Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిలకమర్తి లక్ష్మీనరసింహము

వికీసోర్స్ నుండి

చిలకమర్తి లక్ష్మీనరసింహము :

కవులకు కాణాచియైన రాజమహేంద్రవరమున 19, 20 శతాబ్దములలో నివసించి, ప్రజాదరము పొందిన కవిగా ప్రఖ్యాతిపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహము క్రీ. శ. 1867 సెప్టెంబరు 29 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాయందలి ఖండవల్లి గ్రామమున వారి మేనమామ యైన పురాణపండ మల్లయ్యశాస్త్రియింట జన్మించిరి. వీరు చిలకమర్తి వెంకన్న, వెంకటరత్నమ్మల ప్రథమ పుత్రులు. తలిదండ్రులు వీరికిపెట్టిన పేరు పున్నయ్య - తరువాత అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి పేరుమీదుగా వీరు లక్ష్మీనరసింహము అని పిలువబడిరి.

బాల్యమున వీరి విద్యాభ్యాసము ముఖ్యముగ వీరి తండ్రిగారి వాసగ్రామమగు వీరవాసరమున జరిగినది. తరువాత వీరి మేనమామగారికి రాజమహేంద్రవరమునకు ఉద్యోగరీత్యాబదిలీకాగా, 1884 సం. న లక్ష్మీనరసింహము కూడా రాజమహేంద్రవరము వచ్చి అచ్చటి పాఠశాలలో స్కూలు ఫైనలు పరీక్షలో కడతేరునంతవరకు చదివిరి. వీరికి చిన్నతనము నుండియు కంటిచూపు తక్కువగుట చేతను, ముఖ్యముగ గణితశాస్త్రమున ప్రజ్ఞాపాటవములు తక్కువగా నుండుటచేతను, కళాశాలవిద్యకు వీరి కవకాశము లేకపోయెను. తరువాత తరువాత వీరికి చూపు బొత్తిగా పోయెను.

అయినను లక్ష్మీనరసింహము అత్యద్భుతమైన ప్రతిభ గలవాడగుటచేతను, అఖండమైన మేధావి యగుటచేతను, బాల్యమున నేర్చిన ఈమాత్రపు విద్యనే ఆధారముగా చేసికొని, ఇతరుల సాయమున అనేక సంస్కృతాంధ్ర గ్రంథములను చదివించుకొని విని, తనకుగల ఏకసంథాగ్రాహిత్వ శక్తిచే ధారణమొనర్చి పాండిత్యము సంపాదించుటయేకాక, రచనమున కుద్యమించి, నాటి మహాకవులలో నొకరుగ ప్రకాశించిరి.

వీరితండ్రి ఎక్కువ సంపన్నులు కానందున, వీరుకూడ బాల్యమునుండియు ఆర్థికముగ ఎన్నియో కష్టముల నెదుర్కొనవలసిన వారయిరి. అయితే, లక్ష్మీనరసింహము మిక్కిలి సమర్థులగుటచే, రాజమహేంద్రవరము చేరినది మొదలు మిక్కిలి పరిమితమైన తన సంపాదనతోడనే తాను తనకుటుంబమును పోషించుకొనుటయే కాక, తన బంధువర్గములవారి కుటుంబములను ఆదుకొనుచు, వీర వాసరమున నున్న తండ్రిగారి కుటుంబమునకు కూడ సాయపడుచు ఎన్నెన్నో మహా కార్యముల నొనర్చిరి.

