సరిపడని సంగతులు/మొదటి యంకము/మూడవ రంగము

వికీసోర్స్ నుండి

“ కమనీయభూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూదిపఱుపు లేల? సహజంబులగు కరాంజలులు లేకున్నువే భోజన భోజన పుంజు మేల? వల్క లాజి , కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘంబు లేల? గొనకొని వసియింప గుహలు . లేకున్నవే ప్రాసాద సౌధాదిపటల మేల?

తే. ఫలరసాదులు గురియ వే పొదపములు,
స్వాదుజలముల సుండ వే సకలనదులఁ
బొసఁగభిక్షంబు పెట్ట రే పుణ్య సతులు ,
ధనమదాంధుల గొలు వేల తాపసులకు. "

ఈపడుచు తాళ లేని హృదయ వేదనచే ఏదైనను అకార్యమును చేయనొప్పు. నేను జాగరూకుడై యుండ వలయును. ( తెర పడును.)

సరిపడని సంగతులు.

మొదటియంకము - మూడవ రంగము

. (మరునాటి మధ్యాహ్నము-స్థలము , ఊరి వెలుపల ఆంజనేయ దేవాలయము దేవాలయము స్టేజు యొక్క ముందటి భాగములో ఎడమ వైపున, కుడి వైపు వాకిండ్లుగ లిగినట్లు ఏర్పాటు చేయబడి యుండును. దేవాలయము పక్కన వెనుకటి భాగమున ఒక భావి కట్టడములడును. ఇయ్యది దిగుడు భావి. చుట్టు ఒక మూ రెడెత్తు గోడ కట్టబడి యుండును. దేవాలయము తలుపులు తీసియుండును. పూజ జరుగు చుండును. జనసమూహము ముందరి భాగమున కూర్చొని కొంద రు తబల, హార్మొనియం వాయించుచు పాటలు పొడుచుందురు. కొందరు సిగట్లు, బీడీలు కాల్చుచుందురు. రఘునాధుడటనుండి భజనపాట యొక్కటి ముగిసిన పిదప ముక్కు పట్టుకొని లేచి)

రఘు :—అబ్బా! ఈబీడీలఘాటు ముందర సాంబ్రాణి పొగ ఎక్క డనో! ముక్కులోని వెంబుకలు కమలి పోవుచున్నవి. దేవాల యము దగ్గిర బీడీలు కాల్చడ మేమయ్యా? పాడైన ఈబీడీలు విడచి సిగరెట్లయినను కాల్చరాదా! స్వదేశాభిమానము కాబోలును.

23

భాస్క:- (అందే కూర్చొనియుండి) రఘునాథా! నీ దేవునికి సిగ రెట్ల పొగ యిష్టమా? Fashionable దేవుడు కాబోలును. ఏ దేశపు వస్తువులను స్వీకరించు చుండును. అరే! బీడీలు కాల్పు వారిని దూషించుచున్నా వే! నీనశ్యముట్టయో? ముక్కు పట్టి పొడిపీల్చిన ప్రాణాయామయోగ సాధనమను కొంటివేమో!

రఘు:- భాస్క రా? “వ్యాసంవసిష్ఠన్నఫ్ తారం" యను వాక్యము విన లేదా? శ్రీ వేద వ్యాసుల వారే వసిష్ఠులను "స్న ఫారం” (పొడి పిసరు తెండి' యన్నారట. అప్పుడు 'శుక పరాశరంవందే' అన్నార ట. అనగా శుక పరాశరులు ఇదో మేము వస్తిమి అనిరట, గొప్ప గొప్ప ఆచార్యులవారు, దీక్షితులు, దేవ పూజు వేళలందు సహి తము ఇంచుక ముక్కు బిగిసెనా పూజలు నిలిసి' మంత్రములు నిలిపి, బిర్రుగా పొడివీల్చి దేవునకు అభి షేకమున కుపయో గించు వస్త్రము చేతనే నాసారంధమును పరిశుభ్రము చేసికొని పిదప పూజసాగింతురు.

