Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చర్మవ్యాధులు

వికీసోర్స్ నుండి

చర్మవ్యాధులు (Skin Diseases) :

చర్మమునందు రెండు పొరలు కలవు. అందు ప్రభాసిని (ఎపిడెర్మిస్) అనబడు బాహ్యచర్మము ఒకటి. స్థూలత్వక్రు (డెర్మిస్) అను లోపలిచర్మము మరియొకటి. ప్రభాసిని యొక్క లోతుపొరలలో లోపలిచర్మపువర్గము ఉండును. స్థూలత్వక్కునందు ఈ క్రిందివి కలవు :

(i) చర్మపు గ్రంధులు. ఉపరి భాగమునందలి తమ గొట్టములద్వారా అవి తెరచుకొనును. అందువల్ల చెమట వెలికి వచ్చును.
(ii) వెంట్రుకల లఘురంధ్రములు.
(iii) క్రొవ్వుద్రవమును తయారుచేయు గ్రంధులు.
(iv) స్పర్శ, ఉష్ణోగ్రత, వేడి, చలి మొదలగువాటిని కనుగొను జ్ఞాననాడులు. ఈ నాడులు తుది అవయవముల యొద్ద ముగియును. వ్రేళ్ళయొక్క తుది భాగములు

మొదలైనచోట్ల ఈ స్పర్శజ్ఞానము ఎక్కువగా నుండును.

చర్మము యొక్క పనులు: 1. శరీరావయవములను ఇది కాపాడును. 2. శరీరోష్ణోగ్రతను క్రమబద్ధము చేయు టలో ఇది ముఖ్యపాత్ర వహించును. శరీరమునుండి సుమారు 1000 ఘన సెంటిమీటరుల ద్రవము ఉప్పుతో శరీ రము నుండి ఇగిరి పోవును. ఏ వాతావరణము నందైనను సుఖముగా నున్నామను భావన చర్మమునుండి కలుగు నదియే. బాహ్య ఉష్ణోగ్రతను, తేమను, ఒక ప్రత్యేక స్థాయిలో నుంచుటవలన అట్టిది కలుగుచున్నది. దీనినే 'ఎయిర్ కండిషనింగ్' అందురు.

చర్మములో మార్పులు కలిగించు సాధారణ వ్యాధులు : మధు మేహములో దురద పెట్టుట సామాన్యమైన విష చిత్రము - 184

చర్మమును అడ్డముగా కోసి సూక్ష్మదర్శినితో చూచిన యెడల మనకు గోచరించు దృశ్యము 1. ప్రభాసిని 2. స్థూలత్వక్కు 4. చెమటగ్రంధి 3. వెండ్రుక కుదురు 5. నాడుల కొనలు 6. నూ వెచెమర్చు గ్రంథులు

యము. ఎ. విటమిన్ కొరతవలన చర్మముపై మృదు త్వము పోయి అది గరుకుగా నగును. 'పలాగ్రా' యను వ్యాధి వచ్చినవారికి కాళ్ళు చేతులు క్రిందిభాగము నల్ల బడును.

నరములకు సంబంధించిన కుష్ఠరోగమువంటి వ్యాధులలో ఇంద్రియజ్ఞానము పోవును. చర్మముపై వ్రణములు లేచును. చర్మము గాజువర్ణము పొంది పలుచగా నగును. వెండ్రుకలు రాలిపోవును. వ్రణములు లేచును. రెండు కాళ్ళును పడిపోయిన వారికి పిరుదులపై ప్రణ ములు లేచుట గలదు. పొంగు, మసూచి మొదలగు వ్యాధు లలో చర్మముపై పొక్కులు కనబడును. సవాయివలన చర్మముపై లేచు పొక్కులు ఏ చర్మవ్యాధినైనా పోలి యుండవచ్చును.

పుట్టుకతో వచ్చు లోపములు : చెమట గ్రంధులు లేక పోవచ్చును. వేసవిలో రోగి తనఉష్ణోగ్రతను పూర్తిగా నింపు కొనలేక తడిబట్టలు ధరించి తిరుగవలసివచ్చును. శరీరమం దంతటను రోమములు లేకపోవుట జరుగవచ్చును. చేతులు పాదములపై అదనముగా చెమటపట్టుట కూడ కొందరికి ఉండవచ్చును. చెమటకు చాలా అరుదుగా దుర్వాసన యుండును. '5 క్తి జాసిస్ ' వ్యాధికలవారి చర్మము పొడిగా పొలుసులు కలిగి కొన్ని సందర్భములలో చేప యందు వలె పెరుగుదల రావచ్చును. ఇది వంశపారంపర్యముగ వచ్చు అవకాశము గల వ్యాధి.

