సూచిక చర్చ:బేతాళపంచవింశతి.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

బేతాళపంచవింశతి

రచనను బట్టి చూడగా నిది పదునాల్గవశతాబ్దికింకను పూర్వపుది గాదనిపించును. లక్షణగ్రంథకర్తలు దీనిని కవి భల్లటుఁడు రచించినదానినిగా నుదాహరించినారు. ఇది కథాసరిత్సాగరభాగమయి యండును. ఏల ననగా నీ గ్రంథము సమగ్రముగా దొరికినను గ్రంథకర్తపేరుగాని, ఆశ్వాసవిభాగముగాని యందు గానరాదు. దీని ప్రతి తప్పులతో, గ్రంథపాతములతో దొరతనమువారి లైబ్రరీలో నున్నది. ఓలేటి వేంకటరామశాస్త్రిగారి కథాసరిత్సాగరాంధ్రీకరణమున నీకథ లున్నవి. ఎఱ్ఱన నీతికథావిధానమునను నీకథ లున్నవి. మఱి యింకొక బేతాళపంచవింశతిరచనము తంజావూరిలైబ్రరీలో నున్నది. ఆంధ్రశబ్దచింతామణి, ఆంధ్రకౌముది, అప్పకవీయం – యీ మూఁడిటిలోనూ కవి భల్లటుని ప్రసక్తి కానవస్తుంది. ఇతఁడొక ప్రాచీనవ్యాకరణకర్త.