భాస్క:- భేష్ ! రఘునాథ! అటువ లెనె బీడీలు కాల్చు వారుగూడ యించుక కంఠము బిగించెనా, దైవపూజలు నిలిపి, రెండుద మ్ముల పీల్చి పూజలు సాగించ వచ్చును.

రఘు: అది పాపము.

భాస్క:_ ఏలకో? అదియు ధూమపత్రమే. ఇదియును ధూమ పత్రమే. ఒక్కటి పొగాకును పొడి చేసి పీల్చుట. మరియొక్క టి అదే పొగాకును పీల్చిపొడి చేయుట, ఇం తేకదా భేదము.

రఘు:— నీవు అవివేకివి. నీకు ఆచారము తెలియదు. సంప్రదా యము తెలియదు. దైవపూజ కాలమందు చుట్టకాల్చడమెం దైనను గలదా.

భాస్క:- పొడి పీల్చుట?

రఘు:— ఓ! ఇది వృద్ధాచారము.. గొప్పగొప్ప ఆచార్యులవారు దీని నవలంబించినారు. ఇందు యేదోషము లేదు,

భాస్క:— అయిన ఆచార్యులవారికి ఏది యావశ్యకమో అదిసదా చారము. ఏది యనావశ్యక మో అది దురాచారము. ఇదియే నా ఇప్పటి ఆచార సంప్రదాయము,

24

(అప్పుడు మరల భజన పాట మొదలిడుదురు. పాటసగము పాడుచుండగా, భీమ సేనరావు గారు పట్టుబట్టలతో చేతిలో గిండితో ఏ వేశింతురు. పాటలు నిలుపు దలచేయబడును, బీడీలు తాంతాగు వారు బీడీలను పొర వేయుదురు. రఘునాథుడు, మరికొందరు లేచి సమస్కరింతురు.)

భీమ. __ ఏమి పొడుకంపు? ఇదియే ఇంగ్లీషు చదువు ఫలము. నారా యణ! నారాయణ!! (అనుచు పోడిడబ్బీ తెఱచి నస్య ముపీల్చును, అప్పుడు దేవస్థానము లో పలనుండి విద్యా లం కారాచార్యులు చిరునవ్వుతో ప్రవేశింతురు. వారికి సాష్టాంగ దండ ప్రణామంబు చేయుదురు.)

విద్యా:- మహదైశ్వర్యాభివృద్ధిరస్తు, వచ్చితిరా! నేనిప్పుడే లో పల ఏదో కొంచము సత్కాలక్షేపము చేయుచుంటిని. తమధ్వ నివినిన తక్షణమే......

భీమ: – అయ్యో! నా పైన ఎంత బరువు మోపితిరి. నన్ను పాపము లకు గురి చేసితిరి. మిసత్కాలక్షేపమునకు అంతరాయమైన నాధ్వని పైననే నాకు విసుగుపుట్టునట్లు చేసితిరి. వారు చేయు చుండు ఘనకార్యమును విడిచి నాకొరకై ఆతరతతో రావచ్చునా?

విద్యా:- రాయలవారూ!

( సిరికిం జెప్పఁడు, శంఖచక్రయుగముం జేదోయిసంధింపఁ డే-
పరివారంబును జీరఁ, డభ్రగ పతింబన్నింప డాకర్ణి
తరధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు, వివాడపోత శీకుచో-
పరిచేలాంచలమైన వీడఁడు, గజప్రాణావనోత్సాహియై.

పురుషోత్త ముడగు ఆహరి భక్త శశిష్ఠులకు దాసానుదాసుడుగదా!