రంగులో కలుగు మార్పులు : 'ఎడిసన్సు' వ్యాధిలో నోటిలోను, చంకలలోను రంగు ముదురుట సంభవించును. బొల్లి యనగా శరీరముపై రంగుపోయి తెల్లగా నగుట. దీనికి మేలడొమీన్ అను మలామాను, అదే పేరుగల గోలీ లను ఇచ్చియు, అల్ట్రావయలెట్ కిరణములతోడను చికిత్స చేయుదురు. ఇది కొన్ని ప్రత్యేక స్థానములలో కాని శరీరమం దంతటను కాని యుండవచ్చును. పుట్టుక తోడ నే శరీరమం దంతటను బొల్లి యున్నచో దానిని 'ఆల్ చినిజం' అందురు. అట్టి వారు ఎండలో తిరుగరాదు. చలవ కళ్ళ జోడు పెట్టుకొనవలెను.

నేవస్ అనగా పుట్టుమచ్చ; ఇది చర్మపు రక్తనాళములపైన పెరిగియుండవచ్చును.

బట్టతల: మామూలు చర్మముపై వెంట్రుకలు పోవుట వల్ల యేర్పడు సామాన్యపరిస్థితిని 'అల్ పేషియా అరీటా’ అందురు. ఇది కొన్నిమాసము లుండును. తరువాత మరల వెంట్రుకలు పెరుగును. స్పిరిటువంటి వస్తువులను అక్కడ మర్ధన చేసిన యెడల వెంట్రుకలు త్వరగా మొల చును. టైఫాయిడువంటి వ్యాధులు వచ్చినప్పుడు జుట్టు రాలిపోయినను అది మరల పెరుగును. దేలియం అను మందు తీసికొనిన యెడల వెంట్రుకలు రాలిపోవును. 'సుబ్రుసోకా', 'యిక్తోసిస్' వంటి చర్మవ్యాధుల వల్ల వెంట్రుకలు రాలిపోవుట కలదు. రోగి వెంట్రుకలు లేకుండా జన్మించు పరిస్థితిని అలిపేషియా టోటాలిస్ అందురు. 40 సంవత్సరములు పై దాటినవారి కణతలపై వెంట్రుకలు రాలిపోవుట సాధారణముగా కలుగును. ఇట్టిది కొన్ని కుటుంబములలో వంశపారంపర్యముగా వచ్చును.

వెంట్రుకలు నేరయుట: వయస్సు మళ్ళుటకు ఇది ఒక తార్కాణము. మితిమీరిన పని, హటాత్తుగ దుఃఖము సంభవించుట లేక కష్టము కలుగుట వీటివల్ల కూడ ఇది సంభవింపవచ్చును. కొన్ని కుటుంబములలో చిన్నతనము దీనికి లోనే యిది వచ్చును. కి రంగు వేసికొనుటయే మార్గము.

గజ్జికురుపులు : ఇది ఎకారస్ స్కెబియె అను సూక్ష్మ జీవులవల్ల వచ్చును. గజ్జి రసివలన చర్మముపై పొక్కులు లేచి అవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించును. వ్రేలికణుపులు, బొటన వ్రేళ్ళు, స్తనములు, పిరుదులపై ఇవి లేచును. పైన చెప్పబడిన సూక్ష్మజీవి చర్మములో రంధ్రములు చేసికొని దానిలో గ్రుడ్లుపెట్టును. దురద వల్ల రోగి దానిని గోకుట, అందువల్ల చీము పట్టుట సంభ వించును. కుటుంబమంతటికి ఒకేసారి చికిత్స చేయుట, దుప్పట్లు మొదలగునవి ఉడక బెట్టుట అవసరము. బెంజా యిన్ బెంజివేట్ 25% లోషనును ఒంటినిండా పట్టించ వలెను. పెనిసిలిన్ వంటి ఆంటి బయటిక్సును చీముపోవుటకు ఇవ్వవలెను. ఇప్పుడు సల్ఫరు ఆయింట్ మెంటు ఇచ్చుట అరుదు.

