమంతు దేహ మంతయును
కలఁగక తొలఁగక గవిసి యిర్వురును 355
నిలు! నిలు! గాంగేయ! నిలు నిలు మనుచు
మలయుచు నన్యోన్యమాత్సర్యములను
తలపడి పోర ర క్తంబులు దుముక
సలలితమాణిక్యశైలంబు లనఁగఁ 360బొలుపొందఁ బూచిన మోదుగు లనఁగ
బలువైన కాలవిపర్యాసములను
తరకొని యుభయసంథ్యా రాగములను
సరిపడి సమరంబు సలిపి రాఘనులు
అక్కడ రాధేయుఁ డాహవస్థలము
గ్రక్కున శోధించి కదిపి వెన్నంటి

 

కర్ణుని బలపరాక్రమములుకేక వేయుచు మణిగ్రీవునిరథము
పైకిని లంఘించి పౌలస్త్యుఁ గాంచి
యక్కటా! యిటువంటి యతిరథోత్తముని
చిక్కించి చూడంగఁ జెల్లునే మీకు!
చీడిముడి పులినోటఁ జిక్కిన వేగ
విడిపించుకొనునట్టి వీరులు లేరె!
తొట్టున వగగొర్ల దొడ్డి సొచ్చినను
బట్ట నియ్యరుబంటు పంతంబు మెరసి
యెన్నెన్ని పలికిన నేవ లే దింత
"నెన్నాళ్ల పగ యుండె నీతనిమీఁదఁజత్తురు నొత్తురు సరియౌదు రింత
నిత్తెరంగున నుండ నే నెందుఁ జూడ
నట మున్నె కమలంబు లర్పింతురేని
యిటువంటి యాపద లేటికి వచ్చు.380
గరుణతో నికనైనఁ గాఁచెద వేగ
సరసిజాతములఁ బాంచాలి కొసంగి
కౌరవేంద్రున కలకాపురం బిచ్చి
వీరధర్మము మాసి విపినభూములకుఁ
జనుఁ డని పలుక రోషంబు రెట్టించి 385
ధననాథసుతుఁడు రాధాపుత్రుఁ దాఁకి
యిరవంద గద బూని యినతనూభవుని
కరమందు వెలుగొందుఖడ్గంబు దునిమి
విరథుఁడవై యుండి వీరవాక్యములు
తరముగా దిది నీకు తరలుము కర్ణ!390
యరదంబుపై నెక్కి యస్త్రముల్ పూని
బిరుదువాక్యము లాడి బెదరింతు మమ్ము
చెడుగ! నిన్నీ వేళఁ జేఁగాచినాడఁ
జెడిపోవ వలదు నీ సేనది క్కరుగు


అధికుఁడ వైన జయ్యన నేగి యొక్క
రథమెక్కి రమ్ము దురమ్ము సల్పుటకు
ప్రాణంబుపై నీకు భ్రమ కల్గెనేని
మాను మీమాటలు మరలిపొ మ్మనిన;
నరిగి రథం బెక్కి నలఘుకోదండ
ధరుఁడై కుబేరనందను వడి దాఁకె

కర్ణ మణిగ్రీవుల యుద్ధము


అపుడు మణిగ్రీవుఁ డతిమూర్ఛ బెలిసి
తపనీయదివ్యకోదండంబుఁ బూని
చపలాలతికబోలు శరము సంధించి
కుపితుఁడై కర్ణునిఁ గ్రోధించి చూచి
నలకూబరుని యాననము విలోకించి
వలదయ్య యిట కేల వచ్చితి నీవు '
మానవుం డనుచు నేమరియుంటిగాని
యీనృపాలకు ద్రుంప నెక్కడె నాకు -
వాహిని కెక్కు. నావరశక్తి యితని
బాహాబలము నీవె పరికించవలయు !నన విని యినసూనుఁ డామణిగ్రీవుఁ
గనుఁగొని యిట్లనుఁ గలకల నగుచు
మీరాజు మారాజు మీయోధకారులు
మారధికోత్తముల్ మాసాహసములు
ప్రతిభలు మనుమున్నె పరికింప లేదె! 415
ఇతఁడు చూడకయున్న నేమిటఁ గొదుపు !
నిన్నుఁ జూచిన నిల్వు నీరు బండెడిని,
ఎన్నఁడుఁ బరికింప నిటువంటివాని !
సామజేంద్రముతోడ సయ్యాట లింత
దోమకు సాగునే! తొలగుము వేగ 420
నెరవుగా బల్కెదె నీయీడువారు
కలరు మాసేనలోఁ గదనంబు సేయ;
నస దీరకున్న యానలబరుసకుఁ
గొసరుగా నిచ్చెదఁ గోరి నిన్నిపుడె
యని వారి సంధించి యరదంబు గదిమి 425
కనకపుంఖోజ్వలసువ సాయకముల
నిరువుర నొప్పించె నిషుపరంపరల
నరదముల్ దివ్యశరాసనంబులును


దురగసారధులతోఁ దునియలఁ జేసి
కరుకెక్కి విజయశంఖఁబుఁ బూరించె 430
మహనీయ మాణిక్యమయరథ మెక్కి
బహుశరంబులు కర్ణుపైని సంధించి
నెరి నొవ్వ నేసి మణి గ్రీవుఁ డపుడు
హరుల సారథిఁ గూల్చి యరదంబు ద్రుంచి
మలయక నవరత్నమకుటంబుఁ దునిమి 435
విలునారి తెగటార్చి విల్లు ఖండించి
కలహించి క్రోధించి కాయ మంతయును
సొలవక నెత్తురు జొత్తిల్లఁజేసి
యమ్ముల ముంచిన సళు కింతలేక
నమ్మేటి వేరొక్క యరద మెక్కుటయు 440
అది పొట్టుచేసిన నదరక కనిసి
గదఁబూన నది గూల్ప ఖడ్గంబు పలుక
కరముల సంధించి కదియచేయుటకు
దిర మొంద నవి రెండు తెగటార్చుటయును
ఖరకరాత్మజుఁడు చక్రంబు సంధింప
పరశీలీముఖముల వారించి కర్ణునురము వ్రీలంగ మహోగ్ర బాణముల
నెరి దూరవేసిన నిట్టూర్పు విడుచు
సొరిది నల్టిక్కులుఁ జూచి భీతిల్లి
పరువడి వెన్నిచ్చి పరతెంచుటయును 450

 

కర్ణుని పలాయనము


గని మణిగ్రీవుండు గదియ నేతెంచి
యినసుత నిలు! నిలు! మేల పోయెదవు
మలయుచు మీవారు మావారు జూడఁ
దలచెడి పారుట ధర్మమే నీకు !
బిరుదు వాక్యము లాడి పెక్కులు వ్రేలి 455

పరులందఱుమ జూచి పకపకనవ్వ
పోయిన నిన్నేల పోనిత్తు నేను
మాయన్న ! తొలఁగని మగవాఁడ వీవు !
చలియించి నీ విట్లు జరుగుట కేను
తలపోయ నినుఁ జూచి తక్కినయట్టి 460
నెరయోధు లీబుద్ధి నేర్చెద రింక
నెరి సాహసం బెల్ల నీట గల్పితివి
ఎద గాయముల థాత్రి నీల్గువారలకు
నెదురుగా వచ్చుగుబేరపుష్పకము [1].
కుపితచిత్తుండవై కురువంశమునకు 465
నపకీర్తి దెత్తువే! యన్న ! రాధేయ !
పారక తిరుగుము బవరంబు సేయఁ
దేరువిండ్లమ్ములు దెప్పించి యిత్తు
ననుపల్కు విని విననట్లు భేదిల్లి [2]
చనుకర్ణుఁ జూచి యాచార్యనందనుఁడు 470

అశ్వత్థాను కర్ణునికి సాయపడుట
 
అధిక వేగంబున సరిగి వేరొక్క
రథముపైఁ జే పట్టి రాధేయు నునిచి
యెలమి మణిగ్రీవు నేడంబకములఁ
గళవళఁబడ నేసి కవచంబు చించి
నలకూబరుని పదునాల్గు బాణములఁ


గలగించి సారథి ఖండించి వైచి
భానుకేతనునిఁ దొంబది నారసములఁ |
బూని ఘోరాహవంబునఁ జక్కు చేసి
సకలబలంబుల సైన్యాధిపతుల
ప్రకటించి చీకాకుఁబడఁ జెండివైచి480
కుండలీకృతముగాఁ కోదండమమరఁ
గాండముల్ పూసుట కడిమి నేయుటయు
దెలియఁగూడకయుండఁ దేజంబు మెరసి
బలియుర యోధుల భంజించి గదిమి
వెలయమణిగ్రీవు వికలంబుఁజేసి485
నలకూబరుని ముంచె నవభల్లములను
నలకూబరుఁడు గురునందనుమీఁద
నలువది దివ్యబాణంబు లేయుటయుఁ
బొడియయ్యె నరదంబు బొలిసే గుఱ్ఱములు
మడిసె సారథి బిల్కుమారె కేతనము490
తెరలక వేరొక్కతేరిపై నెక్కి
గురునందనుఁడు నలకూబరుఁ గదిసె
నలకూబరుఁడు గప్పె నానాశుగములనిల మణిగ్రీవుఁ డనేక బాణముల
ముంచినఁ గని ద్రోణముఖ్యులౌ యోధు
లంచితశరనృష్టి నపుడు గప్పుటయు
నవి యెల్లఁ దునిమిన నాచార్యసుతుఁడు
వివిథాస్త్రములు యక్షవిభునిపైఁ బరపెఁ
బెట్టుగ నర్చుచు భీమసేనుండు
ధట్టించి గద కరద్వయమునఁ బూని
నడతెంచుటయుఁ జూచి నలకూబరుండు
బెడిదంపుటమ్ముల భీముని ముంచె
నవి సడ్డనేయక ననిలనందనుఁడు
కవిసె పక్షులమీఁదఁ గన్నె సాళ్వంబు
గోరించుగతి యక్షకోటుల మోది
ఘోరదానవుల మార్కొని చక్కు చేసి
గరుడుల మణియించి గంధర్వవిభుల
ధరఁ గొల్చి కిన్నరదళములఁ జంపి
నలకూబరుని తేరు నలినలిఁజేసి
యల మణిగ్రీవునియరదంబు దునిమె
రణభయంకరపరాక్రమశాలియైనతృతీయాశ్వాసము


మణిమంతుతోఁ గొంత మసలక పోరి
సురనదీతనయుండు సూర్యబాణమున
సరగున నతని మూర్ఛ ముడుంగనేసి
మరలి పౌలస్త్యకుమారుని, డాఁకి 515
శరవృష్టి గురియించి చలియింపఁజేసె
అక్కడి కలకలం బాలించి చూచి

కుబేరార్జునులయుద్ధము - అర్జునునిమూర్ఛ

జక్కుల యెకిమీఁడు సాహస ప్రతిభ
నరదంబు మరలింప నమరేంద్రసుతుఁడు
పరికించి యక్షాధిపతికి నిట్లనియె520
ఇక్కడ నే నుండు టెఱిఁగియు సూరు
అక్కడఁ జనఁ జెల్లు నా కిన్నరేంద్ర!
చలమున ననుడాసి సమరంబు చేసి
గెలిచి పోదువుగాని కేడించి నిలువు
మిన్నక నామాట మీరిపోయినను525
వెన్ను గాయంబుల వేధింతు నిన్ను[3]

'


సౌగంధిక ప్రసవాపహరణము


అని గుణధ్వనిఁజేసి యరదంబు గదిమి
తనరారుదేవదత్తంబుఁ బూరింప
విని ధనాధీశుండు వేగంబె మరలి
వనజభవాస్త్రంబు వాసవిమీదఁ530
బరగింప నమ్మేటి బ్రహ్మసాయకము
కరమర్ధి మంత్రయుక్తంబుగా నేసె
నది నిల్ప కిన్నరాధ్యక్ష్యునిమీఁదఁ
నదలించి యేసె నారాయణాస్త్రంబు
కని కుబేరుఁడు మహాగ్రహమున నపుడు535
ఘనవైష్ణవాస్త్రంబుఁ గైకొని దాని
వారించి కవ్వడి వక్షంబు దాక
నీరజాప్తశరంబు నిగుడించుటయును
బలువిడి నదిగాక ఫల్గునుం డపుడె
తెలియని మూర్ఛల తేరుపై వ్రాలె 540

ఘటోత్కచునియుద్ధము - అతఁడు మూర్చిలుట

కనుఁగొని యాఘటోత్కచుఁడుగ్రుఁ డగుచు
మునుకొని వాడి యమ్ముల విలు ద్రుంచి


భూరికిరీటంబు పొట్టు గావించి
క్రూరత రధముపై కుప్పించి దుమికి
కరవాలు బెరికి వెక్కసముగా నార్చి 545

నరవాహనునిబెట్టు నరకిన నతఁడు
నరదంబుపై వాలి యంతఁలోఁ దెలిసి
కోదండమునఁబెట్టు గొట్టిన నతఁడు
పోదట్టి నక్షంబుఁ బొడువ శ్రీదుండు
కళవళ మంది రాక్షసకులేశ్వరుని 550

ప్రళయాంతకుని లీల బలుగఁద బూని
మోదీన నది దాకి మూర్ఛిలి యపుడు
ఆదైత్యకులమౌళి యవనిపై వ్రాలె
వేమరు పరికించి వికలంబు నొంది
సామజేంద్రము నెక్కి శమననందనుఁడు555

ప్రకటించి నడచె తురగంబు నెక్కి;
నకులుండు నడచె తురంగంబు మ్రోల[4]
దుర్యోధనుండును దుశ్శాసనుండుశౌర్యంబు లుప్పొంగ జనిరి వెంబడిన[5]
వహికెక్క నెరయోధవర్యులతోడ 560
సహదేవు డరుదెంచె జనపతి వెంట
చతురంగబలములు సమకట్టి మొనను
చతురుఁడై వెన కృపాచార్యుఁడు నడచె
ఆటమున్న పడియున్న యర్జునుఁ జూచి
పిటపిట కోరలు బెట్టుగా దీటి 565

హనుమంతుడు కుబేరునితో యుద్ధము సేయుట
ఉభయపక్షముల వారికిని జరిగిన చిత్రయుద్ధము

కేతనంబున నున్న కేసరిసుతుఁడు
భూతలం బదుర నద్భుతశక్తి దుమికి
నక్షత్రమండలోన్నతమైనయొక్క
వృక్షంబు కూకటి వ్రేళ్లతో బెరికి
కరముల సంధించి గద్దించి నడువ 570
పరికించి చతురంగబలములు పగిలె
చిడిముడి పడి సర్వసేనాధిపతులు


