సకలతత్వార్థదర్పణము/చతుర్థ నిరుక్తము
సకలతత్వార్థదర్పణము
1. ప్రణవార్థ విచారము.
కుటీచకమను సన్యాసము, బహుదక మను సన్యాసము, హంస సన్యాసము, పరమహంస సన్యాసము యీ నాలుగువిధము లగు సన్యాసములకును వైరాగ్యమే ప్రయోజనమౌను గాని, పైన ధరించిన కాషాయ దండముఖ భేదములచేత మోక్షమును కలుగదని తాత్పర్యము. పుట:SakalathatvaDharpanamu.pdf/208 201
తనయొక్క ఆనందమనెడి ప్రళయకాలసముద్రమందు సార్వభౌముడైన చక్రవర్తియొక్కయు, మనుష్యలోకమందు శ్రేష్ఠుడైన మనుష్యగంధర్వునియొక్కయు, దేవగంధర్వునియొక్కయు, ద్వివిధము లైన పితృదేవతలయొక్కయు, అనగా అజాత జానదేవతలయొక్కయు, అగ్నిష్వాత్తాది దేవతలయొక్కయు, కర్మదేవతలయొక్కయు, దేవతలయొక్కయు, ఇంద్రునియొక్కయు, బృహస్పతియొక్కయు, చతుర్ముఖునియొక్కయు, విరాట్పురుషుడయిన తటస్థేశ్వరునియొక్కయు, హిరణ్యగర్భునియొక్కయు, 12 ఆనందములు, నురుగులు, నీటిచినుకులు, నీటిబుగ్గలు, అలలు మొదలయిన భేదములుగాను పుట్టుచు వృద్ధిబొందుచు అణగుచుండును. పుట:SakalathatvaDharpanamu.pdf/211 204
భుమియందు మనోనాశము స్వరూపమని అరూపమని రెండు విధములు. అందు స్వరూపమనోనాశము జీవన్ముక్తుల యందును, అరూపమనోనాశము విదేహముక్తులయందును ఒప్పునని పెద్దలు జెప్పుదురు. ఆ త్రిగుణరహితమైన సామ్యా మనోలయమై స్వరూపమను పేరుగలది. సూక్ష్మశరీరనాశమందు ఆ శుద్ధసత్యము నశించి రూపము లేనిదై కనబడునని తాత్పర్యము. 205
తేచాన్యకర్మాణియస్మిన్ ద్రుష్టేపరావరేః అను శ్రుతిప్రమాణము ననుసరించి హృదయగ్రంధియైన లింగశరీరము నశించగానే సకల సంశయములు నివారణమై బ్రహ్మసందర్శనమై 'బ్రహ్మవేదబ్రహ్మైభవతీ బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మే అగునను శ్రుతిప్రమాణము చొప్పున బ్రహ్మలో ఐక్యమగుచున్నాడు. ఇట్లని విచారించి శరీరత్రయవిలక్షణుం డైన ప్రత్యగాత్మ తానని తెలిసికొనినవాడు కుక్తుండని వేదాంతసిద్ధాంతము.
గద్య.ఇది శ్రీమన్నారాయణ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మ వర ప్రసాదలబ్ధ కవితా విలాస సందడి నాగదాస ప్రణీతంబైన సకలతత్వార్థదర్పనము సంపూర్ణము.
ఏతత్సర్వంబును శ్రీలక్ష్మీనారాయణార్పణమస్తు.
కరకృతమపరాధం క్షంతుమర్హంతు సంతః.
చెన్నపురి: బరూరు, త్యాగరాయశాస్త్రులు అండ్ సన్ వారి స్వకీయ గీర్వాణభాషారత్నాకరముద్రాక్షరశాలయందు ముద్రితము--1925