Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొక్కొండ వేంకటరత్నము పంతులు

వికీసోర్స్ నుండి

కొక్కొండ వేంకటరత్నము పంతులు:

తొట్టతొలుత 'మహామహోపాధ్యాయ' బిరుద మును సంపాదించిన పండితులు కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు. వీరు వినుకొండలో 1842 వ సంవత్సరమున జన్మించిరి. గుంటూరిలో


చిత్రము - 15

విద్యాభ్యాసము కావిం చిరి. చిత్తూరు మండ లాంతర్గత మగు 'తిరు వల' అను గ్రామమున వెలసిన శ్రీ తనుమధ్యా బిల్వనా థేశ్వరు ల నారాధించితతరుణా కటాడు ప్రభావమున కవితావిద్య నార్జించినారు. వీరు కొంతకాలము చెన్నపురి రాష్ట్రీయ కళాశాల యందును, చాలకాలము మహేంద్రవర కళాశాలయందును ఆంధ్ర పండిత స్థానము నలంకరించి పెక్కుమంది కళార్థులకు విద్యాభిక్ష పెట్టి నారు.

విద్వత్పరిషత్తులు 'కవిబ్రహ్మ' అనియు, 'అక్షరసంఖ్యా చార్యు' లనియు పంతులు గారికి బిరుదములు ప్రసాదించి నవి. 'ఆంధ్ర భాషా సంజీవిని' అను పేరుగల తెనుగు పత్రికకు సంపాదకులుగా నుండి వేంకటరత్న కవిగారు చేసిన సారస్వత సేవ చిరసంస్మరణీయ మైనది. వీరు రచించిన కృతులలో ప్రసిద్ధము లైనవి "ఆంధ్ర ప్రసన్న రాఘవ నాటకము, పంచతంత్రము, సింహాచల యాత్ర, బిల్వేశ్వరీయ ప్రబంధము, కుమార నృసింహము, ధనం జయ విజయ వ్యాయోగము, నరకాసుర విజయ వ్యాయోగము, మంగళగిరి మహత్వము, గోవిందమంజరి, దీక్షిత చరిత్రము, శంకరాచార్య చరిత్ర, కోరుకొండ మాహాత్మ్యము" అనునవి. ఈ గ్రంథములలో కొన్ని అనువాదములును, కొన్ని స్వతంత్ర రచనలును గలవు. వేంకటరత్న కవిగారి కవితారచన సంస్కృత సమాస నిబిడమై యుండును. రసవత్తరమైన ఘట్టములు స్వల్ప ముగా గోచరించుచుండును. వీరు వెండి, బంగారము మొదలగు క్రొత్త పేళ్లతో వృత్తములు రచించిరి. మొత్తము కవిత్వములో ప్రతిభకంటే వైదుష్యమే ముందు నడచునట్లు కనబడును.

నాడు పెక్కు తడవలు కందుకూరి వీరేశలింగము, వేదము వేంకటరాయ శాస్త్రి ప్రభృతులతో వేంకట రత్నము పంతులుగారు పత్రికా వాదమును నెరపిరి. ఆనాటి పండితులలో వీరు గ్రాంథిక వాదులుగా పేరు మోసిరి. గృహ వ్యవహార సందర్భములలో గూడ గ్రాంథిక భాషలో నే మాటాడుచుండు నభ్యాసము వేంకట రత్నక విగారు కలిగియుండిరి. “పలుకు దయ్యమా! యిది పాయసమమ్మా! ! బమ్మదయ్యపు టిల్లాలా! యిది పానక మమ్మా!" అను ధోరణిలో సంభాషణము సాగించువారని ప్రసిద్ధి. సలక్షణ భాష పై వీరికిగల అభినివేశ మంతటిది.

వేంకటరత్నము పంతులుగారు తెనుగున నే కాక సంస్కృత భాషలో కూడ గ్రంథరచన సాగించిన వారు. జయదేవుని 'గీత గోవిందములను పోలిన వీరి 'గీత మహా నటము' అను గ్రంథము నాడు పండితశ్లాఘా పాత్రమై తన రారినది. ఇట్లు సంస్కృతాంధ్రముల యందు బహు గ్రంథ రచన సాగించి, అధ్యాపక వృత్తిలో ప్రసిద్ధి గడించి, తెనుగువారిలో మున్ముంగల 'మహామహోపాధ్యాయ' మహాబిరుదమును ఆర్జించుకొన్న కొక్కొండ వేంకట రత్నము పంతులుగారు డెబ్బది వత్సరముల పైగా జీవ యాత్ర గడపి 1915వ సంవత్సరమున బిల్వనా థేశ్వరు నిలో ఐక్యమందిరి.