Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చామర్లకోట

వికీసోర్స్ నుండి

చామర్లకోట :

చామర్లకోట (సామర్లకోట) రాజమహేంద్రవరము నకు తూర్పుగా రై లుమార్గమున ముప్పదిమైళ్ళ దూరములో నున్న పారిశ్రామిక కేంద్రము. ఇది పంచారామ క్షేత్రములలో నొకటియై శివప్రధానమైన పుణ్యక్షేత్రమై వెలసినది. క్రీ.శ. 1855 వ సంవత్సర ప్రాంతమున ద్రవ్వబడిన కాకినాడ కాలువవలనను, 1893 వ సంవత్సరమున తెరువబడిన రైలుమార్గమువలనను ఈ క్షేత్రమందలి చాళుక్య భీమేశ్వర, రాజనారాయణస్వాముల ఆలయ ములు ప్రధాన గ్రామమునుండి వేరుపడిపోయి చెరకు, వరి పొలములమధ్య నిల్చి ప్రకృతిమాత లాలితము లగుచున్నట్లున్నవి. మొదటి చాళుక్య భీమ విష్ణువర్ధనుడు వేంగిరాజ్యమును క్రీ. శ. 892 నుండి 922 వరకును పాలించిన కాలములో ఈ ప్రదేశ మారాజున కొక రాజధానిగా నుండెను. అంతకు పూర్వ మిది మొగలాయి ప్రభువుల కాలములో మృత్యుంజయ పురమను పేరున వెల సెడిది. చాళుక్య భీముడు తనకు ఉపాస్యదై వమగు భీ మేశ్వరుని కిట దేవాలయ నిర్మాణము చేయించి, చాళుక్య భీమవరాగ్రహారమును తన పేర నెలకొల్పెను. “.. చాళుక్యభీమః, షష్ట్యుత్తరం యస్త్రిశతం రణానాం జిత్వాస్వనామ్నా ప్రధితంవిధాయ చాళుక్య భీమేశ్వర దేవహర్మ్యం త్రింశత్సమాభూతలమన్వరవత్"

అని యొక శాసనమున గలదు. చాళుక్యభీముడే తన పేరును దేవున కిడెనని కొందరందురు. ఈశ్వరపుత్రుడగు కుమారస్వామిచే నిట శివలింగము ప్రతిష్ఠితమగుటచే నిది కుమారారామము, స్కందారామము అని కొన్ని శాసన ములలో బేర్కొనబడినది. తారకాసురుని మెడలోని అమృతలింగమును కుమారస్వామి యైదు ఖండములుగా ఖండింప నందొక ఖండ మిట బడినందున నీ క్షేత్రము పంచారామ క్షేత్రములలో నొకటియై ప్రఖ్యాతమైనది. 'అదె కుమారారామ మాహర్మ్యరేఖయ చాళుక్య భీమేశు సదనవాటి' అని శ్రీనాథ కవిసార్వభౌముడీ క్షేత్రమును గూర్చి తన భీమేశ్వర పురాణమున నుగ్గడిం చెను. చాళుక్య రాజరాజనరేంద్రునికి గూడ భీమేశ్వరుడు ఉపాస్యదై వమై యుండునని "భారత శ్రవణాసక్తియు, బార్వతీపతిపదాబ్జధ్యాన పూజామహోత్సవమున్... ఇవి యేనున్ సతతంబు నా యెడ గరంబిష్టంబులై యుండు" నన్న భారత వాక్యమువలన గ్రహింపదగును. ఇట చాళుక్య భీముని కోట ధ్వంసమైపోగాఁ బిమ్మట క్రీ. శ. 1400 ప్రాంతమున కాటయవేమారెడ్డి రాజమహేంద్రవరమున రెడ్డి రాజ్య పాలనము గావించుచు తూర్పు దేశములను జయించి భీమవరమున పూర్వము కోటయుండిన స్థల మును ద్రవ్వింపగా, మహిషాసురమర్దని శక్తి విగ్రహము దొరకినది. దానికి శ్యామలాదేవి యను పేరిడి, ఆలయము గట్టించి, యట గ్రామము నిర్మించి, దానికి శ్యామలా దుర్గమని పేరిడెను. అదే సామర్ల కోట. ఇది సామర్లకోట కై ఫియతునందు వ్రాయబడినది. ఆ మహిషాసురమర్దని తరువాత భీమేశ్వరాలయమును చేరుకొన్నది. 'భీమ నాయక దేవు పేరురంబున గ్రాలు భుజగహారములకు భుక్తి వెట్టి, రాజనారాయణస్వామి రమ్యభవన తార్క్ష్య కేతన పతికి నర్తనము గరపి' అని శ్రీనాథకవి యిచ్చటి గాలు లను వర్ణించెను. ఈ భీమేశ్వర, నారాయణస్వాముల అలయములలో ముప్పది శాసనములు గలవు. వీనిలో క్రీ. శ. 1087 నాటిది అతి ప్రాచీనము. 1993 నాటి తామ్ర శాసన మొకటి కాటయ వేమారెడ్డి రాజనారాయణ స్వామికి భూరిదానములు చేసినట్లు తెల్పును.