రాజమహేంద్రవరమున ఉన్నత విద్యార్జన కై వచ్చిన ఒక సామాన్య కుటుంబ బాలుడుగా జీవిత ప్రారంభ మొనర్చిన లక్ష్మీ నరసింహము తరుణ వయస్సువచ్చుసరి కే ప్రజా రంజకమగు పవిత్ర వర్త నము కలవారై, గొప్ప ప్రతిష్ఠకలజీవితము గడపి, ప్రసిద్ధివహించి, మహేంద్రవర చరిత్రలో ఒక ఉన్నత పురుషులుగా పరిగణింపబడిరి. వారి రాజ నైతిక శీలము, వారి నిరాడంబర స్వభావమే దీనికి కారణము. సరళ వర్తనము, సంఘ సేవా భిరతి, ప్రజానుకూల హృ దయ ప్రకృతి, సర్వంకష ప్రజ్ఞ యుకూడ కారణము. సంగ్రహ ఆంధ్ర ప్రారంభమైనదని చెప్పవచ్చును. 1887 వ సంవత్సరమున జరిగిన విక్టోరియా రాణి జూబిలీ పరిపాలనోత్సవమున కై ప్రప్రథమమున వీరు పద్యములు రచించిరి. కాని జంకుచే ఆ ఆ పద్యములను వారపుడు సభలో చదువలేదు. తరువాత తరువాత వీరు పాల్గొనిన ప్రతి ఉత్సవము నందును. ప్రతి సభా సమావేశము నందును పద్యములను వ్రాసి చదువు టయు, ఆశువుగా చెప్పుటయు వారి జీవితములో నొక యాచార మైపోయినది. కాని చిత్రము - 205 కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహము

కవిగా, మహావక్తగా, పండితుడుగా, పత్రికాధిపతిగా, సంఘ సంస్కా రాభిమానిగా, ఆత్మాభిమానము కల సంఘ సేవకుడుగా, దేశభ క్తుడుగా చిలకమర్తి లక్ష్మీనరసింహము జీవితమున పేరుపొందియుండిరి.

కవిగా లక్ష్మీనరసింహము ముఖ్యముగా ఆంధ్ర సార స్వతమున కొనర్చిన సేవ మిక్కిలి ప్రశంసాపాత్రము. వీరి ఇరువదవ సంవత్సరము నుండియు, వీరి సారస్వతజీవితము 708 ఆ పద్యములను భద్రపర చుట యందు శ్రద్ధవహిం చకపోవుటచే అవి చాల వరకు ఖిలమై పోయినవి. ఇవి కాక పృథ్వీరాజీ యము, కాదంబరి (అను వాదము), రామచరిత్ర (వాల్మీకి రామాయణము నందలి ముఖ్య కథా ఘట్టమును మాత్రము వివరించు కములకు అనువాదము) అను పద్య కావ్యములను వీరు రచిం చిరి. కాని ఇందలి ప్రథమ గ్రంథములు రెండు రచనా మధ్యముననే సంపూర్ణము కాక పోయినవి. ఇట్లీ కావ్య ఆగి రచన చాలవరకు అసమ గ్రముగా నిలిచిపోవుట వలనను, వీరి నవలలు, నాటకములు ప్రసిద్ధిలో నికి వచ్చుట వలనను సారస్వతేయులలో వీరికి నవలా, నాటక కర్తగనే ఎక్కువ ప్రఖ్యాతి కల్గెను.

