Jump to content

సాయిబాబా పాటలు

వికీసోర్స్ నుండి

పాట 1: మా పాలిట నువ్వే దైవము

[మార్చు]
మా పాలిట నువ్వే దైవము
మా అందరికీ నువు ప్రాణము
ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం || ఓం||
మా కష్టాలన్నీ తీర్చావయ్యా
మా కన్నీళ్ళను నువు తుడిచావయ్యా || ఓం||
మా తప్పులు అన్నీ ఒప్పులు చేసి
క్షమా భిక్ష మాకు పెట్టవయ్యా || ఓం||
మా పాపాలన్నీ భిక్షగా మార్చి
నువు భిక్షాపాత్ర తో స్వీకరించి
యుక్తిని పెంచి భక్తిని పంచి
ముక్తి మార్గాన్ని ప్రసాదించావు || ఓం||


పాట 2: దయ చూడు తండ్రి మమ్ము

[మార్చు]
దయ చూడు తండ్రి మమ్ము, దీన బాంధవా సాయీ!
కరుణించి కాపాడే కరుణామయి సాయి!
పరీక్షించ కోయి సాయీ! పరిష్కార మీయ వోయీ!
ఏమి తప్పు చేసినామో, శిక్షింప బడుతున్నాము!
సదా నీ నామాన్నే స్మరించేము సాయి
సాదరం తో మమ్ము సేద దీర్చ వోయీ! ॥ దయ చూడు ॥
అపహాస్యం చేసినారు, అవమానం పొందినాము
అపఖ్యాతి పాలై మేము అలసిపోయి వున్నాము!
చల్లని మా తండ్రివనీ, చేతులెత్తి ప్రార్ధించేము
మా వేదనలన్నీ తీర్చి దీవించగ రావయ్యా!
భవ బంధాలన్నీ పారద్రోల రావయ్యా
ముక్తి మార్గమే మాకు ప్రసాదించ వేమయ్యా ॥ దయ చూడు ॥

పాట 3: బాబా నా బ్రతుకు పుష్పన్ని

[మార్చు]
బాబా నా బ్రతుకు పుష్పన్ని
ఎందుకు వికసింప చేశావో
వేదనల రోదనలలో
వాడి వడలి పోక ముందే
కష్టాల కడలి లో కన్నీటి సుడిగుండాలలో
నా రెక్కలు కకావికలం కాకముందే
నన్ను నీ పవిత్ర పాదాల చెంత
పదిలంగా సమర్పించుకోనీ ప్రభూ
నయనాల భాష్పాలు జాలువారే వేళ
నాకు నీ దర్శన భాగ్యమ్ము ఏలకల్గునో ప్రభూ
కనుల కొలనులో కనుదోయి దోసిలి చేసి
నీకు అర్ఘ్యమిడనే ప్రభూ
నాలోని చందన పుప్పొడులతో
నీకు అభిషేకం చేసి
నాలోని మకరందాల మధురిమలనే
నీకు నైవేద్యంగా సమర్పించీ
నన్ను నీ పవిత్ర పాదాల చెంత
పదిలంగా సమర్పించుకోనీ ప్రభూ

పాట :4 సాయి రాగసుధను నేను

[మార్చు]
సాయి రాగసుధను నేను
సాయి గానామృతసారన్ని నేను

సాయి రాగసుధను నేను


సాయి కనులలో కురిసే
అమృత వర్షిణి నేను
సాయి గళములో విరిసే
జ్ఞానవాహిని నేను


సాయి దివ్య స్పర్శలో
అనుభూతిని నేను
సాయి దయా హృదయమ లో
ఆశీస్సును నేను


సాయి పదకమలం లో
త్రివేణి సంగమం నేను
సాయి రాగసుధను నేను
సాయి గానమృతసారాన్ని నేను
సాయి రాగసుధను నేను


పాట :5 భక్తితో నీకు పూజలు చేయలేదు

[మార్చు]