జడిసి కూతలు మాని జరిగిరి వేగ
పేరైనదొరలు కుబేరుని విడిచి
జారిరి యోధులు చనిరి బెగ్గిలుచు575
అలకాధినాయకుఁ డాభూరుహంబు
తొలగక శరముల దురుము సేయుటయు
పోలించి కాంచి యద్భుతమైన యొక్క
శైలంబుఁ బెరికి యక్షకులేశుమీఁద
వైచిన నమ్మేటి వ్రక్కలు నేయ580
జూచి కో యని యార్చి సురలు భేదిల్ల
కనకాచలములీల కాయంబుఁ బెంచి
ధనపతిమీఁద నుద్దండత సడిచె
తెలివొంది గనుఁగొని దేవేంద్రసుతుఁడు
యలివేణి లాలించి యరదంబు దుమికి 585
వలగొని యాకపివరుసకు మ్రొక్కి
చెలువొంద గీర్తించి చేతులు వెలిగించి
కపికులాధీశ! జగన్నుతచరిత!
విపులబలాటోప! వీరాగ్రగణ్య!
వలనొప్ప నెరయోధవర్యులలోన590చులకసేయుదురె నాశూరత్వ మి వుడు
కలయక్షకిన్నరగంధర్వపతుల
నలకాధిపతితోడ నని గెల్తుఁ జూడు
కినుకమాను మటంచుఁ గీర్తించి యతని
తనధ్వజంబున నుంచి ధర్మజాదులను
వారించి యరదంబు వైళంబ యెక్కి
దారుణశంఖనాదంబు బర్వించి
యక్షవల్లభునిపై నరదంబు నూకి
యక్షయదివ్యశరావళుల్ నించె
ఆలోన తెలివొంది యనిలాత్మజుండు 600
కాలునిగతి నార్చి గర్వంబు చేర్చి
యలకాధిపతిమీఁదఁ నరుదెంచుటయును
తిలకించి కాంచి యాదేవధ్వజుండు
పటుతరాంచితదివ్యబాణజాలముల
చటులత ముంచె రాక్షసకులేశ్వరుని 605
మకుటంబు దునిమిన మండి సురారి
వికలంబు నొందక వికవిక నగుచు
దేవధ్వజుని ముంచె దివ్య బాణముల


వేవేగ విలుద్రుంచి వీరులఁ జంపి
సూతునిఁ దెగటార్చి సూర్య బాణమున
నాతని నొప్పించి యదలించుటయును
తనరార దేవకేతనుఁదు జృంభించి
జననుతం బైనట్టి స్యందనం బెక్కి
మెరసి ఘటోత్కచుమీఁద దండురికి
పరగించె బహుఘోరబాణజాలముల;
నవియెల్లఁ బొడినేసీ యసురనాయకుఁడు
తివిరి యమ్ముల నుంచి దేవకేతనుని
ఈరీతి నొండొరు లేవు దీపించి
పోరుచునుండి రద్భుతశక్తి మెరసి;
అంతట మణిమంతుఁ డతిమూర్ఛ దెలిసి
యంతకు లీల సాహస మగ్గలించి
కరుకెక్కి యరదంబు గాంగేయుమీఁదఁ
దరిమినఁ గర్ణుఁ డుద్ధతి నెదురేఁగి
శరముల నరదంబుఁ జక్కుసేయుటయు
సురవడి సతఁడు వేరొక్కరథంబుఁ 625
బరువడి నెక్కి యాభానుసందనుని


నిరుపమాంబకముల నించు సవ్వేళ
మార్తాండసుతునకు మణిమంతునకును
కీర్తింపఁదగు రణకోళి సంధిల్లె
తివిరి ఘటోత్కచదేవధ్వజులకు
బవరంబు చాల దెప్పరమయ్యె నపుడు
అమరేంద్ర సుతునకు యక్షనాథునకు
సమరంబు గల్గె నాశ్చర్యంబు గాఁగ
నలకూబరునకు ద్రోణతనూజనకును
గలితభయంకరకదనంబు చెల్లె635
నెరయ గాంగేయమణిగ్రీవులకును
గరమొప్ప ఘోరసంగరమువాటిల్లె
మారుతాత్మజునకు మణికేతనునకుఁ
దారుణంబైన యుద్ధము సంభవించె
హరికేతనునకు ద్రోణాచార్యునకును640
నరుదంద నాహనం బగ్గల మ్మయ్యె
చెలువొందఁ గృపునకు: జిత్రకాయునకుఁ
బలువైన జగడంబు ప్రకటించి మించె
విలసిల్లు కురురాజవీరసేనలకునలరి చూడఁగ నాల మధికమై మెరసె645
నకులునకును సదానందున కపుడు
ప్రకటంబుగాఁ బోరు బలసె నెంతయును
తక్కిన యట్టి యోధులకు యోధులకును
నక్కజంబైన కయ్యము సంఘటిల్లై
అరయ భటుల్ భటుల్ హరులును హరులు 650
కరులును గరులును గదిసి పెంవెక్కి
రథకులు రథికు లుగ్రత చలపోరి
యధికజయాకాంక్ష నని సేయుచుండ
అప్పుడు నారదుం డధిక మోదమున

నారదుఁడు ద్వారకాపురమునకు వచ్చుట

గొప్పునఁ జని ద్వారశావురి నేరి 655
నిరుపమమౌక్తికనీలవైడూర్య
మరకత ఘనహీరమాణిక్య ఖచిత
సప్తసాలముల ముచ్చటలు చూచుచును
తప్తకల్యాణసౌధములు చూచుచును
గంగాతరంగిణీ కనకాబ్దముకుళ 660
సాంగత్యకలితకాంచనకుంభనికర

భూరిగోపురచయంబుల విలాసములు
సారె వీక్షింపుచు సకలసౌభాగ్య
మందిరంబుల మేలు మచ్చులు గనుచుఁ
జందన క్రముకరసాలజంబీర
మాలూర శారద మాధవీ పనస
తాలతమాలలతాకుంజమంజు
పల్లవకోరక ప్రసనఫలాది
సల్లలితామోదసంయుతం బగుచుఁ
గలకంఠ శుకశారికాహంసచక్ర
విలసిత మధురవాగ్విభవంబుఁ గనుచు
వలనొప్ప శృంగారవనమధ్యమునను
వెలఁదులు పదియారువేలు గొల్వఁగను
జెలఁగుచు దివిజరాజీవలోచనలు
సలలితనాట్యప్రసంగము ల్నెరప
క్ష్మాపాలకన్యక ల్చామర ల్వీవ
గోపికాజనములు గొడుగులు బూనఁ
జనువుల రుక్మిణీసతి మొదలైన
యెనమండ్రసతులతో నింపు సొం పెసఁగకేళికామహిమలఁ గ్రీడించుచున్న

 కృష్ణ దర్శనము

తాలాలకసోదరు తతకీర్తిహారు
నలఘునీరదదేహు నాజానుబాహు
కలిత త్రిదశగేయు కనకకౌశేయు
లీలావిలాసు లాలితదరహాసు
బాలికామదసగోపాలునిచెంత
నిలిచిన గనుఁగొని నెలతలుఁ దాను
బొలుపొంద బ్రణమిల్లి పూజలు సేసి
యురురత్నపీఠిపై నుంచినఁ జెలఁగి
సురమౌని వసుదేవసుతుని కి ట్లనియె

నారదకృష్ణ సంవాదము

ఓ పాపనచరిత్ర! యోపాండుమిత్ర!
యోపుండరీకాక్ష! యోజగద్రక్ష!
కడకతో నొకవార్త గలదు దెల్పెదను;
కడుసావధానంబుగా వినవలయు
పరగ ధనాధీశ పాండవేయులకుఁదరుచైన ఘోరయుద్ధము సంఘటిల్లె
ఇపుడు సేనలతో ఫణింద్ర కేతనుఁడు
కపటసహాయుఁడై కలిసి యున్నాఁడు.
పొలకువ నిలుకులో సొలుకుమంత్రంబు[6]
దలవెట్టగలఁ డల ధార్తరాష్ట్రుండు
మదమత్తుఁ డతని మర్మము మీకె తెలుసు 700
మది నింక నొకయనుమాన మయ్యెడిని
అలకాధిపతికిని హరునకు దొడ్డ
చెలిమియౌ నీవార్త చెవిఁబడెనేని
యల శ్రీదునకు సహాయంబు గాఁగలఁడు
పాలుపునిూరంగ నాభూతనాయకుఁడు 705

తలపోయ మీదయ తప్ప వేరొండు
గలదె పాండవులకుఁ గమలాధినాథ!
అనునంద మీకు సహాయంబు గాఁఃగఁ
జనుఁ డని దేవతాసంయమి వెడలె


కనులాక్షు డవ్వేళ గడు విజృంభించి710

 కృష్ణుఁడుపాండవులకు సహాయముసేయఁబూనుట

రమణుల నంతఃపురంబున కనిచి
యాస్థానమున కేఁగి యసనికంపింప ;
బ్రస్థానభేరికాప్రతతిమ్రోయించి
యక్కడ నున్న యోధావళి నెల్ల
గ్రక్కున పయనముల్ గ్రమ్మని యనిచి 715
తరలక శార్ఙ్గగదాచక్ర ఖడ్గ
వరసాధనంబులు వరుస ధరించి
గరుడ కేతనధనుర్గుణదివ్యబాణ
నిరుపమనవరత్ననికరసంఖచిత
సురధరోన్నతవిభాసురరథం బెక్కి720
యరుదార పాంచజన్యంబుఁ బూరించి
యదువృష్ణిభోజాంధకాదులతోడ
మది నెన్న రాని కుమారులతోడ
నలఘుతేజోనిధి యభిమన్యుతోడ
బలువిడి చతురంగ బలములతోడ 725
వలనొప్ప బహువైభవంబులతోడ
ఘనతరాత్యంతవేగంబున గదిలి
చనియె నుద్భటవృత్తి జలజలోచనుఁడు
కదనరంగమునకుఁ గమలలోచనుని
గదలించి పొదలుచు గ్రక్కున నపుడు
కలహభోజనమౌని కైలాటకాఁడు

నారదుఁడు కైలాసమున కరుగుట

తులకించు బొజ్జ చిందులు ద్రొక్క నేఁగి
యన్ని దిక్కులయందు ననవరతంబు
వెన్నెల నిండార వెదచల్లుదాని
ఘోరకామ క్రోధకుటిలమాత్సర్య
భూరిపాపౌఘముల్ పోఁద్రోలుదాని
చారుసౌభాగ్యముల్ సమకూర్చుదాని
తారాచలము గాంచి తగ వినుతించి
యమ్మహాగిరి నెక్కి యందంద నిండు
కమ్మని వాసనల్ గ్రమ్ము మందార
వనముల దాటి భవ్యవినూత్నరత్న


కనకసాలంబులు గడచి యుత్తుంగ
సారచంద్రోపలసౌధజాలంబు
లారూఢి మీరి మహాభోగ భాగ్య
బంధురకల్యాణభవనరాజములు 745
సింధురాలయములు చెలఁగి చూచుచును
జని చని మహనీయసాంబ్రాణికాది
ఘనధూపవాసనఘంటానినాద
పంచాక్షరీ ధ్వానబహుశంఖనినద
కంచుకీజనఘోషగంభీర మగుచు
సలలితం బైన యాస్థానమంటపము
చెలువంబు మీర నీక్షింపుచు నేఁగి
వీరభద్ర కుమార విఘ్నాధినాథ
భైరవాదు లుభయభాగంబులందు
రమణ గూర్చుండ విక్రమధురంధరుఁడు
ప్రమథాగ్రగణ్యు లంద్భటవృత్తిఁ గొలువ
గంధర్వకిన్నరకామినీమణులు
బంధురగీత ప్రబంధము ల్పాడ
కరమర్థి యక్షరాక్షస కులాధిపులు
పరువడిలో బరాబరు లొనరింపఁ
గలితమోదంబున గంగావధూటి
తులకించి జడలలో తుంపెసలాడఁ
గలువలచెలికాఁడు కళలు రంజిల్లఁ
బలు రవమౌళిపై భాసిల్లుచుండ
గరగరికలమించు గట్టురాపట్టి
గరిమెతో వానుభాగంబున మెలఁగ,
బహువినోదావిలాస భద్రసంపదల

 శివుని సందర్శనము

రహిమీరఁ గొలువున్న రాజుశేఖరుని
గని దేవముని కులాగ్రణి వినుతింప
మొనసి ప్రత్యుత్థానములు చేసి యతని
నలువొప్ప నుచితాసనంబున నునిచి
చెలఁగుచు నమ్మౌనిక్షేమంబు లడిగి
ఘనులు మీ రిట వచ్చుకార్య మే మనిన
మనసిజారికి సురమౌని యిట్లనియె
నారద శివుల సంభాషణలు

సర్వలోకశరణ్య! శైలజారమణ!775
శర్వ! గంగాధర! సద్భక్తవరద!
వినుపింతునొక వార్త విను చిత్తగించి
తనర విజృంభించి ధర్మనందనుఁడు
అనుజులు దుర్యోధనాదులు గొలువ ఁ
జనుదెంచి ధనదుని సరకుగాఁ గొనక780

చెలరేఁగి యుద్ధంబు సేయుచున్నాఁడు
తలపోయ ధర్మనందనుసేనలోన
గురుఁడు భీష్ముండు నాగురుతనూభవుఁడు
కురురాజు భీముఁడు గోత్రారిసుతుఁడు
పరగు నానాదివ్యబాణకౌశలులు785

నెరయోధవర్యుల నీ వెరుంగుదువు
కదనరంగమున నాఘనులతో శ్రీదుఁ
డెదిరించి పోరాడుటే దుస్తరంబు
పాటించి యిఁక నొక్క భయమును గలదు,
తేటగా నావార్త తెలిపెద వినుఁడు790తలపోయ పాండునందనులకు శౌరి
బలిమైన చెలికాఁడు ప్రాణబంధువుఁడు
కలలోఁ దలంచిన గ్రక్కున నేఁగి
తొలఁగక రక్షించుఁ దోయజాక్షుండు
వెలయ నీకార్యంబు విన్నంతలోన795

నలఘు వైఖరిసహాయమువచ్చు నిజము
కంతుని గన్న య్య గదిసిన వెనక
చింతింప గతజలసేతుబంధనము
నిన్నె నమ్మినవాఁడు నీ చెలికాఁడు
కన్నడ సేయంగఁ గడు ధర్మ మగునె;800

యీ క్షణంబున మీర లేగకయున్న
యక్షాధినాథున కాసింపఁదగదు
తెలిసినంతయుఁ దేట తెల్లమిగాఁగఁ
దెలిపితి నని యేగె దేవతామౌని.