వంగవోలు నుండి రాజమహేంద్రవరమునకు వచ్చి నాటక ములను ప్రదర్శించుచు, నాటక కళయందు మిక్కిలి ఆదరాసక్తులు కల ఇమ్మానేని హనుమంత రావు .. నాయుడి కోరిక పై లక్ష్మీనరసింహము ప్రప్రథమముగా 1899 వ సం. న కీచకవధను వచన నాటకముగా రచిం చిరి. అది మిక్కిలిగా ప్రజల మన్ననకు పాత్రమగుటచే ఇమ్మానేని హనుమంతరావు వీరిని మరలమరల నాటక రచనకై ప్రోత్సహించుచువచ్చిరి. ఇట్లు నాయుడుగారి కోరిక పైననే వరుసగా ద్రౌపదీకల్యాణము, గయో పాఖ్యానము, రామజననము, పారిజాతాపహరణము, నలచరిత్రము, సీతాకల్యాణము అను నాటకములను రచించిరి. ఇందు చాలవరకు వచన నాటకములే. కాని తరువాత ఈ నాటకములను ముద్రించి ప్రక టించినపుడు పద్యములను వ్రాసి ముద్రించిరి. తరువాత ప్రసన్న యాదవ నాటకము విరచింపబడియెను. వీరి నాటకము లన్నింటిలో గయోపాఖ్యానము మిక్కిలి విశ్రుతమై, ప్రజాదరణకు పాత్రమై, ఎన్నియో ముద్రణములం దెను. లక్షలకొలది ప్రతు లమ్ముడువోయెను. ఆంధ్రులలో ఆ నాటక మునందలి పద్యములు రానివారు - ముఖ్యముగా 'అల్లుడారమ్మని' అను పద్యము - ఒక్కరుకూడ లేరనిన అతిశ యోక్తి కానేరదు. ఇట్లీ నాటకము ఆబాలగోపా లము ఆకర్షకమైనది. వీరి తొమ్మిదవ నాటకము చతుర చంద్రహాసము. పార్వతీ పరిణయమను వీరి నాటక ము సంస్కృత నాటకమునకు ఆంధ్రీకరణము.

వీరి సారస్వత సేవా కలాపము నందలి ఇంకొక ముఖ్యాంశము నవలారచనము. వీరేశలింగముగారి రాజ శేఖర చరిత్రతో ప్రారంభమైన నవల వీరి హస్తమున మంచి పరిణతినొందినది. ప్రసిద్ధ ఆంధ్ర వాఙ్మయపోషకు లైన న్యాపతి సుబ్బారావు పెట్టిన పోటీ పరీక్షల కొరకై మొదటగా లక్ష్మీనరసింహము 1894 లో రామచంద్ర విజయ మను నవలను రచించిరి. తరువాత క్రమముగా వీరు హేమలత, అహల్యాబాయి, సౌందర్యతిలక, కర్పూర మంజరి, సుధాశరశ్చంద్రము, కృష్ణవేణి, మణిమంజరి, గణపతి యను నవలలను రచించిరి. ఈ నవలలలో కొన్ని పౌరాణికములు, కొన్ని సాంఘికములు . సాంఘిక నవలలలో ఆనాటి సాంఘిక వృత్తము అనేక విధముల చక్కగా చిత్రింపబడెను. అందును వీరి 'గణపతి' మిక్కిలి ప్రసిద్ధినొందినది. ఇది వ్యంగ్యప్రధానమగు సాంఘిక నవల. ఆనాటి బ్రాహ్మణసంఘమున ప్రబలియున్న మూఢాచార ములను రూపుమాపుటకై ఉద్దేశింపబడిన నవలా రాజమిది.

ఇవి గాక రాజస్థాన కథావళి, మహాపురుష జీవిత చరిత్ర, భారత క థామంజరి, ధర్మవిజయము, మహాపురుష జీవితముక్తావళి మున్నగు వచన రచనలు, ప్రహసనములు, వినోదములు మున్నగునవియు, ఇంకెన్ని యో రచనము లును కలవు. ముఖ్యముగ వీరి రచనము లన్నియు సరళ సుందరములు, ప్రసన్నములు నగుట యొక విశేషము. 1928 లో జరిగిన వీరి షష్టిపూర్త్యుత్సవమునకు వీరి రచనము లన్నియు చక్కని సంపుటములుగా నచ్చొత్తింప బడెను.