పెడీకులోసిస్ (పేలు) : ఇవి మూడు రకములు. (1) నెత్తి, (2) శరీరము, (3) కడుపుపై వెంట్రుకలపై పెరుగునవి. పదేపదే తిరుగబెట్టు జ్వరమును బైఫస్ జ్వరమును ఇవి వ్యాపింప జేయును. ఇది పరస్పర సంపర్కమువల్ల వచ్చును. తల దువ్వి గ్రుడ్లను తీసివేయ వచ్చును. బెంజాయిన్ బెంజివేట్ ఎమల్షను, బెంజీస్ హైడ్రోక్లోరీడ్ 1% సొల్యూషను (లారేక్సేన్) వల్ల వీటిని పోగొట్టవచ్చును.

పనుగుగజ్జి (ఎక్జిమా): శరీరము యొక్క వాపు ఒక ప్పుడు ప్రకోపించును. ఒకప్పుడు దీర్ఘకాలిక వ్యాధిగా నుండును. కొన్ని చెట్లవంటి బాహ్యప్రకోపకారిణులవల్ల గాని, లేక గ్రుడ్లవంటి ఆహారములులేక కొన్ని మందుల వాడకమువల్ల గాని కల్గిన యింద్రియ వికారము మూల మున ఇది సంభవించవచ్చును. దీనికి హైడ్రో కార్టిజోన్ నియోమైసిన్ మలామా వాడవలెను. పిల్లలకు ఇది సాధారణముగా బుగ్గల మీద వచ్చును. దీని నుండి రసి క్రిందికి కారును. ఇందులకు గల కారణములను కనుగొని వాటిని తొలగించుటయే ఇందులకు జరుగవలసిన చికిత్స. వ్యాధి ప్రకోపించినప్పుడు నీళ్ళు తగులకూడదు. కాల మిన్ లోషనును తరుచుగా రాయవలెను. చేనేడ్రల్ యాంటిస్టిక్ వంటి యాంటీహిస్టామిన్ మందులు వాడ వలెను. వ్యాధి వంటబట్టిన కేసులలో పాదరసము కలసిన మలామాలు (ఆయింట్ మెంట్లు) వాడవచ్చును. చర్మ ముపై గరుకుదనము గల మచ్చ లున్న యెడల కొద్ది మోతాదులో ఎక్సు రే చికిత్స ప్రయోజనకరముగా నుండ గలదు.

ఆర్టికేరియా: ఇది ప్రేలుడుజాతికి చెందినది. చర్మము పై వాపు, దురద ఉండును. ఇది దదురరూపములో వచ్చును. పురుగులు కుట్టుట, నరముల బలహీనత, భావోద్రేకము ఉబ్బసము వ్యాధికి సంబంధించిన ఎల్లర్జీ పరిస్థితి, హేజ్వరము గ్రుడ్లు మొదలగు ఆహారపదార్థములు తినుట ఇందులకు గల కారణములు. ఆంటి ఇస్టమిన్ మందులవల్లను, ఎడ్రి నలీన్ ఇంజ నులవల్లను ఇది తగ్గును. కాని ఇది పదేపదే రాకుండా చేయుట మిగుల కష్టసాధ్యము. అందులకు ఏవేని హేతువు లునయెడల వాటిని తొలగించవలసి యుండును.

సోరయాసిస్ : ఇది క్రమరూపములో నుండని మచ్చ లుగా వచ్చును. ఇది కొంచెము పైకి యుండి | రజతవర్ణము గల పొలుసులు సమృద్ధిగా గోచరించును. వాటితో పాటు ఎట్టి స్రావము ఉండదు. అది ముఖ్యముగా మోకాళ్ళు, మోచేతులపై యుండును. నెత్తి చర్మము, శరీరములోని ఏదేని పార్శ్వము దీనికి గురికావచ్చును.

ఈ క్రింది చికిత్సలవలన లాభించును:

సరోచిన్ ఆయింట్ మెంట్ 2%
టార్ ఆయింట్ మెంట్
విటమిన్ బి 12 ఇంజెక్ష నులు
కార్తిసాన్ మాత్రలు.