భీమ: - (కనులు మూసికొని) ఆహాహా!!! మహానుభావుడు, హరి, పరమపురుషోత్తముడు, ఆయనకథలు వినుటవలననే, జన్మము పావనమగును. అనంత నామములు ఆయనకుకలవు. అందులో 'భక్త పరాధీను'డను బిరుదు మిక్కిలి శ్రేష్ఠము. కేవలము భక్త పరాధీనుడతడు.

25

విద్యా:— అవును. ఏమనవ లెను? ఆహరిని ఏమనవ లెను. హరి, హరియే!

భీమ. _ కదా! మరి.

విద్యా:- మిధ్వని వినినతక్షణమే నేనువచ్చినది......

భీమ: - కాదు, కాదు. మడుగు, మైల, ఆచారము మీబోటివా రికి ఉండునుగదా!

విద్యా:- రాయల వారూ! ఆచారము; యేమిఆచారము!! మీబో టి విచారపరుల వారిదగ్గరనా, నాఆచారము? మీ పాదసంచా రముండిన స్థలమున చేయునదంతయు సదాచార మే!

భీమ: అయ్యో! అపచారము. అట్లనవచ్చునా? నే నెంతటివాడను, నాయోగ్యత యేమి? ఏదో మీ ఆశీర్వాదబలము వలన సదాచా ర సంపన్నుడను కీర్తిని కొంచెము సంపాదించి నేగాని, తుదకు భక్తుడను పేరు కైనను నేను పాత్రుడనా?

విద్యా:- స్వామి:! నన్నేల అడుగవలెను? లోకులనడుగుడు. మీ సత్యనారాయణ పూజల నడుగుడు. మీతులసీమాలల నడుగు డు. ఈ దేవాలయము నడుగుడు. (కన్ను లుమూసికొని) ఇదంత యు తమయాదార్యము.

భీమ: -

"కాయేన వాచామన సేంది యైర్వా,
బుద్ధ్యాత్మ నా వాప్రకృ తేస్స్వభావాత్ ,
కరోమి యద్య త్సకలం పర స్మై,
నారాయణాయేతి సమర్పయామి”

విద్యా: __మీపరోపకారము, నాపూజా పురస్కారములు, మాల న్నదాన, వస్త్రదాన . . . . . .

భీమ:- ఆచార్యులవారు! క్షమించండి. ఆసంగతి ఇచ్చట ఏల? ఇచ్చట చేరిన విద్యార్థు లెవరు?

విద్యా:-(రఘునాథుని చూపించి) ఈ చిన్న వాడు కేవలము భక్తుడు. ప్రతిదినమును పుష్పం, ఫలం, దక్షిణ సమర్పించుచు ప్రాణ దేవు లవారి సేవ చేయుచుండును. ఏదో యథాశక్తి స్వామి! ఇప్పుడిం

26

గ్లీషు చదువుకొను విద్యార్థులలో ఇట్టి వారు దొరకుటయే దుర్ల భము. ఇట్టివారు ఒక రిద్దరున్నారు గనుక నే ప్రపంచము జరుగును.

భీమ: __ మిక్కిలి సంతోషము. (రఘునాథునిగురించి) నాయనా, నాయింటికి దినదినమును వచ్చి తీర్థము తీసుకొనిపోవుము.

(భాస్కరుడు, మిగతవారును నవ్వుచుపోదురు. భీమ సేన రావు వారి వైపు చూచును.)

విద్యా: – చూచితి రా! నవ్వుచుపోయిరి. పెద్దలనుచూచిన ఎంత తిరస్కారము చూడండి, కాలమహిమ! ఇంగ్లీషువిద్య! అదో ఆ ఖాదిటోపి వేసుకొన్నాడే వాడే ఆ వానర సేన నాయకుడు.