శివుఁడు కుబేరునకు సాయపడ సిద్ధ మగుట

ఇందుకళాధరుఁ డెలమి యుప్పొంగి
యందరిఁ బరికించి యాహనంబునకుఁ
గట్టాయితమ్ములు గమ్మని యనిచి
గట్టిగా పులితోలుకాశ బిగించి
కమనీయఘనవజ్రకవచంబుఁ దొడిగి
డమరుగశూలచండపినాకముఖ్య
వివిధాయుధంబులు వెస ధరియించి
సవరించి తెచ్చినస్యందనం బెక్కి
ధీరత్వమునఁ జనుదెంచు నవ్వేళ
నారూఢదివ్యరథారూఢుఁ డగుచు
భైరవగుహవీరభద్రాదు లరుగ
హీరంపుటరదంబు లెక్కి పెంపెక్కి
ప్రమథులు శతకోటి బలసి కొల్వంగ
ప్రమదంబునను వీరభటపరంపరలు
తమకము ల్నిగుడ ముందరఁ జనుదేర
గమకమై కరితురంగశతాంగతతులు
కరకరిపార్శ్వభాగముల నేతేర
వరుస చతుర్విధవాద్యఘోషములు
ఘోరమై సకలదిక్కులుఁ బిక్కటిల్ల
భోరున నేతెంచె భూతేశ్వరుండు
గురు తరతురగోగ్రఖురఘట్టనములు825
కరిపాదఘాతఘీంకారరావములు
రమణీయమణిమయరథచక్రగతులు
పుడమిఁ గంపింప త్రిభువనము ల్గలఁగఁ
దడఁబడి శేషునితల లన్ని చెదర
బెగడి కూర్మమువెన్ను బిట్టులు వార[7]830

పరమేశ్వరుఁడు కుబేరునిదగ్గఱకు వచ్చుట

తగుసప్తకులపర్వతము లొడ్డగిల్ల
నతిరభసంబున నరుదెంచి యక్ష
పతి చెంత నిల్చె నప్పరమేశ్వరుండు
నిలిచిన గనుఁగొని నెయ్యంబుతోడఁ
దులకించు తమకముల్ తొడి బొమ్మలాడఁ 835
గయ్యంబు నిల్పి యక్షకులాధినాథుఁ
డయ్యెడ హిమగిరిజాధీశుఁ జేరి
ఘనభక్తి ప్రణమిల్లి కరములు మొగిచి
వినయసంభ్రమముల వినుతించుటయును


హరుఁడు సంతోషించి యతని లాలించి 840
వరయోధవర్యుల వరుస దీవించి
సకలసైన్యంబుల సమరంబునకును
బ్రకటించి సమకట్టి బారులు దీర్చి
సముదగ్రతరభేరిశంఖారవంబు
లమరంగ నిగుడించు నాసమయమునను845
శమనతనూజుఁ డాశ్చర్యము నొంది
అనురనదీనందనాచార్యవరులఁ

ధర్మరాజు చింతించుట

గనుఁగొని యిట్లను గటకటపడుచు
అనఘాత్ములార! యక్షాధినాథునకుఁ
గడిమి సహాయంబుగా వచ్చె హరుఁడు850
తొడరి భూతేశ్వరుతో నిల్చి పోర
వల్లనొప్ప మనయోధవర్యులలోన ఁ
గలరె! యెంతటి దొడ్డ కార్యంబు గలిగె!
భైరవగుహవీరభద్రులతోడఁ
బోరాడ నెవ్వ రోపుదు రయ్యలార 855


ప్రమథులతో మనబలము లింతైన
సమరాంగణంబున సరి నిల్వఁగలవె
యనుచు జింతించునా యమతనూభవునిఁ
గనుఁగొని పలికె గంగానందనుండు
మనుజేంద్ర యొకపేద మానవులీల 860

భీష్ముడు ధైర్యముసెప్పుట

ఘనభయంబున నింత కలఁగ నేమిటికి?
చలపడి వారితో సరిపోరువారు
గలరా యటంటివి కలరు తెల్పెదను
పరగ ద్రోణునకును భైరవునకును;
గురుతనూభవునకు గుహునకు జోడు;865

వివరింపఁ గృపునకు విఘ్నేశ్వరునకు,
పవనుజునకు వీరభద్రున కుద్ది
కురురాజునకు నలకూబరునకును
నరునకు ధననాథునకు నీడు జోడు;
మన నకులునకును మణిమంతునకును,870
నెనయ మణిగ్రీవునకు సైంధవునకు;
శుకదామునకు నలసూతపుత్త్రునకు;
శకునికి నుతికెక్క సైంహికేయునకుఁ
జండీశ్వరునకును సహదేవునకును;
నొండొండ సరి యుద్దు లుర్వీతలేంద్ర"875

తలపోసి చూడ యోధలకు యోధలకు
లలిమీర సైన్యంబులకు బలంబులకుఁ
దొలఁగక త్రాసునఁ , దూఁచినవైన
నలర సమానంబు లదిగాక వినుము
వారిలోపలను మనవారిలోపలను880

వారక రహికెక్క వరయోధులందుఁ
జటుల సాహసశక్తి సరిపోల్ప రాని
పటుబలాఢ్యుఁడు హిడింబానందనుండు[8]
పొంకించి నన్ను నేఁ బొగడుకోరాదు
శంకరుతోఁ జేరి సరిపోరఁగలను 885
అన విని గాంగేయు నదరంటఁ జూచిగాంగేయకర్ణ సంవాదము

కనలి రారాజుతోఁ గర్ణుఁ డి ట్లనియె
భూతలాధీశ! యద్భుతమైనయట్టి
మీతాత పల్కులు మీకు సమ్మతమే!
యెందైన డెబ్బది యేండ్లు వెళ్లినను 890
మందవిచారముల్ మదితప్పిపోవు.
తనబల్మి యెఱుగఁడు తారతమ్యములు
గనలేఁడు నీతిమార్గంబుఁ బోవిడుచు
పలుము నన్యులఁ దిట్టు బలియుర గిట్టు
నెలకొన్న ధైర్యుల నేరము ల్బట్టు 895
తనలోనే తాను నెంతయు రంతుసేయు
ఘనయోధవరులతోఁ గారులు బలుకు
కదిసి దండనచేసి గద్దించిరేని
బెదరి కూతలు పెట్టు ప్రియములు పలుకు
మత్తిల్లు నీతనిమహిమలు గావు 900
చిత్తవికారంపు చేష్టలుగాని ;
బహునాళ్ల ముదిడోక్కుపైనిఁ గోపింప
విహితంబుగా దిది వినుము తెల్పెదను
నెరయ శ్రీదునకును నీకు వెన్నుద్ది;905
దొరయ మణిగ్రీవ దుశ్శాసనులకు
నలువంద మణిమంతునకు శకునికిని ;
నలకూబరునకు సైంధవునకు జోడు
నన్ను నే నెన్నుకో నాయంబుఁ గాదు
పన్నగభూషణ ప్రముఖులౌయోధ
వరులెల్ల నాజోడు వర్ణించి చూడ910
గురుకృపార్జునభీష్మగురుసుత భీమ
నకులాదు లైన మానవకోటు లెల్ల
ప్రకటించు యక్ష, కాల్బలములజోడు
నరనాథ యొకటికి నవ్వు పుట్టెడిని !
తిర మొంద నావార్త తెలిపెద వినుము915
వారిలోపల మనవారిలోపలను
పేరు గీర్తులు లేని బీదలలోనఁ
దలపోసి యెంచఁగాఁ దగదు కయ్యంబుబలుకోచ యాహిడింబానందనుండు [9]
అన విని మీసంబు లల్లన దువ్వి920
దినకరాత్మజుఁ జూచి దేవతారాతి
కాలాంతకుని లీల గద ధరియించి
పోలించి పవమానపుత్రుఁగన్గొనినఁ
గనలి భీముఁడు ఘటోత్కచుని వీక్షించి
కొనుమని కనుగిల్చి గూఢత నున్న925

ఘటోత్కచకర్ణ సంవాదము

చలమునఁ గెరలి రాక్షసచక్రవర్తి
తలకొని మార్తాండతనయునిఁ జూచి
ఏమనంటివికర్ణ ! యీసారి పలుకు
నీమదం బడగింతు నృపతులయెదుట
యెంత సిగ్గెరుఁగవో యిందరు జూడ930
నింతకు మున్నె నిన్నేమిసేసితిని
మరపువచ్చెనొ దొడ్డమగటిమి గల్గు
బిరుదుబంటవు నాదు పిరికితనంబు
కనుఁగొను మని మహాగదఁ బూని నడువ
దినకరతనయుండు దిగ్గున లేచి 935

సురనదీతనయుఁడు వారిని వారించుట

ప్రతిభతో గదఁ బూని పరతెంచుటయును;
అతివేగమున వారి కడ్డంబు వచ్చి
చనువున లాలించి శమననందనుఁడు
ఘనుల నిర్వురఁ గాంచి కరమొప్పఁ బలికె
అనుపమబలసాహసాటోపులార!940

మనలోన మన కింత మాత్సర్య మేల
యిప్పుడే కలనికి యేగుచున్నార
మప్పుడు గన్పించు నందరిబల్మి
కుడువఁబోయెడువేళ కూరలరుచులు
నడుగఁగా నేమి మిమ్మపుడె చూచెదము 945
వసుధ వంటలసాని వంటలసాని
మిసికిన కూరలు మేల్సూపవలయుఁ
గాని వేగమె తెడ్లు గరిటలు బూని 
యానుకు వేట్లాడు టది నీతి యగునె![10]
అని వారి వారించి యక్కు నఁ జేర్చి950

చనువున నొక కొన్ని సఖ్యముల్' 'నెరపి
వెస భీష్మునకుఁ చాల వినయముల్ చేసి
పొసఁగ యుద్ధమున కుప్పొంగుచున్నంత ;
నెందుఁ జూచిన నేల యీనిన లీల
పొందుగా జలధు లుప్పొంగి పెల్లుబ్బి955

పొలుప పిల్లిగ వచ్చు పోలిక దనర
బలువిడి "గెరలి నిబ్బరమున నడుచు
సకలసైన్యో ద్ధూతసాంద్ర పరాగ
నికరంబు చేఁ బయోనిధులు గలంగె
గిరిసుతవహియించే ఖేదమోదములు950

హరుఁడు మున్నగఁ దాల్చె నాత్మలో చింత
రవిచంద్రతారకారాజికీ మిగుల
సవిరళం బైన మార్గాయాస మొదవె
మొనసి యహోరాత్రములు గానఁబడక

ఘనతరగాఢాంధకారంబు గప్పె965
భేరికాహళశంఖపృథుల డఘామి
కారావములకు బ్రహ్మాండము ల్పగుల
కరిఘటఘంటి కాకలితఘీంకార
గురుఘోషణములకు కులగిరు లురలె
పరువడి నరవీరభటసింహనాద970

హరిహేషలకును దిగంతము ల్వణఁ కె
చతురంగ వాహినీ సంయుతుఁ డగుచు
నతివేగమున వచ్చె వబ్జలోచనుఁడు
కని ధర్మజుఁడు మహాకౌతుకం బడరఁ
దన సహోదరులును దా నెదురేఁగి 975

-:హరి పాండవులకు సహాయము వచ్చుట:-మ్రొక్క నుద్యోగించు మురవి భేదనుని
గ్రక్కున నక్కునఁ గౌఁగిటఁ జేర్చి
పొల పొంద వినుతించి పూజలుం జేసి
బలరాముఁ గని చాల ప్రణుతించి పొగడి
పలుమరు తనగూర్చు బంధువర్ధములఁ
గలయఁ గన్గొని క్రమక్రమమున మెలఁగె
భీమార్జునాదులు ప్రేమ నేతెంచి
రామకృష్ణులకు మర్యాదమార్గమున
పేర్మితో వందన ప్రియభాషణముల
నర్మిలి విహరించు నాసమయమునకు985
శమనతనూజుండు సంతోషమ్మునంది
కమలనాభునిమోముఁ గనుఁగొని పలికె
తలిదండ్రి వీవె మాదైవంబ వీవె
చెలి కాఁడ వీవె మాజీవంబు నీవె
మరదివి నీవె మామర్మము ల్నీవె990
వరదుఁడ వీవె మావాఁడవు నీవె
అరయంగ పాండుజనాధినాయకుఁడు
నీరజలోచన నినుఁ జూపి చనియె
ఆపద ల్దొలగింప నఘములు వాప
చేపట్టి రక్షించి చెక్కిలి సరచి995
వెలయబుద్ధులు చెప్ప వేడ్కలు నెరప
సలలితం బగు బహుసంపద లొసఁగ
శుభములు చేగూర్ప శూరులుసేయ
ప్రభువులు గావింప భయములు మాన్ప
పావనపుణ్యసంపన్నులఁ జేయ 1000
నీవె కర్తవుగదా ! నిఖిలలోకేశ !
జలజాసనునకైన శక్యంబు గాదు
తిలకించి మిమ్ము ప్రార్టింప నాతరమె!
రవిరాజనేత్ర! శ్రీరమణీకళత్ర!
వివరింతు నొకవార్త విను చిత్తగించి1005
పరగ సౌగంధికప్రసవంబువలనఁ
గరకరిమధుబిందుకలహంబు పుట్టె
ధననాథుఁ డతిశౌర్యధైర్యప్రతాప
ఘనబలాధికశర క్రమకౌశలుండు :
నతనికి ప్రాపుగా నళికలోచనుఁడు 1010
చతురంగబలశక్తి చనుదెంచినాఁడు
కమ్మపూవిల్తుని గన్న మాయయ్య !
నెమ్మితో మముఁ బ్రోవ నీవు వచ్చితివి
గాంగేయుఁడును మీరు కవగూడి ఘోర
సంగరంబునకును సకలసైన్యముల1015
నడిపించి జయము గనందగు ననినఁదడయక హరి ధర్మతనయున కనియె
జననాథవర ! మీకు సాధింపరాని
పను లున్న నే ధరాభాగంబునందు ?
నను జన్ములు సహాయు లతిబలోన్నతులు 1020
తనయులు చండప్రతాపవిక్రములు
గురుఁడు మహాయోధ గురుతనూభవుఁడు
గురుశౌర్యుఁ డతిధైర్య గుణనిధి కృపుఁడు
బల్లిదుఁ డగుభీష్ము ప్రతిభ యెంచినను
నెల్లలోకంబుల నెవ్వరు గలరు ?1025
పరశురామునియంత బలశాలి నెదిరి
దురమున గెల్చి కీర్తులు గొన్నవాఁడు
పొంకింపఁగా భీమపుత్త్రుఁ డానాటి
లంకాధిపతియంత లావరి నిజము
అతనిదీ టనవచ్చు నర్జు నాత్మజుని1030
శతమఖాత్మజు నెంచ శక్యమేగాదు
ప్రతిభ కెక్కిన బలభద్రుండున్నాఁడు
ఆతిధైర్యధనుఁడు సాత్యకి యున్న వాఁడు
బహువైభవమున ధనపతియంతవాఁడు