సెబారియా (పొలుసులవంటి పుండ్లు) : గుండ్రని లేక కోడిగ్రుడ్డు ఆకారములో ఇది శరీరము లేక తలపై గోచరించును. నూనె కారెడు పసుపుపచ్చని పొలుసు లుండును. వీటిని తరచుగా కడగవలెను. వీటికి గంధకము, ఆసిడ్ కార్బాలిక్ లోషన్ లేక ఆయింటుమెంటు వాడ వలెను. రోగి ఆహారములో క్రొవ్వు పదార్థములు, కర్బన ఉదజనిదములు తగ్గించవలెను. కింది రెండర్-

శిలీంధ్రపు (ఫంగన్) సంపర్క దోషములు : ఎఱ్ఱని మచ్చలు, కోడిగ్రుడ్డు ఆకృతిలోగాని, ఉంగరపు రూప ములోగాని పొలుసులతో పెరిగి దోబీకురుపులు టెంకాక్ర సీస్ చర్మము యొక్క హారనీ పొరలలో వచ్చును. అందు వల్ల మిగుల భాధకరములైన ఎఱ్ఱని మచ్చలగును. దీనికి (1) ‘విట్ ఫీల్డ్ ' మలామా వాడవలెను. సలిసిలిక్ ఆసిడ్ ను, బెంజాయిక్ ఆసిడ్ న్ను 26% వాసలీన్ లో కలిపి వాడ వలెను. (2) అన్ డిసిలినిక్ ఆసిడ్ ఆయింట్ మెంటు. (3) ఆంటీబయటక్ వర్గమునకు చెందిన గ్రీసియోఫోలిన్ మాత్రలు ప్రొద్దున రెండు, సాయంత్రము రెండు చొప్పున 8 వారములు వాడినచో మంచిగుణము కనబడుచున్నట్లు ఇటీవల తెలియుచున్నది.

టెనీయాసర్సినేటా: శరీరముపై తామర వచ్చును. ఈ కురుపులు జంతుజాతికి సంబంధించినవి. ఈ పొడలు సుస్పష్టమైన ఉంగరము ఆకృతిలో నుండును. ముఖము, చేతులు, మెడ సాధారణముగా ఇందుకు గురియగును.

పిటేరియాసిస్ వెర్సికోలార్ : హరనీలేయర్ (పొర) సాధారణముగా ఇందుకు గురియగును. శిలీంధ్రపు సూక్ష్మ జీవులే ఇందులకు హేతువులు. శరీరకాండముపై ముఖ్య ముగా రొమ్ముపై యిది కనబడును. దీనికి క్రమబద్ధ మైన ఆకారము ఉండదు. ఇది పొడిగా నుండి, పొలుసులు కల్గి, పసుపు గోధుమరంగు మచ్చలతో నుండును. వానిని సులభముగా గోకివేయవచ్చును. పది రోజుల కొకసారి కుర

తామర (టీనియాటాన్సురాన్సు) : తెల్లని పొలుసులు గల గుండ్రని మచ్చలు కనబడును. అందులో వెంట్రుకల ముక్కలు ఉండును. తలకు కర్మ చేయించవలెను. వ్యాధి ఒకేచోట ఉన్న యెడల పిక్ నిక్ ఆసిడ్ 7 పాళ్లు, కర్పూరము, శుద్ధిచేసిన స్పిరిటు, ఒక్కొక్కటి ఔన్సు చొప్పున కలిపి రోజుకు 2 సార్లు రాచిన యెడల మంచిగుణము కనబడును. మూడు వార ములలో వెంట్రుకలు వదులుగా నగును. వాటిని లాగి వేయవచ్చును. నిపుణుడైన రేడియాలజిస్టుచే ఎక్సు రే ద్వారా వెంట్రుకలు రాలిపోవునట్లు చేయుట మంచిది. ఆ పిమ్మట మలామాను వాడవచ్చును.

ఫీవస్ : ఇది తల, శరీములపై వచ్చును. క్రమబద్ధముగ నుండని పసుపురంగు పెచ్చులు కప్పు ఆకారముగల పసుపు కొనలతో కనబడుట, దుర్వాసనయుండుట దీనిలక్షణములు. ట్రెకోఫైటాన్ షాన్లినైన్ వలన ఇదిసంభవించును. ఇది దీర్ఘ కాల వ్యాధి. దీనివలన మచ్చలు మిగులును.