భీమ: (నవ్వుచు) ఆయవివేకి కలియుగ పురుషుడగు. ఆగాంధీశిష్యు లలో నొక్కడు గాబోలును. పేరు మహత్ముడు. చేయుపనులో వర్ణసంకరము,జాతి భ్రష్టత్వము, చండాలస్పర్శ. ఎచట చూచినను “మహాత్మగాంధీకి జై " ఏమి ఆయన ప్రభావము! సత్రములగ ట్టించినాడా? దేవాలయముల గట్టించినాడా? బాహ్మణుల కే దేని సంతర్పణల నేమైన చేయించినాడా? శాస్త్రముల జదివి నాడా? ఏమియు లేదు. ఎప్పుడు చూచినను అందరు ఒక్కటే! అందరు ఒక్కటే!! ఇదియే ఆయన మంత్రము. బాహ్మణులు, శూద్రులు, హిందువులు, ముసల్ మానులు , స్త్రీలు, పురుషులు అందరును ఒక్కటే, ఇ దేగాంధి మంతము, గాంధీమంత్రము ఒక్క టే. తప్పతాగితే బ్రాందీమంత్రము ఒక్క టే. అందరు ఒక్కటే నా? గాడిద, గురము ఒక్కటే ఎట్లు అవును? ఏమోకాలము చెడి పోయినది. కాలము చెడినప్పుడు అందరు మహత్ము లే.

విద్యా:- రాయలవారూ! ఆ పాడుకథ మన కెందులకు ఏదో మన సత్కాలక్షేపము మనకు ముఖ్యము. ఇది కలియుగము. బా హ్మణుల కధికారమే లేదు. బాహ్మణుడే రాజై యుండిన... ... . పోనీయండి! కలియుగ మింతే. ఏదో మనబోటివారుండి కృత యుగమునకు వేగిరముగ సర్వధర్మములను సేకరింపవలెను. రండీ! హారుతికి వేళయయినది. మీరువచ్చినదే కేవలము మా భాగ్యోదయము.

27

హారతి పాట (అని వేద పఠనము గావించి,పొడుచుండగా, విద్యాలంకారా చార్యులవారు మంత్రపుష్పములను చెప్పుచు, తీర్థ ప్రసాదములనిచ్చి ((ధన ధాన్య కీర్తి సంతాన సంప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించును. అందరు పెడలి పోవుదురు. పూజారి గుడితలుపుమూసికొనిపోవును. ఇదివరకు దూరమున నిలు చుండిన శ్రీధరుడు ముందుకువచ్చి స్వగతముగా)

శ్రీధరు. _ అయ్యో! ధర్మమా! దైవమా! ఎక్కడిధర్మమ:! ఎక్క డిదైవము? ద్రవ్య మేధర్మము! ద్రవ్య మేదై వము! బాహ్మణు నకు నీచమగు సేవావృత్తి ప్రాప్త మైనపిదప ధర్మ మెక్కడ? దైవ మెక్కడ ? ఇది యేమి సంఘము? హృదయమున ఇంచు కై నను పశ్చాత్తాపము, పరోపకారబుద్ధి ప్రేమ లేని సంఘ ము. వీరు దేవాలయములను కట్టించు ముఖ్యో దేశము ఆ దేవుని మోసగించుట కేయని తోచుచున్నది. సర్వాంతర్యామియగు దేవుడు అన్ని చోట్లయందు ప్రత్యక్షముగ నుండిన యెడల వీరి పాపకృత్యములను చూచు నేమో యనుభయముచే ఆ దేవునిపట్టి కట్టి తెచ్చి ఒక్కచోపడ వైచి, చుట్టు దేవాలయముగట్టి తలుపులు బిగించి దేవునికి నిర్బంధము చేసినయెడల, తాము ఇతరచోట్ల చేయు పాపములు దేవునికి తెలియకుండునని వీరుపన్ని న ఉపా యమని నాకు తోచుచున్నది. ఇట్టి నిర్బంధమునకు పరమేశ్వ రుడెన్న డైనను లోబడునా? విద్యాలంకాగా చార్యులవంటి బాహ్మణులకు దేవు డెన్నటి కైనను ప్రసన్ను డగునా? ఇది రామ చంద్రుని గుడి, మారీచాది మాయావి రాక్షసుల మోసముల గుర్తెరిగిన మహానుభావుడు ఈవిద్యాలంకారా చార్యుల మోస మును గుర్తెరుగక యుండునా? ఇతనికి దేవస్థానము ద్రవ్యస్థానము. శ్రీరామచంద్రుని పూజులకంటె ఇందు పకీలు భీమ సేన రావు పూజలు హేచ్చు. అయ్యయ్యో! ఇచ్చోటనైన ఐదునిముసములు మనసు పరమేశ్వరుని పాదార విందములందు సమర్పించి సర్వ ప్రపంచ క్షమమునకై ప్రార్థనల నొసగకూడదా? ఇచ్చట గూడ హెచ్చుతగ్గుల సంవాదమా? ఇచ్చట కూడ జాతి భేదముల చర్చయా? కేవలము (ప్రేమమూర్తి యైన దయామయుని సాన్ని

