సిగ్గూ పూబంతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి


విరజాజి పూలబంతి అరసేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి
ఏసినాది కులుకుల మొలికి


సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న
చిలకమ్మ కొనసూపు సవురు బొండుమల్లి చెండుజోరు
ఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు
మెరిసే నల్లమబ్బైనాది
మెరిసే నల్లమబ్బైనాది వలపు జల్లు వరదైనాది