అహిరాజకేతనుఁ డరుదెంచినాడు 1035
కురుపాండవుల జతగూడి యుండఁగను
దుర మొనరింప యింద్రునకైనఁ దరమె
పెక్కు యోచనలేల పృథ్వీతలేంద్ర
యెక్కువ పనులకు నేనున్న వాఁడ

కర్ణకృష్ణ సంవాదము

ననిన భానుతనూజుఁ డంభోజనాభుఁ 1040
గనుఁగొని రౌద్రుఁడై గద్దించి పలికె
భళిభళి! మేల్మేలు! పంకజనయన
కులశీల బలశౌర్యగుణశాలి వగుట
తెలిసె నీ కిన్నియుఁ దెలియ రెవ్వారు !
సొలవక నెంతశ్రేష్ఠుఁడ వైతి వీవు!1045
నిన్న నే దాసరి నేడె రాగంబు
నిన్నెరుంగుదు నేఁగు నీరదవర్ణ!
బండాటములుచేసి ప్రజలు దిట్టంగ
కుండలతోఁ దిని గొల్లలయిండ్ల
దొంగిలి కొంటెబుద్దులు కొన్ని నేర్చి1050యంగనామణుల బాయని రట్టుఁజేసి
మసలుచు నావులమందల నున్న
పసులగాపరి నెరబంటు నే మెఱుగు
నెందెందుఁ జూచిన నిటువంటిచెడుగు
మందబుద్ధులుగావె మందగొల్లలకు1055
నెంచితి వౌర! నీ వీయోధవరుల
మంచిదె తారతమ్యము లెఱుంగుదువు
ముందర కయ్యంబు మొనసి యున్నయది
యందరి నేఁజూతు నపుడు నన్జూడు
వీరశేఖరుఁ డెంచు వీరశేఖరుని1060
పారుబోతు నుతించు పారుబోతులను
నీవీరమర్మంబు నీబలప్రతిభ
నీవిక్రమస్ఫూర్తి నే నెన్న నేల?
వడినంటి తరిమి పర్వతము లెక్కించి
జడియఁదోలినజరాసంధుఁ డెఱుంగు1065
కదిసిపోవగనీక ఘనగహ్వరముల
కదరఁ దోలిన కాలయవనుఁ డెఱుంగు
నింతలో మరచితివే కృష్ణ నీవు!

పంతంబు గల నెరబంటవు గనుక
తలపోయ నీకును దగినట్టివారి1070
పలుదెఱంగుల మెచ్చి ప్రస్తుతించితివి
అన విని రోషించి యమరేంద్రసుతుఁడు

అర్జునుఁడు కర్ణుని దూషించుట

వనజాప్తనందనువదనంబుఁ జూచి
వ్రేలనిచ్చిన మరి ప్రేలెదు క్రొవ్వి
చీలల్ల నీ కేల సిగ్గు లేదాయె!1075
నీచాత్మ యెవరు దండించిన వినవు.
కోచకూతలు రేఁగి కూసెద వేల
అతఁడు జగత్కర్త యతఁ డాదివిష్ణుఁ
డతఁడు సన్మునివంద్యుఁ డతఁ డప్రమేయుఁ
డతఁ డఘుదూరుఁ దనంతుఁ డచ్యుతుఁడు 1080
అతని దూషింప నీక ర్హ మే మూర్ఖ!
మగటిమిగల దొడ్డమగవానివలెనె
పొగరెక్కి నీ వేల పొంగెద విపుడు?
చలమున నాఖడ్గశక్తికి నిన్ను'
బలిపెట్టకున్న నీ ప్రజ్ఞలు మాన 1085వని కేల కరవాల మంకించు విజయుఁ
గనుఁగొని కనుగిల్చి గద్దించి నిల్పి
ఖరకరనందను గౌఁగిటఁ జేర్చి
కరము సంధించి పంకజనాభుఁ డనియె
అనఘాత్మ రాధేయ యసహాయశూర 1090

కృష్ణుఁడు కర్ణునిఁ బొగడుట

యనుపమాటోప నీకాగ్రహం బేల?
వరుస నే దెల్పినవారల నెల్ల
వరయోధలై యుండ వచియింపఁగల్గె
హరునకు నీకు దీ టనుచు నే నిన్ను
ధర నుతించక యుంటి తప్పేమి నాదు! 1095
శంకరునకు నీకు సమమైన యుద్ది
పంకజాప్తతనూజ ప్రధనరంగమున
పాయక హరు నెదుర్పడ నీవు దక్క
నీయోధవరులలో నెవ్వరు గలరు!
ఈ వాహినులెకావ యఁక మాటలేల1100
నీవారు మే మెల్ల నిరుపమాటోప


రాయమున హరు రాజరాజును గెల్చి
జయలక్ష్మి చేకొని సత్కీర్తినడయు
మన విని కర్ణుఁ డత్యంతమోదమున
కనకాంబరుని మోము గనుఁగొని పలికి 1105
నలినలోచన జగన్నాథ శ్రీకృష్ణ
చెలువంద నీవు మెచ్చినవాఁడె ఘనుఁడు
క్రొవ్వున గొన్ని పల్కులు పల్కె నన్ను
కవ్వడి నినుఁ జూచి కాచితి నతని
రాజీవనాభ విక్రమశక్తి నిపుడు[11]1110
నేఁ జెప్పఁగలబుద్ధి నీవె చెప్పితివి

కర్ణుఁడు భీష్మ ద్రోణాదుల దూషించుట

కలక దొలంగె సత్కరుణ వాటిల్లె
బలువైన దొకవిన్నపంబుఁ దెల్పెదను
గురుడుఁ దుర్మార్గుండు గురుసుతుఁ డల్పుఁ
డరయ భీష్ముడు వారికంటెను పెంకె 1115
కడు కృపాచార్యుఁడు కపటమానసుఁడు
 తొడరి యీదుష్టచతుష్టయం బెపుడు
బలువిడి నాబాహుబలశౌర్యగరిమ
వలనొప్పఁ జూచి యోర్వఁగజాల రనఘ,
యెందుకు పనికిరా రీనీచమతులు1120
నిందింతు రెంతటి నెరయోధనైన
కుటిలోక్తులకు నేను కొరగాను నాదు
పటుశక్తి గని మెచ్చి పనిగొనవలయు
పన్నగభూషణు ఖలిమి నాబలిమి
కన్నులపండువుగాఁ జూతుగాని1125
నెదురుమీరఁగ నన్ను నీవెంట దోడ్క
చనుమన్న హర్షించి జలజలోచనుఁడు
గురుకృపాదులను మక్కువ సన్నుతించి
సురనదీనందను జూచి యిట్లనియె
గాంగేయసందడి కయ్యంబు గలదు1130
గంగాధరునిమీఁదఁ గర్ణుని వెంట
నా సైన్యములు నేను నడిచెద మివుడె
నీ సేనలును నీవు నృపులు యోధలును
ధననాథునిమీఁద యుద్ధమునకు జనుఁడుకనలుచు సకలలోకము లేకమైన1135
హరుని మీమీఁదికి నరుదేర నీఁదు
సొరిది కర్ణుని లావు చూడుము నీవు
సురుచిరంబుగ మిమ్ముఁ జూచు కర్ణుండు
నరమరల్ సేయక నని సల్పవలయు
నందు నిందును గల యఖిలరాజన్యు 1140
లందరు మీవెంట నరిగెడువారె
యన విని వినుతించి యంజలి చేసి
యనుమోద మొదవ గంగాత్మజుం డనియె
కమలామనోహర! కమలాయతాక్ష !
కమలదనిభవర్ణ ! కమలాంకవినుత 1145

భీష్ముని వచనము

ఖగవాహనారూఢ! గజరాజవరద
నగధర! వైకుంఠనాయక! కృష్ణ!
కర్ణుఁ డెవ్వాఁడు గంగాపుత్త్రుఁ డెవఁడు
వర్ణించి చూచిన వాహిను లెవరు
చదరంగబలములు సమకట్టినటుల1150కదనంబునకు మీరు గదియించినారు
హరుఁడు నేర్పరిమీర లధికు లంతకును
తిర మొంద బారులు దీర్చితి రిపుడు
గెలిచిన నోడిన కీర్తులు మీవె
తిలకింప మీమాయఁ దెలియువా రెవరు? 1155
లోకేశ! మీ యాజ్ఞలో నుందు మింతె
గాక స్వతంత్రముల్ గలవార లెవరు?
వలనొప్పఁగా భక్తవత్సలబిరుదు
తలకొని శరణాగతత్రాణబిరుదు
గల దేవుఁడవు నీవు గావె శ్రీకృష్ణ!1160
కలనైన మీదాసగణముల కెల్ల
జయముగా కిల నపజయ మేల గల్గు?
భయ మేల గలుగు నోపరమాత్మ యనిన
భావించి హరిభీష్ము బరికించి పలికె
నీవు నావాఁడవు నేను నీవాఁడఁ1165
గాని యన్యులమే జగన్నుతచరిత!
భానుమానుఁడు నొవ్వబలికినపలుకు
లొకయింత మదిలోన నుంచగా వలదుసకలసేనలఁ గూడి సమరంబుచేసి
భువనముల్ వినుతింప భుజశక్తి మెరసి1170
యవలీల గెల్చి రమ్మని సెల విచ్ఛి
రాధాతనూజాకరంబు చేపట్టి
యోధావళుల కెల్ల నొగి చెయిచూపి

కృష్ణుఁడు యుద్ధమునకు సన్నద్ధుఁ డగుట

ప్రమథులపై యదుబలముల నెల్ల
తమకంబుమీర సుధ్ధతి గదియించి1175
కాంచనాంబరుఁడు దిక్తటము లల్లాడ
పాంచజన్యంబు దాఁ బరఁగ మ్రోయించె
అమరనదీసూనుఁ డందరఁ జూచి
తమకంబు గినుక సందడిగొన బలికె
పురుహూతసుత వాయుపుత్ర యాచార్య 1180
గురుతనూభవ కృపకురుకులాధీశ
శకుని దుశ్శాసన సైంధవ నకుల
సకలభూపతులార! జలజలోచనుని
ఘనతరసంగ్రమక్రమవాక్యసరణి
వినినారుగద మీరు వీనుల కొలఁది?1185
కదనరంగంబునఁ గదిసినవేళ
పదపడి మీ బాహుబలశరప్రౌఢి
ఘనపరాక్రమశక్తి గాన నయ్యెడిని
యనుచుఁ జేతులు జాపి యఖిలసైన్యముల
పరువడి యక్షాదిబలములమీఁదఁ1190

బురికొల్పి శంఖంబుఁ, బూరించుటయును,
అక్కడ ధననాథుఁ డావిధం బంతఁ
గ్రక్కునఁ గాంచి శంకరున కిట్లనియె
గౌరీమనోహర! కంటివే యిపుడు
నీరజనాభుఁడు నీమీఁదఁ గదలె1195

శంకరకుబేర సంభాషణము

వలనొప్ప పాండవవాహినీవితతి
నలిరేగి యుప్పొంగి నామీఁద నడిచె!
గొదకొని హరిణంపుగుంపులఁ గాంచి
పొదలెడు గబ్బిబెబ్బులి విధంబునను
దానవేంద్రుడు మదోద్దండుఁడై కెరలి 1200పూని కోపున మించి పొంచుకున్నాఁడు
ఎవరిపై దూకునో! యేకార్య మగునొ!
యెవరిఁ జెండాడునో! యెఱుఁగరా దింక
పరమాత్మ ! దీని కుపాయ మే మనిన
నరవాహనునిఁ గాంచి నాగకంకణుఁడు1205
బెదరేల నీకు కుబేర నే నిపుడె
యదుకులాగ్రణి మీఁద నరుగుచున్నాను.
నలినలోచనునకు నాకు వెన్నుద్ది
తిలకింప నతని మీదిక్కు రానీను
బలువిడి పాండవబలములమీఁద1210
తలపడి నీవు యుద్ధముచేసి గెలువు
నరునితో నీవును నలకూబరుండు
సురనదీసూనుతోఁ జోడు గావలయుఁ
గాకున్న నొరులతోఁ గాదు పోరంగ
చేకొని గంధర్వసేనలతోడ1215
గణుతికి నెక్కురాక్షససేనతోడ
ప్రణుతింప కిన్నరబలములతోడ ·
వీరయోధులతోడ వెక్కసంబుగను