ఇంపు గోకంటే జియోసా : ఇది ఒక బిడ్డనుండి మరొక బిడ్డకు వెనువెంటనే వ్యాపించును. ముఖము, శరీరముకూడ ఇందుకు గురియగును. స్టెప్టోకోకె, స్టెఫలో కోకై అను సూక్ష్మజీవులు ఇందుకుగల సాధారణ కారణ కారణములు. చీముపొక్కుల రూపేణాగూడ ఇది సంభ వింప వచ్చును. అవి పగిలి పుండ్లగును. ఇది సాధారణ ముగ కొద్ది వారములలో నే పోవును. పెచ్చులను నూనెతో తీసి వైచి మెర్క్యురీ ఆయింట్ మెంట్ వాడవలెను. లేక సల్ఫతై జాల్ క్రీం 5% కాని, పెన్సిలిన్ ఆయింట్ మెంటు కాని, జన్షన్ పై లెట్ 1% గల ద్రవమునుగాని వాడవలెను. సైకోసిస్ : గడ్డము యొక్క చర్మములోపల, వెంట్రు కల కుదుళ్ళు, నూనెగ్రంధులలోను 'స్టెఫలకోకై ' అను సూక్ష్మజీవులవల్ల వచ్చును. ఇవి చీముపట్టి ఉబ్బి పగులును. జుట్టును పొట్టిగానుంచి పొక్టులను చిదపవలెను. క్వినోలరు ఆయింట్ మెంటువల్ల తరుచు గుణము కలుగును. పెన్సిలిన్ కూడ మిగుల ఉపయోగకరము. వ్యాధి తిరుగబెట్టుట సామాన్యముగ జరుగును. కొన్ని కేసులలో టీకాల మందులు (వాక్సినులు) మంచి ఫలితముల నిచ్చును. రోగి ఆహారములో చక్కెర తగ్గించవలెను. చక్కెర ఉన్నదో లేదో తెలుసు కొనుటకు మూత్రపరీక్ష చేయించవలెను.

యాక్నీవల్గారిస్ : ఇది సంపర్కదోషమువలన కలిగిన యెడల దీనిని 'చీరొఫాఫి లెస్' అందురు. ఇది ఒక దీర్ఘ కాలిక వ్యాధి. మొటిమలు గుంపులుగా లేచును. వీటినే 'ఆపిల్ సెల్సు' అందురు. ఇవి ముఖము, రొమ్ముల పై లేచును. ప్రతిరోజు 'బి' విటమిన్ తీసికొనుట అవసరము. చాకొలెట్సును, క్రొవ్వుపదార్థములను విసర్జించవలెను. నంధకముగల మలామాలను వాడవలెను.

ఫింఫిగస్ : ఇది చాల అరుదైనవ్యాధి. బొబ్బలు కన బడి జ్వరము మొదలగునవి వచ్చుట దీని లక్షణములు. ఫింఫిగస్ వల్నారిస్ అనునది దీర్ఘకాలవ్యాధి. ఇందు బొబ్బలు లేచి చిదికి మరల లేచును. ఇది ఒకప్పుడు మరణ హేతు వగును. కార్టిసౌన్, ఎ. సి. టి. హెచ్. వలన సత్ఫలి తములు కలుగుచున్నట్లు తెలియు చున్నది.

ఫరంకిల్: తీవ్రములు మిగులు బాధాకరములు అగు ఎఱ్ఱని మృదువైన పిండములుగల ఒక రకమైన కురుపు. వెంట్రుకల కుదుళ్ళలో ప్రారంభమగును. స్టెప్లోకో కై అను సూక్ష్మజీవులవలన కలుగును. వాపు నెమ్మదిగా తగ్గ వచ్చును. లేక చీము పట్టుటకూడ జరుగవచ్చును. చర్మము పగిలి అందలి మధ్యగల చీము బయటికి వచ్చిన త ర్వాత అది తగ్గిపోవును. ఆంటీ బయటిక్సు (పెన్సిలిన్) ఉపయో తురు. 'కొల్లాయిడల్' మాంగనీస్' రెండు సూదులు ఇచ్చినయెడల క్రొత్తవి పుట్టకుండా చేయును. టీకాల మందును ఉపయోగింతురు. చర్మమునకు సంబంధించిన క్షయ:

లూపస్ వల్గారిస్ : ముఖము ఇందులకు ముఖ్యముగా గురియగును. శరీరములోని ఇతరభాగములు కూడా దీనికి గురికావచ్చును. ముందు ఒక పొక్కుగా ప్రారంభమై, దరిమిలా పుండుగా మారి ఆ పిమ్మట చాలా మెల్లగా మానును. మచ్చపడును. మెడలోని మాంసపు గ్రంధులు వాచి అందుండి చీము కారును. దీనికి క్షయకు చేసిన మాదిరి చికిత్సనే చేయవలయును.

పులిపిరి కాయలు : చర్మము పై పొర పెరిగి పులిపిరి కాయలు ఏర్పడును. ఇది ఒక్కొక్కచోట రసివలనకూడా కలుగవచ్చును. ఇది ఒక్కటిగా కాని పెక్కులుగా కాని రావచ్చును. ఇవి అంటు వ్యాధులు, పులిపిరి కాయలు కోసి నను అవి పెరుగ నారంభించును. విద్యుత్తుతో కాల్చుట ఇందుకు ఉత్తమమార్గము. కార్బన్ డైయాక్సయిడ్ స్నో వాడవచ్చును.

కాయలు (కారన్సు) : తరచుగా కాళ్ళుచేతులలో ఒత్తిడియుండు స్థావరములందు పుట్టును. సరిగా పట్టని జోళ్ళవలన కాళ్ళపై లేచి నొప్పి కలిగించి నడచుట కశ క్తత కలుగజేయును. మృదువైన కాయలకు 20% సాలి సై లిక్ ఆసిడ్ ను కల్లోడిన్ లో కలిపి ప్రతి రాత్రియు రాయవలెను. అట్లు చేయగా మెత్తబడిన పై భాగమును కత్తిరించవలెను. అప్పుడు ఆతొడుగు ఊడిపోయి అవి నివారణమగును. కాయలను ఎంతగా కోసి పై చినను, మూలము ఊడిపోవునంతటి లోతుగా కోసివేయని యెడల ఎట్టి ప్రయోజనము ఉండదు ; అవి తిరిగి పుట్టును.

ఆర్సెనికల్ డర్మటైటిస్: ఆర్సెనిక్ పడని వారికి ఆ యింజక్షన్ ఇచ్చిన యెడల వంటి చర్మమంతయు ఎఱ్ఱ పడి, పొక్కులుగామారి, పొలుసులు క్రింద రాలిపోవును. దీనితో జ్వరముకూడా వచ్చును. జ్వరము ప్రకోపించిన యెడల నూమోనియావల్ల ప్రాణాపాయము కూడ కలుగవచ్చును. ఇది ఆరువారములు మొదలు రెండు నెలలవరకు ఉండును. బి. ఎ. ఎల్. ఇంజెక్ష నులవల్ల ఇందు లకు మంచి ఉపశమనము కలు అవకాశము కలదు.

వ్రణములు (పుండ్లు) : ఇవి చర్మములో ఏర్పడును. అవి పెదవుల చర్మమువంటి సున్నితమయిన చర్మమునకు వచ్చును. లేక తక్కిన శరీరముమీది దళసరి చర్మమునకు వచ్చును.

ఈ క్రింది రకములు సాధారణమైనవి :

1. తీవ్రవ్రణములు: (i) సూక్ష్మజీవులు, (ii) కాలుడు, (iii) రసాయనిక ద్రవములు, (iv) విద్యుచ్ఛక్తి షాక్, (v) దెబ్బ తగులుట; ఇందులకు కారణములు.

ఈ పుండు మొదట ఎఱ్ఱపడి, చీముకారి నొప్పిగా నుండును. తర్వాత మెల్లగా మానును.

2. ఖర వ్రణములు : సిరాజవ్రణములు, వాతరక్త వ్రణములు, పడకలో చచ్చినపుండ్లు, మానుటకు దీర్ఘకాలము పట్టును.