చాళుక్యభీము డీ భీమేశ్వరాలయమును, దాక్షారామ భీమేశ్వరాలయమును ఇంచుమించుగ నొకేరీతిగా నిర్మించెను. ఆఆలయము చుట్టును పదు నెనిమిది యడుగుల ఎత్తు గల ప్రాకారమున్నది. ప్రాకారము నలుమూలల నాలుగు గోపురములున్నవి. యాత్రికు లుత్తరద్వారమున లోపలి యావరణములో ప్రవేశించి, తూర్పు ద్వారమునకు వచ్చిన నట కోనేరు గలదు. కో నేటిమధ్యమున నొక మండపము ఉన్నది. కో నేటిలో యాత్రికులు స్నానతర్పణములు గావింతురు. ధ్వజ స్తంభమును దాటి ముందున కేగిన నట పెద్ద నంది గలదు. లోపలి ప్రాకారములో గణపతి, సరస్వతి మొద లగు దేవతల విగ్రహములున్నవి. స్వామి ప్రధానాలయము రెండంతస్తులుగా నుండును. దాక్షారామము నందువలెనే క్రిందియంతస్తు చీకటికొట్టు. మీడియంతస్తుననే అభిషేకా దులుచేయుదురు. లింగము గోధుమవన్నెగలిగి, మొత్తము పదు నెనిమిది యడుగుల యెత్తుండును. పార్థుడు కొట్టిన దెబ్బలు సూచించుటకన్నట్లు లింగము శిరస్సు ఎగుడు దిగుడుగా నుండును. ఉత్తరదిశలో మూలను ఊయెల ఆ మండపమున్నది. ఇది కదిపినచో నూగుచు ఆ కాలపుశిల్ప నిర్మాణనై పుణిని దెల్పును. ఆలయ పశ్చిమ ద్వారమునకు కొలదిదూరములో నొక పెద్ద రాతి స్తంభమును, దానిపై నొక నంది విగ్రహమును గలవు. భీమవరాగ్రహారము పాడుపడిన తరువాత నీట నొక గొల్లది స్వామికి నిత్య మును పాలు పెరుగులు నివేదన యిడెడిదనియు, నామె స్మృతి చిహ్నముగ నీ స్తంభము నిర్మింపబడెననియు దెల్పుదురు. శివరాత్రికి స్వామిక ళ్యాణాదులు జరుగును. ఇతర పర్వములలోగూడ భక్తు లభిషేకాదులకు ఆలయ మునకు వత్తురు. భీమేశ్వరాలయమునకు పశ్చిమమున రెండు ఫర్లాంగుల దూరములో రాజనారాయణస్వామి ఆలయ మున్నది. ఇది విష్ణ్వాలయము. ఇందలి మూర్తి మాండవ్య నారాయణస్వామి. ఇందలి విష్ణువిగ్రహము క్రింద పరసు వేదియుం డెననియు, చోరుడు యత్నింప వానిచేయి యం దంటుకొనిపోయె ననియు, వాడు స్వామిని ప్రార్థింప చేయి యూడివచ్చె ననియు స్థలపురాణగాథ చెప్పుదురు. దానిని దొంగిలింపనొక

వ్యాసుడు ఈశ్వరునిచే వెడలనడుపబడి కాశిని వీడి దక్షిణకాశియగు దక్షారామమున కేగుచు పీఠికాపురము 646 నుండి ఏలేరు అను ఏటి తీరమునుండి ఈ కుమారా రామము మీదుగనే సర్పవరము చేరి, తుల్యభాగానదిని గడచి, భీమమండలమును బ్రవేశించెనని శ్రీనాథకవి వర్ణిం చెను. ఈ ప్రదేశమంతయు వరిచేలు, చెఱకు తోటలు, మామిడి, కొబ్బరి, పోక మొదలగుతోటలు కలిగి యొప్పె నని వర్ణింపబడెను. 'కలమశాలి శారదాముఖాది వ్రీహి సస్యంబులవలనను నిరంతర నారికేళ చ్ఛదచ్ఛాయాచ్ఛన్న హరిదంతరంబులగు భుజంగవల్లిమతల్లీ కాలింగిత క్రముక కంఠోపకంఠంబుల గ్రీడించునసఫలసారణి పరంపరా రంభాపలాశ సంభారంబులు ... అఖిల భువనాభిరామంబు లైన యారామంబుల వలనను"-ఇట్లు భీమేశ్వర పురాణ మున (2-55) గలదు.