28

ధ్యమునగూడ మహనీయ దూషణయా? ఔరా రామున కొక్క నామము. జగ దేకవంద్యుడై , సకలదీనజన బంధుడై , వక్ర సమాజ, క్రూరాచార సముదాయ పరంపరచే బాధింప బడు హత భాగ్యలపాలిటి కరణోద్దాముఁడగు గాంధీ మహాత్మున కొక్క యవమానము. (ఉదేకముతో) మహానుభావుడగు మ హాత్మా గాంధీని దూషించిన ఈ పాపపు ప్రదేశమున శ్రీరామ చంద్రు డెన్నటికైన నిల్చునా. ఇతడు నిక్కంపు రాముడైన... (అని చెప్పుచుండగా, తార ప్రవేశించుట చూచి వెనుకకు చనును.)

తార: - (ప్రవేశించి గుడివాకిండ్లు బీగము వేసినది చూచి) రామా! రామ చంద్రా!! కడపటి దర్శనముకూడ నాకు పాప్తి లేదా? ఒక్క సారి వాకిండ్లు నీవే తీసివైచి నాకు దర్శనమియ్య లేవా? నీపాదకమలముల ధూళి సోకినంత నే కారాగృహపు గడియలు తాళములు వీడిపోయెనను గాధయన్నది. అది కల్లయేనా? అయ్యో! నిన్ను నిర్బంధమున ఉంచినా రే! నీవే నిర్బంధము నుం డి తప్పించుకొనుటకు శక్తుడవుగాకున్న నీభక్తుల నెట్లు కాపాడు దువు? రామచంద్రా! హృదయమున విషము నిండియుండ, దయయు, దానము నెరుగని హస్తములచే కపట వేషధారులగు పూజారుల యభిషేకముల ననుభవించుచున్నావు కాని అనా థయై, ఆర్తయై, మోసగింపబడినదై , దిక్కు లేక, ఇప్పటి దుర్భ లసమాజపు కఠోరమగు కట్టుబాట్లకుజిక్కి రోదించు హిందూ స్త్రీ దుఃఖాశ్రుతరంగముల అభిషేకము లెట్టుం డునో నీకొక్క సారి రుచిచూపింతు. రామచంద్రా! వాకిలి తెరువుము. నిన్నే మియు అర్థించను, ఒక్కింత యైనను తొందర చేయను. నీకు జగ త్కర్త యను బిరుదుకలదు. నీకు జగత్ సాక్షి యను పేరుకూడ గలదు. నిజముగా నీకు గన్నులున్న వా యని పరీక్షించవల యును. కన్నలు లేవా? గుడ్డివాడవా? ఈప్రపంచమున జరు గుచున్న ఘోరపాప మొక్కటియైన గుర్తించ లేవా? రామచం దా! నీకును ఆచార్యులవారి కట్టు బాట్ల కలవా'! శాస్త్రములు