భైరవుఁ డిదె దైత్యపతిమీఁద నడుచు,
నని పల్కి సెల విచ్చి యఖిలసైన్యముల 1220
గనుఁగొని చేవీచి గదియించుటయును;
ఉభయబలంబు లి ట్లొగిమారుకొనిన
రభసంబు లయ్యె తురంగహేషలును
భేరికానిస్సాణభీకరకాహ
ళారావముల్ పద్మజాండంబు నిండె? 1225
కరిరథఘంటికాఘణఘణంఘాణ
గురుతరధ్వనులు దిక్కులు పిక్కటిల్లె
తలపడి పోరు నత్తరి నెన్నరాని
బలుకయ్య మయ్యె నాబలములు కెల్ల
నీటెల బల్లేల నిలగుదుల్ గ్రుచ్చి1230
తాటుచు దూటుచుఁ దలపడువారు
శత్తుల కత్తుల కకవికల్గాఁగ
హత్తి మత్తిల్లి చెండాడెడివారు
గదలచే గదలచేఁ గదలక నిలిచి
యదలించి కదిసి యేట్లాడెడివారు1235
బెడిదంపు పిడెములఁ బిడెములఁ దొడరియడరి కేడించి పోట్లా డెడివారు
పంకించి బాకుల బాకుల చికిలి
వంకిళ్ల వంకిళ్ల వరుస గ్రొవ్వాడి
చూరీల చూరీల జొచ్చి భేదించి1240
చీరి డొక్కలు చించి చెండాడువారు
బలమును జలము నిబ్బరము నగ్గలము
బొలుపంద నందంద బోరాడువారు
నెలకొని చికిలి పన్నిదమాడునటుల
నెలమి కోలాటంబు లేయు కైవడిని1245
యలరార బిళ్లద్రిప్పాడినకరణి
నలముక చిడుగుడు లాడెడిసరణి
జలధులు జలధులు సరిబోరునటుల
చలమున సమరంబు సల్పు నవ్వేళ
కనకాంబరధరుండు కర్ణునిమోముఁ1250
గనుఁగొని చాల వక్కాణించి పొగడి
అల్లదె గనుఁగొను మయ్య రాధేయ !
మొల్లముగా మినుముట్టి యున్నదియు
విహితప్రదీప్తుల వృషభధ్వజంబు

411 వ పుట ద్వితీయ ఆవార్తము. 412 వ పుట లేదు. తరువాత పుట 413


నరిది పరాకుసేయక నన్నుఁ జూడు[12]
నిఖిలమునిస్తుత్య నిగమాంత వేద్య !
అఖిలాండకోటి బ్రహ్మాండకుటుంబ
వైకుంఠ నిలయ ! గోవర్ధనోద్ధార !
శ్రీకరగుణమూర్తి ! చిన్మయమూర్తి !1275

దానవకులశిక్ష ! ధవళాంబుజాక్ష!
మానితగుణజాల! మదనగోపాల!
అప్పుడు మిమ్ము నే నాడినయట్టి
తప్పులు మన్నించి దయబ్రోవు నన్ను
పన్నుగా సుతుఁ డెన్ని పలికినఁగాని1280

కన్నతండ్రికి ముద్దు గాదె శ్రీకృష్ణ
నావిని నవ్వి దానవకులాంతకుఁడు
వేవేగ గర్ణుని వీక్షించి పలికె
మాయురె! మేల్మేలు! మార్తాండతనయ
నీయెడ నాయెడ నేరము ల్గలవె 1285
నీనేమి నేనేమి నెనరైన మేనబావవు తగువైన బంధుండ వీవె
పెద్దపు వరుసను బిన్నను నేను
తద్దయుఁ దండింప ధర్మము గాదె;
పాయక నేకమై బహునాళ్లనుంచి
మాయయ్య నేనును మెలఁగినవాఁడ;[13]
తగవు లెంచక నిన్ను తప్పు లేన్నుదునె
యింక నే నొక్కటి యెంచెద వినుము
శంకరుతో నీవు సమరంబు సేయ
సన్నుతి కెక్కిన సాహసు లచట
నున్నారు తగదయ్య యొంటిగా నేగ
బలభద్ర సాత్యకి ప్రముఖులతోడ
బలువిడి నేతెంచి బవరంబు సేయుమన విని నవ్వి కంజాక్షునిమోము1300
గనుఁగొని పలికె నాకమలాప్తసుతుఁడు
మురదానవాంతక  ! మున్నె యీ యోధ
వరులెల్ల వినఁగ దుర్వారప్రతిజ్ఞఁ
బలికితి శంకరప్రముఖులౌ యోధు
లెలమి నాజోడంటి నిఁక మాట లేల?1305
శంకరుతో యోధచయములతోడ
పంకించి గెలిచిన ప్రబలు నాకీర్తి
తెగి నన్ను వారు సాధించిరే నీవు
పగ దీర్పుదువుగాని పంకజనయన
నను సంతరించిన నరవరోత్తముఁడు 1310
గనుఁగొని మెచ్చ విక్రమముఁ జూపెదను
ననుఁజూడు, ప్రమథాదినాథులఁ జూడు
మని పల్కి, సకలసైన్యదులు భేదిల్ల
విలుగుణధ్వనిచేసి, విఘ్నేశుఁ దాఁకి
యలఘుబాణంబుల నతని నొప్పించి1315
వీరభద్రుని రెంట వికలంబుసేసి
తారకారిని శరత్రయమున నొంచి


నలువందఁ జండీశు నాల్గింట నేసి
యలరుచు భృంగీశు నైదింట గ్రుచ్చి
తక్కినరథికులదర్పంబు లణచి1320
యెక్కువ బలముల నెల్ల భేదించి
బారులు చీకాకుపడ చెండివైచి
తేరులు కూల్చి గద్దించి డీ యనుచు
కరుల నేలణఁగించి ఘనుల బోఁ దరిమి
హరుల నీరుగఁ జేసి యార్భటల్జేసి1325
అంగజహరుని డాయంగ నేతెంచి
పొంగి వైశ్వానరభూరిసాయకము,
నరుదార గంధపుష్పాక్షత ధూప
పరమంత్ర యుతముగా వైచె; వైచుటయు
వెరగంది వీక్షించి వీరభద్రుండు1330
వరుణాంబకంబుచే వహ్ని బాణంబు
తుమురులు గావించి దోశ్శక్తి మించి
యమరులు భేదిల్ల నార్చి కోపించి
యిన నందనుని దాఁకి యిషుపరంపరల
పనుపడ గరిదూరి పారనేయుటయు;1335రౌద్రుఁడై కర్ణుండు రహి నార్చి వీర
భద్రునియరదంబు పడగయు విల్లు
తురగసారథులతోఁ దునియలుసేసి
గరకరి మేనెల్లఁ గాడ వేయుటయు[14]
పరువడి యవ్వీరభద్రుండు గెరలి 1340

మరలు భేదిల్ల శేషుఁడు తల్లడిల్ల
పటపట బ్రహ్మాండభాండము ల్బగుల
ఘుటఘుటధ్వనిచేసికో యని యార్చి
కరవాలమును బల్కఁ గైకొని రోష
భరితుఁడై భానుసంభపు నిరీక్షించి1345

తలవాంచి ఖడ్గంబు తళతళ మనఁగ
ఝళిపించి రథముపై చంగున దుమికి
కుప్పరం బెగసి దిక్కులు నిరీక్షించి
యుప్పొంగి యదువీరయోధుల దరిమి
సముదగ్రరథరథ్యచయములతోడ 1350
కమలాప్తనందను ఖండించుటయును;


భావించి కర్ణునిపాటెల్లఁ జూచి
భావజజనకుండు పాంచజన్యంబు
పూరించి రథికులఁ బురికొల్పుటయును
ధారుణి వణఁక నుద్దండవేగమున1355
జని బలప్రద్యుమ్న సాత్యకి ముఖ్య
ఘనయోధవర్యు లొక్కటఁ జుట్టికొనినఁ
గాంచి భృంగీశ్వరగణనాయకులను
క్రౌంచభేదనముఖ్యరథికశేఖరుల
ప్రధనజయాకాంక్షప్రౌఢి నేతెంచి1360
పృథ్వి భేదిల నార్చి బెట్టు దాఁకుటయు;
నడరి కోపించి తాలాంశుఁ డవ్వేళ
తొడిఁబడి గణనాథుఁ దొడరి పోరాడె
భద్రవిక్రమకళాప్రౌఢిచే వీర
భద్రునిఁ దాఁకి సౌభద్రుండు పోరె
సాత్యకి చెలరేఁగి షణ్ముఖుతోడ
నత్యంతబలశక్తినని సల్ప నపుడు;
నందికేశ్వరుమీఁద నడిచెఁ బుష్కరుఁడు
కందర్పరిపుఁ దాఁకె కమలలోచనుఁడు


తక్కిన యట్టియోధలు యోధకోటి 1370
యక్కజంబుగఁ బోర నాసమయమునను,
అక్కడ కౌరవయక్షసేనలకు
మిక్కుటంబై హెచ్చి మించె కార్యంబు
జక్కులఱేనికి సవ్యసాచికిని
నుక్కు మీఱిన మహాయుద్దంబు గలిగె 1375
నలువందగా భీష్మనలకూబరులకు
బలిమైన కయ్యంబు ప్రకటించి మించె;
నెలకొని ద్రోణ మణి గ్రీవులకును
గలితమహోగ్ర సంగ్రామంబు చెల్లె;
మలయు నశ్వత్థాను మణిమంతులకును1380
నలరు నుదగ్రజన్యము సంభవించె;
రధిక శేఖరులకు రథికోత్తములకు
ప్రధనమగ్గలముగా బలసె నవ్వేళ ;
కనలి కిన్నరదైత్యగరుడగంధర్వ
ఘనచమూవితతి రాక్షససేన దాఁకి 1385
లలిమీర తిలతండులన్యాయమునను
గలసి భయంకరగతిఁ బోరువునపుడు


అలఘు తేజోమూర్తి యైన భైరవుఁడు
జలజభవాండముల్ జడియ ఘోషించి
నిప్పులు దుమికెడు నిఖిలాంబకములఁ1390
గుప్పించి బలము జక్కులుచేసి డాసి
బలువిడి సేనాధిపతుల ఖండించి
చెలరేఁగి రాక్షసశ్రేష్ఠులఁ ద్రుంచి
మారుతాత్మజునికుమారునిఁ దాఁకి
క్రూరతగండ భేరుండధ్వజంబు:1395
దునుమాడి విలురెండుతునియలు చేసి
యనుపమాటోపుఁడై యరదంబుఁ గూల్చి
తనువెల్ల జర్ఝరితంబు సేయుటయుఁ,
దనుజనాథుఁడు మదోద్దండుఁడై గెరలి
గగనంబు మెరయంగ గాయంబు బెంచి1400
బిగువుచే దిశ లేల్ల భేదిల్ల నార్చి
భైరవుపాదము ల్బంధించిపట్టి
భోరున మిన్నంత పొడవుగా నెత్తి .
గుప్పించి ధరణీపైఁగూలఁగా మోది
యుప్పరం బెగసి మహోగ్రుఁడై మండి 1405


వినువీధి దానవవీరులతోడ
ఘనఘనాకారముల్ గైకొని నిలిచి
పట్టుగాదశదిశాభాగంబునందు
దట్టంపుచీకటుల్ దార్కొన మించి
మినుకైన యడిదంపు మించుట మించి1410
యొనరనార్భటులును నురుములు నురిమి
పురుహూతుపాపంబు; బోలినయట్టి
వరశరాసనము చెల్వమునఁ జేపట్టి
కరకరినావర్త కాలమేఘములు
వరుస కుంభద్రోణవర్షము ల్గాఁగ 1415
గురియుచందంబున ఘోరతరోగ్ర
శరవర్షములు ముంచి చలము రెట్టించి
పిడుగులవానలు బెడిదంపు వారి
యడిదంపువానలు నద్రులవాన
లురుతరభీతి నాయుధములవాన 1420
లరిమురి గురియించి యధికుఁడై మించి
యొకచోట హసియించు నొకచోటఁ గేరు
నొకచెంత గర్జించు నొకట గద్దించునొకక్రేవఁ బలు రొప్పు నొకదిక్కు నార్చు
నొకటెంకి నదలించు నొకపజ్ఞఁ గదుము 1425
పేరుపేరులబిల్చు పేరెముల్బారు
భోరుభోరునదూరు భుజములు సరచు
మసలి వర్తిలు పెక్కుమాయలు పన్ను,
కసివోక మరియు రాక్షసకులేశ్వరుఁడు
బలిమి కిన్నరయక్షప్రమథసైన్యములఁ1430
బొలియించి వెస నొక్క ప్రోవు గావించి
మేటియోధలనెల్ల మేదినిఁగూల్చి
దీటైనరథికులఁ దెంపునఁ జంపి
తక్కిన దొరుల యోధలరథోత్తముల
పెక్కు మార్గణముల భేదించుటయును;1435
కరులేఁగె హయములు గదలె కాల్బలము
పరువెత్తె రధికులు పారిరిదిశల
తరుచుగా నున్న వేదండగాత్రముల
మరుగుల నడఁగిరి మానంతకులము
హయకళేబరముల నటునిటుఁ ద్రోచి1440
రయమున దూరిరి రాహు త్తతతులుసలలితరథచక్రచయముల క్రింద
నళుకుచుఁ జొరబారి రథికయోధలును
బెదరుచుఁ బీనుంగు పెంటలలోన
నొదుగుచు డాగిరి యొగి వీరభటులు 1445

ఘటోత్కచుడు శివునితో యుద్ధంబు సేయుట

అంతట బోక నయ్యసురవల్లభుఁడు
కంతువిద్వేషిపై గమకించుటయును;
కనలి శంభుఁడు పినాకం బెక్కు పెట్టి
వనధు లింకఁగ గుణధ్వనిచేయుటయును;
ఘనరోషచిత్తుఁడై గణనాయకుండు 1450
వినుతప్రతాపుఁడై వీరభద్రుండు
ప్రళయాంతకునిలీల బాహులేయుండు
ఇలమహోద్దండుఁడై భృంగీశ్వరుండు
జగదేకవీరుఁడై చండీశ్వరుండు
నగణితాటోఫుఁడై యర్థనాయకుఁడు 1455
నగభిత్ప్రతాపుఁడై నందికేశ్వరుఁడు
నతులరణాద్యుక్తుఁడై మణీగ్రీవుఁ


డతిబలవిక్రముఁడై మఖమంతుఁ
డాదిగాఁ గలుగు మహాయోధవరులు
మేదురంబుగఁ బన్ని మిన్ను గ్రక్కదల[15]1460
బెట్టార్చుచును నొక పెట్టున నేఁగి
కట్టల్క గగపభాగం బెల్లఁ గప్ప
ననలానిలాదిదివ్యాస్త్రజాలముల
ఘనతపింజాపింజఁ గదియనేయుటయు;
ఆవిధమంతయు నరుదార నపుడు1465

అభిమన్యుఁడు యుద్ధము నందు మూర్ఛిలుట

భావించి గాంచి సౌభద్రుండు గెరలి .
జగములు పదునాల్గు జలదరింపఁగను
గగనంబు నగుల శంఖంబుఁ బూరించి
దారుణసింహనాదంబుఁ బర్వించి
ధీరత వా రేయుదివ్యబాణముల1470
నన్నింటిఁ బొడిచేసి యరదంబు నూకి
యెన్నఁగా భృంగీశు నేడంబకముల