ప్రధానముగా లక్ష్మీనరసింహముగారు వృత్తిచేత ఉపా ధ్యాయులుగా నుండి వారు స్వయముగ ఆర్జించినది చాల తక్కువయే. అయినను సాధుశీలమువలనను, నిష్కళంక మైన సంఘ సేవారతివలనమ, ఎందరో ధనవంతులయొక్క మెప్పుబడసి, వారల సహాయ సహకారములతో పాఠశా లలు నిర్వహించుట, పత్రికలు నడపుట, ప్రజాసేవా కార్య క్రమములు జరుపుట మున్నగు మిక్కిలి ధనసాధ్యములగు ఎన్నో దేశహితైక కార్యములను దీక్షగా కొనసాగించిరి. వీరు స్థాపించిన హిందూ లోయర్ సెకండరీ స్టూలునే కందుకూరి వీ రేశ లింగము తీసికొనిరి. అదియే ఇప్పటి వీరేశ లింగం హైస్కూలు. తరువాత 1909 లో 'రామ మోహన రాయ్ పాఠశాల' యను పేరిట నిమ్నజాతుల వారికి పాఠ శాల పెట్టి ఉచిత విద్యా దానము చేసిరి. కొన్నాళ్ళు భీమ వరములో నొక పాఠశాలను నడిపిరి. పాఠశాలా నిర్వ హణమున అధికారులు చాల చిక్కులు కల్పించినను, ఆతడు చలింపక ఆత్మాభిమానము నేమాత్రమును వీడ. కుండగనే దానిని నిర్వహించిరి. లక్ష్మీనరసింహము, మనోరమ, దేశమాత, సరస్వతి, దేశ సేవ అను పత్రికలను నడపి, ఆనాటి సాంఘిక, రాజ కీయ, సారస్వత వ్యవస్థల కెంతో సేవ సల్పిరి. సౌందర్య తిలక మున్నగు వీరి నవలలు, ప్రహసనములు వీరి పత్రిక లలో ప్రచురింపబడిన వే. ఆనాటి మండల సభల యందును, 'హోమ్ రూల్', 'వందేమాతరం' ఉద్యమముల యందును ఆంధ్ర మహా సభల యందును, సంఘ సంస్కారోద్యమముల యందును, వేశ్యా బహిష్కా రాది ఇతర దేశ సేవా కార్యక్రమముల యందును, ఉపన్యాసకులుగను, అధ్యక్షులుగను పాల్గొను టయే కాక వాటిని స్వయముగ నిర్వహించి మహో వక్తగను, చిత్తశుద్ధి, అచంచల దీక్ష గల సంఘ సేవకుడు గను, నిర్వాహకుడుగను ఎన్నిక గనిరి.

1893 వ సంవత్సరమున పురాణపండ వేంకట దీక్షి తులుగారి తనయ వెంకాయమ్మతో వీరికి వివాహమైనది. కాని సంతానము కలుగలేదు. అయితే, అప్పచెల్లెండ్ర యొక్కయు, తమ్ముని యొక్కయు సంసారములను వీ రే నిర్వహించిరి. బడినది.

వీరి స్వీయచరిత్రము కూడ ఇటీవలెనే ప్రచురింప “భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్ల వారు పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి"

అను వీరి పద్యము వీరి జాతీయాభిమానమునకును, 'అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వబంపు' అను పద్యము వీరి ఉజ్జ్వల నాటక రచనమునకును, 'ముదితల్ నేరగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్' అను పద్యము వీరి స్త్రీ విద్యాభిరతికిని పేరుబడసి ప్రజలలో మిక్కిలి ప్రచారము నొంది, వీరిని ప్రజా కవిగా తీర్చిదిద్దినవి.

ఈ మహావ్యక్తి 1947 సం. జూను 17వ తేదీనాడస్తమించెను.

ఊ. ల.