సామర్లకోట ప్రాంత దేశము ఆంధ్రదేశము నేలిన పెక్కు వంశముల రాజుల పాలనము ననుభవించెను. కాకతీయ కొంతకాలము పతనానంతరమున గజపతుల రాజ్య యొకయు, కొండవీడు, రాజమహేంద్రవరపు రెడ్డిరాజు యొక్కయు ప్రాభవ మిట చెల్లెను. కాటయ వేమా రెడ్డి యీప్రాంతమును జయించెను. పిమ్మట మొగలాయి పాలనమునకును, తరువాత హైదరాబాదు నై జాముల యాధిపత్యమునకు ఈ ప్రాంతము గురియయ్యెను. పెద్దా పురము, పిఠాపురము, విజయనగరములందు సంస్థానా ధీశులును, జమీందారులును నెలకొని శతాబ్దముల తర డిగా నీ ప్రాంతము నేలుచు బలాఢ్యులును విజేతలును నగు సమ్రాట్టులతో సందర్భానుసారముగా వైరము లును, నెయ్యములును నెరపుచు ప్రజలనుండి పన్నులు గ్రహించుచుండిరి. సామర్లకోట పిఠాపురపు సంస్థాన ములో జేరినట్టిది. మాధవరావు అను వెలమ ప్రభువు ఈ వంశమున నొక మూలపురుషుడు. పిఠాపురపు జమీం దారు మొదట సామర్లకోటలో నివసించుచు తరువాత పిఠాపురము చేరుకొనెను. ఈ వంశములో తెనుగురావు అను నతడు రాజమహేంద్రవర సర్కారుకు సర్దా రాయెను. పదు నెనిమిదవ శతాబ్దములో సామర్లకోట మరల రాజధానీస్థల మాయెను. అప్పటికి డచ్చివారు. ఫ్రెంచివారు, ఆంగ్లేయులు మొదలగు విదేశీయు శ్రీ దేశ మున పరిపాలనము నెలకొల్పుకొనుటకు పరస్పర యుద్ధ ములతో దేశమును అట్టుడికించున ట్లుడికింప జొచ్చిరి. 1758 లో ఆంగ్లసై స్యములు విజయనగర సంస్థానాధీశుని ప్రోత్సాహమున సామర్లకోట మీదికి నడచెను. ఇచ్చటి కోట మూడు నెలలపాటు ఆంగ్లేయుల ముట్టడిని ధిక్క రించి నిలువగలిగెను. తుదకు లొంగిపోయెను. ఆంగ్లే యులు 1759 లో సామర్లకోటను వశముచేసికొని ఫ్రెంచి సేనలను కాకినాడకు తరిమిరి. 1765 నాటికి ఉ త్తరసర్కార్ల ప్రాంతము నై జాముపాలననుండి తొలగి, ఆంగ్లేయుల వశమాయెను. ఢిల్లీ చక్రవర్తి ఉత్తర సర్కార్లను ఆంగ్లేయులకు దానముగా నిచ్చుచు ఫర్మానా నిచ్చెను. నాటినుండియు ఈ ప్రాంతమునకు పరిపాలనా స్థైర్యము కలిగెను. అప్పుడు సామర్లకోట ఆంగ్లేయ సైనికదళము లకు ప్రధాన ఆరోగ్య నివాస కేంద్రమాయెను. 1786 లో నిట సేనానివేశములు (బ్యారక్సు) కట్టిరి. సైనికుల కవాతులకు సామర్లకోట ఊరి యుత్తరముననున్న పెద్ద బయళ్ళు కంటోన్మెంటు బయళ్ళుగా నేర్పడెను. 1888 లో ఆంగ్లసైనికు లిచ్చటికోటను నేలమట్టము చేసిరి. 1868 లో నిచ్చటి సేనాని వేళములు ఎత్తివేయబడెను. భద్రాచలపు మన్యప్రాంతములో 1879 లో రంపపితూరీ జరుగుట చే రెండు ఆంగ్లపటాలములు సామర్లకోటలో నిలుపబడెను. అవికూడ 1893 లో తొలగింపబడెను. ఫ్రెంచి, ఆంగ్ల సేనానులును, విజయనగర సంస్థానాధిపతులును, నైజా మును పరస్పర యుద్ధములలో చిక్కుకొనియున్న కాల ములో ఫ్రెంచివారి సహాయమున విజయనగర రాజు బొబ్బిలికోటను ముట్టడించెను. బొబ్బిలి వెలమవీరులు యుద్ధభూమికి తమప్రాణములను ధారపోయ నురికిరి. బొబ్బిలికోట సర్వనాశనమగు స్థితిరాగా, రాణివాసపు స్త్రీలు అగ్నిలో దమ ప్రాణము లర్పింప సిద్ధపడిరి. బొబ్బిలి రాణి మల్లమదేవి, చినవెంకట రావను తన యైదేండ్ల బాలునికి బ్రాహ్మణకుమారు వేషమువేసి యొక దాసిచే, సామర్లకోటలో నున్న తన చెల్లెలు జగ్గయ్య దేవి కడకు బం పెను. బాలుడు శత్రువులచేత జిక్కెను. విజయ నగర రాజు శత్రువంశాంకుర ముండరాదని వధింపనెంచగా, ఫ్రెంచి సేనాని బుస్సీ యను నాతడు బాలుని గాపాడెనని బొబ్బిలి యుద్ధకథ వలన తెలియు చున్నది. ఇట్లు సామర్లకోట దేశ చరిత్రలో కొంత కీలక స్థానము వహించెను. 1765 సంవత్సరము నుండియు ఆంగ్లప్రభుత్వము వారీ సామర్లకోట ప్రాంతము చెఱకుపంటకు ప్రధానముగా నున్నదని గుర్తించిరి. ప్యారీకంపెనీయను బ్రిటీషు సంస్థ 1897 లో నిచ్చట నొక పంచదార ఫ్యాక్టరీని స్థాపించెను. అది దినదినాభివృద్ధి నొందినది. అనుదినము సుమారైదు వందల మంది పనివాండ్ర కిందు జీవనోపాధి లభించు చున్నది. 1952 నాటికి సంస్థ పెట్టుబడి 26,92000 రూపా యలు. పదిలక్షల రూప్యములు నిధులుకూడ నున్నవి. ఇందలి యంత్రములు దినమున కై దువందల టన్నుల చెఱకు ఆడగలవు. తాటిబెల్లము, చెఱకు బెల్లములనుండి పంచదార తీయుచున్నారు. సగటున సంవత్సరమున కిట అది వేల మణుగుల పంచదార యుత్పత్తి యగుచున్నది. చెఱకుపిప్పి మున్నగువాటిని వ్యర్థముగా పోనీక వానినుండి పిప్పరమెంట్లు మున్నగునవి తయారు చేయు యంత్రభాగముల నిట అనుబంధముగా జేర్చిరి.