29

నిన్ను గూడ వేధించుచున్నవా? రామచంద్రా! నాయందుండు శిశువు నీకుకూడ భారమా? శ్రీరామచంద్ర! రామా! నా యాశయంతయు, నాభారమంతయు నీ పైన పెట్టుకొని యున్నాను. నిక్కముగ నీవేకదా నాప్రియుడు. లోకమున కే ప్రియుడైన వాడు నాకు ప్రియుడు గాకూడదా? ప్రియా! నీవిచ్చిన పాణ ముల నీకే సమర్పింతును. రామచంద్రా! నే వట్టి భ్రాంతను, నీ కెన్నటి కైనను స్త్రీలపైన దయ గలుగునా? కలుగదు! నిను మోహించిన శూర్పణఖను నిష్కా రణముగ ముక్కు గోయించితివి. వలదనిన పోవుచుండెనే! ము క్కు గోయింప వలయునా? నీవే పర దైవమని నమ్మి, కలయం దై నను కళంకముకానని జానకిని అడవులకు బంపి అగ్ని ప్రవేశము చేయించితివి. హా! నాకుదిక్కు నీవుగావు! ఇదిగో ఈ బావియే. ఈ దౌర్భాగ్యపు దేశమునందు నాయట్టి నిరాధారలగు వితంతు స్త్రీలకు జలములే ఆధారములు. అమ్మా! అనాథ బంధూ ! అమృ తసింధూ ! (అని ప్రార్థన చేయుచుండును. శ్రీధరుడు ప్రక్క నుండి తటాలునవచ్చి)

శ్రీధరు. _ బిడ్డా! తారా! ఆపని చేయకుము. నీవు చేయగూడదిట్టి పని. దుఃఖమెన్నటికిని అవార్యముగాదు. తారా! నీ సేవ చేయు టకు సిద్ధముగా నున్నాను. తారా! ఎందులకిట్లు సాహసించితివి?

తార:- శ్రీధరా! పౌరుషధర్మమే నాశనమైనది.

శ్రీధరు:-నీ వాడినది సత్యము. నీ సమాచారమును నేనాక స్మికము గ గుర్తెఱింగితిని. ఆనాడే నిన్ను బాధలనుండి తప్పించి, నీకు ధైర్యము నొసగ వలసియుండె. మన కృత సమాజము యొక్క నిర్వీర్యత్వమునకు ఇంచుక చిక్కియుంటిని. ఇప్పుడు ధైర్యము చేసితిని. నిజముగ పురుషుడ నై తిని. తల్లీ! రమ్ము నాయింటికి. నన్ను గన్న తల్లి నీకు సర్వసౌఖ్యములనిచ్చి నీమనసునకు శాంత త కలుగ జేయును. సంతోషమున నిన్ను పోషించును. ఆమెకు వయస్సయినది. ముసలిది. నేడో, రేపో, హరిచరణముల చేర

30

నున్నది. నీయట్టి హత భాగ్యురాలికి ఇంచుక చేయూతనిచ్చిన సంత సముగ తన జీవయాత్ర ముగించును. రమ్ము. పోవుదము.

తార:- అయ్యా! ఈ ప్రపంచమున నేనుండి ఎవరి కేమి లాభము చేయవలయును?

శ్రీధరు. _ బిడ్డా! ఈ ప్రపంచమునకు ఎవరినుండి మాత్రమేమి లా భము? రమ్ము పోవుదము

తాత:- అయ్యా! నానుంచి నీకునష్టమగు. నీకు పనిపోవును. పిదప మిక్కిలి కష్టము వాటిల్లును.