చిలీ దేశము :

దక్షిణ అమెరికాలో బహుకాలముగా ఘటిల్లిన విప్ల వములను, కలహములను బట్టి చూడగా, 'చిలీ' తరతమ భావముచే ప్రశాంతమగు చరిత్రగల దేశమనవచ్చును. కాని అది ఇటీవలి కాలమున తరచుగా సంభవించుచు వచ్చిన కార్మిక కలహముల కారణముగా గొప్ప ఇక్కట్టు లకు గురియైనది,

క్రీ. శ. 1536 వ సంవత్సరమున ప్రప్రథమముగా యూరపియనులు చిలీ దేశమున దిగిరి. డైగో డీ ఆల్ మగ్రో (Diego de Almagro) అను నతడు ఆ సమ యమున ' పెరూ' (Peru) నుండి చిలీపై దండయాత్రచేసి విఫలమనోరథుడయ్యెను. అయిదు సంవత్సరముల అనం తరము పెడ్రో డీ వాల్ డివియా (Pedro de Val- divia) అను మరియొక స్పెయిన్ దేశీయుడు సాంటి యాగో (Santiago) ను స్థాపించెను. 1810 వ సంవత్స రము సెప్టెంబరు 18 వ తేదీన చిలీ దేశీయులు స్పెయిన్ ఆధిపత్యముపై తిరుగబడిరి. కాని వారికి 1818 వ సంవత్స రము వరకు సంపూర్ణ స్వాతంత్ర్యము లభింపకుం డెను. ఆ సంవత్సరమున బెర్ నార్డో ఓ హిగ్గిన్స్ (Bernardo o Higgins), జోస్ డీ సాన్ మార్టిన్ (Jose de san Martin) అనువారు తుదకు స్పానిష్ సైన్యములను అణగద్రొక్కిరి.

చిలీ ఎన్నడును యుద్ధమున పరాజయ మొందిన దేశము కాదు. దానికిని బొలివియా (Bolivia). పెరు (Peru) లకును నడుమ 1879-83 సంవత్సరముల మధ్య కాలమున యుద్ధము సంభవించెను. ఆ యుద్ధములో 'ఆన్టో ఫాగస్టా' (Anto Fagasta) అను పేరుతో బొలివియాకు గల ఏకైక సముద్రమార్గమున్న రాష్ట్ర మును, దానితోపాటు, పెరుకు చెందిన విశాల భూభా గములును చిలీ కైవసమయ్యెను. మొదటి ప్రపంచ మహాసం గ్రామమందు చిలీ తటస్థముగానుండెను. 1927 వ సంవత్సరమున కర్నల్ కార్లోస్ ఇ ఫియజ్ (Colonel Carlos Ibafiez) అనునతడు అధికారమును తన హ స్త గత మొనర్చుకొనెను. అతనికి 1931 వ సంవత్సరమున పతనము సంభవించెను. అతని పతనమునకు అనంతరము కొలది కాలమువరకు అరాజకపరిస్థితులేర్పడెను. ఆ స్వల్ప కాలమునందే ఏద్గురు వ్యక్తులు దేశాధ్యములగుటయు, తిరిగి పదభ్రష్టులగుటయు గూడ తటస్థించెను. కాని డా. ఆర్టురో అలెస్సాండ్రీ (Dr. Arturo Alessandri) 1982-88 సంవత్సరము మధ్యకాలములో చిలీ యొక్క రాజకీయ, ఆర్థిక స్థైర్యమును నెలకొల్పుటకు గొప్ప ప్రయత్న మొన ర్చెను.

1938 వ సంవత్సరమున జరిగిన ఎన్నికలలో విజయు డైన పెడ్రో ఆగ్విరే సెర్ డా (Pedro Auguirre Cerda) అను నతడు 1941 నవంబరు 25 వ తేదీన మరణించెను. ఇతడు తన మరణమునకు పూర్వమే విపులమైన ఒక సామ్యవాద ప్రణాళికను దేశములో ప్రవేశ పెట్టెను. 1942 సం. లో 'ప్రజాపక్షము'న (popular Front) తీవ్రవాదియైన జువాన్ ఆన్ టోనియా రియోస్ (Juan Antonio Rios) అభ్యర్థిగా ఎన్నుకొనబడెను. ఆతని