చెఱకు తెగుళ్ళచే పంట క్షీణించుటచే ప్రభుత్వము వారు ఓషధీశాస్త్రనిపుణులను నియోగించి పరిశోధనలు గావింపజేసిరి. పరిశోధకుల సూచనలనుబట్టి సర్కారు వారు సామర్లకోటలో పరిశోధనాత్మక వ్యవసాయ కేంద్ర మును 1902 లో స్థాపించిరి. ఇది కాకినాడ కాలువ లోని సామర్లకోట లాకును ఆనుకొనియున్నది. సుమారు నలుబదియెకరముల విస్తీర్ణమున ఈ వ్యవసాయక్షేత్రము వారు వివిధములగు పంటలు పండించుచు. రైతులకు చక్కని వ్యవసాయిక విజ్ఞానము నందించుచున్నారు. ఈ సంస్థ శాశ్వత సంస్థగా మార్చబడినది.

సామర్లకోటలో మంగుళూరు పెంకుల పరిశ్రమకూడ విరివిగ పెంపొందినది. పెద్దాపురమునకు పోవు రోడ్డు నానుకొని మంగుళూరు పెంకుల కార్ఖానాలున్నవి. ఈ యూర, తోళ్ళను బాగుచేయు సంస్థకూడ నొకటి గలదు. ఇటీవల సర్కారువారు పారిశ్రామిక శిక్షణకేంద్రము నొకదానిని ఊరికు త్తర భాగమున స్థాపించిరి. యువకుల కిట వివిధ పారిశ్రామిక శిక్షణము లియబడుచున్నవి.

వా. రా.