నారూఢి నేనాని నైదుబాణములు
వీరభద్రునిఁ జండవిశిఖత్రయమున
గణనాథు శితసాయకముల నారింట1475
మణిమంతు నెనిమిదిమార్గణంబులను
గినుకతో నలమణిగ్రీవు నాల్గింట
ధననాథసుతుని బద్నాల్గుశస్త్రముల
నరవాహనుని ఘోరనారాచతతుల
నెరి నొవ్వ నేసి సైనికుల ఖండించి1480
యతిరథోత్తముల మహాయోధపరుల
జతురంగబలముల సమయించి మించి
శంభునిపై మహాశక్తి సంధించి
గంభీరముగ నార్చి కనలి యేయుటయు;
ఆమహాసాయక మరుదారఁ గాంచి1485
వామదేవుండు పావకశరంబునను
ఖండించి కులిశమార్గణము సంధించి
చండకోపాటోపసంరంభుఁ డగుచు
నభిమన్యుపై నేయ నరి శతకోటి-
రభసంబుతోడఁ బార్ధతనూజు నురము1490


దాఁకిన ఘనధరాధరముకైవడిని
భీకరంబుగ నార్చి పృథీవిపై వ్రాలె
అభిమన్యుపాటు దా నంతయుఁ జూచి
రథసంబుతో నేఁగి రాక్షసేశ్వరుఁడు
ఉభయసైన్యములెల్ల నొగి బెగ్గడిల్ల1495
త్రిభువనంబులు స్రుక్క దిశలు గంపింప
దారుణంబైన కోదండరాజంబు
జ్యారవం బడరించి శక్తి సంధించి
యనలసాయకమును నద్రి బాణంబు
ననిలశిలీముఖం బమరేంద్రశరము1500
వరుణమార్గణము:ను వనధరాస్త్రంబు
గురునిశాశుగమును కులిశబాణంబు
పన్న గారిశరంబు భాస్కరాశుగము
పన్నగబాణంబు పటురౌద్రశరము
నలిరేగి యొకపరి నారి సంధించి1505
యలిగి కోపించి యాహరున కిట్లనియె
భూతేశ! నీకేల భూరియుద్ధంబు !
నాతో నెదుర్పడ నాదీటు గావుపునుకపాత్రయు బెద్ధవులితోలు కాశ
మినుకులుగలగాలిమేనితలసొమ్ము1510
పూని ధరించిన పురియలపిండు
ఏనుఁగుచర్మము హెయ్యంపుపటము
జడలు మెండుగఁ దాల్చి జడియక రేలు
బడుగు కల్లరికాటి పాపనిలీల
భూతిమై పూసి యాఁబోతునెక్కి1515
జాతిమాలిన వేషభాషలు నేర్చి
దయ్యాలరాజపై తగ కాడు గాచి
యయ్యెడ నుండక ననికి రాఁ దగునె!
పోడిమి ఘనులతోఁ బోరాడుటెల్ల
వేడుక కుడుముల వేట్లాటగాదు1520
పొమ్ము శ్రీకైలాసభూధరంబునకు
నిమ్మహాశరముల నీల్గఁగావలదు;
అని యార్చి యేసిన నతిభీకరముగఁ
జనుశిలీముఖముల శంభుడు గాంచి
ప్రతిబాణముల నని భంజించి వైచి1525
యతులసాయకముల నతని నొప్పించికనలి యంతటఁ బోక కందర్పవైరి
దనుజనాథుని మాయ దలగింతు ననుచు
నలునొంద వాయు బాణంబు సంధించి
వలనొప్ప మంత్రపూర్వకముగా వైచె1530
అది రెండు నాలు గైదారును నగుచుఁ
బదియు నల్వదియు నర్వది నూరు నగుచుఁ
గడు నేఁగి వేలు లక్షలు గోటు లగుచుఁ
దడయకఁ జని యర్బుదంబులు నగుచు
ఘనఖర్వములు మహాఖర్వము లగుచుఁ
జని శంఖములు మహాశంఖము లగుచు
బహుపద్మములు మహాపద్మము లగుచు
మహి ననంతానంత మహిమల నేఁగి
దనుజాధినాథునిఁ దద్బలంబులను
దనరు తేజంబులఁ దాఁకె; తాఁకుటయుఁ
బరువడి సురరాజుపై దండు గదలు
గురుతైన కాటుకకొండలో యనఁగ
తిరమొంద మదనుండు దివిజులమీఁదఁ
బరఫు నీలోత్పల బాణంబు లనఁగగగనతరంగిణీ కంజవాసనల1545
కెగయు నిందిందిరబృందంబు లనఁగ
నమరారిసైన్యంబు లాకాశమునకు
నమరులు భేదిల్ల నవరూఢి నెగసి
పురహరు ఘనరోషమున కోర్వలేక
పరువు లెత్తెడు దేవభామల మెడల1550
సరములు ద్రెవ్వి విచ్చలవిడి దిశల
నెరసి రాలెడు నింద్ర నీలంబు లనఁగ
కడిమి జంఝానిలఘాతంబువలన
పడెడు జంబూఫల పంక్తు లనంగఁ
గొందఱు దనుజులు ఘోరదుర్గములఁ1555
గొందఱు దానవు ల్కూపంబులందుఁ
గొందఱు రాక్షసుల్ గురునదీతతులఁ
గొందఱు రక్కసుల్ కొండలయంద
గొందఱు దీవుల కొందరు దిశలఁ
గొందఱు జలధులఁ గొందఱు చెరుల1560
వాపోవుచును చెట్టువడఁకుచు జెలఁగి
చాపకట్టుగఁ గూలె సకలసైన్యములు
నహికెక్కు నేరయోధవర్యులతోడ
రహిమించు బంధువర్గంబులతోడ
మేరుధీరులు నగు మిత్రులతోడ
భూరిబలాఢ్యులౌ పుత్త్రులతోడ
బిరుదులు పోనాడి భీమనందనుఁడు
గురుతైవరణభూమిఁ దోలె నంతయును
గనుఁగొని కనలి పంకజలోచనుండు
కనులెఱ్ఱచేసి శంఖంబుఁ బూరించి.

ఘటోత్కచుఁడు మూర్చిలుట

బిరుదారిసందోహభీముని భీము
సరసతేజోధనంజయు ధనంజయుని
ప్రాకట బలజగత్ప్రాణుని ద్రోణు
భీకరారాతి విభీష్ముని భీష్ము
తరలని యభిమానధను సుయోధనుని
ధరనగణ్యేభ సైంధవు సైంధవుని[16]రమణ బాహుబలాభిరాముని రాము
కమనీయనతుల పుష్కరుని పుష్కరుని
పరికించి పురికొల్పి పాంచజన్యంబు
తరుచుగాఁ బూరించి తమకించి మించి1580

ధనువున నైదుశస్త్రములు సంధించి
ఘనరోషచిత్తుఁడై గదిసె కృష్ణుండు
నరవాహనుని ఘోరనారాచములను
విరథుని గావించి వివ్వచ్చుఁ డపుడు
గుణరవం బడర నుగ్రునిమీఁదఁ గదిసి 1585

కృష్ణు డొనర్చినయుద్ధము

మణికేతనునిఁ గూల్చి మణిమంతుఁ జంపి
పవమానతనయుండు పశుపతిమీఁదఁ
గవిసి నిష్ఠురతరకాండము ల్జొనిపి
గురుభీష్మ గురుసుత కురురాజముఖ్యు
లురుశరావళిముంచి రగ్రునిమీఁద 1590

భీమార్జునులమీఁద భీమ ప్రతాప
ధాముఁడై సేనాని తలపడి పోరెవెలుచ నుగ్రతగురుభీష్మలమీఁదఁ
బలుచిత్రగతి వీరభద్రుండుపోరె
సాత్యకి ప్రద్యుమ్న సహదేవవరుల1595
నత్యంతబలశక్తి నాగె కుబేరు
డాచార్యతనయతాలాంశులతోఢ
నేచివిఘ్నేశ్వరుం డెగిరి పోరాడె
చలమున పుష్కరపాంబులతోడ
జలదరింపఁ బోరెఁ జండీశ్వరుండు1600
వరుస తక్కిన యోధవరులు యోధులను
బొరిపొరి జయకాంక్ష బోరు నవ్వేళ
అంతట గెరలి రథాంగధరుండు
కంతువిద్వేషిపై గదిసి యుప్పొంగి;
చటుల శిలీముఖసారము ల్నించి1605
పటుతరానిలవహ్ని బాణము ల్దొడిగి
భాసురంబుగ వీరభద్రునిమీఁద
నేసిన నవి దాఁకి యిలఁ గూలె నతఁడు
నారాయణాస్త్రంబు నారి సంధించి
ప్రారూఢమంత్రపూర్వకముగా గుహుని 1610పై నేయ నది మహా ప్రళయప్రచండ
భానువైశ్వానరభాను ప్రకాశ
మగుచు నేతెంచి క్రౌంచారివక్షంబు
పగటున దూరి దెప్పరముగాఁ బడిన
నరుదార నైంద్రాస్త్ర మరిబోసి డాసి1615
పరువడి విఘ్నేశుఁ బడనేయుటయును
ధరణిపై నొరగిన తనయులవంక
పరికించి క్రోధించి పాలలోచనుఁడు
హరిమీఁద ఘోరశరావళి ముంచి
గరుడధ్వజంబుపైఁ గడు కొన్ని బరపి1620
యనలాంబకమునఁ దాలాంకుని నొంచి
యనిలసాయకమున ననిరుద్ధుఁ గూల్చి
ద్రోణుని శక్తిచేఁ దునుమాడి పంచ
బాణుని శరపరంపరల మర్దించి
కలిశ మార్గణమున గురుసుతు నొంచి1625
జలధరాశుగమున సాత్యకి ద్రుంచి
సాంబుని ఘనరౌద్రశరమున నణఁచి
యంబకత్రయమున ననిలజు గెడపిభూధరాశుగమునఁ బుష్కరుఁ దునిమి
యోధావళులనెల్ల నొడిఁ ద్రెళ్లనేసి
గాండీవి నొక్కట గళవళపరచి
పుండరీకాక్షుపై భోగిశరంబు
బరపిన హరిరోషభరితుఁడై మండి
గరుడాంబకంబున ఖండింప దాని
గౌరీశుఁ డధికవేగమున సంధించి
శ్రీరమాధ్యక్షుపై శిఖసాయకంబు
పరువడి జొనిపిన పంకజాక్షుండు
వరుణసాయకమున వారించి కినిసి
కనలుచు ఘనఘనాఘన బాణ మేయ
ననిలశరంబున నవి ద్రుంచివైచి
భవుఁడు మహారౌద్ర బాణంబు వరప
నవలీల నారాయణాస్త్రంబు చేత
నలినేసి సమ్మోహనాస్త్రంబు వేయ
చెలఁగి శంభుఁడు శక్తిచే నది ద్రుంచి
యబ్జాక్షుమీఁద మహశస్త్ర మేయ
నబ్జభవాండము లట్టిట్టు జెదరఁ
జనుదేర శౌరి యాశరము నీక్షించి
వనజాసనాస్త్రంబు వైచి నిల్పుటయు;
గజచర్మధరుఁడు దగ్గర జేర నేఁగి

హరిహరసంవాదము

గజవరదునిమోముఁ గనుఁగొని పలికె1650
సరసిజలోచన! జగములఁ బ్రోవ
ధరణీభారము మాన్పఁ దనర నిర్మింప
నీవు నేనునుదక్క నిఖిలలోకముల
భావింపఁగలరె! యీ ప్రతిభలు వారు
ధననాథ పాండురాట్తనయులవలన1655

మనలోన మనకింత మాత్సర్య మొదవె
జగతి నెవ్వరికైనసరి జంపరాని[17]
పగ గెల్వరా దను పటువాక్యసరణి
నెరయ చింతించిన నిక్కు వంబాయె;
సరిపోర నిది ధర్మసంకట మాయె;జగముల నింకొక సాటున గలదు;
తెగి పూఁటబడినచో దిద్దగావలయు[18]
తగఁదోడుపోయినఁ దచ్చనల్ దగదు
జగడంబులోన వంచన సేయరాదు
నిన్ను నమ్మినవాఁడు నెమ్మి ధర్మజుఁడు
నన్ను నమ్మినవాఁడు నరవాహనుండు
నీవె గెల్తువటంచు నే గెల్తునంచు
భావింపుచున్నారు బవరంబు మాని
వారికి వేడుకల్ పాటుల్ల మనము
పోరి నాయ మెరింగి పోట్లాడవలయు
గరిమతో సాధనకయ్యముల్ సేయ
పరికించువారెల్లఁ ఒక పక నగ రె!
సొలవక నీ నేర్పుఁ జూచెద నేను
కలగక నా నేర్పు గనుఁగొను నీవు
అని కేల కేలికేరాభీలజాల
జనన తేజఃకాండచండస్ఫులింగ


మాలికాలంకార మహితత్రిశృంగ
పాలితఖురాలక పాలమై వెలయు [19]
శూలంబుఁ గైకొని సూటీగాఁ బూని
పోలించి శౌరిపైఁ బూని నిల్చుటయు, 1680
కనకాంబరుఁడు మహా గ్రహమున గెరలి

హరిహరుల సమరము
 
కనలి శంకరుని యగ్గలిక వీక్షించి
తగవు లెంచకు మింక ధర్మంబుగాదు
తెగి మరికొంచించితే కార్యహాని
యని పేర్చి పాంచజన్యంబుఁ బూరించి1685
తనర దక్షిణభుజాదండంబునందు
మధుకైటాభాసురమస్తకకంఠ
రుధిరానులేప నారుణిమసంక్రాంత
బహుతరాజ్యాహుతప్రకటప్రయోగ
సహనహుతాశనజ్వాలికాజాల1690
విలయావసరమధ్య వేలాతివేల
చలిత చరాచర జగదంతరాళ
తంతప్యదుష్ణసంధాన సహస్ర[20]
కాంతిచ్ఛటాంశుప్రకాండప్రచండ
సముదయద్వాదశసంఖ్యావిధాన1695

తిమిరహరాదిత్య దేదీప్యమాన
దశశతపారారథారానుసార[21]
నిశితరథాంగంబు నీటుతోఁ బూని
నలువందపాంచజన్యంబుఁ బూరించి
సొలవక, హరునిపైఁ జూడ్కి నిల్పుటయు; 1700