భక్తితో నీకు పూజలు చేయలేదు
భక్తితో క్షీరసుమసుగంధాభిషేకాలు చేయలేదు
భక్తితో పట్టుసేలములు సమర్పించలేదు
భక్తితో ధూప దీప సాంబ్రాణి హారతులు యివ్వలేదు
భక్తితో తులసి మాలలు అల్లలేదు
భక్తితో నీ గీతాలు ఆలపించగ లేదు
భక్తితో పంచభక్ష్యాలు నైవేద్యమిడలేదు
భక్తితో పట్టుపానుపుల్ పరవగాలేదు
భక్తితో వింజామరలు వీ చలేదు
భక్తితో నీ పాదసేవలు చేయలేదు
కడుభక్తితో సమర్పిస్తున్నాను
ఈ చిన్ని ప్రాణాన్ని నీ సేవకే ప్రభూ !



పాట 28 : సద్గురువును తెలుసుకునుట మన కర్తవ్యం

[మార్చు]
సద్గురువును తెలుసుకునుట మన కర్తవ్యం
అలా తెలుసుకున్నపుడే మనిషి జన్మ ధన్యం
ఆత్మజ్ఞానానికి ధ్యానమెంతో అవసరం
ఆ ధ్యానంతోనే మనస్సు నిశ్చలం సుస్థిరం
అహర్నిశలు సద్గురువును మనస్సు నందు నిలపటం
మన జీవితాలకిచ్చును అది అర్ధం పరమార్ధం ||సద్గురువును ||
నువ్వు నేను వేరను భావం విడువు
అనన్యమయిన భక్తితో సద్గురువును కొలువు
తననాశ్రయించిన భక్తులకు కల్పవృక్షమై
మధురమయిన ఆధ్యాత్మిక ఫలమిచ్చును సద్గురువు ||సద్గురువును ||


అజ్ఞానపు చీకటులను తొలగించుటకై
జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకై
ఈ భువిలో జన్మించెను ఒక దివ్య తేజము
అది షిరిడీ లొ వెలిసిన సాయి రూపము ||సద్గురువును ||


పాట 29: మరువకు ఓ మాలి నను విడువకు ఓ మాలీ

[మార్చు]
మరువకు ఓ మాలి నను విడువకు ఓ మాలీ !
సాయి చెంత నన్ను చేర్చు నా ప్రార్ధన మన్నించు
ప్రతి ఉదయం నా చెంతకు అరుదెంచే మాలీ
నీ సాయి స్మరణ విని నిత్యం పులకించేనోయి
పూల సజ్జ చేతబట్టి పూజకు పుష్పాలు కోసి
సాయి పాట మధురంగా నువు పాడుతువుంటే
అది విన్నంతనె కొమ్మ రెమ్మ చిగురించెనోయి
అది కన్నంతనే నా జన్మ ధన్యమాయెనోయి ||మరువకు ||
కొమ్మనై ఎండిన మోడునై
సాయి స్మరణ వినినంతనే చిగురించిన రెమ్మనై
మొగ్గనై అరవిరిసిన పూవునై
సాయి సేవలో చరితార్ధినై
సాయి పాదాలపైన వ్రల వెచితిని మాలీ
సాయి పాదాలపైన వ్రాలవేచితిని మాలీ ||మరువకు ||
ఏ విసురు గాలికో ఏ కొమ్మ రాపిడికొ
రాలి పోదునేమోనని తల్లడిల్లేనోయి
పూలరెమ్మ వంచి నీవు పుష్పాలను కోయునపుడు
నను విడిచెద వేమోనని వేదన చెందేనోయి
నను మరువకు మాలి అని ప్రార్ధించితినోయి ||మరువకు||
నువు పాడే సాయి పాట పాడుతునే పుట్టితిని
నువు చేసే సాయి స్మరణ పలుకుతునే పెరిగితిని
సాయి పాద పూజ కొరకు పువ్వునై విరిసితిని
సాయి సేవలొ బ్రతుకు ధన్యమవగ వేడితిని
సాయి కొరకు విరిసింది ఈ పూల కొమ్మ
సాయి పూజకొరకు పూచింది ఈ పూవు జన్మ ||మరువకు||