3. నిర్దుష్ట వ్రణములు : (ఇవి నిర్దిష్ట కారణములవల్ల వచ్చును.) (అ) క్షయ, (ఆ) సవాయి, (8) టైఫాయిడ్, (ఈ) హెక్టినోమైకోసిస్. (ఉ) డెప్తీరియా (ఘటసర్పి), (ఊ) లీష్మేనియా (ఢిల్లీకురుపు) వీటికిగల కారణములకు చికిత్స చేసినయెడల వ్రణము మానును.

4. ప్రమాదకరమైన వ్రణములు : (i) పుట్టకురుపు (కాన్సరు) ఇది కఠినమగు కొనలను స్థానిక గ్రంధుల ద్వారా తినివేయును. (ii) ధ్వంసక వ్రణము (రోడంట్ అల్సర్). (iii) సెర్్కమీ.

5. ఉష్ణమండల వ్రణములు: వీటికి కారణములు తెలియవు. ఇవి దీర్ఘకాల వ్యాధులు. చాలాకాలము దురదపెట్టి మానును. ఒక్కొకప్పుడు శస్త్రచికిత్స అవసరమగును.

కాల్పులు, బొబ్బలు : శరీరపు ఉపరి భాగమునకు పొడి వేడిమి (dry heat) సోకుటవల్ల కాల్పులు సంభవించును. ఆవిరివంటి తేమగల వేడిమి శరీరమునకు తగిలిన యెడల బొబ్బలు కల్గును. ఈ క్రింది ఆరు తరతమ భేదములు గుర్తింపబడినవి.

(1) చర్మము ఎఱ్ఱపడుట,

(2) ప్రభాసిని (చర్మపు పైపొర పైకి లేచిపోవుట, బొబ్బలు కనబడుట,

(3) ప్రభాసిని నాశనము చేయబడుట, యుగాల నరముల కొనలకు ఎట్టి పైకప్పుదల లేకపోవుటచే నొప్పి అధికముగా నుండును. షాకు వచ్చుట సాధారణముగ జరుగు విషయము. త్వరగా నయమగును.

(4) చర్మమంతయును మరియు క్రింది ధాతువులలో కొంత భాగము నాళనమగును.

(5) కండరములు కూడా నాశనమునకు గురియగు

(6) శరీరావయవము పూర్తిగా కాలిపోవుట లేక క్రమము తప్పుట.

4, 5, 6 లలో నాడులు చివరి భాగములో నాశన మగుమ. కావున రోగికి నొప్పి తెలియదు. మానునప్పుడు అంగవైకల్యము కల్గును. కాలిన వెంటనే రోగికి ఆఘా తము తగిలినట్లగును. కాల్పు యొక్క తీవ్రతను బట్టి ఆఘాతము (షాకు) వచ్చును. నొప్పి తగ్గించుటకు (1) మార్ ఫైనును పెద్ద మోతాదులలో ఇవ్వవలెను. (2) రక్తనాళములలోనికి ప్లాస్మా లేక ప్లాస్మా వంటి మందులు ఇవ్వవలెను.

మొదటి ఆఘాతమునుండి తెప్పరిల్ల చేసిన పిమ్మట రోగిని ఏదైనా చికిత్సాలయమునకు చేర్చి, మత్తుమందు నిచ్చి కాలిన భాగమున విషక్రిమి నిరోధక వస్తువులతో శుభ్రపరచవలెను.

పెన్సిలిన్ ఆయింటు మెంటుతో కట్టు కట్టుటవలన రుండవతూరి సంపర్క దోషము రాకుండా నిరోధింప సంపర్కదోషము బడును.

ఈ క్రిందివి ప్రత్యేక రకపు కాల్పులు :

(1) పిడుగు దెబ్బ,
(2) విద్యుచ్ఛక్తివలన వచ్చిన కాల్పులు
(3) X రే - రేడియం వలన వచ్చిన కాల్పులు.

(ఇవి కొన్ని సంవత్సరముల తర్వాత మొండిజాతి వ్రణములకు కూడ దారితీయు అవకాశము కలదు).

(4) ఆమ్లములు, క్షారముల వలన వచ్చిన కాల్పులు.
(5) పై కప్పులేనిచోట్ల విపరీతమైన చలివలన వచ్చినవి.
(6) సూర్యుని వేడిమి వలన వచ్చు కాల్పులు.

శాం. నా. మా.