ఆచక్రవాళపర్యంతవిశ్వంభ
రాచక్రమంతదుర్వారవేగమున
వరుస కుమ్మరసారెవై ఖరి నొరసి[22]
గిరగిర గిరగిర గిరగిర దిరిగె;
పటుతర బ్రహ్మండభాండజాలములు1705
పటపట పటపట పటపటఁ బగిలె ;
తనరారుచున్న పద్నాల్గులోకములు
ఘనభయంబుల హల్లకల్లోలమయ్యె,
పొలుపొందునట్టి యంభోనిధానములు
పెలుచ నీరము లింకి బీటలు వారె!1710
కుతలంబుతో సప్తకులపర్వతములు
గతితప్పి బలుక్రుంగి కానరావయ్యె
ప్రకటించి చీకాకుబడె ఫణిరాజు;
కకలిక లగుచు దిగ్గజములు బెగడె,
సురసమూహంబెల్ల చూడ్కులు మాని 1715
వరువడి వడి పటాపంచగా నేఁగె;
ఆవేళ తల్లడమంది పద్మజఁడు

బ్రహ్మదేవుఁడు హరిహరులకడ కేతెంచుట వారల స్తుతించుట

వావిరి దగదొట్టిపడి దొట్రుకొనుచుఁ
గ్రక్కున హంసతురంగరాజంబు


నెక్కి యక్కజముగా నిలకు నేతెంచి1720
మచ్చరంబున నున్న మాధవహరుల
విచ్చలవిడి మది వెరగంది చూచి
యిరుపురనడుమ దా నెంతయు దుమికి
శరణంబు శరణంబు శరణం బటంచు
నటు మళ్లి యిటు మళ్ళీ యటు నిటు మరలి 1725
పటుభయభక్తితోఁ బ్రణమిల్లి లేచి
నయమొందఁగా హస్తనలినము ల్మొగిచి
జయజయ కమలాక శరశిలాటాంక [23]
జయజయ సితగాత్ర సత్యచారిత్ర
జయజయ గోరాజ సన్నుతతేజ 1730
జయ దైత్యశిక్షపుష్కరహితాబ్జాక్ష
జయజయ గోత్రాత్మజామనోరమణ
జయరాజశేఖర సల్లలితోదార
జయజయ వరఖగజానేయజనక[24]


అని యిట్లు మురహరపూరుల నెంతయును 1735
వినుతించి భారతీవిభుఁ డిట్లు పలికె
విలసిల్లు వేదాంత వేద్యులు మీరు
పుట్టింపఁ గిట్టింపఁ బోషింప మీరు
పొలుపొంద కర్తలు భోక్తలు మీరు
పట్టుఁ గొమ్మలు మీరె ప్రభువులు మీరె 1740
నూతనలీలావినోదులు మీరె
యీ తెఱంగునఁ గలహింపధర్మంబె
సకలజీవులు మీకు సరిగావె తలఁప
ప్రకటింప హితులేరి? పగవార లేరి
తెరలలో బ్రతిమల తెరఁగున జనుల,1745
నొరపుగా నాడించుచున్నారు మీరు
యమసుతుఁ డెవడు? యక్షాధీశుఁ డెవఁడు?
సమమె మీరిర్వురు జగదీశులార
బాలుఁడ నొకవిన్నపము సేతు వినుఁడు;
మీలోన మీకేల మేటికార్యంబు1750
భువి నావులావులును బోట్లాడి కెరలి
కవిసిన లేగలకాళ్లెల్ల విరుగుమీకేమి పనిలేదు మిగిలినయట్టి
లోకముల్ హల్లకల్లోలములో గావె,
కోపము ల్వారించి కూర్మి పాటించి
చేపట్టి మమ్ము రక్షింపఁగావలయు,
నని దైన్యరసమున నడలుచుఁ బలుకు
వనజాసనుని గాంచి వరదయానిధులు

యుద్ధము మానుట

తగవిచారించి మాత్సర్యముల్ డించి
యొగి మహాయుధముల నుపసంహరించి
గజరాజవరడుండు గజచర్మధరుఁడు
గజిబిజి చాలించి ఘనత నేతెంచి
యెలతోడ విరించి యెడదయ లుంచి
యలుకు వారించి చయ్యన గారవించి
యిరువురు నొకపరి యిరవందఁ జేరి
కరము రంజిల్ల గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి
యొకటియై మువ్వురు నుండి యాలోన
మకరాంకవైరితో మాధవుం డనియె


అనఘాత్మ నీవు నే ననుభేద మేమి
మనవినోద విలాసమహిమలుగాక1770
నెనయ వేరొండులే దెన్నటికైన
చేసిన కార్యంబులు చనఁ గని మ్మింక
ధననాథునకుఁ బాండుతనయుల కివుడు
కనకాబ్జములనుంచి గలిగె కయ్యంబు
గరిమ రెండును రెండుకన్నులు మీకు 1775

మరి వలపక్ష మేమాత్రము లేదు
వారల వీరల వైరముల్ మాన్చి
గారాపు వియ్యంబు గల్పింపవలయు;
ననీ పాండవాగ్రణి నర్ధనాయకుని

హరిహరులు ధర్మయక్షనాథులకు సఖ్యమును జేయించుట

జనువునఁ బిల్చె నాచక్రాయుధుండు1780
పిలిచినంతనె ప్రియసంభ్రమములు
దళుకొత్త శ్రీదుండు ధర్మనందనుఁడు
క్రమమున నేతెంచి ఘనభయభక్తి
రమణ హరిహర హిరణ్యగర్భులకువినయమార్గంబుల వేర్వేర మ్రొక్కి
వినుతులు గావించి వెస నిల్చుటయును;
వేడుక మువ్వుడు వీరశేఖరుల
పోడిమి దీవించి పొసగ లాలించి
గారవంబున వారికలక వారించి
గారాపు వియ్యంబు గల్పించి చెలఁగి
హరుఁడు ధర్మజువదవాబ్జంబుఁ జూచి
కరుణారసము చిల్కఁగా నిట్టు లనియె
పాండవాగ్రణి నీద భాగ్యంబు ధరణి[25]
మండలాధిపతుల కీమహిమలుగలవె !
తనయులు చండప్రతాపవిక్రములు
ననుజులజేయు లగణ్యసాహసులు
నలఘు ధీరోదారు లరిభయంకరులు
బలశౌర్యవిభవులు బాంధవాశ్రితులు
వెలయంగ హయ్యంగవీనాపహరుఁడు
చెలికాఁడు చుట్టంబు చేరిక మరఁదిదైవంబు భృత్యంబు దాతయై మెలఁగ;[26]
నీవు చేసినపుణ్య మెన్న శక్యంబె!
నీశాంతగరిమంబు నీసత్యమహిమ
నీశౌర్యవిస్ఫూర్తి నీధర్మ గుణము
నెరయ నీతాలిమి నీ నేర్పునోర్పు
వరుసనార్గురుచక్రవర్తులం దైన
నమర చూడము విన్న యదిలేదురాజ !
మెచ్చె కృష్ణుఁడు నిన్ను మెచ్చితి నేను
యిచ్చకువచ్చిన యేవరంబైన
నడుగు మిచ్చెద నన హరునకు మ్రొక్కి
తడయక నాధర్తతనయుఁ డి ట్లనియె;

ధర్మజువరము

పార్వతీవల్లభ భవరోగవైద్య
శర్వ మహాదేవ శంకర భర్గ
భూతనాయక ఫణిభూషణ సర్వ
భూతదయాపర భువనప్రతాప
జలజనాభుఁడు మీరు సద్వినోదములఁ
 


బొలుపొంద సూత్రంపుబొమ్మలలీల
నాడింప మాడెద మంతియ కాని
పోడిమి మాకింత బుద్ధులు గలవె
పరమమునీంద్రులు భక్తసంఘములు1820
వరదేవకోటులు వర్ణింపలేరు ;
పరఁగ మీ మువ్వురిపాదపద్మములు
వరుస గాంచుటకంటె వరములు గలవె;
యాపద దొలఁగె సౌఖ్యము లబ్బె సకల
పాపముల్బారె సంపదలు చేకూరె1825
నన్నియు ఫలియెంచె నైనగిరీశ
చెన్నొంద మీర లిచ్చినవరం బేను
వెరువక వేడెద వినుము మాకొరకు
నరవాహుపైని పంతములతో వచ్చి
కవనిలోఁ జీకాకుగాఁ బడియున్న1830
బలములనెల్ల నెప్పటి విధంబునను
గలఁగక దొలఁగక కసిగందనీక
నలరంగ బ్రతికింపుఁ డదియె నావరము
అన విని మోదించి యతనివేడుటకు
యుద్ధమున జచ్చినవారు మఱల బ్రదుకుట

మనమున హర్షించి మాధవహరులు 1835
అరుదైనకరుణాకటాక్షమాధుర్య
వరసుధాసారము ల్వర్షించుటయును
వరుసతుత్తుమురులై వ్రాలినయట్టి
నరయక్ష దనుజకిన్నరముఖ్యబలము
లనువందఁగా గోమలాకారు లగుచు1840

మునుపటికంటెను ముదమునఁ బొదలి
ఘనమైన నిద్ర మేల్కనిన చందముల
నెలయు వేడుకలవాహినులెల్ల లేచి
వెలయు వైభవముల వితతవైఖరుల
నలువందు బంధురానందులై రపుడు;1845

సురలు వర్షించిరి సూనవర్షములు
దురుసుగా దేవదుందుభులు ఘోర్నిల్లె
ఘనముగా గంధర్వగాణము ల్బరఁగె
విననయ్యె తుంబురువీణారవములు
నమితమై తగె నారదాదులనుతులు1850నమరె రంభాదినాట్య ప్రసంగములు
నలినలోచనుఁడు పన్నగకంకణుండు
జలజాసనుండును సంతుష్టులైరి
అప్పుడు ధననాథు నాననాంబుజము
తప్పక చూచి కందర్పారి పలికె 1855

శివుఁడు కుబేరునితో సౌగంధికములను బాండవుల కిమ్మనిచెప్పుట

ధవనాథ వింటివె ద్రౌపదీరమణి,
కనకాబ్జములు గోరి కాంక్షించె నిపుడు
వనజాతములనుంచి వారికి మీకు
ఘనతరం బైనసంగరము వాటిల్లె
పాండునందనులు మాభక్తశేఖరులు1860

పుండరీకాక్షునిఁ బొందినవారు
మనము సేయనిబహుమానము ల్పాండు
తనయుల కెవ్వరు దగఁజేయఁగలరు
వనితాలలామకు వలసినయన్ని
గొనివచ్చి దామముల్ గూర్చి యర్పించు 1865


వహికెక్కుభూషణావళులమన్నించు
బహుచిత్ర కాంచనాంబరము లిప్పించు
కినుక చాలించి మిక్కిలి గౌరవించు
మనవంద సెలవిచ్చి యనుపు మన్నంత
హరునివాక్యములకు నంగీకరించి 1870
నరవాహనుండు నానందంబునొంది.

కుబేరుఁడు సౌగంధికములఁ దెచ్చి యిచ్చుట

ఘనతరసౌగంధికప్రసూనములు
వినుతభూషణములు విమలాంబరములు
తరుచైన దివ్యగంధంబులు, మరియు
తిరమొంద వేవేగఁ దెప్పించి యపుడె1875

చనువున బిలిచి యజాతశత్రువునకు
ననిలనందనున కర్జునునకు నకుల
సహదేవులకును బాంచాలపుత్త్రికిని
రహిమీరఁ జెలఁగి యలంకరించుటయు
హరిహరు ల్పూర్ణాంచితానందులైరి. 1880


హరిహరుల సంతోషము

అరుదంది యుభయసైన్యంబు లుప్పొంగె
ధనపతి యాపురంద తనూభవుని
గనుగొని యనురక్తి గౌఁగిటఁ జేర్చి
క్ష్మాతలాధిప! హరిశ్చంద్రాదిసర్వ
భూతలాధిపులందు బురుహూతముఖ్య 1885
దివిజనాథులయందు దిక్పతులందు
వివరింప నీసాటివీరులు గలరె
మును నిన్నుఁ జెప్ప సొంపున విందు నేఁడు
గనుఁగొనఁగలిగె కన్గవ చల్లనాయె ;
పరశురాముఁడు నీకు ప్రతి యనవచ్చు1890
శరలాఘవ ప్రౌఢిసంధానగరిమ ;
నిటలాగ్ని నయనుఁడు నీదీటువచ్చు
చటులబాహాటోపసాహసప్రతిభ,
జలజనాభుడు నీకు సరివచ్చు సమర
తలమున చిత్రయుద్ధంబులు నెరప;1895
విపులపైఁగలధరావిభు లెవ్వరైన


నృపచంద్ర నినుఁ జూచి నేర్చుకోగలరె
నిజబల్మి యున్నది నీరజాక్షుండు
విజయనీకాప్తుడై వెలయుచు నుండ
యాలంబులోన బాహశక్తిఁ జూప1900
నీలోకములను నీకెదు రెవరయ్య
యనుచు మెచ్చుచు బునరాలింగనంబు
లొనరించి తగువేడ్క సున్నంతలోన;

బ్రహ్మసత్యలోకమునకుఁ బోవుట

ఆవేళ పద్మజుం డధికమోదమున
భావజజనకుని బార్వతీధవుని1905
కడకతో సన్నుతు ల్గావించి మ్రొక్కి
తడయక పాండునందనుల దీవించి
యరుదైన హంసవాహనముపై నెక్కి
కరమర్ధి సత్యలోకంబున కరిగె

కుబేరుఁ డలకాపురమునకుఁ బోవుట

శంకరునకు నమస్కారంబుఁ జేసి1910
పంకజాక్షున కట ప్రణమిల్లి పొగడినలువంద పాండునందనుల దీవించి
పొలుపొంద పాంచాలపుత్త్రి దీవించి
చెలువంబుతో సర్వ సేనల గూడి
యలకాపురంబున కరిగె శ్రీదుండు
ప్రేమతో ధర్మజభీమార్జునులను
వేమరు కృప గారవించి దీవించి
యదువంశభూషణుం డనుప నత్యంత