పాట 30: దర్శనం ఇవ్వయ్యా ఈ మౌనము నీకేలయ్యా

[మార్చు]
దర్శనం ఇవ్వయ్యా ఈ మౌనము నీకేలయ్యా
ద్వారకామాయిలో కొలువుండే ఓ సాయి
దర్శనం కోరితిని నిదర్శనం వేడితిని ||దర్శనం||
కోపమే రప్పించానా అలిగినావా నాపైనా
కినుక మాని ఇకనైనా కనికరించు నాపైనా
కోరిన రూపంలో దర్శనం ఇచ్చే సాయి
నా సాయి రూపంలో దర్శనం ఇవ్వోయి ||దర్శనం||
పాపమే చేశానా మౌనము వహించావు
నమ్మలేక పోతున్నవా అనన్యమైన నా ప్రేమ
జీవమిచ్చానంటావా ఈ జీవితమిచ్చానంటావా
మేలు చేస్తే చాలా సాయి కనులకెందుకు కనపడవోయి ||దర్శనం||
నిరతము నీ చరణాలే నమ్మినాను ఓ దేవా
సతతము నీ నామాన్నే స్మరించేను నా దేవా
రేయి పగలు నిన్నే తలచితి అలుపెరుగక నిన్నే కొలిచితి
కనులు కాయలు కాచేలాగ ఎదురు చూచితి నీ కొరకు ||దర్శనం||

పాట :31 ఆద్యంతము లేని పాదము

[మార్చు]
ఆద్యంతము లేని పాదము
పరమ పావనము సాయి పాదము
సాయి మీద వుంచుము విశ్వాసము
అది తొలగించును నీ హృదయభారము ||ఆద్యంతము||
భవ భయము ను హరియించే పాదము
అది సద్గురువుని శ్రీ దివ్య పాదము
బ్రహ్మము తానైన భవ్య పాదము
అది భువిపైన వెలిసిన సాయిపాదము ||ఆద్యంతము||
దర్శన స్మరణములతో ప్రసన్నము
అది సాయి దేవుని దివ్య చరణము
గంగా యమునల సంగమక్షేత్రము
శ్రీ సాయినాధుని పాదయుగళము ||ఆద్యంతము||
పాపాలను హరియించే దివ్యపాదము
అది పాపులను రక్షించే అభయ హస్తము
కులమతాలకతీతము సాయిధర్మము
అది సర్వగత చైతన్యము సాయితత్వము
పురుషార్ధము నిచ్చే స్వర్గధామము
అది షిరిడీలో వెలిసిన సాయి చరణము ||ఆద్యంతము||

పాట 32: జీవులను సృష్టించె తండ్రే సాయి

[మార్చు]
జీవులను సృష్టించె తండ్రే సాయి
ఈ దేహమిచ్చి పోషించే తల్లే సాయి
మహనీయుడై వెలసిన సద్గురువే సాయి
వేదశాస్త్రాలలో మంచిని చెప్పే మన మిత్రుడు సాయి
తన భక్తుల క్షేమానికి దత్తుడు సాయి
ఈ సృష్టిని పరిపాలించే శివుడే సాయి
భవసంద్రము దాటించే విభుడే సాయి
కలియుగాన వెలసిన భగవంతుడు సాయి ||జీవులను||
మోడులను చిగురించే జీవం సాయి
అంధులకు వెలుగిచ్చే దైవం సాయి
మూఢులతో వేదం పలికించెను సాయి
మృతులను బ్రతికించే మృతసంజీవని సాయి ||జీవులను||
తన సంపదను భక్తులకు పంచెను సాయి
వారి ప్రేమతో జీవించే భిక్షువు సాయి
ఇహలోకపు కోర్కెలను తీర్చును సాయి
తన భక్తులను ముక్తివైపు నడిపించును సాయి ||జీవులను||