శ్రీధరు: ... తారా! నాపనిపోవునా? పోవనిమ్ము. వంచకుని ధర్మవి ద్వేషిని అందువలన దేశద్రోహిని సేవించుటకంటే ఆకలిచే శుష్కించుట మేలు; ఇట్టి నీచ సేవవలన నాపొట్టకు ఇంచుక లా భము కలిగినను, నాఆత్మగౌరవమున కే నష్టముగలుగు చున్నది. గౌరవము నియ్యని ఆహారము చే పెంచిన దేహము ఉండుటకం టె, మండుటయే మేలు. నీనుంచి యైనను, నే నీ నీచ సేవనుండి విముక్తుడనయ్యెదను నాకు కష్టముగలుగు నంటివి. కలుగునని తెలియునుగాని నీకష్టమునకంటె నాకష్టములు హేచ్చా? పరుల కష్టములందు పాల్గొనుటయే పర మధర్మము. పరమేశ్వరుని ని క్కంపుపూజ.

తార:— అయ్యా! నానుంచి నీకు అపకీర్తి వచ్చును. నీబంధువులు మిత్రులు, విడనాడుదురు.

శ్రీధరు:— అపకీర్తి యా? అర్తులకు సాహాయ్య మొనర్చుట అపకీర్తి యా? అనాథులరక్షించుట అపకీర్తి యా? యోచన చేయకుము. నా వెంటరమ్ము నా సేవ గైకొనుము.

తార:-ఇంకెవరుదిక్కు నాకు? రామా! ఇదియును నీకరుణార సమే' . . . . . .(అని ఇంకనుఏదియో చెప్పబోగా)

శ్రీధరు:- హా! 'హా!! తారా! తారా!! వలదు. వలదు. అందు దేవుడే లేదు. వట్టి రాయియున్నది. భక్తు లహృదయము ఎప్పుడు శ్మశానమాయెనో అప్పుడే విగ్రహము పాషాణము గాక మ రే

31

మగును? అర్చకులకు సద్భావము లేదు. విగ్రహములకు ప్రభా వమే లేదు. ఒకప్పుడు " దేవాలయములయందు దివ్యమగుశక్తి, యుండెను. స్వార్థ త్యాగులై , భూతదయయను నిర్మలనదీ ప్రవాహమున స్నానము చేసి, లోక సేవారంజితమగు వస్త్రము లను ధరించి పరమేశ్వరుని లీలావిభూతిని నొసట నలంకరించి ప్రపంచ క్షేమమే తమ క్షేమముగా భావించి, ధ్యానము చేయు మహనీయులు, ఇందు కలియు చుండిరి. కావున దేవాలయములు దివ్యశక్తి గలిగి ప్రతి ప్రాణులకు పరమానందము నొసగుస్థల ముగ శోభించుచుండెను. ఒకానొకప్పుడు ఈస్థలము యోగ సా ధనమునకు, ఆత్మ పరిశోధనమునకును అనుకూలముగ నుండెను. ముక్తి క మార్గముగనుండెను. ఒకప్పుడీ దేవాలయము ప్రపంచము నకే చిత్రపటమై మానవ కోటికే శరణాలయముగ నుండెను. అర్చకుల స్వార్థతకు ప్రదర్శనాలయము. ముందు వారికి ద్రవ్యముస్పర్శనమిచ్చినగాని, దేవుని దర్శనమబ్బదు. వారుచూ పిన దేవుడే మనకుగతి. దేవుడిప్పుడు దేవుడుగాదు. . మృగా రామము (Zoological Gardens) లలోనుండు విచిత్రమయిన ఒక జంతువు. దుడిచ్చినగాని చూచుటకు సాధ్యము కాదు. తారా! లేడు! లేడు!! రాముడిందు లేడు. ప్రేమ లేనిచోట రాముడుండునా? అయ్యయ్యో! మన దేశీయుల హృదయమున పరిశుభ్రమైన శక్తి ప్రేమలుండెనా, స్వదేశము, స్వరాజ్యము, వేయేల, అప్ప ట్టున మనము స్వర్గమునే యనుభవించుచుంటిమి. రమ్ము పోవుదము.

(నిష్క్రమింతురు)

32

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.