శివుఁడు కైలాసమునకుఁబోవుట

ముదమున గైలాసమున కేఁగె హరుఁడు

దుర్యోధనుఁడు కరిపురంబునకుఁబోవుట

తలఁప ధర్మజునకు దండంబుపెట్టి
వలనొప్ప శౌరికి వలనొప్ప మ్రొక్కి
యరుదార సకలసైన్యసమేతుఁ డగుచుఁ
గరిపురంబునకును గదలె రారాజు,

కృష్ణుఁడు ద్వారక కేఁగుట

ధర్మ సూనునకు వందన మాచరించి
యర్మిలి భీమార్జునాదుల నెల్లబరఁగ దీవించి ద్రౌపది నాదరించి
సరసోక్తులను నుపచారముల్ చేసి
యెలమి ఘటోత్కచు నెసగ లాలించి
యలరి వారలనుతు లంగీకరించి
యదువాహినులతోడ సజ్జలోచనుఁడు 1930
పొదలుచు ద్వారకాపురమున కరిగె;

ఘటోత్కచుఁడు వెడలుట

ఎలమితోజనకుల కెల్లను మ్రొక్కి
పొలుపొంద బాంచాలపుత్త్రికి మ్రొక్కి
రాజిల్లు మౌనివిప్రకులంబునకును
దేజంబుతో మ్రొక్కి దీవనలంది1935
జనకుల యనుమతి సైన్యంబుతోడఁ
దన నివాసముఁజేరె దా నవేశ్వరుఁడు

తర్వాతి భారతకధ

ధరమహొన్నతులైన తమ్ములతోడ
పరమసాధ్వీమణి పాంచాలితోడ
వలనొప్ప బాంధవవర్గంటుతోడ1940నలరుచు నున్న ధౌమ్యాదులతోడ
పోడిమి నావనభూమి కొన్నాళ్లు
వేడుకల్ మీరంగ విహరింపుచుండి
కడుద్వాదశాబ్దము ల్గడచిసపిదప
తడయక ననుజులు ద్రౌపది తాను

వెలయంగ నొకయేడు విరటునియొద్ద
కొలువుండి తర్వాత గురుతులు తెలిపి
యలరుచు నుత్తర కభిమన్యునకును
జెలగి వివాహంబు చేయించి వేగ
నిరటుండు ద్రుపదభూవిభుఁ డాదియైన

నరవరులరు దేర నలినలోచనుఁడు
ఘనతసహాయుఁడై గరిమతో నడువ
జని కురురాజుపై చల మగ్గలించి
మునుకొని సుముహూర్తమున సేనతోడ
మొనసి కురుక్షేత్రమున దండు విడిపి

పెలుసంగరమున భీష్ముఁ జెండాడి
నలవడ కలనిలో నాచార్యుఁ దునిమి


కరకరి బోరిలోఁ గర్ణునిఁ జంపి
సరభసం బగు నని శల్యునిఁ గూల్చి
కలఁగక నొంటరి కయ్యంబునందు1960
తలపడి యురగకేతనుని ఖండించి
యురవడి తక్కిన యోధలనెల్ల
వరుసతో ఘోరావహమున మర్దించి
పరువడి యంచుండి పాండునందనులు
సరసిజాక్షుని కటాక్షంబునఁ జెలఁగి1965
సకలభాగ్యంబులు సకలసంపదలు
సకలసౌఖ్యంబులు సకలవైఖరులు
ప్రకటించి సకలభూభాగమంతయును
బలువిడి సకలభూపాలకు ల్గొలువ
నెలమి మహోన్నతి నేలుచు నుండె
ఈమహాచరితంబు హితసంభ్రమముల
వేనురు చదివిన వినిన వ్రాసినను
ప్రేమ లిఖించిన ....తలమున
నామహామహులకు నాయురారోగ్య
బహుపుత్త్రపౌత్త్రసౌభాగ్యసంపదలు


మహనీయభూషణాంబరవస్తుతతులు
కరితురంగాందోళికానికాయములు
కరిరాజవరదుండు కరుణతో నొసఁగు
అని జనమేజయక్ష్మానాథమణికి
జననుతుండైనవైశంపాయనుండు
వినిపించె పాండవవిజయకావ్యంబు
తనరు వేడుకలవిస్తారంబుఁగాఁగ
నెన్నాళ్లు రవిచంద్రు లెన్నాళ్లు తార
లెన్నాళ్లు గగనోర్వు లెన్నాళ్లు జగము
లెనాళ్లు కులగిరు లెన్నాళ్లు జలధు
లెన్నాళ్లు వేదంబు లెన్నాళ్లు ధర్మ
మెన్నాళ్లు హరిచర్య లెసఁగుచునుండు
నన్నాళ్లు సకలరాజాస్థానములను
సకలవిద్వజ్జనసమ్మతం బగుచు1990
నకలంకలీలల నలరుచు నుండు
అని యిట్లు కురుకరూశాంగకాశ్మీర
జననాథకీర్తిత సత్కీర్తి పేర


కరహాటకర్ణాటగౌళనేపాళ[27]
ధరణీశ వినుతప్రతాపుని పేర1995
వహి కెక్క నశ్వరేవంతుని పేర
మహనీయచిత్ర హేమధ్వజు పేర
సరసారుణోజ్వలచ్ఛత్రుని పేర[28]
గురుతర వెల్లుట్లగోత్రుని పేర
నరపతి దత్తనానారత్నభూష2000
కరితురంగశతాంగఘనభాగ్యుపేర[29]
సింధురాజార్పితసింధురఛత్ర
సైంధవ బంధురస్యందనుపేర
సౌరాష్ట్రనృపదత్త సలలితరత్న
హారునిపేర దీనావనుపేర[30]2005
రణవీరఘంటానిరాతంకమల్ల[31]
ప్రణుతసింహతరాట పరబలభీమ
నిత్యాభిరామ నిర్నిద్రప్రతాప
సత్యహరిశ్చంద్ర సంగడిరక్ష .
పాలకగాయగోవాళహంవీర[32]
కేళాదిరాయ సత్కీర్తికలాప
చలమర్తి వరగండ జగనొబ్బగండ
కలితాదవనిదుర్గగర్వవిభాళ
హత్తుమువ్వరగండ హర్యక్షశౌర్య
మత్తారి మదభంగ మదనావతార
కనక వసంతాంక గగ్గోలురాయ[33]
ఘనతరప్రజ మెచ్చు గండారిఘోర
బిరుదాంకుపేర గంభీరాబ్ధిపేర[34]వరభోగనిర్జితవాసవుపేర[35]
రావిళ్ల కొండభూరమణుని లింగ2020
భూవరాగ్రణిపేర బుధులౌ సనంగ
నంకితంబుగ వెంకటాద్రీశుపాద
పంకజద్వంద్వసేవావిహారుండు
రత్నాకరాన్వయరాజితక్షీర
రత్నాకరక్షపారమణీధవుండు2025
గురుభరద్వాజసద్గోత్ర పావనుఁడు
ధరకొండ ఘనుకృష్ణధన్యునిసుతుఁడు[36]
సరసుఁడు గోపాలసత్కవీంద్రుండు
గరిమ నొనర్చు సౌగంధిక ప్రసవ
హరణకావ్యమునందు యక్ష నాయకుఁడు 2030
(గరిమ)సైన్యములతో గదలివచ్చుటయు[37]
వచ్చుట గని పాండువరతనూభవుఁడు


చెచ్చెర నొకసంధి సేయఁబూనుటయు
గాండీవి దాని విఘ్నంబుసేయుటయు
మండలాధిపునితో మక్కువసేయ 2035
ధనపతి తలఁచుట తత్తనూజుండు
వినకయుండుట బలు నిడికయ్య మగుట
తగక్రీడి చిత్రయుద్ధంబుసేయుటయు
నిగుడి శివుండు గాండీవిమార్కొనుట
వేరైనయోధులు బెనఁగిపోరుటయు 2040
నారూఢి హనుమంతు డర్థనాయకుని
కినియుట బరికించి క్రీడి నిల్పుటయు
నని బహుళం బౌట యది విని హరుఁడు
యక్షాధిపతికి సహాయంబు సనుట
వీక్షించి కురుకులవిభుఁడు చింతిలుట2045
సురనదీతనయుండు జోళ్ళేర్పరించి
గరిమధర్మతనూజు కలఁకదీర్చుటయు
హరిపాండవులకు సహాయంబు జనుట


ధరణీశ్వరుండు మోదంబు నొందుటయు
హరి శంకరునిమీఁద ననిసేయ సనుట2050
కురుసైనికులు యక్షకోటిపై సనుట
భైరవునకు హిడింబానందసునకు
బోరగ్గలం బౌట పోరి భైరవుని
సురవైరిఁ గూల్చుట చూచి రుద్రుండు
నరసుత భీమనందనులద్రుంచుటయు2055
హరి శంభుపుత్త్రుల నని నొంచుటయును
హరితనూజులశంభు డట్ల సేయుటయు
హరిహరులకు యుద్ధ మధికంబు నగుట
హరుఁడు మహాశూల మంకించుటయును
గరిమతో హరిరథాంగంబుఁ బూనుటయు 2060
అయ్యెడ కబ్జజుం డరుగుదెంచుటయు
చయ్యన నిరువుర సన్నుతించుటయు
కలహంబు మానుట కలనిలోఁ బడిన
బలములనెల్లను బ్రతికించుటయునుహరిహరుల్ ధర్మజయక్షనాథులకు2065
గరిమ మీరంగ సఖ్యంబు సేయుటయు
హరిహరులును సహాయము వచ్చువారు
సఁరగున నిజనివాసముల కేఁగుటయు
తమమేర చెల్లించి తగపాండుసుతులు
విమతులవధియించి వేడ్క నుండుటయు 2070
క్రమముస నది యాదిగాఁగల్గుకథల
నమరుచు నిది కృతీయాశ్వాసమయ్యె
భూరి సౌగంధికపుష్పాపహరణ
చారిత్ర మిది కథాసంపూర్ణమయ్యె
వెలయ నీపాండవవిజయకావ్యంబు 2075
సలలితహృదయులై సద్భక్తిగరిమ
నలరుచు బూజించి యానందమునను
చెలువంబుగలవారిచేఁ జదివించి
చదివినవారల చనవులఁ బ్రోచి
సదమలమతి కథాసావధానముల2080

 


విన్నవారల కెల్ల విభవసంపదలు
సన్నుతవస్తుభూషణములు గలుగు
నెల మూఁడువానలు నెలకొని కురియు
బలుసస్యసంఘము ల్ఫలియించు నెపుడు
సురుచిరకళ్యాణశోభనంబులను.
థరణీజనము లెల్లఁ దనరుచుండుదురు. 2085

 1. 1 a. నెదురుగావచ్చు దేవేంద్ర పుష్పకము (త )
    b. నేదురుగా వచ్చు సురేంద్ర పుష్పకము (ట)
 2. ననుపల్కు విని విననట్లును జెదరి (త)
 3. వెన్నుగాయంబుల వెలయింతు నిన్ను (త)
 4. నకులుండు నడచె మానవనాథుతోడ (ట)
 5. శౌర్యంబు లుప్పొంగి జనిరి వెంబడిగ (ట)
 6. a.సొలవక నిరుకులో సోకు మంత్రంబు (త )
    b.సొలవక నిలుకులో సోకు మంత్రంబు
 7. బెగడి కూర్మమువెన్ను బీటలు వార (త )
 8. సాటి యీడును జోడు గరిలేనియట్టి
  నేటివీరుఁడు హిడింబీ నందనుండు (త)
 9. పరికింప నెందుకుఁ పనికిరానట్టి
  పిరికివాఁడల హిడింబీనందనుండు (త )
 10. యానుక వేట్లాడు టది నీతి యగునే (త).
 11. రాజీవనాభ యాశ్రితభక్తి నిపుడు(ట )
 12. పరవసేయక నన్ను పాటించి చూడు(ట).
 13. మీయయ్యలోననే మెలఁగినవాఁడ
  పాయని యన్యోన్య బాంధవద్వేష
  లైయున్న కుముదకంజాప్తుల మెపుడు
  గడురెండు రెండును గన్నులుగాఁగ
  నెడపక వీక్షించి నేకంబుసేతు
  తగ నిన్న నేటి బాంధవ్యంబె మనకు (త)
 14. కరకరి మేనెల్ల గదియ నేయుటయు, (ట)
 15. మేదురంబుగ ధాత్రి మిన్నుగ్రక్కదల (ట).
 16. a. ధరనగణ్యభప సైంధవు సైంధవుని (ట)
  b. ధరనగణ్య భజనధవుని సైంధవుని (ట)
 17. a. జగతి నెవ్వరికైన సాధింపరాని (ట)
  b. జగతి నెవ్వరికైన సరి చెప్పరాని (త)'
 18. తెగి పూఁటబడినచో దీర్ఛగావలయు (2421)
 19. a. పాలికకాలవ పాలమై వెలయు (ట)
  b. ఫాలికాశారాలఫాలమై వెలయు (శ),
 20. తంతప్తమానసంధాన సహస్ర (త)
 21. a . దశశతసారసంధానానుసార (ట)
  b. దశశతసారాంధధారానుసార (త)
 22. వరుసకుమ్మరసారెవైఖరి దిరిగె (త)
 23. a. జయజయకమలాంక శశిలలాటాంక (త)
  b. జయజయకమలాంకశరశిలాటంక.
 24. జయజయ భర్గ గజాననజనక (త )
 25. పాండవాగ్రణి నీవు భరితపుణ్యుఁడవు (త)
 26. దైవంబు భృత్యుండు దాతయై మెలఁగ (ట; త)
 27. కరహాటపరిహాటగౌళ చేపాళ (త )
 28. a. సరసారుణోజ్వలచంద్రుని పేర (త )
     b. సరసారుఁణోజ్వలచల్వుని పేర (ట)
 29. కరితురగశతాంగగణభాగ్యుపేర (త)
 30. a. హారుని నవవేగినాయను పేర (ట)
     b. హారుని వరవేగినాయునిపేర (చ)
 31. రణవీరఘంటానిరాటంకమల్ల (త)
 32. a. పాలక రాజగోపాల హంవీర (ట)
     b. పాయక గాయగోపాల హంవీర (త)
 33. కనక వసంతాఖ్య గగ్గోలురాయ (త )
 34. బిరుదాంకుపేర గంభీరుని పేర (డ)
 35. పరభోగనిర్జరవాసవు పేర (త)
 36. ధరకొండ ఘనకృష్ణధన్యునిసుతుఁడు (ట, త)
 37. కవిబుధుల్ మెచ్చఁగా కారణమగుచు.